ఇంట్రో యాంకర్
ఈ భూగోళం ఎంత సుందంరంగా ఉంటది. ఎన్నికావ్యఝరులు కురిపించినా ఇంకా మిగిలే అందం ఈ భూమిది. అంతకు మించి భూమి పై అన్ని రకాల జీవులు జీవించడానికి అనుకూలమైన వాతావరణాలు ఉన్నయి. ఎన్నో కోటాను కోట్ల జీవులకు అమృత ధారలు పంచుతున్న ఈ భూమి కాసిన్ని రోజుల్లో మరుభూమిగా మారనుందా.. ఈ విషయం పై నాసా శాస్ర్తవేత్తలు ఒక కొత్త వాదన బయటకు తెచ్చారు.
భూమి కి యాక్సిడెంట్ చేసే ఆ గ్రహశకలం ఏంటి..
వాయిస్
అందమైన భూగోళం..ఎంత అందమైనదంటే మంచు ముత్యాలు అవని మెడలో అందంగా అలంకరింనట్టుండే హిమగిరులు...నల్లని పాయలతో నిగనిగలాడే బారు జడల్లాంటి నదీ నదాలు. భూమికి బొట్టు పెట్టినట్టు కణకణ మండే అగ్ని పర్వతాలు.. అంతెత్తునుంచి దూకే జోరైన జలపాతాలు.. పచ్చని అడవులు, సొగసైన జలవనరులు.. ఎన్న కావ్యాలు వర్ణించినా తరగని అందం పుడమి తల్లిది.
స్పాట్
ఈ తరగని గనుల కల్పవల్లి ఒడిలో ఎన్న జీవులు, స్వేచ్ఛగా ఎగిరే విహంగాలు.. జలాంతర్భాగంలో ఈదులాడే జలచరాలు.. అడవి తల్లి ఒడిలో సేద తీరే వన్యప్రాణులు. ఒకటేమిటి ఈ చల్లని భూమాత నీడలో ఎన్నో ప్రాణులు పురుడు పోసుకొని పునీతమవుతున్నయి. అటుంటి భూ తల్లి త్వరలో శ్మశాన వాటికగా మారనుందా..
స్పాట్
ఎందుకు..భూమికి వచ్చిన ఆపద ఏంటి.. అయితే భూమికి ఇది కొత్తగా వచ్చిన ఆపదేం కాదు. ఎప్పుడూ జరిగేదే.కానీ ఈ సారి అది శృతి మించడమే అనర్ధానికి దారి తీస్తోంది. ఈ అనంత విశ్వంలో అనేక గ్రహశకలాలు స్వైర విహారం చేస్తున్నయి. ఇవి వాటి కక్ష్యలో అవే తిరుతుంటయి. అలా తిరుగుతూ తిరుగుతూ ఒక్కోసారి అవి భూమికి చేరువగా వస్తయి. అప్పుడు మాత్రం అవి తమ దిశ మార్చుకుంటయి. కక్ష్యా వేగంలో మార్పులు చేసుకుంటయి. ఇలా కక్ష్య దాటి భూమిపైకి వచ్చి భూమిని ఢీకొన్న గ్రహశకలాలకు లెక్కేలేదు. అయితే కొన్ని భూ వాతావరణంలోకి రాగానే భూమిని తాకకుండానే పేలిపోతయి. వాటినే మనందరం చుక్కతెగిందంటూ పిలుచుకుంటం. మరికొన్ని మాత్రం భూమికి మరీ దగ్గరగా వచ్చిపేలిపోతే ఇంకొన్ని సముద్ర గర్బంలోకి దూసుకుపోతాయి. ఇవి ఆకాశంలోనే పేలిపోవడమా లేక భూమిని చేరడమా అనేది వాటి పరిమాణాన్ని బట్టి ఉంటుంది.
స్పాట్
గ్రహశకలాలు చిన్నవయితే ఆకాశంలో పేలుతయి. కాస్త పెద్దవయితే భూమికి దగ్గర్లో పేలిపోతయి. మరీ పెద్దవయితే భూమిని తాకుతాయి. అధృష్టవశాత్తూ ఇప్పటి వరకూ అత్యధికం సముద్రంలో కూలినవే అధికం. కాబట్టి ఏ ప్రమాదమూ రాలేదు. మరి గ్రహశకలాల మాట అటుంచి మన భూమిని ఏకంగా ఒక కొత్త గ్రహమే ఢీకొంటే... దీంతోబాటు అపోసిస్ అనే గ్రహశకలం కూడా భూమిని ఢీకొట్టబోతోందని చెబుతున్నారు
స్పాట్
గ్రహశకలాలు ఇంతకుముందు కూడా భూమిని తాకిన సందర్భాలున్నయి. అటువంటి ఘటనలే భూమిపై పెను మార్పులు తెచ్చినయని శాస్ర్తవేత్తల అంచనా వేస్తున్నరు. అటువంటి ఒకానొక విధ్వంసం వల్లనే మహా సరీసృపాలు- డైనోసార్లు - అంతరించిపోయినయని ఒక సిద్ధాంతం. అలాగే జూన్ 30, 1908 న జరిగిన తున్గుష్క విస్ఫోటనం. రష్యాలోని తున్గుష్క నది సమీపంలో ఈ మహా విస్పోటనం జరిగింది. ఆ మహా విస్ఫోటనానికి కారణం ఒక ఉల్క. అయితే ఆ ఉల్క నేరుగా భూమిని తాకలేదు. భూమికి సుమారు 10 కిలోమీటర్ల పైనే ధ్వంసమైంది. దాని ప్రభావం హిరోషిమాపై వాడిన అణుబాంబు కంటే 1000 రెట్లు శక్తివంతమైనదని అంచనా. అయితే ఆ విస్ఫోటనంలో రెండువేల చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో 8 కోట్ల వృక్షాలు సర్వ నాశనమైపోయినయి.
స్పాట్
గడచిన మిలియన్ సంవత్సరాలలో ఈ భూమిని అనే గ్రహశకాలాలు తాకి విధ్యంసం సృష్టించనట్టు భూమి పై ఉన్న ఆధారాలను బట్టి తెలుస్తోంది. రానున్న రెండు దశాబ్దాలలో అంటే 2036, ఏప్రిల్ 13 శుక్రవారం అపోఫిస్ అనే గ్రహశకలం భూమిని తాకే ముప్పు ఉందని శాస్ర్తవేత్తలు అంటున్నరు. ఆనాటికి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని రష్యన్ ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నరు. ఐతే అటువంటి ఇబ్బందికి వీలే లేదని నాసా అంటోంది. అపోఫిస్ గ్రహశకలం రావడం మాత్రం వాస్తవమే అయినప్పటికీ ఇది ఢీకొనే అవకాశాలు చాలా తక్కువ అని వాదిస్తోంది. అపోఫిస్ గ్రహశకలాన్ని 2004 జూన్‌లోనే కనుగొన్నరు. దీని కక్ష్య 2029 నాటికి భూమికి దగ్గరగా వస్తుందని అంచనా. అప్పుడు గానీ అసలు ఈ శకలం భూమిని తాకుతుందా లేదా అన్న విషయంమీద పూర్తి స్థాయి అవగాహన కలగదు. ఆరేళ్ల క్రితం అసలు 2029లోనే అపోఫిస్ భూమిని ఢీ కొంటుందని అనుకున్నరు. అయితే మరిన్ని అధ్యయనాల తరువాత ఈ అంచనాలన్నీ భూమికి అనుకూలంగా మారినయి. వాటి ఆధారంగా అపోఫిస్ 2029లో భూమిని తాకే అవకాశమే లేదని తేలింది.
స్పాట్
ఒక ఖగోళ శకలం, మరొక పదార్థం దగ్గరగా ప్రయాణించినప్పుడు వాటి కక్ష్యలలో మార్పులు జరుగుతయని, ఈ మార్పులు ఆ గ్రహాలు లేదా శకలాల పరిమాణాన్ని బట్టి ఉంటయని అంటున్నరు ఖగోళ నిపుణులు. అందుకు కారణం, భూ ఆకర్షణ శక్తి. కొంత మంది లెక్కలు కట్టి ఈ గ్రహశకలం కక్ష్య 28 డిగ్రీల మేర వాలుతుందని, తద్వారా కాస్త తక్కువ వేగంతో ప్రయాణిస్తుందని అంటున్నారు. అయితే ఇదంతా మరో 19 సంవత్సరాల తర్వాత అపోఫిస్ భూమికి ఎంత దగ్గరగా వస్తుందనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఊహించిన ప్రకారం అది 610 మీటర్ల పరిధిలో ప్రయాణిస్తే 2036 ఏప్రిల్ 13 శుక్రవారానికి కూడా అదే స్థానంలో ఉంటుంది. అంటే మనకు ఎటువంటి ప్రమాదమూ ఉండదు. ప్రస్తుతానికి అలా ప్రమాదం జరిగే అవకాశాలు 40,000 వంతులో ఒక్కశాతం మాత్రమే.
స్పాట్
ఖగోళ వస్తువులు ఎంత చిన్నవిగా ఉన్నా అవి భూమిని తాకితే వాటి ప్రభావం మాత్రం చాలా భారీగా ఉంటుంది. ప్రస్తుతానికి అపోఫిస్ కంటికి కనిపించనంత చిన్నదిగా, సాధారణ టెలిస్కోపులకు కూడా దొరకనంత దూరంలో ఉంది. మరో కొన్ని నెలల్లో అది మన రాడారు పసిగట్టే పరిధిలోకి వస్తుంది. అప్పుడు మరింత విపులమైన అవగాహన ఏర్పడే అవకాశముంది. ఇటువంటి గ్రహశకలం ఇంతకుముందు కూడా భూమిని తాకిన సందర్భాలున్నాయి. అటువంటి ఘటనలే భూమిపై పెను మార్పులు తెచ్చినయని అంటున్నరు పరిశోధకులు.
స్పాట్
గ్రహశకలాలు భూమిని ఢీకొన్న సంఘటనలు ఎక్కువ శాతం సముద్రాలమీద జరిగి ఉంటయని, అవి మన దృష్టికి రాలేదని అంటున్నరు మరికొంత మంది ఖగోళ శాస్ర్తవేత్తలు. ప్రస్తుతం అపోఫిస్ వంటి వందలాది గ్రహ శకలాలు మన తలపై తిరుగాడుతున్నయి. అవి మనకు ఇంకా కనిపించనంత చిన్నగా గానీ, దూరంగా గానీ ఉండి ఉండవచ్చు. వాటి సంగతి అలా ఉంచితే, అపోఫిస్‌ని అంతరిక్షంలోనే నాశనం చేసేందుకు రష్యన్ సంస్థ పూనుకుంది. అపోఫిస్ భూ వినాశనానికి దారి తీయకుండా నిరోధించేందుకు ఒక వ్యోమ నౌకను రూపొందించే ప్రణాళికను సిద్ధం చేసుకుంది. నాసా చెప్పినట్టు అపోఫిస్ వల్ల నష్టం జరగకపోయినా మరిన్ని శకలాల వల్ల ఎప్పటికైనా ప్రమాదం వాటిల్లవచ్చని, అందుకు సన్నద్ధంగా ఉండాలని రష్యా అంటోంది. ఆ దిశలో అవసరమైతే అమెరికా, యూరప్, చైనాల సాయాన్ని కోరే అవకాశాలున్నాయి. ఒకవేళ అపోఫిస్ గనక భూమిని తాకితే? ఆ ప్రభావం 65000 అణుబాంబులకు సమానంగా ఉంటుందని నాసా అంటోంది.
స్పాట్
2036 ఏప్రిల్ 13న అపోఫిస్ అనే గ్రహశకలం.. భూమిని ఢీకొంటుందని లెక్కలు కట్టిన్రు. ఇంతకీ ఈ అపోసిస్ ఎలా ఉంటుందో చూద్దాం.. అపోఫిస్ 275 మీటర్ల పొడవు, అదే స్థాయిలో వెడల్పుంటుంది. ఆ గ్రహశకలం భూమిని ఢీకొంటే..విస్పోటనం కారణంగా జీవరాశే అంతమయ్యే ప్రమాదముందని అంచానా వేస్తున్నరు శాస్ర్తవేత్తలు. 2029 ఏప్రిల్‌లో..ఈ గ్రహశకలం దాని కక్షలో పరిభ్రమిస్తూ భూ గురుత్వాకర్షణకు కీలకమని చెప్పదగిన బిందువు నుంచి ప్రయాణిస్తుందని లెక్కలు కట్టిన్రు. ఆ సమయంలో దాని దిశమారుతుందని..ఏడేళ్ల తర్వాత భూమిని ఢీకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషించిన్రు రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ కు చెందిన పరిశోధకులు.
స్పాట్
అమెరికన్ సైంటిస్టులు మాత్రం అలాంటి అవకాశాలు చాలా తక్కువని కొట్టిపారేస్తున్నారు. అపోఫిస్ 2న్నర లక్షలసార్లు భూమి చుట్టూ తిరిగితే ఒకసారి మాత్రమే భూమిని ఢీకొట్టే అవకాశముంటుందని అంటున్నరు. అయితే..ఆ ఒక్కసారే మొదటిసారిదైతే పరిస్థితి ఏంటనేది రష్యన్ సైంటిస్టులు వాదన. దీనిపై ఎవరూ భయపడొద్దంటోంది నాసా చెబుతోంది. 2029 తర్వాత అపోఫిస్ భూమిని ఢీకొనేందుకు ఏడేళ్ల సమయం ఉంటుందని..అప్పట్లోగా ఆ గ్రహశకలం దిశమార్చేందుకు ప్రయత్నిస్తమని చెబుతోంది.
స్పాట్
అపోఫిస్ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం కంటే ముందే.. దాన్ని పేల్చివేసేందుకు ప్లాన్ వేస్తున్నారు రష్యా పరిశోధకులు. గతంలో ఓ తోకచుక్కను డీప్ ఇంపాక్ట్ వ్యోమనౌకతో ఢీకొట్టించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మొత్తమ్మీద..2012 తర్వాత అందరి దృష్టీ ఇప్పుడు 2036పై పడింది.
స్పాట్
చిన్నచిన్న గ్రహ శకలాలైతే పెద్దప్రమాదం లేదు కానీ..మరీ ఫుట్ బాల్ గ్రౌండంత ఉన్న శకలం దూసుకు వస్తే ఈ భూమికి వచ్చే ముప్పు అంతా ఇంతా కాదు. గతంలో మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఈ భూమి పైకి ఒక గ్రహ శకలం దూసుకు వచ్చి ఎన్నో జాతులను తుడిచి పెట్టింది. డైనోసార్స్ వంటి బలిష్టమైన జాతి అంతరించడం వెనుక గ్రహశకలాల పాత్రే ఉందని పరిశోదకుల అభిప్రాయం.
స్పాట్
గతంలో జరిగిన పెనుమప్పే మళ్లీ జరిగితే ఈ భూమి మొత్తం అగ్ని గుండంగా మారి జీవం పూర్తిగా నాశనం కావడం ఖాయం. ఇన్ని వేల సంవత్సరాల నుంచి సాధించిన ప్రగతి మొత్తం చిటికెలో తుడిచిపెట్టుకు పోతుంది. ఈ నీలివర్ణ భూగోళం పై పచ్చని మొలక కూడా మొలవని పరిస్థితి వస్తది.
స్పాట్
ఈ విపత్తు ఇప్పటికిప్పుడు వచ్చేది కాకున్నా..ఏదో ఒకరోజు మాత్రం భూమికి తప్పని సరిగా వచ్చే విపత్తే..ఎందుకంటే లక్షలాధి గ్రహలకలాలు భూ కక్షకు అతి దగ్గరగా వచ్చి వెళుతున్యయి. సంవత్సరాలు గడిచేకొద్దీ వాటి కక్షా వేగాన్ని …కక్ష్యా దిశను మార్చుకుంటున్నయి. దీంతో అవి క్రమేపీ భూమి క్షక్ష్యకు దగ్గరగా వస్తున్నయి. ఏదో ఒక రోజు ఈ పెద్దపెద్ద శకలాలు భూమిని ఢీ కొట్టడం ఖాయం.
స్పాట్
ఈ గ్రహశకలాల ఉనికిని గుర్తించేందుకు అంతరిక్షకేంద్రాన్ని ఏర్పాటు చేసిన్రు. ఈ కేంద్రం నిత్యం విశ్వాంతరాళంలో జరిగే మార్పులను గమనిస్తది. గ్రహశకలాల గమనాన్ని గుర్తిస్తది. ఏదైనా శకలం భూమి పైకి దూసుకొస్తే కనిపెట్టి అలెర్ట్ చేస్తది.
స్పాట్
విశ్వంలో విహరించే లక్షలాది గ్రహశకలాలు రోజు రోజుకూ భూమికి తగ్గరవుతున్నయి. వాటికి ఉన్న గురుత్వారక్షణ శక్తి తగ్గి భూమి వైపు మళ్లుతున్నయి..మరి కొన్ని ఒకదానికొకటి ఢీ కొని కక్ష్యమార్చుకొని భూమికి దగ్గరగా వస్తున్నయి. ఇవిగానీ భూమిని ఢీ కొంటే ప్రళయం వస్తుంది. భూమి మొత్తం ఒక అగ్ని కణంలా మారుతుంది. అంతేకాదు. ఇక పై భూమి పై గడ్డిపోచ కూడా మొలిచే ఛాన్సులేకుండా అయిపోతది. ఈ విపత్తు ఎప్పుడో ఒకప్పుడు భూమికి తప్పనిసరి అందుకే శాస్త్రవత్తలు ఈ భూమిని, భూమిపై జీవులను గ్రహశకలాలనుంచి కాపాడేందుకు ఒక టెక్నిక్ ను కనిపెట్టన్రు.
స్పాట్
అంతరిక్షపరిశోధనా కేంద్రం శకలాల ఉనికికిని కనిపెట్టి తెలియజేయగానే పరిశోధకులు అలర్ట్ అవుతరు. వెంటనే ఒక స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగిస్తరు. మానవ రహిత స్పేస్ క్రాఫ్ట్ గ్రహశకలాన్ని చేరుకుంటది.. దాని గురుత్వాకర్షణ శక్తిని తగ్గిస్తూ ఈ స్పేస్ క్రాఫ్ట్ భూ కక్ష్యనుంచి కొంత సమయం తప్పిస్తది. కొంత సమయానికి ఆ కక్ష్యనుంచి భూమి వెళ్లిపోగానే యధావిధిగా శకలం తన కక్ష్యను చేరుకుంటది..మరో కొన్ని వందల ఏళ్లవరకు ఆగ్రహశకలంతో భూమికి ముప్పు ఉండబోదు. ఈ లోపే ఆ శకలం శిధిలమైనా కావచ్చు. కానీ ఈ ప్రక్రియ అత్యంత నైపుణ్యంతో నానో సెకన్ను కూడా అంచనా వేసి చేయగలిగేదిగా ఉండాలి. ఒక్క క్షణం ఏమరు పాటుగా ఉన్నా ఈ భూమి మొత్తం భూడిదగా మారాల్సిందే.. గ్రహశకలం ఇరవై సంవత్సరాలకు భూమిని చేరుకుంటదనగా ఇప్పుడే స్పేస్ క్రఫ్ట్ ను ప్రయోగించాలి. అప్పుడే ఆ మరణశాసనాలనుంచి తప్పించుకోగలం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి