17, అక్టోబర్ 2011, సోమవారం

అట్లాంటిస్ మహానగరం

మరుగు పడిన మహానగరం.
ఇంట్రో యాంకర్:
ఈ భూగోళం పై మన సకల సౌకర్యాలతో జీవిస్తున్నామని అనుకుంటున్నాము... ఒకప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కాలి నడకే శరణ్యం.. కాస్త సంపన్న వర్గాల కుటుంబాలైతే... రవాణా కొరకు ఎడ్ల బండి, గుర్రాన్ని ఆశ్రయించే వారు.. కానీ ఆధునిక కాలంలో నడిచిపోయేవారే కరువయ్యారు... పేద ధనిక అనే తేడా లేకుండా వాహనాలను వినియోగిస్తున్నారు. ఇదే గొప్ప అని మనం భావిస్తున్నాం.. కానీ ఎటువంటి పర్యావరణ కాలుష్యం లేకుండా అత్యాధునిక వాహనాలు వాడిన శకం ఒకటుంది.. అతి నాజూకైన కళాఖండాలను పోషించిన యుగమొకటుంది.. అతి సుందమైన, అద్భుతమైన కట్టడాలు నిర్మించిన నాగరికత ఒకటుంది.. అదే అట్లాంటిస్.... మనిషి ఎప్పటికప్పుడు తాను అనుభవిస్తున్నదే గొప్ప సౌకర్యవంతమయిన నాగరికత అనుకోవడం పరిపాటి. ఎందుకంటే చంద్రమండలం మీద కూడా కాలుమోపగల సాంకేతిక సామర్ధ్యం నేటి నాగరికత సొంతం కనుక. అలాంటిది... ఇంతకన్న గొప్పనాగరికత ఎక్కడా వుండనే వుండదదు. ఈ భావనలోఉన్నవారికి మతులు పోగొట్టే ఓ గొప్ప సంస్కృతీ సంప్రదాయాలమేళవింపు కొన్ని వేల ఏళ్ళ క్రితమే ఉండేదని తెలిస్తే?! అప్పుడే స్పేస్ షటిల్స్, సబ్ మెరయిన్లున్నాయని చెబితే!? కచ్చితంగా అది షాకింగ్ న్యూసే అవుతుంది. ఇంతకీ ఏమిటది? అదే ఈ రోజు మన స్పెషల్ స్టోరీ అట్లాంటిస్ దీవి..
బ్యాంగ్.... మరుగు పడిన మహానగరం.
యాంకర్ 1
నాగరికతలకే నాగరికత అది. ఎన్నో జీవన చిత్రాలను తీర్చిన అత్యంత పురాతనమైన శైలి అది. ఉన్నట్లుండి ప్రకృతి ప్రకోపానికి బలయిపోవడంతో... ఆ నాగరికత
సముద్రగర్భాన్ని తన శాశ్వత చిరునామా చేసుకుంది. ఆనాటి నుంచీ ఈనాటి వరకూ ఎందరో శాస్త్రజ్ఞులకు పని చెప్పింది... చెబుతూనే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నదంతా ఆనాడే సాధించారని నిరూపించిన గొప్ప సంస్కృతి అది. అదే అట్లాంటిస్ నగర నాగరికత. సుమారు పన్నెండు వేల ఏళ్ళ క్రితమే విరాజిల్లిన ఆ సంస్కృతీ- సంప్రదాయాల విశిష్టతలేంటో... లాస్ట్‌ సిటీ అట్లాంటిస్‌ కాలగర్భంలో కలిసిపోయిన విధానమేంటో తెలుసుకుందాం..
వాయిస్ 1
ఈ భూగోళం ఒకప్పుడు ఇప్పుడున్నట్టు లేదు.. మనం చదువున్నట్టుగా ఖండాలు సముద్రాలన్నీ విడివిడిగా లేవనేది ఖండ చలన సిద్దాంతం చెబుతుంది. ఈ భూమి మొత్తం ఒకే ఖండంగా ఉండేదని... ఏదో ఒక విపత్తు వల్ల భూమి ఖండ ఖండాలుగా విడిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలా విడిపోయిన భూమి ఇప్పటికీ విస్తరిస్తూ ఉందని గణాంకాలతో సహా వివరిస్తున్నారు.. ఈ ఖండ విస్తరణలో నుమరుగయిపోయిన ప్రాంతమే అట్లాంటిస్.. అయితే ఇది ఖండ చలనంలో కనుమరుగయిందా.. లేక.. మరేదైన మాయ జరిగిందా అనే విషయంలో పరిశోధకులకు భిన్నాభిప్రాయాలున్నాయి.
స్మాల్ స్పాట్
వాయిస్
ఇది అందమైన భూగోళం... ఈ భూమి పై రకరకాల జీవ జాతులు వృక్ష జాతులు మనుగడ సాగిస్తున్నాయి.. ఈ భూగోళం పై లక్షల సంవత్సరాలుగా జీవ జాతి మనుగడ సాగిస్తోంది... అయితే ఈ జీవ పరిణామంలో ఎన్నో పరిణామాలు.. ఎన్నో మార్పులు.. ఈ మార్పులు అటు ప్రకృతి పైనా.. ఇటు యావత్ భూగోళం పైనా పడ్డాయి. ఈ పరిణామ క్రమంలో మానవుడిది అత్యంత కీలకమైన పాత్ర. ప్రకృతిలో జీవులందరిలో మనిషి అత్యంత తెలివైన జీవి.. మానవుడు విశ్వాన్ని జయించాలనే కాంక్ష కలిగిన వాడు.. అదిమ కాలంలో కేవలం తన చుట్టూ ఉన్న పరిస్థితులను, ప్రకృతి విలయాలను తట్టుకొని బతకడమే కష్టంగా ఉండేది.. క్రమేపీ ప్రకృతి వనరులను, జీవ జాతులను తన ఆధీనంలోకి తెచ్చుకొని ప్రకృతి మీద పట్టు సాధించాడు. ఆ పట్టుతోనే తన జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. అంతే కాదు ప్రకృతిలో కొన్ని రకాల జీవులను తన పుట్టు బానిసలుగా మార్చుకొని.. అవి పుట్టిందే తనకు సేవ చేయడానికన్నట్టు తయారు చేశాడు.
విజువల్స్
ఈ భూగోళం పై జీవ జాతుల ఆవిర్భావానికి నిర్ధిష్టమైన కారణాలను చెప్పడంలో శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు ఏకాభిప్రాయం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన సిద్ధాంతాలలో పరిణామ సిద్ధాంతం కానివ్వండి... ఉపయుక్త నిరుపయుక్త సిద్ధాంతం కావచ్చు. ప్రకృతి వరణ సిద్ధాంతాలైనా కొంతవరకే ఆమోదం చెందుతాయే తప్ప కొన్ని ప్రశ్నలకు అవి సమాధానం చెప్పలేక పోయాయి.. ఎందుకంటే ఆయా సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చిన కాలాలలో ఉన్న పరిస్థితులను.. అవకాశాలను బట్టి ఆయా సిద్దాంతాలను ప్రతిపాదించారు.. కానీ ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక పాత తరం సిద్ధాంతాలు చాలా వరకు వట్టి ఊహాగానాలుగానే తేట తెల్లమయ్యాయి. అంతేగాదు పరిణామ సిద్ధాంతాన్ని కూడా కొట్టేసిన సందర్భాలున్నాయి. కానీ మానవ పరిణామం ఎలా జరిగింది అనే విషయం పై నిర్దిష్టమైన ఆధారాలతో కూడాని సమాచారమేదీ మన వద్ద లేదు.. ఎందుకంటే వేల సంవత్సరాలకు పూర్వమే మనిషి తన విజ్ఞానాన్ని ఆకాశం అంచులు తాకేలా పెంచుకున్నాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.. దానికి ఉదాహరణే అట్లాంటిస్... అయితే అట్లాంటిస్ నిజమా.. ఒక ఊహాకాల్పనిక గాథా అన్నది.. ఇప్పటికీ సందేహమే..
విజువల్స్ (అట్లాంటిస్)
ఈ భూగోళం పై మానవ నాగరికత ఎప్పుడు మొదలయింది.. మానవులు ఎలా బతికే వారు... మనకంటే ముందు ఐదు తరాల ముందు వాళ్లంతా చీకటి యుగంలో బతికిన వారేనా.. అంటే కొన్ని సంఘటనలు కాదనే సమాధాన మిస్తున్నాయి. ఎందుకంటే గ్రీకు తత్వవేత్తల వాదనలు.. వారి వద్ద నుంచి వెలుగు చూసిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సామాగ్రి కొన్ని వందల సంవత్సరాలకు ముందే మనిషి ఎంతో విజ్ఞానాన్ని సంపాదించాడనే చెప్పవచ్చు. గ్రీకులు ఇటు బాషా పరంగా, జీవన తాత్విక విషయాల పట్ల, యాంత్రిక విషయాల పట్ల, గ్రహగతుల విషయంలోనూ స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. అంటే మనమనుకున్నట్టు మనకంటే ముందు తరాలన్నీ చీకట్లో జీవించాయనే మాట కేవలం ఊహాజనితమే.. అయితే ఇది ఒక్కో ఖండానికి ఒక్కోరకమైన నీతి ఉంది.. భూమి పై మానవనాగరికత గొప్పగా విలసిల్లిన పట్టణాలు కొన్నైతే.. అసలు పూర్తిగా మనిషికి జంతువుకు తేడా ఏంటో తెలియక పశుసమానంగా జీవించిన జాతి కూడా కొన్ని ప్రాంతాల్లో విలసిల్లింది.. దీనికి కారణం ఏంటి.. ఒక ప్రాంతంలో మనిషి అత్యధిక జ్ఞాన సంపన్నుడై విలసిల్లడానికి... మరికొన్ని ప్రాంతాలలో తిమిరంతో సమరం చేస్తూ దినదిన గంఢంగా బ్రతకడంలో వ్యత్యాసం ఎక్కడుంది.. ఇదే నేటి ఆధునిక మానవుడి ముందున్న అతి పెద్ద ప్రశ్న
విజువల్స్
ఈ భూగోళం పై భూమి ఖండ ఖండాలుగా విభజింపబడి ఉంది.. మానవుడు కానీ జంతువులు కానీ పరిణామ క్రమంలో అభివృద్ధి చెంది ఉంటే.. ఒకే జాతి ఒకే రకంగా వివిధ ఖండాలలో ఎలా అభివృద్ది చెందింది.. ఒక ఖండం నుంచి మరో ఖండం దాటాలంటే ఆకాశ మార్గం లేదా సముద్ర మార్గం తప్ప మరో అవకాశం లేని రోజుల్లో ఈ మానవ పరిణామ క్రమం అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఎలా సాధ్యమయింది.. జీవ జాతులు, వృక్ష జాతులు, ఒకేవిధమైన ఆకారాన్ని, లక్షణాలకు వ్యవహార శైలిని కలిగి ఉండటంలో అసలు రహస్యమేంటి... వందల సంవత్సరాలుగా శాస్త్రవేత్తలను వేధిస్తున్న ఈ ప్రశ్నకు సమాధానమే ఖండచలన సిద్ధాంతం.. యస్.. ఖండ చలన సిద్ధాంతంమే ఈ భూమిలో వివిధ ప్రాంతాల మద్య వ్యత్యాసాలకు కారణం. ఖండ చలన సిద్ధాంతమే అభివృద్ధి చెందుతున్న నాగరికత ఆగిపోవడానికి కారణం, ఖండ చలన సిద్ధాంతమే కొత్త జీవ జాతుల ఉద్భవానికి సమాధానము.
విజువల్స్ విత్ మ్యూజిక్
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం... ఈ భూగోళం పై భూమి అంతా ఒకవైపు నీరంతా ఒక వైపు ఉండేదనే భావన ఉంది.. ఈ భూమి పైనే రకరకాల జీవ జాతులు, ఉద్భవించాయి.. అయితే వీటి ఉద్భవానికి నిర్ధిష్టమైన కారణం చెప్పడానికి ప్రామాణిక సిద్ధాంతాలేవీ లేవు. కానీ ఈ భూమి పై సకల జాతులు ఉండేవన్న అభిప్రాయం మాత్రం ఉంది.. సరిగ్గా అప్పుడే మానవ జాతి అభివృద్ది పథంలో పయనించడం మొదలయింది. అంతే కాదు విశ్వమానవుడు కాలుష్య రహితమైన వాహనాలకు కూడా తయారు చేసుకొని వినియోగించడం మొదలు పెట్టాడనే వాదన కూడా ప్రచారంలో ఉంది.
విజువల్స్
ఈ భూమి పై నాగరిక పురుడు పోసుకొని వేగంగా అభివృద్ధి చెందుతున్న కాలంలో అనుకోని ప్రకృతి విపత్తు వచ్చిందని మెజారిటీ పరిశోధకుల అభిప్రాయం.. అంతరిక్షం నుంచి ఒక పెద్ద గ్రహ శకలం వచ్చి భూమిని ఢీ కొన్నపుడు ఈ భూమి ఆకారంలో పూర్తిగా మర్పు వచ్చిందనే అభిప్రాయం ఉంది. అప్పుడే భూమి ఖండ ఖండాలుగా విడిపోయిందని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. భూమి ఖండాలుగా విడిపోవడంతోనే ఆ ఖండంలో ఉన్న జీవులు కూడా వేరయ్యాయి. అంటే భూమి ముక్కలు ముక్కలుగా విడిపోయినపుడు ఆ భూబాగంలో మిగిలిన జంతు, వృక్ష జాతులు అలానే ఉండి కొత్త వాతా వరణంలో అభివృద్ధి చెందసాగాయి.. ఈ హఠాత్పరిణామంలో కొన్ని జాతులు పూర్తిగా నాశనమై పోయాయి. కొన్ని జాతులు కొత్త వాతావరణంలో మనుగడ సాగించలేక అంతరించి పోయాయి..
యాంకర్ పార్ట్
ఈ ఖండ చలన సిద్ధాంతం కంటే ముందున్న నాగరికత గల ప్రాంతమే అట్లాంటిస్.. అయితే కొంత మంది పరిశోధకులు ఈ వాదనతో ఏకీభవిండం లేదు.. మద్య అమెరికా ప్రాంతంలో అభివృద్ది చెంది ప్రకృతి ఉత్పాతాల వల్ల కనురుగైన ప్రాంతమే అట్లాంటిస్ అని మరికొందరి అభిప్రాయం.. ఎవరెవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా అట్లాంటిస్ గురించి మొట్ట మొదట ప్రస్తావించింది మాత్రం ప్లేటో... ప్లేటో తన రచనల్లో ఎన్నో విషయాలు వెల్లడించాడు. అయితే ఈ విషయాలన్నీ ప్లేటో కి ఎలా తెలుసు. ప్లేటో కేవలం ఒక గ్రీకు తత్వవేత్త.. అట్లాంటిస్ అనేది ఒక ఊహాకల్పిత నగరం.. ఇది జరిగి సుమారు 12000 సంవత్సరాలని అంచనా.. మరి ప్లేటో కు అట్లాంటిస్ గురించి ఎలా తెలుసు... ఇది నిజంగా నిజమేనా..
విజువల్స్
అవును అట్లాంటిస్ అనేది నిజంగా నాగరికత వర్ధిల్లిన నగరమా లేక ఊహాజనిత పట్టణమా అన్నది నేటికీ మిస్టరీగానే మిగిలింది. ఎందుకంటే అట్లాంటిస్ ను ప్రత్యక్షంగా చూసిన వాళ్లెవరూ లేరు. మరి ప్లేటోకు అట్లాంటిస్ ఆలోచన ఎలా వచ్చింది.. ప్లేటో చెప్పిన అట్లాంటిస్ ఎలా ఉండేదో.. ఆ నగరం ఎలా వినాశనమయిందో చూద్దాం...
విజువల్స్
ప్లేటో ఆలోచనల ప్రకారం అట్లాంటిస్ ఒక అద్భుత నగరం.. ఒక్కముక్కలో చెప్పాలంటే భూలోక స్వర్గం... ఆ స్వర్గతుల్య పట్టణంలో ఎటు చూసినా అందాలే.. మగువలు వంపుసొంపుల వయ్యారాలతో అప్సరసలను మించిన అందాన్ని కలిగి ఉండేవారు... మగవారు దేహదారుడ్యాన్ని కలిగి కండపుష్టితో నిగనిగలాడుతూ మంచి తేజస్సు కలిగినవారై ఉండేవారు.. అట్లాంటిస్ ఎటు చూసినా అందమైన ప్రాంతం.. లోయలు.. పర్వతాలు.. జల వనరులు... పూదొటలు.. జంతువిహార స్థలాలు.. పండ్ల తోటలు.. సెలయేళ్లు,, ఈ ప్రాంతాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు.. ఉదయ సంధ్యలలో అదో ఉత్సాహ భరిత వాతావరణం అలుముకున్న అందమైన ప్రాంతం... ఈ ప్రాంతానికి ఎప్పుడూ చుట్టూ ఉన్న రాజ్యాల నుంచి శత్రువుల బెడద ఉండేది.. సంపన్న నగరంగా విలసిల్లే ఈ సామ్యాజ్యం పై నిత్యం శివారు రాజ్యాలు దండయాత్రలు చేసేవి.. అలా చేసిన దండయాత్రల్లో కొన్ని సార్లు అట్లాంటిస్ విజయాలను మూటగట్టుకుంటే.. మరికొన్ని సార్లు పరాజయం పాలయ్యేది. ఈ రకంగా ఎన్నో దండయాత్రలు చేసి శత్రురాజులు రాజ్యాన్ని కొల్ల గొట్టడం వల్ల పూర్తిగా దుర్భర స్థితికి చేరుకుందనే కథనం ఉంది.. దీంతో బాటు ఈ నగరం పూర్తిగా అదృశ్యమయి పోవడానికి కూడా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఆకాశం నుంచి ఒక గ్రహశకలం నేలను తాకినపుడు భూమి పై కొంతకాలం అగ్నిగోళంగా మారిందని... నేలంతా దట్టమైన పొగవ్యాప్తి చెంది కనీసం సూర్యకిరణాలు సోకడమే కష్టమై పోయింది.. ఇలా సుమారు రెండు సంవత్సరాల తరువాత నెమ్మదిగా పొగ తగ్గిపోయింది.. ఈ రెండు సంవత్సరాల్లో భూమిపై చాలా జాతులు అంతరించిపోయాయి.
విజువల్స్
మరో కథనం ప్రకారం ప్రశాంతం గా ఉన్నా అట్లాంటిస్ నగరం పై అగ్ని పర్వతాలు దాడి చేశాయి.. చుట్టూ ఉన్న పర్వతాల నుంచి పొగలు కక్కుతూ.. నిప్పులు చిమ్ముతూ ఒక్కసారిగా లావా ద్రవం వీదుల వెంబడి ప్రవహించింది.. ఎక్కడ చూసినా హాహాకారాలు.. దీంతో అట్టాంటిస్ మొత్తం నాశనం అయిందని... ఆ తరువాత వచ్చిన ప్రకృతి విపత్తులు, సునామీల వలన అది సముద్ర గర్భంలో తలదాచుకుందని పరిశోధకులు బుతున్నారు.
స్పాట్............................
వాయిస్ 1 కంటిన్యూ:
ఇతోపియన్ భూతల స్వర్గమది. అప్పటి కాలానికి అదే అత్యంత అభివృద్ధి చెందిన సమాజం. ఓ రాత్రి ఉదృతంగా ఎగిసిపడిన అట్లాంటిక్ సముద్రం కెరటాల తాకిడికి
అట్లాంటిస్ అల్లకల్లోలమై అదృశ్యమయింది. అట్లాంటిస్ ప్రపంచపు మొట్టమొదటి నవనాగరికతను లోకానికి చాటిన మహానగరం. అంతేకాదు అత్యంత శక్తివంతమయిన
సంపన్న సామ్రాజ్యం. విచిత్రమేంటంటే ఆ కాలంలోనే అట్లాంటిస్ సంస్కృతిలో భాగంగా... ఆకాశయానాలుండేవి. సముద్రగర్భంలో విహారాలుండేవి. అంటే మనం
ఇప్పుడు చెప్పుకునే స్పేస్ షటిల్స్, సబ్ మెరైన్లు అప్పుడే వుండేవన్నమాట! అలాంటి అరుదైన నగరం మొత్తం ఒకానొక ప్రకృతి ప్రకోపానికి బలై భూమి మీదనుంచి
మటుమాయమైపోయింది. అట్లాంటిక్ మహా సముద్రంలోకి వెళ్లిపోయిన ఈ నగరం పన్నెండు వందల ఏళ్ళక్రితం ప్రపంచానికి దూరమయిపోయింది. అది కూడా కేవలం ఒక
రాత్రి ఒక పగలు మధ్య కాలంలో... ఈ దుర్ఘటన సంభవించింది.
స్పాట్.......................
వాయిస్ కంటిన్యూ:
"అట్లాంటిస్ కింగ్‌డమ్‌'' ఇప్పటికీ పురావస్తు విభాగంలో అత్యంత అరుదైన రహస్యంగా నిలుస్తోంది. అట్లాంటిస్ నగరం ఐర్లండ్, ఏజోర్ దీవులు,
అంటార్కిటికాలను సరిహద్దులుగా చేసుకుని వుండేదని చరిత్రకారుల భావన. శాస్త్రజ్ఞుల అంచనాల మేరకు ఇది నిజంగా ఓ అద్భుతం. కాల్పనిక గాధను మరిపించే సుందరనగరం... గ్రేట్ సిటీ ఆఫ్ ట్రాయ్ లాగా ఇది కూడా ఒకానొక గొప్ప నగరంగా భావించవచ్చన్నది సైంటిస్టుల నమ్మకం. 19వ శతాబ్దిలో పురావస్తు శాస్త్రజ్ఞులు ఈ నగర ఆనవాళ్ళను అణువణువు పరిశీలించారు. దీనికీ గ్రీకు నాగరికతకీ పోలికలున్నాయా అన్న కోణంలో పోల్చిచూసారు. ప్రస్తుతం
సాగరగర్భంలో తలదాచుకుని వున్న అట్లాంటిస్ నగరం తాలూకు అనేక విషయాలు ఇంకా ప్రపంచం ముందుకు రావాల్సి వుంది.
యాంకర్ పార్ట్
ఆర్కే నారాయణ్ సృష్టించిన మాల్గుడి గ్రామంలాగా... అట్లాంటిస్ నగరం... ప్లేటో సృజనాత్మకతకు దర్పణం పడుతుందా? అసలు "కలదు... కలదన్న...''
అట్లాంటిస్ నగరం వుందా లేదా?! మనవాళ్ళు చిత్రాలు గీసి వూహిస్తూ.. వూరిస్తూ... చెప్పుకొస్తున్న ఆనవాళ్ళు సహజసిద్ధమయినవా? లేక... మనిషి "అతి
వూహాత్మకత''కు నిదర్శనమా? శాస్త్రజ్ఞుల మెదళ్ళకు వేడి పుట్టించే ప్రశ్నలివి... ఇంతకీ ఈ మిస్టరీ ఛేదనలో నయా సైంటిస్టులు చెప్పుకొస్తున్న
నిజాలేమిటి? బెర్ముడా ట్రయాంగిల్ తో ఈ నగరానికి వున్న సంబంధమేంటి?
వాయిస్
ఆకాశంలో ఎగిరే విమానాలు, సముద్రంలో పయనించే పెద్ద పెద్ద నావలూ ఉన్నట్లుండి బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరకు వచ్చేసరికి సముద్రంలో
కలిసిపోయేవి. ఏమిటీ మాయ?! అని ఎన్నో వూహాగానాలు చెలరేగాయి. అందులో ఒకటి బిమినీ రోడ్. ఇది అట్లాంటిస్ నగరంలోని ఒకానొక రహదారి... అది బెర్ముడా
ట్రయాంగిల్ కి దగ్గరలో ఉండటం వల్ల ఈ పరిణామాలు సంభిస్తున్నాయన్న కథనం ప్రచారంలో ఉంది. అట్లాంటిస్ నగరానికి.... దాని అవశేషాలకూ ప్రపంచ చరిత్రలో
అంతటి శక్తి వుంది మరి!
స్పాట్.....................
వాయిస్ కంటిన్యూ:
ఇంతకీ- బిమినీ రోడ్ మానవ నిర్మితమా? లేక సహజసిద్ధంగా ఏర్పడిన శిలాజాలమా? దాన్నే మనవాళ్ళు అతిగా వూహించుకుని లేని అట్లాంటిస్ నగరమాయను ఉందని
వూహిస్తున్నారా?! అనే కోణంలో ఆలోచించి... పరిశోధకులు కాళ్ళకు, చేపతోకల తొడుగులు తొడుక్కుని మరీ రంగంలోకి దిగారు. సముద్రగర్భం నుంచి కొన్ని
శిలలను తీసుకువచ్చి ప్రయోగశాలలో పరిశోధనకు ఉపక్రమించారు. రేడియోకార్బన్ డేటింగ్ ద్వారా ఈ శిలల నిజచిత్రాన్ని నిర్దారించడానికి ప్రయత్నాలు
చేశారు.
స్పాట్.........................
వాయిస్ 2 కంటిన్యూ:
నాడు... ప్లేటో వుందని చెప్పిన అట్లాంటిస్ ను 1920లలో కరేబియన్ సముద్రగర్భంలో కనుగొన్నారు. తరువాత 1969వ సంవత్సరంలో... నీలి సముద్రజలాల
కింద, బిమిని దీవుల సమీపంలో... ఒక రహదారి నిర్మాణాన్ని కనుగొన్నారు. మియామీ తూర్పు తీరానికి 58 మైళ్ళ దూరంలో ఈ రహదారి వుండేదని అంటోంది
శాస్త్రలోకం. ఇదే అట్లాంటిస్ నగరంలోని బిమినీ రోడ్డుగా చెబుతున్నారు వీరు. ఇది ఒక హర్బరును ఆనుకుని వుండే రహదారిగా చెప్పవచ్చని కూడా
పరిశీలకుల అంచనా. 1600అడుగుల పొడవుతో... జె ఆకారంలో ఈ రోడ్డు వుండటాన్నినిపుణులు గమనించారు. అప్పటికే అత్యంత అధునాతన వసతులతో కూడిన హర్బరు
వుండేదని చెప్పడానికి ఇదే ఉదాహరణగా చెప్పవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీన్నిబట్టీ... అట్లాంటిస్ సామ్రాజ్యానికి...
అపారమయిన నావికాబలం ఉండేదని తెలుస్తోంది. హర్బర్ని కలుపుకుంటూ నిర్మితమయిన బిమినీ రోడ్డును... రెక్టాంగిల్ ఆకారంలోని రాళ్ళను పొదిగిన
మానవ నిర్మిత రహదారిగా అంచనా వేస్తున్నారు. కానీ ఇదంతా కట్టుకథగా కొట్టిపారేసే వారు కూడా లేక పోలేదు. ఇది సహజసిద్ధంగా ఏర్పడిన శిలల సమాహారంగా
చెపుతున్నారు కొందరు విశ్లేషకులు. కానీ కొన్ని స్పష్టమయిన ఆకారాలలో చెక్కినట్టుండే రాళ్ళను వాడటం బట్టీ ఇది మానవ నిర్మితంగానే
భావించవచ్చన్నది పరిశీలకుల వాదన. అనేక లేయర్లతో రొడ్డు నిర్మాణం జరుగుతుందనీ.. అది బిమినీ రోడ్డు విషయంలో కనిపిస్తుందంటారు పరిశోధకులు. ఈ
రాళ్లను చూస్తే... మనుషులు చేతితో చెక్కిన పనితనం కొట్టకొచ్చినట్టు... కనిపిస్తుందని అంటారు వీళ్ళు.
స్పాట్.........................
యాంకర్ పార్ట్
అట్లాంటిస్ గురించి చెప్పే ముందు దాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన తత్త్వవేత్త ప్లేటో గురించి తెలుసుకోవాలి. ఆయన రాసిన రచనలల్లో 'ది
రిపబ్లిక్' అనేది ప్రపంచ మానవాళికి గొప్ప మేలు చేసిందనే చెప్పాలి. రాజ్యం ఎలా వుండాలి? అని ప్లేటో ఈ పుస్తకంలో చక్కగా వివరించారు. అలాగే 'భూతల
స్వర్గము' ఇతోపియా అనేది ఆయన తీపికల. అంటే దీనర్ధం ఏమిటీ?! ప్లేటోకి వూహాజనిత శక్తి ఎక్కువని చెప్పాలి. ఏమీ లేకున్నా అది ఉంటే ఇలా వుండాలని
రచనలు చేసేవారాయన. అలాగే తన 'డైలాగ్' అనే రచనలో అట్లాంటిస్ ప్రస్తావన చేసారు ప్లేటో. అది ఎలా ఈ భూమినుంచి దూరమయిందో కూడా ఆయన తన రచనలో
పేర్కొన్నారు. ఆయనే కాకుండా ఇతర రచయితలు, ప్రముఖులు అట్లాంటిస్‌ గురించి ఏమన్నారో వివరించి, వర్ణించారో... ఇప్పుడు చూద్దాం.
వాయిస్
క్రీస్తు పూర్వం 350వ సంవత్సరం... ప్లేటో మొదటిసారిగా తన రచనల్లో అట్లాంటిస్ నగర ప్రస్తావన చేశారు. సరిగ్గా అప్పటికి 9వేల ఏళ్ళ క్రితం
అట్లాంటిస్ అనే నగరం ఉండేదని... రాశారాయన. కానీ ప్లేటో ఉద్ధేశపూర్వకంగా చేశారో... లేక కాల్పనికం కనుక అలాగే వుంటుందనుకున్నారో తెలియదు గానీ,
అట్లాంటిస్ ఎక్కడ వుండేదని మాత్రం పూర్తిగా వివరించలేకపోయారు. అయితే ఆయన రాసిన దాని ప్రకారం- "అట్లాంటిస్''- హెర్క్యులస్ స్థంభాల వెనుక భాగంలో
వుండేదని వర్ణించారు. ఈ వర్ణన వలన స్పెయిన్, మొరాకో భూభాగాలు... అట్లాంటిక్, మెడిటెరేనియన్ సముద్రాల మధ్య అట్లాంటిస్ ఉండేదని అంచనాకు
వచ్చారు పరిశోధకులు. పదహారు వందల శతాబ్దిలో కొందరు రచయితలు... అట్లాంటిస్ అమెరికాలో ఉండేదని సూచించారు. దీన్నే ఉతోపియా అని తెలియచేశారు. అదే
పందొమ్మిదో శతాబ్దికి వచ్చేసరికి... పరిశోధకులు అట్లాంటిస్ దక్షిణ అమెరికాకు చెందినదని వివరించారు. ఈ పురాతన సంస్కృతి మయన్ నాగరికతకు
చెందిందని అభివర్ణించారు. 1882లో అట్లాంటిస్ మీద మరో రచయిత రాసిన పుస్తకం వెలుగులోకి వచ్చింది. ప్రపంచప్రఖ్యాత నాగరికతలన్నిటికీ అట్లాంటిస్
నాగరికత మాతృకగా ఈ పుస్తకంలో పేర్కొన్నారా రచయిత.
స్పాట్......................
వాయిస్ కంటిన్యూ:
అది 1940వ సంవత్సరం... వర్జీనియా బీచ్... అద్భుత ఊహాజనిత శక్తులు గల వ్యక్తిగా పేరున్న ... జేసి ఆశ్చర్యకరంగా అట్లాంటిస్ ప్రస్తావన చేశారు.
సరైన స్థలకాలాలను ఆయన తన వాక్కుల ద్వారా తెలియచేసారు. ఫలానా సమయంలో ఫలానా చోట అట్లాంటిస్ నగరం వెలుగు చూస్తుందని జేసి అనూహ్యంగా తెలిపారు. సరిగ్గా
ఆయన చెప్పినట్టు... 1968లో "ది బహ్మాస్'' అనే ప్రదేశంలో... బయాలజిస్ట్ జేమ్స్ వాలెంటైన్స్... ఒక అద్భుతాన్ని కనుగొన్నారు. అదే బిమినీ రోడ్.
చాలా మంది అంటున్నట్లుగా... అట్లాంటిస్ అనేది కేవలం వూహ కాదని, నిజంగానేఉందనీ- దీన్ని బట్టీ తేలింది. ఈ వార్త అప్పట్లో సహజంగానే పెను సంచలనాలకు
కేంద్రమయింది.
స్పాట్..........................
వాయిస్ కంటిన్యూ:
కొందరి శాస్త్రవేత్తల వాదనల ప్రకారం అట్లాంటిస్ "ఒక నిజ నాగరికత'' ఆధారంగా తయారు చేయబడిన సృజనగా చెబుతారు. వాస్తవానికి అట్లాంటిస్ ను
సృష్టించిన ప్లేటో... తిరుగులేని ప్రపంచ ప్రఖ్యాత రచయిత. ఆయన అభివర్ణించిన దాని ప్రకారం... ప్రపంచాన్ని అట్టుడికిస్తున్న ఈ
అంతుచిక్కని ప్రదేశం... హెర్క్యులస్ స్థంభాల వెనుక భాగంలో ఉందని నమ్మకం. అదే ఈ చోటు. ఈ దీవి మెడిటెరేనియన్ సముద్రంలోని సెంటరీనీ, క్రేట్ అనే
దీవులకు 70మైళ్ళ దూరంలో ఉందని అంచనా. 1930ల్లో బయటపడిన కొన్ని "మినోనియన్స్'' అనే పురావస్తు అవశేషాలు ప్లేటో వర్ణించిన అట్లాంటిస్ కి
దగ్గరలో ఉంటాయి కూడా.
స్పాట్..................
యాంకర్ పార్ట్
నీటిలోంచి మొలిచినట్టుండే పుష్పాల్లాంటి భవంతులు. వాటిలో ఎన్నో వింతలూ, విశేషాలు. అంతటి జలమయమైన వాతావరణంలోనూ ఎంతో చాకచక్యంగా నిర్మించబడిన తాగు
నీటి వ్యవస్థ, మురుగుకాలువ వ్యవస్థలు... ఈ భవన నిర్మాణాల్లో దర్శనమిస్తాయి. అట్లాంటిస్ చూడటానికి ఎంతో వింతగా, విచిత్రంగా వుంటుంది.
వృత్తాకారంలో వుండే ఈ భూమిని నీరు వేరు చేస్తుంది. "వూహా..'', "నిజమా..'' అన్నది పక్కన పెడితే... ఇంతటి సుందరనగరాన్ని ఆ సముద్రుడెలా మింగేసాడో
అనిపించక మానదు.
వాయిస్ 4
మనిషి ఊహాజనిత వర్ణన ప్రకారం... అట్లాంటిస్ నగరం ఇలా ఉండేది. పూర్తిగా నీటితో అవినాభావ సంబంధమున్న జీవనవిధానం వల్ల నావికా వ్యవస్థ కూడా అధునాతన
పోకడలతో విరాజిల్లిందని తెలుస్తోంది. కానీ ఒకానొక పెను ప్రమాదకరమయిన సముద్రపు కెరటం... అట్లాంటిస్ నగరం మొత్తాన్ని తన దాడితో
ముట్టడించేసింది... ఇంతటి ఆదర్శవంతమయిన అట్లాంటిస్ సమాజం నీటమునిగి పోవడానికి అసలయిన కారణాలేమయి వుండొచ్చు??? అని ప్రశ్నించుకున్న
శాస్త్రవేత్తలు అందుకు తగిన కారణాలెన్నో కనుగొనే ప్రయత్నం చేసారు. ఒకవేళఅట్లాంటిస్ ఉన్నది నిజమే అయితే... అది ప్రకృతి వైపరీత్యానికి లోనై నాశనమై
పోయుంటుందని భావిస్తున్నారు.
స్పాట్.......................
వాయిస్ కంటిన్యూ:
ఒకానొక వూహ ప్రకారం... సెంటరీనీ దీవిలో ఒక ప్రమాదకరమయిన అగ్నిపర్వతం ఉంది. సరిగ్గా క్రీస్తుపూర్వం పదహారువందల కాలంలో... ఈ అగ్నిపర్వతం భళ్ళున
పేలింది. ఇది ప్రపంచంలోని పది అత్యంత ప్రమాదకరమయిన అగ్ని పర్వతాలలో ఒకటి. ఈ పర్వతం పేలుడు ఎంతటి తీవ్రతరమైనదంటే... 50వేల హిరోషిమా బాంబులతో
సమానమైంది. అందులోంచి వచ్చిన రాళ్ళు, బూడిదలు సుమారు ఒక ట్రిలియన్ టన్నుల పైన వుంటుందని అంచానా వేస్తున్నారు. అగ్నిపర్వతం నుంచి విడుదలయిన రాళ్ళు
పడి... సముద్రం అతలాకుతలం అయిపోయింది. దీంతో సుమారు 650 అడుగుల ఎత్తయిన కెరటం ఒకటి ఎగసి పడినట్టుగా అంచనా. అందుకు నఖలు తయారు చేసి చూడగా దాని
ప్రభావం ఇలా ఉంది. మీరే గమనించండి!
స్పాట్........................................
వాయిస్ 4 కంటిన్యూ:
దీన్నే సునామీ అని కూడా అంటారు. అదే అట్లాంటిస్ కొంప ముంచేసిందని ఒక వూహ. ఇలాంటిదే 2004లో ఇండోనేసియాను నిట్టనిలువునా నీటముంచేసింది. సుమారు
రెండువేలమంది ప్రాణాలు నీళ్ళలో కలిసాయీ దుర్ఘటనలో... అట్లాంటిస్ ను నిలువునా ముంచేసిన సునామీ ఇందుకు నాలుగు రెట్ల పెద్దదై ఉండవచ్చని
శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.
స్పాట్..................
వాయిస్ కంటిన్యూ:
సముద్రపు అట్టడుగు భాగంలో దాగి వున్న అంతుచిక్కని రహస్యాన్ని చేధించేందుకు పరిశీలకులు తమ పయనాన్ని సముద్రగర్భంలోకి మళ్ళించారు.
అణువణువు శోధించి అట్లాంటిస్ ఆనవాళ్ళను సాధించడానికి తీవ్రప్రయత్నాలు చేశారు. వారికి సముద్రపు అడుగుభాగంలో కొన్ని రాళ్ళు దొరికాయి. ఇవే బిమినీ
రోడ్డుకు సంబంధించిన రాళ్ళనీ... ఇవి ఎవరో చెక్కినట్టుగా ఉన్నాయని.... అంటే దీనర్ధం ఈ రాళ్ళు మానవనిర్మితాలే కావొచ్చనీ శాస్త్రవేత్తల బృందం
అంటోంది. వాటిని కార్బన్ డేటింగ్ లాబ్ కి అప్పగించారు. మొత్తంగా శాస్త్రజ్ఞులు ఈ రాళ్ళు అట్లాంటిస్ కి చెందిన బిమినీ రోడ్డుకు సంబంధించినవేనని స్పష్టంగా చెప్తున్నారు.
స్పాట్...................
యాంకర్
అట్లాంటిస్ నగరం అదృశ్యం అవడానికి ఏయే కారణాలు ప్రభావం చూపాయి?? భూమి, ఆకాశాలలో ఎక్కడ దాక్కుని వుందా మర్మం? భూకంప ప్రళయమా... లేక కేవలం
అగ్నిపర్వత విస్పోటనమా... గ్రహశకల విన్యాసమా??? ఏ కారణం చేత ఆనాటి ఆదర్శసమాజమైన అట్లాంటిస్... సముద్రపు అట్టడుగు భాగానికి చేరిపోయిందో
తెలుసుకోడానికి శాస్త్రవేత్తల బృందం తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు సాగించింది.
వాయిస్
శాస్త్రవేత్తల బృందం తమ తదుపరి పరిశోధన కోసం రెక్టాంగిల్ వున్న ప్రాంతానికి వెళ్ళింది. ఇక్కడ దొరికే ఆధారాలు కచ్చితంగా పురాతన నాగరికతను
ప్రపంచానికి పరిచయం చేసేవేనని నమ్ముతూ వారు తమ పరిశోధన తిరిగి మొదలుపెట్టారు. అక్కడ దొరికిన నమూనాలు క్రీస్తుపూర్వం పదివేల
సంవత్సరానివని సైంటిస్టులు అంటున్నారు. ప్లేటో కూడా అట్లాంటిస్ గురించి చెబుతూ.... శాస్త్రవేత్తలు చెబుతున్న కాలాన్నే సూచించడం గమనించదగిన
విషయం.
స్పాట్...............................................................
వాయిస్ కంటిన్యూ:
అట్లాంటిస్ వుందని చెబుతున్న కాలంలో... సముద్రమట్టం ఎంత ఉండేదని పరిశీలన జరపగా... సుమారు వంద అడుగులు తక్కువ వుందని తేలింది. సముద్రపు
అడుగుభాగంలోకి వెళ్ళిపోయిన రెక్టాంగిల్స్ పది నుంచి పదిహేను అడుగుల ఎత్తులో ఉండేవి. అంటే దీనర్ధం ఏమిటి? అసలే సముద్ర మధ్యంలో అందంగా
నిర్మించిన సుందర నగరం అట్లాంటిస్... వంద అడుగుల మేరా సముద్రమట్టం పెరగడమంటే... దాదాపు ఆ నగరాన్ని సముద్రం మింగేయడానికి తగిన అవకాశం
దొరికినట్టే.
స్పాట్............................................................
వాయిస్ కంటిన్యూ:
అట్లాంటిస్ నగరం నీటమునిగిపోడానికి కారణాలను ఒకసారి పరిశీలిస్తే... మరికొన్ని విషయాలు స్పష్టం అవుతాయి. అట్లాంటిస్ మాయమవడానికి కారణాల్లో
మొదటిది... సునామీ రావడం. సునామీ అంటే ఉన్నట్లుండి సముద్రకెరటాలు ఒక్కసారిగా ఎగిరెగిరి పడటం. అందుకు కారణం భూకంపం. సముద్రగర్భంలో ఉండే
అగ్నిపర్వతాలు బద్దలు కావడం వల్ల కూడా సునామీ వస్తుంది. అలాగే... ఆకాశం నుంచి గ్రహశకలం దూసుకురావడం వల్ల కూడా అట్లాంటిస్ సముద్రగర్భానికి
చేరిందనే వాదనలున్నాయి. ఎప్పుడయితే ఆకాశం నుంచి గ్రహశకలం నేరుగా అట్లాంటిక్ సముద్రం మీదకు దూసుకురావడంతో... ఆ తాకిడికి సముద్రం
ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో కెరటాలు ఆకాశమంత ఎత్తుకు ఎగిరిపడ్డాయి. ఇలాంటి ఘటనే అట్లాంటిస్ సముద్రం పాలు కావడాని కారణం కావచ్చని
శాస్త్రవేత్తల అంచనా. అట్లాంటిస్ వాసులకు అసలు ఏం జరుగుతుందో తెలిసే లోపలేమొత్తం అగమ్యగోచరం అయిపోయింది. వేలకొద్దీ ప్రాణాలు అనంతజలాల్లో
కలిసిపోయాయి. సెంటరీనీ దీవిలోని అగ్నిపర్వతం పేలి భారీగా రాళ్ళు ఎగిసిపడటం వల్ల కూడా సముద్రమట్టం పెరిగి అట్లాంటిస్ సాగరగర్భంలోకి
చేరివుండవచ్చని మరో వాదన కూడా వుంది. ఈ అగ్నిపర్వతం నుంచి వచ్చిన రాళ్ళు సుమారు 175 మైళ్ళ వేగంతో సముద్రపు నీటిని ముందుకు నెట్టినట్టుగా
భావిస్తున్నారు. దీంతో ఒక్కో కెరటం మూడవందల మైళ్ళ వేగంతో ఎగిసి పడి, అది అట్లాంటిస్ మీద విరుచుకుపడినట్టుగా పరిశీలకులు అంచానా వేస్తున్నారు.
స్పాట్........
కంక్లూడింగ్ యాంకర్:
పరిశీలకులు సేకరించిన బిమినీ రోడ్డు, రెక్టాంగిల్ ప్రదేశాల్లో దొరికిన రాళ్ళు క్రీస్తుశకం పదివేల ఏళ్ళకాలం నాటివిగా తేలాయి. ఇటీవల కొందరు
సైంటిస్టులు అట్లాంటిస్ నగరం ఈజిప్టు పిరమిడ్లకన్నా పురాతనమయినవని కనుగొన్నారు. కరేబియన్ సముద్రగర్భంలో అట్లాంటిస్ నగర ఆనవాళ్ళను తాము
కనుగొన్నట్టుగా వారు ప్రపంచానికి తెలియచేశారు. ఇంకా స్పష్టంగా అట్లాంటిస్ నగరం ఎక్కడుందో తెలుసుకోడానికి తగిన నిధులు సేకరించాలని
ప్రయత్నిస్తున్నారు శాస్త్రవేత్తలు.! అన్నిటికన్నా తమ నాగరికతే పురాతనమయినదని తెలియచెప్పేందుకే. అందుకు పాశ్చాత్య దేశాలవారు శాయశక్తులా కృషి చేస్తూనే ఉన్నారు. మన ద్వారకా నగరం కూడా అరేబియా సముద్రంలో దాగి వుందని విశ్లేషకుల అంచనా. అందుకు తగిన
ఆధారాలు కూడా పదిలంగానే వున్నాయి. కానీ మన నాగరికతను ప్రాచీనమయినదనీ, దివ్యమయినదనీ తెలియచేయడానికి మనవాళ్లెవరూ ఇంత ఆసక్తిగా ముందుకురావడం
లేదు. ఎన్నో విషయాల్లా ఇది కూడా ఆ పాశ్చాత్యులే కంకణం కట్టుకుంటే తప్ప శ్రీకృష్ణసామ్రాజ్యానికి మోక్షం కలగక పోవచ్చు.