4, మార్చి 2011, శుక్రవారం

ది సైన్స్ ఎపిసోడ్ ముఫ్పై నాలుగు

ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలను విప్పి చెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
బ్యాంగ్
యాంకర్ 1
సూపర్ హీరో.. ఈ పదం మనం చిన్నతనం నుంచి వింటున్నదే.. ఈ సూపర్ మేన్ చేయలేనిదంటూ ఏమీ ఉండదు. చిన్నపుడు సూపర్ హీరో లీలలు చదివి తెగ మురిసి పోయే వాళ్లం. కామిక్ బుక్స్ నిండా ఆయన గాధలే..సూపర్ మాన్ అంటే ఎంత బరువైనా ఎత్తగలడు. ఎంత ఎత్తైనా ఎగరగలడు.. ఎవరైనా అపదల్లో ఉంటే కాపాడ గలడు. ఈ మధ్యకాలంలో శక్తిమాన్ అనే సీరియల్ ఇదే కాన్సెప్ట్ తో తీసిందే.. కథల సంగతి పక్కన బెడితే..మ్యాన్ నిజంగా సూపర్ మ్యాన్ అయ్యే అవకాశం ఉందా.. అర చేతిలో అద్బుతాలు సృష్టించగలడా..ఇదే ఈ రోజు మన సైన్స్ టాపిక్..
స్పాట్
వాయిస్
సూపర్ మ్యాన్.. మన ఊహా వీరుడు.. జీవితంలో కనీసం అలా అవ్వాలని ప్రతి ఒక్కరూ కొరుకునే శక్తి సంపన్నుడు.. సూపర్ మ్యాన్లు కలల్లోనో లేదా కథల పుస్తకాల్లోనో..మరీ కష్టపడితే తెలుగు సినిమాల్లోనో కనిపిస్తారు. ఇవన్నీ నీడలే..నిజాలు కాదు.. కానీ ఆ నీడల మాటున దాగిన ఊహలను నిజం చేయగలమా అని ఆలోచించిన్రు శాస్ర్తవేత్తలు.. ఆ ఊహే మనిషిని సూపర్ మ్యాన్ చేయొచ్చని ఆశచూపింది.
స్పాట్
మనం చూసిన సినిమాల్లో చూసే హీరోలంతా ఏ గబ్బిలం అవతారంగానో..స్పైడర్ మ్యాన్గానో కనిపిస్తరు. క్షణాల్లో చేయాల్సిన పనులన్నీ చకచకా చేసేస్తరు. అంతెత్తునున్న బిల్డింగ్లను అవలీలగా ఎక్కేస్తరు. టన్నుల బరువున్న వస్తువులను అగ్గిపెట్టెల్లా ఎత్తేస్తరు. రెక్కలు కట్టుకొని ఆకాశంలో ఎగురుతున్నట్టు అనిపిస్తది. చూసే ప్రతి ఒక్కరికీ తాము కూడా అలా మారి పోతే బాగుండనిపిస్తది. అంతేకాదు. ఏ దేవుడైనా ఎదురయి అటువంటి వరమేదో ఇస్తే బాగుండనిపిస్తది. ఎంచక్కా వినువీధుల్లో చక్కర్లుకొడుతూ విహరించ వచ్చని పిస్తది.
స్పాట్
ఈ ఫిక్షన్ స్టోరీలు రాసే రచయితలంతా కొన్ని భౌతిక శాస్ర్త సూత్రాలను కూడా ఫాలో అవుతరు. అంతేకాదు వీళ్ల ఊహల నుంచి కొత్త కొత్త ఆలోచనలు వస్తయి. ఇవి ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలకు దారితీస్తయి.
స్పాట్
ఈ ప్రపంచంలో అత్యంత బలవంతులైనా 1000 పౌండ్లను మించిన బరువు ఎత్తలేరు. ఇక్కడ ఈ వస్తాదు చూడండి 1000పౌండ్లకు మించిన బరువు మోయాలంటే ఎంత మజిల్ పవర్ యూజ్ చేస్తున్నడో.. ఐనా సాధ్యం కావడం లేదు..
స్పాట్
మనిషి తన కండరాలకు అలసటనివ్వకుండా సునాయాసంగా బలీయమైన పనులు చేసేందుకు శాస్ర్తవేత్తలు ఒకసూట్ ను తయారు చేసిన్రు. ఇది హైడ్రాలిక్ సూట్ ఈ సూట్ సాయంతో బరువులను సునాయాసంగా ఎత్తవచ్చు. ఎంతసేపు కష్టపడి పనిచేసినా తన కండరాలు అలసటకు గురికావు. కానీ ఈ సూట్ చూడండి.. దీన్ని ధరించిన వ్యక్తి ఒక మిషన్ను మోస్తున్న ఫీలింగ్ ఉంది. కాస్త ఇబ్బందిగా కూడా ఉంది. దీనికి సొల్యూషన్ కనుగొన్నరు శాస్ర్తవేత్తలు.
స్పాట్
మన శరీరంలో ఉండే కండరాలు ఒక స్థాయి వరకు మాత్రమే పని చేయగలవు. అంతకు మించిన శ్రమను అవి భరించలేవు. అవిశ్రాంతంగా పని చేయగల కండరాలు కలిగి ఉంటే ఎంత కష్టమైన పనినైనా అవలీలగా చెయ్యొచ్చు. కానీ మనిషి కండరాలు కొంత స్థాయికి మించి చేయలేవు. అంతకు మించి చేయాలంటే అదనంగా శక్తి కావాలి. ఆ శక్తి కూడా కొంత వరకే ఇచ్చే అవకాశం ఉంది. అంతకు మించి చేయాలన్నా సాధ్యం కాదు.
స్పాట్
శారీరక శ్రమను తప్పించి బలంగా పనిచేయగల కృత్రిమ కండరాలు ఉంటే ఎంతటి పనినైనా తేలికగా చెయ్యొచ్చని భావించిన్రు పరిశోధకులు. ఆ కృత్రిమ కండరాలకోసం అన్వేషించిన్రు. అటువంటి ప్రయోగాన్నే మనమిక్కడ చూడొచ్చు.
ఇక్కడ ఇద్దరు శాస్ర్తవేత్తలు కృత్రిమ కండరాలు కనుగొనే పనిలో ప్రయోగాలు చేస్తున్నరు. ముందుగా ఒక మెటాలిక్ స్ప్రింగ్ తీసుకొని దానిని ఒక ఆధారానికి వెలాడదీసిన్రు. దీని చివరన ఒక బరువైన గాజు సీసాను వ్రేలాడదీసిన్రు. అప్పుడు ఈ స్ప్రింగ్ ఒక కండరం మాదిరిగా పనిచేయడం మొదలు పెట్టింది. . . . ఇప్పడు ఈ స్పింగ్ ను ఆవరించి ఉన్న గాజు కుప్పె అంచుల వెంబడి ఆల్కహాల్ను స్పే చేసిన్రు. ఈ పరిస్థితుల్లో గ్లాస్ కంటెయినర్ మొత్తం ఆవిరితో నిండింది. ప్లాటినం స్ప్రింగ్ ఆల్కహాల్ పార్టికిల్స్ తో చర్య జరిపి ఉష్ణశక్తిని ఉత్పత్తి చేస్తది. అంతే ఈ శక్తి వలన ఇది క్రమేపీ సంకోచం చెంది దానికి వేలాడ దీయబడిన బాటిల్ ను పైకి లాగడం మొదలు పెడుతుంది.
స్పాట్
సాగదీయబడి ఉన్న ప్లాటినం స్పింగ్ యధా స్థితికి రావడం మొదలు పెట్టడాన్ని బట్టి ఇది గాలిలో ఆక్సీజన్ ను ఉపయోగించుకొని, ఆల్కహాల్ తో చర్యనొంది కదలికలు ప్రారంభించిందని శాస్ర్తవేత్తలు అంచనా వేసిన్రు. ఈ కృత్రిమ కండరం సహజకండరాలకు మించి 500 రెట్లు బలమైనది. ఇటువంటి కృత్రిమ కండరం మనిషి కలిగి ఉంటే 50 టన్నుల బరువును సునాయాసంగా ఎత్తగలడని శాస్ర్తవేత్తలు అంచనా వేస్తున్నరు.
స్పాట్
మనిషి శరీరానికి, కండరాలకు అలసట కలుగకుండా కృత్రిమ కండరాలను అమర్చడం ద్వారా తేలికగా పనులు చేసుకోవచ్చని భావించిన్రు పరిశోధకులు. దానికి తగిన పదార్ధమే కార్బన్ నానో ట్యూబ్..
స్పాట్
ఈ కార్బన్ ట్యూబ్ గాలికంటే చాలా తేలికైనది. పారదర్శకంగా కనిపిస్తది. మానవుడి వెంట్రుక కన్నా 10వేల రెట్లు సన్నగా ఉంటుంది. వీటి గుండా విద్యుత్తును పంపిస్తే ఒక కండరంలాగా కుంచించుకుపోతది. కండరం కటే 10 వేల రెట్లు వేగంగా పనిచేస్తది.. ఇది అత్యధిక ఉష్ణోగ్రతలోనూ, అత్యల్ప ఉష్ణోగ్రతలో కూడా పనిచేస్తది. ఇది చాలా బలమైనది కాబట్టే దీన్ని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారీలో వాడుతరు. దీనికున్న ప్రత్యేక లక్షణాల వల్ల ఇది కార్లను ఎత్తడానికి, అగ్ని ప్రమాధాలను నివారించే వారికి సూట్గా ఉపయోగ పడుతది.
స్పాట్
ఆల్కహాల్ స్ప్రింగ్లను నమ్మశక్యం కానంత బలంగా తయారు చేస్తది. ఇది నెమ్మది గా జరిగే ప్రక్రియ. కానీ నానో షీట్ చాలా వేగంగా పని చేస్తది.ఈ నానో షీట్ తో తయారు చేసిన ఆర్టిఫిషియల్ మజిల్ షీట్ ను శరీరానికి అమర్చుకున్నట్టయితే మన శరీర కండరాలకు ఎటువంటి అలసట లేకుండా అతివేగంగా ప్రయాణించగలం. ఎంత వేగంగా అంటే రైలును సునాయాసంగా దాటేయగలమని శాస్ర్తవేత్తలు అంచనా వేస్తున్నరు. ఈ సూట్ వేసుకుంటే దాదాపు సూపర్ మ్యాన్ తో సమానం. ఇదే సూట్ లేకుండా ఇలా పరిగెత్తితే తొడకండరాలు, వెన్నెముక తుక్కు తుక్కై పోతది.అంతేకాదు టన్నుల కొద్దీ బరువులు ఎత్తినా శరీరంలో ఉన్న ఎముకలన్నీ పప్పు పప్పు అవుతయి. అందుకే ఈ బాధ తప్పించుకునేందుకు శరీరానికి బాహ్యకవచం తప్పనిచసరి. దీన్నే ఎక్సో స్కెటిటన్ గా పిలుస్తరు. ఈ ఎక్సో స్కెలిటన్ పూర్తిగా కార్బన్ ఫైబర్లతో తయారు చేస్తరు. ఈ కార్భన్ నానో ట్యూబ్ ఎక్సో స్కెలిటర్ ధరిస్తే నిప్పుల్లో నడుచుకుంటూ టన్నుల కొద్దీ బరువును అవలీలగా లేపొచ్చు.
స్పాట్
మనిషికి ఉన్న శారీరక దృఢత్వం కంటే ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఎందుకంటే మనిషి ముందుగా తాను ఎత్తగలిగిన బరువును చూసి ఎత్తగలననే ఆత్మవిశ్వాసం తెచ్చుకోగలగాలి. వ్యక్తి తాను ఒక ఆలోచన చేసినపుడు అతని మెదడులో తీవ్రమైన మార్పులు వస్తయి. ఈ మార్పులకు అణుగుణంగా హార్మోన్లు రిలీజ్ అవుతయి. ఈ హార్మోన్లు మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం లేదా తగ్గించడం చేస్తయి.
స్పాట్
మనిషి మెదడులో కలిగే మార్పులు యంఆర్ఐ స్కాన్ ద్వారా పరిశీలించి వ్యక్తి ఆత్మసైర్యాన్ని లెక్కకడతరు. మెదడే అన్నిటికీ మూలం. ప్రకృతిలో మనం చూసిన ప్రతి వస్తువు ఇమేజ్ ను ఎప్పటికపుడు రికార్డు చేసి శాశ్వతంగా భద్రపరుస్తది. అది అతి సూక్ష్మవస్తువు దగ్గర్నుంచి పెద్దపెద్ద వస్తువుల వరకు పర్మెనెంట్గా రికార్డ్ అవుతది. కానీ దీన్ని మనిషి ఎంత వరకు గుర్తుంచుకుంటాడనేది అతని జ్ఞాపక శక్తిని బట్టి ఉంటది. వాస్తవానికి ప్రతి ఒకరి మైండ్లో తాను విన్నవి, చూసినవి, ఆఖరుకు కలలో కనిపించినవి కూడా గుర్తుపెట్టుకుంటరు. కానీ వీటిని తిరిగి గుర్తుతెచ్చుకోవడంలోనే అసలైన శక్తి దాగి ఉన్నది.
స్పాట్
కొన్ని సందర్భాలలో మనిషి జ్ఞాపక శక్తికి అగ్ని పరిక్ష ఎదురవుతది. మనం ఆదమరిచి ఉన్నపుడు నమ్మిచ్చి మోసపుచ్చే వారికి ఈ లోకంలో కొదవలేదు. మనల్ని పలకరించినట్టే పలకరించి చెంతనున్న బ్యాగ్ లను ఎత్తుకుపోయే దొంగలతో నిత్యం అందరికీ ఎదురయ్యే సమస్యే. మనం ఏమరుపాటుగా ఉంటాం కనుక వారిని పూర్తిగా గుర్తుంచుకోలేం. పోలీసులకు కంప్లైంట్ ఇస్తే.. వారు స్నాచర్ వివరాలు అడుగుతరు. దొంగ ఎలా ఉన్నది..వాడి రూపురేఖలు, ధరించిన డ్రెస్, దొంగతనానికి గురైన వస్తువు ఎలా ఉండేది, అన్నీ వివరాలు రాసుకుంటరు. అప్పుడు మనకు చిన్నపాటి ఐక్యూ టెస్ట్ ఎదుర్కొన్నంత ఇబ్బందిగా ఉంటది.
స్పాట్
యాంకర్
స్పాట్
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలో తీవ్రవాదుల బెడద ఎక్కువగా ఉంది. నిన్న మొన్నటిదాకా రోడ్డువెంట ఖాళీగా ఉన్న కారు విధ్యంసాన్ని సృష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే సంపన్నదేశాల్లో కార్ స్కానర్లు ఏర్పాటు చేసి రోడ్డు మీద అనుమానాస్పద వస్తువులను, వాహనాలను ఎక్స్ రే స్కానింగ్ చేస్తరు. దీనికోసం పెద్ద సరంజామా కావాలి. కానీ మనం చెప్పుకుంటున్న సూపర్ మ్యాన్ కు ఎక్స్ రే విజన్ ఉంటది. ఈ విజన్ తోనే గోడలోపల ఏం జరుగుతుందో కూడా నేరుగా చూడొచ్చు.
స్పాట్
సూపర్ మ్యాన్ కు ఎక్స్ రే విజన్ ఉన్న గూగుల్స్ కావాలి. వీటి సాయంతో అతను నాలుగు గోడల మధ్య ఏముందో కూడా చూడగలడు. ప్రమాదాలను పసిగట్టి ముందే జాగ్రత్త పడగలడు. కానీ ఎక్స్ రే అంటే మాటలు కాదు. దీనకి పెద్దయంత్రాంగం ఉంటదు. ఒక పెద్ద మిషన్. దీనికి పవర్ సప్లై చేసే ట్రాన్స్ ఫార్మర్స్. ఎక్స్ రే స్ ను రిఫ్లెక్ట్ చేసే బ్లాక్ ప్లేట్. ఇవీన్నీ ఉన్నా మనం దేన్నైతే స్కాన్ చేస్తున్నమో దానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని వస్తువుల గుండా ఎక్స్ రే స్ వెళ్లవు. అప్పుడు స్కాన్ చేయడం కాస్త కష్టంగానే ఉంటది. ఈ సమస్యను అధిగమించాలంటే చాలా కృషి చేయాలి.
స్పాట్
ఎక్స్ రే కళ్ల జోడు కావాలంటే మామూలు అద్దాలు ఏమాత్రం పనిచేయవు. ఈ అద్దాల్లోంచి మామూలు సమయాల్లో సహజంగా చూడాలి. కావాలనుకున్నపుడు మాత్రమే ఎక్స్ రే విజువల్ ను చూడొచ్చు. అలా ఉండాలంటే దానికి ప్రత్యేకమైన అద్దాలు కావాలి. ప్రకృతిలో సహజంగా ఉన్న కిరణాలను ఎక్స్ రే కిరణాలుగా మార్చుకొని వాటిని ఆబ్జెక్ట్ పై ఫోకస్ చేయాలి. తిరిగి వాటిని డిస్ప్లె చేసే ప్లేట్ కావాలి. అప్పుడే అది పర్ఫెక్ట్ గూగుల్స్ అవుతది.
స్పాట్
ఎక్స్ రే గూగుల్స్ కోసం అన్వేషించిన్రు శాస్ర్తవేత్తలు. ఈ అద్దాల అన్వేషణకు సముద్ర గర్భాన్ని ఎంచుకున్నరు. జలచరాలు ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపినయి. మనం నిత్యం చూసే రొయ్యలోనే ఈ ఎక్స్ రే విజన్ దాగుందన్న సంగతి కనిపెట్టేశారు పరిశోధకులు. రొయ్య ఆర్దోపొడా జాతికి చెందిన జీవి. దీని దృష్టిని విశ్లేషిస్తే చాలా అద్బుతమైన విషయాలు తెలిసినయి. ఆర్దొపొడా జీవుల దృష్టి మొజాయిక్ రకానికి చెందినది. అంటే ఒక్క కన్నులోనే కొన్ని వేల కటకాలు ఇమిడి ఉంటయి.ఒక్కో కటకం వస్తువులో ఒక్కోబాగాన్ని చూస్తది. వీటన్నిటి దృశ్యాలు మెదడుకు చేరి అక్కడ పూర్తి స్థాయి ఇమేజ్ ఫామ్ అవుతది. అంటే ఒక వస్తువును బాగాలు బాగాలుగా చూసినా మెదడు వాటిని ఒకే వస్తువుగా సంశ్లేషించుకుని రూపాన్ని పొల్చుకుంటుందన్నమాట.
స్పాట్
రొయ్య చూపు ఎక్స్ రే గూగుల్స్ కు దారి చూపింది. ఎక్స్ రే అద్దాల తయారీకి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. . ఇంకేం సూపర్ మ్యాన్ తయారీకి కావలసిన అన్ని అవకాశాలు సిద్దంగా ఉన్నయి. వీటిదో బాటు ఆర్టిఫిషియల్ హాండ్స్ కూడా పెడితే బాగుంటుందను కున్నారు శాస్ర్తవేత్తలు. ఇంత శక్తి వంతమైన మనిషికి చేయడానికి రెండు చేతులు సరిపోవు . అందుకే మరో రెండు చేతులు పెట్టాలి. ఇవి కూడా మన మామూలు చేతుల్లాగే బ్రెయిన్ కమాండ్స్ తో పని చేయాలి. ఇది సాధ్యమయ్యే పనేనా..ప్రయోగాలు చేసి నిరూపించారు శాస్ర్తవేత్తలు.
స్పాట్
ఇదిగో ఇక్కడ ఒక కోతిని బాక్స్లో పెట్టి దానికి ఎలక్ర్టానిక్ హాండ్ ను సెట్ చేశారు. ఈ హ్యాండ్ డైరెక్ట్ బ్రెయిన్ ఇచ్చే కమాండ్స్ ను ఫాలో అయి తన ముందున్న ఆహారాన్ని నిజమైన చేతితో తీసుకున్నట్టు తీసుకుంటోంది. ఒక రకంగా చెప్పాలంగే కోతి దృష్టిలో అది తన హ్యాండే అనే భ్రమలో ఉంది.
స్పాట్
ఒక హార్డ్ వేర్ ను బ్రెయిన్ ఎలా కమాండ్ చేయగలదు.. చేయగలిగేలా చేశారు సైంటిస్టులు.. ఇదిగో ఈ సైంటిస్టు చేతిలో ఉన్న ఈ చిన్న పరికరాన్ని డైరెక్ట్ గా బ్రెయిన్ కు అటాచ్ చేస్తరు. అప్పుడు బ్రెయిన్ ఇచ్చే ఎలక్ట్రో మాగ్నెట్ సిగ్నల్ ను ఈ పరికరం విశ్లేషించి దానికి అమర్చిన పరికరంతో పనిచేయిస్తుందన్నమాట. అంటే ఒక రకంగా బ్రెయిన్ లో ఉన్న సాఫ్ట్ వేర్ తో నడిచే ఒక పర్ఫెక్ట్ రోబో అన్నమాట. ఈవిధంగానే మనిషి తన శక్తిని బట్టి ఒకటి రెండు చేతులు కాళ్లు అమర్చుకొని పనులు చేసుకుంటూ పోవచ్చన్నమాట. ఓకే మనం కోరుకున్న సూపర్ మ్యాన్ కు కావలసినవి మూడు లక్షణాలు అందుబాటులోకి వచ్చినయి. ఇక సూపర్ మ్యాన్ తయారీయే అలస్యం.
స్పాట్
సూపర్ మ్యాన్ వేగంగా పరిగెత్తడానికి కావలసిన బలాన్ని నానో స్ప్రింగ్ లు, నానో ఫైబర్ లతో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇదే మెటీరియల్ తో తయారు చేసిన ఎక్సోస్కెలిటన్ తో ట్రైన్ ఇంజన్ కూడా మోయగలిగే శక్తని తెచ్చుకోవచ్చు. ఎక్స్ రే విజన్ గూగుల్స్ తో పరిసరాలను స్కాన్ చేసి గోడల అవతల కూడా ఏముందో చూడ గలిగే శక్తిని సంపాదించుకున్నం. ఇంతే కాకుండా ఒక మనిషికి ఇంత శక్తి ఉంటే రెండు చేతులు సరిపోవని మరో రెండు చేతులను కూడా బిగించి బ్రెయిన్ కమాండ్ ఫాలో అయ్యేలా తయారు చేసిన్రు. ఇంకే మనం కోరుకున్న సూపర్ మ్యాన్ రెడీ..మీరూ సూపర్ మ్యాన్ లా కావాలను కుంటున్నరా… ఒక్క పది సంవత్సరాలు వెయిల్ చేస్తే ఈ సూపర్ మెన్ సూట్లు మన సూపర్ బజార్లోనే దొరుకుతయి. కాకుంటే కాస్తంత ఖర్చుపెట్టాల్సి ఉంటుంది.

ది సైన్స్ ఎపిసోడ్ ముప్పై మూడు

ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలను విప్పి చెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
బ్యాంగ్
యాంకర్ 1
ఫ్లైయింగ్ సాసర్..ఈ పదం మనలో చాలా మంది వినే ఉంటరు. ఇది కొత్త పదమేమీ కాదు. ఎందుకంటే గత దశాబ్దకాలంగా ఏలియన్స్ గురించి ఏ చిన్న కథనం వచ్చినా ముందు ఫ్లైయింగ్ సాసర్ గురించే చెప్పుకుంటం. ఏలియన్స్ వాహనాలు సాసర్లు. సాసర్ ను పోలి ఉండే ఫ్లైయింగ్ వెహికిల్స్ చాలా స్పీడ్ గా దూసుకు పోగలవని ఒక నమ్మకం. ఇంతకీ ఫ్లైయింగ్ సాసర్ ను చూసింది లేనిదీ పూర్తిగా ఆధారాలు లేకున్నా.. కేవలం ఊహాగానాలే అయినా..అటువంటి సాసర్నుమనమే ఎందుకు తయారు చేయకూడదనే ఆలోచన వచ్చింది శాస్ర్తవేత్తలకు..ఇంకేం ప్రయత్నం మొదలు పెట్టారు.
స్పాట్
ఇది సాంకేతిక యుగం.. సృష్టికి ప్రతి సృష్టి దిశగా ఆలోచనలు సాగుతున్న యుగం. అంతేకాదు సృష్టి మొత్తాన్ని మానవుడు తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఆరాట పడుతున్న కాలం. కానీ ఇంతకంటే ముందే.. ఈ సాంకేతిక యుగం ప్రారంభం కావడానికి ముందే ఎన్నో వేల ఏండ్లకిందట ఈ భూమి పై అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పరిఢవిల్లిందని చరిత్రకారుల విశ్లేషణ. కానీ అదంతా మాయన్ నాగరికతలోనే విలసిల్లిందని, కాలగర్భంలో కలిసిపోయిందనే వాదనలు బలంగా ఉన్నయి. కానీ ఇది నిజం కాదని.. గ్రహాంతర వాసులు భూమి పై ఉన్న వ్యక్తులతో సంబంధాలు పెట్టుకొని కొన్ని సాంకేతిక అంశాలు నేర్పిన్రని అవే నేటి మన సాంకేతికతకు మూలాలనే వాదన కూడా లేకపోలేదు. ఏలియన్స్ ఉన్నయో లేవో మనకు పూర్తిగా తెలియదు. ఇప్పటి వరకు కేవలం ఊహాగానాలే ప్రచారంలో ఉన్నయి. నిజమైన ఏలియన్స్ ను చూసినవారు లేరనే చెప్పాలి. ఇంటర్నెట్ లో షికారు చేస్తున్న పుకార్లను నిజమని నమ్మలేం.
స్పాట్
ఏలియన్స్ ఉన్నయా లేవా అన్న విషయం పెద్ద సబ్జెక్ట్. ఆ విషయాన్ని పక్కన బెడితే. వారు వాడుతున్నట్టు చెప్పుకునే ఫ్లైయింగ్ సాసర్ అనే అంతరిక్ష వాహనం పై శాస్ర్తవేత్తల దృష్టి పడింది. ఈ ఊహాగానాలలో ఎంతో సాంకేతికత ఉంది. వస్తున్న పుకార్లకు వాస్తవ సాంకేతికతకు ఒక రకమైన సారూప్యం ఉంది. ఫ్లైయింగ్ సాసర్ నిర్మాణం ప్రకారం కేవలం తక్కువ ఇందనంతో లేదా అసలు ఇంధనం అవసరం లేకుండా కోటాను కోట్ల కిలోమీటర్లు అతితక్కువ సమయంలో అంటే రెప్పపాటు వేగంలో కాంతి కంటే వేగంగా పయనించే అవకాశంఉన్న ఒకే ఒకే వాహనం ఫ్లైయింగ్ సాసర్.
స్పాట్
ఇప్పటి వరకు మనం తయారు చేసిన జెట్ విమానాలు, రాకెట్ల వంటివన్నీ కేవలం భూమ్యాకర్షణ సూత్రాలకు లోబడి పనిచేసేవే. కానీ ఫ్లైయింగ్ సాసర్ అనేది వీటన్నిటికీ అతీతం. ఇది పూర్తిగా కొన్ని సెకన్లలో సూర్యకుటుంబాన్ని దాటి వెళ్లగలదు. ఇప్పటి వరకు ఫ్లైయింగ్ సాసర్ అనేది అల్టిమేట్ గా సైన్స్ ఫిక్షన్ వెహికిల్ మాత్రమే. ఆ ఫిక్షన్ నేడు శాస్ర్తవేత్తలు ఫిక్స్ చేయాలని చూస్తున్నరు.
స్పాట్
నేటి ఆధునికి సాంకేతిక యుగంలో అందుబాటులోకి వచ్చిన ఎరోడైనమిక్స్, థర్మోడైనమిక్స్, సూత్రాలతో సాధ్యపడనిదంటూ ఏదీలేదు. అందుకే అసలు ఈ స్పేస్ షిప్ను మనమే తయారు చేస్తే పోతుందని భావించారు. శాస్ర్తవేత్తలు. అయితే దీని కోసం సాసర్ ను చూశామని చెబుతున్న కొద్ది మంది అభిప్రాయాలు సేకరించిన్రు. వారిలో కొందరు అది డిస్క్ మాదిరిగా ఉందని కొందరు, చక్రం మాదిరిగా ఉందని కొందరు తెలిపిన్రు. కొందరు అందులోంచి కొంత కాంతి రిలీజ్ అయి దాని పరిధిలో ఉన్న జంతువులను మాయం చేస్తుందని చెప్పిన్రు.
స్పాట్
యాంకర్ 2
ఇప్పటి వరకు మనం ఎన్నో సైన్స్ ఫిక్షన్ సినిమాలలో ఫ్లైయింగ్ సాసర్ లు చూశాం.. మన విమానాలకంటే ఇవి ఎంతో భిన్నంగా ఉంటయి. పక్కన వచ్చి వాలినా గుర్తు పట్టలేనంత నెమ్మదిగా నిశ్శబ్దంగా ఉంటయి. ఎన్నో వేల రెట్లకాంతితో వేగంగా పయనిస్తయి. మన విమానాల కంటే వాటిమీద ప్రయాణమే ఎంతో బాగుంటుందనే ఆశకూడా ఆధునిక మానవుడికి లేకపోలేదు. అందుకే దాని కోసమే నిరంతర అన్వేషణ.
స్పాట్
ఇప్పడు శాస్ర్తవేత్తలు తయారు చేసే ఫ్లైయింగ్ సాసర్ మునుపెన్నడూ లేని విధంగా అనేక లక్షణాలు కలిగిఉండాలని పరిశోధకుల ఆశ. వాటిలో కాలుష్యరహిత వాహనమై ఉండాలనేది మొదటిది సూత్రం. దశాబ్ద కాలం కిందటి వరకు సినీ దర్శకులు, కామిక్ రైటర్స్ అందరూ ఫ్లైయింగ్ సాసర్ను రకరకాల రూపాల్లో వర్ణించిన్రు. వాళ్లు కాకతాళీయంగా వర్ణించినప్పటికీ అందులో ఎన్నో థర్మో డైనమిక్ సూత్రాలు పొందు పరచబడి ఉన్నయి. కానీ అందులోనే కొన్ని సమస్యలు కూడా ఉన్నయి. ఫ్లైయింగ్ సాసర్ కు ఎటువంటి రెక్కలు ఉండవు. గాలిలో ఎగిరే పక్షులకు గానీ మనం ఇప్పుడు చూస్తున్న విమానాలకు గానీ రెక్కలు తప్పని సరి. పక్షుల రెక్కలు కదిలినపుడు వాటి రెక్కల కింద అల్పపీడనం ఏర్పడి అవి పైకి ఎగరగలుగుతయి. కానీ మనం గాలిలోకి విసిరే డిస్క్లకు రెక్కలు ఉండకున్నా..అవి గాలిలో వేగంగా ఎగురుతూ దూరంగా వెళ్లగలవు. క్రీడాకారులు ఆడే డిస్క్ థ్రో ఆటలల్లో మనం ఇది నిత్య గమనించేదే.
స్పాట్
డిస్క్ ప్లేట్కు రెక్కలు లేకుండా ఎలా గాలిలో ఎగరగలుగుతుంది..ఒక ప్రయోగం చేసిన్రు శాస్ర్తవేత్తలు. ఒక డిస్క్ ను ప్రయోగశాలలో ఫిక్స్ చేసి దానిపై ఆవిరిని బలంగా ప్రయోగించి డిస్క్ ను వేగంగా తిరిగేలా చేసిన్రు. ఈ కదలికలను, అది వేగంగా తిరిగేటపుడు దాని చుట్టూ ఉన్న వాతావరణాన్ని కంప్యూటర్ సాయంతో అంచనా వేసిన్రు. ప్రయోగం తరువాత ఫలితాలను విశ్లేషించిన శాస్ర్తవేత్తలకు ఆశ్చర్యకరమైన నిజాలు తెలిసినయి. వేగంగా తిరిగే డిస్క్ కింద ఎర్రని రంగులో అత్యధిక వాయు పీడనం ఉన్నట్టు కంప్యూటర్ చూపించింది. అదేవిధంగా డిస్క్ పైబాగంలో చాలా తేలికైన వాయు పీడనం ఉన్నట్టు కంప్యూటర్ విశ్లేషించింది.
స్పాట్
యస్. శాస్ర్తవేత్తల ప్రయోగ ఫలితాలు ఎంతో స్పూర్తినిచ్చినయి. రెక్కలు లేకుండా విమానాన్ని తయారు చేయవచ్చన్న విషయం రుజువయింది. కాస్త పుటాకారంగా ఉన్న డిస్క్ థౌసండ్ రెజల్యూషన్ ఫర్ మినిట్ వేగంతో తయారు చేసేందుకు సిద్దమయిన్రు.
స్పాట్
యాంకర్ 3
అవును మనం నిత్యం ప్లేగ్రౌండ్లో టెన్నికాయిడ్, డిస్క్ థ్రోలను చూస్తూనే ఉంటం. ఇవి అచ్చు సాసర్ ల ఆకారాన్ని పోలి ఉంటయి. ఒక చిన్న విసురుకే గాలిలో చక్కర్లు కొడుతూ వేగంగా వెళ్లగలుగుతయి. ఈ గుండ్రటి ప్లేట్లకు అంతటి శక్తి ఎక్కడిది. అసలు డిస్క్ రొటేల్ కావడం వల్ల కొత్త శక్తి ఏమైనా జెనరేట్ అవుతదా అన్న విషయంలో శాస్ర్తవేత్తలకు ఒక క్లారిటీ వచ్చింది. డిస్క్ ల కింది బాగంలో అధిక పీడనం ఉండటం వల్లనే అవి గాలిలోకి ఎగరగలుగుతున్నయనే విషయాన్ని తెలుసుకున్నరు. ఇక సాసర్ ను తయారు చేయడమే తరువాయి. కానీ ఇంజన్ ఎలా..చూడండి..
స్పాట్
ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో కేవలం ఫ్లైయింగ్ సాసర్ ఆకారం పైనే ప్రయోగాలు జరిగినయి. ఈ ఆకారం స్పేస్ షిప్ కు పనికి వస్తదా లేదా అన్న కోణంలోనే సక్సెస్ అయిన్రు. కానీ దీన్ని ఎలా తయారు చేయాలన్న విషయం, దీనికి ఇందనంగా ఏది వాడాలన్న విషయంఇంకా మిగిలే ఉంది. దాని కోసమే ఈ ప్రయోగం.
స్పాట్( ఐరన్ పొక్లైన్ అయస్కాంతం విజువల్స్)
ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ఇనుప సామాగ్రి మొత్తం క్రషింగ్ చేసిన వ్యర్ధపదార్ధాలు. ఇవి ఐరన్ ఫాక్టరీకి తరలించడానికి సిద్దంగా ఉన్నయి. వీటిని లోడ్ చేయాలంటే వందలాది మంది కార్మికులు కావాలి. పొక్లెయిన్ ఎత్తాలన్నా ఎంతో ఇందనం కావాలి. కానీ కేవలం చిన్న ట్రిక్ తో శాస్ర్తవేత్తలు ఈ సమస్యను అధిగమించిన్రు. హిటాచి చివారి బాగంలో ఒక ఎలక్ర్టో మాగ్నటిక్ ప్లేట్ ను అమర్చిన్రు. ఈ మాగ్నటిక్ ప్లేట్ లోకి కరెంట్ పాస్ చేసినపుడు అది అయస్కాంతంలా ప్రవర్తిస్తుంది. తిరిగి కరెంట్ తీసేయగానే మామూలు ఉక్కు ప్లేట్లా మారిపోతది. దీనికి ఏ ఇంధనం అవసరం లేదు. ఇది కేవలం ప్రకృతి ప్రసాదించిన కృత్రిమ అయస్కాంత సూత్రం. చూడండి ఆపరేటర్ బటన్ నొక్కగానే ఆ స్టీల్ ప్లేట్ మాగ్నెట్ లా మారింది. వెంటనే ఈ ఐరన్ రఫ్ అంతా దానికి చిక్కుకుంది. ఒక్క దఫాకు 28వేల పౌండ్ల మెటల్ ను ఒకేసారి ఎత్తగలం. అయస్కాంత శక్తి కండర శక్తి కంటే ఎన్నో వేల రెట్టు బలమైనది.
స్పాట్
అయస్కాంతం సృష్టిలో ఒక వింత పదార్ధం. ఇప్పటి వరకు దీని లక్షణాలు మాత్రమే గుర్తించ గలిగిన్రు కానీ దీనికి అయస్కాంత లక్షణాలు ఎందుకు వచ్చినయో శాస్ర్తవేత్తలు కూడా తేల్చి చెప్పలేక పోయిన్రు. అసలు అయస్కాంతంలో దాగిన సూత్రాలేంటో తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనం చూడ బోయే ఫ్లైయింగ్ సాసర్ను నడిపే ఇంధనం ఇదే..
స్పాట్
అయస్కాంతం..ఇది వివిధ రూపలలో ఉంటుంది. ఎక్కువ శాతం ప్రయోగ శాలలలో దండాయస్కాంతాలనే వాడుతరు. ప్రతి అయస్కాంతానికి ఉత్తర దక్షిణ ధృవాలు ఉంటయి. వీటిని ఆవరించి మనకు కనిపించని ఒక అయస్కాంత క్షేత్రం ఉంటది. ఇది ఉత్తర దక్షణ దృవాల మద్య ప్రవహించినట్టుగా ఉంటది. అయస్కాంతానికి ఒక విశిష్ట లక్షణం ఉంది. విజాతి దృవాలు ఆకర్షించుకుంటయి. సజాతి దృవాలు వికర్షించుకుంటయి. అంటే ఒక నార్త్ పోల్ మరో సౌత్ పోల్ లో ఆకర్షించుకుంటది. కానీ ఒక సౌత్ పోల్ దగ్గరకు మరో సౌత్ పోల్ ను తీసుకొస్తే మాత్రం వికర్షించుకుంటది. యస్. ..అచ్చు ఇదే సూత్రంతో ఫ్లైయింగ్ సాసర్ను తయారు చేసేందుకు సిద్దమయిన్రు శాస్ర్తవేత్తలు.
స్పాట్ (సూపర్ కండక్టర్ విజవల్స్) డౌన్ లోడ్ చిన్న క్లిప్పింగ్లు వాడుకోవాలి.
ఒక చిన్న ఫార్ములా..థర్మోడైనమిక్స్ సూత్రాలను అవపోసన పట్టిన ఒక భౌతికశాస్ర్తవేత్త చేసే చిన్న ప్రయోగమిది. ఒక పెట్రి డిష్లో ద్రవీకరించిన నత్రజని ద్రావణాన్ని పోసిండు. ఇప్పుడు దీని మధ్యలో ఉన్న ఒక గుండ్రని ప్లేట్ పై మాగ్నటిక్ క్యబ్ను వదిలిండు. ఆ క్యూబ్ను జాగ్రత్తగా పరిశీలించండి. అది అటు బ్లాక్ డిస్క్ ను ఆనుకోకుండా గాలిలో తేలుతోంది. దాన్ని కదిలిస్తే చుట్టూ తిరుగుతుందే తప్ప ప్లేట్ కు తాకడం లేదు. ఇంతకీ కింద ఉన్న ఆ నల్లని ప్లేట్ ఏమై ఉంటుంది..యస్. దాని పేరే సూపర్ కండక్టర్, మానవ నాగరికతలో విద్యుదయస్కాంత సూత్రాలు పెట్టిన బిక్షే సూపర్ కండక్టర్. కాల్షియం, బేరియం, కాపర్ ఆక్సైడ్ లేదా ఇంట్రియా బేరియం కాపర్ ఆక్సైడ్ వంటి పదార్ధాన్ని మైనస్ 183 డిగ్రీల ద్రవ నైట్రోజన్ ఉపయోగించి చల్లబరిచినట్టైతే అది సూపర్ కండక్టర్ గా మారుతుంది.
స్పాట్(సూపర్ కండక్టర్ విజవల్స్) డౌన్ లోడ్ చిన్న క్లిప్పింగ్లు వాడుకోవాలి.
యాంకర్ 4
సూపర్ కండక్టర్.. ఇది భౌతిక శాస్ర్తవేత్తల పాలిటి వరం అని చెప్పొచ్చు. సూపర్ కండక్టర్ సాయంతో భూమ్యాకర్షణ శక్తినే నిర్వీర్యం చేయోచ్చంటే దాని పవరేంటో అర్ధం చేసుకోవచ్చు. కానీ ఈ సూపర్ కండక్టర్లను భూమి నిండా పరచగలమా.. లేక భూమినే ఒక సూపర్ కండక్టర్గా మార్చగలమా..ఇదీ ఆధునిక శాస్ర్తవేత్తల ముందున్న సమాలు.
స్పాట్
ఈ సూపర్ కండక్టర్ కున్న ఒక ప్రత్యేకతే నేటి భౌతిక శాస్ర్తవేత్తలకు వరంగా మారింది. సూపర్ కండక్టర్ అయస్కాంతాన్ని వికర్షిస్తది. అంతేకాదు అయస్కాంతం తన అయస్కాంత క్షేత్రంలోనే ఒక కుషన్ పై తేలిన మాదిరిగా ఎగురుతుంది. భూమి పై ఏ ఆచ్చాదన లేకుండా ఎగరగలదు. ఈ విధానాన్ని శాస్ర్తవేత్తలు లెంటేషన్ అని పిలుస్తరు. ఇది చూడటానికి భూమ్యాకర్షణ శక్తిని అధిగమించినట్టు కనిపిస్తది. ఇదే సూత్రం ఇప్పుడు ఫ్లైయింగ్ సాసర్ కనుక్కోవడానికి మూల సూత్రంగా మారింది.
స్పాట్
సూపర్ కండక్టర్ తో ఒక ప్రయోగం చేసిన్రు శాస్ర్తవేత్తలు. ముందుగా ఒక ట్రాక్ తయారు చేసిన్రు. ఈ ట్రాక్ లో నిండా అక్కడక్కడా ఒక నిర్ధిష్ట దూరంలో సూపర్ కండక్టర్ లను అమర్చిన్రు. అదే సందర్భంలో సాసర్ అడుగు బాగాన పవర్ఫుల్ ఎలక్ర్టో మాగ్నట్లను అమర్చిన్రు. ఇప్పడు ఈ సాసర్ను సూపర్ కండక్టర్లు అమర్చిన ట్రాక్ పై వదిలిన్రు. అంతే సహజంగా సూపర్ కండక్టర్ పై మాగ్నట్ తేలి ఆడుతుందనే సూత్రంతో ఆ సాసర్ నేలను తాకకుండా ఒక కుషన్ మాదిరిగా కదులుతోంది. అయస్కాంత క్షేత్రంలో చేసే మార్పులను బట్టి ఈ సాసర్ తన దిశను మార్చుకుంటూ వేగంగా పయనిస్తోంది.
స్పాట్
సక్సెస్.. ఒక రకంగా నేలను తాకని..పొల్యూషన్ లేని…అత్యంత వేగంగా ప్రయాణించే నౌక సిద్దమైనట్టే..కానీ ఇక్కడ వచ్చిన సమస్యల్లా ట్రాక్ను అతి శీతల పరిస్థితుల్లో ఉంచగలగాలి. అంటే కనీసం మైనస్ రెండు వందల డిగ్రీల సెంటీగ్రెడ్ వద్ద ఉంచితేనే సూపర్ కండక్టర్లు పనిచేస్తయి. ఇలా చాలా కాలం ఉంచడం అనేది సాధ్యంకాని పని. అదే సందర్బంలో పొడవైన ట్రాక్ను అలా మెయింటెయిన్ చేయడం కూడా ఖర్చుతో కూడుకొన్న పని..ప్రయోగమైనే సక్సెస్ కానీ ఖర్చు తడిసి మొపెడవుతుంది. దీనికి ప్రత్యామ్నాయమే లేదా..చూద్దాం..
స్పాట్
గది ఉష్టోగ్రత వద్ద పనిచేయగల సూపర్ కండక్టర్ ను కనుగొన గలిగితే చాలు. పారిశ్రామిక విప్లవం కొత్ పుంతలు తొక్కుతది. అంతేకాదు కాలుష్యరహిత ప్రపంచం వచ్చేస్తది. మనుషులు కూడా సూపర్ కండక్టివిటీ బెల్ట్ తగిలించుకుంటే చాలు గాలిలో సూపర్ మెన్ లా ఎగరొచ్చు.
యాంకర్ 5
సూపర్ కండక్టర్ తక్కువ ఖర్చుతో దొరికితే బావుండని అందరు శాస్ర్తవేత్తలు ఆశపడేదే..కానీ సాధ్యపడే దేనా..కాదు. ఎందుకంటే సూపర్ కండక్టర్ మెయిన్టెనెన్స్ సాధ్యం కాని పని. దీనికి ప్రత్యామ్నాయంగా అంతే శక్తి గల ఇంకేదో శక్తి కావాలి. అది సృష్టిలో తప్పకుండా ఉండి తీరుతుంది. అవే లక్షణాలుండి అంతకన్నా తక్కువ ఖర్చుతో ఉంటే శక్తి ఉండే ఉంటుంది. దానికోసమే సైంటిస్టుల అన్వేషణ..
స్పాట్
సైన్స్ ఫిక్షన్ సినిమాలను బట్టి ఫ్లైయింగ్ సాసర్ అనేది ఏలియన్స్ వాహనం. ఇందులో ఏముందో..ఏ టెక్నాలజీ ఉపయోగించిన్రో ఎవరికీ తెలయదు. అభూత కల్పనలతో ఒక రూపాన్ని మాత్రం చెప్పగలిగిన్రు. ఆ రూపంతోనే శాస్ర్తవేత్తలు ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన్రు. సూపర్ కండక్టివిటీ ట్రాక్లు వేయడం దుస్సాద్యం అని తేల్చేసిన శాస్ర్తవేత్తలు ..దానికి సమానమైన మరింకేదో శక్తికోసం అన్వేషించ సాగిన్రు. ఇదిగో ఇక్కడ యువశాస్ర్తవేత్తల బృందం చేసే ఒక అద్భుత ప్రయోగం రేపటి ఫ్లైయింగ్ సాసర్ కు దారులు వేస్తోంది.
స్పాట్
ఈ ప్రయోగంలో కేవలం ఇంట్లో వాడుకొని వస్తువులే ఉన్నయి. ఇక్కడ వెండిలా ధగధగా మెరుస్తున్న పొర అల్యూమనియం పొర. తరువాత కొన్ని అగ్గిపుల్లలు, మందపాటి కాపర్ తీగ వీటితో బాటు విద్యుత్ ఇవే ప్రయోగానికి ఉపయోగించిన సామాగ్రి. ఈ మూడింటిని ఒక క్రమ పద్దతిలో అమర్చి కాపర్ తీగల ద్వారా 30వేల వోల్టుల విద్యుత్ను ప్రసరింపజేసిన్రు. అంతే ఆశ్చర్యంగా ఆ సెట్ గాలిలోకి లేచింది.
స్పాట్
ఈ చిన్న ప్రయోగంలో పెద్ద సూత్రం ఉంది. ఇక్కడ కాపర్ వైర్లగుండా పంపించిన విద్యుత్ అత్యంత శక్తివంతమైనది. ఇది కాపర్ తీగల ద్వారా తన చుట్టూ ఉన్న గాలి అణువులను అయనీకరణం చేసింది. దాంతో చూట్టూ వాతావరణంలో ఉన్న అణువులలో ఉన్న ఎలక్ట్రాన్ లను విచ్ఛినం అవుతయి. విచ్చిన్నం అయిన ఎలక్రాన్లు తమ కింద పాజిటివ్ క్షేత్రాన్ని ఏర్పరచుకుంటయి. ఎప్పుడైతే చుట్టూ వాతా వరణం పాజిటివ్గా తయారయిందో అల్యూమినియం రేకుల్లో ఉండే ఎలక్రాన్ల చేత వికర్షించబడి సెట్ మొత్తం గాలిలోకి లేస్తది. విద్యుత్ ప్రవాహాన్ని ఆపగానే లిఫ్టర్ కిందకు దిగుతది.
స్పాట్( ఇక్కడ పాత ఎపిసోడ్ 29లో రాకెట్ విజువల్స్ వాడుకోగలరు.)
ఈ లిఫ్టర్ కూడా రాకెట్ సూత్రంతో పనిచేసింది. రాకెట్లో ఇందనం మండి ఇంజన్ ను పైకి నెడుతోంది. కానీ ఈ ఎలక్ర్టిక్ లిఫ్టర్లో అయాన్ లు బలంగా కిందికి నెట్టడం ద్వారా లిప్టర్ పైకి లేస్తుంది. ఈ ప్రయోగం దాదాపు సక్సెస్ అయిందనే అనుకున్నరు. కానీ ఇది చాలా చిన్న వ్యాసార్దంతో మాత్రమే పని చేస్తది. ఎక్కువ విద్యుత్ అవసరం. ఇది కూడా గాలిలో స్పార్క్ ల మాదిరిగా విడుదల కావాలి. వాతావరణంలో ఉన్న అణువులను నిత్యం అయనీకరణ చేస్తూ ముందుకు వెళ్లాలి. అంటే గాలిలో ఉన్న ప్లాస్మాలేయర్ నిత్యం వేడెక్కుతూ ఉంటది. అంతేకాదు ఏదైన సంధర్బంలో వాతా వరణం అనుకూలంగా లేనపుడు అంటే ఉరుములు మెరుపులు వస్తే అప్పడు సహజంగానే మెరుపులు వాతావరణాన్ని అయనీకరణం చేస్తయి. ఈ సందర్భంలో సాసర్ నేలకూలే అవకాశం ఉంది. ఇది ఆకాశంలో ఉన్నపుడు ఇలాజరిగితే పెద్దప్రమాదమే ఎదురు కావచ్చు. అందుకే ఈ ప్రయోగం కొద్దిగా రిస్క్ తో కూడుకున్నదిగా భావించిన్రు శాస్ర్తవేత్తలు.
స్పాట్
ఫ్లైయింగ్ సాసర్ ను తయారు చేద్దామని సంకల్సించినపడే శాస్ర్తవేత్తలు ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చిన్రు. తాము తయారు చేసే సాసర్ వాతావరణానికి హాని తలపెట్టకూడదు. తక్కువ ఖర్చుతో కూడినదై సహజవనరులతో నడపగలిగేదై ఉండాలి. అందుకే అటువంటి ప్రయత్నాలకోసం తిరిగి అన్వేషించడం మొదలుపెట్టిన్రు.
యాంకర్ 6
ఫ్లైయింగ్ సాసర్ తయారీ కోసం శాస్ర్తవేత్తలు చేసే ప్రయోగాలన్నీ గాలిలో కలుస్తున్నయా..లేదు అన్నీ సక్సేస్ అవుతున్నయి. కానీ చేసే పద్దతి వల్లనే ఇబ్బందులు ఎదురవుతున్నయి. అంటే ఊహలన్నీ నిజమవుతున్నయి కానీ ఖర్చు పెరుగుతోంది. తక్కువ ఖర్చుతో కాలుష్యరహిత వాహనాన్ని నిర్మించాలనుకున్న దారులన్నీ మూసుకు పోసాగినయి. కానీ ఆఖరుగా ఒక్క ప్రయోగం తో మళ్లీ కొత్త ఉత్సాహం నిండింది శాస్ర్తవేత్తల్లో ఏంటా ప్రయోగం.
స్పాట్
స్పాట్( మాగ్నెట్ ముక్కలు చేసే సీన్)( గ్లోబ్కు గాలి ఊదే సీన్)
ఈ భూగోళం మొత్తం ఒక అయస్కాంతం..దీని చుట్టూ మన కంటికి కనిపించని అయస్కాంత క్షేత్రాలు ఆవరించబడి ఉన్నయి. ఈ క్షేత్రాలు దక్షిణ దృవం నుంచి ఉత్తర దృవాన్ని కలిపినట్టుగా ఉంటయి. అంటే భూగోళం ఒక సూపర్ కండక్ట్ గా ఉపయోగించుకుంటే..ఈ భూమే పెద్ద ట్రాక్ గా వినియోగించుకోగలిగితే వేరే సూపర్ కండక్టర్ అవసరం లేదు. భూమధ్య రేఖ నుంచి దృవాల ఉత్తర దృవం వైపు వెళ్లాలనుకుంటే సౌత్ పోల్ను వాడుకోవచ్చు. ఎందుకంటే విజాతి దృవాలు ఆకర్షించుకుంటయి కనుక. సౌత్ పోల్ మాగ్నట్ నార్త్ పోల్ వైపు ఆకర్షించుకుంటది. అదే సందర్భంలో దక్షిణ దృవం వెళ్లాలంటే నార్త పోల్ను వాడుకోవచ్చు. కానీ ఇలా సౌత్ పోల్ నార్త్ఓ పోల్ అంటూ విడిగా ఉండవు. ఒకే అయస్కాంతంలో రెండు వైపులా సౌత్ అండ్ నార్గ్ పోల్స్ రెండూ ఉంటయి. ఒకే దృవం ఉండే అయస్కాంతాలను తయారు చేయడం కుదరదా..సైంటిఫిక్ బాషలో చెప్పాలంటే మోనోపోల్ మాగ్నట్ ను తయారు చేయడం సాధ్యం కాదా..చూద్దాం..
స్పాట్
ఇక్కడ శాస్ర్తవేత్త చేతిలో ఒక దండాయస్కాంతం ఉంది. దీనికి ఒక వైపు దక్షిణ దృవం మరోపక్క ఉత్తర దృవం ఉన్నయి. మనకు మోనో పోల్ అంటే ఒకే దృవం కావాలి..అందుకే ఈ శాస్ర్తవేత్త దీన్ని రెండుగా కట్ చేసిండు. విచిత్రం ఇది కూడా రెండు పోల్ కలిగి ఉంది. దీన్ని వందలు వేలు ముక్కలు చేసినా ప్రతి ముక్కా రెండు దృవాలను కలిగి ఉంటదనే విషయం రుజువయింది. ఆఖరుకు అణు పరిమాణానికి రంగరించినా ఆణువు కూడా రెండు దృవాలను కలిగి ఉంటదనే విషయం రుజువయింది. అంటే మోనోపోల్ అనేది సాధ్యంకాదని నిర్ణయించుకున్నరు శాస్ర్తవేత్తలు. అయస్కాంతానికి ఈ లక్షణం ఎందుకో ఇంతవరకూ శాస్ర్తవేత్తలకు కూడా అంతు చిక్కలేదు.
స్పాట్
ఈ అయస్కాంత సూత్రాల నుంచి కొత్త పాఠం నేర్చుకున్నరు శాస్ర్తవేత్తలు. మోనోపోల్ మాగ్నెట్ అనేది సృష్టిలో ఎక్కడో ఒక దగ్గర ఉండే ఉంటుంది. కానీ అది ఇప్పటికిపుడు దొరికే పని కాదు. అప్పటి వరకు ఒక కొత్త పద్దతిని కనుగొన్నరు శాస్ర్తవేత్తలు. ఫ్లైయింగ్ సాసర్ కు అడుగు బాగాన సౌత్ పోల్ను ఎగ్జిక్యూట్ చేసే మాగ్నట్, నార్గ్ పోల్ను ఎగ్జిక్యూట్ చేసే మాగ్నట్ లను బిగించిన్రు. వీటి చివర బాగాలను రూడార్ అనే పొరతో మరో పోల్ ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకున్నరు. అంటే సాసర్ కిందవైపు నార్త్ పోల్ ఉన్న ఎలక్ర్టో మాగ్నట్ను యాక్టివేట్ చేసినపుడు ఆ మాగ్నట్కు మరో వైపున్న సౌత్ పోల్ పవర్ రుడర్ వలన నిర్వీర్యం అవుతది. అంటే ఇది ఆర్టిఫిషియల్ మోనోపోల్ మాగ్నట్ అన్నమాట. ఈ మోనో నార్త్పోల్ మాగ్నట్ భూగోళం సౌత్పోల్ వైపు లాగబడుతది. కొంతదూరం ప్రయాణించాక కేవలం సౌత్ పోల్ మాత్రమే యాక్టివేట్ అయే ఎలక్ర్టో మాగ్నట్లను యాక్టివేట్ చేస్తరు. దాంతో ఇంజన్ తిరిగి నార్తపోల్ వైపు మళ్లుతది.ఇలా సర్పచలనం ద్వారా ముందుకు అటూ ఇటూ పాకుతూ వేగంగా గాలిలో కదులుతుంది. ఇటువంటి జిగ్ జాగ్ కదలికలతో ఫ్లైయింగ్ సాసర్ గాలితో తేలుతుంది. ఇలా తేలే సాసర్ కేవలం భూమి పై మాత్రమే వెళ్లగలదు. ఎందుకంటే ఇది కేవలం అయస్కాంత క్షేత్ర ఆధారంగా పనిచేస్తది. భూ అయస్కాంత క్షేత్రాన్ని దాటితే ఇక అది పనిచేయనని మొరాయిస్తది. ఒక అయస్కాంత క్షేత్రం దాటితే అది మరో గ్రహక్షేత్రం ఉంటేనే ఇది పయనించగలదు.
స్పాట్
శాస్ర్తవేత్తల సిద్దాంతం ప్రకారం. ఒక సాసర్ థౌసండ్ రెజల్యూషన్ పర్ సెకండ్ వేగంతో తిరిగే సాసర్ కావాలి. దీనిలో అత్యధిక విద్యుత్ ను ప్రసరింప జేసి ఎలక్ర్టినిక్ అయాన్ ఫోర్స్ ద్వారా ఇది పైకి ఎగిరేలా చేస్తరు. ఎగిరిన సాసర్ను దృవాలవైపు మళ్లించడానికి సౌత్ అండ్ నార్త్ పోల్ ను ఆల్టర్నేట్ గా ఉపయోగిస్తూ జిగ్ జాగ్ పద్దతిలో ఖండాంతరాలను రెప్పపాటు వేగంతో చేరుకునే చేస్తరు. ఇదే మోడ్రన్ సాసర్. దీంట్లో ఏ ఎక్స్ ప్లోజర్స్ ఉండవు. పొల్యూషన్లు ఉండవు. సౌండ్ పొల్యూషన్ ఉండదు. పెద్ద ఖర్చుకూడా ఉండదు. కానీ ఇది కేవలం భూ వాతావరణానికే పరిమితం. శాస్ర్తవేత్తలకు విశ్వవ్యాప్తంగా పనిచేయగల సాసర్ కావాలి. దానికోసమే శాస్ర్తవేత్తల అన్వేషణ..అది కూడా సాధ్యమైనంత త్వరలో అందుబాటులోకి వస్తదని ఆశిద్దాం.
స్పాట్
ఎండ్ యాంకర్
ఇదీ ఇవాల్టి సైన్స్ ఎపిసోస్, మరిన్ని సైంటిఫిక్ అప్ డేట్స్ మళ్లీ వచ్చేవారం కలుసుకుందాం అంటిల్ దెన్ బైబై..దిసీజ్ శోభన్ సైనింగ్ ఆఫ్
బ్రేక్లు

ది సైన్స్ ఎపిసోడ్ ముప్పై రెండు

ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలను విప్పి చెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
బ్యాంగ్ ( మర మనిషి)
యాంకర్ 1
దేవుడు తన సృష్టి ద్వారా మనిషిని పుట్టిస్తే, మనిషి తన తెలివి తేటలతో ప్రతి సృష్టి ద్వారా 'మరమనిషి' ని పుట్టించిండు. ఆ మరమనిషినే ఇంగ్లీషులో 'రోబో' అంటరు. ఈ రోబో చేసే పనులు అన్నీ ఇన్నీ కావు.. ఒక్క పిల్లలను కనడం తప్పా అన్నీ చేయగలదు. మనిషి చేయగల పనులన్నీ అవలీలగా చేయగలదు.. మరీ అతిశయం అనుకోకుంటే మనిషి చేయలేని పనులను కూడా రోబో అవలీలగా స్పీడ్ గా చేయగలదు. ఇంతకీ రోబోకి ఇంత శక్తి ఎక్కడిది. రోబో తయారీకి పునాదులు ఎక్కడివి..
స్పాట్
యాంకర్ 2
మొట్ట మొదట 1948 లో ఇంగ్లాండుకు చెందిన గ్రేవాల్టర్ అనే శాస్ర్తవేత్త "ఎలక్ట్రానిక్ ఆటోనామస్ రోబోట్" ను తయారు చేసిండు. అయనకుంటే ముందే అనేక మంది ఈ మరమనిషి ఊహను చేసినా అవేవీ బయట ప్రపంచానికి అంతగా తెలియలేదు. క్రీ.పూ 450 సంవత్సరంలోనే గ్రీకు గణితవేత్త ఆర్కిటస్ ఆవిరి తో ఒక 'మరపక్షి' ని తయారుచేసి గాలిలో ఎగరేసిండట. ఆ తర్వాత సాహిత్యంలో, సైన్సు ఫిక్షన్లో కూడా రోబో హల్ చల్ మొదలయింది.
స్పాట్( మొదట వచ్చే విజువల్స్, సైన్స్ ఫిక్షన్ మూవీ విజువల్స్)
రోబో.. ఈ పదం ఇప్పటి వరకు అంటే మొన్న మొన్న రజనీకాంత్ రోబో సినిమా వచ్చే వరకూ చాలా మందికి చాలా తక్కువ పరిచయం ఉన్న పదం.. రోబో అంటే కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాలోనే చూసేవారు. కానీ నిజమైన రోబోల గురించి తెలిసివారు అతి తక్కువ మందే. రోబో గురించి కొన్ని ఊహాగానాలు మరి కొన్ని కల్పితాలు ప్రచారంలో ఉన్నయి. ఎందుకంటే సినిమాల్లో రోబోలకు నిజజీవితంలో రోబోలకు చాలా తేడాలున్నయి.
స్పాట్
మర మనిషి భావన 20వ శతాబ్దం నుంచే బలంగా నాటుకు పోయింది. మరమనిషి ఇప్పుడున్నరూపాన్ని సంతరించుకోవడానికి ముందు ఎన్నో రూపాలు మారింది. ఇప్పటికీ మారుతూ వస్తోంది. మర మనిషి అనే పదం దీనికి సరియైనది కాదని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే మొదట 'రోబో' అనే మాట 'కారెట్ లేపెక్' అనే 'చెక్ రచయిత' ఉపయోగించిండు. 'చెక్' భాషలో 'రోబో' అంటే బానిస అని అర్థం. అతడికి ఈ పదాన్ని అందించింది అతని తమ్ముడైన జోసఫ్ లేపెక్. ఏమైనా 1950ల తర్వాత ఊపందుకున్న రోబోల తయారీ కాలక్రమంలో అమెరికా, జపాన్ దేశాల శాస్త్రజ్ఞుల ద్వారా రోజు రోజుకూ పరిణితి చెందింది. రోబోల తయారీ కోసమే రోబోటిక్స్ అనే సైన్సు పుట్టింది.
స్పాట్
మనిషి చేయలేని ప్రమాదకరమైన పనులకు అంటే బాంబ్ డిప్యూజింగ్ అగ్ని ప్రమాదాలు వంటి వాటిలో సహకరించేందుకు.. లేదంటే మనిషితో అవసరం లేని పనులకు రోబోలను ఉపయోగించిన్రు.. కాలక్రమంలో డొమెస్టిక్ రోబోలు వచ్చినయి. వీటి వల్ల సంపన్న వర్గాలకు ఇంటి పనులు చేసేందుకు అత్యంత టెక్నాలజి గల జీతం అక్కరలేని పనిమనుషులు దొరికిన్రు. అభివృద్ది చెందిన దేశాల్లో పని మనుషులను పెట్టుకోవడం కంటే ఒక రోబోను కొనుక్కోవడం సులభం కనుక ఇంటి పనులు చేయడానికి డొమెస్టిక్ రోబోల అవసరం ఏర్పడి ప్రస్తుతం వాటి గిరాకీ ఎక్కువగా ఉంది.
స్పాట్
యాంకర్ 3
సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా డెవలప్ అయిన ఈ రోజుల్లో రోబోలు చేయని పనంటూ లేదు. ఇంట్లో పనుల దగ్గరి నుంచి ఆఫీస్ పనుల వరకు మనుషులకంటే సమర్ధవంతంగా, తేలికగా, వేగంగా చేయగలుగుతున్నయి. మనిషులకు చేదోడు వాదోడుగా ఉంటున్నయి. ఆఖరుకు వైద్యం చేయడంలో కూడా రోబో ఓ చేయి వేసింది. ఇప్పటి వరకు డాక్టర్ చేతి చలువ అనేవారు..ఇకనుంచి రోబో చేతి చలువతో ఆరోగ్యం కుదుట పడింది అనాలేమో.
స్పాట్
రోబోల వల్ల జరుగుతున్న ఉపయోగకరమైన పనుల్లో అవి ఆపరేషన్లో సాయపడటం ఒకటి. డాక్టర్లకు సహాయంగా సూక్ష్మ భాగాల సర్జరీ కోసం అతి చిన్న రోబోలు తయారయ్యాయి. వీటిని "టినీ రోబోట్స్" అంటున్నరు. ఆపరేషన్ల సమయంలో మనిషి ద్వారా రోగికి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. కాని టినీ రోబోట్స్ ద్వారా ఆ ప్రమాదం పూర్తిగా తొలగిపోయి, ఆపరేషన్ అనంతరం రోగి త్వరగా కోలుకుంటడు. మొత్తం మీద 2020 నాటికి ఇంచుమించు మనిషిలాంటి రోబోలు తయారవుతున్నయని ఒక అంచనా. ప్రస్తుతం తాకడం ద్వారా అది ఏ వస్తువో గ్రహించే స్పెన్సర్లను తయారు చేసి వాటిని రోబోల చేతికి అమరుస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం సఫలం అయితే రోబోలకు స్పర్శాజ్ఞానం వచ్చేస్తుంది. అవి ఇంకా మెరుగైన సేవలు అందిస్తాయి. రోదసిలో, సముద్ర గర్భంలో... ఇంకా ప్రమాదకరమైన అనేక చోట్ల మనిషికి బదులు రోబో ఎంతో సహాయకారిగా పని చేస్తున్నా రోబోల వల్ల ప్రమాదాలు కూడా ఉండే అవకాశం ఉంది.
స్పాట్
సాంకేతిక యంత్రాలను రోబోట్‌లుగా పరిగణించాలనే దానిపై ఏకాభిప్రాయం లేదు, అయితే నిపుణులు మరియు ప్రజలు సాధారణంగా కొన్ని పనుల్లో కొన్ని లేదా అన్ని చేసేవాటిని రోబోట్‌లుగా అంగీకరిస్తున్నారు ముఖ్యంగా వీటికి కదిలే సామర్థ్యం కలిగివుండటం, యాంత్రిక అవయవం కలిగివుండటం, వాటిచుట్టూ ఉన్న వాతావరణాన్ని గ్రహించి, నియంత్రించగలగడం, మేథావి ప్రవర్తనను ప్రదర్శించడం, ముఖ్యంగా మానవులు లేదా ఇతర జంతువుల ప్రవర్తనను అనుకరించడం వంటి లక్షణాలున్న వాటినే రోబోలుగా పిలవాలని పరిశోధకులు చెబుతున్నరు.
యాంకర్ 4
మనిషికి రోబోను సృష్టించాలన్న ఆలోచన ఎందుకొచ్చింది. రోబోని మనిషి ఆకారంలో తీర్చిదిద్దాలని పరిశోధకులు ఎందుకనుకున్నరు. ఇది చాలా మంది మెదళ్లను తొలిచే ప్రశ్న. వాస్తవానికి రోబో అనేది మరమనిషే కాదు. అనేక రూపాల్లో ఉన్న సాంకేతిక యంత్రం. ఒక్కో పనికి ఒక్కో ప్రోగ్రామింగ్‌ను రూపొందించి వదిలేసిన కదిలే కంప్యూటర్‌ రోబో..
స్పాట్
వాయిస్
శాస్ర్తవేత్తలు రోబోలో తయారీలో సంచలనాలు క్రియేట్‌ చేస్తున్నరు. ఇప్పడు రోబోల నుంచి శాస్ర్తవేత్తలు ఆశిస్తున్న వి మూడు అంశాలు..ఒకటి రోబోలు పరిసరాలను గుర్తించగలగాలి. రెండు రోబో తన అనుభవాలతో ఎప్పటికపుడు తన సాఫ్ట్‌ వేర్‌ ను తానే అప్‌డేట్‌ చేసుకోగలగాలి. మూడు మానవ మేథస్తుకు మించిన వేగం రోబో కంప్యూటర్ కు ఉండాలి. దీనితో బాటు అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు తట్టుకోగల బాడీ నేచర్ ఉండాలి. ఇటువంటి లక్షణాలున్న రోబో తయారైతే ఇక మానవుడు సాధించాలనుకున్నవి రోబోల సాయంతో త్వరగా సాధించ వచ్చని పరిశోధకుల ఆశ.
స్పాట్
రోబో తాను స్వతహాగా కదులు కుంటూ వెళ్లాలంటే అది తన చుట్టూ ఉన్న పరిసరాలను గుర్తించ గలగాలి. అంటే దానికి చూపు ఉండాలి. చూపు కావాలంటే దానికి జ్ఞానేంద్రియాలు అవసరం. ఎస్‌ ఆ జ్ఞానేంద్రియాలను సాంకేతిక బాషలో సెన్సర్‌లు అంటరు. రోబోకు ఎటువంటి సెన్సర్‌లు అమర్చిన్రో , వీటి ద్వారా అవి వస్తువులను ఎలా గుర్తుపడతయో ఒక్కసారి చూద్దాం.
స్పాట్
స్పాన్ఫర్డ్ యూనివర్సిటీలో రోబో పై ఎక్కువగా పరిశోధనలు జరుగుతయి. ఇదిగో ఇక్కడ ఒక రోబో తన సెన్సర్‌ ల సాయంతో ఆబ్జెక్ట్లను ఎలా గుర్తించగలుగుతుందో చూద్దాం.( చిన్న స్పాట్) రోబో చేయి చివరన ఒక హై రెజల్యూషన్‌ కెమేరాను అమర్చిన్రు. ఈ కెమెరా లేజర్‌ సాయంతో తన ముందున్న అన్ని రకాల వస్తువులను స్కాన్‌ చేస్తది. స్కాన్‌ రిపోర్ట్ ను రోబోకు అమర్చి ఉన్న కంప్యూటర్‌ ఎనలైజ్‌ చేస్తది. అప్పటికే ఆ కంప్యూటర్‌ లో మన నిత్యజీవితంలో ఉపయోగించే, తటస్తపడే వివిధ రకాల వస్తువుల, జంతువుల, పరిసరాల బొమ్మలు ఉంటయి. వాటికి సంబందించిన వివిధ రకాలు కూడా ఇందులో పొందుపరచబడి ఉంటయి. అంటే కంప్యూటర్‌ లో కొన్న మిలియన్‌ రకాల ఇమేజ్‌లు అప్పటికే ప్రోగ్రామింగ్‌కు లింక్‌ చేయబడి ఉంటయి. రోబో తన కెమేరా ద్వారా స్కాన్ చేసిన ఇమేజెస్ ను కంప్యూటర్‌ స్కాన్‌ చేసి ఒక్కో ఇమేజ్‌ పేరేంటో తెలుపుతుంది. దాన్ని బట్టి ఆ రోబో ఏ కమాండ్‌ను ఫాలో కావాలో డిసైడ్ చేసుకుంటది.
స్పాట్
ఇక్కడ పరిశోధకులు మొదట ఒక కాఫీ మగ్‌ను చేతికి అందించమని రోబోకు ఆదేశాలు జారీ చేసిన్రు. ముందుగా అది అక్కడున్న పరిసరాలను స్కాన్‌ చేసింది. అప్పుడు కంప్యూటర్‌లో ఇదిగో ఇలా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో స్కాన్‌ అవుతుంది. తరువాత వీటిలో కాఫీ మగ్‌ ఆకారంలో ఉన్న తన ఇమేజెస్‌కు పోలిన వస్తువేదైనా ఉన్నదా అన్న అంశాన్ని బూట్‌ చేసుకుంటది. అప్పటికే తనలో ఉన్న ఇమేజెస్‌ తో కంపేర్‌ చేసి కాఫీ మగ్ దగ్గర ఆగుతుంది. అంతే కాదు కాఫీ మగ్‌ను కాచ్‌ చేసేముంది దాన్ని ఓవరాల్‌గా మరోసారి స్కాన్‌ చేసుకుంటది. అయితే ఇదంతా కేవలం సెకన్ల వ్యవధిలో జరిగే ప్రాసెస్ మాత్రమే.
స్పాట్ (రోబో గ్రాఫిక్స్ విజువల్స్)
యాంకర్ 5
రోబోలు అంటే సినిమాలో చూపించినట్టుగా మనుషుల్లో ప్రవర్తించవు.. ఒక ఎలక్ర్టానిక్‌ మిషన్‌ను మానవాకారంలో మలిచి వాటి కదలికలకు తగిన ప్రోగ్రాం ఫిక్స్ చేసి ఆటోమూవబుల్ సిస్టం ఏర్పాటు చేస్తరు. ఎదుటి వారు వేసిన క్వచ్చన్ కేవలం కమాండ్‌ రూపంలోనే ఉండాలి. యూసర్ అడిగే కమాండ్ వాయిస్‌ తిరిగి డాటా రూపంలో డీకోడ్‌ అవుతుంది. దానికి తగ్గ సమాధానం పరిస్థితులను బట్టి కంప్యూటర్‌ రెస్పాండ్‌ అవుతది. ఆ క్వచ్చన్‌ తిరిగి వాయిస్ కన్వర్టర్ సాఫ్ట్ వేర్ సాయంతో మనకు స్పీకర్స్ ద్వారా వినిపిస్తుంది. ఇదంతా కేవలం సెకన్ల వ్యవధిలోనే జరుగుతుంది. చూడ్డానికి ఎదురెదురుగా నిల్లోని మాట్లాడుకున్నట్టుంటది.
స్పాట్( ఐ రోబో మూవీ సీన్)
రోబోలు స్వయంగా ఆలోచించలేవు. ప్రోగ్రామర్‌ ఫిక్స్ చేసిన దానికే కట్టుబడి ఉంటయి. అంతకు మించి ఒక్క కమాండ్‌ను కూడా ఫాలో కావడం చాలా కష్టం. ఎందుకంటే అది జీవి కాదు. కేవలం టెరాబైట్‌ల మెమరీ ఆఫ్‌ కమాండ్స్ అండ్‌ ఇమేజెస్. ఇదే శాస్ర్తవేత్తలకు పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. ఉదా హరణకు మనం రోడ్డు పై నడుచుకుంటూ వెళుతుంటే ఎవరైనా అడ్డుతగలవచ్చు లేదా రోడ్డు పై ఎగుడుదిగుళ్లు గతుకులు రావచ్చు. మనం వాటిని బట్టి నడుచుకుంటూ వెళతం. కానీ మిషన్‌కు అవేమీ తెలియదు. పసిగట్టలేదు కూడా. అలా పసిగట్టగలిగే జ్ఞానాన్ని కామన్‌ సెన్స్ అంటరు. ఈ కామన్‌సెన్స్ ను రోబోకు అందివ్వ్డడానికి శాస్ర్తవేత్తలు ప్రయత్నిస్తున్నరు.
స్పాట్
ఒక జీవరహిత యంత్రానికి కామన్‌ సెన్స్ కలిగించడమంటే మాటలు కాదు. ఎందుకంటే మెదడున్న జంతువులకే కామన్ సెన్స్ కష్టం అటువంటిది ఒక మిషన్‌ కు కామన్‌ సెన్స్ అంటే మాటలు కాదు. ఎందుకంటే కామన్‌ సెన్స్ అంటే మెదడు పూర్తిగా అభివృద్ది చెంది ఉండాలి. ఉదాహరణకు మానవ మెదడును విశ్లేషిస్తే దాంట్లో కొన్ని మిలియన్‌ల న్యూరాన్‌లు ఉంటయి. ప్రతి న్యూరాన్‌లో మెమరీ పవర్‌ ఉంటుంది. అంతేకాదు ఈ న్యూరాన్‌లు శరీరంలో వార్తా వాహక క్రియను నిర్వహిస్తయి. మామూలుగా ఈ పనిని కంప్యూటర్‌లో చిన్న చిన్న సిలికాన్‌ చిప్‌లు చేస్తయి. అయితే అవి కేవలం యూసర్‌ ఇచ్చిన వాటిని ప్రోగ్రాంలో ఉన్నట్టు మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలవు. అంతకు మించి వాటితో ఇంకేమీ చేయలేము. కానీ ఇప్పడు మన శాస్ర్తవేత్తల ఆలోచన ప్రకారం రోబోలో ఉన్న కంప్యూటర్ పరిస్థితులను బట్టి దాని ప్రోగ్రామింగ్‌ అది మార్చుకోవాలి. అంటే ఆ రోజు వరకు జరిగిన వివిధ సంఘటనలు రికార్డు చేసి ఆ అనుభవాలను తన పాత డేటాకు కలుపుకోవాలి. మళ్లీ అటువంటి సంఘటనలు ఎదురైతే గతంలో ప్రవర్తించిన విధంగా ప్రవర్తించాలనేది సూత్రం.
స్పాట్
యాంకర్ 6
రోబోను మనిషిలా అలోచించేలా చేయాలను కోవడం అత్యాశే కావచ్చు. ఎందుకంటే రోబో అనేది కేవలం ఒక ఫిక్స్ డ్ ప్రోగ్రాం చేయబడిన కదిలే కంప్యూటర్‌. దానికదే ఆలోచించుకోవడం అనేది సాధ్యంకాని పని ఒక వేళ అలాగానీ జరిగిందంటే ఇక అప్పడు రోబోలు మానవాతీత శక్తలుగా మారినా ఆశ్చర్యంలేదు. ఇంగ్లీష్‌ ఫిక్షన్‌ మూవీలో లాగా తిరిగి మనుషులపైనే యుద్దం ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటకే ఈ అంశం పై బోలెడన్ని సినిమాలు వచ్చినయి.
( ఐ రాబాట్ మూవీ విజువల్స్ స్పాట్)
రోబోట్‌ అనేది కేవలం యంత్రం. సాఫ్టవేర్ ప్రకారం కమాండ్‌ను నడుచుకునే యంత్రం. దీని నిండా సెన్సర్‌లు నింపబడి ఉంటయి. ఆ సెన్సర్లు కాప్చర్ చేసిన విజవల్‌ బట్టి కమాండ్స్ రన్ అవుతూ ఉంటయి. కమాండ్‌ ను బట్టి రోబో మూవ్ అవుతూ ఉంటది. ఇంతకు ముందు రోబోలకు ఒక సాంకేతిక సమస్య అని చెప్పుకున్నం. దారి వెంట నడిచే టపుడు ఏవైనా అడ్డు రావచ్చు, లేదా గతుకుల రోడ్డు ఉండొచ్చు. ఆ సమస్యను రోబో ఎలా అధిగమిస్తుందని. కానీ ఇక్కడ ఒక శాస్ర్తవేత్త ఆ సమస్యను ఎలా అధిగమించిండో చూడొచ్చు.
స్పాట్( చిన్న ట్రాలీ లా ఉండే రోబో )
ఇక్కడ మనకు కనిపించే చిన్న ట్రాలీ లాంటి రోబో రోడ్డు పై నడక సమస్యను ఎలా అధిగమించిందో చూద్దాం.. ముందుగా రోబో హెడ్ పార్ట్ లో నాలుగు కెమరాలు ఫిక్స్ చేసిన్రు. ఇది రోబో కదిలేటపుడు వీడియో రికార్డ్ చేస్తది. ఆ విజువల్స్ ఎప్పటికపుడు కంప్యూటర్‌లో ఉన్న ఇమేజెస్ తో కంపేర్‌ చేసుకుంటూ ఉంటయి. కమాండ్‌ను బట్టి అవి ఫాలో అవుతుంటది. చూడండి ఇక్కడ పరిశోధకులు చూట్టూ డబ్బాలు విసిరి మద్యలో రోబోను విడిచారు. అది వాటి మద్యలోంచి దేన్నీ ఢీ కొనకుండా డైరెక్ట్ గా ఒక డ్రైవర్‌ నడిపినట్టు వెళ్లింది.
స్పాట్
ఇప్పటి వరకు మనం చూసింది 20 వ శతాబ్దంలో ఉన్న రోబోలను మాత్రమే.. ఇప్పడున్న రోబోల ఆధునిక సాంకేతక పరిజ్ఞానం అద్భుతమైనది. నిజానికి ఇవి వాటంతట అవే ఆలోచించి పనిచేస్తున్నయా అన్నంత భ్రమకలుగుతది. ఇవి ఇప్పడు మొడ్రన్ గా తయారయ్యే రోబోలు వాటంతట అవే మూవ్‌ కాగలవు.అంతేకాకుండా మార్గాన్ని బట్టి వాటి కదలికలను మార్చుకోగలవు. అప్పటికపుడు తమ రూపాన్ని పూర్తిగా మార్చగలవు. ఇదిగో ఇక్కడ చైన్‌ లా ఉన్న రోబో చూడండి ఎన్ని విన్యాసాలు చేస్తుందో. ఇది అప్పటికపుడు కాటర్‌ పిల్లర్ లా నడవగలదు. తాళ్లపై పాకగలదు. అంతేకాదు అప్పటి కపుడు తన రూపాన్ని మార్చుకొని పాములా మారి ఇరుకైన దారిగుండా వెళ్లగలదు.
స్పాట్
చూశారా అచ్చం ఇటువంటి కాన్సెప్ట్ తోనే శంకర్‌ రోబో సినిమా తీసిండు. ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్‌ లో అవి అప్పటికపుడు తమ రూపాన్ని మార్చుకొని, వాటి లక్షణాలను కూడా మార్చుకొని రోబోలు తమ పని చేసుకొని వెళ్లి పోతయి.
స్పాట్ (ఫైటింగ్‌ సీన్0
ఇప్పుడు మనం చూసిన ఈ రోబోలను హ్యూమనాయిడ్‌ రోబోలు అని పిలుస్తరు. అంటే మానవుణ్ని పోలి, అచ్చం మానవుడేనా అని భ్రమ కలుగ జేసే రోబోలన్నమాట. వీటిని చూసి సడెన్‌ గా మనిషి అని అనుకున్నా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇందులో ఆండ్రాయిడ్‌ రోబో, గైనాయిడ్‌ రోబోలని రెండు రకాలు ఉన్నయి. యాండ్రాయిడ్‌ రోబో అంటే రోబో పురుషుడి అవతారంలో ఉంటది. గైనాయిడ్‌ రోబో స్ర్తీని పోలి ఉంటది.
స్పాట్ (హ్యూమనాయిడ్‌ రోబో విజువల్స్)
భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానం మరింత డెవలప్‌ అయి మరింత మంచిరోబోలు అందుబాటులోకి వచ్చి కష్ఠమైన పనులన్నిటినీ సులభంగా రోబోలతో చేయించుకోవలని ఆశపడుతున్నరు పరిశోధకులు. అయితే వీరు తయారు చేసే రోబోలు మానవ కళ్యాణానికా లేక వినాశనానికా అనేది శాస్ర్తంతో బాటు కాలమే నిర్ణయించాలి.
స్పాట్
ఎండ్‌ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ విశేషాలు. వచ్చేవారం మరిన్ని సైంటిఫిక్‌ అప్‌డేట్స్‌ తో మళ్లీ కలుసుకుందా.. అంటిల్‌ దెన్‌ బైబై ది సీజ్‌ యువర్స్ శోభన్ సైనింగ్‌ ఆఫ్..
బ్రేక్‌లు.

ది సైన్స్ ఎపిసోడ్ ముప్పై రెండు

ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలను విప్పి చెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
బ్యాంగ్ ( మర మనిషి)
యాంకర్ 1
దేవుడు తన సృష్టి ద్వారా మనిషిని పుట్టిస్తే, మనిషి తన తెలివి తేటలతో ప్రతి సృష్టి ద్వారా 'మరమనిషి' ని పుట్టించిండు. ఆ మరమనిషినే ఇంగ్లీషులో 'రోబో' అంటరు. ఈ రోబో చేసే పనులు అన్నీ ఇన్నీ కావు.. ఒక్క పిల్లలను కనడం తప్పా అన్నీ చేయగలదు. మనిషి చేయగల పనులన్నీ అవలీలగా చేయగలదు.. మరీ అతిశయం అనుకోకుంటే మనిషి చేయలేని పనులను కూడా రోబో అవలీలగా స్పీడ్ గా చేయగలదు. ఇంతకీ రోబోకి ఇంత శక్తి ఎక్కడిది. రోబో తయారీకి పునాదులు ఎక్కడివి..
స్పాట్
యాంకర్ 2
మొట్ట మొదట 1948 లో ఇంగ్లాండుకు చెందిన గ్రేవాల్టర్ అనే శాస్ర్తవేత్త "ఎలక్ట్రానిక్ ఆటోనామస్ రోబోట్" ను తయారు చేసిండు. అయనకుంటే ముందే అనేక మంది ఈ మరమనిషి ఊహను చేసినా అవేవీ బయట ప్రపంచానికి అంతగా తెలియలేదు. క్రీ.పూ 450 సంవత్సరంలోనే గ్రీకు గణితవేత్త ఆర్కిటస్ ఆవిరి తో ఒక 'మరపక్షి' ని తయారుచేసి గాలిలో ఎగరేసిండట. ఆ తర్వాత సాహిత్యంలో, సైన్సు ఫిక్షన్లో కూడా రోబో హల్ చల్ మొదలయింది.
స్పాట్( మొదట వచ్చే విజువల్స్, సైన్స్ ఫిక్షన్ మూవీ విజువల్స్)
రోబో.. ఈ పదం ఇప్పటి వరకు అంటే మొన్న మొన్న రజనీకాంత్ రోబో సినిమా వచ్చే వరకూ చాలా మందికి చాలా తక్కువ పరిచయం ఉన్న పదం.. రోబో అంటే కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాలోనే చూసేవారు. కానీ నిజమైన రోబోల గురించి తెలిసివారు అతి తక్కువ మందే. రోబో గురించి కొన్ని ఊహాగానాలు మరి కొన్ని కల్పితాలు ప్రచారంలో ఉన్నయి. ఎందుకంటే సినిమాల్లో రోబోలకు నిజజీవితంలో రోబోలకు చాలా తేడాలున్నయి.
స్పాట్
మర మనిషి భావన 20వ శతాబ్దం నుంచే బలంగా నాటుకు పోయింది. మరమనిషి ఇప్పుడున్నరూపాన్ని సంతరించుకోవడానికి ముందు ఎన్నో రూపాలు మారింది. ఇప్పటికీ మారుతూ వస్తోంది. మర మనిషి అనే పదం దీనికి సరియైనది కాదని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే మొదట 'రోబో' అనే మాట 'కారెట్ లేపెక్' అనే 'చెక్ రచయిత' ఉపయోగించిండు. 'చెక్' భాషలో 'రోబో' అంటే బానిస అని అర్థం. అతడికి ఈ పదాన్ని అందించింది అతని తమ్ముడైన జోసఫ్ లేపెక్. ఏమైనా 1950ల తర్వాత ఊపందుకున్న రోబోల తయారీ కాలక్రమంలో అమెరికా, జపాన్ దేశాల శాస్త్రజ్ఞుల ద్వారా రోజు రోజుకూ పరిణితి చెందింది. రోబోల తయారీ కోసమే రోబోటిక్స్ అనే సైన్సు పుట్టింది.
స్పాట్
మనిషి చేయలేని ప్రమాదకరమైన పనులకు అంటే బాంబ్ డిప్యూజింగ్ అగ్ని ప్రమాదాలు వంటి వాటిలో సహకరించేందుకు.. లేదంటే మనిషితో అవసరం లేని పనులకు రోబోలను ఉపయోగించిన్రు.. కాలక్రమంలో డొమెస్టిక్ రోబోలు వచ్చినయి. వీటి వల్ల సంపన్న వర్గాలకు ఇంటి పనులు చేసేందుకు అత్యంత టెక్నాలజి గల జీతం అక్కరలేని పనిమనుషులు దొరికిన్రు. అభివృద్ది చెందిన దేశాల్లో పని మనుషులను పెట్టుకోవడం కంటే ఒక రోబోను కొనుక్కోవడం సులభం కనుక ఇంటి పనులు చేయడానికి డొమెస్టిక్ రోబోల అవసరం ఏర్పడి ప్రస్తుతం వాటి గిరాకీ ఎక్కువగా ఉంది.
స్పాట్
యాంకర్ 3
సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా డెవలప్ అయిన ఈ రోజుల్లో రోబోలు చేయని పనంటూ లేదు. ఇంట్లో పనుల దగ్గరి నుంచి ఆఫీస్ పనుల వరకు మనుషులకంటే సమర్ధవంతంగా, తేలికగా, వేగంగా చేయగలుగుతున్నయి. మనిషులకు చేదోడు వాదోడుగా ఉంటున్నయి. ఆఖరుకు వైద్యం చేయడంలో కూడా రోబో ఓ చేయి వేసింది. ఇప్పటి వరకు డాక్టర్ చేతి చలువ అనేవారు..ఇకనుంచి రోబో చేతి చలువతో ఆరోగ్యం కుదుట పడింది అనాలేమో.
స్పాట్
రోబోల వల్ల జరుగుతున్న ఉపయోగకరమైన పనుల్లో అవి ఆపరేషన్లో సాయపడటం ఒకటి. డాక్టర్లకు సహాయంగా సూక్ష్మ భాగాల సర్జరీ కోసం అతి చిన్న రోబోలు తయారయ్యాయి. వీటిని "టినీ రోబోట్స్" అంటున్నరు. ఆపరేషన్ల సమయంలో మనిషి ద్వారా రోగికి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. కాని టినీ రోబోట్స్ ద్వారా ఆ ప్రమాదం పూర్తిగా తొలగిపోయి, ఆపరేషన్ అనంతరం రోగి త్వరగా కోలుకుంటడు. మొత్తం మీద 2020 నాటికి ఇంచుమించు మనిషిలాంటి రోబోలు తయారవుతున్నయని ఒక అంచనా. ప్రస్తుతం తాకడం ద్వారా అది ఏ వస్తువో గ్రహించే స్పెన్సర్లను తయారు చేసి వాటిని రోబోల చేతికి అమరుస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం సఫలం అయితే రోబోలకు స్పర్శాజ్ఞానం వచ్చేస్తుంది. అవి ఇంకా మెరుగైన సేవలు అందిస్తాయి. రోదసిలో, సముద్ర గర్భంలో... ఇంకా ప్రమాదకరమైన అనేక చోట్ల మనిషికి బదులు రోబో ఎంతో సహాయకారిగా పని చేస్తున్నా రోబోల వల్ల ప్రమాదాలు కూడా ఉండే అవకాశం ఉంది.
స్పాట్
సాంకేతిక యంత్రాలను రోబోట్‌లుగా పరిగణించాలనే దానిపై ఏకాభిప్రాయం లేదు, అయితే నిపుణులు మరియు ప్రజలు సాధారణంగా కొన్ని పనుల్లో కొన్ని లేదా అన్ని చేసేవాటిని రోబోట్‌లుగా అంగీకరిస్తున్నారు ముఖ్యంగా వీటికి కదిలే సామర్థ్యం కలిగివుండటం, యాంత్రిక అవయవం కలిగివుండటం, వాటిచుట్టూ ఉన్న వాతావరణాన్ని గ్రహించి, నియంత్రించగలగడం, మేథావి ప్రవర్తనను ప్రదర్శించడం, ముఖ్యంగా మానవులు లేదా ఇతర జంతువుల ప్రవర్తనను అనుకరించడం వంటి లక్షణాలున్న వాటినే రోబోలుగా పిలవాలని పరిశోధకులు చెబుతున్నరు.
యాంకర్ 4
మనిషికి రోబోను సృష్టించాలన్న ఆలోచన ఎందుకొచ్చింది. రోబోని మనిషి ఆకారంలో తీర్చిదిద్దాలని పరిశోధకులు ఎందుకనుకున్నరు. ఇది చాలా మంది మెదళ్లను తొలిచే ప్రశ్న. వాస్తవానికి రోబో అనేది మరమనిషే కాదు. అనేక రూపాల్లో ఉన్న సాంకేతిక యంత్రం. ఒక్కో పనికి ఒక్కో ప్రోగ్రామింగ్‌ను రూపొందించి వదిలేసిన కదిలే కంప్యూటర్‌ రోబో..
స్పాట్
వాయిస్
శాస్ర్తవేత్తలు రోబోలో తయారీలో సంచలనాలు క్రియేట్‌ చేస్తున్నరు. ఇప్పడు రోబోల నుంచి శాస్ర్తవేత్తలు ఆశిస్తున్న వి మూడు అంశాలు..ఒకటి రోబోలు పరిసరాలను గుర్తించగలగాలి. రెండు రోబో తన అనుభవాలతో ఎప్పటికపుడు తన సాఫ్ట్‌ వేర్‌ ను తానే అప్‌డేట్‌ చేసుకోగలగాలి. మూడు మానవ మేథస్తుకు మించిన వేగం రోబో కంప్యూటర్ కు ఉండాలి. దీనితో బాటు అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు తట్టుకోగల బాడీ నేచర్ ఉండాలి. ఇటువంటి లక్షణాలున్న రోబో తయారైతే ఇక మానవుడు సాధించాలనుకున్నవి రోబోల సాయంతో త్వరగా సాధించ వచ్చని పరిశోధకుల ఆశ.
స్పాట్
రోబో తాను స్వతహాగా కదులు కుంటూ వెళ్లాలంటే అది తన చుట్టూ ఉన్న పరిసరాలను గుర్తించ గలగాలి. అంటే దానికి చూపు ఉండాలి. చూపు కావాలంటే దానికి జ్ఞానేంద్రియాలు అవసరం. ఎస్‌ ఆ జ్ఞానేంద్రియాలను సాంకేతిక బాషలో సెన్సర్‌లు అంటరు. రోబోకు ఎటువంటి సెన్సర్‌లు అమర్చిన్రో , వీటి ద్వారా అవి వస్తువులను ఎలా గుర్తుపడతయో ఒక్కసారి చూద్దాం.
స్పాట్
స్పాన్ఫర్డ్ యూనివర్సిటీలో రోబో పై ఎక్కువగా పరిశోధనలు జరుగుతయి. ఇదిగో ఇక్కడ ఒక రోబో తన సెన్సర్‌ ల సాయంతో ఆబ్జెక్ట్లను ఎలా గుర్తించగలుగుతుందో చూద్దాం.( చిన్న స్పాట్) రోబో చేయి చివరన ఒక హై రెజల్యూషన్‌ కెమేరాను అమర్చిన్రు. ఈ కెమెరా లేజర్‌ సాయంతో తన ముందున్న అన్ని రకాల వస్తువులను స్కాన్‌ చేస్తది. స్కాన్‌ రిపోర్ట్ ను రోబోకు అమర్చి ఉన్న కంప్యూటర్‌ ఎనలైజ్‌ చేస్తది. అప్పటికే ఆ కంప్యూటర్‌ లో మన నిత్యజీవితంలో ఉపయోగించే, తటస్తపడే వివిధ రకాల వస్తువుల, జంతువుల, పరిసరాల బొమ్మలు ఉంటయి. వాటికి సంబందించిన వివిధ రకాలు కూడా ఇందులో పొందుపరచబడి ఉంటయి. అంటే కంప్యూటర్‌ లో కొన్న మిలియన్‌ రకాల ఇమేజ్‌లు అప్పటికే ప్రోగ్రామింగ్‌కు లింక్‌ చేయబడి ఉంటయి. రోబో తన కెమేరా ద్వారా స్కాన్ చేసిన ఇమేజెస్ ను కంప్యూటర్‌ స్కాన్‌ చేసి ఒక్కో ఇమేజ్‌ పేరేంటో తెలుపుతుంది. దాన్ని బట్టి ఆ రోబో ఏ కమాండ్‌ను ఫాలో కావాలో డిసైడ్ చేసుకుంటది.
స్పాట్
ఇక్కడ పరిశోధకులు మొదట ఒక కాఫీ మగ్‌ను చేతికి అందించమని రోబోకు ఆదేశాలు జారీ చేసిన్రు. ముందుగా అది అక్కడున్న పరిసరాలను స్కాన్‌ చేసింది. అప్పుడు కంప్యూటర్‌లో ఇదిగో ఇలా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో స్కాన్‌ అవుతుంది. తరువాత వీటిలో కాఫీ మగ్‌ ఆకారంలో ఉన్న తన ఇమేజెస్‌కు పోలిన వస్తువేదైనా ఉన్నదా అన్న అంశాన్ని బూట్‌ చేసుకుంటది. అప్పటికే తనలో ఉన్న ఇమేజెస్‌ తో కంపేర్‌ చేసి కాఫీ మగ్ దగ్గర ఆగుతుంది. అంతే కాదు కాఫీ మగ్‌ను కాచ్‌ చేసేముంది దాన్ని ఓవరాల్‌గా మరోసారి స్కాన్‌ చేసుకుంటది. అయితే ఇదంతా కేవలం సెకన్ల వ్యవధిలో జరిగే ప్రాసెస్ మాత్రమే.
స్పాట్ (రోబో గ్రాఫిక్స్ విజువల్స్)
యాంకర్ 5
రోబోలు అంటే సినిమాలో చూపించినట్టుగా మనుషుల్లో ప్రవర్తించవు.. ఒక ఎలక్ర్టానిక్‌ మిషన్‌ను మానవాకారంలో మలిచి వాటి కదలికలకు తగిన ప్రోగ్రాం ఫిక్స్ చేసి ఆటోమూవబుల్ సిస్టం ఏర్పాటు చేస్తరు. ఎదుటి వారు వేసిన క్వచ్చన్ కేవలం కమాండ్‌ రూపంలోనే ఉండాలి. యూసర్ అడిగే కమాండ్ వాయిస్‌ తిరిగి డాటా రూపంలో డీకోడ్‌ అవుతుంది. దానికి తగ్గ సమాధానం పరిస్థితులను బట్టి కంప్యూటర్‌ రెస్పాండ్‌ అవుతది. ఆ క్వచ్చన్‌ తిరిగి వాయిస్ కన్వర్టర్ సాఫ్ట్ వేర్ సాయంతో మనకు స్పీకర్స్ ద్వారా వినిపిస్తుంది. ఇదంతా కేవలం సెకన్ల వ్యవధిలోనే జరుగుతుంది. చూడ్డానికి ఎదురెదురుగా నిల్లోని మాట్లాడుకున్నట్టుంటది.
స్పాట్( ఐ రోబో మూవీ సీన్)
రోబోలు స్వయంగా ఆలోచించలేవు. ప్రోగ్రామర్‌ ఫిక్స్ చేసిన దానికే కట్టుబడి ఉంటయి. అంతకు మించి ఒక్క కమాండ్‌ను కూడా ఫాలో కావడం చాలా కష్టం. ఎందుకంటే అది జీవి కాదు. కేవలం టెరాబైట్‌ల మెమరీ ఆఫ్‌ కమాండ్స్ అండ్‌ ఇమేజెస్. ఇదే శాస్ర్తవేత్తలకు పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. ఉదా హరణకు మనం రోడ్డు పై నడుచుకుంటూ వెళుతుంటే ఎవరైనా అడ్డుతగలవచ్చు లేదా రోడ్డు పై ఎగుడుదిగుళ్లు గతుకులు రావచ్చు. మనం వాటిని బట్టి నడుచుకుంటూ వెళతం. కానీ మిషన్‌కు అవేమీ తెలియదు. పసిగట్టలేదు కూడా. అలా పసిగట్టగలిగే జ్ఞానాన్ని కామన్‌ సెన్స్ అంటరు. ఈ కామన్‌సెన్స్ ను రోబోకు అందివ్వ్డడానికి శాస్ర్తవేత్తలు ప్రయత్నిస్తున్నరు.
స్పాట్
ఒక జీవరహిత యంత్రానికి కామన్‌ సెన్స్ కలిగించడమంటే మాటలు కాదు. ఎందుకంటే మెదడున్న జంతువులకే కామన్ సెన్స్ కష్టం అటువంటిది ఒక మిషన్‌ కు కామన్‌ సెన్స్ అంటే మాటలు కాదు. ఎందుకంటే కామన్‌ సెన్స్ అంటే మెదడు పూర్తిగా అభివృద్ది చెంది ఉండాలి. ఉదాహరణకు మానవ మెదడును విశ్లేషిస్తే దాంట్లో కొన్ని మిలియన్‌ల న్యూరాన్‌లు ఉంటయి. ప్రతి న్యూరాన్‌లో మెమరీ పవర్‌ ఉంటుంది. అంతేకాదు ఈ న్యూరాన్‌లు శరీరంలో వార్తా వాహక క్రియను నిర్వహిస్తయి. మామూలుగా ఈ పనిని కంప్యూటర్‌లో చిన్న చిన్న సిలికాన్‌ చిప్‌లు చేస్తయి. అయితే అవి కేవలం యూసర్‌ ఇచ్చిన వాటిని ప్రోగ్రాంలో ఉన్నట్టు మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలవు. అంతకు మించి వాటితో ఇంకేమీ చేయలేము. కానీ ఇప్పడు మన శాస్ర్తవేత్తల ఆలోచన ప్రకారం రోబోలో ఉన్న కంప్యూటర్ పరిస్థితులను బట్టి దాని ప్రోగ్రామింగ్‌ అది మార్చుకోవాలి. అంటే ఆ రోజు వరకు జరిగిన వివిధ సంఘటనలు రికార్డు చేసి ఆ అనుభవాలను తన పాత డేటాకు కలుపుకోవాలి. మళ్లీ అటువంటి సంఘటనలు ఎదురైతే గతంలో ప్రవర్తించిన విధంగా ప్రవర్తించాలనేది సూత్రం.
స్పాట్
యాంకర్ 6
రోబోను మనిషిలా అలోచించేలా చేయాలను కోవడం అత్యాశే కావచ్చు. ఎందుకంటే రోబో అనేది కేవలం ఒక ఫిక్స్ డ్ ప్రోగ్రాం చేయబడిన కదిలే కంప్యూటర్‌. దానికదే ఆలోచించుకోవడం అనేది సాధ్యంకాని పని ఒక వేళ అలాగానీ జరిగిందంటే ఇక అప్పడు రోబోలు మానవాతీత శక్తలుగా మారినా ఆశ్చర్యంలేదు. ఇంగ్లీష్‌ ఫిక్షన్‌ మూవీలో లాగా తిరిగి మనుషులపైనే యుద్దం ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటకే ఈ అంశం పై బోలెడన్ని సినిమాలు వచ్చినయి.
( ఐ రాబాట్ మూవీ విజువల్స్ స్పాట్)
రోబోట్‌ అనేది కేవలం యంత్రం. సాఫ్టవేర్ ప్రకారం కమాండ్‌ను నడుచుకునే యంత్రం. దీని నిండా సెన్సర్‌లు నింపబడి ఉంటయి. ఆ సెన్సర్లు కాప్చర్ చేసిన విజవల్‌ బట్టి కమాండ్స్ రన్ అవుతూ ఉంటయి. కమాండ్‌ ను బట్టి రోబో మూవ్ అవుతూ ఉంటది. ఇంతకు ముందు రోబోలకు ఒక సాంకేతిక సమస్య అని చెప్పుకున్నం. దారి వెంట నడిచే టపుడు ఏవైనా అడ్డు రావచ్చు, లేదా గతుకుల రోడ్డు ఉండొచ్చు. ఆ సమస్యను రోబో ఎలా అధిగమిస్తుందని. కానీ ఇక్కడ ఒక శాస్ర్తవేత్త ఆ సమస్యను ఎలా అధిగమించిండో చూడొచ్చు.
స్పాట్( చిన్న ట్రాలీ లా ఉండే రోబో )
ఇక్కడ మనకు కనిపించే చిన్న ట్రాలీ లాంటి రోబో రోడ్డు పై నడక సమస్యను ఎలా అధిగమించిందో చూద్దాం.. ముందుగా రోబో హెడ్ పార్ట్ లో నాలుగు కెమరాలు ఫిక్స్ చేసిన్రు. ఇది రోబో కదిలేటపుడు వీడియో రికార్డ్ చేస్తది. ఆ విజువల్స్ ఎప్పటికపుడు కంప్యూటర్‌లో ఉన్న ఇమేజెస్ తో కంపేర్‌ చేసుకుంటూ ఉంటయి. కమాండ్‌ను బట్టి అవి ఫాలో అవుతుంటది. చూడండి ఇక్కడ పరిశోధకులు చూట్టూ డబ్బాలు విసిరి మద్యలో రోబోను విడిచారు. అది వాటి మద్యలోంచి దేన్నీ ఢీ కొనకుండా డైరెక్ట్ గా ఒక డ్రైవర్‌ నడిపినట్టు వెళ్లింది.
స్పాట్
ఇప్పటి వరకు మనం చూసింది 20 వ శతాబ్దంలో ఉన్న రోబోలను మాత్రమే.. ఇప్పడున్న రోబోల ఆధునిక సాంకేతక పరిజ్ఞానం అద్భుతమైనది. నిజానికి ఇవి వాటంతట అవే ఆలోచించి పనిచేస్తున్నయా అన్నంత భ్రమకలుగుతది. ఇవి ఇప్పడు మొడ్రన్ గా తయారయ్యే రోబోలు వాటంతట అవే మూవ్‌ కాగలవు.అంతేకాకుండా మార్గాన్ని బట్టి వాటి కదలికలను మార్చుకోగలవు. అప్పటికపుడు తమ రూపాన్ని పూర్తిగా మార్చగలవు. ఇదిగో ఇక్కడ చైన్‌ లా ఉన్న రోబో చూడండి ఎన్ని విన్యాసాలు చేస్తుందో. ఇది అప్పటికపుడు కాటర్‌ పిల్లర్ లా నడవగలదు. తాళ్లపై పాకగలదు. అంతేకాదు అప్పటి కపుడు తన రూపాన్ని మార్చుకొని పాములా మారి ఇరుకైన దారిగుండా వెళ్లగలదు.
స్పాట్
చూశారా అచ్చం ఇటువంటి కాన్సెప్ట్ తోనే శంకర్‌ రోబో సినిమా తీసిండు. ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్‌ లో అవి అప్పటికపుడు తమ రూపాన్ని మార్చుకొని, వాటి లక్షణాలను కూడా మార్చుకొని రోబోలు తమ పని చేసుకొని వెళ్లి పోతయి.
స్పాట్ (ఫైటింగ్‌ సీన్0
ఇప్పుడు మనం చూసిన ఈ రోబోలను హ్యూమనాయిడ్‌ రోబోలు అని పిలుస్తరు. అంటే మానవుణ్ని పోలి, అచ్చం మానవుడేనా అని భ్రమ కలుగ జేసే రోబోలన్నమాట. వీటిని చూసి సడెన్‌ గా మనిషి అని అనుకున్నా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇందులో ఆండ్రాయిడ్‌ రోబో, గైనాయిడ్‌ రోబోలని రెండు రకాలు ఉన్నయి. యాండ్రాయిడ్‌ రోబో అంటే రోబో పురుషుడి అవతారంలో ఉంటది. గైనాయిడ్‌ రోబో స్ర్తీని పోలి ఉంటది.
స్పాట్ (హ్యూమనాయిడ్‌ రోబో విజువల్స్)
భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానం మరింత డెవలప్‌ అయి మరింత మంచిరోబోలు అందుబాటులోకి వచ్చి కష్ఠమైన పనులన్నిటినీ సులభంగా రోబోలతో చేయించుకోవలని ఆశపడుతున్నరు పరిశోధకులు. అయితే వీరు తయారు చేసే రోబోలు మానవ కళ్యాణానికా లేక వినాశనానికా అనేది శాస్ర్తంతో బాటు కాలమే నిర్ణయించాలి.
స్పాట్
ఎండ్‌ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ విశేషాలు. వచ్చేవారం మరిన్ని సైంటిఫిక్‌ అప్‌డేట్స్‌ తో మళ్లీ కలుసుకుందా.. అంటిల్‌ దెన్‌ బైబై ది సీజ్‌ యువర్స్ శోభన్ సైనింగ్‌ ఆఫ్..
బ్రేక్‌లు.

ది సైన్స్ ఎపిసోడ్ మప్పై ఒకటి

ఇంట్రో యాంకర్
ఈ భూగోళం ఎంత సుందంరంగా ఉంటది. ఎన్నికావ్యఝరులు కురిపించినా ఇంకా మిగిలే అందం ఈ భూమిది. అంతకు మించి భూమి పై అన్ని రకాల జీవులు జీవించడానికి అనుకూలమైన వాతావరణాలు ఉన్నయి. ఎన్నో కోటాను కోట్ల జీవులకు అమృత ధారలు పంచుతున్న ఈ భూమి కాసిన్ని రోజుల్లో మరుభూమిగా మారనుందా.. ఈ విషయం పై నాసా శాస్ర్తవేత్తలు ఒక కొత్త వాదన బయటకు తెచ్చారు.
భూమి కి యాక్సిడెంట్ చేసే ఆ గ్రహశకలం ఏంటి..
వాయిస్
అందమైన భూగోళం..ఎంత అందమైనదంటే మంచు ముత్యాలు అవని మెడలో అందంగా అలంకరింనట్టుండే హిమగిరులు...నల్లని పాయలతో నిగనిగలాడే బారు జడల్లాంటి నదీ నదాలు. భూమికి బొట్టు పెట్టినట్టు కణకణ మండే అగ్ని పర్వతాలు.. అంతెత్తునుంచి దూకే జోరైన జలపాతాలు.. పచ్చని అడవులు, సొగసైన జలవనరులు.. ఎన్న కావ్యాలు వర్ణించినా తరగని అందం పుడమి తల్లిది.
స్పాట్
ఈ తరగని గనుల కల్పవల్లి ఒడిలో ఎన్న జీవులు, స్వేచ్ఛగా ఎగిరే విహంగాలు.. జలాంతర్భాగంలో ఈదులాడే జలచరాలు.. అడవి తల్లి ఒడిలో సేద తీరే వన్యప్రాణులు. ఒకటేమిటి ఈ చల్లని భూమాత నీడలో ఎన్నో ప్రాణులు పురుడు పోసుకొని పునీతమవుతున్నయి. అటుంటి భూ తల్లి త్వరలో శ్మశాన వాటికగా మారనుందా..
స్పాట్
ఎందుకు..భూమికి వచ్చిన ఆపద ఏంటి.. అయితే భూమికి ఇది కొత్తగా వచ్చిన ఆపదేం కాదు. ఎప్పుడూ జరిగేదే.కానీ ఈ సారి అది శృతి మించడమే అనర్ధానికి దారి తీస్తోంది. ఈ అనంత విశ్వంలో అనేక గ్రహశకలాలు స్వైర విహారం చేస్తున్నయి. ఇవి వాటి కక్ష్యలో అవే తిరుతుంటయి. అలా తిరుగుతూ తిరుగుతూ ఒక్కోసారి అవి భూమికి చేరువగా వస్తయి. అప్పుడు మాత్రం అవి తమ దిశ మార్చుకుంటయి. కక్ష్యా వేగంలో మార్పులు చేసుకుంటయి. ఇలా కక్ష్య దాటి భూమిపైకి వచ్చి భూమిని ఢీకొన్న గ్రహశకలాలకు లెక్కేలేదు. అయితే కొన్ని భూ వాతావరణంలోకి రాగానే భూమిని తాకకుండానే పేలిపోతయి. వాటినే మనందరం చుక్కతెగిందంటూ పిలుచుకుంటం. మరికొన్ని మాత్రం భూమికి మరీ దగ్గరగా వచ్చిపేలిపోతే ఇంకొన్ని సముద్ర గర్బంలోకి దూసుకుపోతాయి. ఇవి ఆకాశంలోనే పేలిపోవడమా లేక భూమిని చేరడమా అనేది వాటి పరిమాణాన్ని బట్టి ఉంటుంది.
స్పాట్
గ్రహశకలాలు చిన్నవయితే ఆకాశంలో పేలుతయి. కాస్త పెద్దవయితే భూమికి దగ్గర్లో పేలిపోతయి. మరీ పెద్దవయితే భూమిని తాకుతాయి. అధృష్టవశాత్తూ ఇప్పటి వరకూ అత్యధికం సముద్రంలో కూలినవే అధికం. కాబట్టి ఏ ప్రమాదమూ రాలేదు. మరి గ్రహశకలాల మాట అటుంచి మన భూమిని ఏకంగా ఒక కొత్త గ్రహమే ఢీకొంటే... దీంతోబాటు అపోసిస్ అనే గ్రహశకలం కూడా భూమిని ఢీకొట్టబోతోందని చెబుతున్నారు
స్పాట్
గ్రహశకలాలు ఇంతకుముందు కూడా భూమిని తాకిన సందర్భాలున్నయి. అటువంటి ఘటనలే భూమిపై పెను మార్పులు తెచ్చినయని శాస్ర్తవేత్తల అంచనా వేస్తున్నరు. అటువంటి ఒకానొక విధ్వంసం వల్లనే మహా సరీసృపాలు- డైనోసార్లు - అంతరించిపోయినయని ఒక సిద్ధాంతం. అలాగే జూన్‌ 30, 1908 న జరిగిన తున్గుష్క విస్ఫోటనం. రష్యాలోని తున్గుష్క నది సమీపంలో ఈ మహా విస్పోటనం జరిగింది. ఆ మహా విస్ఫోటనానికి కారణం ఒక ఉల్క. అయితే ఆ ఉల్క నేరుగా భూమిని తాకలేదు. భూమికి సుమారు 10 కిలోమీటర్ల పైనే ధ్వంసమైంది. దాని ప్రభావం హిరోషిమాపై వాడిన అణుబాంబు కంటే 1000 రెట్లు శక్తివంతమైనదని అంచనా. అయితే ఆ విస్ఫోటనంలో రెండువేల చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో 8 కోట్ల వృక్షాలు సర్వ నాశనమైపోయినయి.
స్పాట్
గడచిన మిలియన్ సంవత్సరాలలో ఈ భూమిని అనే గ్రహశకాలాలు తాకి విధ్యంసం సృష్టించనట్టు భూమి పై ఉన్న ఆధారాలను బట్టి తెలుస్తోంది. రానున్న రెండు దశాబ్దాలలో అంటే 2036, ఏప్రిల్‌ 13 శుక్రవారం అపోఫిస్‌ అనే గ్రహశకలం భూమిని తాకే ముప్పు ఉందని శాస్ర్తవేత్తలు అంటున్నరు. ఆనాటికి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని రష్యన్‌ ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నరు. ఐతే అటువంటి ఇబ్బందికి వీలే లేదని నాసా అంటోంది. అపోఫిస్‌ గ్రహశకలం రావడం మాత్రం వాస్తవమే అయినప్పటికీ ఇది ఢీకొనే అవకాశాలు చాలా తక్కువ అని వాదిస్తోంది. అపోఫిస్‌ గ్రహశకలాన్ని 2004 జూన్‌లోనే కనుగొన్నరు. దీని కక్ష్య 2029 నాటికి భూమికి దగ్గరగా వస్తుందని అంచనా. అప్పుడు గానీ అసలు ఈ శకలం భూమిని తాకుతుందా లేదా అన్న విషయంమీద పూర్తి స్థాయి అవగాహన కలగదు. ఆరేళ్ల క్రితం అసలు 2029లోనే అపోఫిస్‌ భూమిని ఢీ కొంటుందని అనుకున్నరు. అయితే మరిన్ని అధ్యయనాల తరువాత ఈ అంచనాలన్నీ భూమికి అనుకూలంగా మారినయి. వాటి ఆధారంగా అపోఫిస్ 2029లో భూమిని తాకే అవకాశమే లేదని తేలింది.
స్పాట్
ఒక ఖగోళ శకలం, మరొక పదార్థం దగ్గరగా ప్రయాణించినప్పుడు వాటి కక్ష్యలలో మార్పులు జరుగుతయని, ఈ మార్పులు ఆ గ్రహాలు లేదా శకలాల పరిమాణాన్ని బట్టి ఉంటయని అంటున్నరు ఖగోళ నిపుణులు. అందుకు కారణం, భూ ఆకర్షణ శక్తి. కొంత మంది లెక్కలు కట్టి ఈ గ్రహశకలం కక్ష్య 28 డిగ్రీల మేర వాలుతుందని, తద్వారా కాస్త తక్కువ వేగంతో ప్రయాణిస్తుందని అంటున్నారు. అయితే ఇదంతా మరో 19 సంవత్సరాల తర్వాత అపోఫిస్‌ భూమికి ఎంత దగ్గరగా వస్తుందనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఊహించిన ప్రకారం అది 610 మీటర్ల పరిధిలో ప్రయాణిస్తే 2036 ఏప్రిల్‌ 13 శుక్రవారానికి కూడా అదే స్థానంలో ఉంటుంది. అంటే మనకు ఎటువంటి ప్రమాదమూ ఉండదు. ప్రస్తుతానికి అలా ప్రమాదం జరిగే అవకాశాలు 40,000 వంతులో ఒక్కశాతం మాత్రమే.
స్పాట్
ఖగోళ వస్తువులు ఎంత చిన్నవిగా ఉన్నా అవి భూమిని తాకితే వాటి ప్రభావం మాత్రం చాలా భారీగా ఉంటుంది. ప్రస్తుతానికి అపోఫిస్‌ కంటికి కనిపించనంత చిన్నదిగా, సాధారణ టెలిస్కోపులకు కూడా దొరకనంత దూరంలో ఉంది. మరో కొన్ని నెలల్లో అది మన రాడారు పసిగట్టే పరిధిలోకి వస్తుంది. అప్పుడు మరింత విపులమైన అవగాహన ఏర్పడే అవకాశముంది. ఇటువంటి గ్రహశకలం ఇంతకుముందు కూడా భూమిని తాకిన సందర్భాలున్నాయి. అటువంటి ఘటనలే భూమిపై పెను మార్పులు తెచ్చినయని అంటున్నరు పరిశోధకులు.
స్పాట్
గ్రహశకలాలు భూమిని ఢీకొన్న సంఘటనలు ఎక్కువ శాతం సముద్రాలమీద జరిగి ఉంటయని, అవి మన దృష్టికి రాలేదని అంటున్నరు మరికొంత మంది ఖగోళ శాస్ర్తవేత్తలు. ప్రస్తుతం అపోఫిస్‌ వంటి వందలాది గ్రహ శకలాలు మన తలపై తిరుగాడుతున్నయి. అవి మనకు ఇంకా కనిపించనంత చిన్నగా గానీ, దూరంగా గానీ ఉండి ఉండవచ్చు. వాటి సంగతి అలా ఉంచితే, అపోఫిస్‌ని అంతరిక్షంలోనే నాశనం చేసేందుకు రష్యన్‌ సంస్థ పూనుకుంది. అపోఫిస్‌ భూ వినాశనానికి దారి తీయకుండా నిరోధించేందుకు ఒక వ్యోమ నౌకను రూపొందించే ప్రణాళికను సిద్ధం చేసుకుంది. నాసా చెప్పినట్టు అపోఫిస్‌ వల్ల నష్టం జరగకపోయినా మరిన్ని శకలాల వల్ల ఎప్పటికైనా ప్రమాదం వాటిల్లవచ్చని, అందుకు సన్నద్ధంగా ఉండాలని రష్యా అంటోంది. ఆ దిశలో అవసరమైతే అమెరికా, యూరప్‌, చైనాల సాయాన్ని కోరే అవకాశాలున్నాయి. ఒకవేళ అపోఫిస్‌ గనక భూమిని తాకితే? ఆ ప్రభావం 65000 అణుబాంబులకు సమానంగా ఉంటుందని నాసా అంటోంది.
స్పాట్

2036 ఏప్రిల్‌ 13న అపోఫిస్‌ అనే గ్రహశకలం.. భూమిని ఢీకొంటుందని లెక్కలు కట్టిన్రు. ఇంతకీ ఈ అపోసిస్‌ ఎలా ఉంటుందో చూద్దాం.. అపోఫిస్ 275 మీటర్ల పొడవు, అదే స్థాయిలో వెడల్పుంటుంది. ఆ గ్రహశకలం భూమిని ఢీకొంటే..విస్పోటనం కారణంగా జీవరాశే అంతమయ్యే ప్రమాదముందని అంచానా వేస్తున్నరు శాస్ర్తవేత్తలు. 2029 ఏప్రిల్‌లో..ఈ గ్రహశకలం దాని కక్షలో పరిభ్రమిస్తూ భూ గురుత్వాకర్షణకు కీలకమని చెప్పదగిన బిందువు నుంచి ప్రయాణిస్తుందని లెక్కలు కట్టిన్రు. ఆ సమయంలో దాని దిశమారుతుందని..ఏడేళ్ల తర్వాత భూమిని ఢీకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషించిన్రు రష్యాలోని సెయింట్‌ పీటర్స్ బర్గ్ కు చెందిన పరిశోధకులు.
స్పాట్

అమెరికన్‌ సైంటిస్టులు మాత్రం అలాంటి అవకాశాలు చాలా తక్కువని కొట్టిపారేస్తున్నారు. అపోఫిస్‌ 2న్నర లక్షలసార్లు భూమి చుట్టూ తిరిగితే ఒకసారి మాత్రమే భూమిని ఢీకొట్టే అవకాశముంటుందని అంటున్నరు. అయితే..ఆ ఒక్కసారే మొదటిసారిదైతే పరిస్థితి ఏంటనేది రష్యన్‌ సైంటిస్టులు వాదన. దీనిపై ఎవరూ భయపడొద్దంటోంది నాసా చెబుతోంది. 2029 తర్వాత అపోఫిస్‌ భూమిని ఢీకొనేందుకు ఏడేళ్ల సమయం ఉంటుందని..అప్పట్లోగా ఆ గ్రహశకలం దిశమార్చేందుకు ప్రయత్నిస్తమని చెబుతోంది.
స్పాట్
అపోఫిస్‌ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం కంటే ముందే.. దాన్ని పేల్చివేసేందుకు ప్లాన్‌ వేస్తున్నారు రష్యా పరిశోధకులు. గతంలో ఓ తోకచుక్కను డీప్‌ ఇంపాక్ట్‌ వ్యోమనౌకతో ఢీకొట్టించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మొత్తమ్మీద..2012 తర్వాత అందరి దృష్టీ ఇప్పుడు 2036పై పడింది.
స్పాట్
చిన్నచిన్న గ్రహ శకలాలైతే పెద్దప్రమాదం లేదు కానీ..మరీ ఫుట్ బాల్ గ్రౌండంత ఉన్న శకలం దూసుకు వస్తే ఈ భూమికి వచ్చే ముప్పు అంతా ఇంతా కాదు. గతంలో మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఈ భూమి పైకి ఒక గ్రహ శకలం దూసుకు వచ్చి ఎన్నో జాతులను తుడిచి పెట్టింది. డైనోసార్స్ వంటి బలిష్టమైన జాతి అంతరించడం వెనుక గ్రహశకలాల పాత్రే ఉందని పరిశోదకుల అభిప్రాయం.
స్పాట్
గతంలో జరిగిన పెనుమప్పే మళ్లీ జరిగితే ఈ భూమి మొత్తం అగ్ని గుండంగా మారి జీవం పూర్తిగా నాశనం కావడం ఖాయం. ఇన్ని వేల సంవత్సరాల నుంచి సాధించిన ప్రగతి మొత్తం చిటికెలో తుడిచిపెట్టుకు పోతుంది. ఈ నీలివర్ణ భూగోళం పై పచ్చని మొలక కూడా మొలవని పరిస్థితి వస్తది.
స్పాట్
ఈ విపత్తు ఇప్పటికిప్పుడు వచ్చేది కాకున్నా..ఏదో ఒకరోజు మాత్రం భూమికి తప్పని సరిగా వచ్చే విపత్తే..ఎందుకంటే లక్షలాధి గ్రహలకలాలు భూ కక్షకు అతి దగ్గరగా వచ్చి వెళుతున్యయి. సంవత్సరాలు గడిచేకొద్దీ వాటి కక్షా వేగాన్ని …కక్ష్యా దిశను మార్చుకుంటున్నయి. దీంతో అవి క్రమేపీ భూమి క్షక్ష్యకు దగ్గరగా వస్తున్నయి. ఏదో ఒక రోజు ఈ పెద్దపెద్ద శకలాలు భూమిని ఢీ కొట్టడం ఖాయం.
స్పాట్
ఈ గ్రహశకలాల ఉనికిని గుర్తించేందుకు అంతరిక్షకేంద్రాన్ని ఏర్పాటు చేసిన్రు. ఈ కేంద్రం నిత్యం విశ్వాంతరాళంలో జరిగే మార్పులను గమనిస్తది. గ్రహశకలాల గమనాన్ని గుర్తిస్తది. ఏదైనా శకలం భూమి పైకి దూసుకొస్తే కనిపెట్టి అలెర్ట్ చేస్తది.
స్పాట్
విశ్వంలో విహరించే లక్షలాది గ్రహశకలాలు రోజు రోజుకూ భూమికి తగ్గరవుతున్నయి. వాటికి ఉన్న గురుత్వారక్షణ శక్తి తగ్గి భూమి వైపు మళ్లుతున్నయి..మరి కొన్ని ఒకదానికొకటి ఢీ కొని కక్ష్యమార్చుకొని భూమికి దగ్గరగా వస్తున్నయి. ఇవిగానీ భూమిని ఢీ కొంటే ప్రళయం వస్తుంది. భూమి మొత్తం ఒక అగ్ని కణంలా మారుతుంది. అంతేకాదు. ఇక పై భూమి పై గడ్డిపోచ కూడా మొలిచే ఛాన్సులేకుండా అయిపోతది. ఈ విపత్తు ఎప్పుడో ఒకప్పుడు భూమికి తప్పనిసరి అందుకే శాస్త్రవత్తలు ఈ భూమిని, భూమిపై జీవులను గ్రహశకలాలనుంచి కాపాడేందుకు ఒక టెక్నిక్ ను కనిపెట్టన్రు.
స్పాట్
అంతరిక్షపరిశోధనా కేంద్రం శకలాల ఉనికికిని కనిపెట్టి తెలియజేయగానే పరిశోధకులు అలర్ట్ అవుతరు. వెంటనే ఒక స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగిస్తరు. మానవ రహిత స్పేస్ క్రాఫ్ట్ గ్రహశకలాన్ని చేరుకుంటది.. దాని గురుత్వాకర్షణ శక్తిని తగ్గిస్తూ ఈ స్పేస్ క్రాఫ్ట్ భూ కక్ష్యనుంచి కొంత సమయం తప్పిస్తది. కొంత సమయానికి ఆ కక్ష్యనుంచి భూమి వెళ్లిపోగానే యధావిధిగా శకలం తన కక్ష్యను చేరుకుంటది..మరో కొన్ని వందల ఏళ్లవరకు ఆగ్రహశకలంతో భూమికి ముప్పు ఉండబోదు. ఈ లోపే ఆ శకలం శిధిలమైనా కావచ్చు. కానీ ఈ ప్రక్రియ అత్యంత నైపుణ్యంతో నానో సెకన్ను కూడా అంచనా వేసి చేయగలిగేదిగా ఉండాలి. ఒక్క క్షణం ఏమరు పాటుగా ఉన్నా ఈ భూమి మొత్తం భూడిదగా మారాల్సిందే.. గ్రహశకలం ఇరవై సంవత్సరాలకు భూమిని చేరుకుంటదనగా ఇప్పుడే స్పేస్ క్రఫ్ట్ ను ప్రయోగించాలి. అప్పుడే ఆ మరణశాసనాలనుంచి తప్పించుకోగలం.

ది సైన్స్ ఎపిసోడ్ మప్పై

ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాను విప్పి చెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాటెడ్జ్ కు స్వాగతం.
యాంకర్ 1
అందమైన భూగోళం../ హిమ పర్వతాలు..లోయలు../కొండలు..కోనలు.. /సెలయేళ్లు..జలపాతాలు../అరణ్యాలు..అద్బుతాలు..ఇవన్నీ ఒక్క భూమికే సొంతం. దుర్భిణి వేసి వెదకినా టెలిస్కోప్ కనుచూపు మేరల్లో ఇంత అందమైన గ్రహం మరోటి కనిపించడం లేదు.
బ్యాంగ్ ( ది ఎర్త్ 2)
స్పాట్( హోమ్ వీడియో విజువల్స్)
ఇంత అందమైన భూ గ్రహం రోజు రోజుకూ మసక బారిపోతోంది. ఇక్కడ గాలి పీల్చడం కూడా కష్టమయ్యే రోజులు దగ్గర పడుతున్నయి. ఎంత ఫామిలీ ప్లానింగ్ చేసుకున్నా..ఎన్నివిపత్తులు వచ్చినా.. రోజురోజుకూ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. రేపటి రోజున ఈ భూమి పై కూర్చోడానికి చోటు కరువయినా ఆశ్చర్యం లేదు. ఎలా.. ఈ సమస్యలను ఎలా అధిగమించాలి..
స్పాట్
వాయిస్
పుడమి తల్లి…ఎంత చక్కనిది.. ఎంత చల్లనిది. ఎన్నో లక్షల రకాల జీవులు..ఎంతో అద్భుతమైన దృశ్యాలు..స్వర్గం ఉందో లేదో తెలియదు కానీ స్వర్గాన్ని మించిన అందాలు ఇహలోకంలో ఉన్నాయనేది మాత్రం వాస్తవం.
స్పాట్
ఈ భూమి పై ఖండానికో సొగసు రంగరించుకొని రంగులు చిమ్మింది ధరిత్రి. అప్పుడే భగభగ పొగలు చిమ్మే అగ్ని పర్వతాలు.. వాటిని ఆనుకుని నీలి వర్ణ తివాచీ పరిచినట్టుంటే మహాసముద్రాలు..అంతెత్తునుంచి జాలువారే జలపాతాలు.. చెక్కిన శిల్పాల్లాంటి కొండ చరియలు. ప్రకృతి మాతకు పచ్చని చీర సింగారించినట్టు ఆకు పచ్చని అడవులు. వహ్..వర్ణించుకుంటూ పోవాలిగానీ ఈ భూమి అందం ఎన్ని కావ్యాలు రాసినా తరగదు. ఎందరు కవులు మనసు పెట్టి వర్ణించినా ఒడవదు. ఈ భూగోళం తనను తాను చెక్కుకున్న స్వయం శిల్పి. హిమ నదాలు, ఎత్తు పల్లాలు.. తనకు తాను సృష్టించుకున్న ఒంపు సొంపుల వయ్యారాలు. ఇవన్నీ మిలిన్ల సంవత్సరాలుగా ఏ అద్దంలో చూసుకోకుండా ఒద్దికగా దిద్దుకున్న సొగసలు భూమి సొంతం..
స్పాట్(హోం విజువల్స్)
ఇంత సుందరమైన భూమి ఒడిలో సేదతీరడం మంటే అదృష్ఠమే మరి. ఈ నేల అందరి సొంతం. ఒక్క మనుషులే ఇది మా సొంతం అని భ్రమపడతారు. కానీ ఎగిరే పక్షులు.. తెల్లని కొంగలు. పచ్చని బయళ్లలోపరుగులు తీసే మదగజాలు..ఆకాశాన్ని తాకే చెట్లను కూడా అలవోకగా నమిలే జిరాఫీలు..ఇవన్నీ భూతల్లి బిడ్డలే.. జాతి జాతికో జాగా.. ఏ వాతావరణంలో పెరిగే జంతువుకు ఆ జాగాలో చోటు.. హాయిగా అమాయకంగా స్వేచ్ఛగా జీవించగలిగే చోటు భూమి ఒక్కటే.

స్పాట్
యాంకర్ 2
ఈ సకస చరాచర జగత్తులో భూమి లాంటి మరో గ్రహం ఏదైనా ఉందా... ఆ గ్రహం పై మనుషులు ఎవరైనా ఉన్నారా..ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడంలో మనిషి అలుపెరగకుండా ప్రయత్నిస్తూనే ఉన్నడు. కానీ ఎంత వెదికినా ఊహలు తప్పవాస్తవాలు లేవు. మనిషికి మరో గ్రహం గురించి ఎందుకు..వేల కాంతి సంత్సరాల్లో జీవానుకూల గ్రహమేదైనా ఉన్నా మనిషి చేరగలడా.. ఈ భూమికి ఏమయింది.. మానవుడు ప్రయత్నం దేనికోసం..
స్పాట్
అవును.. ఈ సుందమైన భూమి పై మానవుడు చాలా కాలం వరకు ఈ జంతువుల లాగే స్వేచ్ఛగా హాయిగా బతికిండు.. దొరికిన దానితో సంతృప్తిగా బతికిండు..ఎప్పడైతే రేపటికోసం..తన కోసమే కాక తన ముందు తరాల వారి కోసం కూడా ఈ భూమి పై కొంత బాగాన్ని ఆక్రమించి పెట్టాలన్న ఆలోచన వచ్చింది ఆనాటి నుంచి ఈ భూమి పై ఆధిపత్యాన్ని సాధించాలనే ఆలోచన వచ్చింది మానవుడికి. అంతేకాదు బ్రతికినంత కాలం సౌకర్యవంతంగా బతికేందుకు ఎన్నో ఆవిష్కరణలు చేసిండు. కానీ ఈ అత్యుత్సాహమే స్వర్గం లాంటి భూమిని నరకంగా మార్చింది. కనీసం స్వేచ్చగా గాలి కూడా పీల్చలేని పరిస్థితి.. భవిష్యత్తులో పెరుగుతున్న జనాభాకు సరిపడా వనరులు సరిపోవు కాబట్టే..ఇప్పడే మరో గ్రహం వెతుక్కుంటే మంచిది. అందుకే మానవుడి అన్వేషణ.
యాంకర్ 3
మరి వేరే గ్రహం కోసం మానవుడు చేసే అన్వేషణ ఫలించిందా.. విశ్వాంతరాళంలో ఎక్కడైనా మానవ నివాసానికి సరిపడా జాడలు దొరకాయా.. మరీ ఇంత అద్భుతమైన, సుందరమైన భూమి కాకున్నా..కనీసం మనిషి బతకగలిగే భూమి దొరికిందా..
వాయిస్
టెలీస్కోప్ కనుక్కున్న రోజు నుంచీ మానవుడు మరో గ్రహం పై బతకడం సాధ్యమవుతుందా అనే అన్వేషణ మొదలు పెట్టిండు. అయితే ఏది చేసినా దూరం నుంచి చూడటమే..పరికరాలు అందించిన సమాచారం తోనే..ఒక్కముక్కలో చెప్పాలంటే భూమికి అత్యత సమీపంలో ఉన్న చంద్రుడు గురించే ఇంకా పూర్తిగా తెలియదు. చంద్రుడి పై నీరుందని కొందరు. లేదు నీటి జాడలు సాధ్యం కావని కొందరు వాదిస్తున్నారు. ఒక్కో శాస్ర్తవేత్తది ఒక్కో అభిప్రాయం. భారతదేశ చంద్రయాన్ ఫలితాలు కూడా ఇంకా పూర్తిగా విశ్లేషించ బడలేదు. అంటే మనకు సమీపంలో ఉన్న ఉపగ్రహం పై గురించే సమగ్రంగా తెలుసుకోలేక పోయాము..
స్పాట్
మనిషి మనుగడ సాగించేందుకు భూమి తరువాత సూర్యరశ్మి అనుకూలంగా ఉన్న గ్రహం అంగారకుడు. భూమి తరువాత మనుషులు పెద్ద సంఖ్యలో నివసించదగ్గ గ్రహం అంటూ ఏదైనా ఉంటే అది మార్స్ గ్రహమే నని స్పష్టమయ్యింది. ఎందుకంటే మార్స్ కి భూమికి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. అవేంలో ఒక్కసారి చూద్దాం
స్పాట్
- మార్స్ మీద రోజు వ్యవధి - 24 గంటల 37 నిముషాలు
భూమి మీద రోజు వ్యవధి - 24 గంటల 56 నిముషాలు
- మార్స్ అక్షం యొక్క వాలు - 24 డిగ్రీలు
భూమి అక్షం యొక్క వాలు - 23.5 డిగ్రీలు
- మార్స్ గురుత్వాకర్షణ శక్తి భూమి గురుత్వాకర్షణ శక్తిలో మూడో వంతు
- భూమి మీద లాగానే మార్స్ మీద కూడా ఋతువులు ఉంటాయి
స్పాట్
యాంకర్ 4
ఇప్పడు మనం చూసిన మార్స్ గ్రహం వివరాలు నిజమైతే అక్క డ అడుగు పెట్టడం సాధ్యమేనా.. అక్కడ ఉన్న వాతావరణంలో మానవుడు బతికి బట్టకట్టాలంటే ఏం చేయాలి. అసలు అక్కడున్న జీవావిర్భావ పదార్దాలేంటి..
స్పాట్
అయితే మార్స్ అతిశీతలమై, శుష్కమైన, నిర్జీవమైన లోకం. జీవం ఉన్నా అది ఏకకణజీవులకి మించి ఉండే అవకాశం లేదు. ప్రస్తుత స్థితిలో మార్స్ మీద ఉన్న పరిస్థితుల్లో మనిషి మనుగడ సాగకపోవచ్చు.. కానీ, మానవ నివాసానికి కావలసిన కొన్ని ముఖ్యమైన వనరులు మాత్రం మార్స్ మీద ఉన్నయి. ముఖ్యంగా జీవసృష్టికి కావలసిన పదార్థాలు పుష్కలంగా ఉన్నయని శాస్ర్తవేత్తల నమ్మకం. జీవానికి కాలసిన ఎన్నో వనరులు ఉన్నాయి.
- ధృవప్రాంతాల్లో ఘనీభవించి ఉన్న పుష్కలమైన నీరు
- సమృద్ధిగా కార్బన్ డయాక్సయిడ్ ఉంది. దీనిలోనే కార్బన్ను ఆక్సిజన్లని వాడుకోవచ్చు.
కావలసినంత నైట్రోజెన్ కూడా ఉంది.
మార్స్ వాతావరణ పరిస్తితి చూస్తే అక్కడి వాతావరణంలో..
CO2 - 95.3%
N2 - 2.7%
Argon - 1.6%
O2 - 0.2% ఉన్నయి.
మార్స్ మీది ఈ పరిస్థితులని చూస్తుంటే ఒకప్పుడు భూమి మీద కూడా ఇలాంటి పరిస్థితులే ఉండేవేమోననిపిస్తుంది. తొలిదశల్లో భూమి మీద కూడా ఎక్కువ ఆక్సిజన్ ఉండేది కాదు. వాతావరణం నిండా కార్బన్డయాక్సైడ్, నైట్రోజెన్ లే ఉండేవి. అంతలో కిరణజన్య సంయోగక్రియా బాక్టీరియా (photosynthetic bacteria) రంగ్రప్రవేశం చేసినయి. మొక్కల్లాగానే ఇవి సౌరశక్తిని వాడుకుంటూ, CO2 ని ఆక్సిజన్ గా మార్చడం మొదలెట్టాయి.
భూమి మీద ప్రస్తుత వాతావరణ వివరాలు:
N2 - 78.1%
O2 - 20.9%
Argon - 0.9%
CO2 etc - 0.9%
ఇది కాక మార్స్ మీద ఉష్ణోగ్రత కూడా విపరీతంగా ఉంటుందని శాస్ర్తవేత్తలు గుర్తించిన్రు. మార్స్ ఉపరితలం మీద సగటు ఉష్ణోగ్రత -62.77 C అయితే, భూమి మీద సగటు ఉష్ణోగ్రత 14.4 C. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో మార్స్ ని సందర్శించామంటే, ఆక్సిజన్ సిలిండర్లు మోసుకుపోతూ, స్పేస్ సూట్లలో మాత్రమే మార్స్ నేల మీద సంచరించగలం.
యాంకర్ 4
అవును ఇప్పుడు మార్స్ మీద ఉన్న వాతావరణం ప్రకారం మనిషి దీని మీద మామూలుగా అడుగు పెడితే అర క్షణం కూడా బతికి బట్టకట్టలేదు. మరేం చేయాలి. ఈ మాత్రం భూమికి సరిపడా వాతావరణం ఉన్న ఈ మార్స్ ను మన భూమిలాగా మార్చుకోవాలి..అది సాధ్యమయ్యే పనేనా..ఈ సృష్టిలో మానవుడు చిన్న జీవి..తాను ఒక గ్రహాం మొత్తాన్ని శాసించగలడా.. శాసించాలంటే ఏంచేయాలి. మార్స్‌ పై లాంగ్‌ మార్చ్‌ చేయడం అంత ఈజీయేనా..శాస్ర్తవేత్తలేమంటున్నారు.
స్పాట్
వాయిస్
మార్స్ మనకు సమీపంలో కాస్తో కూస్తో జీవం ఏర్పడటానికి పుష్కలమైన మూలకాలున్న గ్రహం. ఈ గ్రహాన్ని మనకు అనుకూలంగా మర్చుకునే అవకాశశాలు లేకపోలేదంటున్నారు శాస్ర్తవేత్తలు. ఇక్కడ అడుగు పెట్టాలంటే ప్రస్తుతమున్న వాతావరణంలో ఆక్సీజన్‌ సిలిండర్లు, స్పేస్‌ సూట్లు తప్పనిసరి. ఈ సరంజామా ఎమీ లేకుండా స్వేచ్ఛగా తిరగాలంటే వాతావరణం మారాలి. లేదా మార్చుకోవాలి! శైశవ దశలో ఉన్న భూ వాతావరణం కూడా అచ్చం ఇలాగే ఉండేదని కార్బన్ డేటింగ్‌ లెక్కల ప్రకారం శాస్ర్తవేత్తలు అంచనా వేస్తున్నారు. మరి భూమి నేడున్న ఈ దశ వరకు ఎలా పరిణామం చెందిందో పరిశోధించిన్రు. అచ్చు అలాంటి ప్రక్రియలే వాడి మార్స్ గ్రహాన్ని కూడా మనకు అనువుగా మలచుకోగలమా? ఇది చాలా ఘనమైన ఆలోచన. ఇలా చెయ్యడం అంటే ఒక విధంగా మనిషి దేవుడిలా ప్రవర్తించ బూనుతున్నట్టు అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇదో ప్రతిసృష్టి అన్నట్టు లెక్క.
స్పాట్
వాయిస్
మానవ సంకల్పిత పరిణామానికి, పృథ్వీ పరిణామానికి మధ్య ఒక మౌలికమైన తేడా ఉంది. నాలుగున్నర బిలియన్ల సంవత్సరాల సుదీర్ఘ పరిణామం వల్ల భూ వాతావరణం ప్రస్తుత స్థితికి వచ్చింది. ఏవో యాదృచ్ఛికమైన హఠాత్ పరిణామాల వల్ల, అనుకోని అదృష్టమైన సంఘటనల వల్ల భూమి ఓ ప్రత్యేక పరిణామ రేఖ వెంట నెమ్మదిగా ప్రయాణిస్తూ ఈ స్థితికి చేరింది. మార్స్ విషయంలో ఆ గమనాన్ని... దాని పరిణామ రేఖని... పరిణామ వేగాన్ని మనం శాసించ గలమా.. ఇది అయ్యే పనేనా? అది మంచి పనేనా? ఇలా జరిగితే విపరీతాలు జరగవా..సాధ్యాసాధ్యతల మాట అటుంచితే, మంచి చెడుల మాట పక్కన పెడితే అసలు అలాంటి ఉద్దేశం మాత్రం శాస్ర్తవేత్తల్లో బలంగా ఉంది.. ఈ భావనకే ధరాసంస్కరణ (Terraforming) అనే ఓ పేరు కూడా ఉంది. అంటే కొత్త ధరిత్రిన సంస్కరించడం అన్నమాట. ఓ గ్రహం యొక్క పరిణామ క్రమంలో వైజ్ఞానిక దృష్టితో దాని పై నున్న పరిస్థితులు సరి చేసుకుంటూ, అందులో సకాలంలో కొన్ని అంశాలని ప్రవేశపెట్టి ఓ బొంసాయి మొక్కని మలచుకున్నట్టు ఆ గ్రహం మీది పరిస్థితులని కొన్ని శతాబ్దాలుగానో, సహస్రాబ్దాలుగానో మలచుకోవాలన్న ఆలోచననే ధరాసంస్కరణ అంటరు. మనిషి ఆలోచన అందనంత ఎత్తుకి చేరిందనడానికి ఇదొక చక్కని తార్కాణం.
యాంకర్ 5
మార్స్ ను చేరుకోడానికి మానవుడు చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు దానిపై రోవర్‌లను ప్రవేశ పెట్టి అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు బోలెడన్నీ ప్రయోగాలు చేసిండు. ఒక్కసారి ఆ ప్రయోగాన్ని చూద్దాం.
స్పాట్
మార్స్ ది కచ్చితమైన గోళాకారం కాదు. ఉత్తర గోళార్థంలో ఉబ్బెత్తుగా లేచిన ఓ సువిశాల ప్రాంతం ఉంది. దాన్నే థార్సిస్ కుంభ ప్రాంతం అంటరు. అంతరిక్షంలో గ్రహాన్ని బాగా దూరం నుండి నిశితంగా చూస్తే దీన్ని కనిపెట్టొచ్చుగాని, కక్ష్యలో ప్రస్తుతం మనం ఉన్న ఎత్తు నుండి చూస్తే కనిపెట్టడం కష్టం. దాని వెడల్పు సుమారు 5000 కిమీలు, ఎత్తు సగటున దిగువ ప్రాంతాల మీద 10 కిమీలు ఉంటుంది. ఈ ఉబ్బెత్తు ప్రాంతం మీదే కొన్ని చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. ఈశాన్య ప్రాంతంలో మూడు అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇక్కడే సౌరమండలంలోనే అతి పెద్దదైన ’ఒలింపస్ మాన్స్’ అనే అగ్నిపర్వతం ఉంది.
స్పాట్
ఇంత క్లిష్టమైన గ్రహాన్ని మానవుడు ఎలా సంస్కరించి తన దారిలోకి తెచ్చుకోగలడు.
దానికి ఉన్నది ఒక్కటే దారి. మార్స్ గ్రహం పై దృవాలలో కొండలకొద్దీపేరుకు పోయిన కార్భన్డై ఆక్సైడ్ ఉంది. దీన్నే డ్రై ఐస్ అంటరు. ఈ డ్రై ఐస్ను కరిగించి ఆయాప్రాంతంలో ముందుగా కేవలం కార్బన్ డై ఆక్సైడ్ ను మాత్రమే వినియోగించుకునే జాతి మొక్కలను ప్రయోగించాలి. వీటికి నీటి తేమ అక్కర్లేదు. ఈ మొక్కలు చిన్న చిన్న శైవలాలైనా కావచ్చు. చిన్న పొదలైనా కావచ్చు. వీటి జీవిత కాలంలో ఇవి వేగంగా విస్తరించ గలిగేవై ఉండాలి. ఇటువంటి సందర్భంలో ఈ మొక్కలు కార్భన్ డై ఆక్సైడ్ ను ఉపయోగించుకొని ఆక్సీజన్ ను విడుదల చేస్తాయి. కార్భన్ డై ఆక్సైడ్, నత్రజని ఆక్సీజన్ ఉన్న గ్రహం రెడీ అయిపోతుంది. అంతే ఇక కావలసిందేముంది.. నీటి చుక్కకు బీజాలు పడ్డట్టే.. నాలుగు చుక్కలు రాలాయా ఇక కాలక్రమంలో అంగారకుడి పై సముద్రాలు తొణికిస లాడటం ఎన్నోరోజులు పట్టవు. అంతే మరో ప్రపంచం రెడీ..
స్పాట్
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ విశేషాలు మరిన్ని సైన్టిఫిక్ అఫ్ డేట్స్తో వచ్చేవారం కలుసుకుందాం. అంటిల్ దెన్ బై
బ్రేక్లు. వెల్ కం బ్యాక్లు.

ది సైన్స్ ఎపిసోడ్ ఇరవై తొమ్మిది

ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాను విప్పి చెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాటెడ్జ్ కు స్వాగతం.
యాంకర్ 1
మనం మనింట్లో కూర్చొని ఊహాలోకాల్లో ఊరేగుతుంటం. నయాగరా జలపాతం ఒడ్డున కూర్చోవాలని, హిమాలయాల పై విహంగ వీక్షణం చేయాలని, సాగరతీరాలలో చాయ్ తాగాలని అనిపిస్తది. కానీ కోరికలున్నంత రిచ్ గా ఆదాయం ఉండదు. మరెలా.. వరూధినీ ప్రవరుడిలా అరికాళ్లకు ఎదైనా లేహ్యం రాసుకొని ఇక్కడ మాయమై అక్కడ తేలితే ఎంత బావుంటుంది. కానీ మనకా లేహ్యం దొరకదు కదా..ఎలా..కానీ ఇప్పుడా కలలు నిజం కాబోతున్నాయి. కంప్యూటర్ ముందు కూర్చొని ఒక్క క్లిక్ చేస్తే చాలు ఈఫిల్ టవర్ చూట్టూ తిరగొచ్చు. తాజ్ మహల్ ముందు కూర్చొని తాపీకా కాఫీ తాగొచ్చు. ఇదంతా ఫాంటసీ కాదు నింజంగా నిజం, డౌటోస్తే మీరే చూడండి.
స్పాట్
వాయిస్
మాయలు మంత్రాలు..ఇప్పటి వరకు పురాణాలలో మాత్రమే వినిపించేవి కానీ ఇప్పుడు మనం కూడా చేయబోతున్నాం..అంటే మన భౌతికంగా మాయం కాకపోయినా
ఒక్కక్లిక్ తో మనం కదలకుండా కుంటాల జలపాతం ముందు మొక్కజొన్న కంటి తినొచ్చు. టెక్సాస్ వీధుల్లో షికారు చేయొచ్చు. వీధుల్లో వద్దనుకుంటే వినువీధిలో విహరించ వచ్చు.
స్పాట్
గూగ్ ఎర్త్ అంటే ఇప్పట వరకు మనకు తెలిసినది ఒకటే..ఈ భూగోళం పై ఉన్న ప్రతి ప్రాంతాన్ని చూడొచ్చు. లాండ్ మాప్లు తీసుకోవచ్చు. ఒక కిలోమీటర్ ఎత్తులో నుంచి మన ఇల్లు, మన లాండ్, మన పొలం మాత్రమే చూసుకోగలం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కంప్యూటర్ ముందు కూర్చొని ఒక్క క్లిక్ చేస్తే చాలు ప్రపంచాన్ని చుట్టిరావచ్చు. అరసెకన్లో అమెరికా వీధుల్లో విహరించే అవకాశం మన సొంతం. అంతే కాదు మనం ఏసి రూంలో కూర్చొని పట్టపగలు అమెరికా వీధుల్లో తిరిగితే ఎలా ఉంటుందో ఆస్వాదించొచ్చు. అర్ధారాత్రి వేళ అరేబియా సంముద్రపు అలలను తిలకించొచ్చు.
స్పాట్
అమ్మో అంత అదృష్టమా ఎలా సాధ్యం అంటారా. అక్షరాలా ఈ అదృష్టాన్ని మనకు కలిగించింది గూగుల్ ఎర్త్.
స్పాట్
గూగుల్ ఎర్త్ ఈ అవకాశానికి జియోబ్రౌజ్ అనే పేరు పెట్టింది. ఈ జియో బ్రౌస్ సహకారంతో ప్రపంచం మొత్తం చుట్టిరావచ్చు. దీనికి ఫేజ్ 1 వర్క్ దాదాపు పూర్తయింది. అన్ని స్ట్రీట్ లోనూ కెమెరాలు అరేంజ్ చేసి వాటిని ఇంటర్నెట్ కు అనుసంధానం చేసిన్రు. అయితే ప్రస్తుతానికి కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను మాత్రం ఇందులో పొందు పరిచిన్రు. భవిష్యత్తులో ఈ ఎర్త్ మొత్తాన్ని తమ ఆదీనంలోకి తెచ్చుకోవాలని గూగల్ ఎర్త్ ఆశ.
స్పాట్
గూగ్ల్ ఎర్త్ జియోబ్రౌజింగ్ అందుబాటులోకి వస్తే మనం చూడాలనుకున్న ప్రాంతాన్ని సెలక్ట్ చేసి దాన్ని జూమ్ చేసుకొని ఆ స్పాట్లో త్రిడి డైమన్షన్ విజువల్స్ తో వీదుల్లో వీర విహారం చెయ్యోచ్చు.
స్పాట్
గూగుల్ ఎర్త్ సాయంతో ప్రపంచంలో ఎక్కడైనా తిరగొచ్చన్నమాట నిజమే కానీ మనం తిరిగే ప్రాంతం లైవ్ కాదు. కొన్నాళ్ల కిందటిదన్నమాట. అవి ఎప్పుడో తీసిన విజువల్స్. ప్రతి వీధిలో ఒక కార్ని తిప్పి…ఆ కార్ పై మినీ కెమెరా పెట్టి.. ఆ వీధి విజువల్స్ రికార్డ్ చేస్తరు. ఈ విజువల్స్ ను గూగుల్ లో వీధి పేరుకు లింక్ పెడతారు. జియోబ్రౌజింగ్లో మనం ఏ ఏరియానైతే క్లిక్ చేసి టూర్ బటన్ నొక్కుతామో ఆ వీధిలో కార్లో తిరిగిన అనుభూతి కలుగుతుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే వీధికో వీడియో అన్నమాట. ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభదశలోనే ఉన్నది.
యాంకర్ 111
ఒకే త్వరలో మనం ఇంట్లో ఉండే ఈ ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చూడబోతున్నాం.. ఇదొక రకంగా మంచి అడ్వంటేజే..కానీ మరో వండర్ త్వరలో మన ముందుకు రాబోతోంది. అయితే ఇప్పటి వరకు మనం వెబ్ కామ్ తో ఎక్కడో దేశంలో ఉన్న మన మిత్రుడితో లైవ్ లో మాట్లాడటం, లేదా 3జి మొబైల్లో ఫేస్ టు ఫేస్ మాట్లాడు కోవడం మామూలే కానీ అదే మాటల్ని కాస్త కాఫీ షేర్ చేసుకుంటూ గ్రూప్ డిస్కషన్ లా చేస్తే ఎలా ఉంటది. చూస్తే ఆ థ్రిల్లేంటో మీకే తెలుస్తది.
స్పాట్
వాయిస్
ఇక్కడ ఫోన్ లో మాట్లాడున్న యువతి టెక్సాస్ కు 500మైళ్ల దూరంలో జాబ్ చేస్తోంది. ఈమె తన వారితో మాట్లాడుకోవాలంటే ఫోనే సాధ్యం. కొన్నిటిని లైవ్ లో షేర్ చేసుకోవాలంటే వెబ్ కాం ని ఆశ్రయించాల్సిందే..అయితే అదీ కూడా అంత సాటిస్ఫై లేదు. ఇప్పడు మరో కొత్త టెక్నాలజి వచ్చిపడింది. అదే టెలీ ప్రసెంట్. ఈ టెక్నాలజి తో ఎదురెదురుగా ఉన్నంత క్వాలిటీ తో పక్కపక్కన కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇదిగో ఇక్కడ ఓ ఇద్దరు ఉద్యోగులు ఎలా ఎదురెదురుగా ఉన్నట్లు మాట్లాడు కుంటున్నరో..దీనికి వీడికో కాలథి అని పేరు పెట్టిన్రు శాస్ర్తవేత్తలు. భవిష్యత్తులో గ్రూప్ ఆఫ్ కంపనీస్ ఉన్న బాస్ లు ఈ ట్రాన్స్ పోర్ట్ ప్రసెన్స్ టెక్నాలజీ తో ఒక్కచోట నుంచే అన్నీ ఆఫీస్ల స్టాఫ్ కు పనులు పురమాయించొచ్చు. స్నేహితులంతా ఒక్కచోట చేరి కాఫీ పంచుకొని తాగిన అనుభూతి పొందొచ్చు.
స్పాట్
టెలీ ప్రసెంట్ విధానం పెద్దపెద్ద కార్పోరేట్ సంస్థలకు బాగా ఉపయోగ పడింది. మల్టీనేషనల్ కంపెనీ అధినేతలు దేశదేశాలు తిరుగుతూ వారి కంపనీ వ్యవహారాలు, లావాదేవీలు చూసుకొంటరు. దీని వల్ల వారి విలువైన సమయం, డబ్బు వృదా కావడమే కాకుండా దేశదేశాలు తిరగడం వల్ల చాలా తొందరగా అలిసిపోతరు. కానీ ఈ టెలీప్రసెంట్ విధానం అందుబాటులోకి వచ్చినంక ఖండాంతరాల్లో ఉన్న తమ కార్యాలయాలను తేలికగా ఆపరేట్ చేసుకోగలుగుతున్నరు. భవిష్యత్తులో ఈ టెక్నాలజి చిన్న చిన్న కార్పోరేట్ సంస్థలకు కూడా అందుబాటులోకి రానున్నయి.
స్పాట్
యాంకర్..
మీరు రోడ్డు పై వెళ్తున్నారు.. సడెన్ గా డబ్బులు అవసరం వచ్చినయి. కానీ పర్సులో చిల్లిగవ్వ కూడా లేదు. ఇల్లు ఓ ముప్ఫై కిలో మీటర్ల రూరంలో ఉంది. కాస్త కంగారు పడతరు.. ఎవర్నైనా అడగాలంటే మోమాటం..ఈ టెన్స్ లోనే మీ జేబులో ఏటియం కార్డుందన్న విషయం గుర్తుకొస్తది. అంతే గుండె నిబ్బరం చేసుకొని ఎంచక్కా ఎటియంలో డబ్బలు డ్రా చేసుకొని అవసరం తీర్చుకుంటరు. ఇప్పటి వరకు డబ్బుకోసమే ఏటియంలు ఉన్నయి. భవిష్యత్తులో మీకు సడెన్ ఆరోగ్య దెబ్బతిన్నా. లేదా మీ ఆరోగ్యంలో ఏవో సడన్ మార్పులొచ్చినయని మీరు భావించినా ఏటియం మిషన్ లాగానే అత్యంత ఆధునిక టెక్నాలజి వైద్యం ఎక్కడ కోరుకుంటే అక్కడే పొందే రోజులు చాలా దగ్గర్లోనే ఉన్నయి. ఎలాగంటారా..ఇది గో ఇలా..
స్పాట్
హెల్త్ కేర్ ఎనీ ప్లేస్..ఎనీ టైం..ఎనీ డాక్టర్. ఇదీ మోటో..ఈ మోటోతో ఉన్న హెల్త్ చెకప్ చాంబర్ లు ఇక ప్రతి సెంటర్లలో రాబోతున్నయి. ఆ సెంటర్లలో కంప్యూటర్ ముందు నిల్చొని తమ వివరాలు చెప్పాలి. అంతే అది ఫీడ్ చేసుకొని అతని ఐడి నంబర్తో సరిచూసి చాంబర్లోకి అనుమతినిస్తది.
విజువల్స్
ఈ మినీ క్లినిక్ లో ఒక మెడికల్ అసిస్టెంట్ ఉంటడు. పెద్ద ప్లాస్మా స్క్రీన్ పై డాక్టర్ సిద్దంగా ఉంటది. వచ్చిన రోగిని ఆరోగ్యసమస్య ఏంటని వాకబు చేస్తది. అంతే కాదు రోగి లక్షణాలు అడిగి తెలుసుకొని రికార్డ్ చేస్తది. అంతేకాదు ఈ వ్యాధికి సంబందించిన ప్రాధమిక పరిక్షలను జరిపి డయాగ్నసిస్ చేస్తది. తరువాత ఏ డాక్టర్ చేత ట్రీట్ మెంట్ కావాలో అడుగుతది. జవాబు చెప్పిన అరక్షణంలోనే డాక్టర్ స్ర్కీన్ సై కనిపించి ట్రీట్ మెంట్ స్టార్ట్ చేస్తడు. టోటల్ స్కానింగ్ అవసరమను కుంటే లేజర్ స్కానింగ్ చేసి టెలీ డయాగ్నసిస్ చేసి వ్యాధి నిర్ధారణ చేస్తరు. అంతే కాదు ఆ వ్యాధినివారణకు సంబంధించిన మందులను నేరుగా ఇంటికి వచ్చే ఏర్పాటు చేస్తరు. మళ్లీ ఎప్పడు కలవాలో కూడా అపుడే చెప్తరు.
స్పాట్
యాంకర్
ఇంతకు ముందు మనం ట్రాన్స్ పోర్ట్ టెక్నిక్ అనే టాస్క్ని చూశాం. అంటే ఎక్కడో వేల కిలో మీటర్ల దూరంలో ఉన్న మనిషి ప్లాస్మా స్క్రీన్ పై కనిపించి మనతో లైవ్ లో మాట్లాడటం చూశాం. కానీ ఎక్కడో వేయి కిలోమీటర్ల దూరంలో ఉన్న మనిషి సడెన్గా పౌరాణిక సినిమాలలో లాగా మన ముందు కనిపించి మాట్లాడితే ఎలా ఉంటుంది.. కాసిన్ని మాటలు కప్పు కాఫీ తాగి తరువాత సడెన్ గా మాయమైతే ఎలా ఉంటుంది. ఇప్పటి వరకు ఇవన్నీ కేవలం ఊహలు మాత్రమే.. కానీ ఆ ఊహలు నిజం కానున్నాయి. అవును ఇప్పుడు సైన్స్ ఎంత వేగంగా అభివృద్ది చెందిందంటే తలచుకోగానే కోరుకున్న మనిషి కళ్లముందు ప్రత్యక్షం అయి కాసిన్ని కబుర్లు చెప్పి వెళ్తాడు. మీరే చూడండి.
స్పాట్
వాయిస్
ఇదిగో ఇక్కడ ఒక వ్యక్తి చేసే తమాషా చూడండి. తాను తన పార్ట్ నర్ కు చాలా దూరంలో ఉన్నాడు. కానీ తనతో కలిసి కబుర్లు చెబుతూ ఓ పెగ్గేయాలని ఆరాటం. కానీ తనోదేశంలో ఆమె ఒక దేశంలో ఎలా సాధ్యం. కానీ ఆప్పుడొచ్చిన 3డి టెలిప్రసెంట్ టెక్నాలజితో ఇది సాధ్యం. ఇక్కడ కనిపించే వ్యక్తి తాను పెగ్గు వేయదల్చుకోగానే సదరు పార్ట్నర్కు ఓ రింగిస్తడు. అంతే పార్ట్ నర్ అలర్ట్ అయి ప్రత్యక్షం అవుతది. అంతే అక్కడ ఆమెకూడా ఓ పెగ్ తో సిద్దంగా ఉంటుంది. కానీ 3డి ఎఫెక్ట్ వల్ల అచ్చు ఆమె నడిచొచ్చి మన ఎదురుగా కూర్చొని నిజం మనిషిలా మాట్లాడే ఫీలింగ్ కలుగుతది. అక్కడ ఉన్న ఆమెకు కూడా ఇవతలవ్యక్తి ఎదురుగా కూర్చొని మాట్లాడినట్టే ఉంటది. ఈ టెక్నాలజిలో ఒరిజినల్ కలర్స్ హైడెఫినేషన్ 3డి కెమెరాలను వాడటం వల్ల నిజంగానే ఎదురుగా మనిషి కూర్చున్న భావన కలుగుతది. రిమోట్ స్మూత్ గా ప్రేస్ చేసి బాయ్ చెప్పగానే ఎదుటి మనిషి మాయం.
యాంకర్
మనిషి హైటెక్ జీవితానికి అలవాటు పడ్డడు. చిన్న లాంతరు వెలుగులో సరిపెట్టుకొనే మనిషి హై మాస్ట్ లైట్లను మించిన వెలుతురు కోరుకుంటున్నడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ భూగోళం రాత్రి వేళకూడా విద్యుత్ కాంతితో దగదగా మెరిసిపోతుంది. విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. కానీ ఉత్పత్తి సరిపడాలేదు. అంతుకే కనిపించే ఏ చిన్న వనరును కూడా వదులుకోవట్టేదు మనిషి..అయినా రోజురోజుకూ కరెంట్ కోత తప్పడంలేదు.. అందుకే ఓ యువశాస్ర్తవేత్త ఓ కొత్త టెక్నిక్ కనిపెట్టింది. మనం నడిచే పాదాల స్పర్శ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తే ఎలా ఉంటుంది. మన నడకే కరెంట్ ఉత్పత్తి చేస్తే..ఊహే చాలా థ్రిల్లింగా ఉంది కదూ..ఆ టెక్నిక్ ఏంటో చూస్తే ఇంకా థ్రిల్లింగా ఉంటది..
స్పాట్
మనలో కొందరు రోజుకు కనీసం ఒక కిలోమీటరైనా నడుస్తం. కానీ ఆ కిలో మీటర్ నడకలో ఎంతో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చంటోంది ఈ యువశాస్ర్తవేత్త. ఇది నిజంగా నిజం..ఇక్కడ మిణుమిణుకు మని మెరిసే ఇండికేటర్లు ఉన్న ప్యాడ్లకు అనుసంధానం చేసిన సర్క్యూట్ లపై వెయిట్ పడగాగే ఆటోమేటిక్ గా కెనెటిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతది. ఒకసారికి 15వోల్ట్ ల కరెంట్ జెనరేట్ అవుతది. ఇటువంటివి కొన్ని వందల పాడ్లు జనసమ్మర్ధం ఉన్నచోట పరిస్తే ఇక ఆ ఏరియాకు కావలసిన కరెంట్ అక్కడే ఉత్పత్తి చేసుకోవచ్చు.. జనసంచారం బాగా ఉంటే బస్టాండ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, రైల్వేస్టేషన్లు, ఏర్పోర్ట్ల వద్ద, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వీటిని అమర్చి విద్యుత్ను పొందవచ్చంటున్నారు శాస్ర్తవేత్తలు. అంతేకాదు ఈ పద్దతి వల్ల వందలాది వాట్ ల విద్యుత్ అవుతుంది. కరెంట్ కోత అనేదే ఉండదు. .
స్పాట్
యాంకర్..
ప్రపంచవ్యాప్తంగా జనబా విపరీతంగా పెరిగిపోతంది. వీరందికీ తగ్గ ఆహారం, నీరు సమకూర్చడం ఇప్పుడో పెద్ద సమస్య. ఎందుకంటే నీటి చినుకు నేలను తాకగానే పొల్యూటెడ్ సొల్యూషన్ గా మారిపోతది. మళ్లీదాన్ని తాగే నీటిలా మార్చుకోవాలంటే ఒక యాగమే చెయ్యాల్సి వస్తోంది. మన పాత తరం మూడు కుండల పద్దతికి కొత్తసాంకేతిక రూపం ఇచ్చిన్రు శాస్ర్తవేత్తలు.
స్పాట్
ప్రస్తుతం మనకు కాలువల్లో, నదుల్లో లభించే మొత్తం నీటిలో కేవలం 3శాతం నీరే తాగడానికి అనుకూలంగా ఉంది. అది కూడా పూర్తిగా శుభ్రపరచుకొని తాగాలి. లేకుంటే నీటితో బాటు మందులు కూడా మింగాల్సి వస్తది. అందుకే వాటర్ ప్యూరిఫైయర్ను కనుగొన్నరు శాస్ర్తవేత్తలు. దాని పేరు స్లింగ్ షాట్ వాటర్ ప్యూరిఫైయర్. ఈ వాటర్ ఫ్యూరిఫైయర్ లో సూయిజ్ వాటర్, డ్రైనేజ్ వాటర్, రివర్ వాటర్ అనే తేడా లేకుండా ఏ రకమైన నీటిని నింపినా స్వచ్చమైన నీటిని అందిస్తది.
స్పాట్
ఈ స్లింగ్ షాట్ లో రెండు చాంబర్ లుంటయి. ఒక దానిలో మామూలు వాటర్ పోస్తే. మిగతా ఛాంబర్ లోకి ప్యూరిఫైడ్ వాటర్ వచ్చి చేరుతది. ఒక్కసారి దీని పని విధానం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తది. మనం పోసిన వాటర్ ముందుగా ఆవిరి రూపంలోకి మారుతది. ఆ ఆవిరి చాంబర్ పైబాగానికి చేరి చల్లబడి తిరిగి ఒక పైప్ ద్వారా మరో చాంబర్ లోకి ప్రవేశిస్తది. ఈ వాటర్ చాలా స్వచ్చంగా ఉంటది.
స్పాట్
ఈ మిషన్లో ఏ రకమైన నీటినైనా చాలా తేలికగా ప్యూరిఫై చేయొచ్చు. ఈ మిషన్ రోజుకు వేయి లీటర్ల నీటిని శుద్ది చేయగలదు. ఇంతా చేసి ఈ మిషన్ రేటు వింటే గుండెలు బాదుకోవడం ఖాయం. ఈ ప్యూరిఫైయర్ అక్షరాలా 2వేల డాలర్లు. అంటే మన రూపాయిల్లో చెప్పాలంటే లక్షరూపాయలన్న మాట. మనం ఇళ్లల్లో చిన్న గుడ్డ ముక్కతోనో, కాస్త డబ్బున్న వాళ్లయితే వాటర్ ఫిల్టర్ తోనో నీళ్లు వడగట్టుకుంటరు. కానీ నీళ్లు శుద్ది చేసుకోడానికే లక్షరూపాయల మిషనంటే.. చెలిమ నీటితో చెలిమి చేసే సామన్యుడికి సాధ్యమయ్యే పనేనా..అందుకే కాలుష్యాన్ని తగ్గించి పరిసరాలను శుభ్రంగా ఉంచితే ఈ బాధ ఉండదని పర్యావరణ వేత్తలు చెబుతున్నరు.
స్పాట్
యాంకర్..
అర్ధమయింది కదా..రోజు రోజుకూ పెరుగుతున్న నీటి కొరతను తట్టుకోవాలంటే వాటర్ ప్యూరిఫైయర్ లను వాడి నీటి కొరత తీర్చుకోవచ్చు..కానీ పెరుగుతున్న జనాభా తరుగుతున్న వ్యవసాయ విస్తీర్ణం... ఈ పరిస్తితుల్లో ఆహారపు కొరతను ఎలా ఎదుర్కోవాలి. పెరుగుతున్న జనాభాకు తగ్గ ఆహారాన్ని ఈ తక్కువ ప్రాంతంలో అందించడం ఎలా సాధ్యం. తలుచుకుంటే సాధ్యం కానిదంటూ లేదంటున్నరు శాస్ర్తవతత్తలు..దానికి వారు పెట్టిన ముద్దుపేరు స్కై ఫామ్..
స్పాట్
ప్రపంచ జనాభా రోజు రోజుకూ పెరుగి పోతంది. ఈ జనాభాకు తగిన ఆహారం సమకూర్చడం అంటే మాటలు కాదు. ఏటా కొన్ని మిలియన్ల జనాభా ఆహారం దొరకక చనిపోతే..కొన్ని లక్షల మంది పౌష్టికాహార లోపంతో తనువు చాలిస్తున్నరు. ఆహారం అంటే పళ్లెంలో నాలుగు మెతుకుల అన్నం అనుకుంటే పొరపాటే.. ఆహారమంటే పాలు పండ్లు..కూరగాయలు..ఆకుకూరలు ఇవన్నీ ఆహారం కిందకే వస్తయి. మరి ఇంతగా పెరిగిపోతున్న జనాబా..పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్న అపార్ట్ మెంట్ లు.. పరిశ్రమలు..రియల్ ఎస్టేట్ లు .. ఈ పరిస్తితుల్లో ప్రజలకు పంట పండించడానికి కూడా భూమి దొరకని పరిస్తితి. ఈ విషమ పరిస్తితిని ఎదుర్కొనేందుకే అపార్ట్మెంట్ అగ్రికల్చర్ అనే పద్దతిని ప్రవేశపెట్టిన్రు శాస్ర్తవేత్తలు. ఈ పద్దతిలో 14 అంతస్థల భవనంలో కూడా గాలీ, నీరు తాకే విధంగా నిర్మాణం చేపట్టి పంటలు పండిస్తున్నరు. ఈ విధానంలో షేవర్ వాటర్ సప్లై చేసి తక్కువ విస్తీర్ణంలో పంట పండించి ప్రజలకు అందించే టెక్నిక్ ను అభివృద్ది చేసిన్రు శాస్ర్తవేత్తలు.
స్పాట్
అంతా బాగానే ఉంది..మనిషికి ఈ గ్రహం పై నీరు లేకుంటే నీటిని శుద్దిచేసే యంత్రాలు వచ్చినయి. ఆహారం లేకుంటే మన అంతస్ధు పైనే పంట పండించుకొనే టెక్నిక్ లు వచ్చినయి. కానీ ఒక గ్రహశకలం వచ్చి భూమి మీద పడితే ఎలా..ఈ భూమి పై ఉన్న జీవరాశి మొత్తం తుడుచుకుపోతే ఎలా..ఈ సమస్య మనిషిని ఎప్పటినుంచో వేదిస్తోంది. ఈ అంతరిక్షంలో లక్షలాది గ్రహశకలాలు నిత్యం పిశాచాల్లా తిరుగుతున్నయి. వీటిని ఎదుర్కోవడం ఎలా.. ఏదైనా గ్రహశకలం దారి తప్పిభూమి పైకి వచ్చే మనందరం భూమి పై ఆశలొదలుకోవడమేనా..
స్పాట్
ఈ విశాల విశ్వంలో మన భూమితో బాటు ఎన్నో గ్రహశకలాలు తిరుగుతున్నయి. ఇవి అప్పుడప్పుడు తమ కక్ష నుండి వేరు పడి భూమి పైకి దూసుకొస్తున్నయి. కొన్ని భూ వాతా వరణంలోకి ప్రవేశించగానే మండి మసిలా మారిపోతుంటయి..మరి కొన్ని భూమి పరిధి వరకూ దూసుకొచ్చి నేల పై పెద్దపెద్ద గోతులు చేస్తయి..
స్పాట్
చిన్నచిన్న గ్రహ శకలాలైతే పెద్దప్రమాదం లేదు కానీ..మరీ ఫుట్ బాల్ గ్రౌండంత ఉన్న శకలం దూసుకు వస్తే ఈ భూమికి వచ్చే ముప్పు అంతా ఇంతా కాదు. గతంలో మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఈ భూమి పైకి ఒక గ్రహ శకలం దూసుకు వచ్చి ఎన్నో జాతులను తుడిచి పెట్టింది. డైనోసార్స్ వంటి బలిష్టమైన జాతి అంతరించడం వెనుక గ్రహశకలాల పాత్రే ఉందని పరిశోదకుల అభిప్రాయం.
స్పాట్
గతంలో జరిగిన పెనుమప్పే మళ్లీ జరిగితే ఈ భూమి మొత్తం అగ్ని గుండంగా మారి జీవం పూర్తిగా నాశనం కావడం ఖాయం. ఇన్ని వేల సంవత్సరాల నుంచి సాధించిన ప్రగతి మొత్తం చిటికెలో తుడిచిపెట్టుకు పోతుంది. ఈ నీలివర్ణ భూగోళం పై పచ్చని మొలక కూడా మొలవని పరిస్థితి వస్తది.
స్పాట్
ఈ విపత్తు ఇప్పటికిప్పుడు వచ్చేది కాకున్నా..ఏదో ఒకరోజు మాత్రం భూమికి తప్పని సరిగా వచ్చే విపత్తే..ఎందుకంటే లక్షలాధి గ్రహలకలాలు భూ కక్షకు అతి దగ్గరగా వచ్చి వెళుతున్యయి. సంవత్సరాలు గడిచేకొద్దీ వాటి కక్షా వేగాన్ని …కక్ష్యా దిశను మార్చుకుంటున్నయి. దీంతో అవి క్రమేపీ భూమి క్షక్ష్యకు దగ్గరగా వస్తున్నయి. ఏదో ఒక రోజు ఈ పెద్దపెద్ద శకలాలు భూమిని ఢీ కొట్టడం ఖాయం.
స్పాట్
ఈ గ్రహశకలాల ఉనికిని గుర్తించేందుకు అంతరిక్షకేంద్రాన్ని ఏర్పాటు చేసిన్రు. ఈ కేంద్రం నిత్యం విశ్వాంతరాళంలో జరిగే మార్పులను గమనిస్తది. గ్రహశకలాల గమనాన్ని గుర్తిస్తది. ఏదైనా శకలం భూమి పైకి దూసుకొస్తే కనిపెట్టి అలెర్ట్ చేస్తది.
స్పాట్
యాంకర్
బాగానే ఉంది. ..అందరిక్షంలో ఉన్న అంతరిక్ష పరిశోధనా కేంద్రం విశ్వాంతరాళంలో జరిగే మార్పులను గుర్తించి..గ్రహశకలాలు భూమి పైకి వచ్చే విషయాన్ని తెలియజేస్తది. మరి మనిషి అంత పెద్ద గ్రహాశకలాన్ని ఎదిరించగలడా..కొన్ని లక్షల మైళ్ల వేగంతో దూసుకు వచ్చే గ్రహశకలాన్ని ఎదుర్కొనడమంటే మాటలు కాదు. ఊహించడానికే చాలా కష్టం..మరేంచేయాలి.. దానికి కేవలం చిన్నటెక్నిక్ ని కనిపెట్టిన్రు శాస్ర్తవేత్తలు. మరేంలేదు ఎదురుగా ఒక రాయి వస్తే మనం దాన్ని చేత్తో అడ్డుపెట్టే బదులు తలవంచి తప్పించుకునే సూత్రమే ఇదీను. చూడండి..
స్పాట్
విశ్వంలో విహరించే లక్షలాది గ్రహశకలాలు రోజు రోజుకూ భూమికి తగ్గరవుతున్నయి. వాటికి ఉన్న గురుత్వారక్షణ శక్తి తగ్గి భూమి వైపు మళ్లుతున్నయి..మరి కొన్ని ఒకదానికొకటి ఢీ కొని కక్ష్యమార్చుకొని భూమికి దగ్గరగా వస్తున్నయి. ఇవిగానీ భూమిని ఢీ కొంటే ప్రళయం వస్తుంది. భూమి మొత్తం ఒక అగ్ని కణంలా మారుతుంది. అంతేకాదు. ఇక పై భూమి పై గడ్డిపోచ కూడా మొలిచే ఛాన్సులేకుండా అయిపోతది. ఈ విపత్తు ఎప్పుడో ఒకప్పుడు భూమికి తప్పనిసరి అందుకే శాస్త్రవత్తలు ఈ భూమిని, భూమిపై జీవులను గ్రహశకలాలనుంచి కాపాడేందుకు ఒక టెక్నిక్ ను కనిపెట్టన్రు.
స్పాట్
అంతరిక్షపరిశోధనా కేంద్రం శకలాల ఉనికికిని కనిపెట్టి తెలియజేయగానే పరిశోధకులు అలర్ట్ అవుతరు. వెంటనే ఒక స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగిస్తరు. మానవ రహిత స్పేస్ క్రాఫ్ట్ గ్రహశకలాన్ని చేరుకుంటది.. దాని గురుత్వాకర్షణ శక్తిని తగ్గిస్తూ ఈ స్పేస్ క్రాఫ్ట్ భూ కక్ష్యనుంచి కొంత సమయం తప్పిస్తది. కొంత సమయానికి ఆ కక్ష్యనుంచి భూమి వెళ్లిపోగానే యధావిధిగా శకలం తన కక్ష్యను చేరుకుంటది..మరో కొన్ని వందల ఏళ్లవరకు ఆగ్రహశకలంతో భూమికి ముప్పు ఉండబోదు. ఈ లోపే ఆ శకలం శిధిలమైనా కావచ్చు. కానీ ఈ ప్రక్రియ అత్యంత నైపుణ్యంతో నానో సెకన్ను కూడా అంచనా వేసి చేయగలిగేదిగా ఉండాలి. ఒక్క క్షణం ఏమరు పాటుగా ఉన్నా ఈ భూమి మొత్తం భూడిదగా మారాల్సిందే.. గ్రహశకలం ఇరవై సంవత్సరాలకు భూమిని చేరుకుంటదనగా ఇప్పుడే స్పేస్ క్రఫ్ట్ ను ప్రయోగించాలి. అప్పుడే ఆ మరణశాసనాలనుంచి తప్పించుకోగలం.
స్పాట్
ఎండ్ యాంకర్

బ్రేక్ లు, వెల్ కం బ్యాక్ లు,

ది సైన్స్ ఎపిసోడ్ ఇరవై ఎనిమిది

ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలను మీ ముంగిలిలో నిలిపే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం
వాయిస్
ఈ విశాల విశ్వంలో ఇప్పటి వరకు మానవుడు మనుగడ సాగించగల గ్రహం భూమి ఒక్కటే..మానషి భూ చర జీవి..కేవలం నేల పై మాత్రమే జీవిస్తడు. తనకు కావలసిన అన్ని అవసరాలు నేలే తీరుస్తది. నీటి మీద పయనం చేసినా..నీటిలో దిగినా అది పరిమిత కాలం మాత్రమే.. జీవితాంతం నీటిలో మనుగడ సాగించడం సాధ్యంకాని పని.
స్పాట్
మనిషి నేల మీద మాత్రమే జీవించగలడు..కానీ మనకు కనిపించే ఈ భూగోళంలో మూడొంతుల నీరే ఉంది. కేవలం నాలుగవ భాగం భూగోళం మాత్రమే మనిషి సంచరించడానికి అవకాశం ఉన్నబాగం. అందులోనూ మంచు పర్వతాలు… కొండలు, కోనలు, లోయలు ఇవన్నీ మానవసంచారానికి అనుకూలం కాదు. కేవలం మైదాన ప్రాంతం మాత్రమే మానవ మనుగడకు అనుకూలం. కానీ విస్పోటనంలా పెరుగుతున్న జనాభాకు ఈ నేల సరిపోతుందా.. మరో గ్రహంలో నీటి ఛాయల కోసం వెదికే మానవుడు ఈ గ్రహం పై ఉన్న నీటి ఆవాసాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటే ఎలా ఉంటుంది. యస్.. ఆ ఆలోచనే మనిషికి కొత్త ఆవాస ప్రాంతాన్నిచ్చింది. నేల పైనే కాదు మనిషి తలుచుకుంటే నీటిలోనే ఆకాశాన్ని తాకే అంతస్తులు నిర్మించవచ్చని నిరూపించిండు.
స్పాట్
రానున్న మరో 100 సంవత్సరాలలో ఈ నేల మానవ నివాసానికే సరిపోదు..ఇక పాడి పంటలు పెంచడం కూడా చాలా కష్టం కావచ్చు. అందుకే ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నరు శాస్ర్తవేత్తలు. భూగోళం పై మూడొంతులు ఆక్రమించిన నీటిని కూడా మానవుడు కబళిస్తే ఎలా ఉంటుంది. నీటి పై నగరాలు నిర్మిస్తే చాలా వరకు సమస్యతీరుతుంది కదా..అవును .. ఉవ్వెత్తున ఎగసే కెరటాలను పునాదులుగా చేసుకొని నగరాలకు లే అవుట్ గీస్తే ఎలా ఉంటది. ఇదిగో ఇలా ఉంటదంటున్నారు శాస్ర్తవేత్తలు.
స్పాట్ (సముద్రం పై ఇళ్లు కట్టే ఇళ్ల స్పాట్లు)(సముద్రం విజువల్స్)
ఇక్కడ నక్షత్రాకార నమూనాలో కనిపిస్తున్న లే అవుట్ నిర్మాణాలు సముద్ర ఉపరితలం పై ఆధునిక పద్దతిలో కట్టిన కట్టడాలు..ఇది నీటి పై తేలే నగరం. చందమామ కథల్లోలా లాగా జలగృహాల సముదాయం ఇది.
స్పాట్
ఈ ఇండ్లను కట్టడానికి ఫోమ్ ను వాడుతరు. ఫోమ్ తో తయారు చేయబడ్డ ప్రత్యేక ఇటుకల సహాయంతో ఈ ఇండ్లను నిర్మిస్తరు. రామప్పగుడి ఇటుకల మాదిరిగా ఇవి కూడా నీటిలో తేలే ఇటుకలన్నమాట. ఇటువంటి ఇటుకలన్నిటిని ఒక్కోక్క బ్లాక్ గా చేసి ఆ బ్లాక్ లన్నిటిని ఫైబర్ కడ్డీలతో అమర్చుతరు. సుమారు 4లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తయారు చేసిన ఈ నీటి పై తేలియాడే నగరానికి భూమి పై నిర్మించే అన్ని రకాల భవనాలకుండే హంగులు ఉంటయి.
స్పాట్
సముద్రం అంటే మాటలు కాదు. అది అల్లకల్లోలానికి గుర్తు. పౌర్ణమి అమావాస్యలలో సముద్రంలో కెరటాల అలజడి అంతా ఇంతా కాదు. మరి ఈ ఆటుపోట్లను తట్టుకోవాలంటే ఎలా..అందుకే ఈ భవన నిర్మాణాలకు అడుగున షాక్ అబ్జర్వర్స్ లాంటి ఫైబర్ రాడ్ లను వాడుతరు. ఇదిగో ఇలా అలకు కుదుపులకు భవనాలు దెబ్బతినకుండా కాపాడుతయి.
స్పాట్
ఇదిగో ఇక్కడ కనిపించే నల్లని ఉపరితలమంతా.. నీటిమీద తేలే భవన నిర్మాణ తలం.. దీనికి కింద భాగంలో ఫోమ్ తో 30 మీటర్ల ఫోమ్ తో తయారు చేయబడిని పునాది ఉంటది. ఈ నగరంలో తేలే విమానాలు, తేలే సూపర్ మార్కెట్లు ఇవన్నీ ఉన్నయి. దీనికోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఆర్కిటెక్చర్ ప్లాన్ లు తయారు చేశారు. ఇదిగో ఇక్కడ కొందరు నిఫుణులు అతి జాగ్రత్తగా తేలియాడే భవనాలు నిర్మించడంలో బిజీబిజీగా ఉన్నరు.
స్పాట్
వాస్తవానికి ఈ భూమి పై ఉన్న విస్తీర్ణంలో మూడొంతుల నీటినే కాదు ఆకాశాన్ని కూడా వినియోగించుకొనే ప్రయత్నం చేశారు ఆర్కిటెక్చర్లు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ నిర్మాణం చైనా రాజధాని బీజింగ్ లో ఉన్న సిసి టివీ టవర్స్. ఇది ప్రపంచంలోనే ఒక అద్భుత నిర్మాణంగా చెప్పొచ్చు.
స్పాట్ (ఒరజినల్)
ఈ టవర్ లలో మొత్తం లభించే విస్తీర్ణం 4 మిలియన్ ల చదరపు అడుగుల స్థలం. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆఫీస్ గా గుర్తించారు పరిశోదకులు. దీని తరువాత స్థానాన్ని పెంటగాన్ ఆక్రమించింది. దీనిలో నిత్యం 10వే మంది ఉద్యోగులు, వేలాది మంది సందర్శకులతో భవనం కిటకిటలాడుతుంటది. అంటే ఇది చిన్నపాటి నగరంతో పోల్చారు శాస్ర్తవేత్తలు.
స్పాట్
సిసి టివీ అతి పెద్ద నిర్మాణం..ఇక్కడ అతిపెద్ద నిర్మాణం అనేది ప్రత్యేకత కాదు..అతి పెద్ద నిర్మాణాలు ఎన్నో ఉన్నా మనం దీనిగురించే చర్చించుకుంటున్నామంటే దీనిలో ఒక ప్రత్యేకత ఉంది. ఇంతకీ ఏంటా ప్రత్యేకత.
స్పాట్
ఈ సిసి టివి టవర్స్ లో ఉన్న ప్రత్యేక లక్షణం ఆర్కిటెక్చర్ మోడల్స్ నే పూర్తిగా మార్చేసింది. ఆధునిక ఆర్కిటెక్చర్ లకు కొత్త ప్లాన్ లను నేర్పింది. ఇది నేలపై తక్కువ స్థలాన్ని ఆక్రమించి ఎక్కువ విశాలమైన గదులను అందించడమే దీని ప్రత్యేకత. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇది భూమి పై కేవలం కొంత ప్రాంతాన్ని ఆక్రమించి..ఆకాశంలో వంతేన మాదిరి నిర్మాణాన్ని కట్టగలిగిన్రు. ఈ ఎయిర్ బ్రిడ్జ్ మామూలు బ్రిడ్జ్ కాదు. 11 అంతస్థుల నిర్మాణం. ఇందులో వందల కొద్దీ ఆఫీసులు ఉన్నయి. నిజానికి రెండు టవర్ల మద్యలో ఉన్న ఈ బ్రిడ్జిలో ఇంత భారీ బరువును ఆపడం నిజంగా వండరే. ఆకాశంలో 500మీటర్ల ఎత్తు నిర్మాణాన్ని నిర్మించడం వెనుక రహస్యం దీని పునాదుల్లోనే దాగి ఉంది. ఈ టవర్ల నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇవి రెండూ 10 డిగ్రీల ఏటవాలు కోణంలో నిర్మించబడినయి. దీంతో ఇవి ఒకవైపు ఒరిగిఉన్నట్టు ఇప్పుడో ఇంక నిముషంలోనో కూలిపోతున్న భ్రమను కలిగిస్తుంది. అందుకే చైనీయులు దీన్ని ప్రమదకర భవనంగా పిలుస్తరు.
స్పాట్
దీనినిర్మాణంలో ఉన్న ప్రత్యేకత మరోటి ఉంది. రెండు రకాల పునాదులు. రెండు రకాల స్లాబ్స్ ఉన్నయి. దీని పునాది మొత్తం మందపాటి ఇనుప చువ్వలతో నిర్మించబడి ఉంది. వేలాది చువ్వలను పునాదులలో అమర్చిన్రు.
స్పాట్
ఈ భవనం ఆకాశాన్ని ఆక్రమించ వచ్చనే విషయాన్ని రుజువు చేసింది. భవిష్యత్తులో ప్రతి బ్రిడ్జికి, ప్రతి బిల్డిండ్ కు అను సంధానంగా ఆకాశ వంతెన భవనాలు నిర్మించే రోజు తొందరలోనే ఉంది.
స్పాట్
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 6 వందల మిలియన్ ల వాహనాలు రోడ్లపై తిరుగుతున్నయి. 2020 కల్లా ఇది 1.2 బిలియన్ల వాహనాలు రోడ్లను ఆక్రమించనున్నాయనేది ఒక అంచనా. ఇన్ని వాహనాలు తిరగాలంటే ఇప్పుడున్న రోడ్లు చాలవని ప్రపంచ వ్యాప్తంగా ఒక ఆందోళన మొదలయింది. అందుకే దీన్ని అధిగమించాలి.. ఒకటి వాహనాల సైజు తగ్గించాలి. లేదా పూర్తిగా వాహనాల రూపురేఖలనే మార్చేయాలి.
స్పాట్
ఆకాశంలో ఎగరాన్న మానవుడి ఆశ అతి త్వరలో నిజం కాబోతోంది. ఎందుకంటే ఒకప్పుడు ఇది సరదా గా ఎగరాలనుకున్న మానవుడికి ఇప్పుడది తప్పని అవసరం అయింది. ఒకప్పుడు పక్షిని చూసి రెక్కలు కట్టుకొని ఎగిరి విహంగ వీక్షణ చేయాలని ఉబలాట పడ్డడు మానవుడు. ఆ ఆలోచనల్లోంచి వచ్చిందే విమానం..విమానం ఎక్కే అదృష్టం అందరికీ లభించకపోవచ్చేమో గానీ ఆకాశంలో ఎగిరే అదృష్టం ఇక ప్రతి ఒక్కరికీ సొంతం కాబోతంది. అదీ మరో 30 ఏళ్లలో రాజహంసల్లా విను వీధిలో హాయ్ చెప్పుకోవచ్చు.
స్పాట్
21 శతాబ్దపు అంతంలో ఇక మనుషులు హెలికాప్టర్లు పోటీ పడాల్సిందే. శాస్ర్తవేత్తలు దీనికి పెట్టిన ముద్దుపేరు జెట్ ప్యాక్..ఈ జెట్ ప్యాక్ను తగిలించుకొంటే ఆకాశ మార్గంలోఅవలీలగా ప్రయాణించ వచ్చు. జెట్ ప్యాక్ అందరికీ అందుబాటులోకి వస్తే సగం ట్రాఫిక్ సమస్యలను అధిగమించొచ్చు. అంతేకాదు తూనీగల్లా ఆకాశంలో మనుషులు కనిపిస్తారు. ట్రాఫిక్ లో చిక్కుకొని సమయానికి చేరలేమనే భయం కూడా ఉండదు. తక్కువ సమయంలో వేగంగా అడ్డదారిలో వెళ్లొచ్చు. అంతేకాదు ఇరవై అంతస్థుల పైన ఉన్న ఆఫీస్ లోకి నేరుగా వెళ్లిదిగొచ్చు.
స్పాట్
న్యూయార్క్ లో 20 మైళ్లదూరం ప్రయాణించడానికి కనీసం గంటంబావు సమయం పడుతది. జెట్ ప్యాక్ అందుబాటులోకి వస్తే 5 నిముషాల్లో ఈ దూరాన్ని చేరొచ్చంటున్నారు దీన్ని పరిక్షించిన జెట్ ప్యాకర్స్. అవును రానున్న రోజుల్లో ఈ జెట్ ప్యాక్ లో ఇందనాన్ని నింపుకొనే ఫ్యూయల్ స్టేషన్స్ కూడా ఉన్నాఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
స్పాట్
ఆకాశంలో ఎగరడం ముందు ముందు ఓ ఫాషన్ కావచ్చు..జెట్ పాక్లను 1960లోనే తొలిసారి ప్రయోగించి చూసిన్రు. ఇదిగో ఇదే జెట్ పాక్ మిషన్..దీన్ని ధరించడం చాలా ఈజీ..మనం కారులో సీట్ బెల్టు పెట్టుకుంన్నట్టే దీన్ని నడుముకు చుట్టుకోవాలి. ఈ మిషన్ కు 800 హార్స్ పవర్ ల శక్తి ఉంది. వాస్తవానికి ఇది హైడ్రోజన్ పారాక్టైడ్ రాకెట్.. ఇందులో ఉన్న మూడు సిలిండర్ లు ఉంటయి. ఈ సిలిండర్ లలో హైడ్రోజన్ పెరాక్సైడ్ఉంటది. ఇది సల్పర్ తో చర్యజరిపనపుడు అత్యధిక ఉష్ణోగ్రత గల ఆవిర్లు వెలువడుతయి. ఈ వేడి నీటి ఆవిరి బలంగా కిందికి వదలడం వలన వ్యక్తి బలంగా పైకి నెట్టబడుతాడు. ఈ వేడి ఆవిర్ల ఫోర్సును బట్టి ఎగిరే ఎత్తు ఉంటది. కిందికి దిగాలంటే ఫ్లూయిడ్ ని కంట్రోల్ చేస్తే చాలు హాయిగా లాండ్ అయిపోవచ్చు. ఎక్కడన్నా ఇందనం అయిపోవచ్చిందంటే ముందుగానే హర్న్ ఇస్తది. దీంతో ఎక్కడంటే అక్కడే దిగి వెళ్లొచ్చు.
స్పాట్
దీని సాయంతో ఇళ్లపైనుంచి వెళ్లే వీలుంద. పెద్దపెద్ద లోయలను అవలీలగా దాటొచ్చు. అంతేకాదు విపత్తులపుడు వ్యక్తులను కాపాడటానికి వారికి కావలసిన సాయం అందించడానికి కూడా ఈ జెట్ పాక్ లు సహకరిస్తయి.
స్పాట్
ఇంత సౌకర్యమైన మిషన్ చాలా ఖర్చు అయి ఉండడొచ్చనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ దీని వెల కేవలం 226 డాలర్ల ఖర్చు మాత్రమే అవుతుంది. ఈమాత్రం చెల్లిస్తే ట్రైనింగ్ తీసుకొని జెట్ పాక్ ను తీసుకొని ఎగురుకుంటూ రావచ్చు.
స్పాట్
అవును ఆకాశంలో ఒంటరిగా ఎగరాలంటే మాటలా.. దురదృష్టం కొద్దీ ఆకాశంలోనే మిషన్ రిపేరుకొచ్చో లేక పూర్తిగా ఆగిపోయిందనుకో..ఇక అటునుంచి అటే నని సెటైర్లేస్తున్నారు సైంటిస్టులు..అందుకే ఒంటరిగా నడపగల స్మాల్ సైజ్ విమానాన్ని ఒకదాన్ని తయారు చేసిన్రు.
స్పాట్
ఇక్కడ ఉన్న విమానాన్ని చూశారా..చూడముచ్చట రాజసాన్ని ఒలకబోస్తూ పక్కన నిలబడి ఫోటోదిగినా చాలన్నంత సొగసులను చిలకరిస్తోంది. అవును మరి రాబోవు 50 ఏళ్లలో ఇంటికో విమానం ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు బైక్ సర్వీస్ సెంటర్లలాగే గల్లీకో ఫ్లైట్ సర్వీసింగ్ స్టేషన్లు ఏర్పాటు కావచ్చు. ఆ కథేంటో చూద్దాం.
స్పాట్
మెరుపులు మెరుస్తూ మురిపిస్తున్న ఈ చిన్నవిమానం ఆటోపైలట్ సిస్టంతో నడుస్తుంది. ఇందులో మాగ్నటిక్ మీటర్స్ దిక్కులను చూస్తయి. దీనికి రాడార్ వ్యవస్థతో పెద్దగా పనిలేదు. ఇది మన ఇంట్లో బైక్ మాదిరిగానే నడుపుకోవచ్చు. ఎందుకంటే రానున్నరోజుల్లో ఎయిర్ ట్రాఫిక్ సిస్టం సాఫ్ట్ వేర్ ను ప్రతి ఆటో పైలట్ విమానానికి కనెక్ట్ చేస్తరు. దీని వలన ఎక్కణ్నుంచి ఏ ఫ్లైట్ ఎగిరేది అది ఎంత ఎత్తులో ఎగిరేది, ఎంత స్పీడ్ లో వచ్చేది అన్నీ సెకన్స్ లోనే ఎస్టిమేట్ చేయగల టెక్నాలజీ ఈ విమానాల సొంతం. ఎటువంటి ప్రికాషన్స్ లేకుండానే లేజర్ రే స్ ద్వారా ఎదురుగా వచ్చే ఫ్లైట్ లను గుర్తించి దాని హైట్, స్పీడ్లను అంచనావేసి ఎదుటి వాహనానికి సిగ్నల్ ఇస్తుంది. అంతే రెండు వెహికిల్స్ వాటి ఎత్తులు, స్పీడ్ లల్లోతగిన మార్పులు చేసుకోవడం గానీ తప్పుకోవడం గానీ చేస్తయి.
స్పాట్
ఈ విమానాల మెయింటెనెన్స్ చాలా తక్కువ. మామూలు పెద్ద విమానానికి గంటకు 400 గ్యాలన్ల ఇందనం ఖర్చయితే.. దీనికి కేవలం 55గ్యాలన్ల ఇందనం మాత్రమే ఖర్చవుతుంది. పెద్ద విమానం ధర 20 మిలియన్ డాలర్ల వరకూ ఉంటుంది. ఈ ఆటోపైలట్ విమానం ధర 1 మిలియన్ 400డాలర్లు మాత్రమే... భవిష్యత్లో టిక్కెట్లు బుక్ చేసుకొనే గొడవలేదు. ఖండాంతరాలకు కూడా ఎప్పుడంటే అప్పడే చెక్కేయోచ్చు. అమెరికా నుంచి ఆస్ట్రేలియాకు, ఇండియాకు పక్కర్లో ఉన్నట్టే వెళ్లిరావచ్చు. అయితే కాసులు మరిన్ని ఖర్చుపెట్టగలిగే స్థోమన ఉండాలి.
స్పాట్
భవిష్యత్తులో ఇదిగో ఇక్కడ చూపినట్లు రైల్వే ట్రాక్ల మాదిరి ఫ్లైట్ ట్రాక్ లు ఉంటయి. వీటిలోనే విమానాలు చక్కర్లు కొడతయి. వీటిని కోఆర్డినేట్ చేసే ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తుంది. వీటికి అమర్చిన ఒక ప్రత్యేక చిప్ లద్వారా వీటి కదలికలు ఎప్పటికపుడు తెలుస్తుంటయి. ఇదిగో ఆకాశంలో గూగుల్ ఇచ్చిన ఎయిర్ ట్రాఫిక్ సిస్టం.ఇక్కడ ఎల్లో కలర్లో కనపడే గుర్తులన్నీ విమానాలన్నమాట. ఈ టెక్నాలజి అందుబాటులోకి వస్తే రానున్న రోజుల్లో హాలీడేస్ మొత్తం ఆకాశంలో గడపొచ్చు లేదా ఏదో కొండశికర ప్రాంతానికి చేరుకొని ఫామిలీ మొత్తం ఎంజాయ్ చెయ్యొచ్చు. వెయిట్ చేయకుండా ఫ్లైట్ జర్నీ చేసే అవకాశం మరో 30 ఏళ్లలో మన సొంతం.
స్పాట్
మనిషి సొంతంగా ఆకాశంలో విహరించినట్టే జలగర్భంలో కూడా మిమానంలో విహరించొచ్చని నిరూపించారు సైంటిస్టులు. అవును విమానాలను ఆకాశంలోనే కాదు నీటిలో కూడా నడపగలిగే భారీ విమానాలను తయారు చేస్తున్నరు శాస్ర్తవేత్తలు. దీని ద్వారా సముద్రగర్భంలో జల చరాలను దగ్గర నుంచి చూసే అవకాశం లభిస్తది. వాటర్ ప్రూఫ్ టెక్నాలజితో సబ్ మెర్సిబుల్ క్రాఫ్ట్స్ తయారు చేస్తున్నరు సాంకేతిక నిపుణులు.
స్పాట్ (తయారు చేసే విజువల్స్)
వేల్ చేపలాంటి ఆకారంతో నీటిలో నేరుగా చొచ్చుకుపోగల ఆకారంతో ఈ విమానాన్ని తయారు చేసిన్రు. ఈ విమానం గంటకు 10మైళ్ల వేగంతో మాత్రమే వెళ్లగలదు. ఎందుకంటే అంతకంటే వేగంగా వెళితే దూరం నుంచి ఏ తిమింగలమో ఢీ కొడితే మొదటికే మోసం వస్తది. అందుకే ఇందులో ఉన్న టెక్నాలజి ప్రకారం దాని స్పీడ్ ప్రకారం..దాన్ని కంట్రోల్ చేయగల దూరం వరకు లేసర్ కిరణాల సాయంతో ఎదురుగా ఏమున్నదో గుర్తిచగలరు. ఈ విమానాలు కూడా అందుబాటులోకి వస్తే ఆకాశంలో పొగమంచు కమ్ముకుంటే ఇక నీటి విమానాల ద్వారా ఖండాంతరాలను దాటవచ్చు.
స్పాట్
నీళ్లల్లో ఎగిరే విమానాల మాదిరిగానే నీటిలో నడిచే కారును రూపొందిచిన్రు శాస్ర్తవేత్తలు. ఇదిగో ఇక్కడ లాండ్ స్కేప్ పై వేగంగా వస్తున్న ఈ తెల్ల కుందేలు లాంటి కారులో ఎన్నెన్నో వెరైటీ ఫీచర్స్ ఉన్నయి.
స్పాట్
ఈ ఫాషనేటెడ్ కార్ మల్టీ పర్పస్ యూజ్ ఫుల్ గా ఉంటది. ఇది హెవీ స్పీడ్ అండ్ స్టైలిష్, జీరో ఎమిషన్స్, ఇకో ఫ్రెండ్లీ కార్. అంతేకాదు దీంట్లో అటో డ్రైవింగ్ సిస్టం కూడా ఉంది. హేవీ స్పీడ్ కార్ని స్కూబా అనే కంపెనీ తయారు చేస్తొంది. ఈ కార్ ను నీటిలో కూడా నడుపుకుంటూ వెళ్లొచ్చు. ఈ కారులో వెళ్లే టపుడు మనుషులు తడిసే అవకాశం ఉంది. అంతేకాదు నీటిలో మనుషులకు కావలసిన ఆక్సీజన్ అందించే సిలిండర్, దాని క్వాంటిటీని మెజర్ చేసే రీడర్లు ఉంటయి. ఇది గంటకు 2 మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. వెనుక వైపు రెండు ఫ్యాన్లు.. ముందు వైపు రెండు వాటర్ ట్రాప్స్ ఉంటయి వీటి సాయంతోనే కారు దిశ మార్చవచ్చు. ఈ స్కూబా కార్ నీటిలో సుమారు 3గంటలు ప్రయాణం చేయగలదు. ఇందులో ఉన్న ఆక్సీజన్, ఇందనం 3 గంటలకు సరిపడా ఉంటుంది. అంటే ఒక రోడ్డుకు అడ్డంగా ఒక నది లేదా కాలువ లేదా సరస్సు అడ్డం వచ్చినపుడు బ్రిడ్జి వరకు వెళ్లడానికి ఎక్కువ సమయం పట్టడం కానీ లేదా అసలు బ్రిడ్జే లేని సరిస్థితి వచ్చినా ఇటువంటి కారుతో మంచి ఉపయోగం. ఒక్కోసారి వరదలు వచ్చినపడు రోడ్లుకొట్టుకొని పోయి. లో లెవల్ బ్రిడ్జిలు మునిగి ఇబ్బందవుతది. అటువంటి విపత్తులను ఎదుర్కోవడానికి ఈ కారు చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది.
స్పాట్
మనిషి నింగీ, నేలా ఆకాశాన్ని ఆక్రమించి మొత్తం తన గుప్పిట్లోకి తెచ్చుకొనే ప్రయత్నంలోనే ఈ కొత్త రకం టెక్నాలజీని ఉపయోగిస్తున్నడు. ఈ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో భవిష్యత్తులో సముద్రాలను రియల్ ఎస్టెట్ ల కింద అమ్ముకుంటారో లేక పొల్యూషన్ లేని నగరాను నిర్మిస్తారో వేచి చూడాల్సిందే..

ది సైన్స్ ఎపిసోడ్ ఇరవై ఏడు

ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలను మీ ముంగిలిలో నిలిపే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
రిపీట్ యాంకర్
మానవుడికి తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకోవాలన్న ఆకాంక్షతో బాటు తనను తాను తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా పెరిగింది. ఆ ఆసక్తితోనే తాను విశ్వవ్యాప్త ప్రయగాలు చేసిండు. అందులో వ్యక్తి హావభావాలు, మనిషి ప్రవర్తనకు మధ్య ఉన్న సారూప్యాలను వైరుధ్యాలను అధ్యయనం చేయగలిగిన్రు. ఈ సృష్టిలో మనం చూసే విషయాలన్నీ వాస్తవాలా..భ్రమలా.. మనకు కనిపించి మన కంటిని సైతం మాయం చేయగల చిత్రాలు మనల్ని మోసపుచ్చుతున్నయా..చూసే ముందు గతవారం చూసిన సైన్స్ ఎపిసోడ్లో నేనెవరు అనే దానికి సమాధానం ఎంతవరకు వచ్చిందో చూద్దాం.( ఇది వీలైతే కనీసం రెండు నిముషాలు వేయగలరు.)
యాంకర్ 1
మనిషి సృష్టిలోనే చాలా తెలివైన జీవి.. ఆహార్యంలో చాలా చిన్నజీవి అయినప్పటికీ..ఈ విశ్వాన్నే తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకొనే ఆశాజీవి. ఇన్ని తెలిసిన మనిషి తాను చావు జయించడంలో పూర్తిగా విఫలం అయిండు. చావును జయించాలంటే ముందు జన్మరహస్యం తెలియాలి. మనిషి సృష్టించబడిండా లేకపరిణామం చెందిండా..ఈ పరిణామంలోనే మనవ మేథస్సు పరిణామం చెందిందా..లేక సృష్టించిన మానవుడి మెదడు వరంగా ఇవ్వబడిందా..ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనే పనిలో పడ్డరు పరిశోధకులు.
స్పాట్
వాయిస్ ( పాత ఫీడ్ కూడా వాడాలి)
మానవుడు తానెవరో తెలుసుకునే క్రమంలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చినయి. మనిషికి సారూప్య పోలికలున్న జంతువులకు హావభావాలలో సారూప్య లక్షణాలు గుర్తించిన్రు. దీనికి కారణం మెదడే అన్న విషయం అర్ధమయిపోయింది. మెదడు అభివృద్ది చెందిన కొద్దీ జీవి ప్రవర్తనలో అభివృద్దిలో మార్పు కనిపిస్తదన్న విషయం రుజువయింది. అయితే ఈ వానరజాతి నుంచే మానవుడు ఉద్భవించాడా అన్న ప్రశ్న నేటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది.
యాంకర్ 2
మెదడు.. ఇదో బ్రహ్మ పదార్ధం. కంప్యూటర్కు హార్డ్ డిస్క్ ఎలాగో జీవులక మెదడు అలాగ..ఎంత మేథావి అయినా మెదడులో చిన్నలోపం వచ్చిందంటే పూర్తి జీవితాన్ని కోల్పోవలసిందే..ఇంతకీ మెదడులో ఏముంది..
స్పాట్
మెదడంటే కపాలంలో ఇమిడిపోయిన ఒక మాంసం ముద్ద కాదు. దీని నిర్మాణంలోనే ఒక ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నయి. మెదడు చుట్టూ చిన్న చిన్న ముడుతలు ఉన్నయి. ఇవి మెదడు వైశాల్యాన్ని పెంచేందుకు ఉపయోగపడుతయి. అంతే కాదు తక్కువ ప్రాంతంలో ఎక్కువ తలాన్ని ఆక్రమిస్తుంది. మెదడు అంతర్భాంగం నిండా న్యూరాన్ లు నిండి ఉంటయి. ఈ న్యూరాన్ లు ఒకదనికొకటి అనుసంధానించబడి ఉంటయి. వీటిద్వారా దేహం మొత్తానికి కమ్యునికేషన్ డెవలప్ అవుతుందన్న విషయం రుజువు చేసుకున్నారు శాస్ర్తవేత్తలు.
స్పాట్ (మెదడు, న్యూరాన్ విజువల్స్)
మెదడును విశ్లేషించిన శాస్ర్తవేత్తలకు అచ్చం మెదడులా పనిచేసే యంత్రాన్ని కనుగొనాలనే ఆలోచన వచ్చింది. అంతే..ఆలస్యం చేయకుండా అమలుకు శ్రీకారం చుట్టిన్రు.
స్పాట్(రూం కంప్యూటర్ )
ఇదిగో ఇక్కడ రూం నిండా కనిపిస్తున్న ఈ ఎలక్ర్టానిక్ సర్యూట్లు చూస్తే ఏదో పవర్ హౌజ్ కు వచ్చినట్టుంది కదూ..వాస్తవానికి ఇది పవర్ హౌస్ కాదు. పవర్ యుటిలేషన్ చాంబర్. అంటే ఇప్పడు మన అరచేతిలో ఇమిడిపోయే ల్యాప్ టాప్ కు ఇదే ప్రాథమిక రూపం.
స్పాట్
యాంకర్ 3
మనిషి మెదడులా వేగంగా పనిచేసే మిషన్ను ఒకటి తయారు చేస్తే మనిషికి ఆలోచనలకు భారం తగ్గి పని త్వరగాఅవుతుందనే ఆలోచనల్లోంచి పుట్టిందే కంప్యూటర్. మెదడుకు కంప్యూటర్ పనితీరుకు ఎన్నో పోలికలు ఉన్నయి. కాకుంటే ఇది మానవ నిర్మితం కాబట్టి మనిషి దానిలో ఫీడ్ చేసిన విషయాలతో మాత్రమే పనిచేయగలదు. అంతకు మించి చేయడానికి దానికి స్వయంగా ఆలోచించే శక్తిగానీ నిర్ణయాలు తీసుకొనే శక్తిగానీ లేదు.
స్పాట్
ఇది మనిషి మెదడుకు నమూనా.. ఇందులో మెయిన్ ప్రాసెసర్ కు, హార్డ్ డిస్క్కు అను సంధానించబడిన ఈ సర్కూట్ లను న్యూరాన్ల తో పోల్చారు. ఈ ఎర్రని వైర్లను ఆక్సాన్ లుగా, డెండ్రైట్ లుగా అభివర్ణించింన్రు.
స్పాట్( రూం కంప్యూటర్)
ఇలా గదినిండా ఉన్న ఈ కంప్యూటర్ ఇప్పుడు మానవ చేతిలో ఇమిడిపోయేంత చిన్నగా తయారయింది. అంతేకాదు మనం ఏ విషయాన్ని మరిచి పోయినా..మన మెదడుకు స్ఫురించని విషయాలు మెదడును అడిగితే అదే చెబుతుంది. మన పేరు మరిచిపోయినా దీన్ని అడిగితే చాలు క్షణాల్లో చెప్పేస్తుంది..అంటే దీనికి ముందు కంప్యూటర్ లో మన పేరు ఫీడ్ చేసిఉండాలి.
స్పాట్( ల్యాప్ టాప్ లో టైప్ చేసే సీన్)
ఈ కంప్యూటర్ ఇలా అరచేతిలో ఇమిడిపోయి సమస్త విశ్వాన్ని తనలో ఇముడ్చుకునే దశ ఒక్కసారే వచ్చింది కాదు. దీనికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. ఆ తరువాతే మాన్ లైక్ మాషిన్ అనే మరమనిషిని తయారు చేయగలిగిన్రు. దీని ద్వారా మనిషి ఆదేశాలను అనుసరించే మరమనిషి తయారయింది.
స్పాట్ (అమెరికా భవంతులు )
20 వ శతాబ్దంపు ప్రారంభదశలో అమెరికా శరవేగంగా అభివృద్ది చెందింది.( బిల్డింగ్ ఒరిజినల్ స్పాట్లు). ఈ దశలోనే మనిషి తనను తాను అధ్యయనం చేసేందుకు పరిశోధన చేసిండు. మనిషిలోని మెదడు శరీరాన్ని సమన్యవయం చేస్తే మరి మనసునెవరు సమన్వయం చేస్తరు. ఇదే ప్రశ్న శాస్ర్తవేత్తలను కూడా ఆలోచింపజేసింది. నిజానికి మెదడు చేసే ఆలోచనల ప్రక్రియే మనసన్న విషయాన్ని తరువాత గుర్తించిన్రు. కానీ ఈ మనసును అధ్యయనం చేయడం ఎలా..దానికి పరిశోధకులు పెట్టిన పేరే “”సైకాలజి”
స్పాట్(పాత విజువల్స్, హిప్నాటిజం బొమ్మలు)
యాంకర్ 4
సైకాలజి. ఈ పదం మనం తరుచూ వింటున్నదే..కానీ దీని లోగుట్టేంటో ఎవరికీ తెలియదు. సైకాలజి తో మనుషులను వశపరచుకోవచ్చంటారు నిజమేనా..మనిషిని వశీకరణ చేసుకోవడానికి సైకాలజిలో ఏమున్నాయి. మాయలా మంత్రాలా కేవలం మాటలేనా..మనిషిని మాటలతో ఏమార్చే ఆ నూతన ప్రక్రియ ఏంటి. దీనికి తొలుత బీజాలు వేసింది ఎవరు..చూద్దాం..
స్పాట్
సైకాలజి.. మనసును అధ్యయనం చేసే శాస్ర్తం..ఇది సైన్స్ లో బాగమే..దీనిలో వ్యక్తి ప్రవర్తనను అధ్యయనం చేస్తరు.( స్పాట్ ట్రైన్ బ్లర్, మీటింగ్ హాల్లో ప్రజలు విజవల్) ప్రజల్లో దాగి ఉన్న మూఢనమ్మకాలు, విశ్వాసాలను రూపుమాపేందుకు ఈ శాస్ర్తం బాగా పనికొచ్చింది. అంతెందుకు ఎప్పటినుంచో మార్చుకోని అలవాట్లు కూడా ఒక్క గంటలో మాన్పిచ్చే ఆయుధం సైకాలజి. సైకాలజి డెవలప్ కావడానికి కొన్ని దశాబ్దాలు పట్టినయి.
స్పాట్( పావురం, శాస్ర్తవేత్త విజువల్స్)
బి. ఎఫ్ స్కిన్నర్ అనే మానసిక శాస్ర్తవేత్త మొదట ఎలుకల, పావురాల ప్రవర్తన పై అధ్యయనం చేసిండు. ఈ చాంబర్ స్కిన్నర్ అధ్యయనం చేసిన పరిశోధనాలయం. ఇవన్నీ ఆయన స్టడీ చేసిన గ్రంధాలు. ఆయనకు సంగీతమంటే ప్రాణం. ఇష్టమైన పాటలు వినేవాడు. రిమోట్ లేని రోజులు కావడం వల్ల. బటన్ లకు దారం కట్టి ఆపరేట్ చేసేవాడు. ఈ ఆలోచనే తరువాత రిమోట్ కనుగొనడానికి మార్గదర్శకం అయింది..స్కిన్నర్ పర్సనల్ రూం మొత్తం సాంకేతిక పరిజ్ఞానంతో నిండి ఉంటది. ఆయన బెడ్ కూడా టెంపరేచర్ కంట్రల్ చేసుకోనే సౌకర్యం కూడా ఉంది. ఈ మాత్రం సాంకేతిక జ్ఞానం ఉండబట్టే స్కిన్నర్ తన పరిశోధనలను సునాయాసంగా చేయగలిగిండు.
స్పాట్( పై విజువల్సే)
దీన్ని స్కిన్నర్స్ పెట్టే అంటరు. ఇందులో ఒక పావురం పరిస్థితులకు అణుగుణంగా ఎలా ప్రవర్తిస్తుందో అధ్యయనం చేసిన్రు. (స్మాట్ స్పాట్ పావురాలు మేత మేయడం...)
ఇక్కడ ఇద్దరు పరిశోధకులు స్కిన్నర్ బాక్స్ గురించిన విషయాలు తెలుసుకుంటున్నరు. కింది వైపు 2 అంకే ఉన్నది స్కిన్నర్ పెట్టే ఇందులో పరిక్షించదలుచుకున్న జీవిని ఉంచుతరు. అందులో చిన్నకెమెరా అమర్చి మూసేస్తరు. అప్పడు అందులో ఉంచిన ఏ జంతువైనా తమను ఎవరూ చూడట్లేదనే భ్రమలో సహజ ప్రవర్తనతో మెదులుతుంటయి. కొన్నినియంత్రిత పరిస్థితుల్లో జీవులు ఏవిధంగా ప్రవర్తిస్తయనేది ఈ ప్రయోగం చెబుతుంది. ఒక్కసారి ఆ ప్రయోగాన్ని చూద్దాం..
స్పాట్
పరిశోధకులు మొదట ఒక పావురాన్ని తీసుకొని దాన్ని ఈ స్కిన్నర్ పెట్టేలో ఉంచుతరు. దానికం టే ముందు ఆ పెట్టెలో కొన్ని నియంత్రిత పరిస్థితులు ఏర్పాటు చేస్తరు. అంటే ప్రయోగానికి కావలసిన మీటలు, ఆహారం వంటివన్నమాట. ఆకలితో ఉన్న పావురానికి కొన్ని గింజలు ఇచ్చే ఏర్పాటు ఉంటది. అయితే పావురం అక్కడ వెలిగిన మీటను నొక్కితేనే దానికి ఆహారం వస్తుంది. మొదటగా ఎర్రలైటు, పచ్చలైటు వేసి దీని ప్రయోగం చేశారు. ఎర్రలైట్ వెలిగినపుడు ఎటువంటి ఆహారం రాలేదు. పచ్చలైటు వెలిగినపుడు దాన్ని మీటినపుడు మాత్రమే ఆహారం వచ్చింది. దీంతో పావురం ఎర్రలైటు వెలిగినపుడు దాన్ని మీటకుండా ఆపేసింది. తరువాత మద్యలో మీట కాకుండా దానికి ఇరువైపులా ఉన్న పచ్చమీటలు నొక్కినపుడు మాత్రమే ఆహారం వచ్చేలా ఏర్పాటు చేసిన్రు.. కొంత సమయానికి కేవలం ఎడమ వైపున్న పచ్చమీట నొక్కినపుడు మాత్రమే ఆహారం వచ్చేలా ఏర్పాట్లు చేసిన్రు. దీంతో పైన ఎడమ వైపు మీట నొక్కడం, కింద ఆహారం సేకరించడం అనే ఏకాంతర చర్యల వలన పావురం నిరంతరం యాంటీ క్లాక్ వైస్ కండీషన్ లో తిరగడం మొదలయింది. అంటే జంతువులు కూడా మారిన సరిస్థితులను బట్టి తమ ప్రవర్తన మార్చుకుంటాయని సూత్రీకరించిండు స్కిన్నర్. ఇదే సూత్రాన్ని మానవులకు కూడా అన్వయింపజేసిన్రు.
స్పాట్
మనుషుల చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చడం ద్వారా వారి ప్రవర్తనను మార్చవచ్చనే సిద్దాంతాన్ని నమ్మిన్రు పరిశోధకులు.
యాంకర్ 5
స్కిన్నర్ ఎలుకలపై పావురాలపై చేసిన ప్రయోగాలు మానవుల పై ప్రయోగిస్తే ఎలా ఉంటది. మానవ ప్రవర్తనకు జంతువుల ప్రవర్తనకు ఉన్న సారూప్యాలేంటి..వైరుద్యాలేంటి అనే విషయాన్ని కనుక్కొనే ప్రయత్నం చేసిన్రు ఆధునిక పరిశోధకులు.
స్పాట్(గ్రాఫిక్ స్పాట్)
1960 దశకంలో సైకాలజిలో ఆధునిక పద్దతులను అవలంబించిన్రు. మానసిక ప్రవర్తనను కంట్రోల్ చేసే కొత్త ఔషదాలు, థెరఫీలు, వ్యక్తిత్వ పరీక్షలు అందుబాటులోకి వచ్చినయి. భావోద్వేగాలను, జ్ఞాపకశక్తిని, అంచనా వేయగల పెద్దపెద్ద పరికరాలు ఆవిష్కరించబడ్డయి. సైకాలజి ఒక పెద్ద విజ్ఞాన శాస్ర్తవిబాగంగా అవతరించింది.
స్పాట్(బ్రెయిన్ స్కానింగ్ విజువల్స్)
మానవుడి ఆలోచనలకు, ప్రవర్తనలకు మూలం తెలుసుకోగలిగిన్రు. మన మెదడులో జరిగే న్యూరో రసాయన చర్యలు కేవలం నానో సెకన్లోనే జరుగుతయి. ( స్పాట్ బ్రెయిన్ స్కాన్ ఒరిజినల్ సౌండ్) చూసే దృష్టిని బట్టి ప్రపంచం కనిపిస్తది. ఇదిగో ఇక్కడ ఒక ఇల్యూజన్ ఏర్పాటు చేశారు. రూంలో అమరికలను బట్టి ఒకే వ్యక్తి చిన్నగా, పెద్దగా కనిపిస్తున్నడు. ఇదిగో ఇక్కడ ఇద్దరు స్నేహితులు చెరో మూలన ఉన్నారు. చూడటానికి మాత్రం ఒకరు పొడుగ్గా ఒకరు పొట్టిగ్గా కనిపిస్తరు. కారణం గ్రౌండ్ లెవల్. రూఫ్ లెవల్ పోయిన కొద్దీ చిన్నగా ఉండటం వల్ల వ్యక్తి దూరంలోఉన్న భావన కలుగుతుంది. ఈ భావన వలన ముందు ఉన్న వ్యక్తి మనకు దగ్గరగా ఉన్నట్టు, రూం చివర ఉన్న వ్యక్తి పొట్టిగా ఉన్నట్టు మిద్యభావన కలుగుతున్నది. ఈ తరహా విజిబిలిటీ మన బ్రెయిన్ కు అలవాటయింది. పసితనం నుంచి చేసే కదలికల వల్ల మన బ్రెయిన్ లో కొంత ప్రొగ్రామింగ్ ఫీడ్ అయి ఉంటుంది. దాన్ని బట్టే మనకు కనిపించే వ్యక్తిని, వస్తువును , పరిసరాలను అంచానా వేయగలుగుతం.
స్పాట్(చిన్నపిల్లవాడు బొమ్మలతో ఆడుకునే విజువల్స్0
ఇక్కడ కనిపించే ఈ పిల్లవాడు తాను బొమ్మలతో ఆడుకోవడమే కాకుండా వాటిని నిశితంగా పరిశీలిస్తున్నడు. ఈ వయసు నుంచే అతని మెదడులో వస్తువుల పట్ల వాటి కదలికల పట్ల ఒక ఖశ్చితమైన అవగాహనకు వస్తడు. వస్తువుల పట్ల స్పృహ వస్తది.
స్పాట్ (పిల్లవాడి విజువల్స్)
మనిషి జీవితంలో తాను అనుభవించిన అనుభవాలన్నీ మెదడులో నిక్షిప్తం అయి ఉంటయి. తాను చేసే పనులకు, చేయబోయే పనులకు గత అనుభవాలు ప్రభావం చూపుతయి. వాటిని బట్టే తాను చేసే పనిలో నైపుణ్యం ఉంటుంది. తన అనుభవంలోకి రాని ఏ విషయమైనా అతనికి కొత్తగానే ఉంటయి. వాటి పట్ల తాను భిన్నంగా ప్రవర్తిస్తడు. (వివిధ రకాల మనుషుల విజువల్స్, జనం వాడుకోవాలి)
(తరువాత అన్నీ పాత విజువల్స్తో ఉన్న సీన్స్ ఉన్నయి. వాటిని వాడుకోవాలి)
సైన్స్ తన చరిత్ర నిండా ఎన్నో ఆవిష్కరణలు, ఎన్నో విజ్ఞాన విషయాలు రాసుకుంది. ఈ విషయాలు మనిషిని మరింత సౌకర్యవంతంగా జీవించేలా చేసింది. మరిన్ని ప్రశ్నలకు సమాధానం రాబట్టింది. దీనికి నింగి, నేల, సముద్రమనే అవధులు లేవు. విశ్వరహస్యాలను తనలో ఇముడ్చుకుంది. ఆ రహస్యాలను మన తరతరాలకు పంచింది.
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ విశేషాలు..మరిన్ని సైన్టిఫిక్ అప్డేట్స్ తో మళ్లీ కలుసుంకుందా..అంటిల్ దెన్ బై..
బ్రేక్ యాంకర్ ,,వెల్ కం బ్యాక్..చెప్పించాలి.
నెక్ట్స్..వీక్..విజువల్స్..30 సెకన్స్ వేసుకోవచ్చు.