ఎ.జనార్దన్
ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలను విశ్లేషించి మీ ముంగిలిలో ఉంచే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం..
బ్యాంగ్
ఇంట్రో యాంకర్
ఈ రోజు మనం హైటెక్ యుగంలో ఉన్నామంటే దానికి కారణం ఎన్నో వేల మంది పరిశోధకుల కృషి ఫలితం. ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు వందలాది సంవత్సరాలుగా విశ్వవ్యాప్తంగా శాస్ర్తవేత్తలు చేస్తున్నకృషి ఫలితమే ఈ ఫలాలు. ఈ వారం కొత్త విషయాలు తెలుసుకునే ముందు గతవారం చూసిన విషయాలు ఒక్కసారి చూద్దాం.
యాంకర్ 1
ఒక వినాశనం ఒక మార్పుకు నాంది పలుకుతది. ఒక మహా విస్పోటనం వెనుక భారీ నిశ్శబ్దం. ఒక ప్రళయం వెనుక ఓ కొత్త ప్రపంచం..అంతే కాదు ఒక మహా సంగ్రామం ఒక కొత్త సైన్స్ ఆవిష్కరణకు దారి తీసింది. అదే ఇప్పటి ప్రపంచాన్ని వసుదైక కుటుంబంగా తీర్చి దిద్దింది. ఏమిటా సంగ్రామం..
వాయిస్
(సముద్ర అలల స్పాట్)
చరిత్రలో ఒక మహాసంగ్రామం ఒక అద్భుత ఆవిష్కరణకు దారులు వేసింది.. అవును విశ్వవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఒక్క సెకన్ వ్యవధిలో మాట్లాడుకోగల సౌకర్యానికి మూలం ఒక మహా సంగ్రామం..అది జూన్ 18, 1815.. వాటర్లూ యుద్దం జరిగిన తేదీ..లక్షలాది ప్రాణాలు గాలిలో కలిసిన వేళ..డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్, నెపోలియన్ దళాలు ఒకరికొకరు విచక్షణా రహితంగా, సమరోత్సాహంతో చంపుకున్న దుర్ధినం..
(ఒరిజినల్ మ్యూజిక్ తో పెయింటింగ్ విజువల్ ఒరిజినల్ స్పాట్)
ఈ మహాయుద్దం యూరప్ అదృష్టానికి పెద్ద పరిక్ష..
స్పాట్
యుద్దం ముగిసింది.. నెపోలియన్ దళాలు వెన్ను చూపినయి.. ఫ్రెంచ్ నష్టపోయింది.. ఈ విషయాన్ని వెల్లింగ్ టన్ లండన్ కు తెలియజేయాలి..అక్కడ ఎదురు చూస్తున్న లక్షలాధి మంది ప్రజలకు ఈ విషయాన్ని తెలియ జేయాలి..తమ దేశ ప్రజలకు విజయోత్సవ శుభవార్త తెలపాలి. కానీ ఎలా..అప్పట్లో ఏ రవాణా సాధనాలు లేవు..అంతేకాదు..వార్తావాహకాలు కూడా లేవు..అయినా విల్లింగ్ టన్ ఆర్మీ మేజర్ హెన్రీ పెర్సీ ఈ వీరవిజయాన్ని ప్రజలకు చేరవేయమని ఆర్డర్ చేసిండు. దూత బయలు దేరిండు. సముద్ర తీరానికి చేరుకుండు..అతను బయలుదేరాలంటే అలల తాకిడి, గాలి వాలు అన్నీ కలిసిరావాలి. అన్ని వాతావరణ పరిస్థితులు కలిసి వచ్చాక ఇంగ్లాండ్ కు పయనం మొదలయింది.ఇంత కష్టపడ్డా ఇంగ్లండ్ కు ఈ వార్త చేరేసరికి నాలుగు రోజులు పట్టింది. ఈ నాలుగు రోజులు ప్రజలు టెన్షన్ పడ్డారు. ఎక్కువ మందికి ఫ్రెంచ్ సైన్యం విజయం సాధిస్తుందనే బలమైన నమ్మకం ఉన్నది. కానీ ఇంగ్లీష్ విజయాన్ని ప్రజలకు చేరవేయడానికి నాలుగురోజుల సమయం పట్టింది. ఈ లోగా టెన్షన్తో కన్నుమూసేవారు కూడా లేకపోలేదు..
స్పాట్
ఇటువంటి సందర్భాలలో అత్యవసర వార్తలు దూరప్రాంతానికి చేరవేయడానికి ఒక వార్తావాహకం తప్పని సరని గుర్తించిన్రు శాస్ర్తవేత్తలు.
స్పాట్
క్రిస్టియన్ ఆస్టర్డ్ అనే శాస్ర్తవేత్త..ఈ టెలీ కమ్యునికేషన్ అవసరాన్ని తీర్చిన మేథావి. ఈయనకు వాల్టా విద్యుత్ మిషన్ చాలా సహకరించిందనే చెప్పాలి..ఆస్టర్డ్ చేసిన ఒక యాదృచ్ఛిక చర్య వలన ఓ ఆద్భుత పరికరం ఆవిష్కరించబడింది..కాకతాళీయంగా ఆస్టర్డ్ ఆరోజు ఆ చిలిపి పని చేయకపోతే ఈ రోజు మన చేతిలో సెల్ ఫోన్లు ఉండేవి కావేమో..ఇంతకీ క్రిస్టియన్ ఆస్టర్డ్ చేసిన పనేంటి..
స్పాట్
క్రిస్టియన్ ఆస్టర్డ్ తన ప్రయోగ శాలలో ఒక తీగచుట్టతో ప్రయోగాలు చేస్తున్నడు.. అప్పటికే ఉన్న ఓల్టా బాటరీతో రకరకాల ప్రయోగాలు చేసి కొత్త విషయాన్ని కనిపెట్టాలన్న ఉత్సాహంలో ఉన్నడు.. కానీ అతని పక్కనే ఉన్న మాగ్నటిక్ కంపాస్ లో మాగ్నటిక్ బార్ ఒక్కోసారి దిశమార్చుకోవడాన్ని గమనించాడు..కానీ ఆ పరిణామం.బల్లా కదలికల వల్లనే అని భావించిండు. కానీ కొంత సేపటికి కేవలం వైర్లకు విద్యుత్ అమర్చినపుడు మాత్రమే ఈ మాగ్నటిక్ ఇండికేటర్ మూవ్ కావడాన్ని ఆస్టర్డ్ గుర్తించిండు.. అనుమానం వచ్చింది..ఈ వైర్లకు మాగ్నట్ కు ఏదో సంబంధముందన్న విషయాన్ని పసిగట్టాడు ఆస్టర్డ్.
స్పాట్
ఈ కంపాస్ కు తీగచుట్టకు మధ్యసంబంధాన్ని కనిపెట్టేందుకు మరికొన్ని పరిశోధనలు చేశాడు.. తీగ చుట్టలో విద్యుత్తు ప్రసరింపజేసినపుడు అడ్డంగా కదిలిన కంపాస్ ఇండికేటర్..కరెంట్ ఆపినపుడు తిరిగి నిలువుగా ఉంటుంది. దీన్ని బట్టి తీగచుట్టలో కూడా కరెంట్ ప్రవహిచినపుడు మాగ్నట్ వస్తుందని రుజువు చేసుకున్నడు ఆస్టర్డ్.
స్పాట్
ఈ పరిశోధనలు ఆస్టర్డ్ రాయల్ సొసైటీకి పంపిండు.. ఇవి సైన్స్ సొసైటీతో ఆమోదం పొందినయి. తరవాత కొన్ని సంవత్సరాలకు ఈ కంపాస్ ఇండికేటరే టెలీగ్రాఫ్ గా మారింది. ప్రపంచ శాస్ర్తవేత్తలు ఆశించిన టెలీకమ్యునికేషన్ కు బీజాలు పడ్డయి.
స్పాట్
ఈ టెలీగ్రాఫ్ పరికరంలో ఒక్కో అక్షరానికి సంబందించిన ఇండికేటర్ కు ఒక్కో మోతాదు విద్యత్ను పంపిస్తరు. దానితో a బటన్ నొక్కితే దానికి సంబందించిన ఇండికేటర్ ఆ మేరకే మూవ్ అయి పంచ్ చేస్తది..అలా a to z అక్షరాలకు వివిధ రకాల ఓల్టేజ్ బటన్ లు ఏర్పాటు చేసిన్రు. దీంతో బటన్ ప్రెసింగ్ను బట్టి ఇంటికేటర్ మూవ్ అవడాన్ని బట్టి ఏఏ లెటర్ లు వచ్చాయో తెలుసుకోవచ్చు..దీంతో క్షణాల్లో ఖండాంతరాలకు సమాచార వ్యాప్తి జరిగే సౌకర్యం కలిగింది. ఈ టెలీగ్రాఫ్ కేబుల్స్ విశ్వవ్యాప్తంగా విస్తరించినయి.
స్పాట్
టెలీగ్రాఫ్ తరువాత మళ్లీ స్టీమ్ ఇంజన్ తో మరో అతిపెద్ద ప్రయోగం చేసిన్రు. ఇది మానవాళి చరిత్రను మలుపు తిప్పిన ఘట్టం.
స్పాట్(రైల్ జర్నీ విజువల్స్)
స్టీమ్ పవర్ పెద్దపెద్దపనులు చేయగలదన్న సత్యాన్ని గుర్తించిన్రు పరిశోధకులు. మైన్స్ తవ్వకాలలో, వస్ర్తపరిశ్రమలో, ఇతర పారిశ్రామిక ప్రయోజనాలలో స్టీమ్ ఇంజన్ ఎంతో కీలకమైన పాత్రపోషించింది. టెలీగ్రాఫ్ కేబుల్స్ మాదిరిగానే రైల్వే లైన్స్ కూడా విశ్వవ్యాప్తంగా విస్తరించినయి. టెలీగ్రాఫ్, రైల్వే ట్రాక్ లు రెండూ 19వ శతాబ్దపు ప్రగతిని మరింత వేగంగా ముందుకు వెళ్లేందుకు సహకరించినయి.
స్పాట్
19 శతాబ్దానికల్లా యూరప్ లో అంతకు ముందున్న అపోహలు చాలా తొలిగిపోయినయి. సాంకేతిక శాస్ర్తం ప్రజల్లోపూర్తి స్థాయి అవగాహన వచ్చింది. శాస్ర్తవేత్తలు రైలింజన్, టెలీగ్రఫ్ లు ఇచ్చిన ఫలితాలతో మరింత ఉత్సాహంతో ప్రయోగాలు చేయనారంభించిన్రు. అంతేకాదు వీటికంటే బలమైన శక్తిని కనుక్కోవలన్న తపన పెరిగింది.
స్పాట్
అయస్కాంత దిక్సూచిలో కదిలే చిన్నముల్లు టెలీగ్రాఫ్కు బీజాలు వేసింది. ఈ సూచిక కదలడం వెనక రెండు బలమైన శక్తులు పనిచేశాయన్నది శాస్ర్తవేత్తలు గుర్తించిన సత్యం..అవే అయస్కాంత శక్తి, విద్యుత్ శక్తి. ఈ రెండింటిని విడదీస్తే ఏ చలనమూ ఉండదు. ఈ రెండు శక్తులు కూడా బలమైనవే..దేనికదే సాటి..ఎలక్ర్టిసిటీ మల్టీ పర్పస్ పవర్. ఇది స్పార్క్ లను ప్రొడక్ట్ చేస్తది. షాక్ ను ప్రొవైడ్ చేస్తది. వెలుతురునిస్తది. అదేవిధంగా అయస్కాంతం కూడా సముద్రయానం చేస్తున్న నావిగేటర్ లకు దిక్కులను సూచిస్తది. ఈ రెండు శక్తులు ఒక్కచోట చేరి మరో కొత్త బలమైన శక్తిని ఉత్పత్తి చేసినయి.
అదే “విద్యుదయస్కాంత శక్తి” ఎలక్ర్టో మాగ్నటిక్ ఫోర్స్. ఈ శక్తి మొత్తం 19 శతాబ్దాన్నే శాసించిందని చెప్పొచ్చు. ఎలక్ర్టో మాగ్నటిజం కేవలం ఎలక్ర్టిసిటీ, మాగ్నట్ పవర్ నే కాకుండా ప్రాకృతిక కాంతిని, రేడియో తరంగాలను, x రేల గురించి విపులంగా తెలుసుకునే అవకాశం లభించింది. 19వ శతాబ్దపు సైన్స్ ఆవిష్కరణలకు ఈ శక్తి మహామంత్రంలా పనిచేసింది.
స్పాట్
అవి 20వశతాబ్దపు తొలి రోజులు..ఊహించని రీతిలో ఓ కొత్త మూలకం ఆవిష్కరించబడింది. ఆ మూలకం విశ్వవ్యాప్తంగా అన్ని పత్రికల్లో పతాక శీర్షికల్లో నిలిచింది.
స్పాట్
చిమ్మ చీకటిలో చల్లని వెలుగులు పంచే వస్తువు..అది ఓ భూతమో..మాయా మంత్రంమో కాదు..ఎటువంటి నిప్పులు లేకుండానే వెలుగు చిమ్మగలదు.. ఆ పదార్ధానికి ఆ శక్తి ఎక్కడిది. ఆ శక్తే రేడియోధార్మిక శక్తి… ఈ శక్తి అద్భుత విన్యాసాలు చేయగలదు. చీకట్లో మెరవగలదు. ఫోటోగ్రాఫిక్ ప్లేట్లపై వింత వింత ఆకారాలను సృష్టించగలదు. ఇందులో ఏదో అద్బుత శక్తి దాగుందని గుర్తించిన్రు శాస్ర్తవేత్తలు. రేడియం పదార్ధానికి అంత గుర్తింపు రావడానికి కారణం దానికున్న ప్రత్యేక లక్షణాలే. ఇది చీకట్లో నిరంతరాయంగా వెలుగులు చిమ్మగలదు. ఆ శక్తిని ఎలా వినియోగించుకోవాలన్న అన్వేషణలో పడ్డరు.
స్పాట్
చీకట్లో వెలుగులు చిమ్మే ఈ రేడియో థార్మిక పదార్ధంతో వివిధ రకాల వాణిజ్య వస్తువులు, అత్యంత ఖరీదైన, ఆకర్షణీయమైన వస్తువులు తయారు చేసిన్రు. 1920లోనే వీటికి బహుళ ప్రజాదరణ లభించింది. యునైటెడ్ స్టేట్స్ లో రేడియం వస్తువులంటే.. సంపన్న వర్గాలు హోదాకు సంబంధించిన అంశంగా భావించేవారు. ఇది రేడియం పూత నీళ్ల కుండ..చీకట్లో వెలుతురు లేకుండా నీరు తెచ్చుకునేందుకు పనికొస్తుంది. ఈ పరికరం ప్రత్యేక గుర్తింపు కలిగిన వస్తువు వద్ద ఉంచితే రాత్రి వేళల్లో ఆ వస్తువును గుర్తించే వీలు కలుగుతుంది. ఇన్ని సంవత్పరాల తరువాత కూడా ఈ పదార్ధం ఇంకా రేడియో ధార్మిక ఉద్ఘారాలను వెలువరిస్తూనే ఉన్నది. ఇది రేడియం వాటర్ ప్రూఫ్..ఇది రేడియం తూత్ పేస్ట్ ట్యూబ్ ఇందులో తూత్ పేస్ట్ నింపుకొని వాడుకుంటరు. ఇది హీట్ పాడ్, వివిధ రకాల ఆటవస్తువులు, సిగరెట్ పెట్టెలు (ఆఖరుకు కండోమ్ (ఇష్టం లేకుంటే చదవొద్దు)) లు కూడా రేడియం పూతపూసిన వస్తువులతో తయారు చేశారు. వాస్తవానికి ఇప్పుడు మనం చూసిన వస్తువులన్నీ కేవలం అలంకరణకు, హోదాకు సంబంధించినవే..ఇంతేనా..రేడియం పని ఇదేనా.. దీనికి ముందు అసలు ఈ రేడియో ధార్మిక పదార్దపు వెలుగులు ఎలా వెలుగు చూశాయో చూద్దాం.
స్పాట్
రేడియం అనే అద్భుత పదార్ధం ఆవిష్కరణ చేయగలిగిన వ్యక్తి మేడమ్ క్యూరి ఆమె భర్త పీయరీ. ఈ పదార్ధాన్ని కనుగొన్నందుకు వీరిని గుర్తింపు లభించేందుకు చాలా కాలమే పట్టింది. మేడమ్ క్యూరీ రేడియంను కనుక్కోంది కానీ పియరీ మాత్రం దీని పై రకరకాల ప్రయోగాలు చేసిండు. దీని శక్తి సామర్ద్యాలను లెక్కగట్టిండు.
స్పాట్
రేడియో ధార్మిక పదార్ధం శక్తి ఎంతో తెలిసి శాస్ర్తవేత్తలు ఆశ్చర్యపోయిన్రు. ఒక గ్రాము రేడియం ఒక టన్ను మంచును నీటి ఆవిరిగా మార్చగల శక్తి ఉత్పత్తి చేయగలదు. అంతేనా ఒక టన్ను రేడియం ఒకటిన్నర మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
స్పాట్
రేడియం వల్ల అంతా బాగానే ఉన్నా..శాస్త్రవేత్తలకు ఈ పదార్ధమొక చిక్కు ప్రశ్నగా మారిపోయింది. ఇది భౌతిక శాస్ర్త నియమాలకు పూర్తి విరుద్దంగా ఉందని భావించిన్రు. ఎందుకంటే ఉష్ణగతిక శాస్ర్తమొదటి నియమం “శక్తినిత్యత్వసూత్రం” ప్రకారం శక్తి ఒక రూపం లోంచి మరొక రూపంలోకి మారుతుందే తప్ప సృష్టించ బడదు, నశింపబడదు. ఒక వేళ ద్రవ్యరాశి నశిస్తేనే శక్తి రూపంలోకి మారాలి. కానీ ఇక్కడ వెలువడుతున్న శక్తి ఎక్కడిది. దీన్ని ఉత్పత్తి చేసే శక్తి ఏంటి.. ఇది శాస్ర్తవేత్తలకు పెద్ద సవాలుగా మారింది.
స్పాట్
ప్రపంచ శాస్ర్తవేత్తలందరూ రేడియో ధార్మికతను క్షుణ్నంగా అధ్యయనం చేసిన్రు. దీనిలో ఏదో ప్రత్యేకత ఉందన్న విషయాన్ని గుర్తించిన్రు. రేడియో ధార్మిక పదార్ధం శక్తిని ఉద్గారం చేస్తుంది కానీ ఇది మరో రూపంలోకి మారుతుంది. ఉదాహరణకు రేడియం సీసంగా మారుతుంది. అంటే రేడియం సీసంగా మారడానికి ఎంతో కాలంపడుతుంది. సీసంగా మారిన రేడియం ఒరిజినల్ దానికంటే చాల తక్కువ బరువుంటది. అంటే అది కాంతిని ఉద్ఘారం చేసి తన బరువును కోల్పోతుందన్నమాట. అంటే ఆ వెలువడే శక్తి రేడియం యొక్క ద్రవ్యరాశి రూపమేనన్నమాట. ఇంతకీ ద్రవ్యరాశికి, కాంతికి లింకేంటి..ఆ విషయాన్ని తేల్చేందుకు ఒక మేథావి నడుంబిగించిండు. ఆయనే ఆల్బర్ట్ ఐన్స్ స్టీన్.
స్పాట్
ఐన్స్ స్టీన్ ఒక విశ్వవ్యాప్త సూత్రాన్ని ప్రతిపాదిచిండు.. పదార్ధం సృష్టిచబడు..నాశనం చేయబడదు..దాన్ని సింపుల్ గా E=mc sqare..అనే ఫార్ములాతో వివరించిండు..దీని ప్రకారం రేడియం నుంచి వచ్చే కాంతి కిరణాలు ఒక మాజిక్ శక్తికాదు..అవి రేడియం పదార్థం తరగడం ద్వారా వచ్చే కిరణాలే..అంటే ఆ కిరణాల్లో ద్రవ్యరాశి ఉందన్నమాట.
స్పాట్
ఈ శక్తి నిత్యత్వ సూత్రం ప్రతి దానికీ అప్లికబుల్ అని తెలిపిన్రు శాస్ర్తవేత్తలు. అది స్టీమ్ ఇంజన్ అయినా, విండ్ మిల్, జీవులు, నక్షత్రాలు, గెలాక్సీ ఏవైనా కావచ్చు అన్నీ ఐన్ స్టీన్ శక్తి నిత్యత్వ సూత్రానికి లోబడి పనిచేసేవే..
స్పాట్
E=MC squar అనే ఫార్ములా నుంచి అణుశక్తి, ఆటంబాంబ్ తయారీకి దారి తీసింది. ఈ అణుశక్తి గురించి తెలుసుకోవాలంటే తిరిగి 19వ శతాబ్దానికి వెళ్లాల్సిందే..
స్పాట్
విద్యుదయస్కాంత శక్తి ఫలితాలు కేవలం శాస్ర్తవేత్తలకు, పారిశ్రామిక వేత్తలకు మాత్రమే ఉపయోగ పడ్డాయి. కానీ సగటు మానవుడికి ఇవి ఏ రకంగానూ ఉపయోగ పడలేకపోయాయి. కారణం బయటిప్రపంచంలో స్టీమ్ ఇంజన్ లు టెలీగ్రాఫ్ లు ఉన్నప్పటికీ జీవనగమనంలో మానవుడికి వెలుతురు నిచ్చే వ్యవస్థలేదు. అందుకే ఇళ్లలో చీకటిని తరిమేందుకు గ్యాస్ లైట్లు, కాండిల్స్, కొలిమి మంటలపై ఆధారపడేవారు. మరి ఎలక్ర్టి సిటీ, మాగ్నటిజం కలిసి ఎలక్ర్టో మాగ్నటిజం గా మారి మన జీవితంలో ఏ రకమైన మార్పు తెచ్చింది. ఇదే ప్రశ్న ఆయిర్ స్టడ్ అనే శాస్ర్తవేత్తను వేదించింది. అందుకే ఆయన దీన్ని మానవ అవసరాలకు మళ్లించే ప్రయత్నం చేసిండు.
స్పాట్
ఆయిర్ స్టడ్ అనే శాస్ర్తవేత్త ప్రవహించే విద్యుత్తుకు అయస్కాంత లక్షణాలుంటయని గుర్తించిండు. బ్రిటీష్ శాస్ర్తవేత్త మైఖేల్ ఫారడే కూడా ఈ విద్యుదయస్కాంత సూత్రాల పై తన పరిశోధనలు ప్రారంబించిండు. ఈయన పరిశోధన ప్రకారం కదిలే అయస్కాంతంలోంచి విద్యుత్ పుడుతుంది. అంటే ఎలక్ర్టిసిటీ నుంచి మాగ్నట్ ను, మాగ్నట్నుంచి ఎలక్ర్టిసిటీని ఉత్పత్తి చేయవచ్చన్న నిజం తేలిపోయింది. అంతే కరెంట్ ప్రవహించే విద్యుత్తు తీగ చుట్టవద్ద మాగ్నటిక్ వీల్ ను అమర్చి మొట్ట మొదటి ఎలక్ర్టిక్ మోటార్ ను తయారు చేసిన్రు. అదే సందర్భంలో మాగ్నట్ వీల్ ను వేగంగా తిప్పగలిగితే దాని చూట్టూ ఉన్న తీగ చుట్టలో విద్యుత్తు ఉత్పత్తి అవుతుందనే విషయం కూడా రుజువయింది. దీన్నే ఎలక్ర్టో మాగ్నటిక్ ఇండక్షన్ అని పిలుస్తరు.
స్పాట్ (నయారగా జలపాతం విజువల్స్)
ఇది నయాగరా జలపాతం. ప్రపంచంలో అత్యంత జలప్రవాహ శక్తి గల జలపాతం ఇది.
స్పాట్(జలపాతం)
ఈ జలపాతంలో నిముషానికి 150మిలియన్ ల లీటర్ ప్రవహిస్తుంటది. ఇందులో అసలైన ప్రకృతి శక్తి దాగుంది. ఈ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చాలన్న ఆలోచన వచ్చింది శాస్ర్తవేత్తలకు..ఇంతకు ముందు తీగచుట్టమద్యలో ఉన్న అయస్కాంతాన్ని నిరంతరం కదిలించ గలిగితే విద్యుత్తు ఉత్పత్తి అవుతుందన్న సూత్రాన్ని ఆధారం చేసుకొని.. ఈ జలపాతం ఆ అయస్కాంతాన్ని నిరంతరం కదిలించ గలిగితే అదే శక్తి ఉత్పత్తి చేస్తుందనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే విద్యుత్తు ఉత్పత్తికి దారిచూపింది.
స్పాట్
ఇది విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం. ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నవాటిని టర్బైన్ లు అని పిలుస్తరు. ఇందులో ఉన్న పెద్ద పెద్ద అయస్కాంతాలను ఈ మహా ప్రవాహం నిరంతరాయంగా తిరగేలా చేస్తుంది. ఇక్కడ తయారయ్యే విద్యుత్తు మిలియన్ బల్బులను వెలిగించేంత శక్తి వంతమైనది. కానీ విద్యుత్తును ఒక చోట నుంచి మరొక చోటకు వైర్ల ద్వారా పంపించినపుడు అది గమ్యన్ని చేరుకునే సరికి పూర్తి సామర్ధాన్ని కోల్పోతుంది. ఈ సమస్యను నయాగరా అధిగమించింది. లోవోల్టేజి సమస్యతీరడంతో నగరాలన్నీ విద్యుత్ కాంతులతో వెలుగులు విరజిమ్మినయి. 1896లో తొలి కరెంట్ బల్బ్ తన ప్రతాపాన్ని చీకటిలోకానికి చూపింది.
స్పాట్
విద్యుత్తును కేవలం వెలుతురు కోసమే కాక అన్నిరంగాలలో వాడటం అలవాటు చేసుకున్నరు. అంతే కాదు ఈ విద్యుత్తు సరిపోక అణువిచ్చేదనం వల్ల వచ్చే విద్యత్తును ఉపయోగించేందుకు అన్వేషిస్తున్నడు మానవుడు..ఈ ప్రగతి బాటలో భూమిని రాత్రి వేళలో ఇతర గ్రహాలనుంచి గమనిస్తే విద్యుత్ కాంతులవల్ల రెండో సూర్యుడిలా కనిపిస్తుందని శాస్ర్తవేత్తలు చమత్కరిస్తరు. అవును విశ్వాంతరాళంలో ఉన్న సమస్త శక్తిని వినియోగించుకునేందుకు మానవుడి నిరంతర అన్వేషన కొనసాగుతూనే ఉన్నది.
స్పాట్…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి