ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాను విప్పి చెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాటెడ్జ్ కు స్వాగతం.
యాంకర్ 1
అందమైన భూగోళం../ హిమ పర్వతాలు..లోయలు../కొండలు..కోనలు.. /సెలయేళ్లు..జలపాతాలు../అరణ్యాలు..అద్బుతాలు..ఇవన్నీ ఒక్క భూమికే సొంతం. దుర్భిణి వేసి వెదకినా టెలిస్కోప్ కనుచూపు మేరల్లో ఇంత అందమైన గ్రహం మరోటి కనిపించడం లేదు.
బ్యాంగ్ ( ది ఎర్త్ 2)
స్పాట్( హోమ్ వీడియో విజువల్స్)
ఇంత అందమైన భూ గ్రహం రోజు రోజుకూ మసక బారిపోతోంది. ఇక్కడ గాలి పీల్చడం కూడా కష్టమయ్యే రోజులు దగ్గర పడుతున్నయి. ఎంత ఫామిలీ ప్లానింగ్ చేసుకున్నా..ఎన్నివిపత్తులు వచ్చినా.. రోజురోజుకూ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. రేపటి రోజున ఈ భూమి పై కూర్చోడానికి చోటు కరువయినా ఆశ్చర్యం లేదు. ఎలా.. ఈ సమస్యలను ఎలా అధిగమించాలి..
స్పాట్
వాయిస్
పుడమి తల్లి…ఎంత చక్కనిది.. ఎంత చల్లనిది. ఎన్నో లక్షల రకాల జీవులు..ఎంతో అద్భుతమైన దృశ్యాలు..స్వర్గం ఉందో లేదో తెలియదు కానీ స్వర్గాన్ని మించిన అందాలు ఇహలోకంలో ఉన్నాయనేది మాత్రం వాస్తవం.
స్పాట్
ఈ భూమి పై ఖండానికో సొగసు రంగరించుకొని రంగులు చిమ్మింది ధరిత్రి. అప్పుడే భగభగ పొగలు చిమ్మే అగ్ని పర్వతాలు.. వాటిని ఆనుకుని నీలి వర్ణ తివాచీ పరిచినట్టుంటే మహాసముద్రాలు..అంతెత్తునుంచి జాలువారే జలపాతాలు.. చెక్కిన శిల్పాల్లాంటి కొండ చరియలు. ప్రకృతి మాతకు పచ్చని చీర సింగారించినట్టు ఆకు పచ్చని అడవులు. వహ్..వర్ణించుకుంటూ పోవాలిగానీ ఈ భూమి అందం ఎన్ని కావ్యాలు రాసినా తరగదు. ఎందరు కవులు మనసు పెట్టి వర్ణించినా ఒడవదు. ఈ భూగోళం తనను తాను చెక్కుకున్న స్వయం శిల్పి. హిమ నదాలు, ఎత్తు పల్లాలు.. తనకు తాను సృష్టించుకున్న ఒంపు సొంపుల వయ్యారాలు. ఇవన్నీ మిలిన్ల సంవత్సరాలుగా ఏ అద్దంలో చూసుకోకుండా ఒద్దికగా దిద్దుకున్న సొగసలు భూమి సొంతం..
స్పాట్(హోం విజువల్స్)
ఇంత సుందరమైన భూమి ఒడిలో సేదతీరడం మంటే అదృష్ఠమే మరి. ఈ నేల అందరి సొంతం. ఒక్క మనుషులే ఇది మా సొంతం అని భ్రమపడతారు. కానీ ఎగిరే పక్షులు.. తెల్లని కొంగలు. పచ్చని బయళ్లలోపరుగులు తీసే మదగజాలు..ఆకాశాన్ని తాకే చెట్లను కూడా అలవోకగా నమిలే జిరాఫీలు..ఇవన్నీ భూతల్లి బిడ్డలే.. జాతి జాతికో జాగా.. ఏ వాతావరణంలో పెరిగే జంతువుకు ఆ జాగాలో చోటు.. హాయిగా అమాయకంగా స్వేచ్ఛగా జీవించగలిగే చోటు భూమి ఒక్కటే.
స్పాట్
యాంకర్ 2
ఈ సకస చరాచర జగత్తులో భూమి లాంటి మరో గ్రహం ఏదైనా ఉందా... ఆ గ్రహం పై మనుషులు ఎవరైనా ఉన్నారా..ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడంలో మనిషి అలుపెరగకుండా ప్రయత్నిస్తూనే ఉన్నడు. కానీ ఎంత వెదికినా ఊహలు తప్పవాస్తవాలు లేవు. మనిషికి మరో గ్రహం గురించి ఎందుకు..వేల కాంతి సంత్సరాల్లో జీవానుకూల గ్రహమేదైనా ఉన్నా మనిషి చేరగలడా.. ఈ భూమికి ఏమయింది.. మానవుడు ప్రయత్నం దేనికోసం..
స్పాట్
అవును.. ఈ సుందమైన భూమి పై మానవుడు చాలా కాలం వరకు ఈ జంతువుల లాగే స్వేచ్ఛగా హాయిగా బతికిండు.. దొరికిన దానితో సంతృప్తిగా బతికిండు..ఎప్పడైతే రేపటికోసం..తన కోసమే కాక తన ముందు తరాల వారి కోసం కూడా ఈ భూమి పై కొంత బాగాన్ని ఆక్రమించి పెట్టాలన్న ఆలోచన వచ్చింది ఆనాటి నుంచి ఈ భూమి పై ఆధిపత్యాన్ని సాధించాలనే ఆలోచన వచ్చింది మానవుడికి. అంతేకాదు బ్రతికినంత కాలం సౌకర్యవంతంగా బతికేందుకు ఎన్నో ఆవిష్కరణలు చేసిండు. కానీ ఈ అత్యుత్సాహమే స్వర్గం లాంటి భూమిని నరకంగా మార్చింది. కనీసం స్వేచ్చగా గాలి కూడా పీల్చలేని పరిస్థితి.. భవిష్యత్తులో పెరుగుతున్న జనాభాకు సరిపడా వనరులు సరిపోవు కాబట్టే..ఇప్పడే మరో గ్రహం వెతుక్కుంటే మంచిది. అందుకే మానవుడి అన్వేషణ.
యాంకర్ 3
మరి వేరే గ్రహం కోసం మానవుడు చేసే అన్వేషణ ఫలించిందా.. విశ్వాంతరాళంలో ఎక్కడైనా మానవ నివాసానికి సరిపడా జాడలు దొరకాయా.. మరీ ఇంత అద్భుతమైన, సుందరమైన భూమి కాకున్నా..కనీసం మనిషి బతకగలిగే భూమి దొరికిందా..
వాయిస్
టెలీస్కోప్ కనుక్కున్న రోజు నుంచీ మానవుడు మరో గ్రహం పై బతకడం సాధ్యమవుతుందా అనే అన్వేషణ మొదలు పెట్టిండు. అయితే ఏది చేసినా దూరం నుంచి చూడటమే..పరికరాలు అందించిన సమాచారం తోనే..ఒక్కముక్కలో చెప్పాలంటే భూమికి అత్యత సమీపంలో ఉన్న చంద్రుడు గురించే ఇంకా పూర్తిగా తెలియదు. చంద్రుడి పై నీరుందని కొందరు. లేదు నీటి జాడలు సాధ్యం కావని కొందరు వాదిస్తున్నారు. ఒక్కో శాస్ర్తవేత్తది ఒక్కో అభిప్రాయం. భారతదేశ చంద్రయాన్ ఫలితాలు కూడా ఇంకా పూర్తిగా విశ్లేషించ బడలేదు. అంటే మనకు సమీపంలో ఉన్న ఉపగ్రహం పై గురించే సమగ్రంగా తెలుసుకోలేక పోయాము..
స్పాట్
మనిషి మనుగడ సాగించేందుకు భూమి తరువాత సూర్యరశ్మి అనుకూలంగా ఉన్న గ్రహం అంగారకుడు. భూమి తరువాత మనుషులు పెద్ద సంఖ్యలో నివసించదగ్గ గ్రహం అంటూ ఏదైనా ఉంటే అది మార్స్ గ్రహమే నని స్పష్టమయ్యింది. ఎందుకంటే మార్స్ కి భూమికి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. అవేంలో ఒక్కసారి చూద్దాం
స్పాట్
- మార్స్ మీద రోజు వ్యవధి - 24 గంటల 37 నిముషాలు
భూమి మీద రోజు వ్యవధి - 24 గంటల 56 నిముషాలు
- మార్స్ అక్షం యొక్క వాలు - 24 డిగ్రీలు
భూమి అక్షం యొక్క వాలు - 23.5 డిగ్రీలు
- మార్స్ గురుత్వాకర్షణ శక్తి భూమి గురుత్వాకర్షణ శక్తిలో మూడో వంతు
- భూమి మీద లాగానే మార్స్ మీద కూడా ఋతువులు ఉంటాయి
స్పాట్
యాంకర్ 4
ఇప్పడు మనం చూసిన మార్స్ గ్రహం వివరాలు నిజమైతే అక్క డ అడుగు పెట్టడం సాధ్యమేనా.. అక్కడ ఉన్న వాతావరణంలో మానవుడు బతికి బట్టకట్టాలంటే ఏం చేయాలి. అసలు అక్కడున్న జీవావిర్భావ పదార్దాలేంటి..
స్పాట్
అయితే మార్స్ అతిశీతలమై, శుష్కమైన, నిర్జీవమైన లోకం. జీవం ఉన్నా అది ఏకకణజీవులకి మించి ఉండే అవకాశం లేదు. ప్రస్తుత స్థితిలో మార్స్ మీద ఉన్న పరిస్థితుల్లో మనిషి మనుగడ సాగకపోవచ్చు.. కానీ, మానవ నివాసానికి కావలసిన కొన్ని ముఖ్యమైన వనరులు మాత్రం మార్స్ మీద ఉన్నయి. ముఖ్యంగా జీవసృష్టికి కావలసిన పదార్థాలు పుష్కలంగా ఉన్నయని శాస్ర్తవేత్తల నమ్మకం. జీవానికి కాలసిన ఎన్నో వనరులు ఉన్నాయి.
- ధృవప్రాంతాల్లో ఘనీభవించి ఉన్న పుష్కలమైన నీరు
- సమృద్ధిగా కార్బన్ డయాక్సయిడ్ ఉంది. దీనిలోనే కార్బన్ను ఆక్సిజన్లని వాడుకోవచ్చు.
కావలసినంత నైట్రోజెన్ కూడా ఉంది.
మార్స్ వాతావరణ పరిస్తితి చూస్తే అక్కడి వాతావరణంలో..
CO2 - 95.3%
N2 - 2.7%
Argon - 1.6%
O2 - 0.2% ఉన్నయి.
మార్స్ మీది ఈ పరిస్థితులని చూస్తుంటే ఒకప్పుడు భూమి మీద కూడా ఇలాంటి పరిస్థితులే ఉండేవేమోననిపిస్తుంది. తొలిదశల్లో భూమి మీద కూడా ఎక్కువ ఆక్సిజన్ ఉండేది కాదు. వాతావరణం నిండా కార్బన్డయాక్సైడ్, నైట్రోజెన్ లే ఉండేవి. అంతలో కిరణజన్య సంయోగక్రియా బాక్టీరియా (photosynthetic bacteria) రంగ్రప్రవేశం చేసినయి. మొక్కల్లాగానే ఇవి సౌరశక్తిని వాడుకుంటూ, CO2 ని ఆక్సిజన్ గా మార్చడం మొదలెట్టాయి.
భూమి మీద ప్రస్తుత వాతావరణ వివరాలు:
N2 - 78.1%
O2 - 20.9%
Argon - 0.9%
CO2 etc - 0.9%
ఇది కాక మార్స్ మీద ఉష్ణోగ్రత కూడా విపరీతంగా ఉంటుందని శాస్ర్తవేత్తలు గుర్తించిన్రు. మార్స్ ఉపరితలం మీద సగటు ఉష్ణోగ్రత -62.77 C అయితే, భూమి మీద సగటు ఉష్ణోగ్రత 14.4 C. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో మార్స్ ని సందర్శించామంటే, ఆక్సిజన్ సిలిండర్లు మోసుకుపోతూ, స్పేస్ సూట్లలో మాత్రమే మార్స్ నేల మీద సంచరించగలం.
యాంకర్ 4
అవును ఇప్పుడు మార్స్ మీద ఉన్న వాతావరణం ప్రకారం మనిషి దీని మీద మామూలుగా అడుగు పెడితే అర క్షణం కూడా బతికి బట్టకట్టలేదు. మరేం చేయాలి. ఈ మాత్రం భూమికి సరిపడా వాతావరణం ఉన్న ఈ మార్స్ ను మన భూమిలాగా మార్చుకోవాలి..అది సాధ్యమయ్యే పనేనా..ఈ సృష్టిలో మానవుడు చిన్న జీవి..తాను ఒక గ్రహాం మొత్తాన్ని శాసించగలడా.. శాసించాలంటే ఏంచేయాలి. మార్స్ పై లాంగ్ మార్చ్ చేయడం అంత ఈజీయేనా..శాస్ర్తవేత్తలేమంటున్నారు.
స్పాట్
వాయిస్
మార్స్ మనకు సమీపంలో కాస్తో కూస్తో జీవం ఏర్పడటానికి పుష్కలమైన మూలకాలున్న గ్రహం. ఈ గ్రహాన్ని మనకు అనుకూలంగా మర్చుకునే అవకాశశాలు లేకపోలేదంటున్నారు శాస్ర్తవేత్తలు. ఇక్కడ అడుగు పెట్టాలంటే ప్రస్తుతమున్న వాతావరణంలో ఆక్సీజన్ సిలిండర్లు, స్పేస్ సూట్లు తప్పనిసరి. ఈ సరంజామా ఎమీ లేకుండా స్వేచ్ఛగా తిరగాలంటే వాతావరణం మారాలి. లేదా మార్చుకోవాలి! శైశవ దశలో ఉన్న భూ వాతావరణం కూడా అచ్చం ఇలాగే ఉండేదని కార్బన్ డేటింగ్ లెక్కల ప్రకారం శాస్ర్తవేత్తలు అంచనా వేస్తున్నారు. మరి భూమి నేడున్న ఈ దశ వరకు ఎలా పరిణామం చెందిందో పరిశోధించిన్రు. అచ్చు అలాంటి ప్రక్రియలే వాడి మార్స్ గ్రహాన్ని కూడా మనకు అనువుగా మలచుకోగలమా? ఇది చాలా ఘనమైన ఆలోచన. ఇలా చెయ్యడం అంటే ఒక విధంగా మనిషి దేవుడిలా ప్రవర్తించ బూనుతున్నట్టు అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇదో ప్రతిసృష్టి అన్నట్టు లెక్క.
స్పాట్
వాయిస్
మానవ సంకల్పిత పరిణామానికి, పృథ్వీ పరిణామానికి మధ్య ఒక మౌలికమైన తేడా ఉంది. నాలుగున్నర బిలియన్ల సంవత్సరాల సుదీర్ఘ పరిణామం వల్ల భూ వాతావరణం ప్రస్తుత స్థితికి వచ్చింది. ఏవో యాదృచ్ఛికమైన హఠాత్ పరిణామాల వల్ల, అనుకోని అదృష్టమైన సంఘటనల వల్ల భూమి ఓ ప్రత్యేక పరిణామ రేఖ వెంట నెమ్మదిగా ప్రయాణిస్తూ ఈ స్థితికి చేరింది. మార్స్ విషయంలో ఆ గమనాన్ని... దాని పరిణామ రేఖని... పరిణామ వేగాన్ని మనం శాసించ గలమా.. ఇది అయ్యే పనేనా? అది మంచి పనేనా? ఇలా జరిగితే విపరీతాలు జరగవా..సాధ్యాసాధ్యతల మాట అటుంచితే, మంచి చెడుల మాట పక్కన పెడితే అసలు అలాంటి ఉద్దేశం మాత్రం శాస్ర్తవేత్తల్లో బలంగా ఉంది.. ఈ భావనకే ధరాసంస్కరణ (Terraforming) అనే ఓ పేరు కూడా ఉంది. అంటే కొత్త ధరిత్రిన సంస్కరించడం అన్నమాట. ఓ గ్రహం యొక్క పరిణామ క్రమంలో వైజ్ఞానిక దృష్టితో దాని పై నున్న పరిస్థితులు సరి చేసుకుంటూ, అందులో సకాలంలో కొన్ని అంశాలని ప్రవేశపెట్టి ఓ బొంసాయి మొక్కని మలచుకున్నట్టు ఆ గ్రహం మీది పరిస్థితులని కొన్ని శతాబ్దాలుగానో, సహస్రాబ్దాలుగానో మలచుకోవాలన్న ఆలోచననే ధరాసంస్కరణ అంటరు. మనిషి ఆలోచన అందనంత ఎత్తుకి చేరిందనడానికి ఇదొక చక్కని తార్కాణం.
యాంకర్ 5
మార్స్ ను చేరుకోడానికి మానవుడు చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు దానిపై రోవర్‌లను ప్రవేశ పెట్టి అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు బోలెడన్నీ ప్రయోగాలు చేసిండు. ఒక్కసారి ఆ ప్రయోగాన్ని చూద్దాం.
స్పాట్
మార్స్ ది కచ్చితమైన గోళాకారం కాదు. ఉత్తర గోళార్థంలో ఉబ్బెత్తుగా లేచిన ఓ సువిశాల ప్రాంతం ఉంది. దాన్నే థార్సిస్ కుంభ ప్రాంతం అంటరు. అంతరిక్షంలో గ్రహాన్ని బాగా దూరం నుండి నిశితంగా చూస్తే దీన్ని కనిపెట్టొచ్చుగాని, కక్ష్యలో ప్రస్తుతం మనం ఉన్న ఎత్తు నుండి చూస్తే కనిపెట్టడం కష్టం. దాని వెడల్పు సుమారు 5000 కిమీలు, ఎత్తు సగటున దిగువ ప్రాంతాల మీద 10 కిమీలు ఉంటుంది. ఈ ఉబ్బెత్తు ప్రాంతం మీదే కొన్ని చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. ఈశాన్య ప్రాంతంలో మూడు అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇక్కడే సౌరమండలంలోనే అతి పెద్దదైన ’ఒలింపస్ మాన్స్’ అనే అగ్నిపర్వతం ఉంది.
స్పాట్
ఇంత క్లిష్టమైన గ్రహాన్ని మానవుడు ఎలా సంస్కరించి తన దారిలోకి తెచ్చుకోగలడు.
దానికి ఉన్నది ఒక్కటే దారి. మార్స్ గ్రహం పై దృవాలలో కొండలకొద్దీపేరుకు పోయిన కార్భన్డై ఆక్సైడ్ ఉంది. దీన్నే డ్రై ఐస్ అంటరు. ఈ డ్రై ఐస్ను కరిగించి ఆయాప్రాంతంలో ముందుగా కేవలం కార్బన్ డై ఆక్సైడ్ ను మాత్రమే వినియోగించుకునే జాతి మొక్కలను ప్రయోగించాలి. వీటికి నీటి తేమ అక్కర్లేదు. ఈ మొక్కలు చిన్న చిన్న శైవలాలైనా కావచ్చు. చిన్న పొదలైనా కావచ్చు. వీటి జీవిత కాలంలో ఇవి వేగంగా విస్తరించ గలిగేవై ఉండాలి. ఇటువంటి సందర్భంలో ఈ మొక్కలు కార్భన్ డై ఆక్సైడ్ ను ఉపయోగించుకొని ఆక్సీజన్ ను విడుదల చేస్తాయి. కార్భన్ డై ఆక్సైడ్, నత్రజని ఆక్సీజన్ ఉన్న గ్రహం రెడీ అయిపోతుంది. అంతే ఇక కావలసిందేముంది.. నీటి చుక్కకు బీజాలు పడ్డట్టే.. నాలుగు చుక్కలు రాలాయా ఇక కాలక్రమంలో అంగారకుడి పై సముద్రాలు తొణికిస లాడటం ఎన్నోరోజులు పట్టవు. అంతే మరో ప్రపంచం రెడీ..
స్పాట్
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ విశేషాలు మరిన్ని సైన్టిఫిక్ అఫ్ డేట్స్తో వచ్చేవారం కలుసుకుందాం. అంటిల్ దెన్ బై
బ్రేక్లు. వెల్ కం బ్యాక్లు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి