సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ 26 ఎపిసోడ్
ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాను విప్పి చెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాటెడ్జ్ కు స్వాగతం.
రిపీట్ యాంకర్
మనిషిని వందల సంవత్సరాలుగా వేధిస్తున్న నేను అనేది ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వెదికే క్రమంలో ఎన్నో కొత్త విషయాలు ఆవిష్కరించ గలిగిండు. ఆ కొత్త కొత్త ఆవిష్కరణలతో మనిషి సుఖంగా జీవించడం నేర్చుకున్నడు. కానీ తానెవరు..తన మనుగడకు మూలం ఏంటి..అనే విషయం తెలుసుకోవడానికి సర్వ విధాలుగా కృషి చేసిండు. ఈ విషయాలు తెలుసుకునే ముందు గతవారం చూసిన విశేషాలు ఒక్కసారి చూద్దాం.
రిపీట్ లాస్ట్ స్టోరీ
స్పాట్
యాంకర్ 1
అవును.. మనిషి తనను తాను తెలుసుకోవడానికి ముందు ఆలోచనలకు మూలమేంటో కనుగొనే ప్రయత్నం చేసిండు. ఆలోచనల కేంద్రమైన మెదడు గురించి పరిశోధించడం మొదలుపెట్టిండు. అయితే ఈ మెదడు ఒక్క మానవులకే ఆలోచనలను కలిగించేలా పని చేస్తుందా లేక ఇతర జంతువులకు కూడా మెదడు ఇదే విధంగా పని చేస్తుందా..పరిశోధించారు శాస్ర్తవేత్తలు.
స్పాట్
వాయిస్
మానవ పరిణామం పై రోజురోజుకూ ఆసక్తి పెరిగింది. ఈ భూమి పైకి మానవుడు ఎలా వచ్చిండనే దానికి సమాధానం వెతికే క్రమంలో ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చినయి. మానవుడు ఎక్కడణ్నించి వచ్చాడనే విషయాన్ని కనుగొనడానికి మానవ రూపంలో ఉన్న అన్ని జంతువుల పై ప్రయోగాలు చేయనారంభించిన్రు పరిశోధకులు.
స్పాట్
శాస్ర్తవేత్తల అంచనా ప్రకారం ఇప్పుడున్న ప్రపంచ సుందరులందిరికీ పూర్వికుడు ఇక్కడ మనకు కనిపించే చింపానే. శాస్ర్తవేత్తలు ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వెలిబుచ్చినా అందిరి ఏకాభిప్రాయం ఒకటే. అదేమంటే మానవుడి పూర్వికులు వానర జాతి నుంచి పుట్టిన వారే. కానీ మానవుడు ఏ జాతి వానరం నుంచి పుట్టాడన్న విషయంలోనే బేదాభిప్రాయలున్నయి.
స్పాట్
ఇదిగో ఇక్కడ కనిపించే ఎర్ర చింపాంజి, గొరిల్లా వంటివన్నీ మానవుడికి దగ్గరి పోలికలతో ఉన్నయి. వీటి చేష్టలు కూడా మానవుని చేష్టలకు దగ్గరగా ఉన్నయి. మానవజాతిలో ఇదొక రకామా లేక మానవుడే వీటి నుంచి ఆవిర్భవించిండా అనేదానికి ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేవు. ఎందుకంటే వానర జాతి మొత్తం ఒకేరకమైన తెలివి తేటలను ప్రదర్శిస్తున్నయి. ఇక్కడ ఒక చింపాంజీ పరిశోధకుణ్ని ఎలా ఆటపట్టిస్తుందో చూడండి. దీని చేష్టలను చూస్తే ఇదొక జంతువన్న సంగతి పూర్తిగా మరిచిపోతం. మనమొక చిన్న పిల్లాడితోనో ఒక స్నేహితుడి తోనో ఆటలాడుకుంటున్న ఫీలింగ్ కలుగుతది.
స్పాట్( చింపాంజితో ఆటలాడే, ఉమ్మివేసే విజువల్స్ స్పాట్)
ఇదిగో ఈ చింపాంజి కోసం ఎవరో వచ్చారన్న సంగతి తెలిసి ముందుగా అది బుంగమూతి పెట్టింది. తరువాత తనకోసం ఏదో తెచ్చారని కిటికీ లోంచి తొంగి చూస్తోంది. దానికిచ్చిన నారింజ తొనలను ఆరగిస్తుంది. అచ్చం మనిషిలాగే గారాభం చేస్తుంది. కొత్తగా వచ్చిన మనిషి చేసే కామెంట్స్ దానికి నచ్చకుంటే మొహాని ఉమ్మేసి తీవ్ర నిరసన తెలియజేస్తుంది.
యాంకర్ 2
చూశారుగా మానవజాతి పూర్వికులు భావించే కోతుల్లో కూడా అచ్చం మానవ చేష్టలే ఉన్నాయి. అంటే మనిషి ఇప్పుడు చూపిస్తున్న లక్షణాలన్నీ పరిణామ క్రమంలోనే వచ్చినవా..లేక జంతువలను చూసి నేర్చుకున్నవా..ఆలోచన వచ్చింది మానవుడికి..అంతే దాని అంతు తేల్చుకోవలన్న జిజ్ఞాస కలిగింది ఒక శాస్ర్తవేత్తకు..రంగంలోకి దిగాడు..ఇంతకీ ఆయనెవరో కాదు..పరిణామ శాస్ర్తానికి మూల పురుషుడు చార్లెస్ డార్విన్..ఇంతకీ డార్విన్ ఏంచేశాడు. చూడండి
స్పాట్( ఉమ్మేసే విజువల్స్ రిపీట్)
ఇప్పుడు ఈ పరిశోధకుడు మాదిరిగానే చార్లెస్ డార్విన్ అనే శాస్ర్తవేత్త. ఒకసారి జూలోకి వచ్చిండు. ఈ కోతి చేసే మానవ చేష్టలను చూసి ఆయన మదిలో ఒక కొత్త ఆలోచన మొదలయింది. ఆ ఆలోచనే పరిణామ సిద్దాంతానికి పునాది రాయి అయింది. ఆయన జూ విజిట్ చేయడం పరిశోధనలో మొదటి అంకంగా మారింది.
స్పాట్(అద్దంలో చింపారజీని చూడటం)
డార్విన్ ముందుగా జులో ఉన్న వివిధ రకాలం జంతువుల హావభావాలను ప్రవర్తనను అధ్యయనం చేయడం మొదలు పెట్టిండు. ఒక చింపాజికి యాపిల్ పండు చూపించి దానికి ఇవ్వకుండా చేతిలోనే ఉంచుకుంటే చిన్నపిల్లలా అది కంటనీరు పెట్టడాన్ని గమనించిండు. అంతే కాకుండా మరీ ఎక్కువ సేపు అలాగే ఉడికిస్తే గోముగా అలిగినట్టు తన నిరసన తెలపడాన్ని కూడా గమనించిండు ఈ ఒక్కటే కాదు పిల్లలను హత్తుకోవడం, వాటి జోలికి ఎవరన్నా వస్తే వారిపైకి దాడికి దిగడానికి ప్రయత్నించడం వంటి ప్రవర్తనను గమనించిండు. సంతోషం, బాధ, కష్టం, కన్నీళ్లు, ఉద్వేగం, ఆవేశం వంటి అన్ని రకాల లక్షణాలను వీటిల్లో గమనించిండు డార్విన్.
స్పాట్
డార్విన్ తన పరిశోధనలను అంతటితో ఆపలేదు తాను చూసిన ప్రతి విషయాన్ని గ్రంధస్తం చేసిండు. మానవ ఉద్యేగాలు, జంతువుల ఉద్వేగాలకు మద్య సారూప్యాలు, వైరుద్యాలను ఇందులో వివరించిండు. ఎక్స్ ప్రేషన్స్ కూడా రికార్డ్ చేసి ఇందులో పొందుపరిచిండు. ఇక్కడ వివిధ రకాల మనుషులను చూపించిండు. ఇందులో ఒకరు కోపంతో, మరొకరు చికాకుతో , ఇంకొకరు ఆశ్చర్యంతో ఉన్న ఇమేజెస్ సేకరించిన్రు.
అంతేకాకుండా మనిషికి, జంతువులకు ఉన్నసారూప్య లక్షణాలకు సంబందించిన ఉద్వేగాలను అధ్యనం చేసి గ్రంధస్తం చేసిండు.
యాంకర్ 3
మనిషికి ఏరకమైన ఉద్వేగాలు, ఆవేశకావేశాలు ఉన్నయో జంతువుల్లోనూ అటువంటి ప్రవర్తన ఉండటం గమనించిండు. దీనికి శరీరకదలికల కన్నా మానసిక ప్రవర్తనే కారణం అని గుర్తించారు మరికొందరు మానసిక శాస్ర్తవేత్తలు. మనిషి హావబావాలకు, మానసిక ప్రవృత్తికి అవినాభావ సంబంధం ఉందన్న విషయాన్ని రుజువు చేయగలిగిన్రు.
స్పాట్
మనిషిలో ఉన్నట్టే తన హావబావాలు, కోరికలు, సహజాతాలు జంతువుల్లో కూడా ఉంటాయన్న నిజాన్ని డార్విన్ రుజువు చేసే ప్రయత్నం చేసిండు. ఈ పరిశోధనల్లోంచే మానవుడు పరిణామ క్రమంలోంచి పుట్టాడన్న విషయాన్ని రుజువు చేసేందుకు ప్రయత్నించిండు డార్విన్ ఆ దశలోనే తన పయనం కొనసాగించిండు.
స్పాట్(ఆకులు రాలే సీన్ దగ్గరి నుంచి పెద్ద బిల్డింగ్ లోకి ఎంటరయ్యే సీన్ వరకు)
ఇక్కడ మనం చూస్తున్న ఈ పెద్ద భవనంఒకప్పుడు మానసిక రోగులను ఉంచే ప్రాంతం. ఈ ఛాంబర్లన్నీ మహిళలను విడివిడిగా ఉంచే గదులు. వీరిని అత్యంత భద్రంగా ఉంచే ప్రాంతం ఇది. ఇందులోంచి తప్పిచ్చుకునే మార్గమే లేదు.
స్పాట్(బిల్డిండ్ అండ్ సీన్స్0
ఈ మానసిక వికలాంగులను ఉద్దరించేందుకు ఇక్కడ ప్రార్ధనా స్థలం వెలిసింది. ఈ స్థలంలో వీరికి కావలసిన ప్రశాంతతను అందించేందుకు తగిన వాతావరణం కల్పించి వీరి మానోవ్యాధులకు కారణాన్ని అన్వేషించే ప్రయత్నం చేసిన్నరు.
స్పాట్
రోమస్ షాకో అనే శరీరధర్మ శాస్ర్తవేత్త సహజ ప్రవర్తనకు అసహజ ప్రవర్తనకు మద్యకారణాలను అన్వేషించడం మొదలు పెట్టిండు. ఆయన పరిశోధనలకు ప్రార్ధనాలయంగా మారిన మనసిక రోగుల ఆసుపత్రి మంచి వనరుగా దొరికింది. అక్కడ దొరికిన వివిధ రకాల పరిశీలనలను బట్టి ఒక అద్భుతమైన గ్రంధాన్నిరాసిండు . ఆ గ్రంధంలో తాను పరిశీలించిన వివిధ రకాల మనోవ్యాధి గ్రస్తుల ఫోటోలతో బాటు వారి హావబావాలను రికార్డ్ చేసిండు. ఒక్కోప్రవర్తనలో మనుషులు ఏవిధంగా ప్రవర్తిస్తారనే విషయాన్ని విపులంగా వివరించిండు. అన్ని మనో వ్యాధులను డాక్టర్ లు అర్ధం చేసుకోగలిగన్రు గానీ ఒక వింతైన మనోవ్యాధిని అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యారు. దాని పేరే హిస్టీరియా.
యాంకర్ 4
హిస్టీరియా..మనం తరచూ వినే మాట. . ఈ వ్యాధి ఉన్న వారు బతికి ఉన్నా దాదాపు స్పృహలేనట్టే..ఎందుకంటే వారేం చేస్తున్నారో వారికి తెలియదు.. వారు ఒక ఊహాజనిత ప్రపంచంలో జీవిస్తారు..ఒక రకంగా మెదడు పూర్తిగా పనిచేయని నిస్పృహ దశ అని చెప్పోచ్చు. వీరి అవయవాల కదలికలు కూడా విచిత్రంగా ఉంటయి. అవయవాల మద్య సమన్వయం చాలా తక్కువ. ఈ వ్యాధిని గుర్తించేందుకు కొన్ని వందల మంది మనో వ్యాధి గ్రస్థుల పై ప్రయోగాలు చేసిన్రు.
స్పాట్
మనిషి మానసిక రోగంతో బాటు, శారీరక ప్రవర్తనలో కూడా మార్పు రావడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. ఈ వ్యాధిని నివారించడానికి గల మార్గాలను అన్వేషించే ప్రయత్నం చేసిండు. వీటిల్లో అత్యుత్మమైన మార్గం ఒకటి హిప్నాటిజం..
స్పాట్( హిప్నాటిజం విజువల్స్)
హిప్నాటిజం అనే ప్రక్రియ ద్వారా మనిషి మానసిక ప్రవృత్తికి, శారీరక సమన్వయానికి ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేసిన్రు. ఇక్కడ ఒక మానసిక శాస్ర్తవేత్త చేసే ప్రయోగం చూడండి. ఈయనను హిప్నాటిజం ద్వారా ఆయన శరీరానికి మెదడుకు ఉన్న సమన్వయాన్ని తప్పించిన్రు. ఆ తరువాత ఆయన సాసర్ పై ఉన్న కప్పును పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సివచ్చింది. ఆఖరుగా చేయిలేపడమే కష్టంగా మారింది. అంటే మానవ ప్రవర్తనకు మెదడు ఇచ్చే ఆదేశాలే కీలకమని తేలింది. మనసంటే మెదడు ఆదేశాలేనని ఆలోచనలకు కేంద్రం మెదడే అన్న విషయం అప్పుడే మానసిక శాస్ర్తవేత్తలు రుజువు చేసిన్రు.
స్పాట్
మానసిక ప్రవర్తనలలో వైరుద్యాలను గురించి మరింత పరిశోధించిన వారిలో ప్రముఖుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ ముఖ్యుడు. ఈయన మానసిక ప్రవర్తనల పై అనేక ప్రయోగాలు చేయడమే కాకుండా వాటిన బృందపరిశీలనలో రుజువు చేసిండు. ఈయన చేసిన ప్రయోగాలలో అత్యధికంగా సబ్ కాన్షియస్ మైండ్ కు సంబంధించినవే. అంటే మనిషి తాను మగతగా ఉన్నపుడు చేసే వివిధ కృత్యాలగురించి ఎక్కువగా పరిశోధనలు నిర్వహించిండు. ఈ సబ్ కాన్షియస్ మైండ్ చేసే పనులు వాస్తవ జీవితంలో గుర్తుకు రావు.అందుకే మానసిక వికలాంగులు పిచ్చివాళ్లుగా మరినపుడు చేసిన పనులేవీ పూర్తిగా కోలుకున్నాక గుర్తురావు. అయితే వారి కలల్లో ఇవి రిపీట్ అయ్యే అవకాశాలున్నప్పటికి వాటిని పీడకలలుగానే గుర్తిస్తరు. ఫ్రాయిడ్ చేసిన ప్రయోగాలు 20శతాబ్దపు సంస్కృతిని కూడా ప్రభావితం చేసినయి. ఈయన ప్రయోగాలు కొన్ని విమర్శలకు కూడా గురయినా మెజారిటీ శాస్ర్తవేత్తలు ఆమోదించిన్రు. ఆ ప్రయోగాలనుంచి పుట్టిందే సైకాలజి అనే శాస్ర్తం.
స్పాట్( గ్రాఫిక్ స్పాట్)(కింది వాయస్ కు ఇదే గ్రాఫిక్స్ విజువల్స్ వాడుకోవాలి)
జంతువుల ప్రవర్తనకు మానవ ప్రవర్తనకు సారూప్య వైరుద్యాలను పరిశీలించిన మానవుడు మనిషి ప్రవర్తనకు మూలాలను అన్వేషించిండు. ఆప్రయత్నంలో అప్రయత్నంగా సైకాలజీ శాస్ర్తానికి పురుడు పోసిండు.
స్పాట్
యాంకర్ 5
సైకాలజి..అంటే..చాలా మందికి తెలయని విషయం..సైకాలజి మనిషి ప్రవర్తన, ఆలోచనా విధానాన్ని పూర్తిగా అధ్యయనం చేయగల శాస్ర్తం. ఈ శాస్ర్తాన్ని అద్యయనం చేసినవారు ఎదుటి వ్యక్తిని ఈజీగా అంచనా వేయగలరు. అంతేకాదు వారితో ఎలా ప్రవర్తించాలో కూడా ముందుగానే ఒక అంచనాకు వస్తరు. ఓకే..19వ శతాబ్దపు చివరి కాలంలో ఖండాంతరాల మధ్య సంబంధాన్ని మెరుగు పరచ గలిగిన్రు. అయితే మనుషిలో ఉన్న కమ్యునికేషన్ వ్యవస్థను మాత్రం చాలా ఆలస్యం గా కనుగొన్నారు.
స్పాట్(ట్రైన్)
19వ శతాబ్దపు చిరి బాగంలో యూరప్ కొత్త రవాణా వ్యవస్థకు పునాదులు వేసింది. ఈ కమ్యునికేషన్ వ్యవస్థతో ఖండాంతరాల నడుమ దూరం దగ్గరయింది. పెద్దపెద్ద పట్టణాలను కలుపుతు రైల్వే లైన్ లను ఏర్పాటు చేసిన్రు. టెలీగ్రాఫ్ తీగలు మనుషుల మద్య సంబంధాలను మరింత మెరుగు పరిచినయి. అంతేకాదు ఖండాంతరాలలో కూడా సమాచారం క్షణంలో చేరుతుంది.
స్పాట్(రైల్బే లైన్ ఫ్లాట్ ఫాం)
ఈ స్పీడ్ యుగం మనిషి ఆలోచనా విధానాన్నిపూర్తిగా మార్చేసింది. ఈ హైటెక్ యుగంతో పోటీపడాలంటే మనిషి తన మేథస్సుకు పదును పెడితే తప్పమనుగడ సాధించలేని అనివార్య పరిస్థతి.
స్పాట్ (పేపర్ పెయింటింగ్,గుట్టలు)
సెంటియాగో రిమో కహాల్... ఒక కళాపిపాసి. ప్రకృతి ప్రేమికుడు.. ప్రకృతి అందాలన్నీ ఒడిసి పట్టుకొని తన కాన్వాస్ పై ముద్రించాలనే సంకల్పం ఉన్నవాడు. సుందర ప్రదేశాలు తిరిగి వాటి అందాలను లాండ్ స్కాప్ లో చిత్రంగా చిత్రించుకునే వాడు. ఒక్కోసారి అన్ని వర్ణాలు తన దగ్గర ఉండేవి కాదు. కొన్నిటిని తానెంత ప్రయత్నించినా సరిగ్గా చిత్రించలేక పోయేవాడు. ప్రకృతి మొత్తాన్ని తన లైబ్రరీలో బందించాలనుకొనే తన కాంక్షకు ఒక మార్గం దొరికింది.. దాని పేరే ఫోటోగ్రఫి.
స్పాట్
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది మొదటి తరం కెమెరా..అంటే అతి ప్రాధమిక మైనదన్నమాట. దీనికి నిర్మాణం పరిశీలిస్తే. వెనుక వైపున రసాయనాలు పూసిన ఫోటోగ్రాఫిక్ ప్లేట్ ఉంచుతరు. ముందు వైపు పుటాకార దర్పణం అమర్చుతరు. ముందుగా ఫోటోగ్రాఫిక్ ప్లేట్ ను వెలుపలికి తీసి ఉంచుతరు. తరువాత లెన్స్ షట్టర్ ఓపెన్ చేసి తిరిగి ఫోటోగ్రాఫిక్ ప్లేట్ కిందికి దించుతరు. ఎస్. ఇప్పుడు ఫోటో తీయడానికి కెమెరా సిద్దమైంది. ఒక క్లిక్ తో ఫోటో రెడీ..
యాంకర్ 6
మనిషి మెదడులో ఏముంది.. కాలికి ముల్లు గుచ్చుకుంటే మెదడు వరకు ఎలా తెలుస్తుంది. గాలిలో ఉన్న వాసనలను ఎలా గుర్తించగలుగుతున్నాం. అందమైన రంగులను ఈ కన్ను ఎలా గుర్తిస్తుంది. మెదడులో చాలా విషయాలే ఉన్నాయని అనిపించింది పరిశోధకులకు. అందుకే మెదడు లో దాగిన మర్మమేంటో తెలుసుకునే ప్రయత్నం చేసిన్రు.
స్పాట్
అవును... ప్రకృతిని తన గుప్పిట్లో ఒడిసి పట్టుకొనే నైపుణ్యం మానవుడికెక్కడిది. కేవలం మేథస్తు మానవ మేథస్సు అంతరిక్షాన్నే తన పిడికిట్లో బందించగలదు. కేవలం మెదడుకి ఇంత శక్తి ఎక్కడిది.. అసలు మెదడులో ఏముంది..చూద్దాం..
స్పాట్
మెదడు ఇది అభివృద్ది చెందిన అన్ని జీవుల్లోనూ ఉంది. ఇక్కడ శాస్ర్తవేత్తలు ప్రాథమిక పరిజ్ఞానం కోసం ఎలుక మెదడు పై ప్రయోగాలు చేస్తున్నరు. ఇక్కడ మెదడును రెండు బాగాలుగా విడగొట్టి దానికి స్టెయిన్స్ అంటే మెదడు కణాలు గ్రహించగల రంగులద్దిన్రు. ఈ రంగులద్దిన మెదడు పూర్తిగా నల్లగా మారింది. దీనికి మళ్లీ ఇతర రసాయనాలు కలిపి సూక్ష్మదర్శినిలో కనపడే విధంగా తయారు చేసుకున్నరు. ఈ బ్రెయిన్ ను మైక్రోస్కోప్ కింద పరిశీలిస్తే ఇదిగో ఇలా కనిపించింది.
స్పాట్( ఎర్రని నాడీకణాలు.)
మెదడులో ఒక అంతర్జాలాన్ని గుర్తించిన్రు పరిశోధకులు. ఇవి ఒకదానికొకటి సంధానించబడి మద్యమద్య బొడిపెల్లాంటి నిర్మాణాలతో పీచుముద్దలాగా కనిపించింది. ఈ బొడిపెల్లాంటి బాగాలే మెదడులో అతి కీలకమైన నిర్మాణాలని గుర్తించిన్రు శాస్ర్తవేత్తలు. వాటికి శాస్ర్తవేత్తలు పెట్టిన పేరు న్యూరాన్..
స్పాట్
ఈ న్యూరాన్ కు చుట్టూ ఉన్న సన్నటి పోగుల్లాంటి వాటిని ఆక్సాన్లు, డెండ్రైట్ లు అంటరు. వాస్తవానికి మెదడులో మనకు కేవలం తెల్లటి పదార్ధం మాత్రమే కనిపిస్తది. స్టెయిన్ చేసినపుడు మాత్రమే ఈ న్యూరాన్ లు కనిపిస్తయి. ఈ న్యూరాన్ లు శరీరం మొత్తం ఆవరించి నాడీ వ్యవస్థను ఏర్పాటు చేస్తయి. ఇవి ఒక దాని నుంచి ఒకదానికి సమాచారం అందించుకొనే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నయి. శరీరంలో ఏ బాగంలో ఏ మార్పు జరిగినా నానోసెకన్లో అది మెదడుకు చేరుతుంది. కహాస్ తన పెయింటింగ్లో బాగంగా ఈ న్యూరాన్ల చిత్రపటాలను కూడా అద్బుతంగా చిత్రించగలిగిండు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వివిధ రకాల చిత్రపటాలన్నీ న్యూరాన్ లవే..
స్పాట్
ఈ న్యూరాన్ లలో వాటి వాటి నిర్మాణాన్ని బట్టి, చేసే పనిని బట్టి వివిధ రకాలుగా వర్గీకరించిండు. ఈ చిన్న న్యూరాన్లే ఈ విశ్వరహాస్యాలను ఒడిసి పట్టగలుగుతున్నయి.
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ విశేషాలు.. వచ్చేవారం మరిన్ని సైన్స్ అప్ డేట్స్ తో మళ్లీ కలుసుకుందాం అంటిల్ దెన్ బై బై..సైనింగ్ ఆఫ్ శోభన్..
బ్రేక్ యాంకర్
దిసైన్స్ అల్టింమేట్ నాలెడ్జ్ లో స్మాల్ బ్రేక్
లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్
వెల్ కం
వెల్ కం బ్యాక్ టు ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి