16, అక్టోబర్ 2010, శనివారం

ది సైన్సు ఎపిసోడే ౧౫

ఎ. జనార్ధన్
ఇంట్రో యాంకర్
ఈ సృష్టిలో మానవ జాతి ఆవిర్భావం ఓ చిక్కు ప్రశ్న. ఎప్పటికీ ఛేదించలేని ఫజిల్. కానీ మానవ జాతి ఈ భూమి పైకి ఎలా వచ్చిందనే విషయాన్ని తెలుసుకునేందుకు గ్రీకుల కాలం నుంచి నేటి వరకు ప్రయత్నిస్తూనే ఉన్నరు. ఇప్పుడిప్పుడే మానవ జాతి మూలాలు బయటపడుతున్నయి.
బ్యాంగ్
యాంకర్ 1
ఈ మనవ జాతిని దేవుడు సృష్టించిండా..లేదా పరిణామ సిద్దాంతం ప్రకారం జంతువుల నుంచి అభివృద్ది చెందిండా..ఇంత సైన్స్ అభివృద్ది చెందినా ఖచ్ఛితంగా మానవ జాతి పుట్టుకకు ఇదీ కారణం అని చెప్పే ఆనవాలు ఏదీ లేదు. ఇంతకీ ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పటి నుంచి వెదకడం మొదలు పెట్టారో తెలసుకుంటే ఎంత ప్రగతి సాధించామో అర్ధమవుతది.
స్పాట్
ఈ ప్రకృతిలో మనిషి పాత్ర ఎంత...అసలు ఈ భూమి పైకి మానవుడు ఎలా వచ్చిండు. కొందరు తత్వవేత్తలు చెబుతున్నట్టు మనిషిని ఒక శక్తి సృష్టించిందా...లేక శాస్ర్తవేత్తలు చెబుతున్నట్టు పరిణామ క్రమంలో మానవుడు ఈ రూపాన్ని సంతరించుకున్నడా అన్నది ఇప్పటికీ తెగని చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇది అత్యంత వివాదాస్పదమైన అంశం ఎందుకంటే ఇప్పటికీ శాస్ర్తవేత్తల్లో మానవ పరిణామం పై ఒక ఉమ్మడి అభిప్రాయం లేదు. శాస్ర్తం అభివృద్ది చెందుతున్న కొద్దీ గతంలో చేసిన పరిశోధనలు, ఊహాగానాలు అంతా ఒట్టి ఊహేనా అన్న డౌట్ కూడా వస్తుంది. జెనెటిక్ ఇంజనీరింగ్ డెవలప్ అయి మానవ జీన్ కోడ్ మాప్ సిద్దం చేస్తున్న ఈ తరుణంలో మానవ పరిణామంలో ఉన్న చిక్కుముడులు ఒక్కొక్కటే వీడుతున్నయి.
స్పాట్
జీవం పుట్టుకకు ఆధారం నీరేనని...నీటిలోంచే జీవం ఉద్భవించిందనేది శాస్ర్తవేత్తలు వాదన. ఇప్పటి వరకు ఎందరో శాస్ర్తవేత్తలు నమ్మే సిద్దాంతం కూడా ఇదే...అయితే బాగా అభివృద్ది చెందిన దేశాలలో జీవి పుట్టుకకు ఆధారమైన జీవజాతులు చాలా కనుమరుగయినవి. వీటి మూలాలు జన సంచారం తక్కువగా ఉన్న అడవుల్లో ఉన్నప్పటికీ వాటిని గుర్తించి వెలికితీయడం చాలా ప్రయాసతో కూడుకున్న పని. ఒక జంతువు ఎన్నోరకాల జాతులుగా అభివృద్ది చెందడం వెనక మర్మం ఏంటనే సందేహం వచ్చింది పరిశోధకులకు... ఈ సందేహం నివృత్తి చేసుకునేందుకు కొన్ని వేల ప్రయోగాలు నిర్వహించిండ్రు. వీటి ఆనవాలు ఖండాంతరాలలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తిచిండ్రు. ముఖ్యంగా జమైకా దీవిలో ఉన్న వేలాది రకాల మొక్కలు, జంతు జాతులు ప్రస్తుత జీవజాతులు పూర్వికులగా గుర్తించిండ్రు. ఒక్కసారి మనం కూడా జమైకా దీవుల్లో విహరించి వద్దాం పదండి...
స్పాట్
ఇక్కడ కనిపించే పూల మొక్కలు ప్రకృతి నిండా అందాలను అద్దుతుంటయి. ఎంత సేపు చూపినా తనివి తీరని అందం వీటిది..ఒకటి కాదు రెండు కాదు వేలరకాల వృక్షజాతులు ఈ ప్రకృతి నిండా పచ్చగా పరచుకొని ఉన్నయి. ఈ సృష్టిలో ఉన్న వైవిధ్య భరిత జీవజాతులు నిజంగా మనిషికి పెద్ద ఫజిల్ గానే మిగిలినయి. ఎప్పటికి ఛేదించలేని ఈ చిక్కుముడిని ..తన ఊహా శక్తితో విప్పేందుకు అనాది నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నడు మానవుడు. అయినా ఆ ప్రకృతిని అర్ధం చేసుకోడానికి ఒక జీవిత కాలం సరిపోదు. అన్ని వేల రకాల జీవజాలం ప్రకృతినిండా పరచుకొని ఉంది. ఒకే రకమైన ఆకృతి కలిగిన జీవులు కొన్ని చిన్నగా ఉంటే మరికొన్ని మరింత పెద్దగా కనిపిస్తయి. కారణం తెలియదు గానీ ఒకే జాతికి చెందిన జీవులు కొన్ని కౄరమృగాలుగా మారితే మరికొన్ని సాధుజంతువులుగా మారినయి. ఈ ప్రకృతి వింతల్లో అర్థం కాని కొన్ని లక్షలనిగూఢ రహస్యాలను అర్ధం చేసుకునే పనిలో పడ్డరు జంతు, వృక్ష శాస్ర్తవేత్తలు.
స్పాట్
ఇదిగో ఇక్కడ ఒక జమైకన్ వృక్షశాస్ర్తవేత్త వివిధ రకాల బల్లులను అధ్యయనం చేసేందుకు చేసే ప్రయత్నం చూడండి.. ముందుగా వివిధ రకాల బల్లి జాతులను సేకరించి వాటి గురించి పూర్తిగా అధ్యయనం చేస్తరు. ఒక్కముక్కలో చెప్పాలంటే మొత్తం జాతుల మూలాలను అధ్యయనం చేస్తే మానవ పరిణామ క్రమం తెలుసుకోవడం తేలికని వీరి అభిప్రాయం. ఎందుకంటే ఒకవేళ పరిణామ సిద్దాంతమే నిజమైతే... ఒక జీవి నుంచి మరో జీవి ఎలా పరిణామం చెందిందో అధ్యయనం చేయడానికి ఈ జాతుల సేకరణ మరింత ఉపకరిస్తది.
స్పాట్
ఇదిగో ఇక్కడ లైబ్రరీలో వేలాది స్పెసిమెన్స్ ను భద్రపరిచిండ్రు. ఎందుకంటే ప్రకృతిని అధ్యయనం చేసే యువశాస్త్రవేత్తలు తొలుత తరగతి గదిలో వీటిని అధ్యయనం చేశాక నిజమైన ప్రకృతిలోకి తొంగిచూస్తరు. ఇటువంటి లక్షలాది నమూనాలు మ్యూజియంలలో భద్రపరచబడి ఉన్నయి.
స్పాట్
బ్రేక్ యాంకర్
ప్రకృతిలో ఉన్న వివిధ జాతులను సేకరించి ఏం చేస్తారు. ఈ స్పేసిమెన్స్ వల్ల పొందే లాభం ఏంటి..నిజాని మనం భద్రపరచిని శిలాజాల కన్నా ప్రకృతి కూడా తన లైబ్రరీలో స్పెసిమెన్స్ను భద్రపరిచింది. ఇంతకీ ఏంటా నేచురల్ స్పెసిమెన్స్ తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం..
యాంకర్ 2
ఒక వ్యవస్థ గురించి అధ్యయనం చేయాలంటే ముందు... ఆ వ్యవస్థలో చిన్న బాగాన్ని అద్యయనం చేస్తే దాని మొత్తం కధంతా తెలిసిపోతది. అందుకే శాస్ర్తవేత్తలు ఎన్నో నమూనాలు సేకరించి దాచుకుంటరు. కానీ ప్రకృతి తనపై తిరుగాడిన ఎన్నో జాతుల ఆనవాళ్లను దాచుకొంది.
స్పాట్
ఇదిగో ఇది బ్రిటీష్ మ్యూజియం. ఇక్కడ వేలాది మంది ప్రజలు భద్రపరచబడిన నమూనాలను తిలకించేందకు కొందరు, కొత్తగా సేకరించిన నమూనాలను నమోదు చేసేందుకు కొందరు ఇక్కడకు వస్తరు. మ్యూజియంలో ఒక్కోక్క్ జాతికి సంబందించి వేలాది రకాలను సేకరించి పెడతరు.. ఇవి చెడిపోకుండా కెమికల్స్ అద్ది ప్లాస్టిక్ కవర్లలో, కంటైనర్లలో, పేపర్ బౌండ్ లలో దాచిపెడతరు. వాటి పార్శిల్ పై ఆ స్పెసిమెన్ పేరు, జాతి, తరగతులు మొత్తం క్షుణ్ణంగా రాస్తరు. ప్రకృతిలో జాతులన్నీ ఒక్క భవనంలో ఒదిగిపోతయి.
స్పాట్
మానవ పరిణామం గురించి అధ్యయనం చేయాలన్న తపన మొదటి నుంచి ఉన్నదే అయినప్పటికి దానిని శాస్ర్తీయంగా అధ్యయనం మొదలుపెట్టింది మాత్రం 17వ శతాబ్దంలోనే... హెన్స్ స్లోయెన్ మొదటి సారి జీవ వైవిధ్యం గురించి మొట్టమొదటి డాక్యుమెంటరీ తయారు చేసిండు.
పారిస్లో ఫ్రెంచి విప్లవం తరువాత శాస్ర్తసాంకేతిక రంగాలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నయి. ఈ ప్రకృతి, సృష్టి భగవంతుని నిర్మితమని చాలా మంది భావించేవారు. దీనిని మార్చడానికి వీలులేదని గట్టిగా నమ్మేవారు.
స్పాట్
పారిస్ నగరం అభివృద్ది చెందిన తరువాత ఎన్నో విలాసవంతమైన భవనాలకు పునాదులు పడ్డయి. ఈ భవనాలు పూర్తిగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కట్టబడినయి. అయితే ఈ భవనాలన్నీ లైమ్ స్టోన్ తో కట్టిండ్రు. ఈ లైమ్ స్టోన్ కోసం వందలాది క్వారీలను ఏర్పాటు చేసి, ఆ క్వారీలలో సున్నాన్ని తవ్వి బయటకు తరలించేవారు. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న చీకటి గుహలన్నీ సున్నం వెలికి తీయగా మిగిలినవే. ఈ సున్నపు బొరియలు తవ్వుతున్న క్రమంలో అక్కడి వారు ఒక వింతను గమనించిండ్రు. గతంలో వారు ఇంత వరకు చూడని అనేక జంతువుల అస్తి పంజరాలు బయట పడటం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. వాటన్నిటినీ ఒక్కచోటకు చేర్చింన్రు. ప్రజలెవరూ చూడని పెద్దపెద్ద అస్థిపంజరాల నిర్మాణం ఏర్పడింది. దాంతో ఈ భూమి పై ఒకప్పుడు పెద్దపెద్ద జంతువులు జీవించేవన్న విషయం అర్ధమయింది.
స్పాట్
ఇదిగో ఇక్కడ ఉన్న వందలాది శిలాజాలన్నీ వివిధ రకాల విలుప్త జీవులవే. అలా దొరికిన శిలాజాలతో ఏకంగా ఒక మ్యూజియమే వెలిసింది. అటువంటి కోవలోకే రాకాసి బల్లులను చేర్చింన్రు. రాకాసి బల్లుల్లో కూడా శాఖాహారులు మాంసాహారులు ఉన్నాయన్న విషయం వాటి శిలాజాల నిర్మాణాన్ని బట్టి తెలిసింది. వాటి దంతవిన్యాసాన్ని బట్టి అవి శాఖాహారులా లేక మాంసాహారులా అన్న విషయాన్ని నిర్ధారించుకునే వారు శాస్త్రవేత్తలు.
స్పాట్
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం విశేషాలు మరిన్ని అప్ డేట్స్ మళ్ళీ కలుద్దాం..అంటిల్ దెన్న బైబై..
వెల్ కం బ్యాక్ టు ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్..

ది సైన్సు ఎపిసోడే 1

ఎ.జనార్దన్‌
మన నేత్రం అత్యంత శక్తివంతమైనది. ఈ సకల చరాచరా జగత్తులో రంగులను గుర్తించగల శక్తి ఒక్క మానవనేత్రానికే ఉంది. అటువంటి మానవనేత్రం నుంచి కూడా తప్పించుకునే ప్రకృతి చిత్రాలున్నయంటే మీరు నమ్మగలరా..మన కంటికి కనిపించని అటువంటి సూక్ష్మప్రపంచాన్ని పరిచయం చేస్తొంది రాజ్‌న్యూస్‌..
బ్యాంగ్‌
రహస్యం...ఈ ప్రకృతి ఇప్పటికీ ఎవరూ ఛేదించలేని ఒక రహస్యం...దీని పాస్‌వర్డ్‌ ఎవరి దగ్గర ఉందో కానీ...దిస్‌ నేచర్‌ ఈజ్‌ వండర్‌ ఫుల్‌ క్రియేషన్. ఈ క్రియేషన్‌లో ఉన్న క్రిటికల్‌ థింగ్స్‌ని కూడా ఛేదించే ప్రయత్నం చేస్తున్నడు మానవుడు. అందుకే కొన్ని కోట్ల మైళ్ల దూరాన ఉన్న గ్రహాలను కనిపెట్టడమే కాదు...మన చుట్టూ, మనలోనా దాగి ఉండి మనకు తెలియని అత్యంత సూక్షజీవులను కనిపెట్టి వాటినుంచి పాఠాలు నేర్చుకుంటున్నడు మనిషి.
వాయిస్‌
నేచర్‌.. ది వండర్‌... కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మానవుడు ఎంతో పురోగతి సాధించానని విర్రవీగుతున్నా...అందంతా కేవలం భ్రమ..ఈ టెక్నాలజీ టెక్నిక్‌లన్నీ ప్రకృతిని చూసి కాపీ కొట్టినవే.. అవును.. నిజం. ఇది మేము చెప్పేది కాదు గ్లొబల్ సైంటిస్ట్‌లంతా ముక్త కంఠంతో వినిపించే సజీవ సత్యం. పిట్టను చూసి గూడు కట్టుకోవడం నేర్చుకున్న మానవుడు..చీమను చూసి పొదుపు చేయడం నేర్చుకున్నడు. ఇవే కాదు వందల కొద్ది ఉపాయాలను మనం చుట్టూఉన్న జంతువులను, పక్షులను , క్రిమి కీటకాదులను చూసి నేర్చుకున్నం. మన ప్రపంచ శాస్త్రవేత్తలు మానవ నేత్రం చూడలేని ఎన్నో వందల రెట్ల సూక్ష్మక్రిములను అధ్యయనం చేయడమే కాదు ... వాటి నుంచి కొత్త పాఠాలు నేర్చుకునే పనిలో పడ్డరు. కొన్ని సూక్ష్మక్రిములు అసలు ఆహారమే తీసుకోకుండా జీవిస్తున్నయంటే వాటి రహస్యం ఏంటో ఇప్పటికీ అంతుచిక్కలేదు. మరి కొన్ని జీవులు కంటికి కనిపింనంత చిన్నవైనా ఈ ప్రకృతినే శాసించగలగడం నిజంగా మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ రహస్య ప్రపంచపు ద్వారాలు తెరిచేపనిలో పడ్డరు మన శాస్ర్తవేత్తలు.
స్పాట్
యాంకర్ 2
మనం చాలా నిశ్శబ్దంగా ఉన్నామని అనుకుంటాం...కానీ ఆ నిశ్శబ్దంలోనే మన చుట్టూ కొన్ని వందల పనులు జరిగిపోతుంటయి. ఈ జగత్తులో ఒక్క సెకనులో కొన్ని లక్షల క్రియలు జరిగిపోతుంటయి. ప్రతి చలనం...ప్రతి కదలిక...ఈ ప్రకృతిలో బాగమే...ఒక చిన్న ముద్దు పెట్టుకున్న సెకన్ల కాలంలో ఏం జరుతోందో చూడండి….
స్పాట్( ముద్దు సీన్లో బ్యాక్టీరియా ట్రాన్స్ఫర్ అయ్యే సీన్)
వాయిస్
యాంకర్ 3
ఈ సూదిని చూశారా... దీని రంద్రంలోకి దారం ఎక్కించాలంటేనే ఎంతో కష్ట పడాలి...ఎందుకంటే ఇంత చిన్న రంద్రాన్ని చూడాలంటే ఎంత కష్టపడాలి...కానీ ఈ సూది మొనకంటే ఎన్నో వేల రెట్ల చిన్నగా ఉండే సూక్ష్మ ప్రపంచం ఉంది...
వాయిస్
ఈ సకల చరాచర జగత్తులో ఎంతో సూక్ష్మమైన జీవులున్నయి. చాలా వాటి ఉనికి నేటి వరకు తెలియదు. ఇప్పటికే కొన్ని కోట్ల బ్యాక్టీరియా, వైరస్, సూక్ష్మ క్రిముల పనితీరును అధ్యయనం చేసిండ్రు మన శాస్ర్తవేత్తలు. అంతేకాదు సూక్ష్మ పరికరాల ద్వారానే సమర్దవంతంగా పని చేయవచ్చని తెలుసుకున్నరు శాస్ర్తవేత్తలు. అందుకే అత్యంత సమర్దవంతంగా పని చేసే సూక్ష్మ పరికరాలను రూపొందిస్తున్నరు.
స్పాట్
వాయస్
ఇది కంప్యూటర్ సి.పి.యు లోపలి బాగం. ఇక్కడ చిన్నగా కనిపించే పరికరాలనన్నిటిని మైక్రోచిప్సని అంటరు... ఈ ఒక్క మైక్రో చిప్ లోనే కొన్ని వందల సర్క్యూట్లను ఏర్పాటు చేసిండ్రు. ఒకప్పుడు ఈ కంప్యూటర్ …ఒక రూంకు సరిపడా ఉండేది. కానీ ఇప్పుడు దీని పరిమాణం అరచేతిలో ఇమిడిపోయేలా తయారు చేశారు మన శాస్త్రవేత్తలు. చిన్న చిన్న పరికరాలతో పెద్ద పెద్ద పనులు చేయించవచ్చని తెలుసుకున్నరు సాంకేతిక నిపుణులు. టెక్నికల్ ఇంజనీరింగ్లో శాస్త్రవేత్తలు అద్భుతాలు సృష్టిస్తున్నారంటే దానికి కారణం మనకు తెలియని, మనం చూడని సూక్ష్మప్రపంచపు రహస్యాలు కనుక్కోవడం వల్లనే అది సాధ్యమయింది.
స్పాట్
యాంకర్ 4
సూక్ష్మజీవులను కూడా చూడటం సాధ్యం కాని మనకు సూక్ష్మ పరికరాలను తయారు చేయడం ఎలా సాధ్యం అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. యస్.. ఇది సాధ్యమే..నానో టెక్నాలజీతో అది సాధ్యమే.. మనం బియ్యం గింజ పై పేరు రాస్తేనే అబ్బో అని నోరెళ్ల బెడతాం..కానీ నానోటెక్నాలజితో వెంట్రుక పొరలో వేయ్యోవంతులో కూడా మనం కోరుకున్నది రాసుకోవచ్చు మీరే చూడండి.
వాయిస్
ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న మిషన్ గుండు పిన్నును కూడా గడ్డపారకంటే పెద్దగా చూపించగల శక్తి కలది. ఒక్క ఆబ్జెక్ట్ను కొన్ని వేల రెట్లు మాగ్నిఫికేషన్ చేసి చూడడం ద్వారా దాని మూలాలు తెలుసుకోవచ్చన్న సూత్రంతో పని చేస్తది. చిన్న వస్తువులను చూపించడమే కాదు ఒక పెద్ద బాగంలో ఉన్న విడిబాగంలో ఉన్న చిన్న వస్తువును కొన్నివేల రెట్లు పెద్దగా చేసి చూపడంలో ఈ పరికరం దిట్ట.
ఇక్కడ వీరు చేస్తున్న హడావుడి చూస్తున్నారుగా…కేవలం ఒక తల వెంట్రుక..ఈ వెంట్రుకను కాస్త దూరం నుంచి చూస్తే నేరుగా కంటికే కనిపించదు. కానీ ఈ ఒక్క వెంట్రుక పై ఈ నానోమిషన్ హిస్టరీ మొత్తం రాసేయోచ్చు. ఇదిగో మీరే చూడండి. వెంట్రుక పై ఎలా పేరు రాస్తున్నారో…
చిన్న స్పాట్
ఈ టెక్నాలజితో టైప్ చేసి పెట్టుకోగలిగితే మన సెంట్రల్ లైబ్రరీ మొత్తం ఒక్కపుస్తకంలో రాసిపెట్టుకోవచ్చు. కాకుంటే మన దగ్గర నానో మిషన్ ఉంటేనే వాటిని తిరిగి చదువుకోగలం. మామూలు కంటితో చదువుకోవడం ఇప్పడు మాత్రం సాధ్యం కాదు..ఏమో భవిష్యత్తులో వీటిని కూడా చూసి చదువగల కళ్లద్దాలు తయారు చేసినా ఆశ్చర్యపోవలసిందిలేదు.
స్పాట్
సైంటిఫిక్ డెవలప్ మెంట్లో మైక్రోస్కోప్ల పాత్ర మరువలేనిది. మైక్రోస్కొప్ కనిపెట్టిన కొత్తలో ముందుగా భూతద్దంతో మాత్రమే చూడటం సాధ్యమయ్యేది. ఆ తరువాత 10x అంటే పది రెట్లు పెద్దగా చూపగల మైక్రోస్కోపులను తయారు చేశారు. వీటి తరువాత 100x అంటే ఒక కణాన్ని వందరెట్లు చేసి చూపగల మైక్రోస్కోప్లను తయారుచేసినరు. లేటెస్ట డెవలప్మెంట్లో ఎలక్ర్టానిక్ మైక్రోస్కొప్లు వచ్చాక హైపవర్ రెజల్యూషన్తో, హై మాగ్నిఫికేషన్ చేసి కణంలోని కణాంగాల పనితీరును కూడా అధ్యయనం చేసి చూపుతున్నరు.
నానోటెక్నాలజీ సాయంతో రోజరోజుకో కొత్త మైక్రోసిస్టమ్ ని క్రియేట్ చేస్తనే ఉన్నరు. కానీ నేచర్ ని మించిన క్రియేటర్ లేదు. మనం ఊహించలేని మైక్రో ఆపరేటర్లను ప్రకృతి సృష్టించి సిద్దంగా ఉంచింది.
స్పాట్ (మైక్రోస్కొప్ విజువల్స డౌన్లోడ్ చేయాలి.)
యాంకర్ 5
మనం ఎంత సాంకేతిక పరిజ్ఞానం అబివృద్ది చెందినా… ఇప్పటికి కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం కనుక్కోలేక ఇబ్బంది పడుతున్నం. కానీ ఇక పరిష్కారం సాధ్యం కావనుకున్న సమస్యలకు కూడా ప్రకృతే దారి చూపింది.
వాయిస్
మానవ మనుగడ మొత్తం ప్రశ్నలమయం..ప్రకృతి మొత్తం ఒక క్వశ్చన్ పేపర్..ఒక వండర్ పజిల్. మనుగడ కోసం ఒక్కో పజిల్ని ఛేదించుకుంటూ ముందుకు పోవాలి. అప్పుడే మన జీవితం చాలా సౌకర్యవంతంగా ఉంటది. మనిషి ఈ నేల పై సుఖంగా జీవించడమే కాదు చంద్రమండలం పై కూడా కాలుమోపాలని ప్రయత్నించిండు. కానీ జాబిల్లి పై జలకాలాడాలనుకున్న మానవుడికి ఆదిలోనే హంసపాదు పడింది. చంద్రుడి పైకి పరిశోధనకు వెళ్లిన మానవుడికి ఓ కొత్త సమస్య ఎదురయ్యింది. చంద్రమండలం నిండా దుమ్ము దూళి ఉంటది. కాలుమోపితే పాదంతో పాటు దుమ్ము లేస్తది. డ్రెస్కు అమర్చిన కెమెరాల నిండా దుమ్ము ధూళిపడి విజువల్స్ రికార్డ్ చేయడం కష్టంగా మారింది. ఈ విషయాన్ని ముందే ఊహించలేక పోవడంతో చంద్రమండలం పై శాస్ర్తవేత్తలకు ఈ సమస్య పెను సవాల్ గా మారింది. ఈ సమస్య కు ప్రకృతే పరిష్కారం చూపింది.
యాంకర్ – బ్రేక్
చంద్రమండలంలో ఎదురైన సమస్యకు ప్రకృతి ఎలా దారి చూపిందో తెలసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం..

యాంకర్ 6
కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం. గ్రహాంతరయానం…ఆపరేటింగ్ మొత్తం ఇక్కణ్నించే..తీరా అక్కడికి వెళ్లాక ఒక చిన్న సమస్య ఎదురైతే… సమస్య చిన్నదైనా దానిని పరిష్కారించే అవకాశాలు లేనప్పుడు… పెట్టిన కోటాను కోట్ల రూపాయల పెట్టుబడి ఏం కావాలి..అవును సరిగ్గా ఇటువంటి సమస్యే ఎదురయింది చంద్రయానం చేసే ఖగోళ పరిశోధకులకు.
వాయిస్
చల్లని వెన్నెల కురిపించే రేరాజు ఉపరితలం పై ఏముందో తెలుసుకోవాలన్న కాంక్ష మనిషిని మిలియన్ డాలర్ల ఖర్చుకు వెనకాడకుండా చంద్రమండలం పై కాలుమోపేలా చేసింది. అక్కడికెళ్లాక చంద్రమండలంపై ఉన్న డస్ట్ సమస్య ప్రయోగానికి పెద్ద ఆటంకంగా మారింది.
స్పాట్
గతంలో ఒకసారి అంతరిక్ష పరిశోధకులకు ఒక సమస్య ఎదురయింది. అంతరిక్ష పరిశోధనకు రోదసి నౌకలో ప్రవేశించాక తాము పరిశీలించిన విషయాలను నోట్ చేసుకునేందుకు పెన్ తీసి రాస్తే అది మోరాయించింది. శూన్యంలో పెన్ రాయకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఆఖరుకు చిన్న ఐడియాతో ఆ సమస్యను అధిగమించారు. మరేంలేదు ఒక్క పెన్సిల్ ముక్క అంతరిక్ష పరిశోధకులకు వరంగా మారింది.
స్పాట్
ఇప్పడీ చంద్ర మండల డస్ట్ సమస్యకు కూడా ప్రకృతే పరిష్కారం చూపింది. ఆ తరువాత అది ఎన్నో వందల సమస్యలకు ఫార్ములాగా మారింది. మన ప్రకృతిలో నిత్యం మనం గమనించినా గమనించనట్టు వదిలేసే ఎన్నో చిత్రాలు ఒక్కోసారి పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారం చూపెడుతయి. అటువంటి విచిత్రమే తామరాకు. తామరాకు నీటిలో ఉన్నా దాని ఉపరితలం పై నీటి చెమ్మను కూడా అంటనీయదు. ఎంత పెద్ద వర్షమయినా దాని పై చుక్కనీరు నిలువదు. ఒక్కనీరే కాదు దుమ్ము ధూళి కూడా తామరాకు ను అంటుకోవు. ఈ తామరాకు లోగుట్టే తమ సమస్యకు పరిష్కారం చూపిస్తుందని భావించారు గార్డర్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ రీసెర్చ్ సైంటిస్ట్ లు. ఆలోచన వచ్చిందే ఆలస్యం తామరాకు లోగుట్టు విప్పేందుకు పరిశోధనలు మొదలు పెట్టిండ్రు.
స్పాట్
ఈ తామరాకు ఉపరితలం మొత్తం మైనపు పొరతో ఆవరించబడి ఉంటది. ఈ లోటస్ లీఫ్ ఎంత బురదలో ఉన్నా దానికి లేశ మాత్రం కూడా దుమ్ము అంటుకోక పోవాడానికి దీని అంతర్నిర్మాణమే కారణం. దీని సెల్ఫ్ క్లీనింగ్ సీక్రెట్ను అధ్యయనం చేసేందుకు అణువణువూ అధ్యయనం చేశారు సైంటిస్ట్ లు.
పారా డబ్బింగ్
ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఈ దారులు తామరాకు ఈనెలు. ఇవి మన మామూలు కంటితో చూడవచ్చు. మైక్రోస్కోప్తో ఆకు అసలు రూపాన్ని తీక్షణంగా పరిశీలిస్తే మనకు చాలా చిన్న మచ్చలు కనిపిస్తయి. మానవుల వెంట్రుక మందం ఆరు మైక్రాన్లు ఉంటది. అంటే ఇంత అన్నమాట. కానీ అంత వ్యాసార్ధంలోనే కొన్ని వందల మైనపు కేశాలు ఆకు ఉపరితలాన్ని ఆవరించి ఉన్నయి. లోటస్ లీఫ్ మనకు పైకి కనిపించినంత మృదువుగా ఉండదు. మన కంటికి కనిపించని ఎత్తుపల్లాలు ఎన్నో ఆకు నిండా ఉన్నయి. ఈ ఎత్తుపల్లాలే తామరాకు సెల్ఫ్ క్లీనింగ్ ఆపరేటింగ్ సీక్రెట్. ఇవే ఆకు పై పడ్డ నీటినైనా, ధూళినైనా దూరంగా విదిలిస్తయి.
స్పాట్
ఈ లోటస్ లీఫ్ సీక్రెట్ శాస్త్రవేత్తలకు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టేలా చేసింది. శాస్ర్తవేత్తలు గదులలో పరిచే రెండు సిరామిక్ టైల్స్ను తీసుకొని ప్రయోగం చేశారు. ఒక టైల్ లోటస్ లీఫ్ సీక్రెట్ కల్చర్తో డెవలప్ చేసిండ్రు. మరో టైల్ సాధారణంగా తయారు చేసిండ్రు. ఈ రెండిటి పైనా డస్ట్ పోసి టెస్ట్ చేస్తే.. లోటస్ లీఫ్ కల్చర్డ్ టైల్… డస్ట్ ఫ్రీగా మారిపోయింది. సక్సెస్….. ఈ ఫార్ములాతో శాస్త్రవేత్తలు తమ సమస్యను అధిగమించిండ్రు. చంద్రమండలం పై డస్ట్ ఫ్రీ కోట్ తయారీకి ఫార్ములా రెడీ అయింది.
స్పాట్ 1 2 3 లాండ్
ఇదే లోటస్ లీఫ్ కల్చర్ ఫార్ములా ఏ ఆబ్జెక్ట్ పై అప్లై చేసినా సేమ్ రిజల్ట్| రిపీట్ అయింది. ఆ వస్తువు డస్ట్ ఫ్రీ, వాటర్ ప్రూఫ్ ఆబ్జెక్ట్గా తయారయితది. ఇదిగో ఈ కోట్ చూడండి టాప్ కింద పెట్టి నీళ్లు వదిలినా ఒక్క చుక్కకూడా కోట్ను తడపడం లేదు. యస్. ఇది తామరాకు నేర్పిన ప్రకృతి పాఠం. మన డ్రెస్లకు బ్యాక్టీరియా, వైరస్లు కూడా అంటుకోకుండా ఇదే సీక్రెట్తో రక్షణ పొందవచ్చనేది శాస్ర్తవేత్తల అంచనా..
యాంకర్ 7
ప్రకృతిలో సూక్ష్మ ప్రపంచపు అద్భుతాలకు తామరాకు ఒక ఉదాహరణ మాత్రమే..ఇటువంటి సీక్రెట్లు ప్రకృతి అణువణువునా కోకొల్లలు. ఇటువంటిదే మరో సీక్రెట్ ఉపయోగించుకొని గోడలపై బల్లులకంటే స్పీడ్ గా పరిగెత్తగలమా..ఈ వండర్ సీక్రెట్..చిన్న బ్రేక్ తర్వాత..
వెల్కం బ్యాక్
యాంకర్ 7
మనం బల్ల పరుపుగా ఉన్న ప్లేస్లో మాత్రమే నడవగలం..కారణం మన కదలికలకు భూమ్యాకర్షణ శక్తికి మధ్య విడదీయరాని సంబంధం ఉంది. ఈ గ్రావిటేషన్ ఫోర్స్ను కూడా తప్పించుకొని స్పైడర్ మాన్లా గోడలెలా ఎక్కొచ్చో మనకు బల్లి నేర్పింది..కాదు మనమే బల్లిని చూసి నేర్చుకున్నం..ఆ సీక్రెట్ మీ కోసం..
వాయస్
మనం ఈ నేలకు సమాంతర తలం మీద మాత్రమే నడవగలం. నేలకూడా కాస్త నునుపుగా ఉందంటే అడుగు తీసి అడుగేయాలంటే కాస్త జాగ్రత్త పడాల్సిందే.. మన నడకకూ భూమ్యాకర్షణ శక్తికి విడదీయరాని సంబంధం ఉంది. ఈ నేల పై కాకుండా నిట్టనిలువు తలాలపై పనిచేయాలంటే మనకు ప్రత్యేకమైన వ్యవస్థ కావాలి. కానీ ఇక్కడ మనం చూస్తున్న జంతువు ఎటువంటి ఆచ్ఛాదనా లేకుండానే అద్దం పై కూడా అవలీలగా నడుస్తోంది. దీనికి కూడా సూక్ష్మ రహస్యమే కారణం.
స్పాట్
ఈ బల్లి చూడ్డానికి 5 ఇంచుల పొడవుతో ఎర్రని నునుపైన పొలుసులను కలిగి ఉంటది. త్రికోణాకారపు దవడలతో సరీసృపాల జాతికి చెందిన జీవి. దీని పాదాల చివర ఏ మంత్రం దండం ఉందో కానీ, నిలువు గోడలపై, నునుపు తలాల పై ఈజీగా నడవగలదు, పరిగెత్తగలదు. వేటాడి ఆహారాన్ని పట్టుకోగలదు. పట్టుకుంటే పట్టులా జారిపోయే దీని పాదాలకు అద్దానికి అతుక్కుపోయి నడిచేంటంత గ్రిప్ ఎక్కడిది..ఈ చిన్న జీవిలో దాగున్న ఆ సీక్రెట్ ఆపరేషన్ ఏమిటి..ఒక్కసారి ఈ లిజార్డ్ లెగ్లో ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలనిపించింది శాస్త్రవేత్తలకు.
స్పాట్
ఈ పాదాల అడుగు బాగం చూడండి. ఒక్కో వేలిలో డజన్ల కొద్దీ విభాగాలున్నయి. ప్రతి బాగం సిల్క్లాంటి ఉపరితలం కలిగిఉంది. ఈ సిల్కీ ఏరియాని మైక్రోస్కోప్ కింద వందరెట్లు పెద్దవిగా చేసి చూస్తేగానీ అసలు రహస్యం తెలియలేదు. మనకు కనిపించే ఈ సిల్కీలేయర్ కొన్ని కోట్ల సూక్ష్మ కేశాలతో నిర్మించబడి ఉంది.ఇంకా ఇంకా లోతుగా అంటే లక్షరెట్లు పెద్దగా చూస్తే ఒక కేశం…కేశాల కట్టలాగా కనిపిస్తది. ఈ కేశాల కట్టలో సుమారు 5లక్షల సూక్ష్మ కేశాలు దాగి ఉన్నయి. ఒక చిన్న వరుసలో కొన్ని కోట్ల సూక్ష్మ కేశాలు బారులు తీరి ఉన్నయి. ప్రతి కేశం ఒక చిన్న పాదంలా పని చేస్తది. కేశం చివరన వెడల్పాటి పాడ్(pad) ఉంటది. ఈ పాడ్.. కాలికి తలానికి మధ్య శూన్య ప్రదేశం ఏర్పరచగలదు. కాలికి తలానికి మధ్య ఉన్న శూన్య ప్రదేశమే నునుపు తలం పై నడిచే గ్రిప్కు గల కారణం. ఇటువంటి కోటాను కోట్ల సూక్ష్మకేశాలు సక్కర్ల వలే పనిచేయడం వల్ల బల్లి అవలీలగా నడవగలదు. తాను నడవడమే కాదు తన బరువు కంటే పదిరెట్లు ఎక్కువ బరువును కూడా సునాయాసంగా మోసుకెళ్లగలదు.
స్పాట్
మన వెంట్రుకలు శరీరంలో చాలా బలహీనంగా అమర్చబడ్డయి. గట్టిగా లాగితే కుదురుతో సహా ఊడొస్తయి. కానీ బల్లి పాదాల పై ఉన్న సూక్ష్మ కేశాలు మన వెంట్రుకలతో పోలిస్తే పదిమిలియన్ రెట్లు బలమైనవి. ఈ సీక్రెట్ తో మనిషి సక్కర్లను తయారు చేయగలిగిండు.
ఎండ్ యాంకర్
ఎంతో సాధించానని హైటెక్ స్పీడ్ తో దూసుకుపోతున్నానని చెప్పుకునే మనిషి చిన్న చిన్న విషయాలకోసం ప్రకృతి పై ఆధారపడక తప్పడం లేదు. ప్రకృతి మనిషికి నేర్పిన పాఠాలు మరిన్ని వచ్చే వార తెలుసుకుందాం..అంటిల్ దెన్ బై.బై.

ది సైన్సు ఎపిసోడే 3

ఎ.జనార్దన్
ఇంట్రో యాంకర్
సృష్టిలోని సూక్ష్మ రహస్యాలను ఒడిసిపట్టి మీ ముంగిలిలో ఉంచే దిసైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్కు స్వాగతం.
యాంకర్ 1
మంచు పర్వతాలు పెకిలించే పరమాణు రహస్యం, జలుబు వెనక దాగిన జీవరహస్యం. సూర్యప్రళయాన్ని ఎదుర్కొనే సూక్ష్మ రహస్యం..ఇవన్నీ తెలుసుకునే ముందు గతవారం చూసిన సూక్ష్మ ప్రపంచాన్ని మరొక్కసారి రివ్యూ చేసుకుందాం.
వాయిస్
స్పైడర్..మన ఇళ్లలో బూజుతో చిరాకు కలిగించే ఆర్ధోపొడా కీటకం. కానీ దానిలో దాగిన గర్భ రహస్యాన్ని ఛేదించారు శాస్ర్తవేత్తలు. సాలీడు గర్బంలో స్పికెట్స్ స్రవించే లిక్విడ్ ప్రోటీన్ పొరలు పొరలుగా కలిసి ఒకే దారంగా వస్తది. పొరలు పొరలుగా ఉన్న దారానికి బలమెక్కువ.
స్పాట్
సాలీడు తాను అల్లే గూడులో కూడా ఇంజనీరింగ్ ప్లాన్ అమలు చేస్తది. టెంపర్ కలిగిన దారంతో అల్లిన గూడుకి ఎలాస్టిక్ నేచర్ రావడానికి కారణం గూడు అల్లేటప్పుడే జంక్షన్ల వద్ద కొన్న కుచ్చులను వదులతది. ఇదే సీక్రెట్తో హంబుల్ బ్రిడ్జి నిర్మిచారు. ఈ దారంలో ఉన్న అమరికలను అధ్యయనం చేసి నానోకార్భన్ థ్రెడ్ ను తయారు చేసి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారు చేసిండ్రు. ఈ దారం మానవ వెంట్రుక కంటే 5 రెట్లు సన్నగా ఉండి ఇనుము కంటే పదిరెట్లు ఎక్కువ బలం ఉంటది. సాలీడు దారంలో దాగిన మైక్రోస్కోపిక్ సీక్రెట్ అది.
స్పాట్
మన నిత్యం కొన్ని కోట్ల రకాల మైక్రోమ్ లతో సహవాసం చేస్తున్నం. ఇవి అక్కడా ఇక్కడా అని కాకుండా నఖశిఖ పర్యంతం అన్ని చోట్లా తిష్టవేసుకొని ఉంటయి. నడిచే పాదాలకిందా, నీటి కుళాయి పైనా, నూడిల్స్ లో కలుపుకునే వెనిగర్లో కూడా వేలాది మైక్రోమ్ లు చేరి మన శరీరంలో ప్రవేశిస్తయి. అవి ఒకరి ద్వారా ఒకరిలోకి ప్రవేశిస్తయి.
స్పాట్
యాంకర్ 2
ఒక్క సూక్ష్మ నిర్మాణం పెద్ద పెద్ద నిర్మాణాలను ఎలా శాసిస్తాయో తెలిస్తే ఆశ్చర్యం వేస్తది. ఒక్క పరమాణువులో కదలిక మంచు పర్వతాన్నే కూలదోసి, మంచు తుఫాన్ ను సృష్టిస్తుందంటే నిజంగా వండర్...ఆ వండర్ సీక్రెట్ మీ కోసం..
స్పాట్
వాయిస్
పెద్ద మంచు శిఖరాలు ఉన్నట్టుండి ఎందుకు విరిగి పడతయో చాలా కాలం వరకు శాస్ర్తవేత్తలకు కూడా అంతుబట్టలేదు. ఇందులో దాగిన మంచు రహస్యమేంటో తెలియలేదు. ఈ మంచు కొండ చరియలు విరిగిపడటం వలన ఊహించని ప్రమాదాలు ఎదరయ్యేవి. స్కీయింగ్ చేసేవారికి , షెల్టర్ తీసుకునే వారికి అనుకోని విపత్తులు ఎదురయ్యేవి. ఈ విపత్తు వలన ఒక్కోసారి వందలాది ప్రాణాలు గాలిలో కలుస్తయి. అందుకే ఈ మంచులోతుల్లో దాగిన మర్మాన్ని వెలికితీసేందుకు బెల్ట్ బిగిచారు పరిశోధకులు.
స్పాట్
మంచు చరియల్లో దాగిన రహస్యాన్ని ఛేదించే ముందు మంచు యోక్క మర్మాన్ని అధ్యయనం చేశారు పరిశోధకులు.
ఇవి సన్నని మంచు ఫలకలు..వజ్రపు బిళ్లల్లా ఉన్న ఈ ఐస్ ఫ్లేక్స్ ఒకదానికొకటి కలిసినపుడు ఇదిగో ఇలా షట్కోణాకారంలో పూల వంటి బంధాలతో అన్ని ఫలకలు కలుస్తయి.
వీటి మధ్య ఏర్పడే బలమైన లాటిస్ బందాలు మంచు ఫలకాలను పట్టి ఉంచుతయి.
స్పాట్
ఒక్కసారి స్నో ఫ్లేక్స్ దగ్గరయినపుడు అన్నీ బలమైన బంధాలు ఏర్పరచుకొని ఒకే గడ్డలా మారిపోతయి.
స్పాట్
ఇదుగో మంచు కణాల మధ్య బంధాలను ఒక్కసారి పరిశీలిస్తే అసలు నిజం కనిపిస్తది. స్నో క్రిస్టల్స్ నిర్ణీత ఉష్ణోగ్రతలో బంధించ బడుతయి. వీటి మధ్య ఉన్న లాటిస్ బంధాలే వీటిని పట్టి ఉంచడానికి కారణం.
స్పాట్
మంచు స్పటికల మధ్య ఏర్పడిన బలమైన బంధాలు ఏర్పడటం వల్ల పర్వతాన్ని ఆవరించిన మంచు మొత్తం ఒకే గడ్డలా మారి పర్వతాన్ని ఆవరించి ఉంటది.ఉపరితలంలో మనకు తెల్లని ముగ్గులా కనిపిస్తున్న మంచు కుప్పలు కొద్దిగా చెదిరినా సర్దుకుంటయి. దానిపై వాహనాలు నడిచినా పెద్ద ప్రమాదం లేదు. ఎండ తన ప్రతాపం చూపించినా కరిగిపోయిన మంచు కరిగిపోగా మిగిలిన మంచు పొరలు క్షేమంగా ఉంటయి.
స్పాట్
ఇంత బలంగా పాతుకు పోయిన మంచు పర్వతాను ఎవరు డిస్టర్బ్ చేస్తున్నరు. ఈ సడెన్ ఐస్ సైక్లోన్ కు కారణం ఏమిటి..ఈ మంచు తుఫాన్ ఆశామాషీ తుఫాన్ కాదు..ఒక్క కుదుపుకు 30వేల టన్నుల మంచు విరిగిపడతది. ఇది కేవలం 10 సెకన్ల వ్యవధిలో 200 కిలోమీటర్ల దూరం దూసుకొని పోగలదు. దీని మార్గమధ్యంలో ఏం ఉన్నా దానికి తలొంచాల్సిందే..
స్పాట్
నిర్మలంగా, ప్రశాంతంగా యోగిలా ఉండాల్సిన మంచు పర్వతానికి ఈ ఉగ్రరూపం ఇచ్చేదెవరు...
మంచు అంతరాలలో దాగి ఉన్న ఓ మైక్రోస్కోపిక్ సీక్రెట్..
ఈ మొత్తం మంచు పర్వతాన్నే అతలాకుతలం చేస్తుంది. ఇంతకీ ఏమిటా సీక్రెట్ అనే విషయాన్ని తేల్చేశారు శాస్ర్తవేత్తలు.
స్నోఫ్లేక్స్ కలిసిపోయేటపుడు హైడ్రోజన్ బంధాలతోని ఒకదానికొకటి కలిసిపోయి లాటిస్ బంధాలు ఏర్పడుతయి. ఈ బంధాలు మంచు ముక్కలను మంచు పర్వతాలుగా ఏర్పస్తయి. వీటి జీవిత కాలం కొంతకాలం వరకే ఉంటుంది. ఆ నిర్ణీత కాలం తరువాత ఈ లాటిస్ బంధం బలహీనమయి కణాలమధ్య దూరం పెరుగుతది. వాటి మధ్య గాలి చొరబడి కణాల మధ్య దూరాన్ని మరింత పెంచుతది. వీటికి ఉష్ణోగ్రత తోడైతే ఇది మరింత వేగంగా జరుగుతుంది. అదే ఒకే మంచు దుప్పటిలా ఉన్న ఈ పర్వతపు మూలాలను కదిలిస్తది.ఈ మార్పు క్షణ కాలంలో అన్ని అన్ని అణువులకు చేరతది. పర్వతం అణువణువునా వ్యాపించి మంచు పర్వతంలో పైబాగాన ఉన్న ఒక లేయర్ మొత్తం పర్వతం నుంచి వేరవుతది. మంచు చరియల్లో ఏర్పడిన ఈ పగుళ్ల మధ్య ఘర్షణలేక పోవడం వల్ల పై లేయర్ పై గురుత్వాకర్షణ శక్తి ప్రభావం పెరుగుతది. అంతే.. వేల కిలో మీటర్ల ఎత్తులో ఉన్న మంచు చరియలు రాకెట్ వేగంతో కిందికి దూసుకొస్తయి. ఈ మంచు తుఫాన్ దారిలో ఏది ఉన్నా దానికి తలొంచాల్సిందే..
స్పాట్
వేల మీటర్ల ఎత్తున సగర్వంగా నిలుచొని అందం ఒయ్యారాలు పోతున్న మంచు పర్వతం ప్రాణం ఒక్క చిన్న మంచు ముక్కలో ఉంది. ఆ మంచు ముక్కే కొంప ముంచుతుంది. హైడ్రోజన్ లాటిస్ బంధాల విలువేంటో అప్పడు గానీ శాస్ర్తవేత్తలకు తెలిసిరాలేదు.
స్పాట్
ఫస్ట్ బ్రేక్ యాంకర్
హచ్..జలుబు.. ఇది పెద్ద ప్రమాదకరమైన వ్యాధి కాకపోయినప్పటికీ.అది అటాక్ అయిన దగ్గర నుంచి వదిలిపోయే దాకా మనిషిన ఇబ్బంది పెడతది.జలుబంటే అలర్జీ వల్లనో వాటర్ చేంజ్ వల్లో అనుకుంటం. నిజానికి జలుబుకు ఇవి కూడా కారణాలైనప్పటికీ ..ఇవే కారణాలు కావు. మరి మనిషికి జలుబు ఎలా ఎలాక్ అవుతుంది. జలుబు వెనక దాగిన జీవరహస్యమేంటి తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.
యాంకర్ 2
జలుబు.. ఇది ప్రతి ఒక్కరిలో ఒచ్చే కామన్ ఇన్ఫెక్షన్..కానీ ఒక్కసారి చేసే స్నీజింగ్ లో శరీరంలో ప్రతి కండరం పనిచేస్తది. ఒక్క తుమ్ముకోసం మన శరీరం ఇంత పని చేస్తదని మనం కనీసం ఆలోచించం..ఎప్పుడైనా కాస్త మెడనరం పట్టినప్పుడో..లేదా శరీరంలో ఎక్కడైనా నరం పట్టినప్పుడో ఒక్క తుమ్ము వస్తే నరకం అంచులు కనిపిస్తయి. శరీరం మొత్తాన్ని లోబరుచుకునే ఈ జలుబుకింత జోరెక్కడిదో మీరే చూడండి..
స్పాట్
మనం హాయిగా బ్రతకాలంటే స్వచ్ఛమైన గాలి కావాలి. బిజీ బిజీగా మన పని మనం చేసుకుపోతున్నా..మనకు తెలియకుండా అసంకల్పితంగా చేసే పని శ్వాస. ఈ శ్వాస మనకు రకరకాల కష్టాలు తెచ్చిపెడుతుంది. ఎందుకంటే స్వచ్ఛంగా ఉందనుకున్న గాలిలో ఎన్ని మైక్రో ఆర్గాన్స్ విహరిస్తున్నాయో తెలిస్తే ..మనకు ఊపిరి పీల్చడానికి కూడా భయమేస్తది.
స్పాట్
మన నిత్యజీవితంలో పక్కవారెవరైనా పొగ త్రాగి వదిలితే హాలు ఆ చివర నుంచి ఈ చివరకు తెలిసిపోతుంది. అంటే ఒక వ్యక్తి ఉచ్వాస వాయువు క్షణక్షణానికి హాల్ మొత్తం నిండిపోతుందన్నమాట.అటువంటి వందలాది మంది ప్రయాణించే బస్సు, రైళ్లలో, సినిమా థియేటర్లలో..మన చుట్టూ ఎందరి ఎంగిలి వాయువులుంటాయి.. తలచుకుంటేనే అదోరకంగా ఉంటుంది. కానీ గాలికి రంగు, వాసన ఉండవు కాబట్టి ఏ అరమరికలు లేకుండా, అబ్బే అనుకోకుండా హాయిగా, స్వేచ్ఛగా శ్వాసిస్తూ బతుకుతున్నాం..
స్పాట్
మన నాసికా రంద్రాలకు కూడా స్పర్శ తెలియనంత నిదానంగా శ్వాసిస్తం మనం. అలా వదిలిన వాయువులే హాల్ నిండిపోతే మన కండరాల శక్తి మొత్తం ఉపయోగించి విడుదల చేసే వాయువుల్లో అంటే..బలంగా తుమ్మే తుమ్ములో ఉన్న వైరస్ సహిత వాయువు ఎంత దూరం విసరబడుతుందో తెలుసా..ఒక్కసారి బలంగా తుమ్మితే దాని ప్రభావం కొద్ది క్షణాలలో 40 మీటర్లు విస్తరిస్తది. ఈ వాయువుల్లో జలుబును కలుగజేసే ఇన్ఫ్లోయేంజా వైరస్లు కొన్ని కోటానుకోట్లు ఉంటయి. ఇవి మన కంటికి కనిపించవు. మనం పీల్చే గాలిలో ఇవి ఉంటయని మనం కనీసం ఊహించే అవకాశం కూడా ఉండదు. మన ఎంత బిజీగా మన పనిలో మునిగి పోతమే ఈ వైరస్లు కూడా అంతే బిజీగా మనలోకి చొచ్చుకోని వస్తయి. మనం చేసే ప్రతి పనిలోనూ ఇవి మేమున్నామంటూ ఆవరిస్తయి. ఇవేవి విక్స్ మూత తీసే వరకు మనకు తెలీదు. మన ముక్కు మన చేతికి పని చెప్తే గానీ అప్పడు నీరు పడలేదనో, ఎలర్జీ అనో సరిపెట్టుకుంటం.
స్పాట్
ఈ మైక్రో ఆర్గానిజం అప్పటికప్పుడు తమ ప్రతాపం చూపకపోయినా..గాలిలో నుంచి మన చుట్టూ ఉన్న వస్తువుల పై తిష్టవేసి ఏదైనా ఆతిధేయి దొరికేవరకు అలాగే నిరీక్షిస్తయి. ఈ మైక్రోమ్ల మీద చేయి వేసినపుడో, లేదా మన శరీర బాగం ఇవి ఉన్న చోట తాకినా ఇవి మన చుట్టాలవుతయి.మనలో బాగమై మన ఇంటిలో వారికీ అంటుకుంటయి.
స్పాట్
ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధిగా జలుబు నమోదయింది. ఇంత చేసి జలుబును ఓ కామన్ కాఫ్గా ట్రీట్ చేసి లైట్ తీసుకుంటున్నరు. ఇది పెద్ద ప్రమాదకారి కాకపోవడం వల్ల ఇబ్బంది లేదు. కానీ తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఇది పెద్ద పెద్ద వ్యాదులు కలగ జేసే మైక్రోమ్లకు వాహకంగా కూడా పనిచేస్తది.
స్పాట్
సెకండ్ యాంకర్ బ్రేక్
సూర్య ప్రళయం.. సన్స్ స్పాట్స్ నుంచి రిలీజ్ అయ్యే మాగ్నటిక్ వేవ్స్.. భూమి పై ఉన్న ఎలక్ట్రికల్, ఎలక్ట్రినిక్ వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తది. ఈ భూ అయస్కాంత క్షేత్రం పై కూడా తన ప్రభావం చూపబోతోందని నాసా వెల్లడించింది. ఈ విపత్తు నుంచి సునాయాసంగా మానవాళిని రక్షించే ఓ స్మాల్ సీక్రెట్ సైన్టిస్టుల చేతికి చిక్కింది. ఈ సీక్రెట్ మీ కోసం .. చిన్న బ్రేక్ తర్వాత.
యాంకర్ 3
ఇప్పడు అందరి నోటా వినిపిస్తున్న మాట సూర్యప్రళయం..అవును రానున్న రెండేళ్లలో మనకు సూర్యుడితో ముప్పు వాటిల్లనుందా..ఇదే ప్రశ్న ప్రపంచ మేథావులను సైతం ఆలోచింప జేస్తుంది. ఈ విషయం తెలుసుకునే ముందు అసలు సూర్యుడిలో ఏం జరుగుతుందో దానికీ భూమికి సంబంధం ఏంటో తెలుసుకుందాం..
స్పాట్
ఈ సృష్టి మొత్తాన్ని నడిపే అతీతశక్తి ఏదో ఉంది. మన భూగోళాన్ని కూడా నిత్యం జాగ్రత్తగా కాపాడే అదృష్యశక్తి కూడా ఏదో ఉంది. అది కంటికి కనిపించని రహస్యం. ఆ రహస్యమే ఈ భూమి పై ఉన్న సకల జీవరాశులను నడిపిస్తోంది.
స్పాట్
సూర్యుడు..జీవకోటికి ప్రాణాధారమైన శక్తి ఉత్పాదకారకుడు. సూర్యుడిని దూరం నుంచి చూస్తే..అందంగా అద్భుతంగా కనిపిస్తడు. ఉదయం, సంధ్యలో సూర్యుడిని చూస్తే కాస్త మనశ్శాంతిని పొందేవారు కూడా లేకపోలేదు. కానీ సూర్యుడు మనకు కనిపిస్తున్నంత ప్రశాంతంగా ఉన్నాడా..ఒక్కసారి సూర్యుడి ఉపరితలం పైకి తొంగిచూద్దాం..
స్పాట్
ఇప్పడు మనం చూస్తున్న ఈ భీభత్స దృశ్యం సూర్యుడి ఉపరితలానిదే..సూర్యుడి ఉపరితలం పై నిత్యం కోటాను కోట్ల సౌరతుఫాన్లు విజృంభించి సూర్యుణ్ని అతలాకుతలం చేస్తయి. ఈ సోలార్ సైక్లోన్లు భూగోళం పై కూడా తమ ప్రభావాన్ని చూపుతాయి.. ఈ సౌర తుఫాన్ల ప్రభావం వల్ల భూమి మీద ఎలక్ర్టానిక్, ఎలక్ట్రికల్ వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతయి. ఈ సోలార్ సైక్లోన్లు చిన్నా చితక వైతే వాటితో పెద్ద ప్రమాదంలేదు. శృతి మించితేనే అన్నిటికీ ఇబ్బంది.
స్పాట్
సూర్యుడిలో కొన్ని మిలియన్ల సన్ స్పాట్స్ ఉన్నయి. వీటి నుంచి నిత్యం అత్యంత ప్రభావవంతమైన అయస్కాంత వికిరణాలు విశ్వంలోకి వెదజల్లబడుతున్నయి. రాబోయే రెండేళ్లలో వీటి తాకిడి మరింత పెరగబోతోంది. ఎందుకంటే సూర్యుడికి ఒక వైపు ఎక్కువగా సన్స్పాట్లు ఉన్నయి. మరోవైపు చాలా తక్కువ స్పాట్లు ఉన్నయి. భూమి సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది.అదే సందర్భంలో సూర్యుడు కూడా వేగంగా తిరుగుతున్నడు. సూర్యుడు భూమికి మధ్య ఈ మెగా సన్స్పాట్లు ఉండేటల్లు అభిముఖంగా రావడం చాలా ఏండ్లకు గానీ జరగదు. భూమికి ఈ సన్ స్పాట్లు అభిముకంగా వచ్చినపుడు ఈ సోలార్ డిజాస్టర్లు తప్పని సరి. ప్రతిసారి వీటి ప్రభావం భూమి పై పెరుగుతూ వస్తోంది. ఈ సారి అంటే 2013లో మన భూగోళం వైపు ఈ సన్స్పాట్లు రాబోతున్నయని, వీటి ప్రభావం కమ్యునికేషన్ వ్యవస్థపై తీవ్రంగా ఉండబోతోందని నాసా ఇప్పటికే తేల్చి చెప్పింది.
స్పాట్
ఈ సోలార్ మాగ్నటిక్ సైక్లోన్ వల్ల భూమి పై ఉన్న ఎలక్ర్టికల్, ఎలాక్ట్రానిక్ వ్యవస్థను దెబ్బతీస్తుంది. అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలను కూడా డామేజీ చేసే శక్తి ఈ సోలార్ సైక్లోన్కుంది.
యాంకర్
మానవాళి ముందుగా మేల్కోక పోతే ఈ సన్ డిజాస్టర్ వల్ల విపరీత పరిణామాలు ఎదురయి, పరిస్తితి మన చేయిదాటిపోయే అవకాశం ఉంది. భూ ధృవాలనే మార్చేయగల శక్తి ఈ సౌర తుఫాన్ కు ఉంది. భూ గమనాన్ని మార్చేసి రుతువులను, కాలాన్ని తిప్పిరాయగల శక్తి ఈ సోలార్ మాగ్నటిక్ వేవ్స్కుంది. ఈ సోలార్ డిజాస్టర్ను శాస్ర్తవేత్తులు ఎదుర్కొంటారా..అయితే ఎలా..తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం..
బ్రేక్
యాంకర్
సన్ స్పాట్స్ రిలీజ్ చేసే మాగ్నటిక్ వేవ్స్ వల్ల ఈ భూగోళానికి, సమస్త మానవాళికి ముప్పు వస్తదని శాస్ర్తవేత్తలు విశ్లేషిస్తున్నరు. మరి ఈ విపత్తు నుంచి మనల్ని మనం కాపాడుకోలేమా..నిజంగా సూర్యుడి వల్ల అంతటి ప్రమాదం రానున్నదా అంటే శాస్ర్తవేత్తల వద్దకూడా స్పష్టమైన సమాధానం లేదు..కానీ అటువంటిదే జరిగితే మానవాళిని కాపాడేందుకు ప్రపంచ శాస్ర్తవేత్తలు ఇప్పటినుంచే ప్రయత్నం చేస్తున్నరు. అంత శక్తివంత మైన సూర్యుడి తాపం నుంచి ఎలా రక్షిస్తారో..ఒక్కసారి చూద్దాం.
స్పాట్
సూర్యుడు అత్యంత శక్తి వంతమైన నక్షత్రం. సమస్త మానవాళికి అదే జీవనాధారం. సూర్యుడిలో నిత్యం కొన్ని మిలియన్ టన్నుల హీలియం వాయువు మండి మనకు ఈ వేడిని పంచుతయి. ఈ నక్షత్రంలో నిత్యం కోట్లకొద్దీ ఆటంబాంబులు పేలినంత శక్తి విడుదలవుతది. న్యూక్లియర్ ఫిజన్ అనే ప్రక్రియ ద్వారా శక్తి విడుదలవుతది. ఆ ఫిజన్ ప్రాజెస్లో హైలీ ఫ్రీక్వెన్సీ ఉండే రేడియేషన్ రిలీజ్ అవుతది. ఈ రేడియేషన్ వేవ్స్ సన్స్ స్పాట్స్ ద్వారా విశ్వంలోకి వెదజల్ల బడతయి. దీని ప్రభావం సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహాల పై పడుతది. భూగోళాన్ని మాత్రం ఓజోన్ పొర కొంత మేర ఈ రేడియేషన్ వికిరణాల నుంచి కాపాడుతుంది. తర్వాత ఈ నవగ్రహ కూటమికి కేంద్రమైన సూర్యుడి మచ్చల నుంచి నిత్యం అయస్కాంత క్షేత్రాలు విడుదలవుతయి. ఈ ప్రక్రియ నిత్యం జరిగేదే అయినా సూర్యుడికి ఉన్న పెద్ద మచ్చల ద్వారా ఇది ఎక్కువగా జరుగుతుంది. ఇప్పడు రానున్న రెండేళ్లలో భూమి వాటికి అభిముఖంగారాబోతుంది. అందుకే ఈ ఆందోళన. కానీ శాస్ర్తవేత్తలు మాత్రం అంతగా భయపడే పనిలేదని ఓదారుస్తున్నరు. ఈ మాగ్నటిక్ వేవ్స్ను మాకొదిలేసి గుండె పై చేయివేసుకొని నిబ్బరంగా నిద్ర పొమ్మని ఆభయం ఇస్తున్నరు.
స్పాట్
సూర్య ప్రళయం నుంచి తప్పించుకునేందుకు ఉన్న ఉపాయం ఒక్కటే. తేనెటీగలు దాడి చేసేటపుడు నీళ్లలో మునిగి తప్పించుకోవడంలాటిదన్నమాట. సూర్యడి నుంచిమాగ్నటిక్ వేవ్స్ రిలీజ్ అయ్యే సమయాన్ని గుర్తిస్తే విపత్తును సగం ఎదుర్కొన్నట్టే. ఈ వేవ్స్ రిలీజ్ అయ్యే సమయాన్ని గుర్తించి టెక్నికల్ అండ్ కమ్యునికేషన్, ఎలక్ట్రికల్ వ్యవస్థలను స్తంభింప చేయాలి. నిస్తేజమై ఉన్న వ్యవస్థలను ఈ రేడియేషన్ ఏమీ చేయదు. కాకుంటే బ్రేకింగ్ న్యూస్ కాస్తలేట్ గా చేరతయి. అనధికార కోత కాకుండా కొన్ని రోజులు అధికార కోతను భరించాల్సి వస్తది. అంతే ఆ రేడియేషన్ వేవ్స్ దాటిపోయాక మళ్లీ పన్నెండు సంవత్సరాల తరువాత ఇదే టెక్నిక్ని మరిత డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఈసారి మరింత రేడియేషన్ పెరగొచ్చని ఖగోళ శాస్ర్తవేత్తల అంచనా.
యాంకర్
ఓకే..మాగ్నటిక్ వేవ్స్ వచ్చేటపుడు కమ్యునికేషన్ సిస్టంను స్థంబింప చేయడం వరకు టెక్నిక్ బాగానే ఉంది. కానీ అది గుర్తిండం ఎలా. సూర్యుడ మామూలు గ్రహం కాదు నిత్యం చూస్తూ కూర్చోడానికి. భగభగా మండుతున్న నక్షత్రం. ప్రత్యేకంగా ఇదే పని కోసం ఎవరో ఒకరు నిఘా పెట్టికూర్చోవాలి. ఇంతకీ ఎవరా ఒక్కరు.
స్పాట్
ఇదిగో ఇక్కడ కూర్చున్న ఖగోళ మేథావుల గ్రూపు సూర్యుడి నుంచి భూమిని రక్షించే పనిలో నిమగ్నమై ఉన్నరు.
…..
ఈ పరికరం సూర్యుడి పై డేగ కన్నేసేందుకు రూపొందించినది. 93 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న సూర్యడి మచ్చలపై ఇదినిఘా నేత్రం. మొట్టమొదటిగా ఇది సైన్స్ చరిత్రలోనే కొత్త అధ్యాయం. అయితే ఇది మన కంటికి కనిపించని సూక్ష్మ రహస్యాలను అధ్యయనం చేయగల శక్తి గలది.
..
ఈ బెలూన్ స్పెషల్ ఎయిర్తో నిపుతరు. ఈ వాయువు హైడ్రోజన్ కన్నా తేలికయినది. ఈ మొత్తం నిర్మాణం తయారు చేసేందుకు సుమారు 85మిలియన్ డాలర్ల ఖర్చయింది. కరెక్ట్ యాంగిల్లోకి రాగానే బెలూన్కు కట్టిన మిషన్తో సహా వాతావరణంలోకి వదుల్తరు. ఈ బెలూన్ వ్యాసార్ధం ఎంత పెద్దదంటే భూమి పై పరిస్తే ఆరు ఎకరాలకు సరిపడా ఉంటది. ఇది నిముషానికి 1000 అడుగుల వేగంతో పైకి ఎగురుతది. ఈ బెలూను -90డిగ్రీల ఉష్ణోగ్రత వరకు ఇదే వేగంతో ఎగురుతది.
స్పాట్
ఈ మిషన్లో ఉన్నటెక్నాలజి ఎంత అడ్వాన్సుడంటే 700 మీటర్ల వ్యాసార్ధం ఉన్న వైడ్ షాట్లో ఉన్న పిన్ పాయింట్ ను కూడా పెద్దగా, స్పష్టంగా చూపించి విశ్లేషించగల శక్తి కలది.
స్పాట్
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న నల్లని మచ్చలే సన్ స్పాట్స్. వీటిపై మిషన్ నిఘానేత్రం వేసి ప్రతిక్షణాన్ని గుర్చించి ఉంచుతది.సన్ స్పాట్స్ నుంచి రిలీజయ్యే ప్రతి రేడియేషన్, మాగ్నటికట్ వేవ్స్ ను గుర్తించి ఎప్పటికప్పడు భూమి పై శాస్ర్తవేత్తలకు పంపుతది. ఆ ఒక్కటి చాలుజ సూర్యుడి ఉపద్రవం నుంచి భూమిని రక్షించడానికి..

ఎండ్ యాంకర్
ఇవీ..ఈ వారం ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ మైక్రోస్కోపిక్ సీక్రెట్స్.మరిన్ని సూక్ష్మరహస్యాలతో మళ్లీ నెక్ట్స్ సాటర్ డే ఇదే సమయానికి మీటవుదా..అంటిల్ దెన్ బై..బై

ది స్సు

ఎ.జనార్దన్
ఇంట్రో యాంకర్
నాలెడ్జ్ ఈజ్ పవర్... సైన్స్ నాలెడ్జ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఆ పవర్ మీకందించే దిసైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్కు స్వాగతం.
బ్యాంగ్
ఆకాశం చీలి రెండుగా విడిపోతున్నట్టు కనిపించే మెరుపులు.మిన్ను విరిగి మీద పడ్డట్టు పెళపెళమంటూ ఉరుములు, ఒక్క చిన్న బాంబ్ రాతిఫలకలను పేల్యేయడం వెనక రహస్యాలు తెలసుకునే ముందు గతవారం చూసిన సూక్ష్మరహస్యాలను ఒక్కసారి చూద్దాం.
రీ కాప్
స్పీడ్ యుగం..ఇప్పుడు మనకు ప్రతిదీ ఫాస్ట్ గా కావాలి..బైక్ నడిపినా స్పీడే..మాట మాట్లాడినా స్పీడే..ఆఖరుకు అన్నంతినడం కూడా స్పీడే. ఈ స్పీడ్ మనం ప్రకృతిని చూసి నేర్చుకున్నదే. ప్రమాదమని తెలిసినా మనకుస్పీడంటే అంత థ్రిల్లెందుకు. స్పీడ్ లో ఉన్న సీక్రెట్ మీకోసం.
స్పాట్
మన చుట్టూ పరిసరాలలో కొన్ని చర్యలు మనల్సి అబ్బురపరిచేంత వేగంతో జరుగుతయి. వాటిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా, అసలెందుకిలా జరుగుతుందని పరిశీలించాలన్నా సాధ్యం కానంత స్పీడ్గా జరుగుతుంటయి. వాటిలో ఏం జరుగుతుందో పరిశీలించాలంటే చర్యావేగం తగ్గించాలి.అప్పుడు దాన్ని నిశితంగా పరిశీలించ వచ్చు. కానీ చర్య వేగాన్ని తగ్గిస్తే ఖశ్చితత్వం దెబ్బతింటది. అప్పుడు వాస్తవానికి, పరిశీలనకు పొంతన లేని పరిశీలన వస్తుంది.
స్పాట్
వేగంగా జరిగే పనులను రికార్డ్ చేసి ఏం జరుగుతుందో గమనించే టెక్నాలజి ఇప్పటి వరకు లేక పోవడంతో పరిశోధకులు సైతం చేతులెత్తేసి ఊహాగానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. రుజువులకు సైద్దాంతిక పరమైన వివరణలు ఇవ్వవలసి వచ్చింది. కానీ ఇప్పడా పరిస్థితి మారింది. ఒక్క నానో సెకన్లో కూడా ఏం జరుగుతుందో రికార్డ చేయగల టెక్నాలజి అందుబాటులోకి వచ్చింది.
స్పాట్
ఒక్క సెకన్ లో కొన్ని కోట్ల కదలికలు జరుగుతాయి. ఇటువంటి వాటి ధర్మాలు మొత్తం వీటి కదలికల్లోనే ఆధారపడతయి.వీటి నిజ స్వరూపం తెలుసుకోవాలంటే, అడ్వాన్స్ డ్, హైస్పీడ్ అండ్ వెరీ స్లో షట్టర్ కెమేరా కళ్లతో చూస్తే గానీ అసలు రహస్యం తెలీలేదు.
స్పాట్
కనురెప్ప కొట్టేంత స్పల్పకాలంలో ఏం జరుగుతుందో స్పష్టంగా రికార్డ్ చేసే టెక్నాలజి మన ముంగిలిలోకి వచ్చింది. అందుకే అతి సూక్ష్మ చర్యలను కూడా అధ్యయనం చేయడం సాధ్యమయింది.
స్పాట్
కాయ కొట్టడం, బుడగలు, పేస్ట్
రెప్పపాటు వేగం..అంటే 50 మిల్లీ సెకన్ లు, ఈ కాలంలో కూడా జరిగే పనిని కూడా పరిశీలించగల టెక్నాలజి ఇప్పడు అరచేతిలోకి వచ్చింది. కానీ మానవ మేథస్సు 150 మిల్లీ సెకన్లో కొన్ని వేల ప్రతిచర్యలు జరుపుతది. వాటన్నిటినీ మానవ నేత్రంతో గుర్తించడం కష్టం. బెలూన్ కింద పడి ఎగిరితే కనీసం అది ముడతలు పడుతుందని కూడా ఆలోచించం. (బెలూన్)
స్పాట్
ఇది .. అదృష్య చర్యలకు నిలయమైన ప్రపంచం. ఇక్కడ అన్నీ వేగంగా జరిగిపోతయి. రెప్పపాటులో జరిగే వాటిని అసలు పట్టిచ్చుకోం.. ఇక్కడకు వచ్చే వారంతా స్పీడ్ ను థ్రిల్ చేసేవారే..
(ఫ్లైట్, జైంట్ వీట్, బాంబ్ బ్లాస్ట్, వాటర్)
ఈ సృష్టిలో స్పీడ్ కు చాలా ప్రాధాన్యత ఉంది. అంతెందుకు కొన్న పనులు స్పీడ్గా చేస్తే తప్పకావు. అంతెందుకు శిలీంద్రాలు తమ స్పోర్స్ ను కూడా వేగంగా విడుదల చేస్తయి. లేకుంటా అవి వ్యాపించడం చాలా కష్టం. అవి ఉన్న చోటు నుంచి అత్యంత వేగంగా విసిరితేనే దూర ప్రాంతాలకు వ్యాపించబడుతయి. కానీ ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే ప్రతి కదలికా మనకు తెలిసి ఉండాలి. అందుకే దీన్ని రికార్డ చేయగలిగితే ప్రతి సూక్ష్మ అంశాన్ని పరిశీలించగలం.
యాంకర్.
ఇప్పడొచ్చిన కొత్త టెక్నాలజి కెమెరాలతో అదృష్య ప్రపంచాన్ని సదృశ్యం చేయగలుగుతున్నాం. మన కంటికి కొంత పరిమితి ఉంది. అంతకు మించి వేగంగా జరిగే చర్యలను కనుపాప స్పష్టంగా గుర్తించలేదు. అందుకే ఇంతకాలం ఆకాశంలో వెలుగులు చిమ్మే మెరుపుల వెనక ఏంజరుగుతుందో తెలుకోలేకపోయాం. కానీ అడ్వాన్స్ డ్ క్యామ్ లు ఈ పనిని చాలా సులువుగా చేసిచూపాయి. ఆ వండర్ థండర్ సీక్రెట్...
(ఉరుము పడే సౌండ్)
ఆకాశాన్ని అతలాకుతలం చేసే ఉరుములు, మెరుపులు, రెప్పపాటులో ఆకాశాన్ని ఆవరించే తెల్లని చారికలు. భయాన్ని, ఆనందాన్ని ఒకేసారి కలుగ జేసే ఆకాశముగ్గులు.అమెరికాలో ఏటా కొన్ని వందల పిడుగులు భవనాలను తాకి విధ్వంసాన్ని సృష్టిస్తయి. మరి వీటివెనక ఉన్న సీక్రెట్ ఏంటో హైడిఫినేషన్ కెమేరాలలో బంధించేందుకు బయలు దేరారు శాస్ర్తవేత్తలు.
స్పాట్ (శాస్ర్తవేత్తలు కారులో వెళ్లే సీన్)
మెరుపు…ఆకాశంలో ఓ అద్భుతం..రెండు విరుద్ద ఆవేశాల మధ్య ఏర్పడే విద్యుద్ఘాతం. వెలుతురుతో చూడ్డానికి అందంగా ఉన్నా, ఆ వెంటనే కర్ణకఠోరంగా వినిపించే ఉరుము శబ్దమే భయపెడుతది.
స్పాట్ ( ఉరుములు మెరుపులు స్పాట్ ఆంబియన్స్)
ఈ స్లో మోషన్ కెమెరాలతో ఈ మెరుపు వెనక రహస్యం ఛేదించడం సులభసాధ్యమయింది. ఈ స్పెషల్ కెమెరాలు, అసలు వేగం కంటే 300రెట్లు స్లోమోషన్ కాప్చర్ చేయగలవు.
స్పాట్
మొదట్లో మెరుపంటే కేవలం ఒక కాంతి లాగానే భావించారు. కానీ స్లో మోషన్లో గమనిస్తే మెరుపు మర్మాన్ని పసిగట్టారు.
స్పాట్
ఇది భూమి నుంచి ఆకాశానికి విస్తరిస్తున్న స్పార్క్. ఈ స్పార్క్ కు మిలియన్ ఓల్టేజీల శక్తి కలదు. దీని మధ్య బాగంలో సూర్యకేంద్రంలో విడుదలయ్యేంత శక్తి విడుదలవుతది.
స్పాట్
ఇప్పటి వరకూ మెరుపంటే రెండు మేఘాల మధ్య జరిగే విద్యుదావేశ చర్యగా భావించారు శాస్ర్తవేత్తలు. అతి తక్కువ పీడనంలో మేఘం భూమితో జరిపే విద్యుత్ చర్యను పిడుగుగా భావించేవారు. అంటే పిడుగు ఆకాశం నుంచి భూమి పై ఉన్న ఎత్తేన ప్రదేశాల పై అంటే భవనాలు, టవర్లు, చెట్ల పై పడుతుందని శాస్ర్తవేత్తలు భావించేవారు. కానీ భూమి నుండి పిడుగు ఆకాశానికి దూసుకెళుతుందన్న సత్యాన్ని రుజువు చేసింది అడ్వాన్స్డ్ టెక్నాలజి. మెరుపు వేగాన్ని విశ్లేషించాలంటే మాటలా..అందుకే.. మేఘం నుంచి కిందికి వచ్చే మెరుపుకంటే భూమి నుంచి ఆకాశానికి ఎగసే మెరుపుకే ఎక్కువ శక్తి ఉంటది అనే సత్యం ఈ స్లోమోషన్ టెక్నాలజి ద్వారా రుజువయింది.
స్పాట్
ఒక్కోసారి ఈ మెరుపు కొన్ని సెకన్ల పాటు నిలకడగా ఆకాశానికి నిచ్చన వేసినట్టుండి శాఖోపశాఖలుగా విస్తరిస్తది. ఆ శాఖలు మరిన్న ఉపశాఖలుగా చీలి ఆకాశాన్ని ఆవృతం చేసినా ..మెయిన్ స్ట్రిప్ మాత్రం కొన్ని సెకండ్ల పాటు బ్లింక్ మోడ్ లో అలాగే ఉండి వెలుతురు పంచుతది.
స్పాట్
ఒక్క మెరుపులో బిలియన్ వాట్ల విద్యుత్చ్ఛక్తి విడుదలవుతది. ఇది భూమి పై పడ్డ చోట ఏది ఉన్నా మాడి మసయిపోవాల్సిందే. పిడుగు ప్రభావాన్ని బట్టి పెద్ద భవనాలయితే పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతింటయి. పెద్ద పెద్ద భవనాలు, కంపెనీలు ఈ పిడుగు బారి నుండి రక్షించుకునేందుకు లైటనింగ్ కండక్టర్లు వాడుతరు.
బ్రేక్ యాంకర్
ఆకాశంలో మెరుపులే కాదు. తారాజువ్వలు తళుక్కుమన్నా పెద్దవాళ్లు కూడా పసిపిల్లలై పోతరు. ఆ మతాబుల మాటున ఉన్న మతలబు ఏంటో మనకు తెలీదు. ఈ టపాకాయల్లో ఉన్న మిల్లీగ్రాం కెమికలే అంత ప్రభావం చూపితే..డిటోనేటర్లు పేలినపుడు ఎలా ఉంటుంది. మందుపాతరల మాటున రహస్యం ఏంటి..తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.
యాంకర్
గ్రానైట్ క్వారీలలు, ఐరన్ ఓర్ క్వారీలలు, సింగరేణి ఓపెన్ కాస్టులు నిత్యం బాంబుల మోతతో హోరెత్తి పోతయి. పిడికెడి కెమికల్ పర్వతాలను కూడా పిండిపిండి చేయగలవు. వీటికి అంతటి శక్తి ఎక్కడిది. బాంబ్ బ్లాస్టింగ్ ల వెనక ఉన్న మైక్రోస్కొపిక్ సీక్రెట్ మీకోసం.
వాయిస్
ఆకాశంలో విరబూసి మాయమవుతున్న ఈ తారా జువ్వలను చూడండి ఎంత అందంగా ఉన్నయో. మనకు ఇంత ఆనందాన్ని పంచే ఈ మతాబుల వెనక ఉన్న మతలబు చిటికెడు కెమికల్. ఈ చిచ్చుబుడ్డిని చిచ్చుపిడుగును చేసేది కూడా కాసింత కెమికలే. ఈ చిటికెడు కెమికల్ ఇంత వేగంగా పేలితే మరి భారీ డంప్ లో ఉన్న కెమికల్ ఎలా పేలిపోతుంది..ఒక్కసారి చూద్దాం..
స్పాట్( బ్లాస్టింగ్)
ఇక్కడ వీళ్లు చేసే హడావుడి చూస్తున్నారుగా..వీరు ఈ క్వారీలో ఉన్న మట్టిని తొలగించేందుకు డిటోనేటర్లను అమర్చి, పేల్చేందుకు సిద్ధం చేస్తున్నరు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వాల్ లో 20 వేల టన్నుల వెయిట్ ఉండే రాతిఫలకలున్నయి. ఈ రాతిని చీల్చి మైన్ ను వెలికితీసేందుకే ఈప్రయత్నం. దీన్ని పేల్చేందుకు 20 ప్రత్యేక రంధ్రాలు చేసి అందులో పేలుడు పదార్ధాలు నింపుతరు. ఒక హోల్ నుంచి ఇంకో హోల్ కు పవర్ పాస్ కావడానికి 20 మిల్లీ సెకన్ల సమయం మాత్రమే పడుతది. అంటే ఆఫ్ సెకన్లోనే అన్నిటికి పవర్ పాసై ఒకేసారి పేలుతయన్నమాట. నిజానికి ఒక్కసారి పేలినట్టు అనిపించినా.. ఇవ్నీ వేరువేరుగా పేలుతాయన్న సూక్ష్మ రహస్యం నిశితంగా పరిశీలిస్తే మాత్రమే తెలుస్తది.
స్పాట్
ఇక్కడ అమర్చిన 20 డిటోనేటర్లలో ఒక డిటోనేటర్ పేలిన తర్వాత దాని షాక్ పక్కనున్న రాక్ పై పడి ఆ రాక్ లూజ్ అవుతది. అంటే రెండవ బ్లాస్ట్ కు లూజ్ సాయిల్ ఉంటది. ఇలా ప్రతి బ్లాస్టింగ్ దానికంటే ముందు బ్లాస్టింగ్ వల్ల లూజ్ అయిన సాయిల్ ను ఈజీగా పేల్చే అవకాశం ఉంటది.
స్పాట్
ఒక్క పేలుడుతో 20వేల టన్నుల రాళ్లు సెకన్లో కప్పకూలిపోయింది.
స్పాట్(బ్లాస్టింగ్ రివర్స్ సీన్)
ఇప్పుడీ పేలుడు ఎలా జరిగిందో చూద్దాం..
స్పాట్ (బ్లాస్టింగ్ స్లోమోషన్ సీన్స్ తో)
ఇలా రాక్ వాల్ పై కనిపించే ఫ్లాష్లు, డిటోనేషన్ కేబుల్లో ఎలక్ట్రికల్ రియాక్షన్ స్పార్క్. ఇది మన స్లో మోషన్లో చూస్తేనే స్పార్క్లు ఇంత స్పీడ్ గా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ మొత్తం చర్య పూర్తి కావాడానికి పట్టేకాలం కేవలం 25మిల్లీ సెకన్లు మాత్రమే.
స్పాట్
చూశారా ..ఈ బ్లాస్టింగ్ ముందు ఎటువైపు నుంచి ప్రారంభమయిందో..ప్రతి మిల్లీ సెకన్ను రికార్డు చేసి చూస్తే గానీ అసలు విషయం అర్ధం కాదు. మన మామూలు కంటితో చూస్తే అన్నీ ఒకేసారి పేలినట్టనిపిస్తది.
స్పాట్
భూ అంతర్భాగంలో ఉన్న షాక్ వేవ్స్ ఒక చోటు నుంచి మరో చోటుకు రెప్పపాటు కాలంలో పయనించి, టన్నుల కొద్దీ రాక్ సాయిల్ ని కుప్పపోస్తది.
బ్రేక్ యాంకర్
చూశారుగా ఒక్క బటన్ ప్రెస్సింగ్ తో నిలువెత్తు రాతిగోడ క్షణాల్లో కూలిపోయింది. ఈ బాంబులకు ఇంత పవర్ ఎక్కడిది. బ్లాస్టింగ్ వేవ్స్ ఎలా మూవ్ అయితాయో తెలుసుకునేందుకు శాస్ర్తవేత్తులు పెద్ద ప్రయోగమే చేసిండ్రు. ఈ ప్రయోగ విశేషాలు చిన్న బ్రేక్ తరువాత..
యాంకర్
కాసింత కెమికల్ క్షణాల్లో పెద్దపెద్ద పర్వతాలను సైతం పెకిలించగలదు. వేయి మంది ఒక రోజంతా చేయగల పని ఒక్క బాంబ్ క్షణంలో చేయగలదంటే నమ్మరా..మొదట పరిశోధకులు కూడా నమ్మలేదు ప్రయోగం చేసి రుజువు చేసుకునేదాకా..ఇదిగో ఇలా.
స్పాట్
ఒక చిన్న ట్రిగ్గర్ బలమైన బ్లాస్టింగ్ సృష్టిస్తది. రెప్పపాటు కాలంలో అసలేం జరుగుతుందో తెలుసుకునేలోపే మిన్ను విరిగి మీద పడ్డంత శబ్దంతో పేలుతుంది.ఈ ప్రేలుడు జరిగేటప్పుడు అసలేం జరుగుతదో తెలసుకునే అవకాశం ఉండదు. అందుకే ఈ బ్లాస్టింగ్ ను సూపర్ స్పీడ్ కెమెరా కళ్లతో బంధించి ప్రతి మిల్లీ సెకన్ను స్టడీ చేస్తే బ్లాస్టింగ్ లో దాగిన సీక్రెట్ బ్లాస్ట్ అయింది.బ్లాస్టింగ్ ఎలా జరుగుతది..దాని వేవ్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతయి అనే విషయాలు స్పష్టంగా తెలిసింది.
స్పాట్
ఈ బ్లాస్టింగ్ ప్రయోగం చేయడానికి శాస్ర్తవేత్తల బృందం బయలుదేరింది.
స్పాట్
ముందుగా భారీ విస్పోటనానికి సరిపడా గన్ పౌడర్ ను ఒకస్టీల్ డబ్బాలో నింపారు. ఆ స్టీల్ టిన్ కు ఎలక్ట్రికల్ ఇగ్నిషన్ ఫీజు అమర్చిండ్రు. తర్వాత ఈ ఎలక్ర్టికల్ కేబుల్ను సుమారు అర కిలోమీటర్ దూరం వరకు లాగిండ్రు. ఆ ప్రాంతం నుంచి టీం మొత్తం దూరంగా వెళ్లిపోయారు.
స్పాట్( టీం దూరంగా వెళ్లే షాట్)
బ్లాస్టింగ్ స్పెషలిస్ట్ లు మాత్రం అక్కడే ఉన్నరు. వీరు షాక్ ప్రూఫ్ వెహికిల్లో కూర్చొని బాంబ్ని బ్లాస్ట్ చేస్తరు.
స్పాట్( కౌంట్ డౌన్ చేస్తూ బాంబ్ పేల్చే సీన్)
చూశారుగా ఒక్క సెకన్ లోపే బటన్ ప్రెస్ చేయడం బాంబ్ బ్లాస్ట్ కావడం జరిగింది. అసలేం జరిగిందో పరిశీలించే లోపే గన్ పౌడర్ పేలి గాలిలో కలిసిపోయింది. ఈ మొత్తం పనిని కెమెరాలో బంధించి నిశితంగా పరిశీలిస్తే బాంబ్ ఎలా పేలిందో తెలుస్తది. ఇప్పుడు ఈ విజువల్ ను 100 రెట్లు స్లోమోషన్లో చూద్దాం..
స్పాట్(బ్లాస్టింగ్ రివర్స్ సీన్ వాడుకోవాలి)(4,3,,2,1 కౌంట్ డౌన్ కూడా)
ఇదిగో ఇక్కడ బ్లాస్టింగ్ స్పెషలిస్ట్ బటన్ ప్రెస్ చేయగానే కేబుల్ వైర్ ద్వారా ఎలక్ట్రిక్ పవర్ సప్లై అవుతది. బటన్ నొక్కిన సెకన్లో 1000వంతు టైంలో బాంబ్ కు అమర్చిన ఇగ్నిషన్ యాక్టివేట్ కావడం, బాంబ్ పేలడం జరుగుతుంది.
స్పాట్ ( మళ్లీ బాంబ్ పేలేసీన్లు)
సెకన్లో మిలియన్ వంతు కాలంలో ఘన పదార్ధంగా ఉన్న గన్ పౌడర్ వాయుపదార్దంగా అనంత వాయువుల్లో కలిస్తది.
స్పాట్( బాంబ్ పేలే సీన్ )
ఇప్పుడు స్పష్టంగా పరిశీలిస్తే..బాంబ్ షాక్ వేవ్స్ ఎలా విస్తరిస్తున్నాయో స్పష్టంగా కనిపిస్తది. చూడండి ..బ్లాస్టింగ్ ని ఆవరించి ఒక ఆవిరిలాంటి పొర పైపైకి వెళ్తున్నది. వాస్తవానికి అది ఆవిరి పొర కాదు. బ్లాస్టింగ్ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సెకన్లో మిలియన్ వంతు కాలంలో ఫోర్స్ బుల్ గా ఒకే సారి నెట్టేయడం వల్ల...పెద్దశబ్దంతో బాటు..షాక్ వేవ్స్ వస్తయి. ఒక్క క్షణంలో బాంబ్ చుట్టూ ఉన్న 300మీటర్ల పరిధి విస్తీర్ణం భస్మీ పటలం అవుతుంది.
స్పాట్
ఎండ్ యాంకర్
ఓకే ఫ్రెండ్స్. ఇవీ ఇవారం సైన్స్ విశేషాలు. మరిన్ని మంచి విషయాలతో ఇదేవారం ఇదే సమయానికి మీ ముందుంటా. అంటిల్ దెన్ బైబై

(బాంబ్ బ్లాస్టింగ్ షాట్స్)
గతవారం రివ్యూ ( దీన్ని న్యూస్ ఎక్స్ ప్రెస్ లాగా స్పీడ్ గా చదవాలి)
పెద్ద పెద్ద మంచు పర్వతాలనుంచి సడన్గా మంచు చరియలు విరిగిపడటానికి గల కారణం ఏంటో శాస్ర్తవేత్తలకు చాలా కాలంవరకు అర్ధం కాలేదు. దీనికోసం శాస్తవేత్తల బృందం చేసిన పరిశీలనలో మంచు లోతుల్లో దాగిన రహస్యం తెలిసింది. చిన్న చిన్న ఐస్ ఫ్లేక్స్ కలిసి పర్వతాన్ని ఆవరించి ఒకే మంచు గడ్డలా తయారవుతది. దీనికి కారణం ఐస్ ముక్కల మధ్య హైడ్రోజన్ లాటిస్ బందాలుంటయి. కొంత కాలం తర్వాత ఈ లాటిస్ బందాలు సడలిపోయి అణువుల మధ్య దూరం పెరగ్గానే కొత్తగా ఏర్పడ్డ మంచు లేయర్ మొత్తం పర్వతం నుంచి విడిపోయి ఒకేసారి కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి భీభత్సం సృష్టిస్తయి.
స్పాట్
మనల్ని తరచు బాధ పెట్టే జలుబు మన చుట్టూ ఉన్న గాలిలో నిత్యం తిరుగాడే వైరస్ క్రిముల వల్ల వస్తది. ఒక్కసారి చేసే స్నీజింగ్ సెకన్ కాలంలో 40మీటర్లు వ్యాపించి కొన్ని కోట్ల వైరస్లను వాతావరణంలోకి విస్తరింపజేస్తది.
స్పాట్
రానున్న రెండేళ్లో సన్ స్పాట్ ల నుంచి రేడియోధార్మిక కిరణాలు, మాగ్నటిక్ వేవ్స్ భారీగా విడుదల కాబోతున్నయి.ఇవి భూమి పై ఉన్న ఎలక్ట్రికల్, ఎలక్ర్టానిక్ వ్యవస్థలను చిన్నాభిన్నం చేయబోతోంది. వీటినుండి రక్షణ పొందేందుకు శాస్ర్తవేత్తల బృందం ఒక టెక్నిక్ ను కనిపెట్టింది. ఈ మాగ్నటిక్ వేవ్స్ రిలీజయ్యేటప్పడు అన్ని వ్యవస్థలను నిలుపుచేస్తే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుందని తెలుసుకున్నరు. అయితే ఆ వేవ్స్ రిలీజ్ అయ్యేసమయాన్ని గుర్తించేందుకు ఒక మిషన్ను కేవలం బెలూన్ సాయంతో పైకి పంపించి సూర్యడి పై నిఘా వేశారు.
స్పాట్

ది సైన్సు ఎపిసోడే 2

ఎ.జనార్దన్
ప్రకృతిలో దాగిన సూక్ష్మ రహస్యాలను ఒడిసి పట్టుకొని శాస్ర్తవేత్తలు చేసే అద్భుతాలను మీ కళ్లముందుంచే ది సైన్స్ ప్రోగ్రాంకు స్వాగతం..ఆశ్చర్యచకితులను చేసే నేచర్ సీక్రెట్లతో సూక్ష్మప్రపంచం మరిన్ని విశేషాలతో మీముందుకొచ్చింది. ఈ వారం కొత్త రహస్యాలను తెలసుకునే ముందు లాస్ట్ వీక్ మైక్రోస్కోపిక్ సీక్రెట్లు ఒక్కసారి రివ్యూ చేసుకుందాం..
బ్యాంగ్
వాయిస్
ఈ హరిత గ్రహం పై మానవుడు ఎంతో పురోగతి సాధించాడు. తాను సాధించాల్సినవి ఇంకా చాలా ఉన్నయని, వాటిని సాధించి తీరాలని శతాబ్దాల తరబడి శ్రమిస్తున్నడు. కానీ…తాను కొత్తగా సాధించానని అనుకున్నవన్నీ ప్రకృతిలో అప్పటికే అభివృద్ది చెందని జీవులని పిలిచే సూక్ష్మజీవులు, కీటకాలు, మొక్కలు, జంతువులు, ఒకటేమిటి ప్రకృతిలో అణువణువూ పరిజ్ఞానమే..ఇప్పడు కొత్తవాటిని కనుగొనడంతో బాటు నేచర్ సీక్రెట్లను కూడా అన్వేషించే పనిలో పడ్డడు మానవుడు.
స్పాట్..
చంద్రగ్రహం పై వచ్చిన దుమ్మూ దూళి సమస్యను ఎదుర్కోవడం ఎలాగా అని ఆలోచిస్తున్న మానవుడికి తామరాకు దారి చూపింది..అంతర్నిర్మాణం అధ్యయనం చేయడానికి నానోటెక్నాలజీ ఉపయోగించుకొని సూక్ష్మ రహస్యాలను అన్వేషించడం మొదలు పెట్టిండు మానవుడు. అందులోనే తల వెంట్రుక పై కూడా పేరు రాసే స్ధాయికి చేరుకొండు. నిలువు తలం పై నడిచే బల్లిని చూసి దాని సీక్రెట్ తెలుకున్నడు. తలానికి పాదానికి మధ్య శూన్య ప్రదేశం ఉంటే గ్రిప్ లభిస్తదన్న సీక్రెట్తో సక్కర్లను తయారు చేసిండు. ..
ఇంకా..ఇంకా..ప్రకృతిలో మానవుడి అన్వేషణ కొనసాగుతనే ఉంది.



ఇంట్రో యాంకర్
హంబుల్ బ్రిడ్జ్. ఇంత పెద్ద మానవ నిర్మిత హాంగింగ్ బ్రిడ్జ్. ఎంతో మంది ఇంజనీర్లు, వేలాది మంది శ్రామికులు రేయింబవళ్లు కష్టపడితే ఈబ్రిడ్జి 1981లో పూర్తయింది.ఈ హ్యంగింగ్ బ్రిడ్జ్ ఆలోచన కూడా ప్రకృతి ప్రసాదించిందే..అవును ..ఇలా చూడండి ఈ బ్రిడ్జ్ అంచులో ఉన్న సాలీడుని… ఎంత హుందాగా గూడు కట్టుకొందో…
యాంకర్ 1
స్పైడర్ చాలా తెలివైన కీటకం. ఇక్కడ చూడండి ఓ సాలెపురుగు తన గూడును ఎంత అందంగా, వేగంగా అల్లుకుంటుందో. ముందు నిలువు దారాలను ఆధారాలకు అంటిస్తది. తరువాత ఈ నిలువు దారాలకు బేస్ వేసుకుంటూ అంచులకు వెళ్తది. మళ్లీ అంచుల నుంచి గుండ్రటి వలలాగా అల్లుకుంటూ సెంటర్కు చేరుకుంటది. యస్…సాలీడు ఆయధం తయారయింది. ఇప్పడు ఆ వలలో చిక్కే ఆహారం కోసం ఎదురు చూస్తది.
స్పాట్
యాంకర్ 2
బావుంది..ఈ హాంగింగ్ బ్రిడ్జ్ కట్టడం వెనుక వందలాది మంది ఇంజనీర్ల నైపుణ్యం, వేలాది మంది కార్మికుల శ్రమ ఉంది. చాలా కట్టడాలు స్కిల్డ్ వర్కర్లు నెలల తరబడి కట్టినా నిలువునా ఫెయిలయిన సందర్భాలు కోకొల్లలు. కానీ ఈ సాలెపురుగు ఇంత అందంగా, ఇంత త్వరగా, ఎలా కట్టగలుగుతుంది. దీనికి కావలసిన మెటీరియల్ ఎక్కడిది. ఆ దారానికి అంత బలమెక్కడిది..ఈ మైక్రోస్కోపిక్ సీక్రెట్స్ మీ కోసం..
వాయిస్
సాలీడు..మనం నిత్యం మన ఇళ్లలో చూసి విసుక్కునే ఒక ఆర్ధోపాడ్ జీవి. ఇది పెట్టే బూజు చూసి పదే పదే విసుక్కునే మనం ఆ బూజు రహస్యం తెలుసుకోవాలని ఎన్నడూ అనుకోలేదు. కానీ ఆ బూజే నేడు శాస్ర్తపరిశోధనకు బురుజుగా మారింది. సాలీడులో దాగున్న రహస్యం ఇప్పడు రకరకాల సాంకేతిక పరికరాల తయారీకి పనికొస్తంది. ఇంతకీ ఎంటా సీక్రెట్ అనుకుంటున్నారా…అదే… సాలీడు స్రవించే సిల్క్థ్రెడ్.
స్పాట్
శాస్ర్తవేత్తలు ఒక సాలీడును సేకరించారు…(5 సెకన్స్) . స్పైడర్ గ్రంధుల నుంచి వచ్చే సిల్క్లాంటి దారాన్ని లాగి చూశారు. వండర్ ఎంత సేపటికి ఆగడం లేదు. ఒక సిల్క్ ఫాక్టరీలా దారం అవిచ్చినంగా రావడం శాస్ర్తవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. మొత్తంగా 750 మీటర్ల దారం తెగకుండా వచ్చింది. ఇంత పోడవు దారం నాన్స్టాప్ గా రావడం ఒక వింతయితే..ఆ దారం చాలా బలంగా ఉండటం మరో వింత. ఎక్కడిదీ దారం..సాలీడు గర్భంలో దాగిన నర్మ గర్భ రహస్యం ఏమిటి. పరిశోధనలు మొదలు పెట్టారు శాస్ర్తవేత్తలు.
స్పాట్
ఒక్కసారి సాలీడు అంతరాంగాల్లోకి తొంగి చూద్దాం…ఇక్కడే ప్రకృతి దాచిన నేచర్ నెట్ పురుడు పోసుకునేది. దీన్ని మానవనేత్రంతో చూసి లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా కష్టం. గతంలో ప్రయత్నించి వదిలేశారు కూడా.. కానీ ఇప్పుడు అందుబాలటులోకి వచ్చిన నానో టెక్నాలజి తో ఇది 200రెట్లు సాధ్యమయింది. సాలీడు ఉదర అంతరబాగాన్ని 12000ల రెట్లు మాగ్నిపికేషన్ చేసి చూస్తేగానీ అసలు రహస్యం బోధపడలేదు.. సాలీడు అంతరాంగాల్లో విహరించినంత పెద్దదిగా చేసి పరిశోధించారు శాస్ర్తవేత్తలు.
స్పాట్
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పెద్దబొడిపెల్లాంటి బాగాలను స్టినరేట్స్ అంటరు. ప్రతి స్టినరేట్ పై డజన్లకొద్దీ స్రావక కేశాలుంటయి. ఈ స్రావక కేశాలను స్పికెట్స్ అని పిలుస్తరు. సాలీడు స్రవించే సిల్క్ దారపు రహస్య ద్వారాలు ఇవే..తాను దారం రిలీజ్ చేసేటపుడు అంతఃస్రావీ గంధులు ఎంజైమ్ లను విడుదల చేస్తయి. ఈ ఎంజైమ్ ప్రభావంతో స్పికెట్స్ లిక్విడ్ ప్రోటీన్లను ఫోర్స్తో స్రవిస్తయి. ఇలా ఒకేసారి అనేక స్పికెట్లు దారాలను స్రవిస్తయి. ఇవన్నీ పొరలు పొరలు ఒక కలిసి ఒకే కట్టలాగా తయారయితయి. బయటకు వచ్చేటపుడు ఒకే దారం లాగా కనిపిస్తది. ఈ దారానికి ఇంత పట్టు ఉండటం వెనక ఉన్న గుట్టు ఇదేనని కనిపెట్టారు శాస్ర్తవేత్తలు.
స్పాట్
ఒక్కో స్పైడర్కు 7రకాల దాదాలను ప్రొడక్ట్ చేసే కెపాసిటీ ఉంటది. ఆధారాలను పట్టిఉంచేందుకు ఒకరకం దారాన్ని ఉపయోగిస్తే..వెబ్ ను క్రియేట్ చేసేందుకు మరోరకం దారం ఉపయోగ పడతది. వెబ్ లో చిక్కిన కీటకాన్ని బంధించేందుకు జిడ్డు మాదిరిగా ఉండే మరో రకపు థ్రెడ్ను కూడా రిలీజ్ చేసే శక్తి ఈ సాలీడుకు ఉంటది. చూసీ చూడనట్టు చూసి వదిలేసే మనకు మాత్రం సాలీడు ఒకేరకమైన దారం స్రవిస్తదని అనుకుంటం. ప్రతి దారం కూడా మనం నమ్మలేనంత గట్టిగా ఉంటది. ఈ దారం ఇంత గట్టిగా ఉండటం వెనుక ఓ సీక్రెట్ ఉన్నది. అంతరాంగాల్లోంచి వెలువడే కంటే ముందే ఈ దారానికి సల్ఫైడ్ పూత పూయబడతది. ఆ సల్ఫైడ్ పూతే ఈ దారానికి మరింత పదును తెచ్చిపెడతది. కంటికి కూడా సరిగా కనిపించనంత సన్నగా ఉన్నా దీని బలానికి కారణం పొరలు పొరలుగా ఉండటం, సల్ఫైడ్ పూత ఉండటం మరో అడిషనల్ స్ట్రెంత్. అందుకే ఈ దారాన్ని వైద్యంలో కొన్ని రకాల ఆపరేషన్లలో కుట్లకోసం కూడా ఈ దారాన్ని ఉపయోగిస్తరంటే ఈ దారం ఎంత గట్టిదో తెలుస్తంది.
స్పాట్
బ్రేక్ యాంకర్
సాలీడు స్రవించే దారానికి ఎలాస్టిక్ పవర్ లేదు. అంటే దీనికి సాగే శక్తి తేదన్న మాట. గట్టిగా గుంజితే తెగుతదే తప్ప సాగదు. కానీ సాలీడు కూర్చిన ఆ వలలో ఏదైనా కీటకం చిక్కినా ఆ వల సాగుతుందే కానీ పూర్తిగా తెగదు. సాగే శక్తి లేని దారంతో నిర్మించిన ఈ వల ఎలా సాగుతోంది. కేవలం సాలీడు నేర్పిన ప్రకృతి పాఠంతో మనిషి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారు చేయడం ఎలా సాధ్యమయింది…తెలుసుకునేముందు చిన్న బ్రేక్ తీసుకుందాం..
యాంకర్ 3
వెల్కం బ్యాక్ టు ది సైన్స్ ఎపిసోడ్..ఒకే..సాలీడు దారం స్రవించడమే ఓ పెద్ద వండరనుకుంటే అది దారంతో చేసే విన్యాసాలు మరీ వండర్. ఇప్పడు ఇప్పడుడే నానో టెక్నాలజీతో సాధ్యమవుతుందనుకుంటున్న మైక్రోవీవింగ్ ని సాలీడు జాతి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే చేసి చూపింది..ఇప్పటికీ చూపుతుంది..చూడండి..
స్పాట్
ఇది చినుకులతో ముద్దయిన సాలీడు గూడు. ఈ గూడులో కొన్ని చోట్లనే నీటి బిందువులు ఆగి ఉన్నయి. మొదట ఇది సర్ఫెస్ టెన్షన్ వల్లనే అని భావించారు సైంటిస్టులు..ఆ భావనే చాలా కాలం దీని లోగుట్టు విప్పకుండా ఆపేసింది. కానీ ఓ శాస్ర్తవేత్త రొటీన్ కు భిన్నంగా సెర్చ్ చేశాడు. అంతే సాలీడ్ సీక్రెటే లీడ్ అయింది. గొప్ప అద్భుతం..స్పైడర్ వెబ్లో గూడుకట్టుకున్న రహస్యం గుట్టు రట్టయింది. సాలీడు తాను గూడు అల్లేటప్పుడే జంక్షన్లల్లో దారపు కుచ్చులను వదులుతది. ఇవే షాక్ అబ్జర్వర్స్గా పనిచేస్తయి. ఈ లూజ్ థ్రెడ్ జంక్షన్లే గూడుకు సాగే గుణాన్ని తెచ్చిపెడతయి.
స్పాట్
మెదడు కూడా పూర్తిగా డెవలప్ కాని ఆర్థోపొడా కీటకానికి ఇంత గొప్ప టెక్నికల్ ట్రైనింగ్ ఎవరిచ్చారు…నేచర్లో నిగూఢంగా నిక్షిప్తమై ఉన్న సీక్రెట్…ఈ సీక్రెట్ ఉపయోగించుకొనే ఇప్పడు మనం చూస్తున్న హంబుల్ బ్రిడ్జి నిర్మిచిండ్రు. .అదే స్ర్పింగ్ యాక్షన్, అదే స్ర్టెంథనింగ్, అదే అల్లిక, అవును.. ఆ మైక్రోస్కోపిక్ సీక్రెట్ తోనే ఈ మాక్రోస్ర్టక్చర్ బిల్డప్ చేయగలిగిండ్రు.
యాంకర్ 4
అది గోటితో చీల్చగల పుచ్చకాయ… ఇది రాతిని కూడా చీల్చగల పిస్టల్… దీనితో పుచ్చకాయను పేల్చితే నిండు కుండలా పేలిపోతది.
విజువల్
చూశారుగా ఒక్క చిన్న బుల్లెట్ పుచ్చకాయను చిన్న చిన్న తుంపలుగా పేల్చేసింది. యుద్దాల్లో పాల్గొనే సైనికులకు, శత్రువుల దాడినుండి రక్షించేందుకు బుల్లెట్ల నుంచి రక్షణ పొందేందుకు కావలసిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కావాలి..ఈ జాకెట్ ను దేనితో తయారు చేశారో తెలిస్తే… దీనికి స్పూర్తి ఎవరో తెలిస్తే అవాక్కవడం మీవంతవుతది.
వాయిస్
ఇప్పటి వరకు మనం చూసిన సాలీడు స్రవించే సిల్క్ దారంలో మరో సీక్రెట్ ఉంది.. ఓ ఫిజికల్ ఫార్ములా ఉంది. గడ్డి పోచలన్నీ ఏకమైతే గజాన్ని కూడా బంధించవచ్చనే ఆ ఫార్ములా..అంటే పొరలు పొరలుగా ఉన్న దారానికే బలమెక్కువనేదే ఈ సూత్రం. సాలీడు దేహంలో కూడా ఒక్కో స్పికెట్ ఒక్కో మైక్రోథ్రెడ్ ను స్రవింస్తది. ఇవన్నీ ఏకమై ఒకే దారంగా బయటకు వస్తది. ఆ దారాన్ని మైక్రోస్కోప్కింద పెట్టి చూస్తే కానీ అసలు విషయం తెలీదు. ఇదే ఫార్ములాతో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారు చేసిండ్రు.
స్పాట్
ఈ బుల్లెట్ చూడండి ..ఎంత వేగంగా దూసుకుపోతోందో..అంత స్పీడ్ తో వచ్చే బుల్లెట్ తగిలితే ఈ జాకెట్ తునాతునకలై పోవాలి..కానీ కేవలం నాలుగు సెంటీమీటర్ల రంధ్రం చేసి ఆగిపోయింది. ఈ జాకెట్కు అంత శక్తి ఎక్కడిది..ఈ జాకెట్లో ఉన్న ఫైబర్ దారాలు..ఏ లోహంతో తయారు చేసిండ్రు..ఒక్కసారి చూద్దాం…
స్పాట్
ఇదిగో..ఇక్కడ పొగలాగా కనిపించేది కార్భన్ దారాల కట్ట. అతి సూక్ష్మమైన కార్భన్ ఫైబర్ దారాలను ఏకం చేసి ఒక సన్నని దారంగా తయారు చేస్తరు. ఈ దారం మావనుల వెంట్రుక కన్నా 5 రెట్లు సన్నగా ఉండి…ఇనుము కంటే 10రెట్లు ఎక్కువ బలం కలిగి ఉంటది.
స్పాట్
ప్రతి దారం వేలకొద్దీ సన్నని దారాలను కలిగి ఉంటది. ప్రతి సన్నని దారంలో మిలియన్ కార్భన్ ట్యూబ్లతో ఏర్పాటై ఉంటది. ఈ కార్భన్ ట్యూబ్ లు కేవలం ఒక పరమాణువు వ్యాసార్ధంలో ఉంటయి. అంటే కార్భన్ పరమాణువుల మధ్య బలమైన బంధాలతో ఏర్పడే ఒక ఆర్గానిక్ ట్యూబ్ అన్నమాట. అందుకే ఇది మనం నమ్మశక్యం కానంత బలాన్ని సొంతం చేసుకుంది.
స్పాట్
ఈ మానవ నిర్మిత ఫైబర్ ను మామూలు కార్బన్ ఫైబర్ తో అంటే ఎరామిడ్ ఫైబర్ తో కంపేర్ చేసి చూశారు. ఒక ప్రత్యేకమైన మిషన్లో ఈ రెండు థ్రెట్ల బలాన్ని పరిక్షించిండ్రు శాస్ర్తవేత్తలు.
స్పాట్
ఎరామిడ్ ఫైబర్ కార్బన్ ఫైబర్ కంటే కార్భన్ నానో ట్యూబ్ ఫైబర్ నాలుగు రెట్లు బలమైనదని రుజువయింది. ఇంత బలమైన దారాలతో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారు చేస్తరు. అంటే ఒక పొర నానో కార్బన్ ట్యూబులతో తయారు చేసిన జాకెట్ పది ఐరన్ షీల్డ్ లతో సమానం. అంటే ఒక జాకెట్ ధరిస్తే పది ఇనుప కవచాలు ధరించినంత రక్షణ నిస్తది ఐతే అది ఒరిజినల్ ది అయి ఉండాలి. ఈ నానో కార్బన్ టెక్నాలజి సాంకేతిక రంగంలో పెను మార్పులు తెచ్చింది.
యాంకర్ 5
మన బిజీ జీవితంలో నిత్యం సూక్ష్మశాస్ర్తవేత్తలతో సహవాసం చేస్తం..ఈ బుల్లి శాస్ర్తవేత్తలు వేరెవరో కాదు మైక్రో ఆర్గానిజమ్స్. అసలు ఇవి లేని చోటే లేదు. కానీ ఒక్క క్షణం కూడా వాటి గురించి ఆలోచించం..మన బయట లోపల ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ మనతో ఎలా ఆడుకుంటున్నాయో చూస్తే ఆశ్చర్యమేస్తది… చూస్తే మీకే తెలుస్తది..వీటి సయ్యాట.
స్పాట్(స్మాల్)
వాయిస్
మన నిత్య జీవితంలో సూక్ష్మక్రిములతోనే సహజీవనం చేస్తడు. తాను ఎంత శుబ్రంగా మెయింటెయిన్ చేస్తుంటమని అనుకుంటం..కానీ అదంటా ట్రాష్ చూడండి, నడిచే ప్రతి అడుగు కిందా ఎన్నో క్రిములు..ఈ రూం చూడండి ఎంత శుభ్రంగా ఉందో..అయినా ఇక్కడ ఒక రొమాంటిక్ జంట చేసే డిన్నర్ లో ఎన్ని రకాల క్రిములు ఎన్ని విధాలుగా వ్యక్తులను ఎటాక్ చేస్తయో చూద్దాం..
స్పాట్
ఇక్కడ ఈ జంట చేసుకునే విందుకు ఎన్నిరకాల సూక్ష్మ క్రిములు కంపెనీ ఇస్తున్నాయో చూడండి. .. మొదట తాజా కూరలు క్లీన్ చేద్దామనుకున్న ఇతని ప్రయత్నంలో అదే నీటి నుంచి మరిన్ని క్రిములు ఆ కూరలకు అంటించుకుంటడు. చూడండి..ఈ వాటర్ ట్యాప్ అంచున ఎన్ని క్రిములు స్విమ్ చేస్తున్నయో..ఇవన్నీ పారదర్శకంగా ఉంటయి. ఒక్క చుక్క నీటిలో వందల మిలియన్ల బ్యాక్టీరియాలు హాయిగా విహరిస్తున్నయి. వీటి వల్ల పెద్ద నష్టం ఏమీ లేకున్నా..ఒక్కోసారి వీటిని ఎటాక్ చేసే బ్యాక్టీరియా వల్ల పెద్ద ప్రమాదమే వస్తుంది.
స్పాట్
తాజా కూరలతో చేసే ఈ వెజిటబుల్ సలాడ్ లో కూడా ఎన్ని రకాల క్రిములున్నయో చూడండి..ఫ్రెష్ లీఫ్ సలాడ్ లో వెనిగర్ ను మిక్స్ చేసినపుడు వెనిగర్ లో ఉన్న మిలియన్ల కొద్దీ మైక్రోమ్ లు ఆహారంలో కలిసిపోయి విందుకు సిద్దమయితయి. ఇవి 1 మిల్లీ మీటర్ పొడవుండి సన్నని దారపు పోచల వలే ఉంటయి. ఇవి మామూలు కంటికి కనిపించవు. పూర్తిగా పారదర్శకంగా ఉండటం వల్ల కనీసం వీటిని గుర్తించడం కూడా సాధ్యం కాదు. అంతే సలాడ్తో బాటు అవి కూడా మనకు నాన్ వెజ్ ఫుడ్ గా మారిపోతయి.
స్పాట్
ఇపపడు చీజ్ ముక్కలను చూద్దాం..ఫ్రెష్గా ఉన్న ఈ నేతిగడ్డలో మనకు కనిపించని, ఒళ్లు గగుర్పొడిచే జీవులు ఎలా ఉన్నాయో చూస్తే ఆశ్చర్యం వేస్తది. మిలియన్ లకొద్దీ క్రిములు మన ఆహారం పై ముందే తిష్ట వేసి రోజుల తరబడి ఆ ఆహారాన్ని తినుకుంటూ జీవిస్తయి. మన చుట్టూ ఉన్నా దుబ్బా దూళిలో కొన్ని కోట్ల జీవులు ఆహారం పైకి వచ్చి చేరతయి. కొంత కాలం ఇవి ఆహారం పై ఇలాగే ఉంటే ఆ ఆహార స్వభావాన్ని పూర్తిగా మార్చేస్తయి. ఆ ఫుడ్ ఫ్లేవర్ని పూర్తిగా మార్చేస్తయి.
అంతే కాదు ఒక్కరిలోకి సంక్రమించాయంటే ఆటోమేటిక్గా ఇంకొకరికి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతయి. ఒక్క ముద్దు చాలు మైక్రోమ్లు మైగ్రేట్ కావడానికి..
వచ్చేవారం…
మంచు చరియాలు విరిగిపడటం వెనక ఉన్న సూక్ష్మమర్మం ఏమిటి..
సూర్యకిరణాల్లో ఉన్న సూక్ష్మ రహస్యం..

ది సైన్సు ఎపిసోడే 7

ఎ.జనార్దన్
ఇంట్రో యాంకర్
ప్రకృతి ఒక విజ్ఞాన ఖని . ఈ గనిలో మనం ఇప్పటికీ చూడని మణులు ఎన్నో. శాస్ర్తవేత్తలు ఈ ప్రకృతి పొరల్లో దాగిన రహస్యాలను ఒక్కొక్కటే వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నరు. ఆ జ్ఞాన గుళికలను మీకందించే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం..
రిపీట్ యాంకర్
మన చుట్టూ, మనం గుర్తించని ఎన్నో విషయాల్లో సైన్స్ సీక్రెట్స్ దాగి ఉన్నయి. అందులో కొన్ని గతవారం తెలుసుకున్నం. నీటిలో దాగి ఉండే క్రాబ్ క్లోవ్లో అత్యధిక ఉష్టోగ్రత ఉష్ణోగ్రత, ప్రకృతిలో నిశ్శబ్దంగా జరిగే పనులు, ఫంగస్ లో దాగిన మిస్సైల్ సీక్రెట్, నీటిపురుగు కాళ్లో దాగిన స్కేటింగ్ సీక్రెట్..ఇవన్నీ మరొక్కసారి గుర్తుచేసుకుందాం..
యాంకర్ 1
ప్రాణమీద తీపిలేని వారెవరూ లేరు. కానీ సాహసం చేసేవారికి ప్రాణాలంటే గడ్డిపోచలతో సమానం. వాస్తవానికి వారు చేసే పనిలో అంత ప్రాణాంతక విషయాలు దాగిఉన్నయని భౌషా స్పీడ్ కెమేరాలతో గుర్తించే వరకు ఎవరికీ తెలీదు. ఒక వ్యక్తి విద్యత్ వలయంలో మృత్యుకోరల మధ్య ఎలా తన పని తాను చేసుకుపోతున్నాడో చూడండి.
వాయిస్
మానవ నేత్రం అత్యంత శక్తివంతమైనది.. మన శరీరంలో ఉన్న అద్భుత పరికరాల్లో నేత్రం ఒకటి.. మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో స్పష్టంగా తెలపగల శక్తి ఒక్క మానవ నేత్రానికే ఉంది. కానీ మన కన్ను కూడా గుర్తించలేని ఎన్నో అద్భుత ప్రక్రియలను పట్టి చూపించగల కెమెరాలను తయారు చేశారు సైంటిస్టులు. అవి ఎంత గొప్పవంటే మనల్ని ఆవరించి ఉన్న వాయుపొరల్లో ఏంజరుగుతుందో..మన శరీరంలో ప్రతి అణువు ఎలా పనిచేస్తుందో కూడా గుర్తించే స్థాయికి ఈ టెక్నాలజి డెవలప్ అయింది.
స్పాట్ (నడవడం..కాలి ముద్రలు..లేడీ చేతిలోంచి బుట్టపడిపోయిన వస్తువులు)
వాయిస్
మనం నిత్యం చాలా రకాల పనులు చేస్తుంటం..వాటిలో కొన్ని ప్రమాదకరమైనవైతే కొన్ని సునాయాసంగా చేసేవి..ఇదిగో ఇక్కడ ఇతనుకూడా చేతిలో కొన్ని పరికరాలు పట్టుకొని..ఒంటినిండా ఎలక్ట్రిక్ ప్రూఫ్ కోట్ వేసుకొని బయలుదేరాడు. నిజానికి ఇతను చేసే పని సామాన్యమైనది కాదు. ఇతను చేసే సాహసం మృత్యుకోరల మధ్య నాట్యమాడటమే...ఎంతో గుండెధైర్యం ఉన్న వాళ్లు తప్ప ఈ పని మరొకరు చేయలేదు. ఈ హెలికాప్టర్ ఫుట్ బోర్డుపై కూర్చొని
ఆకుపచ్చని అడవుల పై అంతెత్తు పై నుంచి అలవోకగా ప్రయాణిస్తన్న ఇతను ఓ హై పవర్ ఎలక్ర్టిక్ లైన్తో తలపడబోతుండు..
స్పాట్( హెలికాప్టర్ టాప్ టీన్లు..తీగల దగ్గరకు వచ్చే సీన్)
మనం మన ఇంట్లో చిన్న ఫ్యాన్ కు కరెంట్ కనెక్షన్ ఇవ్వాలంటేనే వంద రకాల జాగ్రత్తలు తీసుకున్నా కటింగ్ ప్లేయర్తో వైర్ను పట్టుకోవాలంటేనే హడలిపోతాం..పని పూర్తయ్యే దాకా చేతుల్లోకి వణుకు మనకు తెలియకుండానే వస్తది. పొరపాటున మన ఇళ్లో కరెంట్ షాక్ కొడితే కాస్త దూరాన పడతాం..లేదా గాయమవుతుంది. సకాలంలో స్పందిస్తే పెద్ద ప్రమాదం ఉండదు. కానీ ఇక్కడి హై పవర్ లైన్స్ అలా కాదు.. తేడా వస్తే ఒక్క సెకన్లో మాడి మసవ్వాల్సిందే..ఈ హైపవర్ లైన్లలో ఎంత శక్తి ఉందంటే ఈ లైన్ల చుట్టూ మన కంటికి కనిపించని విద్యుత్ క్షేత్రం చిక్కగా అలుముకొంది.
స్పాట్ ( హెలికాప్టర్ పవర్ టవర్ దూరంగా చేరుకొనే సీన్..)
ఇదిగో ఈ టవర్ ను మామూలు కంటితో చూస్తే ఇలా ఏ క్రియలూ, కదలికలూ లేకుండా ప్రశాంతంగా కనిపిస్తది. ( ఓన్లీ టవర్ చూపించాలి) కానీ హై పవర్ కెమేరాలతో షూట్ చేసి చూస్తే ఇదిగో ఇలా ప్రతి జంక్షన్ వద్దా ఇలా స్పార్క్స్ కనిపిస్తియి. ఈ స్పార్క్ ల చుట్టూ వేలాది విద్యత్ తరంగాలు అలుముకొని ఉన్నయి. ఈ స్పార్క్ ద్వారా మనకు తెలియకుండానే ఎంతో విద్యుత్ వృధాగా ఖర్చయిపోతుంది. ఈ దృగ్విషయాన్ని కొలోన్ అని పిలుస్తరు.
స్పాట్( టవర్..స్పార్క్స్..లాంగ్ అండ్ షార్ట్ షాట్లు)( చీకట్లో వైర్లు )
ఈ హై పవర్ లైన్లలో వందల, వేల వాట్ల కరెంట్ ప్రవహిస్తుంటది. ఒక నదిలో నీరు ఏవిధంగా ప్రవహిస్తుందో అలాగన్న మాట. పెద్దకాలువలో నీరు అక్కడక్కడా లీక్ అయి వృధాగా పోతున్నట్టే.. ఈ విద్యుత్ కూడా జంక్షన్ల వద్ద మనకు కనిపించకుండానే విద్యుత్ వృధాగా పోతుంది... బాహ్యవాతావరణంలోకి విడుదలయిన ఎలక్ట్రిక్ పవర్ ఏమవుతోంది..
స్పాట్
ఇదిగో ఇక్కడ ఒక సైంటిస్ట్ ఏంచేస్తున్నాడో చూడండి. హైపవర్ లైన్ల కింద ఒక ట్యూబ్ లైట్ను మట్టిలో పాతి పరిక్షిస్తున్నడు. యస్..ఈ ఎక్స్పరిమెంట్ సక్సెస్..ట్యూబ్ లైట్ వెలిగింది..అంటే ఈ హైవర్ లైన్ల కింద విద్యత్ క్షేత్రం ఆవరించి ఉందన్నమాట..మన కన్ను గుర్తించలేని విద్యత్ శక్తి ఈ పవర్ లైన్లకింద ఉంది. అందుకే ఎర్త కనెక్షన్ ఇవ్వగానే ఈ ట్యూబ్ లైట్లు వాతావరణంలో ఉన్న పవర్ తో మిణుకు మిణుకు మంటూ వెలుగుతున్నయి. దీనిని బట్టి హైపవర్ లైన్ల పొడుగునా ఎంతో కరెంట్ వృధా అవుతుందన్నమాట.
బ్రేక్ యాంకర్
మీరెప్పుడైనా కరెంట్ తీగలను పట్టుకొని చూశారా..కనీసం ప్రయత్నం చేశారా..ఆ ప్రయత్నం చేసి కూడా ఇంకా ఈ ఎపిసోడ్ చూస్తున్నారా… అయితే మీరు ఘటికులే..కానీ మీకంటే ఘటికులు చాలామందే ఉన్నరు. ఏకంగా హైపవర్ కరెంట్ పై ఉయ్యాలలూగడమెలాగో చిన్న బ్రేక్ తరువాత చూద్దాం..
యాంకర్ 2
వెల్ కం బ్యాక్ టు అల్టిమేట్ నాలెడ్జ్ ఎపిసోడ్...
బ్యాంగ్
మన ఇళ్లలో చిన్న బల్బు పెట్టాలంటే మందు ప్లగ్ తీసేస్తం.. అయినా భయం తగ్గక ఏకంగ మెయిన్ ఆఫ్ చేస్తం..50వాట్ల కరెంట్ కే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే వేలాది వాట్ల కరెంట్ వైర్లను కరెంట్ ఆఫ్ చేయకుండా వాటిపై కూర్చొని రిపేరింగ్ వర్క చేస్తరంటే మీరు నమ్మగలరా.
స్పాట్ ( ట్యూబ్ లైట్ ల స్పాట్)
ఈ ట్యూబ్ లైట్లు ఏ వైర్ కనెక్షన్ కనెక్షన్ లేకుండానే వెలగడమంటే విద్యుత్ లేకుండా వెలగడమని కాదు.వాతావరణంలో ఉన్నవిద్యత్ శక్తిని..కాంతి శక్తిగా మార్చగలుగు తున్నయన్న మాట..ఈ కొలోన్ ప్రక్రియ వల్ల వందల వాట్ల శక్తి వృధా అవుతుంది. ఈ లీక్ ప్రాసెస్ ఎక్కువయినపుడు పవర్ కట్..లోవోల్టేజి సమస్యలు ఎదురవుతయి. ఈ ఎలక్ట్రిక్ వైర్లను ఆవరించి వాతావరణంలోకి ఎలా విద్యత్ శక్తి విడుదతలవుతుందో హై స్పీడ్ కెమేరాలు పట్టి చూపించాయి.
స్పాట్ ( హెలికాప్టర్ వైర్ల దగ్గరకు కిందికి దిగుతుతన్న విజువల్స్)
ఇదిగో ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీర్ తన చేతులలో ఉన్న వైర్లను పవర్ లైన్ల వద్దకు తీసుకురాగానే.. వైర్ లకు లైన్లకు మద్య ఎలక్ట్రిక్ స్పార్క్లు ఎలా పాస్ అవుతున్నాయో..
స్పాట్ ( హెల్పర్ వైర్లను లైన్లకు ఆన్చడం..వాటి మధ్య స్పార్క్లు రావడం)
హెలికాప్టర్ కొన్ని సెకన్ల పాటు గాలిలో అలా నిలిచిపోతుంది. దాని పాత్ పై కూర్చున్న ఈ ఇంజనీర్ తన వద్దనున్న ఆపరెంట్స్ తో రిపేర్ వర్క్ మొదలు పెట్టగానే..అతని చుట్టూ, అతను కూర్చున్న హెలికాప్టర్ చూట్టూ ఈ కొలోన్ విద్యుత్ క్షేత్రం ఆవరించి ఉంటది. మామూలు నేత్రానికి ఇది కనిపించదు.
స్పాట్ ( స్పెషల్ కెమేరాలతో తీసిన షాట్లు, మామూలు షాట్లు చూపించాలి)
ఇలా హెలికాప్టర్ చుట్టూ, లైన్ మెన్ చుట్టూ విద్యుత్ క్షేత్రం ఆవరించి ఉన్నట్టు వారికి కూడా తెలీదు. లైన్ మెన్ ఇప్పుడు పూర్తిగా వైర్ ల పైనే కూర్చొని తన రిపేరింగ్ పని ప్రారంభిస్తున్నడు. అప్పడు హెలికాప్టర్తో ఉన్న లింక్ ను పూర్తిగా డిస్కనెక్టచేయగానే హెలికాప్టర్ చుట్టూ ఉన్న కొలోన్ ఫీల్డ్ మొత్తం మాయమైపోతుంది. ఆ కనెక్టెడ్ వైర్ కే అది పరిమితమవుతుంది.
స్పాట్
ఈ వైర్లు ఉన్నంత పొడవునా వాటికింద ఉన్న ఇళ్లలోనూ, పొలాల్లోనూ ఈ కొలోన్ విద్యత్ క్షేత్రాలు ఆవరించి ఉంటయి.
స్పాట్ ( వైర్ల కింద ఇళ్లు..)
యాంకర్ 3
ఇంద్రధనస్సును చూసి పులకించని వారెవరుంటరు చెప్పండి. కానీ ఈ ఇంద్రధనస్సు ఎలా ఎర్పడుతుందో చాలా మందికి తెలీదు. ఈ వానవిల్లు లో దాగిన రహస్యం ఏంటో ఓ లుక్కేద్దాం..
వాయిస్
ఇంద్రధనస్సులో ఉన్నసప్తవర్ణాలు కనువిందు చేసే ఓ అద్భుత దృశ్యం. మనం కేవలం ఒక స్పటికం ద్వారా చూస్తేనే ఈ ఇంద్రధనస్సు వర్ణాలను గమనించగలం. అప్పడప్పుడు నీటి తుంపరల మధ్య కనిపించే సప్తవర్ణాల ఇంద్రధనస్సు వెనక దాగిన సీక్రెట్ ను కనిపెట్టేశారు సైంటిస్టులు.
స్పాట్
ఈ విశ్వం మొత్తం ఒక లయ బద్దంగా నడుస్తోంది. ఆ లయలో హెచ్చు తగ్గులే మనకు వివిధ రకాల అద్భుతాలను సృష్టిస్తున్నయి. ఈ మనం ఎంతో ఇష్టపడేసంగీతంలో కూడా వినిపించే శబ్దం ఒకటే... అయినా వాటి ఫ్రీక్వెన్సీలో ఉన్న డిఫరెన్స్ వల్ల శబ్దంలో లయలు మారి అద్భుతమైన సంగీతం వినిపిస్తది. ఈ లయబద్దమైన ప్రక్రియ ఈ సృష్టి మొత్తం విస్తరిస్తది. మన చుట్టూ వాతావరణంలో పట్టణంలో..అంతెందుకు నింగీ, నేలా, ఆకాశం నిండా ఈ లయబద్దమైన ప్రక్రియ తోనే సమస్త సృష్టి గమనంలో ఉన్నది.
స్పాట్( కీ ప్యాడ్ విస్తరిచే సీన్లు)
ఈ ఇంద్రధనస్సులో కూడా అదే రిథమిక్ ఫార్ములాతో కాంతి విక్షేపణ అనే ప్రక్రియ జరుగుతుంది. ఈ కాంతి విక్షేపణ ప్రక్రియ ద్వారా ఒక్కో ఫ్రీక్వెన్సీ వద్ద ఒక్కో రంగు బహిర్గతమవుతుంది. సప్తవర్ణాలయినా, సప్తస్వరాలయినా వాటివాటి పౌనఃపుణ్యాన్ని బట్టే ఆధారపడి ఉంటయి.
స్పాట్
యాంకర్
మన నేత్రంతో చూడగలిగితే...కొన్ని మాత్రమే చూడగలం..కానీ ఇప్పడు సాధించిన అడ్వాన్స్ డ్ టెక్నాలజితో శరీర అంతరాంగాల్లో జరిగే వాటిని కూడా గుర్తించవచ్చు. ఈ టెక్నాలజి ఉపయోగించి... అంతెత్తు నుంచి దూకి కూడా చిన్నదెబ్బ తగలకుండా ఎలా తప్పిచ్చుకుంటుందో తెలుసుకున్నరు. ఆ సీక్రెట్ చిన్న బ్రేక్ తరువాత..
యాంకర్
ఒక వ్యక్తిని మనం చూసేటపుడు అతని హావభావాలు, అతను ధరించిన డ్రస్సులు మాత్రమే చూడగలం..కానీ శరీరంలోపలున్న ఎముకలను కూడా చూడటం సాద్యమేనా... ఇది ఖశ్చితంగా సాధ్యమేని రుజువు చేశారు శాస్త్రవేత్తలు.. ఆ టెక్నిక్ తోనే పిల్లి పాదాల్లో ఉన్న సూపర్ మాన్ సీక్రెట్ కనిపెట్టేశారు.
వాయిస్
కాంతికి అపారమైన శక్తి ఉంది. ఇది పారదర్శకమైన ప్రతి వస్తువులోంచి తేలికగా వెళ్లగలదు. ఈ కాంతిలో మామూలు కాంతితో బాటు అతినీలలోహిత కాంతి, పరారుణ కాంతి ఉంటుంది. ఈ అతినీలలోహిత కాంతికి ప్రతి ఆబ్జెక్ట్ నుంచి చొచ్చుకుపోగల సామర్ధ్యం ఉంది. ఈ కాంతిని ఉపయోగించుకొని జీవిలోని అంతరాంగాలను అధ్యయనం చేసిండ్రు.
స్పాట్
ఇదిగో...ఇది సూపర్ పవర్ ఎక్స్ రే మిషన్. ఇది మూవింగ్ ఆబ్జెక్ట్ లను కూడా అణువణువూ శల్యపరిక్ష చేయగలదు. ఈ ఎక్స్ రే టెక్నాలజి కెమేరా లెన్స్ కు జతచేసి హై స్పీడ్ అండ్ హైడెఫినిషన్ కెమేరాలతో రికార్డ్ చేస్తే జీవుల చలనంలో ఉన్న సీక్రెట్లు తెలిశాయి.
స్పాట్
మనిషి కొంత ఎత్తునుంచి దూకితే తన కాళ్లపై ఫోర్స్ పడి ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. దూకడంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న కానీ పిల్లి ఎంతో ఎత్తునుంచి దూకినప్పటికీ, ఏమరుపాటుగా దూకినప్పటికీ కాస్త కూడా దెబ్బతగలదు. అంతే కాకుండా పిల్లి కఠిన నేలపై దూకినా పరుపు పై దూకినంత తేలికగా క్షణాల్లో వెళ్లిపోతది.
స్పాట్
ఒక్కోజంతువుకు ఒక్కోరకమైన యంత్రాంగం ఉంటది.
స్పాట్
ఎలుక చిన్న గొలుసు పై కూడా బ్యాలన్స్ డ్ గా నడవడానికి గల కారణాన్ని అన్వేషించగా..ఎలుక అస్థుల నిర్మాణంలో, నడకలో ఒక గొంగళి పురుగుకు ఉన్న శారీరక లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ శరీరనిర్మాణం సన్నటి తీగలపై కూడా వేగంగా నడవడానికి ఉపయోగపడుతుంది.
స్పాట్
ఊసరవెల్లి నునుపుతలాలపై వేగంగా పాకడానికి కారణం కూడా ఇదే... కెమిలియాన్ తన కాళ్లను పూర్తిగా ఒకదానికొకటి తాకే విధంగా నడవగలదు. అంటే ముందు కాళ్లతో పాకి, ఆ తరువాత వెనుక కాళ్లు ముందు కాళ్ల వద్దకు తెచ్చి గట్టిగా పట్టుకొని ఆ తరువాత నెక్స్ట్ స్టెప్ తీసుకుంటది.
స్పాట్
కౌజు పిట్ట కాళ్లు చూస్తే పిట్ట వెనుక వైపు ఉన్నట్టు ఉంటాయి. కానీ ఇది చాలా బ్యాలన్స్ డ్ గా నడవగలుగుతుంది. ఎక్స్ రే కెమెరాలతో గమనించగా. ఈ పిట్ట వాతులాస్థులు దేహం వెనుక నుంచి ముందు వరకు సాగి బేలన్స్ డ్ గా అమర్చ బడి ఉంటయి. అందువలన ఇది సునాయాసంగా నడవగలదు.
స్పాట్
పిల్లి ఎంత ఎత్తు నుంచి దూకినా ముందు పిల్లి తన ముందు కాళ్లనే ముందు నేలకు ఆనిస్తది. ఆ తరువాత శరీరం మొత్తాన్ని స్ప్రింగ్ మాదిరిగా కుదుపు కుదిపిన తరువాత వెనక కాళ్లను నేలకు ఆనిస్తది. ముందు కాళ్లు నేలకు ఆనించగానే స్లోగా పాదాలను స్ప్రింగ్ మాదిరిగా వంచుతది. ఆ వంచడంలో సగం షాక్ నుంచి తేరుకుంటది. ఆ మిగతా షాక్ వెనక కాళ్లతో ఎదుర్కొంటది. అంతే కాదు ఈ షాక్ పూర్తిగా తన పై పడకుండా ఉండేందుకు కొన్ని క్షణాలు నేలపై పడుకుంటది. బాంబులు విసిరే సమయంలో యుద్దంలో సైనికులు కూడా బాంబ్ షాక్ ల నుంచి తప్పించుకునేందుకు నేలపై పడుకుంటరు. ఈ సిద్దాంతమేదీ పిల్లికి తెలియపోయినా, తన శరీరనిర్మాణంలో ఉన్న అమరికలను బట్టి ఇది తేలికగా ఎత్తులనుంచి దూకగలుగుతుంది.
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ సీక్రెట్లు…మరిన్ని అమేజింగ్..అల్టిమేట్ సైన్స్ సీక్రెట్ల తో మళ్లీ వచ్చేవారం ఇదే సమయానికి కలుసుకుందాం… అంటిల్ దెన్ బైబై

ది సైన్సు ఎపిసోడ్6

ఎ.జనార్దన్ episode 6
ఇంట్రో యాంకర్
ప్రకృతి ఒక జ్ఞానగ్రంధం. ఈ గ్రంధంలో మనం తెరవని పేజీలు ఎన్నో. శాస్ర్తవేత్తలు ఈ ప్రకృతి పుటల్లో దాగిన మర్మాన్ని ఒక్కొక్కటే వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నరు. ఆ జ్ఞాన ఫలాలను మీకందించే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం..
రిపీట్ యాంకర్
ఈ ప్రకృతిలో ప్రతి జీవి తన మనుగడ కోసం నిత్యం పోరాడుతూనే ఉంటది. ఆ పోరాటానికి కావలసిన రక్షణ కవచాలు. ఒక జాతి తన విస్తరణకు చేసే ప్రయత్నాలు. ఆర్ధోపొడా జీవులకు నీటిపై నడక నేర్పిన సూత్రాలు..ఇవన్నీ చూసే ముందు గతవారం చూసిన సైన్స్ చిత్రాలను ఒక్కసారి గుర్తుతెచ్చుకుందాం..
(రి కాప్)
యాంకర్ 1
ఒక జీవి తనలో ఉష్ణ కాసారాన్ని నింపుకుని జీవిస్తదంటే మీరు నమ్మగలరా..అవును ఒక జలచరం తన చేతుల్లో బడబాగ్ని దాచుకొంది.. దాన్ని రక్షణ కవచంలా ఉపయోగించుకొని తన ఆహారాన్ని సేకరించగలుగుతుంది. ఇంతకీ ఏంటా జీవి..ఏమిటా రహస్యం…
వాయిస్
ఈ సకల చరాచర సృష్టిలో ప్రతి జీవి తన మనుగడ కోసం నిత్యం పోరాడుతూనే ఉంటది. అన్నిటికంటే అద్భుతమైన విషయం ఒకటుంది. ఈ ప్రకృతి ప్రతి జీవికి ఏదో ఒక రకమైన రక్షణ యంత్రాంగాన్ని కల్పించింది. చిన్న అమీబా నుంచి పెద్దపెద్ద జీవుల వరకు ప్రకృతి ప్రసాదించిన రక్షణ కవచాలతోనే అవి తమను తాము కాపాడుకోగలుగుతున్నయి. ఒక్క మనిషి మాత్రమే తన తెలివి తేటలతో సొంతంగా రక్షణ తంత్రాలను ఉపయోగించగలుగుతున్నాడు.
స్పాట్
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పీతను చూడండి. ప్రవాళ బిత్తిక బొరియలో తలదాచుకుంది. ఆహారం వచ్చినపుడు మాటునే ఉండి చప్పున పట్టేయడానికి సిద్ధంగా ఉంది.తన దగ్గరకు వచ్చిన ఆహారపు జీవులను దీని క్లోవ్స్ తో మెరుపు వేగంతో పట్టేస్తది. అంతకు మించిన మరో అద్భుతం ఈ జీవిలో దాగి ఉంది.
స్పాట్
దీని క్లోవ్స్ అంచునుంచి వస్తున్న బుడగలను చూశారా.. వీటిని చూడటానికి ఎదో శ్వాస వాయువులా కనిపించినా వాస్తవానికి ఇది ఉఛ్వాస వాయువు కాదు. సాదారణంగా జీవుల ఉచ్వాస వాయువులు వేడిగా ఉంటాయి. కానీ ఈ జీవి విడుదల చేసే వాయువు తన దగ్గరకు చేరిన జీవిని మాడ్చేసే శక్తి కలది. అవును... ఈ బుడగల్లో అంత శక్తివంతమైన వేడి గాలులు ఉన్నయి. ఇంతకీ నీటిలో ఉన్న ఈ జీవికి వాయులు ఎక్కడివి. తనకు తాను వాయువును ప్రొడ్యూస్ చేయగలదా... ఈ వాయులకు ఇంత వేడి ఎక్కడిది..పరిశోధించారు శాస్త్రవేత్తలు.
స్పాట్‌
ఈ క్రాబ్ తన దగ్గరకు ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చినపుడు మొదట అది దాని క్లోవ్ తో దెబ్బకొడతది. నిజానికి అది దాని క్లోవ్ కాదు. అది ఒక ఆయుధం. కానీ అది ఎకరికీ తెలియని రహస్యం. ఆ క్లోవ్లో అంత పవరుందన్న రహస్యం చాలా మందికి తెలియదు.
స్పాట్
క్రాబ్ క్లోవ్ పనితీరు పరిశీలించేందుకు మొదట దాని క్లోవ్ దగ్గరకు బ్రష్‌ను తీసుకెళ్లారు. అప్పుడు క్రాబ్ తన క్లోవ్‌తో ఒక్క విసురు విసిరింది. ఈ ఒక్క విరుపులో కొన్ని వందల క్రియలు జరుగుతాయనేది మనమెవరమూ ఊహించని సైన్స్ సీక్రెట్..స్లోమోషన్లో చూస్తేగానీ అసలు సీక్రెట్ తెలియలేదు.
స్పాట్ ( క్రాబ్ టప్ మనే శబ్దం విజువల్)
ఇప్పుడు మనకు వినిపించిన శబ్దం క్లోవ్ నుంచి వచ్చింది కాదు..ఒక అదృశ్య శక్తి..పీతకు ఎక్కడిదీ హాట్ పవర్..
స్పాట్
మొదట క్రాబ్.. తన జీవక్రియలో వెలువడ్డ వేడితో నీటిని ఆవిరి రూపంలోకి మారుస్తది. ఈ ఆవిరి తన ఆవిరికోశంలో అట్టే పెట్టుకుంటది. తన దగ్గరకు ఏదైనా ఆహారం కానీ..శత్రువుగానీ వచ్చినపుడు సూపర్ స్పీడ్తో ఆ హీట్ వెపర్ ను విసురుతది..ఈ వేడి ఆవిరులు అత్యంత ప్రమాదకరమైనవి. ఈ బుడగల్లో వేడి నమ్మశక్యం కానిది..ఈ బబుల్ లో ఉన్న టెంపరేచర్ అక్షరాలా 4000డిగ్రీ సెంటిగ్రేట్ అని శాస్ర్తవేత్తలు నిర్దారించిండ్రు. ఈ ఉష్ణోగ్రత శాస్ర్తవేత్తలనే అబ్బురపరచింది. ఈ అద్భుత శక్తి శత్రుజీవిని ఎదుర్కోవడమే కాదు. దొరికిన జంతువును అప్పటికప్పుడు ఫ్రై చేసేందుకు కూడా ఉపయోగా పడుతది. అయితే ఇది అన్ని వేళలా తన పూర్తి శక్తిని వినియోగించదు. సమయాన్ని.. అవసరాన్నిబట్టి ఈ క్రాబ్ తన పవర్ని వాడుకుంటది.. నమ్మశక్యంగాని ఈ వేడి ఒక్కోసారి నీటిని ఉష్ణకాసారంగా ఉడికిస్తది కూడా..
స్పాట్
బ్రేక్ యాంకర్
నీటి లోతుల్లో ఉన్న ఈ క్రాబ్ కు అంతటి శక్తి ఎక్కడిది..ఈ ఉష్ణశక్తి ఆ జంతువుని ఏమీ చేయదా..అసలు ఈ జలచరంలో ఈ శక్తి ఎలా ఉద్భవిస్తది...తెలుసుకునేందుకు పరికరాలు సిద్ధం చేశారు సైంటిస్టులు..ఈ హీట్ సీక్రెట్ చిన్న బ్రేక్‌ తరువాత...
వెల్కం యాంకర్
ఎంతో ఎక్సైట్ మెట్ తో ఎదురు చూసే సైన్స్ ఎపిసోడ్ కు తిరిగి స్వాగతం.
యాంకర్
ఒక జీవి నుంచి మరో జీవిని మాడ్చివేయగల ఉష్ణోగ్రత వెలువడటం ఎలా సాధ్యం.ఈ క్రాబ్లో ఉన్న యంత్రాంగం ఏంటి..ఇది ఒక్క బయోమిస్టరీయేనా నిజంగా సాధ్యమయ్యే పనేనా..అనుమానం వచ్చింది పరిశోధకులకు..ఈ విషయం తేల్చేందుకు ఓ చిన్నప్రయోగం చేశారు. ప్రయోగం చిన్నదే కానీ ఫలితాలు మాత్రం చాలా గొప్పవి.
స్పాట్(స్మాల్)
అచ్చు..క్రాబ్లో ఉన్నయంత్రాంగం మాదిరి బ్లేడ్ వీల్ ను తయారు చేశారు. ఈ వీల్ ను క్లాక్ వైజ్ డైమెన్షన్లో స్పీడ్ గా రొటేట్ చేశారు.వీల్ మధ్యలో కాస్త గాప్ వదిలారు. స్పీడ్ పెరిగే కొద్దీ బ్లేడ్ల్ ల వెంబడి సన్నని వాటర్ కావిటీస్ ఏర్పడటం కనిపించింది. ఈ వీల్ ముందుకు కదులుతుంటే బ్లేడ్ ల వెంబడి కావిటేషన్ రూట్స్ సన్నగా ఫాలో కావడాన్ని శాస్ర్తవేత్తలు గుర్తించారు. అంతే కాకుండా వీల్ మధ్యలో నుంచి కూడా అపసవ్య దిశలో వాటర్ కావిటీ ఫోర్స్ బుల్ గా రావడం కనిపించింది. ఈ వీల్ బ్లేడ్ మొనలకు గరుకు తలాన్ని ఏర్పరచడం వల్ల.. ఈ గరుకు తలం నీటితో వేగంగా జరిపిన ఘర్షణలో ఉష్ణశక్తి విడుదలవుతది. అంతే కాకుండా వాటర్ వెపర్గా మాడిఫై అవడానికి కావల్సిన నిర్మాణం బ్లేడ్ కావిటీస్‌ లో ఉంటది.
స్పాట్
శాస్ర్తవేత్తలు ఎంతో శ్రమకోర్చి తయారు చేసిన ఈ యంత్రం క్రాబ్ కు ప్రకృతి ప్రసాదించిన రక్షణ కవచం. నిజంగా ఒక జలచరంలో ఇటువంటి నిర్మాణ ఏర్పడుతుందని కలలో కూడా ఊహించని సూక్ష్మ రహస్యం శాస్ర్తవేత్తల పరిశీలనలో వెల్లడయింది.
వాయిస్
మనం ఒక పూదోటలో కాసేపు కూర్చుంటే..అక్కడ మన చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా..నిశ్శబ్దంగా ఉన్నదని అనుకుంటం. నిజంగా అలాగే ఉన్నదనే అనిపిస్తది. కానీ అదే మైక్రోసెకన్ లో మన చుట్టూ వేల క్రియలు జరిగిపోతుంటయి. నిశ్శబ్దంగా...అద్భుతంగా తన పని తాము చేసుకుపోతుంటయి. వాటిలో చిగుళ్లు మారాకు వేయడం..పూలు వికసించడం...పరాగరేణువులు సంపర్కం చెందడం..ఒక్కటేమిటి మన కన్నుగప్పి ఎన్ని వేల పనులు జరిగిపోతాయో..ఇవన్నీ మనం గుర్తించలేనంత నెమ్మదిగా జరిగే అందమైన చర్యలు..
స్పాట్ (పూలు వికసించే స్లోమోషన్ విజువల్స్)
వాయిస్
ఇప్పడు మీరు ప్రకృతిలో చాలా నెమ్మదిగా జరిగే చర్యలను చూశారు. నిజానికి ఇవి ఇంత నెమ్మదిగా జరిగితేనే అవి అంత పొందికగా తయారవుతయి. కానీ కొన్ని పనులు రెప్పపాటులో పూర్తయిపోతయి. కనీసం అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అలా జరిగనిది కొన్ని పనులు అసంపూర్తిగా నిలిచిపోతయి...
వాయిస్‌
మొక్క ఎదుగుదల..పూవు వికసించడం..పరాగరేణువులు సంపర్కం చెందడం ఇవన్నీచాలా నెమ్మదిగా జరిగే చర్యలు ఇవి జరుగుతున్నవా లేదా అన్నంత నెమ్మదిగా జరుగుతయి.కానీ కొన్ని పనులు రెప్పపాటులో జరుగుతుంటయి. ఇక్కడ చూడండి ఈ మొక్క విత్తనాలను ఎంత వేగంగా విసురుతుందో..అటువంటి యంత్రాంగం ఈ జాతి విస్తరణకు ప్రకృతి ప్రసాదించిన వరం.ఈ కాయ పక్వానికి వచ్చినపుడు ఒక చిన్నపాటి బాంబ్ లా పేలుతది. అలా విసరబడిని విత్తనం 6 మీటర్ల దూరం విసరబడుతది. అలా విసరబడిన విత్తనాలు మరో చోట తమ జాతిని వృద్ది చేసుకుంటయి. అలా అలా తమ జాతిని భూమి పై విస్తరిస్తయి.
స్పాట్
ఈ ప్లానెట్ పై కొన్ని పనులకు స్పీడ్ తప్పనిసరి. జెట్ విమానాలు, రాకెట్లు, మిసైల్స్, రెప్పపాటు వేగంతో తమ లక్ష్యాలను చేరుకుంటయి.
స్పాట్
యాంకర్
ఈ స్పీడ్ మనకు, జంతువులకు, మొక్కలకు మాత్రమే తెలుసనుకుంటే పొరపాటే.. ఈ స్పీడ్ సీక్రెట్ను ఫంగస్ కూడా వంటబట్టిచ్చుకుంది. స్పీడంటే అట్లాంటి ఇట్లాంటి స్పీడ్ కాదు. కంటిలో నలుసంత ఉండే ఫంగస్‌ స్ర్టిప్ రెండు మీటర్ల దూరం స్పోర్స్ ని విసరగలుగుతుందంటే నమ్మగలరా..ఇది నిజంగా నిజం...
వాయిస్
ఇక్కడ కనిపిస్తున్నది గుర్రపు పేడ. ఈ పేడ పై రైజోఫస్ జాతికి చెందిన శిలీంద్రం నివాసం ఉంటది. ఇది కేవలం ఎరువుల పై మాత్రమే నివసిస్తది. ( పేడ విజువల్స్, పేడ పై స్లోమోషన్లో పెరిగే ఫంగస్ విజువల్స్ చూపించాలి.)
వాయిస్
ఇక్కడ తోకకప్పల్లా కనిపించే ఈ పారదర్శక బుడగలు రైజోఫస్ జాతికి చెందిన శిలీంద్రాలు. ఇవి తమ గుళికల్లో జీవద్రవ్యంతో నిండిన స్పోర్స్ కలిగి ఉంటయి. ఈ క్యాప్సూల్ పైన నల్లని క్యాప్ ఉంటది. ఈ సిస్ట్‌ బ్లాస్ల్‌ కాగానే ఈ బయోప్లాసంతో బాటు స్పోర్స్ కూడా రిలీజ్ అవుతయి.
స్పాట్
ఇక్కడ ఉన్న ఏదో జరుగుతున్నట్టు కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది కానీ ఏం జరుగుతుందో తెలుసుకోవడం మానవనేత్రానికి సాధ్యం కాదు.
స్పాట్
ఈ మొత్తం దృశ్యాన్ని హైస్పీడ్ కెమెరాలో బంధించి దాన్ని పదివేల రెట్లు స్లోమోషన్లో స్టడీ చేస్తే గానీ అసలు సీక్రెట్ అంతుచిక్కలేదు.. ..
ఇదిగో ఇది స్పోర్స్ రాపిడ్ గా పేలిపోయే దృశ్యం..
ఇది స్లోమోషన్లో స్పోర్స్ రిలీజ్ అయ్యే విజువల్స్..
ఈ స్పోర్స్ ఒక్కసారి బలంగా విసిరిన సీడ్ ప్లాజం స్పోర్స్ రెండుమీటర్ల వరకు విస్తరిస్తది..దీని ఫోర్స్ తో బాటు గాలివాటం కూడా తోడైతే ఈ ఫంగస్ స్పోర్స్ దూరతీరాలకు వ్యాపిస్తయి.
స్పాట్‌
యాంకర్
మీకెప్పుడైనా నీటిపై నడవాలనే కోరిక కలిగిందా..కనీసం ప్రయత్నం చేశారా...నిజంగా నేలపై నడిచినట్టు నీటిపై కూడా నడవగలిగితే బ్రిడ్జిలతో పనే ఉండదు... కానీ జలచరం కాని ఒక ఆర్ధోపొడా జీవి నీటిపై యధేచ్ఛగా స్కేటింగ్ చేస్తుంది.. ఇంతకీ దీని కాళ్లలో ఉన్న సీక్రెట్ ఏంటో బ్రేక్ తరువాత చూద్దాం..
యాంకర్
నీటిలో జీవించాలంటే అవి జలచరాలైనా ఉండాలి..లేదా ఉభయచరాలైనా అయి ఉండాలి. ఈ రెంటికీ నీటిలో జీవించడానికి అనుకూల మైన యంత్రాంగం ఉంది. కానీ ఇవేవీ లేని ఆర్ధోపొడా జీవి నీటిపై స్కేటింగ్ చేయగలుగుతుందంటే… దాని కాళ్లలో ఉన్న మంత్ర దండం ఏంటి..
వాయిస్
ఇక్కడ కనిపిస్తున్న ఈ నీటి పురుగు ప్రతి సెకన్ కు రెండు మీటర్ల దూరం ఈదగలదు. (స్మాల్ స్పాట్) ఇది నీటి పైనే తన పనులన్నీ పూర్తి చేసుకుంటవి. నీటిపై స్కేటింగ్ చేసినంత సులువుగా ఇది వేగంగా తిరగగలదు.
స్పాట్
(పాలు నీళ్లలో పడే విజువల్స్)
ఇక్కడ చూస్తే నీటిలో పడ్డ పాలచుక్క చలనం ఎలా ఉన్నదో..పాల చుక్క నీటిలో పడగానే నీటి ఉపరితలం పై తిరిగి అంతే వేగంగా కేవలం పాలబాగం మాత్రమే ఒక బిందువులా మారి గాలిలోకి ఎగిసి తిరిగి నీటిలో కలిసిపోతది.
స్పాట్
వాయిస్
నీటిలో వేలు ముంచి తీస్తే మన వేలికి కొంత అంటుకోగా వేలితో బాటే కొంత సాగుతూ పైకి వస్తది.అంటే నీటికి మనం గుర్తించలేనంత తక్కువ మోతాదులో ఎలాస్టిక్ నేచర్ ఉందన్నమాట.నీటికున్న ఈ సాగే గుణాన్ని ఉపయోగించుకొని నీటిపురుగులు కొలనులో ఆవాసం ఉండగలుగుతున్నయి.
స్పాట్
ఈ పురుగులు రంగునీళ్లో పరిగెత్తితే ఇది ఎలా తన పాదాలను కదిలిస్తుందో తేలికగా గుర్తించ వచ్చు. అంటే నీటికి ఉన్న సాగే గుణం వల్ల పురుగు నీటి పై నడవగలుగుతుంది.
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ సీక్రెట్స్. మరిన్ని విశేషాలతో మళ్లీ వచ్చేవారం కలుసుకుందాం..అంటిల్ దెన్ బై..

కృత్రిమ బ్యాక్టీరియా

ఎ. జనార్దన్
యాంకర్
సైన్స్ చరిత్రలో ఓ కొత్త అద్భుతం…ఓ కోత్త ఆవిష్కరణ..యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తిన అరుదైన ఘటన.. బయోటెక్నాలజీ రంగంలో మనిషి దాటిన మైలురాయి..అమెరికా శాస్ర్తవేత్త జె. క్రెయింగ్ వెంటర్ చేసిన అద్భుతపరిశోధన ఫలించింది. ప్రయోగశాలలో కృత్రిమ బ్యాక్టీరియాకు పురుడు పోశారు. సృష్టికి ప్రతి సృష్టి సాధ్యమేనని నిరూపించిండు క్రెయింగ్ వెంటర్..
వాయస్
మీరు చూస్తున్న ఈ కణాలు మనిషి తన తెలివితేటలతో సృష్టించిన కృత్రిమ బ్యాక్టీరియా. మనిషి మరో బ్రహ్మ అవతారం ఎత్తి రూపొందించిన జీవకణం ఇది. ఆ బ్రహ్మ ఎవరో కాదు అమెరికాకు చెందిన వివాదాస్పద శాస్ర్తవేత్త క్రెయిగ్ వెంటర్..
స్పాట్ (క్రెయిగ్ విజువల్స్)
బ్యాక్టీరియాలు ప్రకృతిలో అతి ప్రాథమిక కణాలు. ఒక రకంగా చెప్పాలంటే జీవం ఉద్భవించడంలో ఇదే తొలిదశ అని కూడా చెప్పొచ్చు. అంతే కాదు సృష్టిలో అనేక క్రియలను శాసించేవి కూడా ఇవే..ఒక్కోరకం బ్యాక్టీరియా అతి ఉష్ట గుండంలో కూడా జీవిస్తే.. మరికొన్ని బ్యాక్టీరియాలు మంచుగడ్డలమద్యకూడా జీవించగలవు. అయితే క్రెయింగ్ సృష్టించిన బ్యాక్టీరియా మాత్రం కేవలం లాబ్లో మాత్రమే జీవించగలదు.
స్పాట్..
ఇది క్రెయింగ్ వెంటర్ ఇనిస్టిట్యూట్…వరల్డ్ మోస్ట్ కాంట్రవర్సియల్ సైంటిస్ట్ క్రెయింట్ తన ఆలోచనలకు పదును పెట్టే ప్రయోగశాల ఇది.15 సంవత్సరాల అవిశ్రాత కృషికి నేడు సజీవ సాక్ష్యం దొరికింది. అకుంఠిత దీక్షతో జీవాన్ని సృష్టించిన క్రెయింగ్ ప్రయోగాల వెనుక ముగ్గురు భారతీయ శాస్ర్తవేత్తలు కూడా ఉన్నారు.
స్పాట్
క్రెయింగ్ ఈ బ్యాక్టీరియాను రూపొందించడానికి అత్యాధునిక సింథటిక్ బయాలజీ టెక్నాలజీని ఉపయోగించుకున్నరు. జీవసంశ్లేషణ అనేది బయోటెక్నాలజీలో ఓ అద్భుత ప్రక్రియ..ఈ టెక్నిక్తోనే జీవోద్భవం సాధ్యమయిందని క్రెయింగ్ వెంటర్ చెప్తున్నడు. బ్యాక్టీరియా సింథసిస్ ప్రక్రియ వేగవంతమైతే బయో కెమిస్ట్రీలో విప్లవాత్మక మార్పులు రానున్నయిని శాస్ర్తవేత్తలు అభిప్రాయపడుతున్నరు.
స్పాట్
జీవకణంలో ఉండే కేంద్రకంలో జతలకొద్దీ క్రోమోజోములుంటయి. ఈ క్రోమోజోముల్లో డి.యన్.ఎ కణాలుంటయి. ఈ డియన్ఎ కణాల్లోనే జన్యునిర్మాణం మొత్తం లిఖించబడి ఉంటది. డియన్ఎ రెండు పోగులతో మెలితిరిగిన నిచ్చెలా ఉంటది. నిచ్చెనలో మెట్లలా ఉండే ఈ తంతువులు నాలుగు రకాలు. అడినీన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్,లు. ఇవి డియన్ఎ పోగులపై జతలుజతలగా ఉంటయి. గ్వానిన్..సైటోసిన్తో, అడినీన్ ..సైటోసిన్తోనే జత కడుతది. ఈ తంతువులు కణద్రవ్యం నిండా ఉంటయి. వీటిని రైబోజోమ్లనే కణాంగాలు ఉత్పత్తి చేస్తయి. డియన్ఎ లో ఉన్న రెండు పోగులు న్యూక్లియోజ్ ఎంజైమ్ల సాయంతో రెండు పోగులుగా విభజింపబడతది. విడిపోయిన పోగుపై ఉన్న అడినీన్, థైమిన్లు మొత్తం జీవద్రవ్యంలో విడిగా ఉన్న పోగులతో జతకట్టి ఓ కొత్త డియన్ఎ పోగు తయారయితది. ఇలా ఒక కణంలో ఒకేసారి కొన్ని వేల పోగులు తయారవుతుంటయి. జీన్ పోగుల పైనే జీవచర్యలన్నీ నియంత్రించ బడి ఉంటయి. ఆ స్పెషల్ కోడ్ నే జీనోమ్ అని పిలుస్తరు. మనిషిలాంటి అభివృద్ది చెందిన జంతువులో కొన్ని లక్షల జీవక్రియలు ఉంటయి. కానీ బ్యాక్టీరియా లాంటి ప్రాథమిక జీవుల్లో తక్కువ జీవక్రియలే ఉంటయి. కాబట్టి చాలా సింపుల్ జీన్ కోడ్ ఉంటది. దీన్ని అధ్యయనం చేయడం చాలా తేలిక. క్రెయింగ్ వెంటర్ కూడా బ్యాక్టీరియాలో ఉన్న జీన్ కోడ్ ను కాపీ కొట్ఇ అచ్చం అటువంటి జీన్కోడ్తో ఉన్న డియన్ఎ ను తన లాబ్లో సృష్టించగలిగిండు. చరిత్రలో ఇదో గొప్ప ఆవిష్కరణ. కొన్న ప్రత్యేకపరిస్థితుల మద్య లాబ్లో కల్చర్ చేసిన బ్యాక్టీరియా కణంలో ఉన్న డియన్ఎ పోగులను తొలగించి..దాని స్థానంలో వెంటర్ తాను సృష్టించిన డియన్ఎ పోగును చొప్పించిండు. ఆశ్చర్యంగా ఆ బ్యాక్టీరియా వెంటర్ సృష్టించిన డియన్ఎ కోడ్ ప్రకారం ప్రవర్తించింది. కణ విభజన, శ్వాసక్రియ వంటి జీవక్రియలతో బాటు ప్రత్యుత్పత్తి వంటి క్రియలు కూడా విజయవంతం అయినయి. అంటే వాంచిత లక్షణాలున్న బ్యాక్టీరియాను సృష్టిచుకోవడం సాధ్యమేనని వెంటర్ రుజువుచేసిండు. సైన్స్ చరిత్రలో ఓ కొత్త జాతి బ్యాక్టీరియాను సృష్టిచిన ఘనత వెంటర్కు దక్కింది.
స్పాట్
ఇదే టెక్నాలజీని ఉపయోగించి భవిష్యత్తులో వాక్సిన్లను, కాలుష్య నివారణ బ్యాక్టీరియాను, ఎయిడ్స్ లాంటి మందులకు లొంగని వైరస్ ను తినే బ్యాక్టీరియాను కూడా సృష్టించి మానవ కళ్యాణానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడాలని ప్రపంచ శాస్ర్తవేత్తలు ఆశిస్తున్నరు.

8, సెప్టెంబర్ 2010, బుధవారం

సైన్స్ ఎపిసోడ్ 12

ఎ.జనార్ధన్
ఇంట్రో యాంకర్
సకల చరాచర జగత్తులో దాగిన సూక్ష్మరహస్యాలను, విశ్వాంతరాళంలో నిక్షిప్తమైన విజ్ఞాన బాండాగారాన్ని మీ ముంగిలో దించే “ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
రిపీట్ యాంకర్.
బిగ్ బ్యాంగ్ ద్వారా ఏర్పడ్డ ఈ సకల చరాచర జగత్తులో… ఒక్క భూమి పైనే జీవరాశి మనుగడ సాధ్యమనేది శాస్ర్తవేత్తల అంచనా..మరి ఈ భూమి పైనే మనుగడ సాధ్యమెందుకయింది. అసలీ భూమి పై జీవరాశి ఎలా ఉద్భవించిందో తెలుసుకునే ముందు గతవారం చూసిన విశేషాలు ఒక్కసారి చూద్దాం.
యాంకర్ 1
ఈ సౌర కుటుంబంలో గ్రహగతులను గూర్చి అధ్యయనం చేసి భూమి సూర్యడి చుట్టూ పరిభ్రమిస్తున్న నిజాన్ని కనుగొన్నారు శాస్ర్తవేత్తలు..అంతే ఉత్సాహంతో అసలీ భూమి పై జీవరాశి ఎలా ఉద్భవించింది..జీవరాశి మనుగడకు సాధ్యమయ్యే అంశాలేమున్నయి అనే దిశగా కూడా ప్రయత్నాలు ప్రారంభించిండ్రు శాస్ర్తవేత్తలు.
స్పాట్
ఈ భూమి పై జీవం ఎలా ఉద్భవించింది అనే ప్రశ్నకు ఇప్పటి వరకు శాస్త్రవేత్తల వద్ద సరైన సమాధానం లేదు.ఈ భూమి పై విస్తరించిన సకల జీవరాశి ఎలా ఆవిర్భవించిందో తెలుసుకోవాలంటే ముందు ఈ జీవరాశి మనుగడకు ఉపయోగ పడే అంశాలేంటో పరిశోధించాలి. గాలి, నీరు , నేల, నిప్పు ఇవే ప్రతి జీవి మనుగడకు జీవనాధారమైనవి. ఈ మూడింటి సంయోగం వల్లనే జీవం ఉద్భవించిందనేది శాస్ర్తవేత్తల అంచనా.. కానీ భగ భగ మండే ఈ భూగ్రహం పైకి నీరు ఎలా వచ్చి చేరింది. ఈ నీరు భూమిని చల్లబరిచి జీవ కోటి ఆవిర్భావానికి ఎలా దారితీసింది. ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో పడ్డరు శాస్ర్తవేత్తలు. ఎందరో శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడి చేసిన పరిశోధనలో నీటికి జన్మనిచ్చింది గాలే నని తేల్చారు పరిశోధకులు. మంట మండటానికి కారణం కూడా గాలేనన్న పచ్చి నిజాన్ని పరిశోధించి తేల్చారు. ( ఈ ఒక్కలైన్ స్లోగా చదవాలి).. అవును ఈ సకల చరాచర చర జగత్తుకు మూలాధారం మన కంటికి కనిపించని వాయువే..
స్పాట్
నిర్మలంగా ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ నగరాన్ని చూశారా.. ఎత్తైన గాజు భవనాలు. రంగురంగుల విద్యద్ధీపాలతో అలంకరించ బడిన ఆకాశహర్య్మాలు. విహంగ వీక్షణం చేస్తే కనిపించే ఆ ఆధునిక నాగరికత ఆనవాలు మొదలయింది వాయువేగంతోనే..అంతే కాదు వాయువు నిర్మితమైనవే.. ఈ నగరాన్నమోత్తం రకరకాల వాయువులు ఆవరించి ఉన్నయి. నగ్నంగా ఉన్న మానవుడు అగ్గిపెట్టెల్లాంటి గృహాలకు మారే వరకు ఎన్నో మార్పులు. అన్ని మార్పులకు కారణం టెక్నాలజే.. ఈ టెక్నాలజిని నడిపించేది రకరకాల ఎయిర్ పార్టికల్స్..
స్పాట్
మన చుట్టూ మనల్ని తాకి పోయే గాలిలో కొన్ని వేల రకాల ఎలిమెంట్స్ ఉన్నయి. గాలి అంటే మన కంటికి కనిపించని ఒక అదృశ్యశక్తి అని మాత్రమే మనకు తెలుసు. కానీ సూక్ష్మంగా పరిశీలిస్తే..అసలు విషయం అవగతం అవుతది. ఇక్కడ కనిపిస్తున్న మెర్క్యురి, కార్భన్ అణువులను లోతుగా అధ్యయనం చేస్తే అణునిర్మాణం యొక్క అసలు రూపం తెలిసింది. ఇక్కడ అనేక రంగులల్లో కనిపిస్తున్న అణుజాలం మనకు కొత్త పాఠాలను నేర్పుతుంది. ఇక్కడ కనిపించే పరమాణువులు ఒకదానికి ఒకటి బంధాలను ఏర్పరచుకొని కొత్త అణువులు, కొత్త పదార్ధాల తయారీకి దారి చూపుతది. పరమాణువుల మధ్య బంధం ఏర్పడాలంటే కనీసం రెండు నుంచి మూడు పరమాణువులు అవసరం. వీటి మధ్యలో ఉండే కార్భన్ పరమాణువు హైడ్రోజన్ బందాలతో కొత్త పదార్దాలను ఏర్పరుస్తుంది. ఈ హైడ్రోజన్ బంధాల సంఖ్యను బట్టి ఏర్పడే పదార్ధాల ధర్మం ఉంటుంది. ఈ కర్భన పదార్ధాల వల్లనే ఈ ప్రకృతిలో అణువణువు ఏర్పడిందనే విషయాన్ని కనిపెట్టారు. అద్దాల మేడల్లో ఉన్న గ్లాసులన్నీ కర్భన పదార్దంతో తయారయివే..అంతెందుకు జీవద్రవ్యం, ఇంధనం, పదార్ధాలు అన్నీ కార్భన్ నిర్మితాలే..
జీవ నిర్మాణ రహస్యద్వారాల తాళ చెవి దొరికింది..
స్పాట్
ఈ ప్రకృతి పునాదుల మాటున దాగిన జీవరహస్యాలు ఒక్కోక్కటే వెలుగు చూస్తున్నయి. రసాయన ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలు వందలాది ప్రయోగాలు చేపడుతున్నరు. రసాయన శాస్ర్త పరిశోధనల్లో సాధించిన ప్రగతి జీవావిర్భావ సూత్రాలను తేలికగా ఛేదించే అవకాశం కల్పించింది. వేలాది సంవత్సరాలకు ముందే గ్రీకులు ఈ ప్రకృతి గాలి, నీరు, నేలల సంయోగమని తేల్చి చెప్పారు. కానీ దీనికి శాస్రీయ రుజువులు ఏమీ లేవు. ఆధునిక శాస్త్రవేత్తలు ఇంతకాలం చేసిన పరిశోధనలో తేల్చిన నిజం కూడా ఇదే… కానీ మోడ్రన్ సైంటిస్టులు జీవోద్భవ ప్రక్రియను కనుగొనే పనిలో ఎన్నో కొత్త విషయాలు వెలుగు చూసినయి. అందులో అసలు జీవ మనుగడకు కారణ వాయువేంటో కనుగొన్నరు శాస్ర్తవేత్తలు.
స్పాట్
బ్రేక్ యాంకర్
నింగి, నేల, ఆకాశం, వాయువు, అగ్ని..వీటిలో అన్నీ సహజంగా లభించేవే..ఒక్క నిప్పు తప్ప. ఈ నిప్పును పుట్టిచ్చే రసాయనాలు కూడా ఉన్నయంటే పెద్ద ఆశ్చర్య పడాల్సింది లేదేమో కానీ.. మానవ మూత్రం నుంచి మంటలు రేపొచ్చనే విషయం రహస్యం మీకు తెలుసా .. ఈ విషయం తెలియాలంటే చిన్న బ్రేక్ అయిపోయే వరకు వెయిట్ చేయాల్సిందే..
యాంకర్ 2
మనం గ్యాస్ స్టౌవ్ ను వెలిగించడానికి లైటర్ ను వాడుతం. ఈ లైటర్ లకంటే ముందు అగ్గిపెట్టెలే దిక్కు.ఈ అగ్గి పెట్టె తయారీలో ఏ మూలకం వాడుతరు. ఈ రసాయనం కనుగొనడానికి దారితీసిన పరిస్థితులేంటి అన్న విషయం తెలుసుకుంటే చాలా అశ్చర్యకరంగా ఉంటది.
స్పాట్
ఎలిక్ బ్రెండ్..ప్రాచీన రసాయన పరిశోధకులు..ఈయన కనగొన్న విషయం అంత సామాన్యమైనది కాదు రసాయన శాస్త్ర పరిశోధనలో ఒక మైలు రాయి అని చెప్పొచ్చు. ఇదిగో ఇక్కడ కనిపించే పరికరాలన్నీ ఆయన ఉపయోగించినవే. ఈ శాస్ర్తవేత్తలంతా నిప్పు, నీరు, గాలి ఎలా ఆవిర్భవించాయో తెలుసుకునే ప్రయత్నం చేసిండ్రు. ఎలిక్ బ్రెండ్ తాను చేసిన ప్రయోగంలో కూడా అచ్చం అటువంటి మూలకాన్నే కనుగొన్నడు.
స్పాట్
ఇక్కడ బర్నెస్ పై మరిగిస్తున్న ఈ రసాయన ద్రావణం ఓ కొత్త మూలకానికి చేసే పరిక్షలాంటిదే.. ఈ సైంటిస్ట్ చేతిలో ఉన్న శాంకవ కుప్పెలో ఉన్న అరలీటర్ యూరియల్ ద్రావణాన్ని బాగా మరిగించి… సుమారు 100గ్రాముల పరిమాణం వచ్చేవరకు చేస్తరు. ఈ ప్రక్రియలో యూరినల్ ద్రావణంలో ఉన్న ఇతర మలిన పదార్ధాలు, స్పటికాలు, లవణాలు కరిగిపోతయి. పూర్తిగా మరిగిన ఈ ఘాడ ద్రవణాన్ని స్టాండ్ కు బిగించిన ఒక పోడవాటి గాజుకుప్పెలో గాజు కడ్డీ సహాయంతో పోస్తరు. దీని కొసను మరొక కుప్పెలో అమరుస్తరు. ఇప్పడు మరలా యూరినల్ ఎక్స్ట్రాక్ట్ ను వేడిచేయగా..అది వేడి వాయువులను విడుదల చేస్తది. ఈ వేడి వాయువులు పొగలు కక్కుతూ ఒక గాజుకుప్పెలో భారంగా నిండిపోతది. పూర్తిగా తెల్లని వాయువుతో నిండిన ఈ గాజు కుప్పెలోకి ఒక రసాయన పదార్ధాన్ని వేయగా ఇదిగో ఇలా ఒక ఎక్స్ ప్లోజీవ్ లైట్ రిలీజ్ అవుతది. కళ్లు మిరిమిట్లు గొలిపే ఈ కాంతి ఎక్కడిది. అందునా నీటిలోంచి తీసిన ఓ కెమికల్ తెల్లని పొగలో వేయగానే ఇంత పెద్ద వెలుగు ఉద్భవించడం నిజంగా అద్భుతమే..ఈ అద్భుతానికి ఎలిక్ బ్రెండ్ పెట్టిన పేరు..కీవోవ్ డ్ లైట్ ఆఫ్ ఫాస్ఫరస్. అవును గాలిలో మండగల సామర్ధ్యం ఒక్క పాస్ఫరస్ కే ఉంది. గాలి, నీరు. నిప్పు, నేలల్లో నిప్పు పుట్టడానికి కారణమైన మూలకాన్ని కనుగొన్నరు శాస్త్రవేత్తలు. ఇప్పడు మన ఇళ్లలో మన వాడే అగ్గిపెట్టెలను తయారు చేసేది ఈ ఫాస్ఫరస్ ను ఉపయోగించే..
స్పాట్
ఈ ఆధునిక యుగంలో ప్రయోగాలు చేయడానికి మనకు కావలసిన పరికరాలు ఉన్నయి. మరింత సురక్షితంగా చేసేందుకు , గాజు పరికరాలు, స్టాండ్లు, సమకూర్చబడ్డయి. కానీ ఆ రోజుల్లో అన్ని ప్రయోగాలు మట్టి కుండలల్లో చేయడం తప్ప మరో మార్గం లేదు. ఎందుకంటే ప్రయోగాలకు కావలసిన వివిధ రూపాల పాత్రలు మట్టితో తయారు చేయడం ద్వారానే సాధ్యం. ఒక్కోసారి పరిశోధకులకు వారు ఎంచుకున్న పాత్రల సామర్ధ్యం సరిగా లేక వాంచిత ఫలితాలు రాక చాలా ఇబ్బంది పడ్డ శాస్త్రవేత్తలు ఉన్నరు. అంతేకాదు ప్రయోగాలు చేసే క్రమంలో జరిగే తప్పుల వల్ల ప్రాణాలు కోల్పోయింది కొదరయితే.. యాదృచ్ఛికంగా కొత్తవిషయాలు కనుగొన్నది మరికొందరు.
స్పాట్
యూరప్ మధ్యయుగంలో ఆయుధ సంపత్తికోసం ప్రయోగాలు చేయనారంబించిండ్రు. అందులో శత్రుసైన్యం పై ప్రయోగించే రసాయనాల తయారీకి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చిండ్రు. ఫిరంగుల్లో వాడే పేలుడు పధార్ధాలు. సలసలా కాగే లావాద్రవంలా శత్రు సైన్యం పై నిప్పుల వాన కురిపించాలనే లక్ష్యంతో ప్రయోగాలు చేపట్టిండ్రు.
బ్రేక్ యాంకర్
యస్..ఈ జీవరాశి మనుగడకు కారణమయిన వాయువేంటి. అసలీ వాయువుని కనుగొనడానికి దారితీసిన పరిస్థితులేంటి. చిన్న బ్రేక్ తరువాత..
యాంకర్ 2
ఈ భూమి పై ఉన్న జీవులన్ని బతకడానికి కారణ మైన వాయువు ఒక్కటే అదే ఆక్సీజన్. అయితే ఈ ఆక్సీజన్.. జీవులు బతకడానికి కారణమైన వాయువేనా ఇంకేమైనా అద్భుతాలు చేయగలదా..ఈ అనుమానం రావడానికి కారణం ఉంది. ఆక్సీజన్ ను కనుగొన్న శాస్త్రవేత్తకు ఎదురైన అనుభవాలేంటి..ఆసక్తికరమైన ఈ ఎక్స్పరిమెంట్ ను మీరే చూడండి.
స్పాట్
భూ అంతర్భాగంలో ఖనిజాలు వెలికితీసే సొరంగ మార్గంలో వాడే లాంతర్లు వెలగడానికి ఇంధనంతో బాటు ఎదో అదృశ్య శక్తి కారణమనే విషయాన్నిగుర్తించారు శాస్తవేత్తలు. పూర్తి ఇంధనం ఉన్నా గాలి తోడు లేకుంటే క్యాండిల్ ఆరిపోవడాన్ని శాస్తవేత్తలు గుర్తిచారు. ఇంతకీ ఈ మంటలను మండించే ఉత్ర్పేరకం ఏంటి..శాస్త్రవేత్తలకు ఇదొక చిక్కు ప్రశ్నగా మారింది. ఈ చిక్కుముడిని విడగొట్టి మనకు ఆక్సీజన్ పరిచయం చేసిన శాస్ర్తవేత్త జోసెఫ్ ప్రీస్ట్ల్ లీ. ఈ నేల పై భూ చరాలు. జలచరాలు, వాయు చరాలు మనుగడ సాగిస్తున్నయంటే దానికి కారణం ఆక్సీజనే. నింగి. నేల, సంముద్రం, ఆకాశం అనే తేడా లేకుండా ప్రతి జీవి జీవక్రియలకు అవసరమైనది ఆక్సీజన్.
స్పాట్
ఈ పచ్చని ప్రకృతిలో ఉన్న స్వేచ్ఛావాయువుల మాటున మర్మాన్ని కనిపెట్టేందుకు ప్రెట్స్ లీ తన శక్తియుక్తులను ధారబోసి మరీ ప్రయోగాలు చేసిండు…ప్రీస్టీ లీ తన ప్రయోగం కోసం రకరకాల పదార్ధాలను వేడి చేసి పరిక్షించిండు. ఇక్కడ కనిపించే పసుపు వర్ణం రసాయనం మెర్క్యురిక్ ఆక్సైడ్.. కొంత పదార్ధన్ని వాచ్ గ్లాస్ లో తీసుకొని దానిని ద్రావణలో వేసి అత్యధిక ఉష్ణోగ్రత వరకు వేడి చేసిండు. ఆ పదార్ధం క్రమేపి నల్లగా మారి ఒక మెరిసే ద్రావణంలా రూపొందింది. ఈ మెరిసే ద్రవం మెటల్ గా గుర్తిచారు. ఇది ద్రవరూప లోహం మెర్క్యురీ..
స్పాట్
పసుపు పచ్చని పదార్ధాన్ని వేడిచేయగా.. మెర్యురీతో బాటు నీటిబుడగలు ఏర్పడటం శాస్ర్తవేత్తలు గమనించిండ్రు.ఈ నీటి బుడగలను గాజుకుప్పె అడుగు బాగంలో పట్టి ఉంచిండ్రు. ఈ వాయువు దగ్గర ఒక వెలిగించిన అగ్గిపుల్లను పెట్టగా అది మరింత కాంతివంతంగా వెలగనారంభించింది. ఆ వెలిగే పుల్లను తీసి ఆర్పివేసి మళ్లీ ఆ గాలిలో ఉంచినా తిరిగి మళ్లీ కాంతిమంతంగా వెలుగుతోంది. అంటే మంట మండటానికి అవసరమైన వాయువు ఆక్సీజన్ అనే విషయం స్పష్టమైంది.
యాంకర్
1774లో ప్రిస్లీ ఆక్సీజన్ ను కనుగొన్నడు. ఎప్పటి నుంచో కొత్త విషయాన్ని ఆవిష్కరించాలన్న తపన ఆక్సీజన్ కనుగొనడంతో తీరింది.
వాయిస్
ప్రిస్లీ ఆక్సీజన్ ను కనుగొనడానికి గాజు జాడీ పాత్ర మరువలేనిది. అతను ప్రయోగం చేసిన గాజుజాడీని అతని గుర్తుగా ఇప్పటికీ పదిలంగా ఉంచిండ్రు. ఆక్సీజన్ను కనుగొన్నంక ప్రీస్లీకి తగిన గౌరవం లభించింది. ప్రెంచ్ ఎక్స్ పరిమెంటల్ లాబరేటరీ కి చెందిన గోల్డెన్ కపుల్స్ మేరియానా, లుథియన్ ల నుంచి ఆహ్వానం అందింది. అక్కడి ప్రయోగ శాలలో పూర్తి స్థాయి నిబద్దత గల ప్రయోగాలకు అనుకూలంగా ఉంది. ప్రతి ప్రయోగం నిర్ణీత కొలతలతో చేయదగిన వీలు ఉంది. మేరియానా దంపతులకు సైన్స్ ను ఆధునిక పద్దతుల్లో తీర్చిదిద్దాలనే బలమైన కోరిక ఉంది. అందుకే వారి లాబ్ లను అధునాతన పద్దతిలో తీర్చి దిద్దిండ్రు. ప్రీస్లీ ఆక్సీజన్నైతే కనుగొన్నాడు కానీ దాని ధర్మాలు పూర్తిగా వివరించలే పోయిండు. ఏదో మండే వాయువుని కనుగొన్నాననే భ్రమలో ఉన్నడు. తరువాత కాలంలో తాను కనిపెట్టిన వాయువు ఎంత గొప్పదో తెలుసుకొని ఆశ్చర్యపోయిండు. ఈ కపుల్స్ లాబరేటరీలో చేసిన ప్రామాణిక పరిశోధనలు ప్రీస్లీకి మంచి ఫలితాన్నిచ్చినయి.
స్పాట్
ప్రీస్లీ సాధించిన ఈ ఘనత ఆధునిక ప్రామాణిక రసాయన శాస్త్రానికి మార్గదర్శకంగా నిలిచింది. రసాయన శాస్త్రంలో కచ్ఛితత్వం పాటించడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తయో గూడ నిరూపిత మయింది.
స్పాట్
ఆధునిక రసాయన శాస్త్రం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది.ముందుగా సమాజ అవసరాలు( ఫిరంగి షాట్) తీర్చడానికి ప్రయోగాలు చేపడుతరు. ఈ ప్రయోగాలు చేపట్టడంలో నైపుణ్యాలు తప్పనిసరి. అంతేకాదు రసాయన పదార్ధాల లక్షణాలు తెలిసి ఉండటం ఒక వంతయితే, వాటిని ఏఏ ప్రయోగాలకు వాడుకోవచ్చనే విచక్షణ మరో వంతు. అంటే ఏ పదార్ధాన్ని వేడి చేస్తే..లేదా మరోక ప్రక్రియకు గురిచేస్తే ఇతర వాయువులు వస్తయో తెలిసి ఉండాలి. వీటికి ఎంత పరిమాణంలో రసాయనాలు తీసుకోవాలో కూడా పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడే అది పరిపూర్ణ రసాయన ప్రయోగం అవుతది. ఈ కొత్త రసాయనశాస్రం కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.

సైన్స్ ఎపిసోడ్ 13

ఎ.జనార్ధన్
ఇంట్రో
మనం నివసిస్తున్న ఈ భూమి మొత్తం ప్రకృతి రహస్యాల పుట్ట. ఆ రహస్యాల సమాహారాన్ని మీకందించే దిసైన్స్అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
బ్యాంగ్
యాంకర్ 1
ఈ భూమి పై కోటాను కోట్ల రకాల ప్రాణులు ఉన్నయి. ఈ ప్రాణులు ఎలా ఉద్భవించినయి. భగభగ మండే అగ్నిపర్వతం లాంటి భూమి నుంచి ఇన్ని కోట్ల రకాల జాతులు ఎలా పుట్టుకొచ్చినయి. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, ఒకటేమిటి జీవం ఇదీ అదీ అని లేకుండా ప్రకృతి నిండా తొణికిసలాడుతోంది. ఎక్కడిదీ జీవం..ఇది అనాదిగా శాస్ర్తవేత్తల మెదడును తొలుస్తున్న జీవరహస్యం...
జీవరహస్యం బ్యాంగ్.
రిపీట్ యాంకర్
భూమి పై జీవోద్భావ రహస్యాలను తెలసుకోవాలన్న తపన ఇప్పటిది కాదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి తత్వవేత్తలు, శాస్ర్తవేత్తలు ఈ చిక్కుముడిని విప్పేందుకు ఇప్పటి వరకు ప్రయత్నిస్తునే ఉన్నరు. ఈ చిక్కుముడులన్నీ ఒక్కొక్కటే తొలిగి పోతున్నయి. జీవోద్భవ రహస్యం తెలిసి పోతోంది. ఈ రహస్యాల మూలాలను చూసే ముందు గత వారం మనం చూసిన జీవరహస్యాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం...
రిపీట్ స్టోరీ...
మళ్లీ జీవరహస్యం బ్యాంగ్ కొద్దిగా...
యాంకర్ 2
అవును ఈ విశ్వం మొత్తం బిగ్ బ్యాంగ్ ప్రయోగం ద్వారా ఏర్పడిందనే వాదన ఉంది. అయితే ఈ విశ్వవిస్పోటనంలో మంటలు రేపే మహా ప్రళయం లోంచి జీవ కణాలు ఎలా తయారయ్యాయి. ఈ భూ గ్రహం పైకి నీరెలా వచ్చి చేరింది. ఆ విశ్లేషణలోంచి ఆవిర్భవించిందే ఆక్సీజన్. ఒక్క ఆక్సీజన్ కనుగొనడంతో విషయం పూర్తికాలేదు. ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో విషయాలు ఈ జీవ భాగాహరం లో శేషాలుగా మిగిలిపోయినయి. ఇంతకీ ఏంటా జీవరహస్యాలు...
స్పాట్
ఈ సృష్టిలో ఉన్న కోటాను కోట్ల గెలాక్సీలలో ఒక్క సౌరకుటుంబంలోనే జీవం ఉన్నట్టు ఇప్పటి వరకు దొరికిన ఆనవాళ్లను బట్టి తెలుస్తుంది. ఈ భూమి పై జీవం పుట్టడానికి దారి తీసిన కారణాలు ఏంటి. జీవోద్భవానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి. ఈ విశాల ప్రకృతి నిండా తొణికిసలాడే జీవద్రవ్యం ఎలా వచ్చింది. అన్న ప్రశ్నలు మన శాస్త్రవేత్తలను వేలాది సంవత్సరాలుగా వేదిస్తున్నయి.
స్పాట్
పచ్చని ప్రకృతి.. పిల్లగాలులు.. వెచ్చని వాతావరణం. ఈ భూ గ్రహానికే సొంతం. ఈ సౌరకుటుంబం మొత్తంలో ఒక్క ఈ భూమి పై మాత్రమే జీవ మనుగడ సాధ్యమనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. అయితే ఏ జీవావరణాన్ని పరిశీలించినా తేలేది ఒక్కటే..ఈ జీవోద్బవానికి కారణం. నింగి, నేల, ఆకాశం, నీరు, నిప్పు. ఈ పంచభూతాల సంగమంగా నే జీవం ఉద్భవించిందనేది శాస్ర్తవేత్తల వాదన.
స్పాట్
యస్. నిజంగా ఈ పంచభూతాల సాక్షిగా జీవం ఉద్భవించిందనే అనుకుంటే అసలు ఈ పంచభూతాలలోకి నీరు ఎక్కణ్నించి వచ్చిందనే ప్రశ్న కూడా శాస్త్రవేత్తలకు చాలాకాలం చిక్కుముడిగానే మిగిలిపోయింది. అవును మహా విస్పోటనం ద్వారా విడివడి భగభగ మండే భూగోళం ఉపరితలం పైకి నీరెలా వచ్చింది. ఈ ప్రశ్నలన్నిటికి సరైన సమాధానం కనుగొందామనుకున్నా ఆరోజుల్లో నీటిని విశ్లేషించే మార్గం దొరకలేదు. ఈ నీటి గురించి చాలా మంది మేథావులు చేసిన వ్యాక్యానాలు నీటిమీది రాతల్లాగే చరిత్ర గమనంలో చెరిగిపోయాయి. కాని ఆధునిక శాస్ర్త సాంకేతిక పరిజ్ఞానం మరింత పెరిగాక మనిషి గాలిలో ఉన్న ధాతువులను కూడా తేలికగా పసిగట్టగలుగుతున్నడు.
బ్రేక్ యాంకర్
ప్రీస్లీ ఆక్సీజన్నైతే కనుగొన్నాడు గానీ..దీని ఉపయోగాలు పూర్తిగా తెలియలేదు. అసలు జీవ పదార్ధానికి ఆక్సీజన్ కు లింకుందన్న విషయం కూడా అతనికి తెలియదు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఆక్సీజన్ అంటే ఒక మండించే వాయువని మాత్రమే తెలుసు..మరి ఆక్సీజన్ అసలు స్వరూపం ఎప్పుడు బయట పడింది. ఈ సృష్టి నిర్మాణానికి పునాది వేసిన మూలకాల్లో ఆక్సీజన్ కూడా ఒకటన్న విషయం ఎప్పుడు తెలిసింది చిన్న బ్రేక్ తరువాత..
యాంకర్ 3
రసాయన శాస్ర్తం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ..ఎందుకంటే ఒక మూలకం మరొక మూలకంతో సంయోగం చెంది అప్పటి కప్పుడు కొత్త సమ్మేళనంగా రూపుదాల్చడానికి ఎంతో సమయం పట్టదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రిస్ట్లీ ఆక్సీజన్ వాయువును కనుగొన్నడు.నిజానికి మన జీవితంలో జరిగే అద్భుతాల నుంచే చాలా రహస్యాలు వెలుగు చూస్తయి. అటువంటి దే ఇప్పుడు మీరు చూడ బోయేది.
స్పాట్
జీవోధ్భవానికి పంచభూతాల్లో ఒకటైన వాయువు పాత్ర మరవలేనిది. ఇప్పటి వరకు గాలి అంటే..రంగు రుచి వాసన లేనిది. కానీ జోసెఫ్ ప్రీస్ట్లీ ఆక్సీజన్ ను కనుగొన్నంక.. వాయువుకు రంగు రుచి వాసన ఉండగలవని, వీటితో బాటు కొన్ని వాయువులకు ప్రత్యేవమైన ధర్మాలుంటయని తెలియవచ్చింది. ప్రీస్ల్టీ కనుగొన్న వాయువుకు అంత శక్తి ఉంటదని అతనికే తెలియదు. కానీ ఆక్సీజన్ను కనుగొనడం ద్వారా ప్రీస్ల్టీ రసాయన శాస్ర్తంలో ఓ గొప్ప ఆవిష్కరణకు దారి తీశాడన్న సత్యం మరువలేనిది.
స్పాట్
వేల సంవత్సరాల నుంచి మన సంస్కృతీ సంప్రదాయాలతో అనేక విషయాలు ముడివేసుకొని ఉన్నయి.. నిజానికి వాటన్నిటిని మనం కేవలం అద్బుతాలుగానే పరిగణలోకి తీసుకుంటం.కానీ ఆ అద్భుతాల మాటున దాగిన రహస్యమేంటని మాత్రం అలోచించం.. అలా ఆలోచించడం తప్పని కూడా వాదించేవారు లేకపోలేదు. ఎందుకంటే ప్రకృతిలో జరిగే ఈ అద్భుతాలన్నీ దైవ ప్రసాదితమని ఒక బలమైన నమ్మకం.
స్పాట్
ఇదిగో ఇక్కడ వీరు చేసే హడావుడి చూడండి.. వీరంతా ప్రతి సంవత్సరం జరిగే బెలూన్ వేడుకకు హాజరువుతున్నరు. సిటీలో ఉన్న పౌరులంతా ఒక్కచోట చేరి ఈ ఉత్సవాన్ని తిలకిస్తరు.ఇక్కడ నిలువుగా కనిపించే పెద్ద ప్లాస్టిక్ తొడుగుకు తాళ్లు కట్టి వేలాడ దీస్తరు. దీని అంచులకు ఒక రింగు మాదిరి నిర్మాణాన్ని తేలిక రకం దారాలతో కడతారు. బెలూన్కు మద్యలో చుట్టూ తిరుగుకుంట వీరు చేసే ఈ పనిని చుట్టూ హాజరైన ప్రజలు ఆసక్తిగా తిలకిస్తుంటరు. ఈ రింగ్ కట్టడం పూర్తయ్యాక బెలూన్ మద్యలో ఒక పాత్రలో ఎండు గడ్డిపరకలు వేసి మంట పెడతరు. ఈ మంటలో ఒక రకమైన కెమికల్ వేయడం ద్వారా వచ్చే ఆవిరులను బెలూన్ లోకి పంపిస్తరు. ఈ వేడిగాలికి బెలూన్ పైకి ఎగిరిపోకుండ చూట్టూ గట్టిగా పట్టుకుంటరు. ఈ వేడి ఆవిరులు బెలూన్ లో నిండే కొద్దీ బెలూన్ పైకి ఎగబాకుతుంది. ఈ బెలూన్ అమాంత గాలిలోకి ఎగరకుండా మనుషులు గుంజి పట్టుకోవడం తో బాటు బలమైన తాళ్లతో గుంజి కడతరు.
స్పాట్
బెలూన్ నిండా గాలి నిండాక ఒక్కసారి అంతా ఒదిలేస్తరు. అంతే పంజరాన్నివీడిన పక్షిలా బెలూన్ ఆకాశంలోకి రివ్వున ఎగిరిపోతది. రెక్కలు లేని విహంగంటా పట్టణ ప్రజలకు గుడ్ బై చెప్పుకుంగా నింగిలోకి దూసుకు పోతది. ఈ వింత చూసేందుకు ప్రజలంతా ఇక్కడ చేరినా ఈ బెలూన్ గాలిలోకి ఎగరడం వెనకున్న రహస్యం ఏంటనే విషయం ఎవరికీ తెలియదు.ఈ వేడి బెలూన్ను మొదటిసారి 1783లో ఎగరేసిండ్రు. అప్పటి నుంచి ఈ ప్రక్రియ ప్రజలకు ఒక వింత గానే తోచింది. దశాబ్ద కాలం తరువాత గానీ దీని వెనకున్న మర్మం బయట పడలేదు.
స్పాట్
ఇదిగో ఇక్కడ యువ పరిశోధకులు ఉత్సాహంతో చేసే ప్రయోగం చూడండి. గతంలో ఎండు గడ్డిపరకలతో పంపించే వేడిగాలుల స్థానంలో ఇప్పడు తాజాగా హీట్ వెపర్ మిషన్లు వచ్చేశాయి. ఈ మిషన్ల సాయంతో బెలూన్ లోకి వేడి గాలులను పంపిస్తరు. ఎంతో ఎత్తుకు ఎగిరే బెలూన్ తో బాటూ మనిషి కూడా ఎగిరితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందే ఆలస్యం ..ఈ బెలూన్ కు ఒక తొట్టి కట్టిండ్రు..అంతే ఈ బెలూన్ కు చివర బాగంలో ఒక వెదురు తొట్టి కట్టి అందులో ఇద్దరు నుంచి ముగ్గురు మనుషులు ఎక్కి పైకి వెళ్లడం నేర్చుకున్నరు.
స్పాట్
ఏ యంత్రాలు అవసరం లేని సహజ శక్తిని ఉపయోగించుకొని, మానవుడు భూ ఉపరితలం పై విహంగవీక్షణ చేయడం అలవాటు చేసుకున్నడు. పచ్చని ప్రకృతిని భూమి ఎత్తుల్లోంచి ఆస్వాదించడం అలవాటు చేసుకున్నడు. ఆకాశంలో నుంచి చూస్తే భూమి ఎలా కనిపిస్తదో గమనించిండు.
స్పాట్
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదుల సంఖ్యలో బెలూన్ లు ఆకాశంలో పక్షుల గుంపుల వలె ఎగరడం మొదలయింది. ఆకాశంలో విహరించడానికి ఇదొక మార్గంగా ఎంచుకున్నడు ఆధునిక మానవుడు. కారణం ఈ బెలూన్ ఎక్కువ బరువును మొయగలగడానికి గల కారణమేంటో కనుగొన్నరు. ఆ సూత్రంతోనే ఈ బెలూన్ ను మరింత ఎక్కువ వాడకంలోకి తెచ్చిండ్రు.
స్పాట్
ఇంతకీ ఈ బెలూన్ ను ఆకాశ వీధుల్లో తిప్పే వాయువు ఏంటి..ఈ బెలూన్ ను గగన విహారం చేయించే అదృశ్య శక్తి ఏంటి..వీటన్నిటికి వెనకున్న రసాయన రహస్యాలేంటి...తేల్చేశారు శాస్ర్తవేత్తలు.
స్పాట్
బ్రేక్ యాంకర్
గాలిని నింపుకొన్న గాలి బెలూన్‌ అంత ఎత్తుకు ఎగరడానికి కారణం ఏంటి. ఇంతకీ ఆ బెలూన్ ఎగరడం వెనుక ఉన్న రహస్యం ఏంటి. చిన్న బ్రేక్ తరువాత..
యాంకర్ 4
శాస్ర్తవేత్తలకు ఎన్నోరోజులనుంచి ఎదురు చూస్తున్నరోజు రానే వచ్చింది. ఎగిరే బెలూన్ రూపంలొ పరిశోధకులకు ఓ మంచి మార్గం దొరికింది. ఈ ఎగిరే బెలూన్ ను ఆకాశంలో తిప్పే అదృశ్యశక్తి ఏంటి. కనిపెట్టేశారు సైన్టిస్టులు.
స్పాట్
ఇక్కడ ఒక రసాయన శాస్ర్తవేత్త చేస్తున్న ప్రయోగం ఒక్కసారి చూద్దాం. ఈ పటంలో చూపినట్టు ఒక వైపు ఫన్నెట్ ట్యబ్..దానికి కనెక్ట్ చేస్తూ ఒక గ్లాస్ ట్యూబ్ ఉంటది. ఈ గ్యాస్ ట్యూబ్ ఒక ఓవెన్ గుండా వెళ్తది. ఈ ఓవెన్ లోంచి వచ్చే హీట్ ను రెగ్యులరైజ్ చేయడానికి ఐరన్ను వాడుతరు. ఈ ట్యూబ్ ను కాపర్ కాయిల్స్కు కనెక్ట్ చేస్తరు. ట్యూబ్లో రిలీజ్ అయిన వెపర్ను కూల్ చేసి వాటర్ వెపర్ మొత్తం కిందికి సెటిల్ అయి కేవలం గ్యాస్ మాత్రం బయటకు రిలీజ్ అవుతది. ఈ గ్యాస్లో ఆక్సీజన్ తో బాటు మరో మండే వాయువు విడుదల అవుతది. ఈ ఆక్సీజన్ వాయువు కాపర్ తో చర్య చెంది క్యూప్రిక్ ఆక్సైడ్ గా మారుతది. ఇక మిగిలిన వాయువును గాజు జాడీలో బందిస్తరు.
స్పాట్
ఈ వాయువును ఒక గాలి తగలని ప్రదేశానికి తీసుకెళ్లి..జాడీలో మండుతున్న పుల్లను ఉంచగా అది ఇంధనం అంటుకున్నట్టు మరింత కాంతి వంతంగా మండటం గమనించిండ్రు. ఈ వాయువు పేరే హైడ్రోజన్. దీన్ని కనిపెట్టిన శాస్ర్తవేత్త కావెండిష్. అయితే ఈ వాయువుకు హైడ్రోజన్ అని పేరు పెట్టినది మాత్రం లీవోయిజర్.
స్పాట్
హైడ్రోజన్ కనుగొన్నంక దీనిని శాస్ర్తవేత్తలు అనేక ప్రజా ప్రయోజనాలకు వాడుకున్నరు. హైడ్రోజన్ అత్యంత తేలికైన వాయువు. అందుకే హైడ్రోజన్ నింపిన బెలూన్ అత్యంత ఎత్తుకు ఎగరగలదు. అంతే కాదు ఈ వాయువుకు కాస్త మంట తగిలితే చాలు భగ్గున మండుతది. అందకే ఈ హైడ్రోజన్ నింపిన చిన్నచిన్న బెలూన్లను శత్రు సైన్యం మీదికి పంపి వాటిని సూర్యరశ్మితో పేల్చేసే వారు. అంతగా టెక్నాలజి అభివృద్ది చెందని కాలంలో కూడా హైడ్రోజన్ బాంబ్ ను ఉపయోగించి శత్రు సైన్యాన్ని దెబ్బతీసేవారు.
స్పాట్
ఆధునిక శాస్ర్త పరిజ్ఞానం పెరిగాక హైడ్రోజన్ ను రకరకాలుగా వాడుకోవడం మొదలు పెట్టిండ్రు. ఇప్పడు వాహనాలకు ఇందనంగా హైడ్రోజన్ వాయువును వాడుకుంటున్నరు.
స్పాట్
అవును ఇదో పెద్ద విచిత్రం. నీటిని విశ్లేషిస్తే రెండు మండే వాయువులు వెలువడ్డయన్నమాట. అంటే అగ్నికి ఆజ్యం పోసే రెండు వాయువులు అగ్నిని చల్లార్చే నీరుగా మారుతాయన్నమాట. ఇదో ప్రకృతి వింత..మరో జీవరహస్యం.
స్పాట్
అంటే గాలిలో ఉన్న రెండు వాయువులు కలిసి నీటిని ఏర్పరచాయనడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరోటి లేదు. అంటే భగభగ మండుతున్న భూగోళంలో వేడి ఆవిర్లలో విడుదలయిన ఆక్సీజన్, హైడ్రోజన్ వాయువులు కలిసి H2O గా మారినయి. అంటే నీటి ఆవిరిగా మారి తిరిగి ఇదే భూమి పై పడి క్రమేపి భూమి తాపాన్ని చల్లార్చినయన్న విషయాన్ని నిర్ధారించిండ్రు శాస్త్రవేత్తలు.
ఎండ్ యాంకర్
ఇవి ఈ వారం సైన్స్ విశేషాలు మరిన్ని సైన్స్ విశేషాలతో వచ్చే వారం కలుసుకుందా..అంటిల్ దెన్ బైబై..

సైన్స్ ఎపిసోడ్ 14

ఎ.జనార్ధన్‌
ఈ ప్రకృతి పరిణామ క్రమానికి దోహదం చేసింది వాయువేనని శాస్ర్తవేత్తలు కనిపెట్టేశారు. అయితే వాయువు మీద ఎప్పటి నుంచో ఉన్న అభిప్రాయాలు ఒక్కోక్కటే మారిపోసాగినయి. అప్పటి వరకు మంచి వాయువు చెడు వాయువు రెండే రకాలన్న అభిప్రాయం ఉండేది. కానీ వాయువుల్లోనూ అనేక రకాలుంటయన్న నిజం తెలిసింది. ప్రిస్లీ ఆక్సీజన్ ను, లీవోయిజర్, కావెండిష్ లు హైడ్రోజన్ ను కనుగొన్నాక రసాయన శాస్ర్తంలో వాయువుల ప్రాధాన్యత పై మరింత ఆసక్తి పెరిగింది శాస్ర్తవేత్తలకు..
స్పాట్
వాయు రసాయన పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చని వాడు హంఫ్రీ డేవి.
స్పాట్
హంఫ్రీ డేవి...బ్రిటీష్ రసాయన శాస్ర్తవేత్త..ఎన్నో అరుదైన అద్భుతవిషయాలను ఆవిష్కరించిండు. ఆల్కలీ, ఆల్కలీన్ మూలకాలను కనుగొని రసాయన శాస్త్రంలో కొత్త దారులు చూపిడు. నవ్వు తెప్పించే నైట్రస్ ఆక్సైడ్ కనుగొన్నడు. అంతేకాదు. రసాయన పరిశోధనల్లో అత్యంత పాముఖ్యత కలిగిన పొటాషియ, సోడియం, క్లోరిన్ ల ఉపయోగాలను ధర్మాలను కనుగొన్నది కూడా ఇతనే. గనుల్లో కార్మికులకు వెలుతురు పంచే హంఫ్రీ లాంప్ కూడా ఈయన చలువే.. డేవి..ఇంత గొప్ప మేథావి కనుకనే రాయల్ ఇన్స్టిట్యూషన్ కు సెక్రటరీగా కొనసాగిండు.
స్పాట్
హంఫ్రీ డేవి కనుగొన్న రసాయని అద్భుతాలలో నైట్రస్ వాయువు ఒకటి. ఇది వైద్యరంగంలో సర్జరీలు చేయడానికి ఎంతో ఉపకరిస్తున్నది. ఈ వాయువు నొప్పి తెలియకుండా చేయగల సెడేటివ్.ఇది క్లోరోఫాం కంటే ముందే కనుగొన్నరు. దాని కంటే తక్కువ శక్తి కలిగి ఉంటుంది. దీన్ని సాధారణంగా డెంటిస్ట్లు ఉపయోగిస్తారు. అయితే ఆ వాయువు పీల్చినవారు కొద్దిసేపు గాల్లో తేలినట్టు ఒకరకమైన ఆనందంలో ఉంటరు. కొంతమంది చిరునవ్వులు నవ్వితే, కొద్దిమంది గట్టిగానే నవ్వుతారు. అందుకే నైట్రస్ ఆక్సైడ్ని లాఫింగ్ గ్యాస్ అంటారు. ఈ వాయువును మొదట డేవి తన మిత్రులతో విలాసంగా వాడుకునే వాడు. పార్టీలలో తన మిత్రులను ఆట పట్టించడానికి నైట్రస్ ఆక్సైడ్ ను వాడుకొనే వాడు. ఈ వాయువును ఎక్కువగా వాడితే దీనికి బానిస అయ్యే ప్రమాదం లేకపోలేదు. అప్పట్లో డబ్బున్న వారంతా ఈ గ్యాస్ కోసం బారులు తీరేవారు.
స్పాట్
డేవీ.. సహజంగా ప్రకృతి ప్రేమికుడు..చిన్నపాటి కవి కూడా..అందుకే ఆయనకు పచ్చని ప్రకృతి అన్నా, దోరగా కనిపించే పూల గుత్తులన్నా ఎంతో ఇష్టం..ఆ పరిమళాలలో ఉన్న ఆనందం వర్ణ నాతీతమైనదని అతని కవిత్వంలో పేజీలకు పేజీలు రాసుకునే వాడు. ప్రకృతి పచ్చదనంలో, గడ్డిపరకల కదలికలల్లో, పూల ఎదలోతుల్లోంచి వచ్చే పరిమళాలకున్న శక్తి తెలుసుకొని వాటిల్లో ఉన్న ఆనందం ఎంత విలువైనదో తెలుసుకున్నడు. ఈ ప్రకృతిలోని ప్రతి కదలికలో ఏదో తెలియని శక్తిఉన్నదని బలంగా నమ్మేవాడు. ఆ ఆనందం తను కూడా ప్రజలకు అందివ్వాలనే లక్ష్యంతో అనుభూతినిచ్చే ఈ నైట్రస్ ఆక్సైడ్ వాయువును కనుగొన్నానని తన డైరీలో రాసుకొండు డేవి.
స్పాట్
డేవి తన పరిశోధనలన్నీ లండన్లోని ది రాయల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ లోనే చేసిండు. సరిగ్గా రెండొందల సంవత్సారలకు పూర్వమే డేవీ రసాయన శాస్ర్తంలో అద్భుతాలు సృష్టించిండు. ఇప్పడు ఇక్కడ శాస్ర్తవేత్తలు పరిశీలించే ప్రయోగ ఫలితాలు డేవీ ఆరోజుల్లో కనుగొన్నవే..చూడటానికి ఆశ్చర్యాన్ని, భయాన్ని ఒకేసారి కలిగించే ఈ ప్రయోగాలలో ఉన్న మర్మం చూడండి..
స్పాట్
ఇప్పడు మీరు చూసిన ఈ మెరుపులన్నీ సోడియం, పొటాషియం మూలకాలు చేసే చిత్రాలు. వాటిలో ఉన్న ఎక్స్ ప్లోజివ్ పవర్ ఎంత హై రేంజ్ లో ఉంటదో ఇక్కడ కనిపించింది. చిటికెడు కెమికల్ తో మంటలు మండించవచ్చు, ప్రేలుళ్లను సృష్టించవచ్చన్న సూత్రాన్ని ప్రపంచానికి తెలపిన మహాశయుడు డేవి.
స్పాట్
డేవి ప్రయోగాల తరువాత రసాయన శాస్ర్తం ప్రజల్లోకి వెళ్లింది. రసాయన శాస్ర్తంలో తాను కనుగొన్న మూలకాలకు ఎంతో ప్రాముఖ్యం లభించింది. ఇదిగో ఇక్కడ శాస్ర్తవేత్తలు చేసే ప్రయోగం చూడండి. ఈ ప్రయోగాన్ని డేవీ రెండొందల ఏండ్లకు ముందే చేసిండు. తెల్లటి పొడిని ఒక చిన్న ఇనుప తొట్టిలో పోసి, దాన్ని ముందు మంటతో వేడి చేస్తరు. ఆ తరువాత వేడి అందలోకి ఎలక్ట్రిసిటీ పంపిస్తరు..అంతే..చిటపట మనుకుంటూ వేడివేడి పొగలు కక్కుకుంటూ తారా జువ్వల్లా పేలిపోతుంటది. అవును ఇది పెద్దపెద్దబ్లాస్టింగ్ లల్లో ఉపయోగించే పొటాషియం..పొటాషియం ఎంత పెద్దపెద్ద పనులు చేయగలదో తన ప్రయోగాల ద్వారా నిరూపించిండు డేవి.
స్పాట్
ప్యూర్ పొటాషియం ను చిన్న చిన్న బిళ్లలుగా కోసి..ఒక చిన్న ముక్కను తీసుకొని దానిని ప్రయోగ ద్రావణంలో వేయగానే ఒక్కసారి పెద్దగా పొగలు కక్కుతూ పేలిపోవడం గమనించిండ్రు. అదే తరువాత కాలంలో పేలుడు పదార్ధాల తయారీకి పునాదిగా మారింది.
స్పాట్
18వ శతాబ్దం దాటి 19వ శతాబ్దం మద్యకాలంలో రసాయన శాస్త్రంతో ప్రజలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకుంది. రసాయనాలంటే కేవలం పదార్ధాలే కాదు..వాతావరణం, చెట్టూ చేమ అన్నీ అని తెలిసింది.. ఇది జమైకాలోని ఒక పర్యాటక ప్రాంతం.. ఆ రోజుల్లో మలేరియా జ్వరం ప్రజలను పీడించే మహమ్మారి. దానికి సరైన మందు లేక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నరు. ఎన్ని రకాల మందులు కనిపెట్టినా మలేరియా బారి నుంచి ప్రజలను కాపాడలేని పరిస్థితి. అప్పుడు ప్రకృతి రసాయనాల వైపు చూశారు శాస్ర్తవేత్తలు.
స్పాట్
ఇక్కడ పచ్చగా కనిపిస్తున్న ఈ చెట్టు పేరు సింకోనా మొక్క. ఇది ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసిన మలేరియాకు కళ్లేం వేసిన చెట్టు. దీని బెరడు మలేరియాకు చక్కని దివ్యౌషదం. ఈ బెరడు కొంచె ముక్క కోసుకొని నోట్లో వేసుకుంటే వగరు, చేదు కలిపిన రుచుల్లో ఉంటది. ఈ విషయం తెలుసుకున్నాక సింకోన మొక్కలను విరివిగా పెంచడాన్ని ప్రోత్సహించినయి ప్రభుత్వాలు.
స్పాట్
ఈ మొక్క చేసిన మేలు అంతా ఇంతా కాదు. వాస్తవానికి 1820లో ఈ సింకోనా మొక్క బెరడులో ఇంత సంక్లిష్ట రసాయనం ఉంటుందని ఒక ఫ్రెంచ్ శాస్ర్తవేత్త కనుగొనే వరకు ఎవరికీ తెలియదు. దానికే క్వినైన్ అని పేరు పెట్టిండు.
స్పాట్
సింకోనా మొక్క నుంచి క్వినైన్ తయారు చేయాలంటే ఎంతో ప్రయాసతో కూడిన పని. మొక్క పెరిగి దాని బెరడు ముదిరి పక్వానికి వచ్చే వరకు నిరీక్షించాలి. అంతేకాదు లక్షలాది మంది ప్రజలకు కావలసిన మందును సమకూర్చడానికి వేలాది ఎకరాల్లో సింకోనా పండించాలి. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా క్పినైన్ కెమికల్ ను తయారు చేయడం ఛాలెంజ్ గా తీసుకున్నరు శాస్ర్రవేత్తలు. ఈ క్వినైన్ ను ఇతర అవసరాలకు కూడా వాడుతరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచాలన్నిరంగులమయం చేయడంలో క్వినైన్ పాత్ర మరువలేనిది.
స్పాట్
19వ శతాబ్దంలో విలియం హెన్రీ పెర్కిన్ చేసిన అద్భుత ప్రయోగం ఈ ప్రపంచాన్నిరంగుల వలయంలో ముంచింది. ఇక్కడ మనకు కనిపిస్తున్న పురాతన భవనం పెర్కిన్ ప్రయోగాలు నిర్వహించిన భవనం. ఇక్కడ ఒక శాస్ర్తవేత్త పెర్కిన్ ప్రయోగాలను పునరావృతం చేయడం చూడవచ్చు.
విద్యుత్ లైట్లు అంతగా ఉపయోగంలోకి రాని ఆ కాలంలో ఎక్కువగా గ్యాస్ లైట్లు వినియోగించే వారు. ఈ గ్యాస్ లైట్లను వెలిగించడానికి బొగ్గును కూడా వాడే వారు. వీటి ఉప ఉత్పత్తి ఈ కోల్తార్. ఈ కోల్ తార్ తో బాటు హైలీ టాక్సిక్ సబ్స్టెన్సెస్ క్వినైన్ ను, పొటాషియం డై క్రోమేట్, సల్ఫ్యూరిక్ ఆసిడ్, ఎనలీన్ ల నుపయోగించి మొట్టమొదటి రంగును తయారు చేసిండ్రు. ఈ ఎనలీన్ లో కార్భన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సీజన్లు కూడా ఉంటయి. ఈ మిశ్రమాలన్నీ కలిపితే ఇదిగో ఈ గాజు జాడీలో లాగా నల్లని ప్రెస్పిటేషన్ తయారవుతది. ఈ కొంచెం పౌడర్ కు డైల్యూటెడ్ సల్ఫూరిక్ ఆమ్లాన్ని కలిపి క్లాత్ కు అప్లై చేసిండు. అంతే మొట్ట మొదటి సింథటిక్ కలర్ ను సృష్టించిన ఘనత హెన్రీ పెర్కిన్స్ ఖాతాలో చేరిపోయింది.
స్పాట్.
ఇది విక్టోరియన్ డ్రెస్. ఎప్పుడైతే క్వినైన్ కలర్ కనిపెట్టబడ్డదో అప్పటి నుంచే ఫాషన్ ప్రపంచానికి పునాదులు పడ్డయి. అంతే రసాయన శాస్ర్తంలో ఇండస్ర్టీయల్ కెమిస్ర్టీ కళ్లుతెరుచుకుంది. పారిశ్రామిక రసాయన శాస్ర్తంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది పెర్కిన్స్ కలర్ డై థియరీ. 1870 వ దశకంలో పెర్కిన్స్ అండ్ హిస్ సన్స్ సంస్థలు రంగుల తయారీ పరిశ్రమలను విరివిగా స్థాపించినయి. పెర్కిన్స్ బ్లూ తో మొదలయి వివిధ వర్ణాల వస్త్రాలు అందుబాటులోకి వచ్చినయి. అందుకే పెర్కిన్ పాథర్ ఆఫ్ ఇండస్ర్టీయల్ కెమిస్ట్రీ అయిండు.
స్పాట్
ఇండస్ర్టీయల్ కెమిస్టీ కాస్త అమ్మోనియా తయారికి దారితీసింది. ఇది మన పంట పొలాలలో వాడే ఎరువు. పెరుగుతున్న జనాభాకు తగిన దిగుబడి రావాలంటే పంటలకు తగిన పోషకాలు అందాలి. నేలలో సరియైన పోషకాలు లేకుంటే పంట దిగుబడి పడిపోయేది. కానీ అమ్మోనియా కనుగొనడం ద్వారా నత్రజని రహిత నేలల్లో కూడా బంగారు పంటలు పండించే అవకాశం కలిగింది.
స్పాట్
రసాయనశాస్ర్తంలో వచ్చిన మార్పులు ఆఖరుకు యుద్దంలో కూడా శత్రు సైన్యాన్ని ఎదుర్కోవడానికి తొడ్పడ్డయి. ఖాకీ సైన్యానికి రసాయన ఆయుధాలు మరింత బలాన్నిచ్చినయి. అంతేకాదు కొత్తగా కనిపెట్టిన క్లోరిన్ ఈ యుద్దంలో వేలాది మందిని శవాలుగా మార్చింది. లక్షలాది మందిని పాక్షికంగా వికలాంగులను చేసింది.
స్పాట్
ఒక పదార్ధం ఒక రూపం నుంచి మరో రూపంలోకి ఎలా మారగలుగుతుంది. ఒక పదార్ధం మరో పదార్ధంతో కలిసి కొత్త పదార్ధంగా ఎలా మారుతుంది. ఆ ఏర్పడిన కొత్త పదార్ధం రెండు పాత పదార్దాల లక్షణాలను మించి మరో కొత్తపదార్దంగా ఏర్పడంటంలో ఉన్న మర్మమేంటి..ఇంతకీ అసలు పదార్థపు అణువుల్లో ఏముంది..ఆలోచన వచ్చింది మానవుడికి..అన్వేషణ మొదలయింది.
స్పాట్
నింగి, నేల, ఆకాశాన్ని ఆవరించి పదార్ధాలన్నీ అణువుల నిర్మితాలని కనిపెట్టేశారు శాస్ర్తవేత్తలు. అయితే ఈ పదార్ధాలన్నీ అనేక అణువుల మద్య బలమైన బంధాలతో నిర్మితమవుతయి. ఈ అణువులో ఏముంటుంది. ఈ ప్రశ్నకు అంత తేలికగా సమాధానం దొరకలేదు.ఎంత వెదికినా అణువు అనేది విచ్ఛేదన రహితమైనదనే భావించిండ్రు. తరువాత పరమాణువు ఉంటదని కనిపెట్టారు. అంతకుమించి సూక్ష్మపదార్ధం లేదని బలంగా భావించిండ్రు. అప్పడే క్రూక్స్ తన ఆవిష్కరణతో పరమాణువులో ఉన్న రహస్యాన్ని పటాపంచలు చేసిండు.
స్పాట్
విలియం క్రూక్స్ కు భూత ప్రేతాల వంటి అదృశ్యశక్తులు చేసే అద్భుతశక్తుల కథలంటే ఇష్టం. వాటిని చూడాలని తహతహలాడేవాడు. వాటిలాగే తానూ అదృశ్య అద్భుతాలు చేయాలని ఉబలాట పడేవాడు.
స్పాట్
ఇది క్రూక్స్ తయారు చేసిన గాజు నాళం..ఇందులో పూర్తిగా శూన్యప్రదేశం ఉంటుంది. రెండు వైపులా రెండు ఎలక్ర్టోడ్లు అమర్చబడి ఉంటయి. ఈ రెండు ఎదురెదురుగా ఉండే ఎలక్ట్రోడ్ల మధ్య హై ఓల్టేజ్ విద్యుత్ సరఫరా చేసి చూశాడు క్రూక్స్. అంతే విచిత్రం తానే ఊహించని ఒక అద్బుత శక్తి కనిపించింది. రెండు ఎలక్ర్టోడ్ ల మధ్య ఒక కాంతి పుంజం కనిపించింది.ఈ కాంతిపుంజం ఒక కొస నుంచి మరో కొసకు కదులుతున్నట్టు కనిపించింది. ఈ ఉత్సాహం తగ్గకముందే క్రూక్స్ మరో ప్రయోగం చేసిండు. ఈ క్రూక్స్ నాళం పై దండాయస్కాంతాన్నుంచి ప్రయోగం చేసిండు. ఎప్పుడైతే అయస్కాంత కాంత పుంజం పైకి వచ్చిందో అప్పుడు కాంతి పుంజం దానికి వ్యతిరేకంగా వంగడం గమనించిండు క్రూక్స్. అంటే కాంతి పుంజాన్ని ప్రభావితం చేసే శక్తి ఏదో ఉన్నట్టు గమనించిండు.
స్పాట్
అయస్కాంత శక్తికి ఒక వైపు వంగిన కాంతి పుజాన్ని గమనించిన క్రూక్స్ వెంటనే మరో రకమైన గ్లాస్ నాళాన్ని తయారు చేసి, అందులో ఒక పారలాల్ వీల్ తిరిగే విధంగా ఏర్పాటు చేసిండు. ఇప్పుడు రెండు ఎలక్ర్టోడ్ ల మధ్య హై ఓల్టోజ్ ఎలక్ట్రిసిటీని పంపిండు. ఆశ్చర్యం రెండు ఎలక్ర్టోడ్ లమధ్య అమర్చిన చక్రం వేగంగా తిరగనారంభించింది. చక్రం గుండ్రంగా తిరుగుతూ ఒక వైపు నుంచి మరోవైపుకు కదలడం క్రూక్స్ గమనించిండు. ఏదో అదృశ్య పదార్ధం చక్రాన్ని తిప్పుతందనే సత్యాన్ని తెలుసుకున్నడు. ఇంతకీ ఆ అదృశ్యపదార్ధం ఏంటి..ఈ విషయాన్నికనుగొనడానికి భౌతిక రసాయన శాస్త్రాలు రెండు ఏకమయ్యాయని చెప్పాలి.
స్పాట్
ఈ ప్రయోగాల ఫలితం అణుసిద్దాంత ఆవిష్కరణకు దారి తీసింది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అణురహస్యం గురించి పూర్తి ప్రయోగాలు జరిగినయి.
ఇక్కడ కావెండిష్ లాబరేటరీలో జె.జె థామ్సన్ చేసిన ప్రయోగాలు అణు రహస్యాన్ని ఛేదించడంలో ప్రముఖ పాత్రపోషించాయనే కంటే అసలు అణురహస్యాన్ని ఛేదించాయని చెప్పటమే కరెక్ట్. క్రూక్స్ నాళంలో చక్రాన్ని తిప్పే పదార్థపు రేణువులు పరమాణువుకంటే చాలా చాలా చిన్నవనే విషయాన్ని గుర్తించిండు థాంప్సన్.అంతేకాదు ఈ రేణువులు పరమాణువు కంటే వేయిరెట్లు చిన్నవన్న విషయాన్ని కూడా నిర్ధారించుకున్నడు. ఈ ఆవిష్కరణకు ఆయనకు 1906లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది.
స్పాట్
పదార్ధం మొత్తం విభిన్న రకాల అణువుల సమ్మేళంనం. అందులో కర్భన, నత్రజని, పాస్ఫరస్, ఇంకా రకరకాల పరమాణువులు ఉండవచ్చు. ఇవన్నీ ఒకే పదార్ధంగా కనిపిస్తయి. సూక్ష్మంగా పరిశీలిస్తేనే వీటి అసలు స్వరూపం తెలుస్తది. ఈ పరమాణువును లోతుగా అధ్యయనం చేస్తే పదార్ధం మూడు రకాల పార్టికిల్స్ తో తయారవుతదని కనిపెట్టిండ్రు. అవి ప్రోటాన్, ఎలక్ర్టాన్, న్యూట్రాన్ లు. ప్రోటాన్, న్యూట్రాన్లు పరమాణు కేంద్రకంలో ఉంటే ఎలక్ర్టాన్ లు కేంద్రకం చుట్టూ తిరుగుతుంటయి. ఇవి తమ తమ కక్ష్యల్లో తిరుగుతుంటయి. పరమాణు రహస్యం మానవుని గుప్పిట్లోచిక్కింది. అప్పడు తెలిసింది. మనకు శూన్యంగా కనిపించేదేది శూన్యంగా లేదని, నింగి నేల, గాలి జీవం నిర్జీవం అన్నీ అదృశ్యం పదార్ధాలతోనే నిర్మితమయ్యామనే సత్యం బోధపడింది శాస్ర్తవేత్తలకు. ఈ సృష్టి మొత్తం ఎలక్ర్టాన్ ,ప్రోటాన్, న్యూట్రాన్ లు తప్పమరో పదార్ధం లేదని అయితే ఇవి అమరి ఉండే విధానాన్ని బట్టి పదార్ధ స్వరూపం మారుతుందనే విషయాన్ని తెలుసుకున్నరు. పరమాణువులో ఎలక్ర్టాన్ లు కేంద్రకం చుట్టూ తిరుగుతుంటయి. పరమాణువు చిన్నపాటి సౌరకుటుంబాన్ని పోలి ఉంటది. సూర్యుని చుట్టూ గ్రహాలు తమ కక్ష్యల్లో తిరుగుతున్నట్టు, ఎలక్ర్టాన్లు, కేంద్రకం చుట్టూ మినీ ప్లానెట్ల మాదిరి తిరుగుతూ ఉంటయి. అవి కూడా తమ కక్ష్యల్లో..
స్పాట్
పదార్దం విచ్ఛేదనంలో పురోగతి సాధించాం..పరమాణువులో ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ఉంటయనే సత్యంతో బాటు విశ్వం మొత్తం ఈ పదార్దాలతో నిర్మితమైనదే అనే విషయం స్పష్టమయింది. ఈ సిద్దాంతంలో నుంచే నీల్స్ బోర్, ఐన్ స్టీన్ ల సిద్దాంతాలు పుట్టుకొచ్చినయి. నీల్స్ బోర్ పరమాణువులో ఎలక్ర్టాన్ స్వరూప స్వబావాన్ని వివరిస్తే, ఐన్ స్టీన్ పదార్ధం మొత్తం ఒకే రకాలైన కణాలతో నిర్మితమైనవి కావున పదార్ధం కొత్తగా సృష్టించ బడదు, నాశనం కాబడదు. అనే విశ్వసూత్రాన్ని ఆవిష్కరించిండు.
స్పాట్
1945లో ప్రపంచం మొత్తం విశ్వ శాంతి ఉత్సవాలు జరుపుకుంటోంది. ప్రజలంతా ఆనందోత్సాహాల్లో నిమగ్నమైన తరుణంలో ఈ ఆధునిక శాస్ర్త పరిజ్ఞాన ఫలాలు కొత్త కొత్త ఆవిష్కరణలకు చేసేందుకు మరింత ఉత్సాహాన్నిచ్చింది.