4, మార్చి 2011, శుక్రవారం

ది సైన్స్ ఎపిసోడ్ ముఫ్పై నాలుగు

ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలను విప్పి చెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
బ్యాంగ్
యాంకర్ 1
సూపర్ హీరో.. ఈ పదం మనం చిన్నతనం నుంచి వింటున్నదే.. ఈ సూపర్ మేన్ చేయలేనిదంటూ ఏమీ ఉండదు. చిన్నపుడు సూపర్ హీరో లీలలు చదివి తెగ మురిసి పోయే వాళ్లం. కామిక్ బుక్స్ నిండా ఆయన గాధలే..సూపర్ మాన్ అంటే ఎంత బరువైనా ఎత్తగలడు. ఎంత ఎత్తైనా ఎగరగలడు.. ఎవరైనా అపదల్లో ఉంటే కాపాడ గలడు. ఈ మధ్యకాలంలో శక్తిమాన్ అనే సీరియల్ ఇదే కాన్సెప్ట్ తో తీసిందే.. కథల సంగతి పక్కన బెడితే..మ్యాన్ నిజంగా సూపర్ మ్యాన్ అయ్యే అవకాశం ఉందా.. అర చేతిలో అద్బుతాలు సృష్టించగలడా..ఇదే ఈ రోజు మన సైన్స్ టాపిక్..
స్పాట్
వాయిస్
సూపర్ మ్యాన్.. మన ఊహా వీరుడు.. జీవితంలో కనీసం అలా అవ్వాలని ప్రతి ఒక్కరూ కొరుకునే శక్తి సంపన్నుడు.. సూపర్ మ్యాన్లు కలల్లోనో లేదా కథల పుస్తకాల్లోనో..మరీ కష్టపడితే తెలుగు సినిమాల్లోనో కనిపిస్తారు. ఇవన్నీ నీడలే..నిజాలు కాదు.. కానీ ఆ నీడల మాటున దాగిన ఊహలను నిజం చేయగలమా అని ఆలోచించిన్రు శాస్ర్తవేత్తలు.. ఆ ఊహే మనిషిని సూపర్ మ్యాన్ చేయొచ్చని ఆశచూపింది.
స్పాట్
మనం చూసిన సినిమాల్లో చూసే హీరోలంతా ఏ గబ్బిలం అవతారంగానో..స్పైడర్ మ్యాన్గానో కనిపిస్తరు. క్షణాల్లో చేయాల్సిన పనులన్నీ చకచకా చేసేస్తరు. అంతెత్తునున్న బిల్డింగ్లను అవలీలగా ఎక్కేస్తరు. టన్నుల బరువున్న వస్తువులను అగ్గిపెట్టెల్లా ఎత్తేస్తరు. రెక్కలు కట్టుకొని ఆకాశంలో ఎగురుతున్నట్టు అనిపిస్తది. చూసే ప్రతి ఒక్కరికీ తాము కూడా అలా మారి పోతే బాగుండనిపిస్తది. అంతేకాదు. ఏ దేవుడైనా ఎదురయి అటువంటి వరమేదో ఇస్తే బాగుండనిపిస్తది. ఎంచక్కా వినువీధుల్లో చక్కర్లుకొడుతూ విహరించ వచ్చని పిస్తది.
స్పాట్
ఈ ఫిక్షన్ స్టోరీలు రాసే రచయితలంతా కొన్ని భౌతిక శాస్ర్త సూత్రాలను కూడా ఫాలో అవుతరు. అంతేకాదు వీళ్ల ఊహల నుంచి కొత్త కొత్త ఆలోచనలు వస్తయి. ఇవి ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలకు దారితీస్తయి.
స్పాట్
ఈ ప్రపంచంలో అత్యంత బలవంతులైనా 1000 పౌండ్లను మించిన బరువు ఎత్తలేరు. ఇక్కడ ఈ వస్తాదు చూడండి 1000పౌండ్లకు మించిన బరువు మోయాలంటే ఎంత మజిల్ పవర్ యూజ్ చేస్తున్నడో.. ఐనా సాధ్యం కావడం లేదు..
స్పాట్
మనిషి తన కండరాలకు అలసటనివ్వకుండా సునాయాసంగా బలీయమైన పనులు చేసేందుకు శాస్ర్తవేత్తలు ఒకసూట్ ను తయారు చేసిన్రు. ఇది హైడ్రాలిక్ సూట్ ఈ సూట్ సాయంతో బరువులను సునాయాసంగా ఎత్తవచ్చు. ఎంతసేపు కష్టపడి పనిచేసినా తన కండరాలు అలసటకు గురికావు. కానీ ఈ సూట్ చూడండి.. దీన్ని ధరించిన వ్యక్తి ఒక మిషన్ను మోస్తున్న ఫీలింగ్ ఉంది. కాస్త ఇబ్బందిగా కూడా ఉంది. దీనికి సొల్యూషన్ కనుగొన్నరు శాస్ర్తవేత్తలు.
స్పాట్
మన శరీరంలో ఉండే కండరాలు ఒక స్థాయి వరకు మాత్రమే పని చేయగలవు. అంతకు మించిన శ్రమను అవి భరించలేవు. అవిశ్రాంతంగా పని చేయగల కండరాలు కలిగి ఉంటే ఎంత కష్టమైన పనినైనా అవలీలగా చెయ్యొచ్చు. కానీ మనిషి కండరాలు కొంత స్థాయికి మించి చేయలేవు. అంతకు మించి చేయాలంటే అదనంగా శక్తి కావాలి. ఆ శక్తి కూడా కొంత వరకే ఇచ్చే అవకాశం ఉంది. అంతకు మించి చేయాలన్నా సాధ్యం కాదు.
స్పాట్
శారీరక శ్రమను తప్పించి బలంగా పనిచేయగల కృత్రిమ కండరాలు ఉంటే ఎంతటి పనినైనా తేలికగా చెయ్యొచ్చని భావించిన్రు పరిశోధకులు. ఆ కృత్రిమ కండరాలకోసం అన్వేషించిన్రు. అటువంటి ప్రయోగాన్నే మనమిక్కడ చూడొచ్చు.
ఇక్కడ ఇద్దరు శాస్ర్తవేత్తలు కృత్రిమ కండరాలు కనుగొనే పనిలో ప్రయోగాలు చేస్తున్నరు. ముందుగా ఒక మెటాలిక్ స్ప్రింగ్ తీసుకొని దానిని ఒక ఆధారానికి వెలాడదీసిన్రు. దీని చివరన ఒక బరువైన గాజు సీసాను వ్రేలాడదీసిన్రు. అప్పుడు ఈ స్ప్రింగ్ ఒక కండరం మాదిరిగా పనిచేయడం మొదలు పెట్టింది. . . . ఇప్పడు ఈ స్పింగ్ ను ఆవరించి ఉన్న గాజు కుప్పె అంచుల వెంబడి ఆల్కహాల్ను స్పే చేసిన్రు. ఈ పరిస్థితుల్లో గ్లాస్ కంటెయినర్ మొత్తం ఆవిరితో నిండింది. ప్లాటినం స్ప్రింగ్ ఆల్కహాల్ పార్టికిల్స్ తో చర్య జరిపి ఉష్ణశక్తిని ఉత్పత్తి చేస్తది. అంతే ఈ శక్తి వలన ఇది క్రమేపీ సంకోచం చెంది దానికి వేలాడ దీయబడిన బాటిల్ ను పైకి లాగడం మొదలు పెడుతుంది.
స్పాట్
సాగదీయబడి ఉన్న ప్లాటినం స్పింగ్ యధా స్థితికి రావడం మొదలు పెట్టడాన్ని బట్టి ఇది గాలిలో ఆక్సీజన్ ను ఉపయోగించుకొని, ఆల్కహాల్ తో చర్యనొంది కదలికలు ప్రారంభించిందని శాస్ర్తవేత్తలు అంచనా వేసిన్రు. ఈ కృత్రిమ కండరం సహజకండరాలకు మించి 500 రెట్లు బలమైనది. ఇటువంటి కృత్రిమ కండరం మనిషి కలిగి ఉంటే 50 టన్నుల బరువును సునాయాసంగా ఎత్తగలడని శాస్ర్తవేత్తలు అంచనా వేస్తున్నరు.
స్పాట్
మనిషి శరీరానికి, కండరాలకు అలసట కలుగకుండా కృత్రిమ కండరాలను అమర్చడం ద్వారా తేలికగా పనులు చేసుకోవచ్చని భావించిన్రు పరిశోధకులు. దానికి తగిన పదార్ధమే కార్బన్ నానో ట్యూబ్..
స్పాట్
ఈ కార్బన్ ట్యూబ్ గాలికంటే చాలా తేలికైనది. పారదర్శకంగా కనిపిస్తది. మానవుడి వెంట్రుక కన్నా 10వేల రెట్లు సన్నగా ఉంటుంది. వీటి గుండా విద్యుత్తును పంపిస్తే ఒక కండరంలాగా కుంచించుకుపోతది. కండరం కటే 10 వేల రెట్లు వేగంగా పనిచేస్తది.. ఇది అత్యధిక ఉష్ణోగ్రతలోనూ, అత్యల్ప ఉష్ణోగ్రతలో కూడా పనిచేస్తది. ఇది చాలా బలమైనది కాబట్టే దీన్ని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారీలో వాడుతరు. దీనికున్న ప్రత్యేక లక్షణాల వల్ల ఇది కార్లను ఎత్తడానికి, అగ్ని ప్రమాధాలను నివారించే వారికి సూట్గా ఉపయోగ పడుతది.
స్పాట్
ఆల్కహాల్ స్ప్రింగ్లను నమ్మశక్యం కానంత బలంగా తయారు చేస్తది. ఇది నెమ్మది గా జరిగే ప్రక్రియ. కానీ నానో షీట్ చాలా వేగంగా పని చేస్తది.ఈ నానో షీట్ తో తయారు చేసిన ఆర్టిఫిషియల్ మజిల్ షీట్ ను శరీరానికి అమర్చుకున్నట్టయితే మన శరీర కండరాలకు ఎటువంటి అలసట లేకుండా అతివేగంగా ప్రయాణించగలం. ఎంత వేగంగా అంటే రైలును సునాయాసంగా దాటేయగలమని శాస్ర్తవేత్తలు అంచనా వేస్తున్నరు. ఈ సూట్ వేసుకుంటే దాదాపు సూపర్ మ్యాన్ తో సమానం. ఇదే సూట్ లేకుండా ఇలా పరిగెత్తితే తొడకండరాలు, వెన్నెముక తుక్కు తుక్కై పోతది.అంతేకాదు టన్నుల కొద్దీ బరువులు ఎత్తినా శరీరంలో ఉన్న ఎముకలన్నీ పప్పు పప్పు అవుతయి. అందుకే ఈ బాధ తప్పించుకునేందుకు శరీరానికి బాహ్యకవచం తప్పనిచసరి. దీన్నే ఎక్సో స్కెటిటన్ గా పిలుస్తరు. ఈ ఎక్సో స్కెలిటన్ పూర్తిగా కార్బన్ ఫైబర్లతో తయారు చేస్తరు. ఈ కార్భన్ నానో ట్యూబ్ ఎక్సో స్కెలిటర్ ధరిస్తే నిప్పుల్లో నడుచుకుంటూ టన్నుల కొద్దీ బరువును అవలీలగా లేపొచ్చు.
స్పాట్
మనిషికి ఉన్న శారీరక దృఢత్వం కంటే ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఎందుకంటే మనిషి ముందుగా తాను ఎత్తగలిగిన బరువును చూసి ఎత్తగలననే ఆత్మవిశ్వాసం తెచ్చుకోగలగాలి. వ్యక్తి తాను ఒక ఆలోచన చేసినపుడు అతని మెదడులో తీవ్రమైన మార్పులు వస్తయి. ఈ మార్పులకు అణుగుణంగా హార్మోన్లు రిలీజ్ అవుతయి. ఈ హార్మోన్లు మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం లేదా తగ్గించడం చేస్తయి.
స్పాట్
మనిషి మెదడులో కలిగే మార్పులు యంఆర్ఐ స్కాన్ ద్వారా పరిశీలించి వ్యక్తి ఆత్మసైర్యాన్ని లెక్కకడతరు. మెదడే అన్నిటికీ మూలం. ప్రకృతిలో మనం చూసిన ప్రతి వస్తువు ఇమేజ్ ను ఎప్పటికపుడు రికార్డు చేసి శాశ్వతంగా భద్రపరుస్తది. అది అతి సూక్ష్మవస్తువు దగ్గర్నుంచి పెద్దపెద్ద వస్తువుల వరకు పర్మెనెంట్గా రికార్డ్ అవుతది. కానీ దీన్ని మనిషి ఎంత వరకు గుర్తుంచుకుంటాడనేది అతని జ్ఞాపక శక్తిని బట్టి ఉంటది. వాస్తవానికి ప్రతి ఒకరి మైండ్లో తాను విన్నవి, చూసినవి, ఆఖరుకు కలలో కనిపించినవి కూడా గుర్తుపెట్టుకుంటరు. కానీ వీటిని తిరిగి గుర్తుతెచ్చుకోవడంలోనే అసలైన శక్తి దాగి ఉన్నది.
స్పాట్
కొన్ని సందర్భాలలో మనిషి జ్ఞాపక శక్తికి అగ్ని పరిక్ష ఎదురవుతది. మనం ఆదమరిచి ఉన్నపుడు నమ్మిచ్చి మోసపుచ్చే వారికి ఈ లోకంలో కొదవలేదు. మనల్ని పలకరించినట్టే పలకరించి చెంతనున్న బ్యాగ్ లను ఎత్తుకుపోయే దొంగలతో నిత్యం అందరికీ ఎదురయ్యే సమస్యే. మనం ఏమరుపాటుగా ఉంటాం కనుక వారిని పూర్తిగా గుర్తుంచుకోలేం. పోలీసులకు కంప్లైంట్ ఇస్తే.. వారు స్నాచర్ వివరాలు అడుగుతరు. దొంగ ఎలా ఉన్నది..వాడి రూపురేఖలు, ధరించిన డ్రెస్, దొంగతనానికి గురైన వస్తువు ఎలా ఉండేది, అన్నీ వివరాలు రాసుకుంటరు. అప్పుడు మనకు చిన్నపాటి ఐక్యూ టెస్ట్ ఎదుర్కొన్నంత ఇబ్బందిగా ఉంటది.
స్పాట్
యాంకర్
స్పాట్
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలో తీవ్రవాదుల బెడద ఎక్కువగా ఉంది. నిన్న మొన్నటిదాకా రోడ్డువెంట ఖాళీగా ఉన్న కారు విధ్యంసాన్ని సృష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే సంపన్నదేశాల్లో కార్ స్కానర్లు ఏర్పాటు చేసి రోడ్డు మీద అనుమానాస్పద వస్తువులను, వాహనాలను ఎక్స్ రే స్కానింగ్ చేస్తరు. దీనికోసం పెద్ద సరంజామా కావాలి. కానీ మనం చెప్పుకుంటున్న సూపర్ మ్యాన్ కు ఎక్స్ రే విజన్ ఉంటది. ఈ విజన్ తోనే గోడలోపల ఏం జరుగుతుందో కూడా నేరుగా చూడొచ్చు.
స్పాట్
సూపర్ మ్యాన్ కు ఎక్స్ రే విజన్ ఉన్న గూగుల్స్ కావాలి. వీటి సాయంతో అతను నాలుగు గోడల మధ్య ఏముందో కూడా చూడగలడు. ప్రమాదాలను పసిగట్టి ముందే జాగ్రత్త పడగలడు. కానీ ఎక్స్ రే అంటే మాటలు కాదు. దీనకి పెద్దయంత్రాంగం ఉంటదు. ఒక పెద్ద మిషన్. దీనికి పవర్ సప్లై చేసే ట్రాన్స్ ఫార్మర్స్. ఎక్స్ రే స్ ను రిఫ్లెక్ట్ చేసే బ్లాక్ ప్లేట్. ఇవీన్నీ ఉన్నా మనం దేన్నైతే స్కాన్ చేస్తున్నమో దానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని వస్తువుల గుండా ఎక్స్ రే స్ వెళ్లవు. అప్పుడు స్కాన్ చేయడం కాస్త కష్టంగానే ఉంటది. ఈ సమస్యను అధిగమించాలంటే చాలా కృషి చేయాలి.
స్పాట్
ఎక్స్ రే కళ్ల జోడు కావాలంటే మామూలు అద్దాలు ఏమాత్రం పనిచేయవు. ఈ అద్దాల్లోంచి మామూలు సమయాల్లో సహజంగా చూడాలి. కావాలనుకున్నపుడు మాత్రమే ఎక్స్ రే విజువల్ ను చూడొచ్చు. అలా ఉండాలంటే దానికి ప్రత్యేకమైన అద్దాలు కావాలి. ప్రకృతిలో సహజంగా ఉన్న కిరణాలను ఎక్స్ రే కిరణాలుగా మార్చుకొని వాటిని ఆబ్జెక్ట్ పై ఫోకస్ చేయాలి. తిరిగి వాటిని డిస్ప్లె చేసే ప్లేట్ కావాలి. అప్పుడే అది పర్ఫెక్ట్ గూగుల్స్ అవుతది.
స్పాట్
ఎక్స్ రే గూగుల్స్ కోసం అన్వేషించిన్రు శాస్ర్తవేత్తలు. ఈ అద్దాల అన్వేషణకు సముద్ర గర్భాన్ని ఎంచుకున్నరు. జలచరాలు ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపినయి. మనం నిత్యం చూసే రొయ్యలోనే ఈ ఎక్స్ రే విజన్ దాగుందన్న సంగతి కనిపెట్టేశారు పరిశోధకులు. రొయ్య ఆర్దోపొడా జాతికి చెందిన జీవి. దీని దృష్టిని విశ్లేషిస్తే చాలా అద్బుతమైన విషయాలు తెలిసినయి. ఆర్దొపొడా జీవుల దృష్టి మొజాయిక్ రకానికి చెందినది. అంటే ఒక్క కన్నులోనే కొన్ని వేల కటకాలు ఇమిడి ఉంటయి.ఒక్కో కటకం వస్తువులో ఒక్కోబాగాన్ని చూస్తది. వీటన్నిటి దృశ్యాలు మెదడుకు చేరి అక్కడ పూర్తి స్థాయి ఇమేజ్ ఫామ్ అవుతది. అంటే ఒక వస్తువును బాగాలు బాగాలుగా చూసినా మెదడు వాటిని ఒకే వస్తువుగా సంశ్లేషించుకుని రూపాన్ని పొల్చుకుంటుందన్నమాట.
స్పాట్
రొయ్య చూపు ఎక్స్ రే గూగుల్స్ కు దారి చూపింది. ఎక్స్ రే అద్దాల తయారీకి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. . ఇంకేం సూపర్ మ్యాన్ తయారీకి కావలసిన అన్ని అవకాశాలు సిద్దంగా ఉన్నయి. వీటిదో బాటు ఆర్టిఫిషియల్ హాండ్స్ కూడా పెడితే బాగుంటుందను కున్నారు శాస్ర్తవేత్తలు. ఇంత శక్తి వంతమైన మనిషికి చేయడానికి రెండు చేతులు సరిపోవు . అందుకే మరో రెండు చేతులు పెట్టాలి. ఇవి కూడా మన మామూలు చేతుల్లాగే బ్రెయిన్ కమాండ్స్ తో పని చేయాలి. ఇది సాధ్యమయ్యే పనేనా..ప్రయోగాలు చేసి నిరూపించారు శాస్ర్తవేత్తలు.
స్పాట్
ఇదిగో ఇక్కడ ఒక కోతిని బాక్స్లో పెట్టి దానికి ఎలక్ర్టానిక్ హాండ్ ను సెట్ చేశారు. ఈ హ్యాండ్ డైరెక్ట్ బ్రెయిన్ ఇచ్చే కమాండ్స్ ను ఫాలో అయి తన ముందున్న ఆహారాన్ని నిజమైన చేతితో తీసుకున్నట్టు తీసుకుంటోంది. ఒక రకంగా చెప్పాలంగే కోతి దృష్టిలో అది తన హ్యాండే అనే భ్రమలో ఉంది.
స్పాట్
ఒక హార్డ్ వేర్ ను బ్రెయిన్ ఎలా కమాండ్ చేయగలదు.. చేయగలిగేలా చేశారు సైంటిస్టులు.. ఇదిగో ఈ సైంటిస్టు చేతిలో ఉన్న ఈ చిన్న పరికరాన్ని డైరెక్ట్ గా బ్రెయిన్ కు అటాచ్ చేస్తరు. అప్పుడు బ్రెయిన్ ఇచ్చే ఎలక్ట్రో మాగ్నెట్ సిగ్నల్ ను ఈ పరికరం విశ్లేషించి దానికి అమర్చిన పరికరంతో పనిచేయిస్తుందన్నమాట. అంటే ఒక రకంగా బ్రెయిన్ లో ఉన్న సాఫ్ట్ వేర్ తో నడిచే ఒక పర్ఫెక్ట్ రోబో అన్నమాట. ఈవిధంగానే మనిషి తన శక్తిని బట్టి ఒకటి రెండు చేతులు కాళ్లు అమర్చుకొని పనులు చేసుకుంటూ పోవచ్చన్నమాట. ఓకే మనం కోరుకున్న సూపర్ మ్యాన్ కు కావలసినవి మూడు లక్షణాలు అందుబాటులోకి వచ్చినయి. ఇక సూపర్ మ్యాన్ తయారీయే అలస్యం.
స్పాట్
సూపర్ మ్యాన్ వేగంగా పరిగెత్తడానికి కావలసిన బలాన్ని నానో స్ప్రింగ్ లు, నానో ఫైబర్ లతో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇదే మెటీరియల్ తో తయారు చేసిన ఎక్సోస్కెలిటన్ తో ట్రైన్ ఇంజన్ కూడా మోయగలిగే శక్తని తెచ్చుకోవచ్చు. ఎక్స్ రే విజన్ గూగుల్స్ తో పరిసరాలను స్కాన్ చేసి గోడల అవతల కూడా ఏముందో చూడ గలిగే శక్తిని సంపాదించుకున్నం. ఇంతే కాకుండా ఒక మనిషికి ఇంత శక్తి ఉంటే రెండు చేతులు సరిపోవని మరో రెండు చేతులను కూడా బిగించి బ్రెయిన్ కమాండ్ ఫాలో అయ్యేలా తయారు చేసిన్రు. ఇంకే మనం కోరుకున్న సూపర్ మ్యాన్ రెడీ..మీరూ సూపర్ మ్యాన్ లా కావాలను కుంటున్నరా… ఒక్క పది సంవత్సరాలు వెయిల్ చేస్తే ఈ సూపర్ మెన్ సూట్లు మన సూపర్ బజార్లోనే దొరుకుతయి. కాకుంటే కాస్తంత ఖర్చుపెట్టాల్సి ఉంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి