4, మార్చి 2011, శుక్రవారం

ది సైన్స్ ఎపిసోడ్ ఇరవై రెండు

ఎ.జనార్ధన్
ఇంట్రో యాంకర్
రిపీట్ యాంకర్
యాంకర్ 1
కోటలాంటి ఇంటి విజువల్ తో స్టార్ట్
వాయిస్
ఇంగ్లండ్..ఇటలీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మహానగరం...ఈ దేశం జాతుల పోరాటం, తెగలపోరాటం, రాజకీయ ఎత్తు జిత్తులతో నిండిన దేశం.
స్పాట్
17వ శతాబ్దంలో ఇంగ్లండ్ లో సివిల్ వార్ మొదలయింది..పాత కొత్తల మధ్యతీవ్రమైన వైరుధ్యాలు... వత్తిళ్లు.(చిన్న స్పాట్)సరిగ్గా అదే సమయంలో లండన్ ఫిజీషియన్ ఓ విషయం గురించి తీవ్రసంఘర్షణకు లోనవుతున్నడు.
యాంకర్ 2
విలియం హార్వే ఒక భవిష్య దార్శినికుడు. తాను నమ్మిన సిద్దాంతం నిజమని నిరూపించేందుకు రేయింబవళ్లు కష్టించి పనిచేసి తానేంటో నిరూపించిండు. నిజానికి అప్పటికే గాలన్ చేసిన పరిశోధనలే ప్రాతిపదికగా యావత్ ప్రపంచం వైద్యరంగం పై ఆధారపడి ఉన్నది..కొన్ని విషయాల్లో గాలన్ తప్పుడు అంచనాలు వేసాడని నిరూపించిన వ్యక్తుల్లో హార్వే ఒకరు.
స్పాట్(చేతిలో గుండె పట్టుకున్నవిజువల్స్)
వాయిస్
పాద్వా యూనివర్సిటీ ఎందరో మేథావులను తయారు చేసింది. అందులో వైద్యవిధ్యను అభ్యసించిన వ్యక్తి హార్వే . హార్వే అస్తమానం తన ప్రశ్నలతో ప్రొఫెసర్ లను వేధించేవాడు. తనకు ఎంతో తెలుసుకోవాలని, ఏదో కనిపెట్టాలన్న తపన ఎక్కువగా ఉండేది. గాలన్ సిద్దాంతాలను వెసేలియస్ కొన్ని సరిదిద్దిండు. మిగిలిన వాటిని సరిదిద్దేందుకు శ్రీకారం చుట్టిండు హార్వే. పరిశోధన ప్రారంబించిండు.
స్పాట్( ఫ్లెష్ విజువల్స్)
హార్వే ప్రకారం రక్తం కాలేయంలో తయారవుతది. ఆ రక్తాన్ని మిగతా శరీరబాగం వినియోగించుకుంటది. ఈ విషయం పై హార్వే నిరంతర పరిశోధనలలు కొనసాగించిండు. దీని కోసం హార్వే బ్రతికి ఉన్న జంతువుల పై, కళేబరాలపై పరిశోధనలు సాగించిండు.(హార్ట్ లోకి గాలి ఊదేసీన్) హార్వే పరిశోధనలల్లో అతని బాగా పేరు తెచ్చింది, చెప్పుకోదగ్గది రక్త ప్రసరణ వ్యవస్థ పై చేసిన ప్రయోగం..హర్వే రక్త ప్రసరణ విధానాన్ని, పరిమాణాన్ని లెక్కగట్టిండు. ఒక రోజులో గుండెలో ఎంత రక్తం ప్రవహిస్తుందో కూడా లెక్కగట్టిండు.
స్పాట్
హార్వే చేసిన ప్రయోగాన్ని ఇక్కడ ఒక శాస్త్రవేత్త తిరిగి చేస్తున్నాడు చూడండి. సరిగ్గా మానవుడి గుండె పరిణామం ఉండే పంది గుండెను సేకరించిండు. అందులో చూడడానికి రక్తపు లక్షణాలున్న ఒక చిక్కని ద్రావణాన్ని నింపిండు. గుండె పూర్తిగా నిండిన తరువాత ఆ ద్రావణాన్ని తిరిగి కొలజాడిలో పట్టిండు. దానిని బట్టి గుండెలో ఎంత రక్తం పడుతుందో అంచనా గట్టిండు. దాన్ని రెండు ఔన్స్ లు అని నిర్దారించుకున్నడు.
స్పాట్
గుండె కొట్టుకోవడాన్ని బట్టి రక్త ప్రసార పరిమాణాన్ని లెక్కించిండు హార్వే. గుండె గంటకు.. ఎంత రక్తాన్ని పంప్ చేయగలదో కూడా లెక్కించిండు. హార్వే లెక్కల ప్రకారం గుండె రోజుకు 4000ల లీటర్ల రక్తాన్ని పంపు చేయగలదని లెక్కించిండు. అంటే గుండె ఒక్క రోజులో ఇక్కడ కనిపిస్తున్న టిన్ లన్నీ రక్తంతో నింపేసేటంత పనిని చేస్తుందన్నమాట. చూశారా ఇక్కడ ఎన్ని పీపాలున్నయో..అంటే మన శరీరం వెచ్చగా ఉండి, అన్నీ జీవక్రియలు సక్రమంగా జరగాలంటే రోజుకు ఇంత రక్తం ప్రసారం అయి తీరాల్సిందే నన్నమాట. ఇది నిజంగా నమ్మలేని నిజం..
స్పాట్
హార్వేని ఒక ప్రశ్నవేధించింది. గుండె రక్తాన్ని పంపు చేస్తోందా…లేక రక్తం గుండె ద్వారా ప్రసారం అవుతున్నందున గుండె కొట్టుకుంటుందా అనే చిక్కుముడి పట్టుకుంది. అప్పటికే గుండె రక్తాన్ని పంప్ చేస్తుందన్న సిద్దాంతం బలంగా ఉంది అయినా కళ్లతో చూస్తేగానీ నమ్మే మనస్థత్వం కాదు హార్వేది.
స్పాట్
హృదయం ఒక అద్భుదమైన అవయవం..ఒక్క ముక్కలో చెప్పాలంటే గుండె అనేది ఒక మిస్టరీ అని కూడా శాస్త్రవేత్తల భావన. (గుండెల విజువల్స్)
యాంకర్ 11111
హార్వే 1500 సంవత్సరాల నుంచి శాస్ర్తవేత్తలు ఛేదించలేని ఒక నిజాన్ని ప్రపంచానికి అందించిండు. గుండె రక్తాన్ని ప్రతి అవయవానికి పంపిస్తుందన్న సత్యాన్ని రుజువు చేసిండు.
వాయిస్
హర్వే రక్త ప్రసరణ విధానం శరీర పనితీరుని చక్కగా వివరించింది. (కోసిన గుండె)
స్పాట్(గ్రాఫిక్స్)
వైద్యరంగంలో ఈ మార్పులన్నీ పర్స్పెక్టివ్ చేంజెస్ వల్ల సంభవించినవి చెప్పుకోవచ్చు. హార్వే చేసిన ప్రయోగాల వల్ల వైద్యరంగంలో ఓ నూతన ఒరవడి మొదలయింది. ఊహాజనిత సిద్దాంతాలకు కాలం చెల్లింది. ప్రయోగాత్మక సిద్దాంతాలకు తెరలేచింది.
స్పాట్(మిషన్)
ఈ గడియారం పాడ్వా యూనివర్సిటీ శిఖరబాగం పై 17వశతాబ్దంలో అమర్చిన్రు. ఈ పరికరం ప్రపంచగమనాన్ని తెలియజేస్తది. గెలీలియో, న్యూటన్ వంటి మహామేథావులు పర్యవరణాన్ని శాసించే శక్తులను కనుగొనే ప్రయత్నం చేసిన్రు. వీరు చేసిన ప్రయోగాలు గణితాత్మకంగా ఉండటంతో ఖశ్చతత్వం ఉండేది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ నిర్మాణాలన్నీ గడియారం లోపలిబాగంలోనివి. కాగ్స్, పుల్లర్స్, వేయిస్, వంటి విడిబాగాలు గడియారం యొక్క సంక్లిష్టవ్యవస్థకు రూపం ఇచ్చినయి. ఈ గడియారం పనితీరు ప్రపంచాన్ని ఆశ్చర్యనికి గురిచేసింది. ప్రకృతి గమనం మొత్తం ఒక గడియారంలో ఇమిడిపోవడాన్ని నిజంగా ఆనాటి ప్రజలు నమ్మలేక పోయినరు. గడియారం యాంత్రిక చప్పుళ్లకు అనుగుణంగా ప్రకృతి కదలడం నిజంగా ఆనాటి పరిశోధకులను ఆశ్చర్యపరిచిన విషయం.
స్పాట్
గడియారం కనుగొనడంలో పూర్తిగా భౌతిక శాస్ర్త, గణిత శాస్ర్తనియమాలు దాగున్నయి.
స్పాట్
కచ్ఛితంగా గడియారంలో ఉన్న నిర్మాణానికి శరీర వ్యవస్థకు ఉన్న సారూప్యాన్ని బోరెల్లి ధృవీకరించిండు. శరీరవ్యవస్థను విడిబాగాలుగా అధ్యయనం చేసి దాని పరితీరును వివరించే ప్రయత్నం చేసిండు. శరీరం మొత్తం అస్థినిర్మాణాలతో జతపరచబడి ఉంటది. ఇవన్నీ తిరిగి కీళ్లతో జతపరచబడి ఉంటయి. వీటన్నిటి పై కండరాలు, నాడులు జతచేసి ఆపరేట్ చేస్తయి. ఈ పూర్తి వ్యవస్థను , కండర కదలికలను ప్రయోగాత్మకంగా వివరించే ప్రయత్నం చేసిండు బొరోలి. ఉదాహరణకు ఇక్కడ చూస్తున్న ఒక పరికరంలో శరీర నిర్మాణాన్ని పోలిన వ్యవస్థను తయారు చేసిన్రు. అస్థి పంజరం స్థానంలో చెక్కముక్కలు, కండరాల స్థానంలో తాళ్లు పెట్టి, ఒక స్థానంలో కదలిక మొదలు పెడితే శరీర అన్నిబాగాలలో ఏవిధంగా కదలిక వస్తుందో ప్రయోగాత్మకంగా వివరించిండు.
స్పాట్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి