ఎ. జనార్దన్
ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాల సమాహారం..విజ్ఞాన ఖని దిసైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం..
బ్యాంగ్
పచ్చని పచ్చిక బయళ్లు, హిమ శిఖరాలు, సొంపైన కనుమలు, నిప్పులు కక్కే అగ్ని పర్వతాలు. ఇవన్నీ.. ఇప్పుడు మనం చూస్తున్న భూమి పై కనిపించే ప్రకృతి దృశ్యాలు.. ప్రకృతి చిత్రకారుడు సంవత్సరాలుగా కష్టపడి చిత్రించినట్టు కనిపించే ఈ అందమైన భూమి ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. మరి ఎలా ఉండేది తెలుసుకునే ముందు గతవారం చూసిన స్టోరీ ఒక్కసారి గుర్తుతెచ్చుకుందాం..
రిపీట్
యాంకర్ 1
జీవ పరిణామ సిద్దాంతం కోసం రుజువుల కోసం మనిషి వేటాడుతున్నడు. తన అన్వేషణలో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినయి. ఈ భూమి పై ఇప్పుడున్న జంతువులు ఒకప్పుడు లేవనే విషయం తెలిసిపోయింది. అంతే కాదు ఒకప్పుడు ఈ భూమి పై రాజ్యమేలిన చాలా జంతువులు ఇప్పడు ఆనవాళ్లకు కూడా లేవు. ఎందుకు.. ఈ విషయం తెలుసుకొనే ప్రయత్నంలో అసలు ఈ భూమి స్వరూపమే ఇలా ఉండేది కాదని తెలిసింది.
స్పాట్
వాయిస్ (నేచర్ విజువల్స్ )
భూగోళం అందంగా అపురూపంగా కనిపిస్తుంది. భూమి పై ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకమైన వాతావరణం ఉంటుంది. భూ మద్యరేఖ దగ్గర ఉన్న వాతావరణం ధృవాల వద్ద ఉండదు. అంతెందుకు ఒక్క రాష్ర్టంలోనే వివిధ నగరాల్లో వాతావరణం, ఉష్టోగ్రతలో మార్పులుంటయి. ఒక అక్షాంశం పై, ఒకే రేఖాంశం పై వాతావరణంలో చాలా మార్పులు కనిపిస్తయి..దీనికి కారణం భూ భ్రమణంలో మార్పులే కాదు భూ ఉపరితలం పై కొన్ని వేల సంవత్సరాలకింద జరిగిన భౌగోళిక మార్పులు కూడా కారణం.
స్పాట్
ప్రాకృతిక, భౌగోళిక మార్పులకు కారణాలన్నీ 20వ శతాబ్దంలోనే వెలుగు చూసినయి. ఈ భూమి పై జరిగిన అనేక ప్రళయ సారూప్య మార్పుల ఆనవాళ్లు ఒక్కొక్కటే వెలుగు చూసినయి. శిధిల రాళ్లు కొన్న కథలు చెప్పినయి. శిలాజాలు తమ గత చరిత్రను విప్పినయి.
స్పాట్
పరిశోధన చేయాలంటే కశ్చితంగా పిహెడిలు చేయాలని చాలామందిలో ఒక అపోహ ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే అలా చేసిన వారి పరిశోధనకే విలువనిస్తరు. కానీ విద్యావకాశాలు లేక కొందరు, తమకు ఉత్సాహం ఉన్న రంగంలో అవకాశం రాని వారు కొందరు తమకు అభిరుచి ఉండి..తన మెదడులో మెరిసిన ఊహాగానాలను నిజమని నిరూపించేందుకు రేయింబవళ్లు కష్టపడి పరిశోధన చేస్తరు. అలా పరిశోధన చేసి ఈ భూ చరిత్రను బట్టబయలు చేసిన వాడే ఆల్ఫ్రెడ్ వేగనార్.. వేగనార్ జర్మన్ వాతావరణ వేత్త.. కానీ భౌగోళిక శాస్ర్తమంటే మక్కువ. కానీ ఒక మెటీరియాలజిస్ట్ జియాలజిస్ట్ రూపాంలోకి మారాలంటే అంత తేలిక కాదు. ఎందుకంటే రెండిటి సిద్దాంతాలకు అనుసంధానమైన విషయాలు కొన్ని ఉన్నా పరిశోధించే స్థాయి నాలెడ్జ్ ఉండదు.
స్పాట్
వేగనార్ తాను ప్రతిపాదించిన సిద్దాంతం యావత్ ప్రపంచ శాస్ర్తవేత్తల నే ఉలిక్కి పడేలా చేసింది. మొదట్లో ఈ సిద్దాంతం వివాదాస్పదంగా అనిపించింది. అంతేకాదు ఇది ఒక్క భూమి రూపం గురించే కాదు. భూమి పై వివిధ శక్తుల పనితీరుకు సరియైన కారణాన్ని వివరించే ప్రయత్నం చేసింది.
స్పాట్
వేగనార్ ఖండ చలన సిద్దాంతం ప్రతిపాదించడం వెనుక కేవలం ఒక చిన్న ట్రిక్ దాగి ఉంది. తాను ప్రపచం పటాన్ని తీక్షణంగా పరిశీలించడమే ఈ సిద్దాంతాన్నికి కారణమయింది.
స్పాట్ (స్మాల్)
ప్రపంచ పటాన్ని పరిశీలించి గ్రీన్ లాండ్ నుంచి అంటే ఉత్తర ధృవం నుంచి దక్షిణ ధృవం వరకు ఖండ రూపాలకు అంచులకు కొంత సారూప్యం ఉన్నట్టు గుర్తించిండు వేగనార్. ఆ మేరకు మ్యాప్ ను కట్ చేసి ఖండాలను దగ్గరగా అతికించి చూసిండు. అంతే అతనిలో మెదిలిన ఆలోచన మరింత బలపడ్డది. తానూహించింది నిజం కావచ్చనే ఉద్దేశ్యంతో మరిన్ని ప్రయోగాలు చేయనారంబించిండు. ఆఫ్రికా ఖండాన్ని, దక్షిణ అమెరికా ను అట్లాస్ నుంచి పూర్తిగా వేరు చేసిండు. ఇప్పుడు ఆఫ్రికా పడమటి భాగాన్ని, దక్షణ అమెరికా తూర్పు భాగాన్ని దగ్గరగా తెచ్చి చూసిండు. అంతే భూమి పొరల్లో ఉన్న దాగిన జియోసీక్రెట్ కు మరింత కదలిక వచ్చింది. ఈ రెండు ఖండాలూ ఒక తానులో చింపిన రెండు గుడ్డముక్కలుగా అతికి పోయినయి. కానీ ఈ ఒక్క ఆధారంతో ఈ రెండూ ఒకే ప్రదేశాలన్న విషయాన్ని రుజువు చేయాడానికి వీలులేకుండా పోయింది. దీనికి మరో రుజువు కూడా దొరికింది వేగనార్ కు అదేంటంటే భూమి పొరల్లో దొరికిన శిలాజాలు దక్షిణ అమెరికా తూర్పు బాగంలో దొరికిన శిలాజాలు, ఆఫ్రికా ఖండంపు పడమర భాగంలో దొరికిన శిలాజాలను పోలి ఉండటమే దీనికి కారణం.
స్పాట్
ఈ శాస్ర్తవేత్త చేతిలో కనిపిస్తున్న శిలాజం ఒక ఫెర్న్ ఆకుది. ఇది 250 మిలియన్ సంవత్సరాల కిందట భూమి పై అంతరించిన మొక్క శిలాజం. ఈ మొక్క కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్యమాత్రమే పెరుగుతుంది. అంటే ఇప్పుడు చూస్తున్న ఈ మంచు శిధిలాల మధ్య అన్నమాట. ఒకప్పడు ఈ భూమి పై కొన్ని ప్రత్యేకమైన సరీసృపాలు రాజ్యమేలేవి. ఈ జంతువుల శిలాజాలు దక్షిణ అమెరికా సానువుల్లో దొరికినయి. ఈ శిలాజాలు ఆఫ్రికాలో దొరికిన శిలాజాలతో పోలిఉన్నయి. ఆఫ్రికాలో 7000ల కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ప్రాంతంలో దొరికిన అనేక రకాల శిలాజాలకు దక్షిణ అమెరికాలో దొరకిన శిలాజాలకు అనేక సారూప్య లక్షణాలున్నయి. ఈ రుజువుల ఆధారంగానే దక్షిణ అమెరికా ఆఫ్రికా ఖండంలో బాగమేనన్న విషయాన్ని రుజువు చేసిండు.
బ్రేక్ యాంకర్
ఆఫ్టర్ బ్రేక్ షాట్స్
యాంకర్ 2
ఈ భూమి పై భూ భాగమంతా కలిసి ఉండేదని కాలక్రమంలో ఖండాలుగా విడిపోయిందనే సిద్దాంతాన్ని ప్రతిపాదించిండు. దానికే కాంటినెంటల్ డ్రిఫ్ట్ అనే పేరు పెట్టిండు. మనం దాన్నే ఇప్పడు ఖండ చలన సిద్దాంతంగా పిలుచుకుంటున్నాం..వేగనార్ సిద్దాంతం ప్రకారం ఇప్పుడున్న ఏడు ఖండాలు కలిసే ఉండేవి. ఈ ఖండాలన్నిటినీ కలిపి వేగనార్ పాన్జియా అని పేరు పెట్టిండు. పాన్జియా అంటే ఖండసమూహమని అర్ధం. కాల క్రమంలో ఇది విడిపోయిందని చెప్తడు వేగనార్.
స్పాట్ ( బ్లాక్ అండ్ వైట్ మాప్ విడిపోయే సీన్స్)
ఇది వేగనార్ ఊహించిన ఖండచలన సిద్దాంతానికి ఊహారూపం. ఒకే చోట ఉన్న భూమి ఇలా ఖండ ఖండాలుగా విడిపోయిందని ఊహిచిండు. దక్షిణ అమెరికా, భారత ఖండాలు ఆఫ్రికా తూర్పు పడమరల ముక్కలేనని ఈయన అభిప్రాయం. ఈ భూమి ఖండాలుగా విడిపోవడాన్ని ఐస్బర్గ్ ల ప్రవాహంగా అభివర్ణించిండు వేగనార్. ఈ భూమి అతిచల్లని మంచు శిలలతో ఆవరించి తరువాత బాగాలుగా విడిపోయిందని ఇతని నమ్మకం. తరువాత తన ఊహలను రుజువు చేసేందుకు అనే మంచు ద్వీపాలను దర్శించి పరిశోధించిండు. ఇంత పెద్ద సిద్దాంతాన్ని కనిపెట్టినా వేగనార్ ఐడియాను ఎవరూ గుర్తించలేదు. పైగా అతనికి సరైన ప్రోత్సాహం లభించలేదు. కారణం వేగనార్ ను కేవలం ఒక వాతావరణ వేత్తగానే ప్రపంచం గుర్తించింది. ఆయన తాను ప్రతిపాదించిన సిద్దాంతాన్ని రుజువు చేయడానికి బలమైన ఆధారాలు లేకపోవడం, అప్పటికి కొన్ని మత పరమైన సిద్దాంతాలు పాతుకుపోవడంతో వేగనార్ సిద్దాంతం కొంతకాలం మరుగున పడింది.
స్పాట్
వేగనార్ వాతావరణ వేత్త నుంచి పూర్తిగా భూగోళశాస్త్రవేత్తగా మారిండు. తన సిద్దాంతాలను ప్రపంచానికి తెలియజేసిండు. 1950లో యునైటెడ్ స్టెట్స్ లో వచ్చిన కోల్డ్ వార్ ప్రపంచ శాస్ర్తరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. రష్యా అమెరికాల మధ్య సాగిన దోబూలచులాట..యుద్ద అవసరాలకు సంబంధించిన పరిజ్ఞానం సముద్రలోతులను అన్వేషించేలా చేసింది. (బ్లాక్ అండ్ వైట్ విజువల్స్ పడవ, సముద్రం) సముద్ర పరిశోధకులు నీటి అడుగు బాగంలో ఏమున్నది. ఏరకమైన వాతావరణం ఉన్నదనే విషయాన్ని పరిశోధించింన్రు. సముద్రగర్భంలో ఉన్న అడుగు బాదానికి సంబంధించిన వేలాది ఫోటోలను సేకరించిండ్రు.(ఫోటోల సౌండ్ తో విజువల్స్ వేయాలి). ఎకో సౌండ్ సిస్టంతో సముద్ర గర్భంలో నేల ఏ ఏ ప్రాంతాల్లో ఎలా ఉందో మ్యాప్ లు గీసిన్రు. లోతైన సముద్రతలాన్ని కూడా ఇదే సూత్రంతో కొలిచిండ్రు. సముద్ర లోతులను లెక్కగట్టిన పరిశోధకులు సముద్ర మట్టిలో ఏ ఏ రకాల ధాతువులు ఉన్నయో పరిశోధించ తలపెట్టిండ్రు. అంతే సముద్రగర్భంలోకి డ్రిల్లింగ్ మెషిన్ ను పంపి మట్టిని సేకరించిన్రు. ఈ పరిశోధనలో శాస్ర్తవేత్తలు ఊహించని ఫలితం వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం వెలుగు చూసింది.
స్పాట్( గ్లోబ్ లాంటి విజువల్స్)
శాస్ర్తవేత్తలు తమ పరిశోధనలో సముద్రగర్భం అంతా ఒకే రకంగా ఉండక పోవడాన్ని గుర్తించిన్రు. అంతేకాదు వేలాది భూ పొరలు ఒకదానికికొకటి అనుసంధానమై ఉన్నట్టు తెలుసుకున్నరు. ఇవి గాడుల మాదిరిగా, కందకాలుగా మిగిలిపోయినవి. వీటి అంచులల్లో ఎత్తైన ప్రదేశాలు గుట్టలు గుట్టలుగా రూపాంతరం చెంది ఉన్నయి. (నీటి అడుగు బాగం విజువల్స్) భూమి పై లోయలున్నట్టే, నీటి అడుగు బాగంలో కూడా లోయలు, గుట్టలు ఉన్నట్టు గుర్తించిండ్రు. అంతే కాదు నీటి అడుగున అగ్ని పర్వతాలను కూడా గుర్తించిన్రు శాస్ర్తవేత్తలు. సముద్ర గర్భంలో నిత్యం రగులుతున్న అగ్ని పర్వతాల లోంచి లావా ద్రవం వెలువడి ఉపరితలం పై చల్లబడుతది. ఇదే తరహా ఆనవాళ్లు పొడి నేల పై గుర్తించారు. నీటి అడుగు బాగాన ఉన్న వాతావరణానికి, నేల పై ఉన్న భౌగోళిక వాతావరణానికి ఒక్క నీరు గాలి తప్ప మిగిలిన వన్నీ ఒకేరకంగా ఉండటాన్ని శాస్ర్తవేత్తలు గుర్తించిన్రు.
స్పాట్
ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం ప్రపంచంలోనే అదుదైన ప్రాంతం. అతి కొద్ది ప్రదేశాలలో ఒకటి. భూగ్రహం పై రెండు ముక్కలను అతుకు పెట్టిన అరుదైన ప్రాంతం ఇది. ఇది ప్లానెట్ ప్యాచ్ ఏరియా..నల్లని పురాతన శిలలతో నిండిన ఈ ప్రాంతం ఒకప్పడు లావాతో నిండిన ప్రాంతమిది రెండు ఖండాలు విడివడి సంధానంగా మిగిలిన ప్రాంతం ఇది. ఇప్పడు చల్లని వాతావరణంతో ఎత్తైన జలపాతాలతో అలరారుతోంది.
స్పాట్ ( ఒరిజినల్ సౌండ్స్)
ఇక్కడ కనిపించే ఈ కందకం ఒక మామూలు కందకం లాగా కనిసిస్తున్నది.. కానీ ఇది భూ బాగాలుగా విడిపోవడం మొదలయింది ఇక్కడే..ఇది భూమి పురా చరిత్ర తాలూకు ఆనవాలు. ఈ కందకం ఇక్కడణ్ణుంచి మొదలుకొని ఐస్ లాండ్ వరకు ఉంది. ఇది అట్లాంటిక్ సముద్రం, ఉత్తర అమెరికా మీదుగా పసిఫిక్ మహాసముద్రం వరకు ఉంది. ఈ ప్రాంతాన్ని ఉత్తర అమెరికా ప్లేట్ గా పిలుస్తరు. దీనికి పూర్తిగా వ్యతిరేక దిక్కులో ఉన్న ఎనార్నమస్ ప్రాంతాన్ని గుర్తించిండ్రు శాస్ర్తవేత్తలు. దాన్ని యురేషియన్ ప్లేట్ అంటరు. అది ఇక్కడ నుంచి షాంఘై వరకు విస్తరించి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ నిల్చున్న శాస్ర్తవేత్తకు దూరాన ఉన్న యురేషిన్ ప్లేట్ కు మద్యలో వేయి సంవత్సరాలకు మునుపు ఎక్కువ దూరం లేదు.
స్పాట్
ఈ ఖండ సంధి ప్రాంతం ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నది. ఈ రెండు ప్రాంతాల మద్యదూరం ఏటా 7మిల్లీ మీటర్లు పెరుగుతూ వస్తుంది. ఒక్కోచోట ఇది సంవత్సరాలనికి పది సెంటీమీటర్ల దూరం కూడా పెరుగుతుంది. ఇలా భూ భాగాల మద్య ఎడం పెరగడం మిలియన్ సంవత్సరాలకు మునుపే మొదలయింది. భూమి ప్రస్తుతం ఉన్న రూపాన్ని సంతరించుకోవడానికి కొన్ని మిలియన్ల సంవత్సరాల నుంచి ఈ ఖండాలు ఒకదానికి ఒకటి దూరంగా జరిగిపోతూనే ఉన్నయి. ఈ ఖండాలు విడివడ్డ ప్రభావం ఇప్పటికీ ఉంది. దీన్నే శాస్ర్తవేత్తలు కాంటినెంటల్ డ్రిఫ్ట్ అని పిలుస్తున్నరు.
స్పాట్
భూమికి సంబంధించి ఇంత అరుదైన సిద్దాంతాన్ని సూత్రీకరించిన వేగనార్ తన సిద్దాంతం ప్రపంచం వెలుగు చూడక ముందే కన్నుమూశారు. 1930లో ఖండచలన సిద్దాంతం ప్రయోగం కొరకు గ్రీన్ లాండ్ వెళ్లిండు. అక్కడి ఉష్ణోగ్రత అమాంతం మైనస్ 60 డిగ్రీలకు పడిపోవడంతో ఆ చలిని తట్టుకోలేక అక్కడే కన్నుమూసిండు. ఈ మంచు శిధిలాలలోనే ఆయన భౌతిక కాయం కప్పివేయబడింది. ఆయన ఖండచలన సిద్దాంతం ప్రకారం ఆయన మరణించిన నాటికి ఇప్పటికి ఆయన చనిపోయిన ప్రాంతానికి ఆయన ఇంటికి రెండు మీటర్ల దూరం పెరిగింది.
స్పాట్
ఉష్ణ ప్రాంతాలలో పెరగే ఫెర్న్ మొక్క శిలాజం మంచు ప్రాంతాలలోకి ఎలా వచ్చింది. రెండు ఖండాలలోనూ ఒకే జాతికి చెందిన ఒకే రకమైన జంతువుల శిలాజాలు ఎలా లభించాయి. అంతే కాకుండ సముద్రాల చేత వేరు చేయబడ్డ భూ భాగాలలో ఒకే జాతికి చెందిన జంతువులు ఎలా అభివృద్ది చెందినయి. ఇవన్నీ శాస్ర్తవేత్తల మెదడును తొలిచిన ప్రశ్నలు. వీటిని మరింత బలపరిచే శిలాజాలు, విలుప్త జీవులు ప్రకృతిలో ఎన్నో దొరికినయి.
ఈ ప్రశ్నలకు సమాధానం వెదికే క్రమంలోనే ఈ భూమి పైకి మానవుడు ఎలా వచ్చిండనే ప్రశ్నకు కూడా సమాధానం రాబట్టేందుకు ప్రయత్నించిండు మానవుడు.
స్పాట్
ఈ భూమి ఖండ ఖండాలుగా, ఖండాంతరాలుగా విడిపోవడానికి ఎన్నో కారణాలున్నయి. ఈ భూమి పై జరిగిన అనేక విలయాల వల్ల భూమి భాగాలుగా విడిపోయింది. భూ పటలాలన్నీ చిక్కని ద్రవ రూపంలో నిప్పులు కక్కుతూ ఉండేవి. ఈ భుగభుగ లాడే నిప్పుల కాసారం నుంచి ఒక్కసారిగా లావాద్రవం ఎగసి పడింది. ఆ పొగలు భూమిలో ఎక్కువ ప్రాంతాన్ని ఆవరించినయి. నెలల కొద్దీ సూర్యరశ్మి భూమిని సోకకుండా అడ్డుకున్నయి ఈ పొగలు. ఈ పేలుళ్ల మద్యలో ఉన్న రెండు భూ పలకలు ఒకదానినొకటి రాసుకొని పగిలిపోయినయి. ఈ పరిణామం భూమి మొత్తాన్ని వణికించింది. భూమి నిండా కంపనాలు పుట్టి భూగోళం కంపించి పోయింది. జలాంతర్భాగం కూడా అతలాకుతలం అయింది. భూమి పై పుట్టిన ఈ మహా భూకంపానికి గుట్టలు, పీఠభూములు అన్నీ కంపించిపోయినయి. సముద్రంలో పుట్టిన భూకంపానికి మహా సునామీ ఉద్భవించింది. అంతే సముద్రం పొంగి భూమి పైకి వచ్చింది. తన దారిలో వచ్చిన ప్రతి దాన్ని సర్వనాశనం చేస్తూ ముందుకురికింది.
స్పాట్
ఈ మహా ప్రళయాన్ని కళ్లముందు ఊహించడానికే భయంగా ఉంటుంది. ఇంత విలయానికి ఎంత ప్రాణ నష్టం జరిగి ఉంటదో ఊహించవచ్చు. ఈ సంఘటన జరిగి హాఫ్ మిలియన్ ల సంవత్సరాలు కావస్తుందని పరిశోధకుల అంచనా.. ప్రళయాలు ఉత్పాతాలు భూమికి కొత్తగాదు. భూమి పై జరిగే ప్రతి ఉత్పాతం ఒక కొత్త మార్పుకు నాంది పలుకుతంది.
ఈ ఖండచలన సిద్దాంతం కూడా కొత్త పరిణామానికి దారి తీసింది.
స్పాట్
భూమి పై జరిగే భౌగోళిక పరిణామాలు కూడా జీవుల జీవన విధానం పై మార్పు తెస్తున్నయి. 30 మిలియన్ ల సంవత్సరాలకు పూర్వం అరేబియా భూ భాగం నుంచి ఆఫ్రికా వేరవడం మొదలయింది. ఈ భూ పంపకంలో రెండు ప్లేట్ ల మధ్య 5000 కిలోమీటర్ల దూరం పెరిగింది. దీన్నే మనం తూర్పు ఆఫ్రికా లోయగా పిలుస్తున్నం. ఇలా ప్రాంతాల మధ్య దూరం పెరగడం వల్ల కొత్త ప్రదేశాలు ఏర్పడే అవకాశం ఏర్పడింది.
స్పాట్
ఈ భౌగోళిక పరిణామాలు జాతుల ఆవిర్భావానికి, అంతానికి దారితీసినయి. కాంటినెంటల్ డ్రిఫ్ట్ భూమి పై కొత్త జాతులు ఉద్భవించడానికి తగిన పరిస్థితులు కల్పించినట్లయింది. భూమి పై ఎగిసిన ధూళి, పొగ వాతావరణాన్ని మొత్తం కప్పివేయడంతో భూమిని సూర్యరశ్మి తాకే అవకాశం లేకుండా పోయింది. అగ్ని పర్వతాలు చల్లబడ్డయి. సూర్యవికిరణం లేని భూమి మొత్తం శీతల వలయంగా మారిపోయింది.. సరిగ్గా అప్పుడే మంచు యుగానికి నాందీ పలికింది. ఖండ చలన ప్రక్రియలో కొంత భూమి దృవాల వైపుకు నెట్టివేయబడింది. మిగతా ఖండాతర స్థానాలలో సముద్రాలు వచ్చి చేరినయి. మారిన వాతావరణ పరిస్థితులను తట్టుకొని బతికిన జీవ జాతులు పరిస్థితులకు అనుగుణంగా మారినయి.
స్పాట్
వాతావరణంలో పరిస్థితులు చక్కబడి జీవజాతులు హాయిగా బ్రతుకున్న సమయంలో భూమి పైకి మరో విపత్తు వచ్చి పడింది. అంతరిక్షం నుంచి ఒక పెద్ద గ్రహశకలం వచ్చి భూమిని ఢీకొంది. అప్పడు ఎగసిపడ్డ మంటలకు, వచ్చిన భూ కంపానికి భూగోళం మరోసారి అతలాకుతలం అయింది. చాలా రకాలైన జీవజాతులు ఆ మంటల్లో ఆహుతైపోయినయి. ఒకప్పుడు ఈ భూగోళం పై ప్రాబల్యాన్ని చాటిన మామత్ లు, డైనోసార్ లు, మచ్చుకు కూడా లేకుండా కనుమరుగైపోయి, శిలాజాలుగా భూమి పొరల్లో నిక్షిప్తమయినయి. వాటి స్థానంలో కొత్త జాతులు పుట్టుకొచ్చినయి.
స్పాట్
ఈ ఎపిసోడ్ మొత్తంలో మానవడి ప్రస్థావనే రాలేదు కదూ..అవును ఇంతకీ ఈ భూగోళం పైకి మానవుడు ఎప్పుడొచ్చాడు. ఇన్ని ఉత్పాతాల నడుమ మనిషి ఎలా బతికి బట్టగలిగిండు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో ఒక్కో పరిశోధకుడిది ఒక్కో సిద్దాంతం. మెజారిటీ శాస్ర్తవేత్తల అంచనా ప్రకారం ఒకప్పుడు ఉష్ణగ్రహంగా ఉన్న భూమి పై బలమైన ఉష్ణరక్త జీవులు ఉండేవి. మారిన వాతావరణ పరిస్థితులకు కొన్ని జాతులు అంతరించి పోగా, మరికొన్ని జాతులు తమ రూపాన్ని ఆహారపు అలవాట్లను మార్చుకొని మనుగడ సాగిస్తున్నయి. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా జంతువుల, వృక్షాలలో కూడా అనేక ఉత్పరివర్తనాలు వచ్చినయి. అలా హోయో సెపియన్స్ జాతి నుంచి ఉత్పరివర్తనం ద్వారా ఉద్భవించిన తెలివైన జీవి మానవుడని మెజారిటీ శాస్ర్తవేత్తల అభిప్రాయం. ఈ పరిశోధనలో జీవం గురించిన అసలు రహస్యం తెలిసింది. ఈ భూమి ఇన్ని మార్పులకు గురికావడానికి కారణం ఉత్పాతాలు, ఖండచలనం, వాతావరణం, ఇవన్నీ నేటి భూమి అసలు రూపానికి, వైరుధ్య జీవజాతులు ఏర్పడటానికి కారణం. ఇన్ని ఉత్పాతాల నడుమ మనిషి బతికి ఈ భూమి పై జీవజాలాన్ని బతికించడం నిజంగా ఆశ్చర్యమే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి