4, మార్చి 2011, శుక్రవారం

ది సైన్స్ ఎపిసోడ్ పందొమ్మిది

ఇంట్రో యాంకర్
చీకటి యుగం నుంచి మానవుడు ఈ ఆధునిక యుగం లోకి అడుగు పెట్టే వరకు ఎన్నో మార్పులు. ఎంతో అభివృద్ది ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు..ఎన్నో వేల ఏండ్ల సంది ఎన్నో వందల మంది శాస్ర్తవేత్తలు చేసిన మేథోశ్రమ ఫలితమే నేడు మనం అనుభవించే ఈ సాంకేతిక ఫలాలు.. ఈ రోజు మనం ఇంట్లో కూర్చొని టివి చూస్తున్నామంటే కారణం..ఆ నాడు ఎందరో శాస్ర్తవేత్తలు చేసిన కృషి ఫలితమే..
బ్యాంగ్
యాంకర్ 1
మనం ఈరోజు రాత్రి పగలు అనే తేడా లేకుండా జీవిస్తున్నామంటే..దానికి కారణం మానవ కళ్యాణం కోసం విశ్వవ్యాప్తంగా జరిగిన కృషే కారణం. ఈ అభివృద్ది ఎలా సాధ్యమయింది.. పాత రాతి గుహల నుంచి పాలరాతి గృహాల వరకు మానవుడు ఇంత అభివృద్ది ఎలా సాధించగలిగిండు..ఒక్కో శాస్త్రవేత్త ఒక్కో ఆవిష్కరణ చేయడం ద్వారా, వాటి నుంచి కొత్త ఆవిష్కరణలు పుట్టుకొచ్చినయి. అలా అలా వచ్చిందే రైలింజన్.. వేలాది మందిని, వందలాది టన్నుల బరువును ఒక్కసారే తీసుకెళ్లగల ట్రైన్ కు పునాది ఏంటి.. ఒక కాఫీ మగ్గు అంటే నమ్మగలరా..
స్పాట్(స్మాల్)
వాయిస్-
అవి ఆధునిక యుగానికి పునాదులు పడుతున్నరోజులు.. అప్పుడప్పుడే సాంకేతిక శాస్ర్తానికి పునాదులు పడుతున్న టెక్నికల్ డే స్.. అప్పటికింకా రవాణా వ్యవస్థ పూర్తిగా అభివృద్ది చెందలేదు. త్వరగా వెళ్లాలంటే కేవలం గుర్రపు బండ్ల ద్వారానే సాధ్యం. అది కూడా సంపన్న వర్గాలకే పరిమితం. యూరప్ అప్పటికే నవీన శాస్ర్త ఫలితాలను అనుభవిస్తున్నయి.. ఈ పరిణామం ఆ దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసింది. ప్రపంచ దేశాలన్నీ సాంకేతిక శాస్ర్త అంశాలపై దృష్టి సారించినయి.
స్పాట్
యూరప్ లో విండ్ మిషన్ లు, విండ్ ఛారిట్లు, వాట్ అండ్ బోల్టర్ స్టీమ్ ఇంజన్ వంటి కొత్త సాంకేతిక పరికరాల ఆవిష్కరణతో ఊహించని అభివృద్ది సాధ్యమయింది. స్టీమ్ ఇంజన్ సాయంతో సాధించిన ప్రగతి ఇంతా అంతా కాదు..అదే ఉత్సాహంతో మరిన్ని కొత్త ఆవిష్కరణలకు పునాది వేశారు శాస్ర్తవేత్తలు.
స్పాట్
రవాణా సౌకర్యాలు పూర్తిగా లేని రోజులవి..కేవలం గుర్రబ్బండీ మాత్రమే వేగవంతమైన ప్రయాణ సాధనం.. అదీ సంపన్న వర్గాలకు మాత్రమే పరిమితం.. స్టీమ్ ఇంజన్ను కనుగొన్న తరువాత పడమటి దేశాలలో దానికి డిమాండ్ బాగా పెరిగింది. దీనితో ఏదైనా సాధ్యమేనన్న సత్యం తెలిసొచ్చింది శాస్ర్తవేత్తలకు..అంతే కాదు స్టీమ్ మిషన్ చాలా మంది శ్రామికులకు పనిలేకుండా చేసిందని కూడా చెప్పొచ్చు. గనిలో నీరు ఎత్తిపోయడానికి, గనిలో మిషన్ల వంటి వాటిని నడపడానికి స్టీమ్ ఇంజన్ ను ఉపయోగించడం మొదలు పెట్టిన్రు.అందుకే తన ఇంజన్ మిస్ యూస్ కాకుండా ఉండేందుకు..వాట్స్ తన ఆవిష్కరణ పై పేటెంట్ హక్కులను పొందిండు.. ఆ పార్ములాను పై ప్రయోగాలు పూర్తిగే ఆయనకే సొంతంమయింది.
స్పాట్
ఈయన పేరు రిచర్డ్ ట్రెవితిక్ ..వాట్స్ స్టీమ్ ఇంజన్ ను మించి మరో కొత్త ఇంజన్ తయారు చేయాలని సంకల్పించిండు..అంతే కాదు ఆ దిశగా కృషి చేసిండు కూడా..ఫలితంగా కదిలే స్టీమ్ ఇంజన్ ను తయారు చేయగలిగిండు..
స్పాట్
ఇదిగో ఇదే మన రైలింజన్ కు తొలిరూపం..ఇది జేమ్స్ వాట్ రూపొందించిన స్టీమ్ ఇంజన్ వంటిదే..అది ఒక్కచోటే ఉండి పనిచేసేయంత్రం..కానీ ఇది కదిలేయంత్రం.. దీని శక్తి 8 అశ్వసామర్ధ్యాలతో సమానం.ఇందులో వాక్యూమ్స్ కానీ కండన్సర్ లు కానీ అవసరం లేదు. ఒక ఇంటి నిండా వ్యాపించే స్టీమ్ ఇంజన్ స్థానంలో చిన్నదైన, తేలికైన, సరళమైన కదిలే ఇంజన్ ను తయారు చేయగలిగిండు రిచర్డ్ త్రివితిక్. అంతేకాదు ఇది కదిలేలప్పుడు కూ కూ అనే శబ్దాన్ని కూడా చేయగలదు..
స్పాట్
ఈ కదిలే యంత్రం ప్రజలను, సరుకులను రవాణా చేయగలదన్న నమ్మకం కలిగింది పరిశోధకులకు. దీన్ని మరింత అభివృద్ది చేస్తే ప్రజలకు మేలు చేకూరుతుందనే ఆశకూడా వారిలో చిగురించింది. ఆవిరి యంత్రాన్ని కదిలే యంత్రంగా తీర్చిదిద్దిన ఘనత ట్రివితిక్ కే దక్కుతుంది. అందుకే ఆయనను మొడ్రన్ రైల్వే పితామహుడిగా అభివర్ణిస్తరు.
స్పాట్
ఇక్కడ మనం చూస్తున్న ఈ ఇంజన్ చూడటానికి చిన్నగా ఉన్నా దీని బరువు అక్షరాలా 5 టన్నులు. ఇది మామూలు రోడ్లపై కదిలితే రోడ్లు చితికి పోవలసిందే..ఇక వందల టన్నుల గూడ్స్ ను లాక్కుంటూ పోతుంటే రోజుకోరోడ్డు వేసుకోవలసి వస్తుంది. అందుకే వీటికోసం రైలు పట్టాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తరు.
స్పాట్
చరిత్రలో ఇటువంటి కదిలే మిషన్ల ఆవిష్కరణకు ఎందరో శాస్ర్తవేత్తలు కృషి చేశారు. కానీ అవి మధ్యలోనే ఆగిపోయేవి. ఒక మంచి ఐడియా మంచి వాతావరణంలో మంచి వ్యక్తికి ఆచరించ గలిగే వ్యక్తికి రావాలి. దానికి పూర్తి రూపం ఇవ్వాలంటే బలమైన ఆర్ధిక నేపద్యం ఉండాలి. లేదా ఆర్ధిక శక్తులు సహకరించాలి. కానీ దురదృష్టం..ట్రివితిక్ కు అటువంటి అవకాశం లేకుండా పోయింది. వాట్స్ కు బోల్టన్ దొరికనట్టు ట్రివితిక్ కు ఎవరూ ఆర్ధికంగా సహకరించే వారు లేరు సరికదా దీన్ని ఖర్చుతో కూడిన పనిగా వ్యంగంగా మాట్లాడిన వారే అధికం. 1800 వ సంవత్సరంలో ఈ కొత్త మిషన్ కు అయ్యే ఖర్చును చూసి ఈ మిషన్ కంటే గుర్రం కొనుక్కోవడమే చాలా చౌక అని దెప్పిపొడిచినవారు కూడా లేకపోలేదు..
స్పాట్
(ఒరిజినల్ స్పాట్) స్టీమ్ ఇంజన్ రకరకాల రూపాంతరాలు చెందింది. మేథావులకు ఆర్దికవేత్తలకు చిరునామా అయిన లూనార్ సొసైటీ మళ్లీ రంగప్రవేశం చేసింది. అ సొసైటీ చలువతోనే స్టీమ్ ఇంజన్ వెలుగు చూడగలిగింది.
స్పాట్ (ఇంజన్ లు కదిలే సీన్స్)
ఈ భూగోళం పై కదిలే మిషన్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోయింది. అన్ని రంగాలలో మిషన్ తయారీ పెరిగింది..యంత్ర సహాయం లేనిదే ఏ ఉత్సత్తి జరగడం లేదనేది సత్యం. స్పాట్( మిషన్ ల స్పీడ్ విజువల్స్)
స్టీమ్ ఇంజన్లు, అవి తెచ్చే లాభాలు విక్టోరియన్ బ్రిటన్ రూపాన్నే మార్చేసినయి.( సిటీ టాప్ విజువల్స్)స్పాట్… ఈ ఇంజన్ల ప్రభావం పెద్ద పరశ్రమలపై పడింది. అయితే ఈ యాంత్రికనైపుణ్యాలను కొందరు స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటే మరికొంత మంది సామాజిక మార్పుకోసం ఉపయోగించుకున్నరు. బానిస విముక్తికి, స్ర్తీ విద్య వంటి వాటిని ప్రొత్సహించడానికి ఈ యంత్రాలు తోడ్పడినయి. ఈ ఆవిరి యంత్రాల వినియోగంతో విక్టోరియా బలమైన శక్తిగా ఎదిగింది.
స్పాట్
స్టీమ్ ఇంజన్ల వాడుకం గణనీయంగా పెరిగింది..అదే సమయంలో స్టీమ్ ఇంజన్ తన రూపాన్ని మార్చుకొంది..కారణం..ఓ యాదృచ్చిక సంఘటన..కాదు కాదు..మనం నిత్యం చూసి పట్టిచ్చుకోనటువంటి ఒక చిన్న సంఘటన కొత్త సైన్స్ ఆవిష్కరణకు దారి తీసింది. అదే కాఫీ మగ్..
స్పాట్(పేపర్ క టింట్ విజువల్స్)
ఇక్కడ ఒక శాస్ర్తవేత్త చేసే చిన్న ప్రయోగం చూద్దాం..ఈ ప్రయోగంలో జరిగే చిన్న చర్య స్టీమ్ ఇంజన్ కు కొత్త అర్ధాన్నిచ్చింది.. ఈ శాస్ర్తవేత్త ముందుగా ఒక కేతిలి తీసుకొని దాంట్లో కొంత నీరు పొసిండు.. ఈ కెటిల్ ను ఒక ఫర్నెస్ పై పెట్టి కొంత సేపు వేడిచేయగా.. కొంత సేపటికి ఈ కెటిల్ పైప్ నుంచి వేడి ఆవిర్లు రావడం మొదలవుతుంది..ఇది మనందరికి తెలిసిన మనందరి ఇళ్లలో జరిగే సామాన్యమైన విషయమే..కానీ ఈ చిన్నవిషయం లోంచే పెద్ద సైన్స్ సీక్రెట్ వెలుగు చూసింది.. దానికి శాస్ర్తవేత్తలు పెట్టిన పేరే “థర్మో డైనమిక్స్” అంటే ఉష్టగతికశాస్ర్తం అని అర్ధం.. ఈ కెటిల్ హీటింగ్ సిస్టంలో ఒక ఫార్ములా ప్రూవ్ అయింది..అదే ఉష్ణగతిక శాస్ర్త మొదటి సూత్రం.. శక్తి నిత్యత్వ సూత్రం.. అంటే శక్తి తన రూపాన్ని మార్చుకుంటుందే తప్ప నశించదు అనే సూత్రమన్నమాట..ఈ సూత్రం ప్రకారం శక్తి సృష్టించ బడదు నశింపబడదు..ఇక్కడ ఈ కొలిమిలో భగభగ మండే నిప్పుల్లోంచి ఉష్ణశక్తి విడుదల అవుతుంది..అదే ఉష్ణశక్తి కెటిల్ లో ఉన్న నీటిని వేడి చేసి ఆవిరి శక్తిగా మారుతుంది.. ఈ ఆవిరి శక్తి తరువాత ఉపయోగించుకుంటే యాంత్రిక శక్తిగా మారగలదు.. ఈ సూత్రం ఒక్క కెటిల్ కే కాదు స్టీమ్ ఇంజన్, విండ్ మిల్ వంటి పరికరాలకు కూడా శక్తి నిత్యత్వ సూత్రం అన్వయించుకోవచ్చు.
స్పాట్(గ్రాఫిక్స్ విజువల్స్)
ఉష్ణగతిక శాస్ర్త నియమాలు భౌతిక శాస్ర్తంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చినయి..ఒక్క మాటలో చెప్పాలంటే 19వ శతాబ్దపు సైన్స్ ప్రగతికి అత్యంత దోహదం చేసినయి థర్మోడైనమిక్స్. ( గ్రాఫిక్స్ విజువల్ వాడుకోవాలి)
స్పాట్( మేఘాలు, వాటర్, హిల్) ఒరిజినల్ సౌండ్స్.
ఫ్రాన్స్ దేశంలో 1772 జూన్ లో సైంటిస్టుల బృందం ఒక సాహస నావికా యాత్ర చేపట్టింది. ఈ బృందానికి ఈస్ట్ ఇండియా కంపనీకి చెందిన జాన్ వాల్ష్ అనే రిటైర్డ్ ఆఫీసర్ నాయకత్వం వహించారు. ఈ యాత్రలో వాల్ష్ ఓ అద్బుతాన్ని గుర్తించిండు..ప్రకృతిలో విద్యుత్తు సహజసిద్దంగా ఉత్పత్తి అయ్యే మహత్తర విషయాన్ని కనిపెట్టిండు.
స్పాట్( ఉరుములు మెరుపులు) ఒరిజినల్ సౌండ్స్ తో
ఇప్పటి వరకు మనకు ఆకాశంలో మెరుపుల్లోనే శక్తి దాగుందనే విషయం తెలుసు..కానీ నీటిలో కూడా ఇటువంటి అద్భుత శక్తులున్నాయనే విషయం వాల్ష్ కనిపెట్టేశారు.
స్పాట్(వాటర్,టార్పిడో ఫిష్)
టార్పిడో ఫిష్.. ప్రకృతిలో ఇదో మిరాకిల్ అని చెప్పొచ్చు. ఆహార సేకరణ కోసం ఈ చేప తన దేహం నుంచి విద్యుత్తు ను ఉత్పత్తి చేసి..ఆ షాక్ ను తన ఆహారజీవి పైకి వదులుతుంది..షాక్ కు గురైన జీవిని ఆహారంగా తీసుకుంటుంది.
(చేప ఒరిజినల్ మ్యూజిక్ తో స్పాట్)
టార్పిడో విడుదల చేసే విద్యుత్తు..మేఘాలలో నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ఒక్కటేనా అన్న విషయాన్ని రుజువు చేసుకునేందుకు వాల్ష్ చాలా ప్రయోగాలు నిర్వహించిండు.
స్పాట్
ఇది స్పార్క్ జనరేటర్.. (స్పార్క్ విజువల్స్)..వాల్ష తిరిగి లండన్ వచ్చాక టార్పిడో ఫిష్ పై అనేక ప్రయోగాలు నిర్వహించిండు..ఈ ప్రయోగాల కోసం కొన్ని వందల రకాల టార్పిడో ఫిష్ లను సేకరించి మ్యూజియం లో భద్రపరచిండు.. ఈ జీవుల అంతరాంగాలలో ఏముందో తెలుసుకునేందుకు వాల్ష్ ..జాన్ హంటర్ అనే సర్జన్ సహాయం తీసుకున్నడు..ఆయన వీటి శరీర బాగాలను విఛ్చేదన చేసి అవయవాల పనితీరును పరిశీలించేందుకు వాల్ష్ కు సహకరించిండు.వీరిద్దరి కాంబినేషన్ లో టార్పిడో ఫిష్ లో ఎలక్ర్టిక్ రే స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయో కనిపెట్టేశారు.
స్పాట్
ఇక్కడ చేప ఉపరితల బాగం పై ఎర్రగా కనిపించే నాళికలను రక్త వాహికలుగా గుర్తించిన్రు. వాటి కింద ఉన్న ఈ చిన్న కణాల నుండే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వీటిని ఎలక్ర్టో సైట్ లు అని పిలుస్తరు. ఇవి ఎలక్ర్టో ఆర్గాన్ అనే అవయంలో ఉంటయి. ఈ ఎలక్ట్రో ఆర్గాన్ టార్పిడో ఫిష్ కున్న ఒక అద్భుత అవయవం..ఈ అవయవ నిర్మాణంలో చాలా కీలక అమరికలు ఉండటం శాస్ర్తవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది.
స్పాట్(పేపర్ పెయింటింగ్ విజువల్స్)
వాల్ష్ పరిశోధన ప్రకారం మేఘాల్లోంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తు.. టార్పిడో ఫిష్ లోంచి విడుదలయ్యే విద్యుత్తు ఒక్కటి కాదని తేల్చేసిన్రు. టార్పిడోలో విద్యుత్ విడుదలకు ప్రత్యేయమయిన యంత్రాంగం ఉందని సిద్దాంతీకరించిండు వాల్ష్..కానీ చాలా మంది వాల్ష్ తో ఏకీభవించలేదు.. మానవుడు విద్యుత్ ఉత్పత్తి ఏ రకమైన పరికరాలు తయారు చేశాడు..అచ్చు అలాంటి నిర్మాణమే ఈ చేపకు ప్రకృతి ఇవ్వడాన్ని శాస్ర్తవేత్తలను విస్మయానికి గురిచేసింది.
స్పాట్ (చేప, వాటర్)(సిటీ ఏరియల్ వ్యూ )
లండన్ కు చెందిన అలెసాండ్రో వాల్టా అనే శాస్ర్తవేత్త 1800లకు పూర్వం ఒక సిద్దాంతాన్ని ప్రతిపాదించిండు. ఇది లండన్ ఆర్కైవ్స్ లో లభించింది. ఇందులో టార్పిడో ఫిష్ యంత్రాంగాన్ని ఎలా తయారు చేయవచ్చో వివరించిండు.(లెటర్ విజువల్స్)
ఇదే వాల్టా రాయల్ సొసైటీకి పంపించిన థీసిస్..ఇది పూర్తి ఫ్రెంచ్ బాషలో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న పెట్టెలో టార్పిడో ఫిఫ్ కు సంబందించిన యంత్రాంగం ఉంది. దీనికి కావలసినవి జింక్ , కాపర్ ప్లేట్ లు, మరియు చిన్న బిట్ కార్డుబోర్డు.. వీటన్నిటినీ ఆల్టన్ నేట్ పద్దతిలో ఒకదాని తరువాత ఒకటి అమర్చాలి. ఇప్పుడు ఈ నిర్మాణాన్ని గమనిస్తే అచ్చం టార్పిడో చేపలో యంత్రాంగాన్ని పోలి ఉంటుంది. అందుకే వాల్టా తాను చేసిన ఈ నిర్మాణాన్ని కృత్రిమ విద్యుదుత్పత్తి నిర్మాణంగా పిలిచిండు. ఈ పలకలకు రెండు వైపులా ఎలక్ట్రిక్ వైర్లతో కనెక్షన్ ఇచ్చిండు.. వీటి మద్య కరెంట్ పాసయ్యేది ఒక ఒల్టా మీటర్ సాయంతో గుర్తించిండు.. ఈ ప్రయోగ ఫలితాన్ని వాల్టా రాయల్ సొసైటీకి అందించిండు.. ఫలితంగా మనం ఇప్పుడు అందరం ఇళ్లో వాడుతున్న బాటరీకి పునాదులు పడ్డయి.చాలా కాలం వరకు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియలేదు..తరువాత కాలంలో ఇది రిజర్వ్ డు విద్యుత్తుగా అనేక ఫలితాల నిచ్చింది..ప్రకృతి నుంచి నేర్చుకున్న ఎన్నోపాఠాలలో వాల్టా బాటరీ ఒకటి..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి