ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలను మీ ముంగిలిలో నిలిపే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
రిపీట్ యాంకర్
మానవుడికి తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకోవాలన్న ఆకాంక్షతో బాటు తనను తాను తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా పెరిగింది. ఆ ఆసక్తితోనే తాను విశ్వవ్యాప్త ప్రయగాలు చేసిండు. అందులో వ్యక్తి హావభావాలు, మనిషి ప్రవర్తనకు మధ్య ఉన్న సారూప్యాలను వైరుధ్యాలను అధ్యయనం చేయగలిగిన్రు. ఈ సృష్టిలో మనం చూసే విషయాలన్నీ వాస్తవాలా..భ్రమలా.. మనకు కనిపించి మన కంటిని సైతం మాయం చేయగల చిత్రాలు మనల్ని మోసపుచ్చుతున్నయా..చూసే ముందు గతవారం చూసిన సైన్స్ ఎపిసోడ్లో నేనెవరు అనే దానికి సమాధానం ఎంతవరకు వచ్చిందో చూద్దాం.( ఇది వీలైతే కనీసం రెండు నిముషాలు వేయగలరు.)
యాంకర్ 1
మనిషి సృష్టిలోనే చాలా తెలివైన జీవి.. ఆహార్యంలో చాలా చిన్నజీవి అయినప్పటికీ..ఈ విశ్వాన్నే తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకొనే ఆశాజీవి. ఇన్ని తెలిసిన మనిషి తాను చావు జయించడంలో పూర్తిగా విఫలం అయిండు. చావును జయించాలంటే ముందు జన్మరహస్యం తెలియాలి. మనిషి సృష్టించబడిండా లేకపరిణామం చెందిండా..ఈ పరిణామంలోనే మనవ మేథస్సు పరిణామం చెందిందా..లేక సృష్టించిన మానవుడి మెదడు వరంగా ఇవ్వబడిందా..ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనే పనిలో పడ్డరు పరిశోధకులు.
స్పాట్
వాయిస్ ( పాత ఫీడ్ కూడా వాడాలి)
మానవుడు తానెవరో తెలుసుకునే క్రమంలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చినయి. మనిషికి సారూప్య పోలికలున్న జంతువులకు హావభావాలలో సారూప్య లక్షణాలు గుర్తించిన్రు. దీనికి కారణం మెదడే అన్న విషయం అర్ధమయిపోయింది. మెదడు అభివృద్ది చెందిన కొద్దీ జీవి ప్రవర్తనలో అభివృద్దిలో మార్పు కనిపిస్తదన్న విషయం రుజువయింది. అయితే ఈ వానరజాతి నుంచే మానవుడు ఉద్భవించాడా అన్న ప్రశ్న నేటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది.
యాంకర్ 2
మెదడు.. ఇదో బ్రహ్మ పదార్ధం. కంప్యూటర్కు హార్డ్ డిస్క్ ఎలాగో జీవులక మెదడు అలాగ..ఎంత మేథావి అయినా మెదడులో చిన్నలోపం వచ్చిందంటే పూర్తి జీవితాన్ని కోల్పోవలసిందే..ఇంతకీ మెదడులో ఏముంది..
స్పాట్
మెదడంటే కపాలంలో ఇమిడిపోయిన ఒక మాంసం ముద్ద కాదు. దీని నిర్మాణంలోనే ఒక ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నయి. మెదడు చుట్టూ చిన్న చిన్న ముడుతలు ఉన్నయి. ఇవి మెదడు వైశాల్యాన్ని పెంచేందుకు ఉపయోగపడుతయి. అంతే కాదు తక్కువ ప్రాంతంలో ఎక్కువ తలాన్ని ఆక్రమిస్తుంది. మెదడు అంతర్భాంగం నిండా న్యూరాన్ లు నిండి ఉంటయి. ఈ న్యూరాన్ లు ఒకదనికొకటి అనుసంధానించబడి ఉంటయి. వీటిద్వారా దేహం మొత్తానికి కమ్యునికేషన్ డెవలప్ అవుతుందన్న విషయం రుజువు చేసుకున్నారు శాస్ర్తవేత్తలు.
స్పాట్ (మెదడు, న్యూరాన్ విజువల్స్)
మెదడును విశ్లేషించిన శాస్ర్తవేత్తలకు అచ్చం మెదడులా పనిచేసే యంత్రాన్ని కనుగొనాలనే ఆలోచన వచ్చింది. అంతే..ఆలస్యం చేయకుండా అమలుకు శ్రీకారం చుట్టిన్రు.
స్పాట్(రూం కంప్యూటర్ )
ఇదిగో ఇక్కడ రూం నిండా కనిపిస్తున్న ఈ ఎలక్ర్టానిక్ సర్యూట్లు చూస్తే ఏదో పవర్ హౌజ్ కు వచ్చినట్టుంది కదూ..వాస్తవానికి ఇది పవర్ హౌస్ కాదు. పవర్ యుటిలేషన్ చాంబర్. అంటే ఇప్పడు మన అరచేతిలో ఇమిడిపోయే ల్యాప్ టాప్ కు ఇదే ప్రాథమిక రూపం.
స్పాట్
యాంకర్ 3
మనిషి మెదడులా వేగంగా పనిచేసే మిషన్ను ఒకటి తయారు చేస్తే మనిషికి ఆలోచనలకు భారం తగ్గి పని త్వరగాఅవుతుందనే ఆలోచనల్లోంచి పుట్టిందే కంప్యూటర్. మెదడుకు కంప్యూటర్ పనితీరుకు ఎన్నో పోలికలు ఉన్నయి. కాకుంటే ఇది మానవ నిర్మితం కాబట్టి మనిషి దానిలో ఫీడ్ చేసిన విషయాలతో మాత్రమే పనిచేయగలదు. అంతకు మించి చేయడానికి దానికి స్వయంగా ఆలోచించే శక్తిగానీ నిర్ణయాలు తీసుకొనే శక్తిగానీ లేదు.
స్పాట్
ఇది మనిషి మెదడుకు నమూనా.. ఇందులో మెయిన్ ప్రాసెసర్ కు, హార్డ్ డిస్క్కు అను సంధానించబడిన ఈ సర్కూట్ లను న్యూరాన్ల తో పోల్చారు. ఈ ఎర్రని వైర్లను ఆక్సాన్ లుగా, డెండ్రైట్ లుగా అభివర్ణించింన్రు.
స్పాట్( రూం కంప్యూటర్)
ఇలా గదినిండా ఉన్న ఈ కంప్యూటర్ ఇప్పుడు మానవ చేతిలో ఇమిడిపోయేంత చిన్నగా తయారయింది. అంతేకాదు మనం ఏ విషయాన్ని మరిచి పోయినా..మన మెదడుకు స్ఫురించని విషయాలు మెదడును అడిగితే అదే చెబుతుంది. మన పేరు మరిచిపోయినా దీన్ని అడిగితే చాలు క్షణాల్లో చెప్పేస్తుంది..అంటే దీనికి ముందు కంప్యూటర్ లో మన పేరు ఫీడ్ చేసిఉండాలి.
స్పాట్( ల్యాప్ టాప్ లో టైప్ చేసే సీన్)
ఈ కంప్యూటర్ ఇలా అరచేతిలో ఇమిడిపోయి సమస్త విశ్వాన్ని తనలో ఇముడ్చుకునే దశ ఒక్కసారే వచ్చింది కాదు. దీనికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. ఆ తరువాతే మాన్ లైక్ మాషిన్ అనే మరమనిషిని తయారు చేయగలిగిన్రు. దీని ద్వారా మనిషి ఆదేశాలను అనుసరించే మరమనిషి తయారయింది.
స్పాట్ (అమెరికా భవంతులు )
20 వ శతాబ్దంపు ప్రారంభదశలో అమెరికా శరవేగంగా అభివృద్ది చెందింది.( బిల్డింగ్ ఒరిజినల్ స్పాట్లు). ఈ దశలోనే మనిషి తనను తాను అధ్యయనం చేసేందుకు పరిశోధన చేసిండు. మనిషిలోని మెదడు శరీరాన్ని సమన్యవయం చేస్తే మరి మనసునెవరు సమన్వయం చేస్తరు. ఇదే ప్రశ్న శాస్ర్తవేత్తలను కూడా ఆలోచింపజేసింది. నిజానికి మెదడు చేసే ఆలోచనల ప్రక్రియే మనసన్న విషయాన్ని తరువాత గుర్తించిన్రు. కానీ ఈ మనసును అధ్యయనం చేయడం ఎలా..దానికి పరిశోధకులు పెట్టిన పేరే “”సైకాలజి”
స్పాట్(పాత విజువల్స్, హిప్నాటిజం బొమ్మలు)
యాంకర్ 4
సైకాలజి. ఈ పదం మనం తరుచూ వింటున్నదే..కానీ దీని లోగుట్టేంటో ఎవరికీ తెలియదు. సైకాలజి తో మనుషులను వశపరచుకోవచ్చంటారు నిజమేనా..మనిషిని వశీకరణ చేసుకోవడానికి సైకాలజిలో ఏమున్నాయి. మాయలా మంత్రాలా కేవలం మాటలేనా..మనిషిని మాటలతో ఏమార్చే ఆ నూతన ప్రక్రియ ఏంటి. దీనికి తొలుత బీజాలు వేసింది ఎవరు..చూద్దాం..
స్పాట్
సైకాలజి.. మనసును అధ్యయనం చేసే శాస్ర్తం..ఇది సైన్స్ లో బాగమే..దీనిలో వ్యక్తి ప్రవర్తనను అధ్యయనం చేస్తరు.( స్పాట్ ట్రైన్ బ్లర్, మీటింగ్ హాల్లో ప్రజలు విజవల్) ప్రజల్లో దాగి ఉన్న మూఢనమ్మకాలు, విశ్వాసాలను రూపుమాపేందుకు ఈ శాస్ర్తం బాగా పనికొచ్చింది. అంతెందుకు ఎప్పటినుంచో మార్చుకోని అలవాట్లు కూడా ఒక్క గంటలో మాన్పిచ్చే ఆయుధం సైకాలజి. సైకాలజి డెవలప్ కావడానికి కొన్ని దశాబ్దాలు పట్టినయి.
స్పాట్( పావురం, శాస్ర్తవేత్త విజువల్స్)
బి. ఎఫ్ స్కిన్నర్ అనే మానసిక శాస్ర్తవేత్త మొదట ఎలుకల, పావురాల ప్రవర్తన పై అధ్యయనం చేసిండు. ఈ చాంబర్ స్కిన్నర్ అధ్యయనం చేసిన పరిశోధనాలయం. ఇవన్నీ ఆయన స్టడీ చేసిన గ్రంధాలు. ఆయనకు సంగీతమంటే ప్రాణం. ఇష్టమైన పాటలు వినేవాడు. రిమోట్ లేని రోజులు కావడం వల్ల. బటన్ లకు దారం కట్టి ఆపరేట్ చేసేవాడు. ఈ ఆలోచనే తరువాత రిమోట్ కనుగొనడానికి మార్గదర్శకం అయింది..స్కిన్నర్ పర్సనల్ రూం మొత్తం సాంకేతిక పరిజ్ఞానంతో నిండి ఉంటది. ఆయన బెడ్ కూడా టెంపరేచర్ కంట్రల్ చేసుకోనే సౌకర్యం కూడా ఉంది. ఈ మాత్రం సాంకేతిక జ్ఞానం ఉండబట్టే స్కిన్నర్ తన పరిశోధనలను సునాయాసంగా చేయగలిగిండు.
స్పాట్( పై విజువల్సే)
దీన్ని స్కిన్నర్స్ పెట్టే అంటరు. ఇందులో ఒక పావురం పరిస్థితులకు అణుగుణంగా ఎలా ప్రవర్తిస్తుందో అధ్యయనం చేసిన్రు. (స్మాట్ స్పాట్ పావురాలు మేత మేయడం...)
ఇక్కడ ఇద్దరు పరిశోధకులు స్కిన్నర్ బాక్స్ గురించిన విషయాలు తెలుసుకుంటున్నరు. కింది వైపు 2 అంకే ఉన్నది స్కిన్నర్ పెట్టే ఇందులో పరిక్షించదలుచుకున్న జీవిని ఉంచుతరు. అందులో చిన్నకెమెరా అమర్చి మూసేస్తరు. అప్పడు అందులో ఉంచిన ఏ జంతువైనా తమను ఎవరూ చూడట్లేదనే భ్రమలో సహజ ప్రవర్తనతో మెదులుతుంటయి. కొన్నినియంత్రిత పరిస్థితుల్లో జీవులు ఏవిధంగా ప్రవర్తిస్తయనేది ఈ ప్రయోగం చెబుతుంది. ఒక్కసారి ఆ ప్రయోగాన్ని చూద్దాం..
స్పాట్
పరిశోధకులు మొదట ఒక పావురాన్ని తీసుకొని దాన్ని ఈ స్కిన్నర్ పెట్టేలో ఉంచుతరు. దానికం టే ముందు ఆ పెట్టెలో కొన్ని నియంత్రిత పరిస్థితులు ఏర్పాటు చేస్తరు. అంటే ప్రయోగానికి కావలసిన మీటలు, ఆహారం వంటివన్నమాట. ఆకలితో ఉన్న పావురానికి కొన్ని గింజలు ఇచ్చే ఏర్పాటు ఉంటది. అయితే పావురం అక్కడ వెలిగిన మీటను నొక్కితేనే దానికి ఆహారం వస్తుంది. మొదటగా ఎర్రలైటు, పచ్చలైటు వేసి దీని ప్రయోగం చేశారు. ఎర్రలైట్ వెలిగినపుడు ఎటువంటి ఆహారం రాలేదు. పచ్చలైటు వెలిగినపుడు దాన్ని మీటినపుడు మాత్రమే ఆహారం వచ్చింది. దీంతో పావురం ఎర్రలైటు వెలిగినపుడు దాన్ని మీటకుండా ఆపేసింది. తరువాత మద్యలో మీట కాకుండా దానికి ఇరువైపులా ఉన్న పచ్చమీటలు నొక్కినపుడు మాత్రమే ఆహారం వచ్చేలా ఏర్పాటు చేసిన్రు.. కొంత సమయానికి కేవలం ఎడమ వైపున్న పచ్చమీట నొక్కినపుడు మాత్రమే ఆహారం వచ్చేలా ఏర్పాట్లు చేసిన్రు. దీంతో పైన ఎడమ వైపు మీట నొక్కడం, కింద ఆహారం సేకరించడం అనే ఏకాంతర చర్యల వలన పావురం నిరంతరం యాంటీ క్లాక్ వైస్ కండీషన్ లో తిరగడం మొదలయింది. అంటే జంతువులు కూడా మారిన సరిస్థితులను బట్టి తమ ప్రవర్తన మార్చుకుంటాయని సూత్రీకరించిండు స్కిన్నర్. ఇదే సూత్రాన్ని మానవులకు కూడా అన్వయింపజేసిన్రు.
స్పాట్
మనుషుల చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చడం ద్వారా వారి ప్రవర్తనను మార్చవచ్చనే సిద్దాంతాన్ని నమ్మిన్రు పరిశోధకులు.
యాంకర్ 5
స్కిన్నర్ ఎలుకలపై పావురాలపై చేసిన ప్రయోగాలు మానవుల పై ప్రయోగిస్తే ఎలా ఉంటది. మానవ ప్రవర్తనకు జంతువుల ప్రవర్తనకు ఉన్న సారూప్యాలేంటి..వైరుద్యాలేంటి అనే విషయాన్ని కనుక్కొనే ప్రయత్నం చేసిన్రు ఆధునిక పరిశోధకులు.
స్పాట్(గ్రాఫిక్ స్పాట్)
1960 దశకంలో సైకాలజిలో ఆధునిక పద్దతులను అవలంబించిన్రు. మానసిక ప్రవర్తనను కంట్రోల్ చేసే కొత్త ఔషదాలు, థెరఫీలు, వ్యక్తిత్వ పరీక్షలు అందుబాటులోకి వచ్చినయి. భావోద్వేగాలను, జ్ఞాపకశక్తిని, అంచనా వేయగల పెద్దపెద్ద పరికరాలు ఆవిష్కరించబడ్డయి. సైకాలజి ఒక పెద్ద విజ్ఞాన శాస్ర్తవిబాగంగా అవతరించింది.
స్పాట్(బ్రెయిన్ స్కానింగ్ విజువల్స్)
మానవుడి ఆలోచనలకు, ప్రవర్తనలకు మూలం తెలుసుకోగలిగిన్రు. మన మెదడులో జరిగే న్యూరో రసాయన చర్యలు కేవలం నానో సెకన్లోనే జరుగుతయి. ( స్పాట్ బ్రెయిన్ స్కాన్ ఒరిజినల్ సౌండ్) చూసే దృష్టిని బట్టి ప్రపంచం కనిపిస్తది. ఇదిగో ఇక్కడ ఒక ఇల్యూజన్ ఏర్పాటు చేశారు. రూంలో అమరికలను బట్టి ఒకే వ్యక్తి చిన్నగా, పెద్దగా కనిపిస్తున్నడు. ఇదిగో ఇక్కడ ఇద్దరు స్నేహితులు చెరో మూలన ఉన్నారు. చూడటానికి మాత్రం ఒకరు పొడుగ్గా ఒకరు పొట్టిగ్గా కనిపిస్తరు. కారణం గ్రౌండ్ లెవల్. రూఫ్ లెవల్ పోయిన కొద్దీ చిన్నగా ఉండటం వల్ల వ్యక్తి దూరంలోఉన్న భావన కలుగుతుంది. ఈ భావన వలన ముందు ఉన్న వ్యక్తి మనకు దగ్గరగా ఉన్నట్టు, రూం చివర ఉన్న వ్యక్తి పొట్టిగా ఉన్నట్టు మిద్యభావన కలుగుతున్నది. ఈ తరహా విజిబిలిటీ మన బ్రెయిన్ కు అలవాటయింది. పసితనం నుంచి చేసే కదలికల వల్ల మన బ్రెయిన్ లో కొంత ప్రొగ్రామింగ్ ఫీడ్ అయి ఉంటుంది. దాన్ని బట్టే మనకు కనిపించే వ్యక్తిని, వస్తువును , పరిసరాలను అంచానా వేయగలుగుతం.
స్పాట్(చిన్నపిల్లవాడు బొమ్మలతో ఆడుకునే విజువల్స్0
ఇక్కడ కనిపించే ఈ పిల్లవాడు తాను బొమ్మలతో ఆడుకోవడమే కాకుండా వాటిని నిశితంగా పరిశీలిస్తున్నడు. ఈ వయసు నుంచే అతని మెదడులో వస్తువుల పట్ల వాటి కదలికల పట్ల ఒక ఖశ్చితమైన అవగాహనకు వస్తడు. వస్తువుల పట్ల స్పృహ వస్తది.
స్పాట్ (పిల్లవాడి విజువల్స్)
మనిషి జీవితంలో తాను అనుభవించిన అనుభవాలన్నీ మెదడులో నిక్షిప్తం అయి ఉంటయి. తాను చేసే పనులకు, చేయబోయే పనులకు గత అనుభవాలు ప్రభావం చూపుతయి. వాటిని బట్టే తాను చేసే పనిలో నైపుణ్యం ఉంటుంది. తన అనుభవంలోకి రాని ఏ విషయమైనా అతనికి కొత్తగానే ఉంటయి. వాటి పట్ల తాను భిన్నంగా ప్రవర్తిస్తడు. (వివిధ రకాల మనుషుల విజువల్స్, జనం వాడుకోవాలి)
(తరువాత అన్నీ పాత విజువల్స్తో ఉన్న సీన్స్ ఉన్నయి. వాటిని వాడుకోవాలి)
సైన్స్ తన చరిత్ర నిండా ఎన్నో ఆవిష్కరణలు, ఎన్నో విజ్ఞాన విషయాలు రాసుకుంది. ఈ విషయాలు మనిషిని మరింత సౌకర్యవంతంగా జీవించేలా చేసింది. మరిన్ని ప్రశ్నలకు సమాధానం రాబట్టింది. దీనికి నింగి, నేల, సముద్రమనే అవధులు లేవు. విశ్వరహస్యాలను తనలో ఇముడ్చుకుంది. ఆ రహస్యాలను మన తరతరాలకు పంచింది.
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ విశేషాలు..మరిన్ని సైన్టిఫిక్ అప్డేట్స్ తో మళ్లీ కలుసుంకుందా..అంటిల్ దెన్ బై..
బ్రేక్ యాంకర్ ,,వెల్ కం బ్యాక్..చెప్పించాలి.
నెక్ట్స్..వీక్..విజువల్స్..30 సెకన్స్ వేసుకోవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి