31, మే 2011, మంగళవారం

సైన్స్ ఎపిసోడ్ 45

ఎ. జనార్ధన్
ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలు విప్పిచెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
యాంకర్ 1
పచ్చని పసిరికలను చూస్తే చంటి పాపలను చూసినట్టుంటది. ఎవరకీ హాని చేయవు. నేలలోదొరికే లవణాలతో, సూర్యరశ్మి, నీటితో బతికేస్తయి. మొక్కలు స్వయం పోషకాలు.. పాపం జీవజాతిని బతికించేది కూడా మొక్కలే.. ఇప్పటి వరకు ఇవే మనలో చాలా మందికి తెలిసిన నిజాలు. కానీ మొక్కల్లో కూడా మాంసాహారులున్నాయని, అవి కూడా అదును చూసి కాటేస్తాయని మీకు తెలుసా.. తెలియకుంటే ఇప్పుడు చెబుతా జాగ్రత్తగా వినండి. ఆదమరిచి ఉంటే నిండు ప్రాణాలు తీసి ఆబగా ఆరగించే మొక్కలున్నాయి. జాగ్రత్త..
స్పాట్ ( క్రిమినల్ ప్లాంట్స్) Plantas Carnivoras ఫైల్ వాడగలరు.
యాంకర్ 2
యస్.. మొక్కలు చంపుతాయి. ఏ మాత్రం దయా దాక్షిణ్యంలేకుండా నమిలి మింగేస్తయి. ఎందుకు ఏం. మొక్కలకు అంత కసి ఎందుకు.. అంటే అసలు సబ్జెక్ట్ లోకి వెళ్లాల్సిందే..
స్పాట్
వాయిస్
మొక్కలు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఎక్కువ శాతం మొక్కలు నేలలోని లవణాలను, గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ ను, నీటిని సూర్యరశ్మిని వినియోగించుకొని పిండిపదార్ధాలను తయారు చేసుకుంటయి. అయితే చాలా మొక్కలు నేల నుంచి నత్రజనిని సేకరించుకోలేవు. ఈ నత్రజని లోపం తగ్గించుకోవడానికి సృష్టిలో ఒక్కో మొక్కలు ఒక్కో రకమైన అమరిక ఉన్నది.
స్పాట్
లెగ్యుమినేసి మొక్కల్లో అంటే చిక్కుడు, వేరుశనగ వంటి మొక్కల్లో నత్రజని లోపం తగ్గించుకోడానికి వాటి వేరు బుడిపెల్లో రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటయి. ఈ రైజోబియం బ్యాక్టీరియా నేలలోని నత్రజనిని సశ్లేషించుకోగలవు. ఈ నత్రజనిని మొక్క వినియోగించుకుంటది. అదే సందర్భంలో బ్యాక్టీరియా కూడా మొక్కనుంచి ఆహారాన్ని పొందుతుంది. ఈ రకమైన జీవనాన్ని సహజీవనం అంటరు. అంటే రెండు జీవులు ఒకదానికొకటి ఆహారాన్ని ఇచ్చి పుచ్చుకుంటూ హాని చేసుకోకుండా జీవిస్తే దాన్నే సహజీవనం అంటరు.
స్పాట్
యాంకర్ .3
ఒకరికొకరు హాని చేసుకోకుండా సాగించే జీవనాన్ని సహజీవనం అంటరు. మరి ఒక జీవి పై మరో జీవి దాడి చేసి ధ్వంసం చేసి ఆహారాన్ని పొందితే దాన్ని పరాన్నజీవనం అంటరు. అవును పరాన్న జీవుల దాడిలో ఒక రకం జీవులు పూర్తిగా నాశనం కావడం లేదా పాక్షికంగా నశించడం జరుగుతది. దాని వల్ల ఏదో ఒక జీవికి నష్టం. ఇటువంటి నష్టం కలిగించే కోవకు చెందినవే కీటకాహార మొక్కలు.
స్పాట్
చిన్న చిన్న క్రిములను, కీటకాలను మరియు చిన్న జంతువులను తినే మొక్కలను కీటకాహార మొక్కలు లేదా మాంస భక్షణ మొక్కలు అంటరు. ఇవి చాలా ఆశ్చర్యకరమైనవి. ఈ మొక్కలు నత్రజని లోపించిన ముఖ్యంగా బురద నేలలలో పెరుగుతయి. ఇవి తమకు కావలసిన నత్రజనిని తయారుచేసుకోలేవు. అందువల్ల ఈ విధంగా క్రిమికీటకాలలో లభించే మాంసకృత్తుల మీద ఆధారపడతాయి. ఈ మొక్కల పత్రాలు కీటకాలను ఆకర్షించి, పట్టుకొని, చంపి, జీర్ణం చేసుకోవడానికి అనువుగా బోనులుగా రూపాంతరం చెందుతాయి. ఈ పత్రాలను 'బోను పత్రాలు' అంటారు. ఈ పత్రాలు వివిధ ఎంజైములను స్రవించడం వలన కీటకాలలోని ప్రోటీనులు విశ్లేషించి జీర్ణం చేయబడతాయి. జీర్ణం చేయబడిన ప్రోటీనులను ఈ పత్రాలు శోషిస్తాయి. ఇవి ఉత్తర, దక్షిణ కరోలినా ప్రాంతాల్లో కనిపిస్తయి.
స్పాట్
మొక్కలు కీటకాలను బంధించడం చాలా చిత్ర విచిత్రంగా ఉంటది. ఒక్కోసారి చాలా ఆశ్చర్యం వేస్తది కూడా. ఎందుకంటే ఇంత టెక్నాలజి తెలిసిన మనిషే వేటాడాలంటే ఎంతో ప్రయాస పడుతడు. అట్లాంటిది ఇంచు కూడా కదలలేని మొక్కలు ఎలా వేటాడగలవు.. రోజువారీ ఆహారాన్ని ఎలా పొందగలవు.
స్పాట్
వాస్తవానికి ఆహారం చెంతకు ఇవి వెళ్లవు. వీటి చెంతకే ఆహారం రావాలి. అవును ఇవి అలా ఆహారం నడిచి వచ్చేలా చేస్తయి. కీటకాలను ఆకర్షించడంలో ఒక్కో మొక్కది ఒక్కో ట్రిక్. కీటకాహార మొక్కల్లో డయోనియా దీనినే వీనస్ ఫ్లై ట్రాప్ అని కూడా అంటరు.
స్పాట్
యాంకర్ 4
వీనస్ ఫ్లై ట్రాప్ మొక్కలను వేటాడుతుంది. ఒక మొక్క కీటకాలను ఎలా వేటాడగలదు. ఇది నిజంగా చాలా ఇంట్రస్టింగ్ విషయం. ఎందుకంటే మొక్కలు తాము ఉన్న ప్రాంతం నుంచి అంగుళం కూడా కదల్లేవు. మనుషులే కీటకాలను పట్టాలంటే నానా ఇబ్బందులు పడుతరు. కానీ వేగంగా ఏగిరే కీటకాలను మొక్క ఎలా పట్టగలదు. ఇవే కదా మీ మెదడును తొలిచే ప్రశ్నలు. అవును మీరు ఊహిస్తుంది. నిజమే..కానీ కీటకాలను పట్టుకోవడం మొక్కలకు చాలా ఈజీ.. ఏలానో చూద్దాం..
స్పాట్
వీనస్ ఫ్టై ట్రాప్ కీటకాలను వేటాడే విధానం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. పిల్లలను పట్టే వాళ్లు, ఇంట్లో ఎలకలను పట్టే బోను ఎలా పనిచేస్తుందో అచ్చం అదే ఫార్ములాతో వీనస్ ఫ్లై ట్రాప్ కీటకాలను పడుతుంది. అంతేకాదు వీనస్ ఒక్క కీటకాలనే కాదు. కాటర్ పిల్లర్ లను, కప్పలను బల్లులను కూడా వదలదు. ఇంతకీ ఈ వీనస్ ఫ్లై ట్రాప్ కీటకాలను ఎలాపడుతుందో తెలుసుకుందాం.
స్పాట్
ఇదిగో ఇక్కడ చూడండి.. వీనస్ ఫ్లైట్రాప్ ఆకుల పై కొన్ని స్పర్శ కేశాలున్నయి. ఈ స్పర్శ కేశాలను ఒక సారి తడిమితే ఏ చర్యా ఉండదు. కానీ వెంట వెంటనే రెండు సార్లు తడిమితే రెండు దళాలు దగ్గరకి వత్తుకుంటయి. అప్పుడు దళాల్లో చివరలో ఉన్న పత్రకాలు ఆహారాన్ని తప్పిచ్చుకొని పోకుండా అడ్డుకుంటయి. విధిలేని సరిస్థితుల్లో ఆహారం అందులోనే చిక్కుకుంటుంది. ఒక్కసారి ఇందులో చిక్కిందా ఇక బతుకు పై ఆశలు వదులుకోవలసిందే. ఇందులో చిక్కుకున్న జీవికి నీళ్లు ఆహారం లేక చిక్కి శల్యమై చనిపోతుంది. కీటకాల శరీరం కైటిన్ అనే పెంకుతో తయారవుతుంది. ఈ ఖైటిన్ లో కాల్షియం ఉంటది. శరీరంలో ఉన్న నత్రజని ఫాస్పరస్ మూలకాలు మొక్క శరీర నిర్మాణానికి ఉపయోగ పడుతుంది. చౌడు భూముల్లో, బురద నేలల్లో పెరిగే మొక్కలకు పాస్ఫరస్, నత్రజని అవసరం.
స్పాట్
వీనస్ ఫ్టైట్రాప్ లో చిక్కుకున్న నత్తలు, కాటర్ ఫిల్లర్ లు, కీటకాలు ఈ మొక్కలకు ఆహారంగా మారుతయి. ఏవో కొన్న అదృష్ట జీవులు.. భూమి పై ఇంకా ఆహారం ఉన్న జీవులైతే చిన్నగా తప్పిచ్చుకుంటయి. బతకు జీవుడా అంటూ బాటపడతయి.
స్పాట్ (నత్త తప్పిచ్చుకునే సీన్)
యాంకర్ 5
ఇప్పటి వరకు వల వేయడం మనుషులకు మాత్రమే తెలుసనుకున్నాం. అంతేకాదు అదునుచూసు వల విసరడంలో సాలీడు కూడా నేర్పరే .. కానీ అంతకంటే అద్భుతంగా.. ఓర్పుగా నేర్పుగా వల విసరడంలో చమత్కారి సన్ డ్యూ ప్లాంట్. ఇంతకీ సన్ డ్యూ ఏంటి అనుకుంటున్నారా. చూడ్డానికి సూర్యుడిలా చుట్టూ కిరణాలు కలిగి ఉండి.. ఉదయపు వేళల్లో మంచుబిందువులను మోస్తున్న లేత ఆకుల్లా కనిపించేదే సన్ డ్యూ.. కానీ ఇది కీటకాల పాటిట యమపాశం.. ఈ డ్రోసిరా మొక్క కీటకాలను ఎలా పట్టుకుంటుందో ఓలుక్కేద్దాం..
స్పాట్
డయోనియా తరువాత మాంసాహార మొక్కల్లో చెప్పుకోదగ్గది డ్రోసిరా.. దీనినే సన్ డ్యూ అని కూడా అంటరు. పత్రం చుట్టూ కేశాలు మెరుస్తూ తెల్లని స్రావాన్ని కలిగిన బుడిపెలు ఉండి అచ్చం సూర్యుడిలా మెరుస్తూ మంచు బిందువులను మోస్తున్నట్టు కనిపించడం వల్ల ఈ మొక్కకు సన్ డ్యూ అనే పెరు వచ్చింది. ఈ సన్ డ్యూ మొక్కలలో చాలా రకాలున్నయి.
స్పాట్(వివిధ రకాల మొక్కల విజువల్స్)
సన్ డ్యూ , డ్రోసిరాగా పిలవబడే ఈ మొక్క టెంటకిల్స్ అత్యంత సున్నితంగా ఉంటయి. ఈ సున్నిత కేశాలకు అత్యంత బలీయమైన స్పర్శ జ్ఞానం ఉంటది. ఏదైనా కీటకం దగ్గరికి వచ్చినపడు ఒక విధమైన స్రావాలను ఉత్పత్తి చేస్తయి. ఈ స్రావం ఆయా కీటకాలకు అత్యంత ఇష్టమైన ఆహార పదార్దం వాసన వస్తది. కీటకాలు తమ టెంటకిల్ సాయంతో వీటి వాసనను గుర్తిస్తయి. వెంటనే అది నిజమైన ఆహారమేననే బ్రాంతిలో డ్రోసిరాను చేరుతయి. పై పెచ్చు మెరుపులు మెరిసినట్టు కనిపించడంతో ఆహారాన్ని గుర్తించడం తేలిక గా దొరికిందనే భ్రమలో ఉంటది కీటకం. అంతే ఈ కీటకం వచ్చి డ్రోసిరా ఒళ్లో వాలుతుంది.
స్పాట్
డ్రోసిరా పత్రాల దగ్గరకు వచ్చిన కీటకం పైకి టెంటకిల్స్ గమ్ వంటి స్రావాన్ని విసురుతయి. ఆ స్రావం కీటకాల కాళ్లకు అతుక్కొంటది. అలా ఒకదాని తరువాత ఒక టెంటకిల్ స్రావాలను విసరడంతో కీటకం బంధిచబడుతది. కీటకం టెంటకిల్స్ మద్యలో చిక్కుకున్న మరుక్షణమే డ్రోసిరా ఆ కీటకాన్ని చుట్టేస్తది. కీటకం ఎంత గింజుకున్నా తప్పించుకోలేదు. ఊపిరాడకుండా చుట్టేస్తయి టెంటకిల్స్. ఆహారం పూర్తిగా జీర్ణమయ్యాక అప్పుడు డ్రోసిరా తిరిగి యధాస్తితికి వస్తది.
స్పాట్
డ్రోసిరాలో రకరకాల జాతులున్నయి. జాతి జాతికో విధమైన పద్దతిని అనుసరిస్తయి. ప్రాంతాన్ని బట్టి, అవి పెరిగే నేలను బట్టి వివిధ రకాల జాతులను చూడొచ్చు. ఇతర దేశాలలో ఇటువంటి మొక్కలను కుండీలలో పెంచుతరు. తమ ఇళ్లలో తిరిగే వివిధ రకాల నుంచి రక్షణ పొందేందుకు ఈ మొక్కలు సహకరిస్తయి. అందుకే ఈ మొక్కలను చాలా మంది కుండీలలో పెంచుతారు.
స్పాట్ (కుండీలలో మొక్కలు)
యాంకర్ 6
డయేనియా, డ్రోసిరా మొక్కలు కీటకాలను ఎలా వేటాడుతాయో చూశాం..కానీ ఈ రెండింటికి భిన్నంగా కీటకాలు ఆయాచితంగా ఒళ్లో వచ్చి వాలే ట్రిక్ ఉందీ మొక్కదగ్గర. వద్దనుకున్నా సరిపోను ఆహారం సమకూరుతుంది. ఇంతకీ ఈ పిచ్చర్ ప్లాంట్ కు ఉన్న స్పెషల్ నిర్మాణాలేంటి. అసలీ నెపెంథిస్ మొక్క ఎలా కీటకాలను, ఇతర జీవులను వేటాడగలుగుతుంది. చూద్దాం..
స్పాట్
సన్ డ్యూ తరువాత పిచ్చర్ ప్లాంట్ మొక్క కూడా కీటకాహార మొక్కల్లో అతి ముఖ్యమైనది. ఒక్కసారి పిచ్చర్ ప్లాంట్ గురించి కూడా తెలుసుకుందాం.
స్పాట్ (Mouse gets eaten by Nepenthes carnivorous plant)( Carnivorous plant almost catches mouse)
పిచ్చర్ ప్లాంట్ చూడటానికి చిన్న కూజాలా ఉంటది. కానీ ఇది చిరు జీవుల పాలిట నరక కూపం అని చెప్పొచ్చు. దీన్న తాకిన ప్రతి జీవి ప్రాణాలపై ఆశలొదులుకోవలసిందే..
స్పాట్
ఈ పిచ్చర్ ప్లాంట్ ను నెపెంథిస్ అని పిలుస్తరు. ఇవి చాలా రకాలుగా ఉంటయి. కొన్ని ఆకు పచ్చరంగులోనూ.. కొన్ని ఎర్రని రంగులోను. మరికొన్ని తెలుపు మచ్చలు గ్రీన్ కలర్ లో ఉంటయి.
స్పాట్
ఈ పిచ్చర్ ప్లాంట్ నుంచి స్రవించే కొన్ని రకాల ద్రవాలు కీటకాలను ఆకర్షిస్తయి. ఈ మొక్కల పై ఉండే మొజాయిక్ సింబల్స్ కూడా కీటకాలకు ఆహారంలా కనిపిస్తయి. దీంతో కీటకాలు వాటి పై వాలిపోతయి. ఆశగా వాలిందా జీవితం పై ఆశలొదులుకోవలసిందే..
స్పాట్
ఈ కూజా లాంటి బాగం లోపల, కూజా వెలుపల మూతలా ఉన్న బాగంలో కూడా మైనం వంటి పూత ఉంటది. ఆశతో దీని పరిధి పై వాలిన జీవి కూజా వంటి బాగంలో పడిపోతుంది. ఈ కూజా లోపలి బాగంలో నీరుంటది. కీటకాలు నీటిలో పడి కొట్టుకొని కొట్టుకొని మరణిస్తాయి. లేదా.. అంచులను పట్టుకొని పైకి రావాలన్నా సాధ్యం కాదు ఎందుకంటే రెక్కలు తడిచిపోయి ఉంటయి. కాళ్లలో గ్రిప్ ఉండదు. మైనపు పూత వల్ల కీటకాలు గోడను పట్టుకొని ఎక్కడం సాధ్యం కాదు. తడిసిపోయిన రెక్కలతో ఎగరడం అంతకంటే సాధ్యం కాదు. ఇక జీవితాల పై ఆశలు కోల్పోవలసిందే.. అదే పిచ్చర్ ప్లాంట్ టెక్నిక్.
స్పాట్
పిచ్చర్ ప్లాంట్ లో ఎన్నో రకాలున్నయి. అయితే ఈ నెపెంథిస్ కూజాలో కీటకాలే కాదు.. రకరకాల జీవులు చేరుతయి. దీంట్లో ఎలుకలు పడ్డా ప్రాణాల పై ఆశలొదులుకోవలసిందే.. ఎంత పెద్ద జీవి పడితే ఈ మొక్కకు అంత ఉపయోగం. ఎందుకంటే కొన్ని సార్లు ఈ పిచ్చర్ ప్లాంట్ కూజాను కోసి చూస్తే వందల కొద్ది జీవులు బయట పడుతయి. ఇందులో కీటకాలు. నత్తలు, కాటర్ పిల్లర్లు, నీటి కప్పలు ఒకటేమిటి రకరకాల జీవులు ఈ చెట్టుకు ఆహారంగా మారాల్సిందే..
స్పాట్..
మొక్కే కదా.. పెద్ద జీవులయితే..దాని కూజాను చించుకొనిర బయట పడొచ్చుకదా అని అనుకుంటరు. కానీ దీని కూడా మందపాటి గోడలతో.. పీచు పదార్ధాన్ని కలిగి ఉంటది. చాలా గట్టిగా ఉంటుంది. అంత ఈజీగా తెగదు. అందుకే ఈ నెపెంథిస్ బారిన పడ్డ జీవులు చనిపోక తప్పదు.
స్పాట్
యాంకర్ 7
ఒక జీవి కదలాలంటే.. దానికి నాడీ వ్యవస్థ కావాలి, కండర వ్యవస్థ కావాలి., అంతేకాదు ఈ వ్యవస్థకు ఆదేశాలు జారీ చేసే మెదడు కావాలి. కానీ ఇవేవీ లేకుండానే మొక్కలు కీటకాలను హాం ఫట్ మని లాగేస్తున్నయి. చూడ్డానికే వింతలా ఉండే ఈ మొక్కలు ఇప్పటివి కావు. ఈ మొక్కలు అతి పురాతనమైనవి.
స్పాట్
పురాణాల్లో మాంసాహార వృక్షాల గురించిన ప్రస్థావన ఉంది. ఇవి పెద్ద వృక్షాలు. ఇవి ఏకంగా మనుషులనే మింగేవట. కానీ ఇప్పుడా జాతి వృక్షాలు లేవు. అక్కడక్కడా ఉన్నట్టు వార్తులు వస్తున్నా అవి కేవలం పుకార్లేనని రుజువయింది. నిజానికి ఈ మొక్కలకు నాడీ వ్యవస్థగానీ కండర వ్యవస్తగానీ, మెదడు కానీ లేకున్నా మొక్కల్లో ఈ రకమైన కదలిక నిర్మాణాలుండటం నిజంగా ఆశ్చర్యం గొలిపే విషయమే.
స్పాట్
జంతువులలో మాత్రమే కదలికలు ఉండటం మనం గమనించాం. కానీ మొక్కలు గాలికి మాత్రమే కదులుతయి. కానీ ఆహార సేకరణకోసం రకరకాల ట్రిక్స్ ప్లే చేసి జీవులను పట్టుకొని తమకు ఆహారంగా మర్చుకోవడం నిజంగా ప్రకృతి వింతే. మన ఇళ్లలో ఎలకలను పట్టుకోవాలన్నా ఎంతో కాలనికిగానీ ఒక బోన్ తయారు చేయలేకపోయాం. కానీ మొక్కల్లో ప్రకృతి ప్రసాదించిన బోను ఎంతో సమర్ధవంతం పనిచేస్తుంది.
స్పాట్
మాంసాహార మొక్కలు ఒక భూమి పైనే కాదు. నీటిలో కూడా ఉన్నవి . వీటిని యుట్రిక్యూలేరియా అని పిలుస్తరు. చూడ్డానికి అత్యంత సూక్ష్మంగా ఉన్నా ఇవి తమకున్న టెంటకిల్స్ సాయంతో ఆహారాన్ని ఈజీగా తమ బ్లాడర్ లోకి లాక్కొని ఆహారంగా తీసుకుంటది. ఈ వ్యవస్థ మొత్తం సూక్ష్మదర్శిని కింద పరిశీలించినపుడు మాత్రమే కనిపిస్తది.
స్పాట్
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ విశేషాలు మరిన్ని లేటెస్ట్ టాపిక్ తో మీ ముందుటా.. దిసీజ్ శోబన్. బైబై..
బ్రేక్

సైన్స్ ఎపిసోడ్ 44

ఎ. జనార్ధన్
ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలు విప్పిచెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
యాంకర్ 1
ఆదిమ మానవుడి కాలంలో ఒక నిప్పు తప్ప ఏ ఇంధనం అవసరం లేదు. అది కూడా అడవి తగల బడుతున్నపుడు నిప్పుతో అవసరాలు తీర్చుకునే వాడు. లేదా ఏదైన పిడుగు పాటుకు చెట్లపై మంటలు పుడితే నిప్పుతో మాంసాన్ని ఉడికించుకునే వాడు. అంతకు మించిన ఇంధనం అప్పుడు అతనికి అవసరం లేదు. కానీ మనిషి నాగరికత నేర్చుకున్నడు. కష్టపడకుండా సుఖంగా బతకడానికి అలవాటు పడ్డడు. ఈ నేల పై దొరికే రకరకాల ఇందనాలకు అలవాటు పడ్డడు. మొత్తంగా ఈ ప్రపంచాన్ని ఇప్పుడు నడిపించేది ఇంధనం..
వాయిస్
ఆదిమ మానవుడి కాలంలో కేవలం తనకు దొరికిన పచ్చి మాంసాన్ని కాల్చడానికే నిప్పును వాడే వాడు. కాల క్రమంలో చలినుంచి తనను కాపాడుకోవడానికి కూడా నిప్పు అవసరం ఏర్పడింది. ఎండు కట్టెలతో నిప్పు రాజేయడం నేర్చుకున్నడు. అప్పుడు అదే ఇంధనం.. కాల క్రమంలో సగం కాలగా మిగిలిన బొగ్గు కూడా ఇంధనంగా పని చేస్తదని తెలుసుకున్నడు.. కట్టెలు కాలగా మిగిలిన బొగ్గెకాదు.. భూగర్భంలో దొరికే రాకాసి బొగ్గుకూడా ఇంధనం గా పనికొస్తుందనే నిజాన్ని తెలుసుకునే సరికి వేల సంవత్సరాలు పట్టింది. ఇంధనం తన రూపాలు మార్చుకొని ఇంటిదీపంలోకి చేరింది.
స్పాట్
మనిషికి యాంత్రిక శక్తి జీవితంలో బాగంగా మారింది. యాంత్రిక శక్తిని నడిపించేది ఇంధనం. తొలుత గాలి వాటంతో వాహనాన్ని నడపడం నేర్చుకున్న మనిషి తరువాత క్రమేపీ బొగ్గుతో.. వాహనాలు నడపడం నేర్చుకున్నడు.. బొగ్గు తరువాత డీసిల్ , పెట్రోల్, కిరోసిన్ వంటి ఇంధనాలను తన అవసరాలకు ఉపయోగించుకున్నడు.
స్పాట్
ఈ ఇంధనాలే మనిషి చేసి కష్టమైన పనులు చిటికెలో చేయగలిగేలా చేసినయి. ఎంత కష్టమైన పనిని కూడా కాసేపట్టో చేయగల సత్తా ఉందంటే అది యాంత్రిక శక్తికే సాధ్యం.. ఒక రకంగా చెప్పాలంటే కొండను పిండి చేసే శక్తి ఇంధనాలకుంది.. ఈ ఇంధనాలన్నీ భూగర్భంలోనో.. సముద్ర గర్భంలోనో దొరికేవే.. కానీ ఎంత కాలం.. ఈ భూగర్భంలో ఉన్న ఇంధనం ఏదో ఒక రోజు అయిపోక మానదు..
స్పాట్
ఇంధనం కోసం మానవుడి అన్వేషణ సాగుతూనే ఉంది.. ఆ అన్వేషణలో ఎన్నో కొత్త రకం ఇంధనాలను, శక్తులను కనుగొన్నడు. ఇంధన వినియోగం పెరిగేకొద్దీ పొల్యూషన్ పెరుగుతూ పోతోంది. పరిశ్రమలకు, వాహనాలకు, గృహ అవసరాలకు ఇంధనమే అవసరం అవుతుంది. అందుకే ఇంధనం మనిషి జీవితంలో బాగమయింది. ఇంధనం లేనిదే మనిషి లేడు అన్న భావనకు వచ్చిండు.
స్పాట్
అయితే భూగర్భంలో ఉన్న ఇంధనమైనా .. సముద్ర గర్భంలో ఉన్న ఇంధనమైనా ఏదో ఒక రోజు తరిగిపోవలసిందే.. అలా ఇంధన వనరులన్నీ తరిగిపోతే.. ఇంధన ఆధారిత వాహనాలు పరిశ్రమలు ఏం కావాలి. ఉత్పత్తులన్నీ ఆగిపోవలసిందేనా.. కాలి నడకను, ఎడ్లబండిని ఆశ్రయించాల్సిందేనా..
స్పాట్
ఇదే భయం పట్టుకుంది మానవుడికి. అందుకే ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం అన్వేషించడం మొదలు పెట్టిండు. ఆ అన్వేషణలో రకరకాల శక్తులు దొరికినయి. సాంకేతిక శాస్ర్తం అభివృద్ది చెందడంతో మనిషి సహజ వనరులను వినియోగించుకోవడం అలవాటు చేసుకుండు. గాలి వాటం, నీటి శక్తి, గురుత్వాకర్షణ శక్తి, సౌర శక్తి ని ఇంధనంగా మలుచుకుండు. అలా పుట్టిందే విండ్ మిషన్, సోలార్ మిషన్, ఎలక్ర్టిసిటీ..
స్పాట్
యాంత్రిక శక్తిని వినియోగించుకోవాలంటే కేవలం డీజిల్, పెట్రోల్‌ ఒక్కటే ప్రత్యామ్నాయ మార్గం కాదు.. సౌరశక్తితో, విద్యుత్ శక్తితో కూడా మోటార్ ను నడపడం నేర్చుకున్నడు. వీటివల్ల కాలుష్యం తగ్గడంతో బాటు వనరులను కూడా కాపాడుకున్నట్టుంటది.
స్పాట్
యాంకర్ 11
పెట్రోల్.. డీజిల్ వంటి ఇంధనాలు దొరకడమేమో గానీ వాటి రేట్లు ఆకాశాన్ని తాకుతున్నయి. రోజు రోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్య మానవుణ్ని బెంబేలెత్తిస్తున్నయి. దీనికి ప్రత్యామ్నాయ మార్గమే లేదా.. అంటే ఉంది.. అదే సోలార్ పవర్.. ఎలక్ర్టిక్ పవర్.. సౌరశక్తితో యంత్రాలు నడపడమెట్లో ఓ సారి చూద్దాం..
స్పాట్
తరిగిపోతున్న వనరుల గురించి బెంగ పడుతున్న మానవుడికి ఓ కొత్త వనరు దొరికింది. ఇది ఎప్పటికీ తరిగిపోని వనరు. ఈ సృష్టి ఉన్నంత కాలం తరగని గని లాంటి నిధి అది. అదే సౌరశక్తి. అవును సౌరశక్తితో ఎన్నో అద్భుతాలు చేయొచ్చని నిరూపించిన్రు శాస్ర్తవేత్తలు. కాలుష్య రహిత ప్రపంచానికి తొలి అడుగు ఇక్కడే పడింది.
స్పాట్
ఎలక్ర్టిసిటీతో మోటార్లు నడిపించి పరిశ్రమల్లో వాడుకోవడం మనకు తెలుసుకానీ.. ఆటోమోబైల్స్ కూడా ఎలక్ర్టిసీతో నడపొచ్చా.. అంటే కచ్ఛితంగా నడపొచ్చు. కానీ కరెంట్ ఎక్కణ్నుంచి వస్తది. మొబైల్ మోటర్ అంటే నిల్వ ఉన్న విద్యుత్ ని వాడుకోవలసిందే.. అంటే చార్జింగ్ బ్యాటరీలతోనే వెహికిల్స్ నడుపుకోవాలి..
యాంకర్
ఎలక్ర్ట్రిసిటీతో వెహికిల్ నడుపుకోవడమంటే ఖర్చుతో కూడుకున్నదని చాలా మంది అపోహ.. ఎందుకంటే మనింట్లో ఫ్యాన్, వాషింగ్ మెషిన్ లకే కరెంట్ బిల్లు తడిసి మోపెడవుతది. మరి ఎన్నో సౌకర్యాలున్న కార్ ను నడపడానికి ఎంత విద్యుత్ కావాలి.ముందు ఒక బైక్ ను నడపడానికి ఎంత విద్యుత్ ఖర్చు అవుతదో తెలుసుకుందాం..
స్పాట్ (Solar Bike, Fujin DigInfo, Solar Cruising Bicycle, Solar Powered Bike, Endless sphere Electric Vehicle Technology Forums HD ) ఫైల్ యూజ్ చేసుకోండి.
ఇక్కడ జపనీయన్ చేతిలో ఉన్న సోలార్ ఎలక్ర్టిసిటీ బైక్ ను చూడండి. దీనికి కావలసిన విద్యుత్ సోలార్ ప్యానెల్ ద్వారా ప్రొడ్యూస్ అవుతది. ఈ సోలార్ ప్యానెల్ ను బైక్ వెనకాలే అమర్చిన్రు. సూర్యుడు ఉన్నపుడు సోలార్ ప్యానెల్ ద్వారా విద్యుత్ సమకూర్చుకోవచ్చు. దీనికి పెద్దగా ఖర్చు అయ్చేదేమీ లేదు. కానీ మబ్బులు పట్టినపుడు, రాత్రివేళల్లో మాత్రం ఇంట్లోనే విద్యుత్ ను ఉపయోగించుకొని రీచార్చ్‌ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీ పూర్తిగా చార్జింగ్ అయితే బైక్ పై 220 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు. ఇక విద్యుత్ బిల్లు విషయానికి వస్తే గంటకు ఒక ఎయిర్ కండీషన్ రన్నయితే ఎంత బిల్లు వస్తదో.. చార్జింగ్ సమయానికి అంతే బిల్లు వస్తది. జపాన్ యెన్ లలో చెప్పాలంటే 220కిలోమీటర్లకు రెండు యెన్ ల కరెన్సీ ఖర్చవుతది. ఇండియన్ కరెన్సీలో అయితే కేవలం ఒక్కరూపాయే అన్నమాట. ఎందుకంటే ఇందులో ఎక్కువ బాగం సోలార్ రూపంలో క్యాష్ లెస్ ఎనర్జీ సేవ్ చేసుకోవచ్చు.
స్పాట్
ఈ బైక్ ను ఉదయపు వేళలో ఆఫీస్ కు రావడానికి గానీ, లేదా కంపెనీలకు వెళ్లెటపుడు వాడుకొని మద్యాహ్న వేళలో చార్జింగ్ కోసం వదిలేయాలి. తిరిగి సాయంకాలం వేళ ఇంటికెళ్లే సమయానికి ఫుల్ గా చార్జింగ్ అయి ఉంటది. దీని వీల్స్ తక్కువ శక్తితో ఎక్కువ కాలం తిరిగే విధంగా తయారు చేస్తరు. అందువల్ల ఎక్కువ విద్యుత్ కూడా ఖర్చు కాదు. పై పెచ్చు బైక్ బాడీ మొత్తం ఫైబర్ తో తయారు చేయడం వల్ల ఇంజన్ పై బారం కూడా చాలా తక్కువ పడుతది.
స్పాట్
యాంకర్
చూశారుగా ఒక్కరూపాయి ఖర్చుతోనే చిన్న బైక్ పై ఎలా హాయిగా తిరుగుతున్నారో.. బైక్ సంగతి ఓకే.. మరి అంతే తక్కువ ఖర్చుతో నడపగలిగే కారుంటే బావుంటుంది కదూ.. అవును.. అందుకే ఇంజనీర్లు సోలార్ కారును తయారు చేసిన్రు. ఈ కారు కొనుక్కుంటే ఇక పెట్రోల్ కోసం పర్సులో చేయి పెట్టాల్సిన అవసరమే లేదు.
స్పాట్ (ఫోటోలు వాడుకో గలరు,
సౌరశక్తితో నడిచే కారు.. వింటుంటేనే కాస్త థ్రిల్లింగా ఉంది. కానీ ఇది ఎలా పనిచేస్తుందనే దాని పైనే అందరికీ అసక్తి.. ఎందుకంటే సైకిల్ షేప్ లో ఉన్న బైక్ అంటే ఓకే.. కానీ కారంటే మాటలా.. దాని ఇంజన్ను లాగాలన్నా.. అందులో కూర్చున్న వారిని లాగాలన్నా ఎంతో శక్తి అవసరం.. ఇంత శక్తిని రీచార్జి చేసుకోవాలంటే అంత ఈజీకాదు.ఇంతకీ సౌర విద్యుత్ కారు ఎలా నడుస్తుందో చూద్దాం.
స్పాట్ (GOOD Transparency Electric Vehicles) ఫైల్ వాడుకోవాలి.
ఎలక్ర్టిక్ కారు రిచార్ట్ కావాలంటే ఎంత విద్యుత్ అవసరం అనే విషయాన్ని పరిశీలించిన్రు. ఒక కారు 8 గంటల్లో ఫుల్ రీచార్జ్ అవుతది. గంటకు 2500వాట్ లు రీచార్జ్‌ అవుతది. అదే సమయంలో ఒక బల్బ్ 100 వాట్లు ఖర్చు చేస్తది. రీ చార్జి అయిన ఈ మొత్తం కరెంట్ సంవత్సరం ఉపయోగపడుతది. ఇది నాలుగు ప్లాస్మా టి.విలు సంవత్సరకాలం వాడిన విద్యుత్ తో సమానం. మరో ప్రశ్న ఇంట్లో కారు రీ చార్జి చేసుకుంటే ఎంత కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంటదనేది మరో ప్రశ్న..అయితే మైళ్లలో చూసుకుంటే. 100మైళ్లకు మూడు డాలర్లు ఖర్చు అవుతది. అంటే ఇండియన్ రూపీలలో అయితే 150 రూపాయలన్నమాట. అంటే మైలుకు రూపాయిన్నర అన్నమాట..అదే పెట్రోల్ కు అయితే 100 మైళ్లకు 10 డాలర్లు ఖర్చు అవుతది.రూపాయిల్లో అయితే 500లన్న మాట. కిలోమీటర్ కు 5 రూపాయలు ఖర్చవుతది.
స్పాట్
ఎలక్ర్టిసిటీ కార్ గురించి చెబుతుంటే బాగానే ఉంది. మరి దీన్ని రీచార్జ్ చేసుకోవడం ఎలా.. మన సెల్ ఫోన్ రీచార్జ్ చేసుకున్నట్టేనా.. ఇంకా ఏమన్నా చేయాలా అంటే.. అచ్చు మనం మన సెల్ ఫోన్ ను రీచార్జ్ చేసుకున్నట్టే రీ చార్జ్ చేసుకోవాలి. ఇప్పడు కార్ ను ఎలా రీ చార్జ్ చేసుకోవాలో చూద్దాం..
స్పాట్
ఎలక్ర్టిక్ కారును పగలు రాత్రి అనే తేడా లేకుండా 24 గంటల్లో ఎప్పుడైనా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ కార్లకు పెద్ద చెప్పుకోదగ్గ కార్భన్ పొల్యూషన్ ఉండదు కాబట్టి..నీట్ గానే ఉంటయి. కంబషన్ కూడా ఈజీ.. ఇకో ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు.
స్పాట్
ఈ వాహనాల వాడకం వల్ల బొగ్గు, సహజవాయువును ఆదా చేయొచ్చు.
స్పాట్
అంతా బాగానే ఉంది. ఇప్పుడున్న కార్లన్నీ ఎలక్ర్టిసిటీ కార్లుగా మారితే అందరికీ సరిపడా విద్యుత్ మన విద్యుత్ కేంద్రాలలో ఉందా.. వాస్తవానికి ఇండ్లలో అందరూ ఇదే పనిలో ఉంటే గృహావసరాలకు సరిపడా కరెంట్ ఉండదు. అందుకే గ్రిడ్ స్టేషన్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన్రు. ఈ స్టేషన్ లలో కార్ రీ చార్జ్ చేసి జస్ట్ క్రెడిట్ కార్డ్ తో స్క్రాట్ చేస్తే చాలు.. అచ్చు మన పెట్రలో బంకులో మాదిరి.. ప్రాబ్లెం సాల్వ్ డ్..
స్పాట్
ఒక్కోసారి ఇళ్లలో కరెంట్ ప్రాబ్లం వచ్చిందనుకోండి అప్పుడేం చేయాలి.. సరిగ్గా ఈ డౌటే వచ్చింది ఇంజనీర్లకు అందుకే సోలార్ రీ చార్జ్ కార్ ను తయారుచేసిన్రు. కారు బాడీలో ఎండ తగిలే ప్రాంతంలో సోలార్ ప్యానెళ్లను అమర్చిన్రు. ఈ సోలర్ ప్యానెళ్లలో నుంచి కావలసినంత విద్యుత్ ను రీ చార్జి చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఖర్చు ఉండదు.
స్పాట్
ఇవే కాకుండా ఎలక్ర్టో మాగ్నటిక్ ఫోర్స్.. గ్రావిటీ ఫోర్స్ వంటి వాటితో ఇంధనానికి ప్రత్యామ్నాయ శక్తులను తయారు చేస్తున్నరు. ప్రకృతి శక్తులైతే ఇప్పట్లో తరగక పోగా ఎంతో తక్కువ ఖర్చుతో కూడిన పని. అందరికీ అందుబాటులో ఉంటది. ఈ సోలార్ వెహికిల్స్ అందుబాటు లోకి వస్తే ఇక పెట్రోల్ ధరల గురించి ధర్నా చేసే అవసరమే ఉండదు. క్యూలో ఉండి పెట్రోల్‌ కొట్టిచ్చే పనే ఉండదు.
స్పాట్

ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ 43

ఎ.జనార్ధన్
ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలను విప్పి చెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
యాంకర్ 1
మానవుడు ఇంత అభివృద్ది సాధించానని విర్రవీగుతున్నడు. మొత్తం విశ్వరహస్యాలనే గుప్పిట్లో పట్టేశానని సంబుర పడుతున్నడు. కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానం సాధించినా ఇది కొన్ని రోజులకే పరిమితం కానుందా... ఈ విజ్ఞానంమంతా కాలగర్భంలో కలిసిపోవలసిందేనా.. ఈ భూమి ప్రమాదంలో పడనుందా.. అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇది మేము చెప్పే మాటలు కావు. లేదా భయపెట్టడానికి అనే మాటలు కావు.. ఇవి అక్షరాలా విశ్వసత్యాలు.. శాస్ర్తవేత్తలు వందల సంవత్సరాలుగా పరశోధించి నిగ్గుతేల్చిన నిజాలు..
స్పాట్
ఈ విశ్వం ఎలా ఏర్పడింది.. విశ్వం ఏర్పడక మునుపు ఏముండేది.. ఈ ప్రశ్నలు వేలాది సంవత్సరాల నుంచి మానవుణ్ని వేధిస్తున్న ప్రశ్నలు. శోధించగా.. శోధించగా.. శాస్ర్తవేత్తలకు విభ్రాంతికర వాస్తవాలు తెలిసినయి. ఇప్పుడు భూమి పై ఉన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడాలంటే 13బిలియన్ సంవత్సరాలు పైనే పట్టింది. ఇన్ని సంవత్సరాలకు ముందు భూమి ఎలా ఉండేది. ఈ విశ్వం ఎలా ఉండేది..
స్పాట్
ఈ విశ్వం ఏర్పడ ముందు. అత్యధిక సాంధ్రతగ చిమ్మ చీకటి ఉండేది. పూర్తిగా దైవకణాలని పిలవబడే సృష్టి నిర్మాణ ప్రాథమిక కణాలతో ఉందని శాస్ర్తవేత్తల ఊహ.. ఒకానొక దశలో రెండు ప్రాథమిక కణాల తాడనం వలన ఈ మహాసృష్టికి పునాదులు పడ్డయని ఇప్పటి వరకు మెజారిటీ శాస్ర్తవేత్తలు అంగీకరించిన ఉమ్మడి భావన.
స్పాట్
ఈ మహా విస్పోటనం తరువాత కాంతి వేగంతో సృష్టి విస్తరించింది. ఈ సృష్టి క్రియలో సాంద్రతాయుత కణాలన్నీ ఏకమై ఎన్నో తాండనాలు జరిగినయి. అప్పుడే పుట్టిన పిల్ల గ్రహాలు, బాల నక్షత్రాలు ఒక నిర్ధిష్ట కక్ష్యలో ఉండక పోవడం, ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల ఒక దాని కొకటి ఢీ కొని మహా అగ్ని విలయమే జరిగింది.
స్పాట్
ఇలా కొన్ని బిలియన్ల సంవత్సరాల తరువాత నేటి అనంత విశ్వం రూపుదాల్చింది. ఈ మహా విశ్వంలో ఎన్నో చోట్ల జీవం ఉంది అనేది నేటికి అర్ధం కాని పరిస్థితి. కానీ అన్ని రకాల వాతావరణ పరిస్థితులు అనుకూలించడం వల్లనో రసాయన చర్యలు సహకరించడం వల్లనో.. ఆస్టరాయిడ్ల నుంచి జీవం దిగుమతి కావడం వల్లనో ఈ భూమి పై జీవావిర్భావానికి పునాదులు పడ్డయి.. కోటాను కోట్ల రకాల జీవజాతులు వృక్ష జాతులు ఆవిర్భవించినయి.
స్పాట్
సృష్టి ఆవిర్భావం నుంచి నేటి వరకు భూమి పై మనుగడ దినదిన గండంగా మారుతోంది. ఏ రోజు ఏ గ్రహ శకలం వచ్చి భూమిని ఢీ కొంటుందో అనే భయం వెంటాడుతూనే ఉంది. ఎందుకంటే ఈ విశాల విశ్వంలో ఆస్టరాయిడ్ ల ట్రాఫిక్ రోజు రోజుకూ పెరిగి పోతోంది. భ్రమణ వేగం తగ్గి ఆస్టరాయిడ్ లన్నీ ఏదో ఒక గ్రహా గురుత్వాకర్షణ శక్తికి లోనయి గ్రహాలను ఢీకొంటున్నయి.ఈ ఆస్టరాయిడ్ యాక్సిడెంట్ బెడద సౌర కుటుంబంలో ఉన్న అన్ని గ్రహాలకు తప్పడం లేదు. కానీ ఇతర గ్రహాల పై జీవం లేదు కాబట్టి పెద్దగా ముప్పులేదు.
స్పాట్
భూమి పై కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న ఆస్టరాయడ్ లు వచ్చి పేలిపోతుంటయి. వీటినే మనం చుక్క తెగింది అని పిలుచుకుంటం. కానీ మరీ పెద్ద ఆస్టరాయడ్లు వచ్చినపుడు భూమికి, భూమి పై ఉన్న జీవజాతులకు పెనుముప్పు ఖాయం. ఇది ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఒక వేళ ఇలా జరుగకున్నా మరో రూపంలో ఈ సృష్టి వినాశనం తప్పని సరి అంటున్నరు శాస్ర్తవేత్తలు.
యాంకర్ 2
ఈ సృష్టి ఎంత వేగంగా విస్తరిస్తుందో.. అంతే వేగంగా వినాశనానికి గురి కాబోతుంది. నిజమా.. ఇలా అని నిత్యం భయపెట్టడమెందుకు.. హాయిగానే బతుకుతున్నాం కదా.. మళ్లీ ఈ ప్రళయం గోలేంటని అనుకోవచ్చు. కానీ మేం చెప్పే విలయం.. మనం కాదు కదా మన మునిమనవళ్లకు.. మునిమనవళ్లు కూడా చూడరు. ఎందకంటే ఇదంతా జరగాలంటే సూర్యుడిలో ఉన్న ఇందనం పూర్తిగా అయిపోయి తీరాలి. అలా అయిపోవడం మాత్రం తధ్యం.
స్పాట్
ఈ సృష్టిలో నక్షత్రాలన్నీ మిణుకు మిణుకు మంటూ మెరుస్తున్నయంటే కారణం అవన్నీ స్వయం ప్రకాశకాలు. ఈ స్వయం ప్రకాశం వెనుక నిత్యం కొన్ని కోటాను కోట్ల ఆటంబాంబులకు సమానమయ్యే శక్తి ఉంది. ఏదో ఒకరోజు ఈ శక్తి వనరు తరగడం ఖాయం అని శాస్ర్తవేత్తలు అంచనా వేస్తున్నరు. ఇలా శక్తి మొత్తం పూర్తిగా తరగిపోయి.. వాటిల్లో ఉన్న ఇంధనం మొత్తం అయిపోయి నక్షత్ర విస్పోటనం జరుగుతది. విస్పోటనం తరువాత ఈ నక్షత్రం బ్లాక్ హోల్ గా మారుతది. సరిగ్గా అప్పుడే సృష్టి వినాశనం మొదలవుతది. ఈ బ్లాక్ హోల్ తన చుట్టూ ఉన్న గ్రహాలను మింగేయడం మొదలేస్తది. బ్లాక్ హోల్ నుంచి కాంతి కూడా తప్పిచ్చుకోలేదు. ఈ బ్లాక్ హోల్ తన పరిధిలో ఉన్న గ్రహాలను నక్షత్రాలను తనలో కలిపేసుకుంటది.
స్పాట్
నక్షత్రాలన్నీ బ్లాక్ హోల్స్ గా మారాల్సిందేనా అంటే అవుననే సమాధానం వస్తది శాస్ర్తవేత్తల నుంచి..అవును ఒక్కమాటలో చెప్పాలంటే భూమి కూడా ఒక బ్లాక్ హోల్ గా మారబోతోందా.. స్టీఫెన్ హాకింగ్ ప్రకారం ఇదిగో భూ కేంద్రంలో మార్పుల వల్ల అత్యధిక గురుత్వాకర్షణ శక్తికి లోనయి భూమి తనలోకి తానే కుంచించుకొని పోతుంది. ఒకానొక దశలో కేంద్రానికి కుంచించుకు పోయి ఒక నల్లని బిందువు మాదిరిగా మారిపోతది.
స్పాట్
భూమి ఒక్కో ముక్కగా. ఎడారులు, మంచు పర్వతాలు అలా కుంచించుకు పోతయి. మొత్తం 8000వేల మైళ్ల వ్యాసార్ధం ఒక చిన్న బిందువుగా మారిపోతది.
స్పాట్
ఈ బ్లాక్ హోల్ నుంచి విపరీతమైన రేడియోషన్ విడుదలవుతది. క్రమేపీ ఈ బ్లాక్ హోల్ తెల్లగా ప్రకాశించ బడుతది. దీనికి అందుబాటులో ఉన్న అన్ని ఉపగ్రహాలను మింగేస్తది. 15 మైళ్ల వ్యాసార్దంలో ఉండే ఈ బ్లాక్‌ హోల్ రోజు రోజుకూ తన వ్యాసార్ధాన్ని పెంచుకొని ఒక మాసివ్ బ్లాక్ హోల్ గా రూపాంతరం చెందుది. ఎంతగా అంటే 11మిలియన్ మైళ్లవ్యాసార్ధానికి తన విస్ర్తుతిని పెంచుకొంటది. అలా పెరిగిన బ్లాక్ హోల్ ఈ పాలపుంతనే మింగగల శక్తిని సొంతం చేసుకుంటది.
స్పాట్
మన పాల పుంత తో బాటు ఈ సౌర కుంటుంబం కూడా విస్పోటనం వల్ల సంభవించినయే.. ఈ సౌరకుటుంబంలో ఉన్న నవగ్రహాలు, వాటి ఉపగ్రహాలు అన్నీ ఏదో ఒక రోజు సూర్యుడికి ఆహారం కావలసినవేనని శాస్ర్తవేత్తలు బల్లగుద్ది మరీ చెబుతున్నరు.
స్పాట్
ఒక మహా విస్పోటనం నుంచి ఎలా ఈ సృష్టి ఆవిర్భవించిందో.. ఆఖరుకు తిరోగమన దిశలో తిరిగి అదే దశకు చేరుకో బోతుందని శాస్ర్తవేత్తలు చెబుతున్నరు. చిన్న చిన్న కాల బిలాలు, పిల్ల విశ్వాలు ఏర్పడి వాటిలో అవే జీర్ణించుకొని ఆ బిలాల వ్యాసార్ధం పెద్దదయి.. మొత్తం ఒక సాంద్రతాయుత బిలంగా రూపాంతరం చెందబోతోందని శాస్ర్తవేత్తలు అంచనా కడుతున్నరు. అయితే ఇది సృష్టి ఏర్పడకముందు ఉన్న ఒక సాంద్రతాయుత స్థితి గా భావిస్తున్నరు.
స్పాట్
మన భూగోళం ఇప్పుడున్నట్టు ఉండేది కాదు.. ఒకప్పుడు ఈ భూమి సలసల కాగే అగ్నిపర్వతం క్రమేపీ చల్లబడి హైడ్రోజన్ ఆక్సీజన్ వాయువుల సమ్మేళనంతో ఏర్పడిన నీటి ఆవిరులు నేటి మన భూమి బ్లూ ప్లానెట్ రూపానికి కారణభూతాలు. ఈ భూమి పై నీరంతా ఒక వైపు భూమి ఉత్తర ధృవం వైపు ఉంది. ఐతే.. తర్వాత భూమి పై జరిగిన అనేక భౌతిక మార్పుల మూలంగా భూమి ఖండ, ఖండాలు గా విభజించ బడ్డది. అయితే ఈ ఖండ చలన సిద్దాంతం ప్రకారం భూమిపై జీవం ఏర్పడ్డంకనే నేల ఖండాలుగా విడిపోయిందని చెప్తరు. అందుకే ఖండాల అంచులు ఒకదానినొకటి విడదీసినట్టుండటం, వివిధ ఖండాలలో ఒకే రకమైన జీవ జాతులుండటం.. ఈ వాదానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. అయితే ఈ భూమి పై ఎన్నో జీవజాతులు అంతరించి పోయినయి. కాలగర్భంలో కలిసిపోయినయి. శాస్ర్తవేత్తలకు దొరికిన శిలాజాలను బట్టి ఎన్నో రకాల జీవులు ఈ నేల పై మనుగడ సాగించినయి. ఈ జాతులు ఎందుకు అంతరించిపోయాయనే విషయం పై భిన్న వాదనలున్నయి. గ్రహ శకలం ఒకటి భూని తాకి చాలా జీవ జాతులు అంతరించాయనే వాదన కూడా ఉంది. అయితే ఈ గ్రహ శకలం ఖండచలనం జరిగాక వచ్చిందా.. లేక భూమి ఉమ్మడిగా ఉన్నపుడే ఢీ కొందా అనే విషయాలపై కూడా అభిప్రాయ భేదాలున్నయి. ఏదేమయినప్పటికీ గతంలో ఈ భూమిని గ్రహ శకలం ఢీకొందనే మాట మాత్రం వాస్తవం. మళ్లీ అటువంటి గ్రహ శకలం రూపంలో భూమికి ముప్పు రాబోతోంది.. ఏం టా గ్రహ శకలం..
యాంకర్ 3
గ్రహశకలాలు భూమి పైకి రావడం కొత్తేమీ కాదు.. అలాగని నిత్యమూ కాదు.. కానీ ఈ సారి అంటే 2019లో భూమికి దగ్గరగా వచ్చే గ్రహ శకలం మాత్రం అతి పెద్దది. అది ఏమాత్రం కక్ష్య తప్పి భూమి పైకి వచ్చిన ఈ భూమి పై ఉండే జీవ జాతులన్నీ మాడి మసవ్వాల్సిందే..
స్పాట్
ఇక్కడ పెద్ద బండరాయిలా శూన్యంలో ప్రయాణిస్తున్న ఈ భారీ గ్రహ శకలం పేరు అపోఫిస్. ఈ గ్రహ శకలం గురించి గ్రీకుసిద్దాంత కర్తలు ముందే ఊహించిన్రు. ఈ అపోఫిస్ పై కూడా వారి గ్రంధాల్లో రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నయి. అయితే శాస్ర్తవేత్తలు వీరి ఊహాగానాలను కూడా కొట్టిపారేయలేదు. దీన్ని 2004లో కనిపెట్టిన్రు శాస్ర్తవేత్తలు. ఇది 20 మిలియన్ టన్నుల బరువుంటది. గంటకు 28వేల మైళ్ల వేగంతో శూన్యంలో దూసుకుపోతుంది. బుల్లెట్ కంటె 10 రెట్టవేగంతో ఇది ప్రయాణిస్తుంది. దీనిలో మన ప్రపంచం మొత్తం దగ్గర ఉన్న అణుబాంబులను మించిన శక్తి ఉంది.
స్పాట్
అపోఫిస్ 2029 సంవత్సరం కల్లా భూమికి ఇది 23వేల మైళ్ల దగ్గరిగా వస్తది. అంటే ఉపగ్రహాల వంటివి దీన్ని తాకే అవకాశం లేకపోలేదు. అంతే కాదు. ఒక వేళ ఇది భూమి వైపు దూసుకొచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని శాస్ర్తవేత్తల అందోళన. అయితే అపోఫిస్ నుంచి తప్పిచ్చుకున్నా.. విశ్వాంతరాళంలో దాగిన వేలాది గ్రహశకలాల ఎప్పుడూ భూమినే టార్గెట్ చేసుకొని భ్రమణం చేస్తున్నయి. 10 మైళ్ల వ్యాసార్ధం ఉన్న గ్రహ శకలాలు భూమిని ఢీ కొని విధ్వంసాన్ని సృష్టిస్తున్నయి. గతంలో ఇటువంటి గ్రహశకలం భూమిని ఢీ కొని భూమిని స్టెరిలైజ్ చేసింది.
స్పాట్
మనవ నాగరికత పెరిగినంక మనిషి భూగోళాన్ని తన చేతుల్లోకి తీసుకుండు. టెక్నాలజీ డెవలప్ అయింది. ఈ భూమి పై ఉన్న ఎన్నో రహస్యాలను, ఖగోళ రహస్యాలను తెలుసుకుండు. అంతే కాదు. తన జ్ఞానం వినాశనం వైపు కూడా అడుగులేసింది. అందులో బాగమే అణుబాంబ్
స్పాట్
మానవుడు తను తయారు చేసుకున్న. అణుబాంబులే భూమికి మరణ శాసనాలను లిఖించనున్నయి.అణుయుద్దాల వల్ల భూమిని ముక్కలు చేసే అవకాశం ఉంది.కానీ ఇప్పటికే అణునిషేదం అమలు చేసి ఈ ముప్పును తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నరు. కానీ విశ్వాంతరాళం మరో ముప్పును సిద్దంగా ఉంచింది. ఏంటా ముప్పు.
స్పాట్
విశ్వాంతరాళంలో నక్షత్రాలలో ఇందనం అయిపోవడంతో పెద్ద శబ్దం చేస్తూ పేలిపోతుంటయి. ఒక నక్షత్రం పేలినపుడు పెద్ద పెద్ద శకలాలు విస్పోటనంలోంచి భారీగా బాహ్య వాతావరణంలోకి విసిరివేయబడుతయి. ఈ శకలాలు ఒక్కోక్కటి చంద్రుడి పరిమాణం నుంచి భూమి పరిమాణమంత ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈ నక్షత్ర విస్పోటనాలను సూపర్ నోవా అని పిలుస్తరు.
స్పాట్
ఈ సూపర్ నోవా జరిగినంకనే బ్లాక్ హోల్స్ ఏర్పడుతయి. కానీఈ సూపర్నోవా నక్షత్రం విస్తరించే సమయంలో భారీ శబ్ధంతో కూడిన పేలుడు సంభ విస్తుంది. ఆకాశం ప్రకాశవంతమై, దాని నుంచివెలువడిన అతిచిన్న కణాలైన న్యూట్రినోలు, అంతరిక్షంలో భారీ స్థాయిలో వర్షిస్తాయని శాస్ర్తవేత్తలు చెబుతున్నరు. సూపర్నోవాలోని 99 శాతం శక్తి , న్యూట్రినోల రూపంలో వెలువడుతుంది. ఈ న్యూట్రినోలు భూమిలోకే కాక మానవుల శరీరంలోకి కూడా చొచ్చుకుపోతయి.
యాంకర్ 4
సూపర్ నోవాలంటే ఏంటి.. వీటి వల్ల మనిషికి వచ్చే ముప్పేంటి.. ఎక్కడో కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో నక్షత్రాలు పేలిపోతే.. మనకు వచ్చే నష్టమేంటి.. అవును.. వేయి సంవత్సరాలకు ముందు పేలిన నక్షత్రాల వల్ల కూడా భూమికి భారీ నష్టమే పొంచి ఉంది..ఏంటా నష్టం..
స్పాట్
ఈ సూపర్ నోవాలు ప్రతి పది సంవత్సరాల కొకసారి వస్తుంటయి. అంటే ఈ విశ్వంలో అర్ధ శతాబ్దానికో నక్షత్రం పేలిపోతోందన్నమాట. అయితే ఇవి భూమి వరకు వస్తయా రావా అనేది వాటి దూరాన్ని, శక్తిని బట్టి ఉంటది.
స్పాట్
19వ దశకంలో బ్రిటీష్ సాటిలైట్ గామా రేడియేషన్ ను గుర్తించింది. ఈ రేడియేషన్ అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి అణుబాంబులు పేలినపుడు మాత్రమే మస్తయి. ఈ గామా కిరణాలను పరిశీలిస్తే ఇవి అంతరిక్షం నుంచి వచ్చినవిగా తెలిసింది. అయితే ఇవి అంతరిక్షం నుంచి ఎలా సడన్ గా వచ్చినవని సూక్ష్మవిశ్లేషణ చేస్తే మన దగ్గరి నుంచి 8వేల కాంతి సంవత్సరాల దూరంలో పేలిపోయిన ఒక నక్షత్రం తాలూకు గామా కిరణాలని తేలింది. అంటే కాంతి వేగంతో ప్రయాణించినా నక్షత్రం పేలిపోయిన 8వేల సంవత్సరాలకు ముందు జరిగిన పరిణామాలు భూమి పై ప్రభావం చూపుతున్నయి. అవి భూమిని చేరడానికి ఇన్ని వేల సంవత్సరాలు పట్టింది. అయితే ఎప్పుడో జరిగిన అంతరిక్ష ఉత్పాతాలకు ఇప్పుడు భూమి పై ప్రభావం పడుతోంది.
స్పాట్
ఈ రేడియేషన్ భూమి పై ఉన్న వృక్ష జీవ జాతుల పై ప్రభావం చూపుతోంది. డబ్లూ 104 అనే నక్షత్రం పేలిన 8వేల సంవత్సరాల తరువాత భూమి దాని రేడియేషన్ ను ఎదుర్కొంది. అయితే దీని బలహీన ప్రాంతాలు మాత్రమే భూమి పరిధిలోకి వచ్చి వెళ్లినయి. పూర్తి స్థాయిరేడియేషన్ భూమిని చేరితే మాడి మసవ్వాల్సిందే.
స్పాట్
450 మిలియన్ సంవత్సరాలకు పూర్వం వాతావరణం మొత్తం గామా కిరణాలతో నిండి ఉందని శాస్ర్తవేత్తలు చెబుతున్నరు.
స్పాట్
మానవుడు ఖగోళరహస్యాలు తెలుసుకునే క్రమంలో అద్భుతమైన రహస్యాలు వెలుగు చూసినయి. ముందుగా చంద్రుని పై కాలు మొపిండు..
స్పాట్
చంద్రుని తరువాత 50 విలియన్ మైళ్లదూరంలో ఉన్న మార్స్ గ్రహం పైకి మానవుడి దృష్టి మళ్లింది. ఈ రెడ్ ప్లానెట్ పై ఏముందో తెలుసుకోవాలన్న ఆకాంక్ష మనిషికి పెరిగింది. ఇక్కడ తక్కువ గురుత్వాకర్షణ శక్తి, తక్కువ పీడనం, అత్యధికంగా కార్భన్ డై ఆక్సైడ్ గ్యాస్ ఉండటం గమనించిండు. మార్స్ పై ప్రత్యేకించిన అయస్కాంత క్షేత్రంగానీ, ఓజోన్ పొరగానీ లేకపోవడాన్ని శాస్ర్తవేత్తలు గుర్తించిన్రు. అయితే మార్స్ నేల పై అప్పికే సరస్సులు ఉండి ఎండినట్టు ఆనవాళ్లు ఉన్నయి. అయితే ఇవి నీటివా కాదా అన్న ప్రశ్న మాత్రం అలాగే మిగిలి ఉంది.
స్పాట్
మార్స్ గ్రహం పై ఉన్న వివిధ రకాల ఆనవాళ్లు గతంలో జీవ సంచారం ఉన్నట్టనిపిస్తున్నా,.. భౌతిక పరిస్థితులు మాత్రం దీనికి విరుద్దంగా ఉన్నయి. సూర్యుడి వయసు రోజు రోజుకూ తరిగిపోతుంది. ప్రతి బిలియన్ సంవత్సరానికి ఒక సారి 6శాతం తగ్గుతోంది. 5 బిలియన్ సంవత్సారాలనుంచి 200బిలియన్ డిగ్రీలు తగ్గింది. దీనికి భవిష్యత్తులో భూమి ఒక గుర్తింపులేని గ్రహంగా మారొచ్చు. 7 బిలియన్ సంవత్సరాల తరువాత సూర్యుడు క్రమేపీ విస్తరించడం మొదలు పెడతడు. సూర్యునిలో ఇందనం తరుగుతున్న కొద్దీ దాని విస్తీర్ణం రోజురోజుకూ పెరుగుతుంటది.
స్పాట్
7 బిలియన్ సంవత్సరాల తరువాత సూర్యుడు ప్రస్తుత పరిమాణం కంటే 200 రెట్టు పెద్దగా ఉంటడు. భూమికి 200 మిలియన్ల మైళ్ల వ్యాసార్దంలో ఉంటడు.అప్పటికే బుదుడు, శుక్రుడు గ్రహాలు సూర్యుడిలో కలిసిపోతయి. ఆ తరువాత వంతు భూమిదే. భూమి కూడా ఒకానొక దశలో సూర్యుడిలో విలీనం కాక తప్పదు.
స్పాట
ఇన్ని వేల సంవత్సరాలుగా అభివృద్ది చెందిన జీవజాతి భౌగోళిక మార్పులకు మసి కావల్సిందేనా.. ఈ జీవద్రవ్యాన్ని కాపాడుకునే మార్గమే లేదా.. టెలీస్కోప్ చూపు మేరలో మరో జీవానుకూల గ్రహం ఏదీలేదా. అంటే ఉంది.. అదే గ్లీసర్..
స్పాట్
యాంకర్ 5
గ్లీసర్ గ్రహం మానవుడు జీవించడానికి అనుకూలమైన గ్రహమే అని శాస్ర్తవేత్తల ఆశ.. కానీ వచ్చిన చిక్కల్లా అంతదూరం వెళ్లడమే.. ఒక మనిషి కాంతి వేగంతో జీవిత కాలం పయనిస్తే గాని ఈ నక్షత్రాన్ని చేరుకోలేడు. మరి ఎలా.. ఈ సమస్యను అధిగమించేదెలా.. పరిష్కారం కనుగొన్నరు శాస్ర్తవేత్తలు.
స్పాట్
ఇది గ్లీసర్..అచ్చం భూమిని పోలిన మరో జీవానుకూల గ్రహమని భావిస్తున్నరు. 2007లో శాస్ర్తవేత్తలు దీన్ని కనుగొన్నరు. దీని ఉపరితలం పై నీరుందనే బలమైన నమ్మకం శాస్ర్తవేత్తలను దీనిపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు పురికొల్పింది. కానీ గ్లీసర్ చాలా చాలా దూరంలో ఉన్న గ్రహం. ఇది ఎంత దూరంలో ఉందందటే.. 20 కాంతి సంవత్సరాలకు మించిన దూరంలో ఉంది. అంటే 120ట్రిలియన్ మైళ్ల దూరంలో ఉంది. అయితే వచ్చిన చిక్కల్లా ఇక్కడికి ఎలా వెళ్లాలన్నదే.
స్పాట్
ఈ గ్రహాన్ని చేరాలంటే కాంతి వేగంతో ప్రయాణించే వాహనం కావాలి. మనిషి మొట్టమొదట1997 లో ఒక వాహనాన్ని తయారు చేసిన్రు. ఈ వాహనం అత్యతం వేగంతో ప్రయాణిస్తది.39వేల మైళ్లను గంటలో చేరగలదు. కన్నుమూసి తెరిచేలోపే భూమిని చుట్టే శక్తి కలదు.
స్పాట్
గ్లీసర్ గ్రహాన్ని చేరాలంటే 350 సంవత్సరాలు పడుతది. ప్రస్తుతం ఉన్న సాంకేతి పరిజ్ఞానాన్ని మరింత పెంచితే ఇది సాధ్యం కావచ్చు. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఒక భారీ అంతరిక్ష వాహనం అటువంటిదే. ఇందులో అణుధార్మిక శక్తి నింపి కేవలం రేడియోధార్మిక శక్తితోనే వేగంగా ప్రయాణించే వాహనాన్ని తయారు చేయవచ్చని శాస్ర్తవేత్తల ఊహా.
ఇంత ఖర్చు పెట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని మొత్తం ఉపయోగించి అంతరిక్ష వాహనాన్ని తయారు చేసినా మరో సమస్య ఉంది. సెకన్ కు వేయి కిలో మీటర్ల వేగంతో ప్రయాణించినా గ్రహాన్ని చేరాలంటే కనీసం 75 సంవత్సరాలు పడుతుంది. అంటే ఒక మనిషి పూర్తి జీవిత కాల మన్నమాట. అంటే మనం పంపించే మిషన్ లో అప్పుడే పుట్టిన ఒక బిడ్డను వేసి.. వాడు బతకడానికి అన్ని రకాల వాతావరనాలు కల్పిస్తే వాడు వృద్దుడయ్యే సరికి ఆ గ్రహాన్ని చేరుతడు. లేదా ఇది సాధ్యం కాని పని. దీనికి కూడా ఓ మార్గం ఉంది. రానున్న జనరేషన్ లో జెనెటిక్ ఇంజనీరింగ్ను ఉపయోగించి మానవ జీవితకాలాన్ని పెంచనున్నారు. జెనెటిక్ ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో మనిషి జీవితకాలాన్ని రెండురెట్టు పెంచి కొంత విజ్ఞానం నేర్పినంక వాడిని వ్యోమగామిగా తీర్చిదిద్ది అంతరిక్ష వాహనంలో గ్లీసర్ గ్రహానికి పంపాలి. అయితే ఇది ఏ ఒక్కరినో ఇద్దరినో కాకుండా ఒక బంచ్‌ గా పంపితే ఏదో ఒక క్షణంలో.. ఎక్కడో ఒక ప్రాంతంలో ఈ ప్రయోగం సక్సెస్ అయి జీవం మరో గ్రహం పై మనుగడ సాగించే అవకాశం ఉంది. 13.5 బిలియన్ సంవత్సరాల వయసున్న ఈ విశ్వం త్వరలో తన రూపు మార్చుకోబోతోంది. త్వరలో అంటే బిలియన్ ల సంవత్సరాల తరువాతే..
స్పాట్
కాల క్రమంలో అంటే బిలియన్ ల సంవత్సరాల తరువాత మన పాల పుంత ఉన్న గెలాక్సీ తన దగ్గర్లో ఉన్న మరో గెలక్సీ తో ఢీకొంటది. అలా గ్రహాలు, నక్షత్రాల పరిధి దాటి ఏకంగా గెలాక్సీలకు గెలాక్సీలే ఒకదానికొకటి ఢీకొంటయి. .. తరువాత ఈ అనంత విశ్వం మొత్తం గ్రావిటీ శక్తితో నిండిపోతది. కొన్ని కోట్ల నక్షత్రాలు, సంలీనం విలీనం అవుతుంటయి. కిరణాలు, పదార్దం అవిరళంగా సంచరిస్తయి. ఈ క్రమంలో విశ్వం పుట్టుక దశలే తిరిగి ఏర్పడుతయి. అంటే మళ్లీ మరో బిగ్ బ్యాంగ్ తప్పదన్నమాట.
స్పాట్
ఈ అనంత విశ్వం నిండా శక్తి కేంద్రాలు నిండి ఉంటయి. దీన్నే డార్క్‌ ఎనర్జీ అంటరు. శూన్యంలో సమాంతర ప్రాంతం మొత్తం ఈ శక్తి నిండి ఉంటది. 13.5 మిలియన్ సంవత్సరాల వరకు జరిగిన పరిణామం బిగ్ బ్యాంగ్ తో మొదలయి. బిగ్ బ్యాంగ్ తో మళ్లీ పునరావృతం అవుతది.
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ విశేషాలు.. మరిన్ని సైంటిఫిక్ అప్‌డేట్స్ తో మళ్లీ మీ ముందుంటాం దిసీజ్ యువర్స్ శోభన్ సైనింగ్ ఆఫ్.
బ్రేక్ లు

ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ 42

ఎ.జనార్ధన్
ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలు విప్పి చెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
యాంకర్ 1
ఈ విశాల విశ్వం కథేంటి.. ఈ భూమి ఎప్పటిది.. ఎవరు సృష్టించిన్రు.. ఈ భూమి పై జీవం ఎలా పుట్టింది.. ఇవన్నీ ఇప్పటికీ ఎడతెగని ప్రశ్నలు.. ఎప్పటికైనా ఈ చిక్కుముళ్లు విడిపోతాయనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే విశ్వాన్ని సర్వస్వం ఒడగడుతున్న శాస్ర్తవేత్తలకు రోజు రోజు కూ ప్రశ్నల సంఖ్య పెరుగుతుందే తప్ప తరగడం లేదు. అంతేకాదు ఇప్పటి వరకు తాము కనుగొన్న చాలా సిద్దాంతాలు శుద్ద తప్పనే విషయం తెలిసి నిరాశ పడే వారు కూడా లేక పోలేదు. వాస్తవానికి ఈ విశ్వం ఎలా ఏర్పడింది. దీని వైశాల్యం ఎంత.. ఈ అఖండ విశ్వంలో మనమెంత.. ఈ ప్రశ్నలకు ఖగోళ మేథావి స్టీఫెన్ హాకింగ్ ఎంత ఆసక్తి కర సమాధానాలిచ్చిన్రు. ఒక్కసారి హాకింగ్ ఏమంటున్నడో చూద్దాం..
స్పాట్
వాయిస్
స్టీఫెన్ హాకింగ్ చెప్పిన విశ్వరహస్యం ఇది. నిజంగా ఎవరూ ఊహించరు.
నేను స్టీఫెన్ హాకింగ్.. కుర్చీలోంచి కదలలేకున్నా విశ్వరహస్యాలన్నీ ఛేదించే ప్రయత్నం చేశాను. మన భూమి, మన సౌర కుటుంబమే కాదు.. విశ్వం మొత్తం ఎలా పుట్టిందో తెలిపే ప్రయత్నం చేస్తాను..ఈ స్టోరీలో విశ్వానికి ముగింపు ఎలా ఉండబోతోందో కూడా చెబు తాను..
స్పాట్
ఇది స్టీఫెన్ హాకింగ్ కాలం కథ.. విశ్వం కథ..భవిష్యత్ కథ.. ఒక్కసారి కాలాన్ని వెనక్కు తిప్పుతూ వెనక్కు వెళదాం.. ఈ సృష్టి ఆవిర్భావానికి దారి తీసిన పరిస్థితులను చూద్దాం.
స్పాట్
స్టీఫెన్ హాకింగ్ ఈ విశ్వం గురించి చాలా ఏండ్లు పరిశోధించిండు.. ఎన్ని సంవత్సరాలైనా ఈ అంశం బోరనిపించలేదు.. రోజు రోజు కూ ఉత్సాహం పెరుగుతోంది.. ఇప్పుడు మనం చూస్తున్నది హాకింగ్ ఊహించిన అనంత విశ్వం.. ఇక్కడ మనకు చిన్న చిన్న బిందువుల్లా, తుంపరల్లా కనిపించే వన్నీ పెద్ద పెద్ద పెద్ద పాలపుంతలు. ఒక్కో పాల పుంతలో నాలుగు వందల బిలియన్ ల ఒంటరి నక్షత్రాలుంటయి. ఈ అనంత విశ్వాన్ని అంచనా వేయగలగడం కేవలం సూపర్ కంప్యూటర్ ద్వారానే సాధ్యం. ఇప్పుడు మనం చూస్తున్న అనంత విశ్వం నుంచి భూమికి వెళ్లాలంటే కోటాను కోట్ల కాంతి సంత్సరాలు ప్రయాణించాలి. ఈ గెలాక్సీ కాంపౌండ్ నుంచి ఎన్నో పాలపుంతలు దాటాలి.. పాల పుంతలు దాటి సౌరకుటుంబం ఉన్న పాల పుంతను చేరాలి. సౌరకుటుంబంలో ఒక్కో గ్రహాన్ని, గ్రహ శకలాలను దాటుతూ భూమిని చేరాలి.
స్పాట్
యాంకర్ 2
విశ్వదర్శనం కావాలంటే అంత సులువు కాదు.. ఎందుకంటే ఇప్పుడు మనం టి.వి లలో కంప్యూటర్ లలో చూసే గెలాక్సీ నమూనాలు చూడ్డానికి చిన్న బొమ్మల్లా ఉన్నయిగని.. ఇలా కనిపించే ఏ రెండు నక్షత్రాల మధ్య ప్రయాణించాలన్నా ఒక జీవిత కాలం సరిపోదు.
స్పాట్
ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా కనిపిస్తున్న ఈ ప్రకృతి ఒకప్పుడు నిత్యం ప్రళయాగ్ని కక్కుతూ ఉండేది.
స్పాట్
సరిగ్గా..14 బిలియన్ సంవత్సరాలకు ముందు.. ఇప్పుడు మనం చూస్తున్న.. ఈ గ్రహాలు కానీ.. ఆస్టరాయిడ్ లు కానీ..నక్షత్రాలు కానీ.. పాలపుంతలు కానీ… గెలక్సీలు కానీ..ఇప్పుడు మనం చూస్తున్న ఈ అనంత విశ్వం ఏవీ లేవు. కేవలం సాంద్రతా యుతమైన చిమ్మ చీకటి ఉంది..
హాకింగ్ వాయిస్
మనం ఈ చిన్న గ్రహం పై హాయిగా బతకడానికి.. మనిషి ప్రత్యేక మైన మనిషిగా బతకడానికి ఎన్నో లక్షల సంవత్సరాల మార్పులు జరిగినయి.
వాయిస్
ఈ గెలాక్సీలో ఉన్న చిన్న చిన్న రేణువుల్లాంటి వన్నీ కోటాను కోట్ల నక్షత్రాల సమూహాలు. ఇటువంటి కోటాను కోట్ల పాల పుంతలు కలిస్తే అనంత విశ్వం ఉంటది. ఈ అనంత విశ్వానికి ఆది అంతం ఇంకా కనుక్కోలేదు.
స్పాట్
యాంకర్ 3
కెప్లర్ టెలీస్కోప్ లో ఈ విశ్వాన్ని పరిశీలిస్తే.. ఈ అనంత విశ్వం కొంత నీలి రంగులో మరికొంత ఎర్ర రంగులో కనిపిస్తది. కారణం చాలా రోజులు తెలుసుకోలేక పోయిన్రు శాస్ర్తవేత్తలు. కానీ ఓ చిన్న కిటుకుతో అసలు విషయం తెలుసుకోగలిగిన్రు. ఇంతకీ ఏంటా కిటుకు..
స్పాట్
వాయిస్ ఇదిగో ఇక్కడ వేగంగా.. రయ్యి మని శబ్దం చేస్తూ వెళుతున్న కారును చూడండి.
ఒక్కసారి కారు మనకు దూరం గా వెళిపోతుంటే వచ్చే శబ్దాన్ని పరిశీలిద్దాం.. (స్పాట్) ఇప్పుడు మన దగ్గరగా వచ్చి దూరంగా వెళ్లిపోయే శబ్దాన్ని వినండి.. మళ్లీ ఇంజన్ స్పీడ్ మరింత పెంచినపుడు శబ్దం ఎలా ఉన్నది.
స్పాట్
ఇదే కారు మనకు దగ్గరగా వస్తున్నపుడు లేత నీలి రంగులో కనిపిస్తది. తిరిగి అంతే వేగంతో మన నుంచి దూరంగా వెళ్తుంటే లేత ఎరుపులో కనిపిస్తది. ఈ ప్రభావాన్ని డాప్లర్ ప్రభావం అంటరు. సో .. డాప్లర్ ప్రభావం మూలంగానే గెలాక్సీ లో నీలి రంగు, ఎరుపు రంగు కనిపిస్తది. ఇందులో కొన్న గ్రమాలు వేగంగా వస్తుంటయి. మరికొన్ని వేగంగా వెళుతుంటయి. అందుకే గెలాక్సీ నీలి, ఎరుపుల దొంతలా కనిపిస్తది.
స్పాట్
ఇంతకీ ఈ గెలాక్సీ జననం ఎప్పుడు .. ఈ అనంత విశ్వం వయసెంత.. ఈ ప్రశ్నలకు ఇప్పటి వరకు దొరికిన జవాబు ఒకటే.. 13 మిలియన్ల సంవత్సరాలకు ముందు చిమ్మ చీకటిలో అత్యధిక సాంత్రతతో ఉన్న ఈ శూన్యంలో రెండు దైవాణువులు ఢీ కొనడం వల్ల ఒక మహా విస్పోటనం జరిగింది. ఆ విస్పోటనమే చీకట్లో వెలుగులు నింపింది.
స్పాట్
చీకట్లో జరిగిన ఆ మహా విస్పోటనం క్రమ క్రమంగా కోటాను కోట్ల కాంతి సంవత్సరాల వేగంతో దూరంగా విస్తరించ సాగింది.
స్పాట్
యాంకర్ 4
ఈ విశ్వ విస్తరణ ఎంత కాలం జరిగింది. ఎలా జరిగింది.. ఒక చెంచాడు ద్రవ్యరాశి ఒక గ్రహంగా రూపాంతరం చెందడం ఎలా సాద్యమయింది. రేణువులన్నీ పిల్ల గెలాక్సీలుగా మరడం ఎలా సాధ్యమయింది. తరచి చూస్తే శాస్ర్తవేత్తలకు లోతైన అంశాలు చాలా వెలుగులోకి వచ్చినయి.
స్పాట్
బారయుత వాయువులతో.. మిరిమిట్లు గొలిపే అత్యుష్ణ వెలుగులతో కనిపించే ఈ మహా సృష్టి వృత్తాకారంలో విస్తరిస్తూ వెళుతుంది.ఈ మహావిస్పోటనం చీకట్లో కాంతి కిరణాలను విస్తరిస్తూ కాంతి వేగంతో విస్తరించింది. బయటనుంచి ఇదో అగ్నిగోళంలా ఉంది. లోపలి బాగంలో రేణు పరిణామంలో టైనీ గెలాక్సీలు వేగంగా వ్యాకోచించడం మొదలు పెడతయి. ఇక్కడ కిరణాల మాదిరిగా కనపడేవన్నీ కోటాను కోట్ల గెలాక్సీల సముదాయం. ఈ గెలాక్సీలన్నీ ధూళి కణాల్లా వేగంగా.. ప్రొజెక్టర్ లో ఫోకస్ లా కాంతి వేగంతో శూన్యం నిండా విస్తరించింది.
స్పాట్
ప్రళయ గర్జనతో విస్తరించే ఈ ద్రవ్యరాశి వాయుధూళి రూపంలో ఉంటది. ఒక్క అణువే ఒక పాల పుంత తో సమానం అంటే దాని ద్రవ్యరాశి ఎంత ఉంటదో అర్ధం చేసుకోవచ్చు. ఇంత ద్రవ్యరాశి మొత్తం కేవలం వాయురూపంలో ఉండటం వల్ల వేగంగా విస్తరించగలిగింది. సూక్ష్మరూపంలో ఉన్న ఈ అనంత విశ్యం 13 మిలియన్ ల సంవత్సరాల నుంచి నేటికీ విస్తరిస్తనే ఉంది. భార సాంద్రత గల ఈ అనంత విశ్వ పయనం ఓ మహత్తర కార్యానికి తొలిఅడుగు.
స్పాట్
వాయుధూళిగా ఉన్న ఈ విశ్వ పదార్ధం క్రమేపీ ద్రవరూపంలో.. ఆ తరువాత మెల్లగా చల్లబడి ఘనరూపంలోకి రూపాంతరం చెందింది. ఈ విశ్వావిర్భావ దశలోనే కాస్మిక్‌ ఎనర్జీ జెనరేట్ అయింది. ఇందులో కొంత సాలిడ్ మేటర్ గా రూపుదాలిస్తే.. మిగతాది యాంటి మేటర్ గా రూపాంతరం చెందింది. సవ్య అపసవ్య దిశలో భ్రమణం చెందే బాలగ్రహాలు, పురిటి నక్షత్రాలు ఒకదానినొకటి ఢీకొని గ్రహాలు ఉపగ్రహాలుగా పిల్ల విశ్వాలుగా విచ్చిత్తి చెందినయి. ఈ మహా తాడనంలో వెలువడిన రేడియేషన్ కోటాను కోట్ల ఆటంబాంబ్‌ లతో సమానం.
స్పాట్
యాంకర్ 5
బిగ్ బ్యాంగ్ మహా విస్పోటనం లో ఏర్పడిన ప్రతి గ్రహం ఇప్పటికీ ఉందా..నక్షత్రాలన్నీ అలాగే ఉన్నయా.. ఒకవేళ అలాగే ఉంటే అవి ఎందుకు దూరంగా విస్తరించ బడ్డయి. కారణం అన్వేషించిన్రు శాస్ర్తవేత్తలు.
స్పాట్
ఈ మహాతాడనంలో కొన్ని నక్షత్రాలు అప్పటికప్పుడు అదృశ్యమైపోయినయి. బిలియన్ రేణువులు గ్రహాలుగా వ్యాకోచించినయి. ఈ తాడనంలో మిగిలిన శేష పదార్ధాలే నేటి విశ్వం. ఈ అనంత విశ్వం కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరం విస్తరించింది. ఇంత విస్తీర్ణంలో ధూళి మేఘం తో పాటు పొగ ఆవరించింది. ఆ పొగలోనే వివిధ రకాల మూలకాలు పుట్టుకొచ్చినయి.
స్పాట్
పది నిముషాల్లో కొటాను కోట్ల కాంతి సంవత్సరాల దూరం ప్రయాణించిన ఈ విశ్వం లోపొగ అంతర్ధానమయింది. ఇలా 330 సంవత్సరాలు ఇంతే వేగంతో శూన్యంలో నక్షత్రాలు గ్రహాలు విస్తరించినయి. ఆ తరువాత వేగం క్రమంగా తగ్గుతూ పోయింది. కానీ అప్పుడు మొదలైన భ్రమణమే నేటి గ్రహాల భ్రమణం, పరిభ్రమణం.
స్పాట్
విశ్వావిర్భావం కొన్ని విలియన్ ల సంవత్సరాలు పట్టింది. ఇందులో వందల బిలియన్ ల గెలాక్సీలు తయారయినయి. మొదట్లో గెలాక్సీల మధ్య తాడనం జరిగేది. తరువాత అది గ్రహాలకు పరిమిత మయింది. ఈ గ్రహాలు కూడా ఒకదానినొకటి ప్రభావితం చేసుకుంటయి. కారణం గురుత్వాకర్షణ శక్తి.
స్పాట్
న్యూటన్ అనే ఖగోళ శాస్ర్తవేత్త ఒక యాపిల్ చెట్టు కింద కూర్చుని ఆకాశం వైపు చూస్తూ సుదీర్ఘంగా ఆలోచిస్తున్నడు. సరిగ్గా అప్పుడే చెట్టు పై నుంచి ఆపిల్ కాయ తెగి నేల పై పడింది. రాలిన ఆ యాపిల్ పండు నేల పైనే ఎందుకు పడాలి. ఆకాశంలోకి ఎందుకు వెళ్లకూడదు అనే ప్రశ్న ఉద్భవించింది న్యూటన్ మనస్సులో.. ఆ ప్రశ్నే గురత్వాకర్షణ శక్తి సూత్రానికి పురుడు పోసింది.
స్పాట్
విశ్వావిర్భావంలో గ్రావిటీ పవర్ చేసిన విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. బిగ్ బ్యాంగ్ తరువాత రెండు మిలియన్ ల సంవత్సరాల వరకు విశ్వం ఒక రూపంలోకి రాలేదు. 1982లో హాకిన్స్ తో బాటు మూడొందల మంది శాస్ర్తవేత్తలు చేసిన ప్రయోగంలో విశ్వం అమరిక ఎలా జరిగిందో తెలుసుకున్నరు. దీనికి వీరు ఎంపిక చేసుకున్నది..పల్లపు స్థలం, బాల్ బేరింగ్ లు
స్పాట్
ఈ ఐరన్ బాల్స్ పై ఏ ప్రభావం లేనపుడు ఇవి ఒక పద్దతి ప్రకారం సమాన దూరంలో అమరి ఉన్నయి. సమ దూరంలో ఉన్న గ్రహాల నుంచి కొన్ని జీవిత కాలం పూర్తయి అదృశ్యమయినయి. దీంతో వాటి ప్రభావం ఇతర గ్రహాల పై పడింది. ఒక వైపు గురుత్వాకర్షణ శక్తి తగ్గడంతో ఆ గ్రహాలు మరో గ్రహ ప్రభావానికి లోనయినయి. ఇలా గ్రహాలన్నీ ఎక్కువ విశ్వ గురుత్వాకర్షణ శక్తి వైపుకు మళ్లడం మొదలు పెట్టినయి. అప్పుడు మొదలయిన ఆ విశ్వవిస్తరణ నేటికీ కొనసాగుతనేఉంది.
స్పాట్
ఈ విశ్వావిర్భావానికి ముందు.. అంటే 13.5 మిలియన్ సంవత్సరాలకు ముందు ఈ విశాల విశ్వం నిండా హైడ్రోజన్ గ్యాస్ నిండి ఉంది. అంటే ఒక రకంగా ప్రోటాన్, ఎలక్రాన్ ల మేఘాలతో నిండి ఉందని చెప్పొచ్చు. హైడ్రోజన్ చాలా తేలికైన వాయువు.. పవర్‌ జెనరేట్ చేయగల వాయువు.. 10మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయగల వాయువు. ఈ ఉష్ణోగ్రతే నక్షత్రాలను కాంతి వంతగా చేయగలుగుతుంది. హైడ్రోజన్ పరమాణువుల సంలీనం ఉష్ణాన్ని వెలువరుస్తది. ఈ హైడ్రోజన్ సంలీనం హీలియం వాయువుగా రూపాంతరం చెందుతది. నక్షత్రాల కోర్ పార్ట్లో మొత్తం హీలియం అణువులతో నిండి ఉంది. ఈ శక్తి కొన్ని కోట్ల అణుబాంబుల శక్తి తో సమానం. విశ్వావిర్భావ సమయంలో ఇటువంటి సంలీనాలు మిలియన్ ల కొద్దీ జరిగినయి.
స్పాట్
విశ్వంలో నిండిఉన్న హైడ్రోజన్ అణువుల తాడనం వల్ల ఎన్నో నక్షత్రాలు కొత్తగా ఏర్పడ్డయి. హైడ్రోజన్ ఇందనంతోనే ఇవన్నీ నేటికీ బతికి ఉన్నయి. ఈ హైడ్రోజన్ వాయువు అయాన్ లుగారూపాంతరం చెంది.. వివిధ రకాల మూలకాలుగా ఏర్పడ్డయి. ఈ మూలకాలే కార్బన్, నైట్రోజన్, సిలికాన్ వంటి 108 మూలకాలు మరియు వాటి సమ్మిళిత అయాన్లు గా ఏర్పడ్డయి. ఇవే నేటి మన భూమి పై జీవరాశి వుట్టుకకు కారణం అయినయి.
స్పాట్
యాంకర్ 6
విశ్వావిర్భావంలో నక్షత్రాలే పాత్ర చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటి ఈ పరిశోధనలకు మూలం నక్షత్రాలే.. 13మిలియన్ సంవత్సరాల క్రితం మొదలయిన విశ్వాగ్ని నేటికీ రగుల్తనే ఉంది. దాన్ని బట్టే నక్షత్రం వయసు.. విశ్వావిర్భావ కాలాన్ని అంచనా వేయగలుగుతున్నరు. ఈ లెక్కలు ఎలా సాధ్యమయినయి.
స్పాట్
విశ్వావిర్భావంలో నక్షత్రం పాత్ర ఏమిటి..అసలు నక్షత్రంలో ఏముంది. ఒక్కసారి నక్షత్రాన్ని వర్టికల్ గా విచ్చేదన చేసి చూస్తే దీని మర్మమేంటో తెలుస్తది. ఈ నక్షత్ర మధ్యబాగంలో హైడ్రోజన్ అణువులు సంలీనమై శక్తి విడుదలవుతది. ఈ చర్య శృంకల చర్యగా జరిగి అయాన్లు, శక్తి కేంద్రాలు ఏర్పడుతయి. ఈ శక్తి కేంద్రాలు అయస్కాంత క్షేత్రాలుగా రూపాంతరం చెందుతయి. నక్షత్ర కేంద్రకం నుంచి ఉపరితలం వరకు ఇదే చర్య జరుగుతది. ఈ చర్యలలో హైడ్రోజన్ పూర్తిగా అయిపోయినపుడు నక్షత్ర జీవిత కాలం పూర్తయినట్టు. నక్షత్రంలో హైడ్రోజన్ ఇందనం పూర్తిగా అయిపోగానే పెద్ద శబ్దంతో పేలిపోతది. ఆ శకలాలు శూన్యంలోకి విస్తరించబడుతయి. ఈ పరికల్పననే సూపర్నోవా అంటరు. ఈ పరిస్థితిలో నక్షత్రాన్ని మృత నక్షత్రం అంటరు.
స్పాట్
ఈ మైక్రో సెకన్ లో కొన్ని కోట్ల ఉద్ఘారాలు విడుదలవుతయి. దీంతో పాటు ఒక బలమైన షాక్ శూన్యంలోకి విడుదలవుతది. అంతే కాదు పేలుళ్లలో విడుదలయిన పదార్ధమంతా శూన్యంలోకి విస్తరించ బడుతయి.
స్పాట్
ఈ మృతనక్షత్రంలో నుంచి మెటల్ ఎర్రగా శూన్యం నిండా విస్తరిస్తది. బిగ్ బ్యాంగ్ జరిగిన 300మిలియన్ సంవత్సరాల తరువాత ఇప్పుడు చూస్తున్న మన సౌరకుటుంబం ఉండే పాలపుంత ఖచ్ఛితమైన రూపు సంతరించుకుంది.ఈ పాలపుంత సుమారు 6వేల బిలియన్ మైళ్ల వ్యాసాన్ని కలిగి ఉంటది. ఇందులో 2వందల బిలియన్ ల నక్షత్రాలుంటయని అంచనా. ఈ నక్షత్ర సమూహాలన్నీ కేవలం గురుత్వాకర్షణ శక్తితో ఏర్పడ్డయి. గురుత్వాకర్షణది శక్తి సృష్టి నిర్మాణంలో కీలక పాత్ర .
స్పాట్
ఈ తెల్లని పొగల చారల మధ్య నల్లని ఆకారాన్ని బ్లాక్ హోల్ అని పిలుస్తరు. ఈ బ్లాక్ హోల్ సిద్దాంతాన్ని ఆవిష్కరించడానికి హాకింగ్ కు చాలా కాలం పట్టింది.
స్పాట్
ఒక మృత నక్షత్రం బ్లాక్ హోల్‌ గా మారినంక జరిగే మార్పులు గెలాక్సీలో పెను భీభత్సాన్ని సృష్టిస్తయి. నక్షత్రం మధ్యలో ఉండే గ్రావిటేషన్ ఫోర్స్ ఓ మెగా అట్రాక్టర్. దీనికి ఎంత బలమైన ఆకర్షణ శక్తి ఉందంటే మృత నక్షత్రం తనకున్న గురుత్వాకర్షణ శక్తితో తన చుట్టూ ఉన్న గ్రహాలన్నిటినీ మింగేయగలదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల నక్షత్రాలను మింగేసినా దాని ఆకలి తీరదు. ఎంత వేగంగా అయితే విస్పోటనం చెందిందో అంతకంగే వేగంగా నక్షత్రాలను, గ్రహాలను దాని పరిధి క్రమేపీ విస్తరించుకుంటూ వెళ్తది. మృత నక్షత్రాలు సాధారణ సమన్వయంలో, కాల రంధ్రం యొక్క విస్తారము మొత్తము ఒక్క చోట, అంటే ఒక బిందువు కాని,ఒక వలయము కాని, ఒక కాంతిరేఖ కాని లేక ఒక గోళమునందు కాని కేంద్రీకృతమై ఉండవచ్చు. దాని యొక్క ఖచ్చితమైన వివరాలు ప్రస్తుత పరిస్థితులలో అర్ధమైతలేవు. ఈ ఒక చోటునుండి గుండ్రముగా ఉండే సరిహద్దుని ఇవెంట్ హారిజాన్ అంటరు. ఈ ఇవెంట్ హారిజాన్ అనునది మరి తిరిగి రానటువంటి బిందువునుసూచిస్తుంది.ఈ సరిహద్దు దాటితే స్థూల ద్రవ్యము మరియు అణుధార్మికతకూడా తప్పనిసరిగా ఈ మొదలు లోపలికే పడిపోతయి. మధ్యభాగామునందుండే మూలము నుండి ఇవెంట్ హారిజాన్ వరకు ఉండే దూరము కాల రంధ్రం యొక్క పరిమాణము.
స్పాట్
సూర్యుని పరిమాణానికి సమానమైన కొలత కలిగిన కాల రంధ్రం యొక్క వ్యాసార్ధము షుమారు మూడు కిలోమీటర్లుంటుంది. దీనికి మించిన దూరంలో ఉన్నప్పుడు,మిగిలిన అదే పరిమాణంగల పదార్ధాలలాగానే,కాల రంధ్రం కూడా సూర్యుని మాదిరి అంతే ఆకర్షణ కలిగి ఉంటుంది. అంటే సూర్యుని కనక అదే పరిమాణము కలిగిన కాల రంధ్రంతో మార్పిడి చేస్తే,గ్రహాల గ్రహమార్గాములో మార్పు లేకుండా ఉంటుంది.
స్పాట్
కాల రంధ్రాల కొలతల బట్టి వాటిని పలురకాలుగా విభజించటమైనది. నక్షత్రముగురుత్వాకర్షణ ముడుగువలన కనక కాల రంధ్రం సృష్టించబడి ఉన్నట్లయితే అప్పుడు వాటినిస్టేల్లార్ కాల రంధ్రాలు అంటారు. నక్షత్ర వీధుల మధ్య ఉండేటువంటి కాల రంధ్రాల యొక్క పరిమాణము కొన్ని బిల్లియేన్ల సూర్య పరిమాణములకు సమానముగా ఉంటుంది.వీటిని సూపర్ మాసివ్ కాల రంధ్రాలు అంటారు. ఈ రెండు శ్రేణుల మధ్య, అందరూ ప్రాక్కల్పితముగా నమ్మేది ఇంటర్మీడియేట్ కాల రంధ్రాలు కొన్నివేల సూర్య పరిమాణములకు సమానమైనటువంటివి ఉంటాయని. జగత్తు సృష్టించబడినప్పటి చరిత్ర ప్రాక్కల్పన ప్రకారము బిగ్ బ్యాంగ్ సమయములో తయారయిన అతి తక్కువ పరిమాణంకల కాల రంధ్రాల ఉనికి కూడా ఉండవచ్చు.వీటిని ప్రైమార్డియేల్ కాల రంధ్రంలుగా అన్వయించవచ్చు. వాటియొక్క ఉనికి ప్రస్తుతము ఖచ్చితముగా నిర్దారించలేము.
స్పాట్
ఈ బ్లాక్‌ హోల్‌ వల్ల భూమి వచ్చే ముప్పేంటి.. సూర్యుడు కూడా మామూలు నక్షత్రాల్లా బ్లాక్‌ హోల్‌ గా మారబోతున్నాడా . ఒక వేళ అలా మారితే ఏం జరగబోతోంది. ఈ సౌర మండలం మొత్తాన్ని సూర్యుడే మింగేయబోతున్నాడా.. ఈ ప్రశ్నలన్నిటికీ వచ్చే ఎపిసోడ్ లో సమాధానం వెతుకుదాం.
యాంకర్ 7
ఇంత పెద్ద గెలక్సీలో.. ఇప్పుడు మనం ఊహిస్తున్న మార్పులన్నీ నిజంగా జరిగినయేనా.. వీటిని మనం నమ్మొచ్చా.. ఇది కేవలం ఊహా కల్సిత సిద్దాంతమేనా..ఈ అనుమానం మనకే కాదు.. శాస్ర్తవేత్తలకూ వచ్చింది. ఒక్కోసారి తామూహించిన విషయాలు నిజం కాదేమోనన్న అనుమానం కూడా వాళ్ల మెదళ్లను తొలిచేస్తది. కారణం.. ఇదిగో ఈ చిన్న విషయం.
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ విశేషాలు.. మరిన్ని లేటెస్ట్ సైంటిఫిక్ అప్ డేట్స్ వచ్చేవారం తెలుసుకుందా.. అంటిల్ దెన్ బైబై దిసీజ్ శోభన్ సైనింగ్ ఆఫ్.
బ్రేక్ లు.

ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ 41

ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలు విప్పిచెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం
యాంకర్ 1
ఈ విశాల విశ్వంలో ఈ భూమి పైనే కాకుండా గెలాక్సీలో ఇంకెక్కడో జీవం ఉండే ఉంటుందనే బలమైన అనుమానాలు ఉన్నయి. ఈ అనుమానాలు.. కేవలం అనుమానాలేనా.. నివురు గప్పిన నిజాలా.. ఏమరు పాటుగా ఉన్న మన పై ఏదో ఒకరోజు గ్రహాంతర వాసులు దాడి చేస్తరా.. అచ్చం ఇదే కాన్సెప్ట్ తో ఎన్నో హాలీవుడ్ సినిమాలు వచ్చినయి. అంతే క్యూరియాసిటీ తో వాటిని ఆదరించింన్రు ప్రజలు. కానీ గ్రహాంతర జీవం పై నిజానిజాలేంటి.. నిజంగా గ్రహాంత జీవం ఉందా.. అవి మన కంటే తెలివైనవా.. మానవ రూపంలోఉంటయా.. పూర్తిగా భిన్నంగా ఉంటయా.. ఈ ప్రశ్నలకు సమాధానం వెదికే పనిలో ఉండగానే.. రీసెంట్ గా సైబీరియా మంచు కొండల్లో ఒక విచిత్ర జీవిని కనుగొన్నరు పరిశోధకులు. ఇది అచ్చం ఇప్పటి వరకు ఫిక్షన్ సినిమాల్లో వచ్చిన గ్రహాంతర వాసిలా ఉండటంతో అనుమానాలు మరింత బలపడ్డయి. మీరూ ఓసారి ఆ క్లిప్పింగ్ చూస్తే మీకే అర్ధమవుతది.
(సైబీరియా క్లిప్పింగ్)
యాంకర్ 2
చూశారుగా.. ఇది కచ్చితంగా భూమి పై తిరిగే జంతువైతే కాదు. మనిషి పోలికలున్నా మనిషి మాత్రం కాదు. రష్యన్ లు మాత్రం ఇది ఎలియనే అని కచ్చితంగా నమ్ముతున్నరు. ఇప్పటికే ఈ వీడియోలు యూ ట్యూబ్ లో షికార్లు చేస్తున్నయి. ఇది ఏలియనా .. కాదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు శాస్ర్తవేత్తలు పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. ఆఖరుకు ఇది ఏలియన్ కాదు... అని తేల్చేసిన్రు. కానీ ఏలియన్ లు ఉన్నయా లేవా అన్న సందేహం మాత్రం అలానే ఉండిపోయింది.
వాయిస్
సైబీరియాలో దొరికిన ఈ ఏలియన్ రూపంలో ఉన్న పదార్ధం యూట్యూబ్ లో హల్ చల్ చేయడంతో ఏలియన్ అనే మాట తిరిగి తెరపైకి వచ్చింది. దీనికి భారీ ఎత్తున ప్రచారం కూడా జరిగింది. శాస్త్రవేత్తలంతా హడావుడి చేసి ఈ దేహం వెనుక ఉన్న రహస్యమేంటో శోధించి సాధించిన్రు. ఇది కచ్చితంగా ఏలియన్ కాదని తేల్చేసిన్రు.
యాంకర్ 3
ఈ సౌర కుటుంబ అవల ఎక్కడో ఒకచోట మాత్రం కచ్చితంగా జీవం ఉండే అవకాశాలు లేకపోలేదు అనే నిర్ధారణకు వచ్చిన్రు పరిశోధకులు. కానీ ఆ జీవం ఏ రూపంలో ఉంటది. ఈ ప్రశ్నకు సమాధానం కేవలం ఊహాత్మకం మాత్రమే.. కానీ ఐన్ స్టీన్ తరువాత అంతటి మేథావి గా ప్రశంసలందుకున్న స్టీవెన్ హాకింగ్ గ్రహాంత జీవం గురించి కొన్ని పరికల్పనలు చేసిండు.. వాస్తవానికి సైన్స్ ఫిక్షన్ సినిమాలను అందరూ నమ్మరు. కానీ ఖగోళ రహస్యాలను, గ్రహ గతులను వడగట్టిన హాకింగ్ విశ్వంలో జరిగే కొన్ని వింతల గురించి తెలపిండంటే.. వాటికి కచ్చితంగా విశ్వసనీయత ఉండే ఉంటుందని ఓ నమ్మకం. ఇంతకీ స్టీవెన్ హాకింగ్ ఏం చెప్పిండు..
బైట్ (స్టీవెన్ హాకింగ్ వాయిస్)
పారా డబ్బింగ్
హాలో..నాపేరు స్టీవెన్ హాకింగ్.. నేను ఫిజిసిస్టుని, కాస్మాలజిస్టుని, నేను కంప్యూర్ సాయంతో మాత్రమే మాట్లాడగలను. అంటే కంప్యూటర్ లో రాసిన స్క్రిస్ట్ వాయిస్ కన్వర్టర్ సాయంతో మాట్లాడగలను.ఇప్పుడు ప్రపంచ మానవాళి మొత్తం అంతా ఆసక్తిగా అడుగుతున్న ఒకే ఒకే ప్రశ్న. ఏటియన్స్ నిజమేనా.. ఎలా ఉంటయి. ఎక్కడ ఉంటయి. వాటి శరీరం ఎటువంటి పదార్ధారలతో తయారయింది. చూడ్డానికి అవి ఎలా ఉంటయి. అవి తెలివైనవా.. ఈ ప్రశ్నలన్నిటికీ నా ఊహా శక్తికి అందిన సమాచారమంతా ఈ స్టోరీ ద్వారా అంతిస్తున్నాను.
స్పాట్
ఈ సృష్టిలో మరెక్కడయినా గ్రహాంతర జీవులు ఉన్నయా.. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే.. మనం ఈ సౌరకుటుంబాన్ని దాటి వెళ్లాలి. భూమిని విడిచి.. ఒక్కొక్క గ్రహాన్ని దాటుకుంటూ.. విశాల విశ్వంలోకి ప్రవేశించాలి
స్పాట్
ఈ విశ్వం ఎంత పెద్దదిగా ఉంటదంటే… మన ఊహకే దాని వైశాల్యం అంతు పట్టనంత పెద్దిగా ఉంటది. మన సౌరకుంటుంబాల్లాంటి వేలాది సౌరకుటుంబాలుంటే ఈ పాలపుంత లో 200ల మిలియన్ల నక్షత్రాలుంటయి… ఇది మన సౌరకుటుంబాల్లాంటి లక్షలాది సౌరకుంటుంబాలుంటే పాలపుంత.. అంటే ఇది మన పాల పుంత అన్నమాట.. ఈ పాలపుంతలోనే కోటాను కోట్ల నక్షత్రాలు గ్రహరాశులున్నయి. అంత పెద్ద పాలపుంత ఈ వైడ్ గెలాక్సీ తో పోల్చుకుంటే ఈ పాలపుంత ఒక చిన్న నీటి బిందువు లాంటిది.
స్పాట్
యాంకర్ 4
రాత్రి వేళ ఆకాశం వైపు చూస్తే మనకు లెక్కలేనన్ని నక్షత్రాలు కనిపిస్తయి. పాలపుంతలు కూడా కనిపిస్తయి. ఐతే మన కంటికి కనిపించే విశ్వం చాలా చిన్నది. ఎంత చిన్నదంటే ఈ మహాగెలాక్సీలో నీటి తుంపరంత.. ఒక్కసారి ఈ పాలపుంతను దాటి లార్జ్ గెలాక్సీలోకి వెళ్లొద్దాం.
స్పాట్
ఈ పాల పుంతల సాగరాన్ని దాటుకుంటు చాలా చాలా దూరంగా.. అంటే పూర్తిగా వెళ్లే ప్రయత్నం చేద్దాం.
స్పాట్
చూశారుగా సుమారు వంద బిలియన్ ల గెలక్సీలు చెట్టు కొమ్మాల్లా ఈ శూన్యంలోకి అన్ని వైపులా విస్తరించుకొని ఉన్నయి.
స్పాట్
ఇంతకీ ఈ విశాల విశ్వానికి ఆది అంతం అనేది ఎక్కడా కనిపించలేదు.
(మళ్లీ..స్పీఫెన్ హాకింగ్ వాయిస్)
నా గణితశాస్ర్త మేథస్సుతో ఆలోచిస్తే ఈ విశాల విశ్వంలో ఎక్కడో ఒక దగ్గర ఏలియన్స్ ఉండటం ఖాయమని నా అభిప్రాయం.. అవి ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో నివసించగలవు.. మండే సూర్యుడి పై కూడా చలించగలగే అవకాశం కూడా ఉండి ఉండొచ్చు..
స్పాట్
ఈ విశాల విశ్వంలో గ్రహాంతర జీవం ఉండే అవకాశాలు అనంతం.
స్పాట్
యాంకర్ 5
ఈ భూమి పై జీవం మొదలయింది ఏకకణ జీవితోనే. ముందు వృక్ష జాతి పుట్టిందా.. జంతుజాతి ఆవిర్భవించిందా అనే విషయం పై ఇప్పటికీ చాలా సందేహాలున్నయి. అయితే మరి ఏలియన్స్ కు పునాది కూడా హరితపదార్ధమేనా.. అక్కడ కూడా మొక్కలున్నయా.. ఉంటే ఎటువంటివి.. మళ్లొక్కసారి గెలాక్సీలోకి తొంగి చూద్దాం.
స్పాట్
ఏలియన్స్ జీవం హరిత వర్ణపు ద్రవంతోనే మొదలయిందా.. ఇది జీవద్రవ్యం ఏర్పడటానికి మొదటిపునాది. ఈ పరిణామమే అత్యంత పరిణితి చెందే జీవుల ఆవిర్భావానికి దారి తీస్తది.
స్పాట్
ఈ గెలాక్సీ సమూహాల నడుమ ఎక్కడో ఒక దగ్గర మనం ఊహించినట్టు.. టి.విలలో .. సినిమాలలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమాల మాదిరిగా ఏలియన్లు ఉండే ఉంటయి. ఇవిస్టార్ వార్ కు సిద్దంగా ఉన్నాయన్న మాటలు కూడా వాస్తవమే అయి ఉండొచ్చు.
స్పాట్
గ్రహాంతర జీవాన్వేషణలో వెలుగు చూస్తున్న కొన్ని ఫార్ములాలు జీవానికి కొత్త అర్ధాన్నిస్తున్నయి. జీవం కొత్త కొత్త రూపాలలో నక్షత్రాల నడుమ కూడా పురుడు పోసుకోవచ్చన వాదనలు కూడా ఉన్నయి.
స్పాట్
ఒక్కోసారి కోటాను కోట్ల సూక్ష్మక్రిములన్నీ కలిసి ఒక మేఘంగా రూపొంది స్వేచ్ఛగా కదలుతూ ఉండొచ్చు. ఇవి ఏ ఆహారం లేకుండా సంవత్సరాల తరబడి జీవించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం.
స్పాట్
గ్రహాంతర జీవం ఉందో లేదో తెలుసుకోవాలంటే ఈ గెలాక్సీని వీడి తిరిగి మళ్లీ మన భూమి పైకి చేరాల్సిందే.
స్పాట్
ఈ పచ్చని ప్రకృతినడుమ జీవార్భావానికి దారి తీసే పరిస్థితులేంటో అనే విషయాలు కోకొల్లలుగా ఉన్నయి. (స్పాట్ తొండ,..)
ఈ భూమి పైన రకరకాల జీవులున్నయి. ఒక్కో జీవి జీవన వైవిధ్యం ఒక్కోరకంగా ఉంటది. వాటి జీవన విధానంలో గానీ, శరీర నిర్మాణం, ఆహారపుటలవాట్లలో గానీ పూర్తి వైరుద్యాలుంటయి.
స్పాట్
జీవం ఏర్పడే అవకాశం ఎలా ఉంటదో తెలుసుకోవాలంటే ముందు జీవాన్ని విశ్లేషించాలి.
స్పాట్
జీవద్రవ్యం, దేహనిర్మాణం జరగాలంటే అమైనో ఆమ్లాలు కావాలి.. అయితే అమైనో ఆమ్లాలు ఒక్కటిగా కలిస్తే జీవం ఏర్పడుతదా.. ఈ సూత్రంతోనే ఎందరో శాస్ర్తవేత్తలు రకరకాల ఊహాగానాలు, పరికల్పనలు చేసిన్రు.
స్పాట్
ఈ సిద్దాంతం ప్రకారం జలాశయాల్లో విడివిడిగా ఉన్న రసాయనాలు కలిసి అమైనో ఆమ్లాలుగా రూపొందినయి. అమైనో ఆమ్లాలన్నీ ఒకదానికొకటి తాకుతూ ఉండేవి. ఏదో ఒకరోజు జీవద్రవ్యం ఏర్పడటానికి అనుకూలమయ్యే ఒక గొలుసు తయారయింది. అంతే ఆ క్షణమే ఈ భూమి పై జీవావిర్భావానికి తొలి అడుగు పడింది.
స్పాట్
తొలిసారి ఏర్పడ్డ ఆ జీవం.. తిరిగి తిరిగి రకరకాల జీవులుగా పరిణితి చెందింది. ఏకకణ జీవులు, బహుకణ జీవులుగా అభివృద్ది చెందినయి. ఇవే తిరగి వర్గాలుగా, విభాగాలుగా, ఉపవిభాగాలుగా అభివృద్ది చెందినయి. అయితే అచ్చు ఇవే పరిస్థితులు ఇతర గ్రహాలపై జరగవని చెప్పలేం. లేదా ఇంతకంటే గొప్ప మార్పులు జరిగే అవకాశం కూడా లేకపోలేదు.. ఇప్పుడిక తిరిగి గెలాక్సీ లోకి వెళదాం..
స్పాట్
యాంకర్ 6
ఇప్పటి వరకు శాస్ర్తవేత్తలు జీవం ఏర్పడటానికి చాలా కారణాలే చెప్పిన్రు. కానీ ఈ భూమి పై జీవం పుట్టడానికి ఇక్కడి పరిస్థితులే కారణం కాదనే కొత్త వాదన పుట్టుకొచ్చింది. ఈ గ్రహం పై ఇప్పుడున్న జీవం వేరే గ్రహం నుంచి వచ్చిందనే వాదన కూడా ఉంది. .
స్పాట్
గ్రహాంతర జీవం కోసం జరిగే అన్వేషణలో ఓ కొత్తనిజం బయట పడ్డది. ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి జీవం రవాణా అయ్యే మార్గం ఒకటి కనుగొన్నరు. గెలాక్సీ లో స్వేచ్ఛగా విహరించే ఆస్టరాయిడ్స్ ఒక్కోసారి తమ కక్ష్య నుంచి బయటపడి ఏదో ఒక గ్రహాన్ని ఢీ కొంటయి. ఈ ఆస్టరాయిడ్ లతో పాటు వాటి పై జీవించే చిన్నా చితక బ్యాక్టీరియా కూడా గ్రహాలను చేరుతయి.
స్పాట్
ఆస్టరాయిడ్ ల పై స్తబ్దుగా ఉన్న చాలా రకాల మైక్రోమ్స్ ఏదైనా గ్రహాన్ని చేరినపుడు అక్కడ అనుకూల పరిస్థితులు ఉంటే వాటి క్రియలను ప్రారంభిస్తయి. ఇప్పుడు భూమి పై ఉన్న సమస్త జాతులకు మూలాలు విశ్వాంతరాళంలోంచి ఊడిపడ్డయేననే కొత్త సిద్ధాంతం వెలుగులోకి వచ్చింది. ఆస్టరాయిడ్ ల ద్వారానే జీవం భూమిని చేరి ఉండొచ్చనే ఒక ఊహ.. ఈ ఊహే నిజం కావాలని లేదు.
స్పాట్
ఆస్టరాయిడ్ నుంచి నేలను చేరిన జీవం ఇంతింతైవటుడింతై అన్నట్టు భూగోళం నిండా జీవజాలంతో నిండిపోయింది. అయితే ఈ పరిణామం ఒక్క భూమికే పరిమితం కాలేదనేది శాస్ర్తవేత్తల అభిప్రాయం. ఇతర గ్రహాలపై కూడా ఇదే విధంగా జీవం అభివృద్ది చెంది ఉండొచ్చనే అభిప్రాయం ఉంది.
స్పాట్
స్టీఫెన్ హాకింగ్ ప్రకారం ఇక్కడ కనిపించే జీవుల వంటి విచిత్ర జీవులు ఏలియన్ లుగా అభివృద్ది చెంది ఉండవచ్చనే అభిప్రాయం ఉంది.
స్పాట్
నీరు.. ఈ సృష్టిలో అత్యంత కీలకం. జీవం ఏర్పడటానికి కావలసిన ప్రధాన వనరు నీరు. అయితే ఈ సౌరమండలంలో గ్రహాంతరాళంలో కూడా నీరు ఘనీభవించిన ఉంది. చిన్న చిన్న క్రిస్టల్స్ రూపంలో ఉంది.
స్పాట్
యాంకర్ 7
మనకు భూమి పై ఉన్ననీరే తెలుసు.. కానీ గెలాక్సీలో శూన్యంలో కూడా వాటర్ ఉంటదట. రేణురూపంలో ఉన్న ఈ నీరు చాలా మందికి తెలయదు.. ఈ సౌరమండలంలో రెండు గ్రహాల మధ్య నీటి చెమ్మ ఆవరించి ఉంది. ఆ రెండింటిలో మొదటిది భూమి. రెండవది ఒకటి భూమికి దగ్గరగా ఉండే మార్స్ గ్రహం.. ఒక్కసారి ఈ మార్స్ పై దాగిన జీవ రహస్యమేంటో చూద్దాం.
స్పాట్
ఇవి మార్స్ గ్రహం ఉపరితల చిత్రాలు. రోబోలు తెచ్చిన ఈ చిత్రాలను శాస్త్రవేత్తలు జాగ్రత్తగా అధ్యయనం చేసిన్రు. మార్స్ గ్రహం పై ఉన్న మట్టిని, రాళ్లను నిశితంగా పరిశీలించిన్రు. ఇక్కడ తెల్లగా కనిపిస్తున్న లవణం వంటిపదార్ధం. ఈ గ్రహం పై నీరుండేదనడానికి నిర్జీవ సాక్ష్యం. ఇక్కడ ఎండిపోయిన సరస్సులా కనిపిస్తున్న ఈ ప్రాంతం నిండా ఒకపుడునీరుండేదని శాస్ర్తవేత్తల ఊహ.. సాటిలైట్ తీసిన చిత్రాలను పరిశీలిస్తే.. పిల్లకాలువలు వాటిని తమలో ఇముడ్చుకున్న పెద్దకాలువల చాయా చిత్రాలను గుర్తించిన్రు. ఇక్కడ ఎడారిలా కనిపిస్తున్న ఇసుక గుట్టలకు కారణం నీరేనని శాస్ర్తవేత్తలు చెబుతున్నరు. ఇసుక రేణువుల నడుమ తేమ ఉండి తీరుతుంది.. ఈ తేమ చాలు జీవం పుట్టడానికి.
స్పాట్
మార్స్ కు సరిగ్రా 30 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న జూపిటర్ గ్రహం ఉంది. దీని చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహం పై కూడా జీవం ఉండే అవకాశాలు మెండుగా ఉండొచ్చనే ఊహాగానాలు బలంగా ఉన్నయి. కారణం ఈ గ్రహం పై ఉన్న పరిస్థితులే.
స్పాట్
ఇది జూపిటర్ ఉపగ్రహం ఉపరితలం. దీనిపై రెండు వేల మైళ్లవిస్తీర్ణంలో మంచు పరుచుకొని ఉంది. ఈ మంచు పొరల మందం 15 మైళ్లు ఉంటది. ఈ 15 మైళ్ల కింద ఉన్న వెచ్చని పొరల్లో జీవం ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నయి. ఈ ఉపగ్రహం జూపిటర్ చుట్టు తిరిగి రావడానికి మూడున్నర రోజులు పడుతది. దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతున్నపుడు ఇది జుపిటర్ గురుత్వాకర్షణ శక్తికి లోనవుతది. ఫలింతంగా ఇది దగ్గరకు ఒత్తబడి లోపలిపొరల్లో తీవ్ర వత్తిళ్లు కలుగుతయి. ఈ వత్తిళ్లు ఉష్ణాన్ని విడుదల చేస్తయి. ఈ ఉష్ణం పై పొరల్లో ఉన్న మంచును కరిగిస్తది. ఈ మంచు నీటిలోనే ఏలియన్ లు ఉండొచ్చని అనుమానిస్తున్నరు.
స్పాట్
ఒంటి నిండా విద్యుత్ బల్బులను అలంరించుకుంటున్నట్టు కనిపిస్తున్న ఈ విద్యుల్లతలు స్టీఫెన్ హాకింగ్ ఊహిస్తున్న ఏలియన్ లు. ఇవి తమ శరీరంలో ఉన్న రసాయనాలను వినియోగించుకొని కాంతిని ఉత్పత్తి చేస్తయని ఊహిస్తున్నరు. ఎందుకంటే వీటిని సూర్యరశ్మి తాకే అవకాశం లేదు. కాబట్టి ఇవి తమ శరీరంలో రసాయనాలతోనే విద్యుత్తు తయారు చేసుకుంటయని భావన..
స్పాట్
ఈ ఏలియన్ లు మనల్ని కంటాక్ట్ చేసే రోజు దగ్గర్నోనే ఉందని భావిస్తున్నరు.
యాంకర్ 8
ఇప్పటి వరకు మనం చూసిన ఆనవాళ్లన్నీ సౌరకుటుంబం పరిధిలోనివే.. ఒక్కసారి ఈ సౌరకుటుంబాన్ని దాటి గెలాక్సీ లోతుల్లోకి తొంగి చూస్తే అక్కడ ఎటువంటి వాతావరణం ఉండొచ్చు. ఆ వాతావరణం జీవార్భావానికి అనుకూలమా కాదా.. ఈ అంశం పై స్టీఫెన్ హాకింగ్ ఏమంటున్నడు.
స్టీఫెన్ వాయిస్
ఈ విశాల విశ్వంలో మనం ఒంటరిగా లేము. మనతో బాటు ఎక్కడో ఒక చోట జీవం సిద్దంగా ఉండటానికి అవకాశాలు లేకపోలేదు.
వాయిస్
శాస్ర్తసాంకేతిక రంగంలో అభివృద్ది చెందినంక గ్రహగతుల గురించి ఎన్నో రహస్యాలు వెలుగులోనికి వచ్చినయి. ఇక్కడ మనకు కనిపించే కెప్లర్ టెలీస్కోప్ ఖగోళాన్ని ఒడగడుతుంటది. అయితే ఇప్పటి వరకు శాస్ర్తవేత్తల దృష్టి నుంచి తప్పిచ్చుకుంటున్న గ్రహం ఒకటుంది. ఇటువంటి గ్రహం ఒకటుందనే ఆచూకీ చూపకుండా తప్పిచ్చకు తిరుగుతోంది. ఎలా సాధ్యం. మనిషి కన్ను గప్పి తిరగడం దీనికి ఎలా సాధ్యమయింది.. కాదు కాదు. సౌరమండలానికి ఆవల ఉన్న నక్షత్రాలను కనుగొనే మానవుడు ఈ గ్రహాన్ని గుర్తించలేకపోవడానికి కారణం ఏంటి.
స్పాట్
ఈ గెలాక్సీలో ఎన్నో రకాల నక్షత్రాలను, గ్రహాలను కనుగొన్నరు. కానీ కొన్ని గ్రహాలు, నక్షత్రాలు టెలీస్కోప్ల కన్నుగప్పినయి. ఇదెలా సాద్యం. అవును.. కొన్ని గ్రహాల గమన తీరే దీనికి కారణం. ఇదిగో ఒక్కడ ఒక యువకుడు డిస్క్ తో వామ్ అప్ చేస్తున్నడు. ఈ డిస్క్ ను తిప్పుతూ దాని బరువుకు తాను కూడా ఒక సర్కిల్ లో చుట్టూ తిరుగుతున్నడు. అచ్చం ఇటువంటి గమనమే ఈ గ్రహానిది. ఇది నక్షత్రం చుట్టూ తిరుగుతూ నక్షత్రాన్ని ప్రభావితం చేస్తుంటది. అంటే ఈ గ్రహాన్ని నక్షత్రమే భారంగా తిప్పుతున్నట్టుఉంటది. అంతేకాదు ఇది నక్షత్రాల నడుమ వేగంగా పరిభ్రమిచడం వలన దీని ఉనికి 1995 వరకు దొరకలేదు. తర్వాత ఇటువంటివి మరో 100 గ్రహాలు ఉన్నట్టు శాస్ర్తవేత్తలు కనుగొన్నరు. ఇదిగో ఇది అటువంటి గ్రహమే..
స్పాట్
ఈ గ్రహం పైనే ఏలియన్స్ ఉండటానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నయని హాకింగ్ అభిప్రాయం… అయితే వేరే గ్రహం పై ఉన్న జీవులు భూమి పై ఉన్నజీవుల మాదిరిగానే ఉండాలనే నిబంధన లేదు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న జీవులను చూడండి. ఇవి హాకింగ్ ఊహించిన రూపాలు. ఇవి నాచు, మన్నుతో జీవించే శాఖాహారులు.
స్పాట్
ముందు పెద్ద పాదం. తలపై రెండు నాసికా రంద్రాలు, శరీరం మద్యలో 180 డిగ్రీలు చూడగల కంటి నిర్మాణం. (స్మాల్ స్పాట్) ప్రాంతమేదైనా కావచ్చు, రూపమెలానైనా ఉండొచ్చు.. కానీ జీవనపోరాటం ఒకటే నని హాకింగ్ ఒపీనియన్. ఇక్కడ కూడా మనుగడ కోసం పోరాటం అనే సూత్రం వర్థిల్లుతుంది. ఒక జీవి పై మరో జీవి దాడి చేయడం.. పోరాడటం వంటివి మామూలే.
స్పాట్
అయితే హాకింగ్ ప్రకారం ఏలియన్స్ ఒకే గ్రహం పై మాత్రమే లేవు.. ఈ విశాల విశ్వగమనంలో ఎన్నో చోట్ల ఎన్నో గ్రహాలపై ఉండొచ్చు. ఆయన ఊహ ప్రకారం మరో గ్రహం పై లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ అతి చల్లగా ఉండి మంచు గడ్డలుగా, ద్రవ రూపంలో ఉండొచ్చు. ఈ లిక్విడ్ నైట్రోజన్ తో బాటు పాస్పరస్, కార్బన్, సిలికాన్ వంటి కొన్ని మూలకాలు ఉండే జీవం పుడుతుందని ఆయన అభిప్రాయం.
స్పాట్
ఇంకా జూపిటర్ , శని గ్రహాల పై కూడా జీవం ఉండే అవకాశాలు ఉండి ఉండొచ్చంటడు హాకింగ్. ఇవి మన కంటే సాంకేతికంగా ఎంతో అభివృద్ది చెందిన జీవులు కూడా కావచ్చు. ఎంతగా అంటే కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరాన్ని కూడా రెప్పపాటులో దాటే సాంకేతిక పరిజ్ఞానం వీటికి ఉండొచ్చనే ఊహ. ఇప్పటి వరకు ఉన్న ఊహాగానాలు పుకార్ల ప్రకారం ఏలియన్ లు కాంతులు వెదజల్లే వాహనాల్లో వస్తరని, మనుషులను, జంతువులను మాయం చేస్తరని కథనాలు వినిపించినయి. సో.. ఇదే నిజమని కాదు.. కానీ హాకింగ్ ఊహ ప్రకారం ఇవి తమ వాహనాలకు కావలసిన ఇందనం నక్షత్రం నుంచే సేకరించుకుంటయి. అది కూడా నక్షత్రం పై వాలి డైరెక్ట్ గా పవర్ ని కాప్చర్ చేస్తయి. నక్షత్రం చుట్టూ డైమండ్ షేప్ లో ఒక కాంతి పుంజాన్ని ఏర్పాటు చేస్తయి. ఈ నాలుగు కోణాలు ఒకే చోట ప్రొజెక్ట్ అయి ఒక ఉష్ణబిలాన్ని ఏర్పాటు చేస్తయి. ఈ ఉష్ణబిలంలో ప్రవేశిస్తే. రెప్పపాటులో కోటాను కోట్ల కాంతి సంవత్సరాలు ప్రయాణించ గలవని హాకింగ్ అభిప్రాయం. అయితే వీటన్నిటికీ రుజువులేమీ లేకున్నా.. అబద్దాలని మాత్రం కొట్టిపారేయలేము. నిజంగా ఏలియన్స్ అంత సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్నవే అయితే వాటి కోసం అన్వేషించడం, వాటిజోలికి పోకపోవడమే మంచిది.
ఎండ్ యాంకర్
అర్ధమయిందిగా ఏలియన్స్ గురించి హాకింగ్ ఏమన్నారో.. ఇవీ ఈ వారం సైంటిఫిక్ అప్ డేట్స్ . వచ్చేవారం మరిన్ని సైన్స్ విశేషాలతో వచ్చేవారం కలుసుకుందాం.. దిసీజ్ శోభన్ సైనింగ్ ఆఫ్..
బ్రేక్ లు.

ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ 38

ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలు విప్పి చెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
స్పాట్
యాంకర్ 1
ఎల్లో స్టోన్ భూగోళం పైనే ఓ అద్భుత ప్రాంతం. ఈ ప్రాంతం ఒక్కో సీజన్ లో ఒక్కో రకమైన వాతావరణం ఉండటమే కాకుండా పూర్తి భౌగోళిక మార్పులు జరుగుతయి. శీతాకాలం మంచు మయమైన ఈ ప్రాంతం కాస్త వేసవి గాలి వీస్తే చాలు. రాళ్ల కుప్పలే మిగులతయి. అయినా పచ్చపచ్చని ఆప్రకృతి ఎంత చూసినా తనివి తీరనంత అద్భుతంగా ఉంటది. గత రెండు వారాలుగా శీతాకాలంలో, వేసవి కాలంలో ఎల్లో స్టోన్ ఎలా ఉంటుందో చూశాం. ఈ వారం వర్షాకాలంలో ఎల్లో స్టోన్ ఎలా ఉంటదో చూద్దాం.
స్పాట్
ఎల్లోస్టోన్.. ఓ ఆల్కానిక్ వండర్ లాండ్.. రెండు మిలియన్ ల ఎకరాల విశాల ప్రాంతం.. ఉత్తర అమెరికా నడిబొడ్డున ఉన్న ఆసక్తి గొలిపే ఏరియా.అంతెత్తు నుంచి దూకే జలపాతాలు. పాము పాకినట్టు హొయలు తీరే వాగు వంకలు. ద్రవీభవించిన మంచు శిలల నుంచి పారుతున్న నీటి చెలిమెల్లో సేదతీరే అడవి జంతువులు. భూతలం పై మేఘాలు పింజల్లా తేలియాడే అద్భుత దృశ్యం ఇక్కడే సొంతం. అడవి మొక్కలను తడుముతూ వెళుతున్న పొగమంచు చూడ ముచ్చటగా ఉంటది.
స్పాట్
సరిగ్గా ఇదే ప్రదేశంలో ఆరు నెలల కిందట మంచు పరుపు ఉండేది. ఇప్పుడది నీటి కొలనుగా రూపాంతరం చెందింది. అప్పటి వరకు మంచు రాజ్యాన్ని ఏలిన ఎన్నో జంతువులు ఇప్పుడు వేసవి తాపం నుంచి తమను తాము రక్షించుకునేందుకు సిద్దపడుతున్నయి.
స్పాట్
ఆగస్టు మాసారంభంలో ఎల్లోస్టోన్ లో ఉండే ఎల్కలు అనబడే అడవి జంతువులు విచిత్ర ధ్వనులు చేస్తుంటయి. ఈ ధ్వనులకు అర్ధం అవి తన జతగాణ్ణి పిలవడమే నట. ఈ వింత ధ్వనులను అర్దం చేసుకున్న మగ ఎల్కీలు ఆడ ఎల్కీలను చేరేందుకు పోటీపడతయి.
స్పాట్
యాంకర్ 2
ఎల్లోస్టోన్ లో ఒక వింత వాతావరణ పరిస్థితి ఉంటది. మన హిమాలయాలను చూస్తే ఎండా కాలంలో కూడా మంచు పర్వతాలు కనిపిస్తయి. శీతాకాలంలో ఉన్నంత మంచు కాకున్నా మంచు పర్వతాల ఆనవాళ్లు మాత్రం అలాగే ఉంటయి. కానీ ఇక్కడ దానికి పూర్తి భిన్నమైన వాతావరణం చూడొచ్చు. శీతాకాలంలో చూడ్డానికి నేలకూడా కనిపించని ఈ ప్రాంతంలో… ఎండాకాలం దాటి వర్షరుతువు వస్తే చాలు మంచు ఆనవాళ్లు కూడా కనిపించవు. అదీ ఎల్లో స్టోన్ స్పెషాలిటీ..
స్పాట్
శీతాకాలం ఈ ప్రాంతం మొత్తం మంచు పరిచినట్టుంటది. ఎండాకాలం ఆ మంచంతా నీటి వాగులై పారడంతో మంచు గుట్టలన్నీ మట్టి దిబ్బలుగా మారిపోతయి. ఈ భూగోళంలో ఒక అరుదైన వింత ప్రాంతం ఈ ఎల్లోస్టోన్. ఎందుకంటే రాకీ కొండల నడుమ ఉండే ఈ ప్రాంతం సీజన్ కో రకంగా తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటది.
స్పాట్
మారుతున్న వాతావరణాన్ని బట్టి ఇక్కడ ఎన్నో కొత్త జీవులు తమ ఉనికిని మార్చుకుంటయి. ఈ కాలంలో ఇక్కడికి యాత్రికుల రద్దీ ఎక్కువ. ఈ వాతావరణంలో మాత్రమే ఇక్కడ మనుషులు సంచరించే అవకాశం ఉంటది. గడ్డి మైదానాలలో బైసన్ లు గుంపులు గుంపులగా తిరుగుతయి. అప్పుడప్పుడే రాలిపడుతున్న మంచు శీతాకాల ఆగమనానికి గుర్తుగా ఉంటది. కొమ్ముల జింకలు ఆ విషయాన్ని గుర్తించి తమకిష్టమైన వాతావరణం రాబోతుందని మంచు పొరలపై గెంతుతయి. కానీ ఈ మార్పు బైసన్ లకు ఎంతమాత్రమూ ఇష్టం లేదు. ఎందుకంటే శీతలంలో వచ్చే మంచు పొరలు వాటికి ఆహారం లేకుండా చేస్తయి.
స్పాట్
యాంకర్ 3
ఎల్లోస్టోన్ లో ఒక ప్రకృతి వింత ప్రకృతి వింత చూడొచ్చు. క్లాక్ పక్షులు తాము దూర దృష్టితో ఆహారాన్ని దాచుకునేందుకు నేలలో గింజలను పాతిపెడతాయి. కానీ రుతువు మారగానే ఆ దాచుకున్న ఆహారమే అటవీ సంపదగా వృద్ది చెందుతుంది.పక్షుల నేలలో పాతిన గింజలే రేపటి కొత్త తరం అడవిగా పురుడు పోసుకుంటది. అంటే ప్రకృతి తనకు తాను తన రూపాన్ని దిద్దుకుంటుదన్నమాట. ఎండాకాలంలో వచ్చే అగ్నికాసరపు నీలి నీడలనుంచి అడవులు పూర్తిగా నాశనం కాకుండా ఈ క్లాక్ పక్షులే తమ ఫుడ్ బ్యాంక్ తో అడవిని కాపాడుతయి.

స్పాట్
సూర్యతాపానికి మొక్కలన్నీ పత్రహరితాన్ని నింపుకుంటయి. పైన్ వృక్షాలు మంచి ఫలాలను వృద్ది చేస్తయి. ఈ పండ్లను తనివి తీరా ఆస్వాదించేందుకు చిట్టి చిట్టి పోటీ పడి మరీ కొమ్మ కొమ్మకూ తిరుగుతుంటయి. ఈ పైన్ పండ్లు చాలా ప్రోటీనియస్ ఫుడ్. ఉడతలు తినగా మిగిలిన ఆహారాన్ని అవి నేలలో బొరియలు తవ్వి జాగ్రత్తగా దాచుకుంటయి. ఈ సీక్రెట్ డ్రీస్లీ బేర్ కు తెలుసు. ఇదే ఆహారం కోసం ఎలుగుబంట్లు వస్తయి. ఉడతలు తెలివిగా దాచుకున్న ఫైన్ పండ్లును ఎలుగు బంట్లు తవ్వి తీసుకొంటయి. అంతే కాదు ఉడతలు చెట్టు మొదట్లో దాచిన పండ్లను కూడా ఎంచక్కా ఆరగిస్తయి. ఈ దోపిడిని చూసి కూడా ఉడతలు ఏమీ అనలేకుండా ఉంటయి. ఈ పైన్ గింజలు క్లాక్ పక్షులకు మంచి ఆహారం. వీటిని ఇష్టంగా తింటయి ఈ పక్షులు. తిన్న వరకు తిని కొన్ని గింజలను తీసుకెళ్లి భూమిలో బొరియలు చేసి దాచుకుంటయి. విత్తనాలు నాటినట్టు నేలలో దాచుకుంటయి. అలా వేలాది పక్షులు ఈ ప్రాంతం నిండా గింజలను దాచుకుంటయి. అవి గింజలను దాచిన ప్రాంతం గుర్తు పట్టేందుకు చిన్న చిన్న రాళ్లు పెడతయి. కానీ పాపం రుతువు మారగానే ఈ గింజలు వసంతంలో తిరిగి మొలకెత్తుతయి. మంచు నిండిన నేలలో ఇవి తిరిగి పైన్ వృక్షాలుగా వృద్ది చెందుతయి.
స్పాట్
స్పాట్
ఎల్కీలు రానున్న శీతలాన్న తలుచుకొని హుషారుగా గడుపుతయి. మగ ఎల్కీలు సంగమానికి సిద్దమై ఆడ ఎల్కీల వద్దకు చేరుకుంటయి. మళ్లీ తొడేళ్ల రాక మొదలవుతుంటది. వీటినుంచి ఎల్కీలు తమను తాము రక్షించుకునేందుకు మొక్కలను అడ్డుగా పెట్టుకొని జీవిస్తయి.
స్పాట్
అప్పటి వరకు జలమయంగా ఉంన్న ప్రాంతమంతా మంచు ముద్దలను ముద్దాడేందుకు సిద్దంగా ఉంటది. నీటి సరస్సులు మంచు సరస్సులుగా రూపాంతరం చెందేందుకు సిద్దపడతయి. నీటి కయ్యలన్నీ స్వచ్చమైన నీటితో కనిపిస్తయి.
స్పాట్
యాంకర్ 4
మనం ఒక చెట్టును కూల్చేయాలంటే ఎంత సమయం పడుతది.. మహా అంటే ఒకరోజు.. అదీ ఒక ఇద్దరు మనుషులు కష్టపడితే.. ఆ కూల్చిన చెట్టును ఫర్నీచర్ గానో వంట చెరుకు గానో తయారు చేయాలంటే మరో రెండు మూడు రోజులు పడుతది. కానీ పెద్ద సైజు ఎలకలా ఉండే ఈ జంతువు ఒక్కరోజులో పెద్ద వృక్షాన్ని నేల కూల్చి, ముక్కలు ముక్కలు చేసి ఒక వడ్రంగిలా వంతెన కడుతదంటే మీరు నమ్మగలరా.. నమ్మితీరాలి.. ఎందుకంటే మనుషులు కూడా చేయలేని పని కేవలం తన నాలుగు పళ్లతో ఈ జంతువు చేసి చూపెడుతది.
స్పాట్
ఇంత పెద్ద చెట్టు పెటీల్మని కూలిపోవడం వెనుక ఓ చిన్న జీవి ఉందంటే నమ్మగలరా.. అవును ఇక్కడ ఎలుకలా కనిపిస్తున్న ఈ జీవి పెద్ద పెద్ వృక్షాలను కొరికి నేల కూల్చుతుంది. కింద పడ్డ చెట్లను ముక్కులు ముక్కలుగా చేసి ఈ ముక్కలను జలాశయంలో తీసుకెళ్లి. నీరు పోకుండా ఈ చెక్క ముక్కలతో అడ్డు కట్ట వేస్తది. ప్రకృతి నేర్పిన పాఠం ఇది. ఆ చెక్క ముక్కల కింద నీటిలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటది.
స్పాట్
ఆటం రుతువులో ఆకాశం వైపు చూస్తే ఎంతో అందంగా ఉంటది. సెప్టెంబర్ మాసంలో ఆకులన్నీ పచ్చని పారాణి పూసుకున్న నిండు ముత్తయిదువుల్లా కళకళలాడుతయి. మొక్కలన్నీ పత్రహరితాన్ని వదిలి జాంతో ఫిల్ నింపుకొంటయి. ఇగుళ్లు ఎర్రగా అడవికి బొట్టు పెట్టినట్టు కనిపిస్తయి. వనకన్యను ముస్తాబు చేసినట్టుండే ఈ వృక్షాలన్నీ ఎల్లోస్టోన్ అందాన్ని రెండింతలు చేసి చూపుతయి.
స్పాట్
ఎల్కీ లన్నీ ఈలలు వేసుకుంటూ అడవంతా కలియ తిరుగుతయి. శీతాకాలానికి వర్షాకాలానికి మధ్య రుతువులో జంతువులన్నీ ఒక రకమైన భావనకు లోనవుతుంటయి. ఒక రకంగా చెప్పాలంటే మధ్యస్థ రుతువులో అయోమయానికి లోనవుతయి. కొమ్ముల దుప్పి తన వన ప్రస్థానాన్ని మొదలేస్తది. రెండు మగ జింకలు ఆదిపత్య పోరుకోసం కొమ్ములతో యుద్దం చేస్తవి. ఎవరో ఒకరు విజేతగా నిలవాలి. ఆ విజేతే ఆ ప్రాంతాన్ని దోచుకుంటాడు. ఇది ప్రకృతి చెప్పిన రహస్యం. ఆ విజేతే అక్కడున్న ఆడ జంతువులపై తన ప్రతాపాన్ని చూపి ముందు తరాలనిస్తది.
స్పాట్
అప్పుడప్పుడే జాలువారుతున్న మంచుతెరలను ఆస్వాదిస్తూ మేల్ ఎల్కీలు శీతల రుతువును ఆహ్వానిస్తున్నట్టుంటయి. ఈ రుతువులో మనుగడ కష్టమని తలచిన జంతువులన్నీ వలస బాట పడుతయి. శీతల రుతువు ప్రారంభంలోఎల్కీలను వేటాడేందుకు వేటగాళ్లు ఈ ప్రాంతానికి వస్తరు. ఈ ప్రాంతంలో తమకు కష్టం తప్పదని గ్రహించిన ఎల్కీలు ఎల్లోస్టోన్ ను విడిచి సుదూర ప్రాంతాన్నికి తరలి వెళతయి.
స్పాట్
యాంకర్ 5
రుతువు రుతువు కో రుతురాగాన్ని వినిపించే ఎల్లోస్టోన్ ఎప్పటికీ తరగని అందాన్ని సొంతం చేసుకుంది. తరిగిపోని వనరులు, ఇగిరిపోని సుగందం దీని సొంతం. నిజానికి భూమి పొరలలో నిక్షిప్తమై ఉన్న రహస్యాలకు ఎల్లొస్టోన్ ఒక తాళం చెవిలాంటిదనే చెప్పొచ్చు. భూగోళం పై ఉండే అన్ని రకాల వాతావరణాలు, చాలా రకాల జీవ జాతులను కలిగి ఉండే ఏకైక ప్రాంతం ఎల్లోస్టోన్. ఇంత భిన్నంగా ఉండ బట్టే దీన్ని నేషనల్ పార్క్ గా గుర్తించిన్రు.
స్పాట్
అందంగా చుట్టచుట్టినట్టుండే మైదానాలు, ఒక పద్దతిగా కనిపిస్తియి. ఎల్కీలన్నీ సంతోశంతో గంతులేస్తూ ఎల్లోస్టోన్ ప్రాంతం నుంచి వలస వెళ్తయి.
స్పాట్
ఇన్ని అందాలూ మూటగట్టుకున్న ఈ ఎల్లో స్టోన్ ప్రాంతం ఒక్కసారైనా చూడాలని ప్రతి అమెరికన్ కోరుకుంటడు. ఆ మాటకొస్తే పర్యాటకం మీద అభిరుచి ఉన్న ఏ వక్తయినా ఎల్లోస్టోన్ కు వెళ్లాలనుకోవడం సహజమే. కానీ ఇక్కడి వాతావరణానికి అలవాటుపడాలంటే మాటలు కాదు.
స్పాట్
ఎల్లోస్టోన్ అందాల వెనుక మృత్యు ముఖాలూ ఉన్నయి. విలయ తాండవం ప్రకృతి పరవశం ఒకే చోట కొలువు తీరిన ప్రాంతం ఎల్లోస్టోన్..
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ విశేషాలు. వచ్చేవారం మరిన్ని సైన్స్ సంగతులతో మీ ముందుంటా..దిసీజ్ యువర్స్ శోభన్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై

ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జి 37

ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలు విప్పిచెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం
యాంకర్ 1
బ్యాంగ్
వాయిస్
ఆరు నెలల మంచు శయనం తరువాత ఎల్లోస్టోన్ క్రమక్రమంగా రూపాంతరం చెందడం ప్రారంభిస్తది. అప్పటి వరకు మంచురాజ్యాన్ని ఏలిన జీవున్నీ ఇక బంట్లు గా మారాల్సిన పరిస్థితి. ఎలుగు బంట్లలాంటి జంతువులు సుప్తావస్థ స్థితిలోకి జారుకొని గ్రీష్మతాపం నుంచి రక్షించుకొనేందుకు సిద్దపడతయి.
భానుడి నులివెచ్చిని కిరణాలు మంచు ముత్యాలను ముద్దాడీ ముద్దాడగానే పరవశించి కరిగిపోయి ఆనంద బాష్పాలుగా ప్రవహిస్తయి. చినుకు చినుకు చిత్తడి నేలై ఒంపు సొంపుల సెలయేరుగా ఒడలు నింపుకుంటది.
ఈ జలాల్లో ఉభయ చరాలు కొత్త ఉత్సాహంతో జలకాలాడతయి. తనువంతా శీతల తాపంతో ఉన్న రుతుకన్య సూర్యుడి వెచ్చని పరిష్యంగం కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తది. అప్పడపుడు దావానలంలా వ్యాపించే అటవీ అగ్ని శిఖల నడుమ ఎల్లోస్టోన్ వేసవిని ఆవహించుకునేందుకు వనమాలతో సిద్దపడతది.
(నక్క..కూత కంటిన్యూ) వేసవి కోసం వేయి కళ్లతో ఎదురు చూసే జీవులన్నీ ఆహ్వాన గీతాలను ఆలపిస్తున్నట్టుంటది. వింటర్ లో విందుభోజనాలు ఆరగించిన జడల జీవులు వదులుగా మారిన మంచు ఎడారిలో అడుగులు తడబడుతుండగా వలస బాట పడుతయి.
వేసవి ఆగమన వాసనను పసిగట్టిన క్రిస్లీ బేర్.. తన పరివారంతో పయనం మొదలు పెడతది. మంచు మడుగులో చేపల వేట మొదలు పెడతది. రుతువు మొత్తం తిరిగి తిరిగి ఈ మంచుకొలనులో చేప మాంసం కోసం ఎల్లోస్టోన్ మొత్తం కలియ తిరుగుతయి.
నిండు శీతలంలో వలస వెళ్లిన జీవులన్నీ మందలు మందలుగా ఎల్లోస్టోన్ ప్రాంతానికి తిరిగి వస్తుంటయి. వేసవి ఆనవాళ్లు చూసి రెట్టించిన ఉత్సాహంతో ఉరుకులు పరుగులు పెట్టుకుంట ఎల్లోస్టోన్ ముఖద్వారానికి చేరుకుంటయి. ఎల్లోస్టోన్ గుండె గుహలో తమకోసం దాచి ఉంచిన ఓ కొత్త ప్రపంచపు తలుపులు తడిమేందుకు అవి కాలంతో పరిగెట్టుకుంటూ వస్తుంటయి. అంతకు ముందు ఇదే ప్రాంతంలో మంచు మడుగుల్లో కూరుకుపోయిన తమకు వెచ్చని నేల గట్టిగా తగలడంతో రెట్టించి ఉత్సాహంతో అడుగులేస్తయి.
అప్పటి వరకు చలికాల సామ్రాజ్యాన్ని గుత్త పెత్తనంగా సొంతం చేసుకున్న బైసన్ లు వేసవి రాకతో పలాయనం చిత్తగిస్తయి. విలయతాండవం చేసే అగ్ని పర్వతం సిగలో వేసిన మంచు దుప్పటి పై తిరుగాడే జీవులు వేడికోసం అలమటించడం బహుషా ఇక్కడ మాత్రమే సాధ్యమేమో. మిలియన్ సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం నిండా వేయి అడుగుల మేర మంచు పరచుకొని ఉండేది. అంత లోతున్న మంచు పుటల కింద దాగున్న ఓ అగ్నిగుండం అప్పుడప్పుడు అనుకోని అతిధిగా వచ్చి. మంచు పొరలను పలచన చేస్తూ చులకనగా చూస్తూ వెళ్లిపోయేది. వేల సంవత్సరాల నాటి ఆ శకున శకలాల శిథిలాలు ఇప్పటికీ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తయి. అలా మంచు కరిగి కరిగి..ఇలా నేల మాళిగలు బయట పడేలా తయారయింది. ఆ నేల పల్లకి పై మొలిచిన మొక్కలను సింగారించుకొని ఎల్లోస్టోన్ ఓ వనకన్యలా కనిపిస్తది. మంచు ముత్యాల నడుమ పొదగ బడిన పచ్చల్లా పసిరిక మొక్కలు కనువిందు చేస్తయి. మంచు పుట్టల్లో పెట్టని కోటలా దాగిన కీటకాలు బాహ్యవాతావరణంలో సంచరించేందుకు బయటకు వస్తయి. వివిధ రకాల పక్షులు కొమ్మకొమ్మకు వాలి తమదైన రాజ్యాన్ని కళ్ళారా చూసి మురిసి పోతయి. నీలి వర్ణపు సొగసులతో చెంగు చెంగున ఎగిరే ఈ పక్షి వేసవిలో ఎల్లోస్టోన్ కు విశిష్ట అతిధి. ఈ కీటకాలన్నీ పక్షికోసమే పుట్టినవన్నంత ఆబగా ఆరగిస్తది. ఆరునెలలుగా ఘనీభవించిన మంచు ఫలకలను మధిస్తున్న ఉష్ణకవ్వానికి తలొగ్గుతూ మంచు గుట్టలన్నీ మంచినీటి వాగులుగా మారుతయి. వాగులనిండా బుడబుంగల్లాంటి పక్షులు కువకువలాడుతూ జలకన్యల్లా జలకాలాడుతయి.అంతెత్తు నుంచి జాలువారే జలపాతాలు వేసవి సూరీడు మీటిన శిలా సంగీతంలా ధ్వనిస్తుంటయి. ఆ జలపాత ఘోషకు వనజీవాలన్నీ పరవశించిపోతయి. ఈ వాగు వరదల్లో జంతువులు కూడా తమ ఉష్ణ తాపాన్నితీర్చుకుంటయి. ఈ జలపాత దారుల్లో అడ్డొచ్చిన వృక్షాలన్నీ నేలకూలాల్సిందే. అంతెత్తునుంచి జాలువారే జలపాతాన్ని చూసి నోరెళ్లబెట్టాల్సిందే. (స్పాట్) ఆరువారాల తరవాత ఎల్లోస్టోన్ వాతావరణంలో పూర్తి స్థాయి మార్పులొస్తయి. బైసన్ లు నీటి మడుగుల్లో స్నానం చేస్తయి. ఎక్కడెక్కడినుంచో రకరకాల పక్షులు అథిదుల్లా వచ్చి అలరిస్తయి. బైసన్లకు కొత్త పసరిక దొరుకుతుంది.ఆర్నెల్ల క్రితం మంచు దుప్పటి కప్పుకున్న ఈ ప్రాంతమంతా ఇప్పుడు ఆకుపచ్చని చీర సింగారించుకున్నట్టుంటది. ఈ వేడి కిరణాలకు నీటి తుంపరలు ఇంద్రధనుస్సును నేలకిందకుదింపుతయి. ఉష్న కయ్యలలో ఉబికి వచ్చే నీరు. భూ అంతరాళాలోనుంచి ఎగజిమ్మే ఆవిరులతో ఈ ప్రాంతమంతా శోభాయమానంగా ఉంటది. బైసన్ ల కొత్త జాతుల ఉత్పత్తి దశ కూడా ఇప్పుడే.
శీతాకాలంలో తమ ప్రతాపాన్ని చూపిన ఎల్బోలు ఇప్పుడు రహస్యజీవనాన్ని గడుపుతయి. కొత్తసంతతికి ప్రపంచపు దారులను పరిచయం చేస్తయి. కూనలన్నీ ఈ వాతావరణానికి అలవాటు పడతయి. ఈ మాసంలో ఎల్లోస్లోన్ ప్రాంతంలో జంతువులు సయ్యాటలు చూసి తీరాల్సిందే.
స్పాట్
నెక్టార్ పుష్పాల నిండా తొణుకుతున్న తేనె ను తాగేందుకు హమ్మింగ్ బడ్స్ ఝుమ్మనే నాదంతో సందడి చేస్తయి. ఒళ్లు విరిసిన పుష్ఫ పల్లకిలో తేనె పిట్టలు మధువు గ్రోలి మైమరిచి పోతయి. నిండా మంచు ఉన్న పర్వతాలు కాస్తా పొడిబారిన మామూలు గుట్టలుగా కనిపిస్తియ. అప్పుడప్పుడూ పలకరించిపోయే వాన చినుకులతో అడవి జీవులన్నీ తమ తాపాన్ని తీర్చుకుంటయి. రాలిన మంచు వానతో రానున్న రుతువుకు స్వాగతమని భావిస్తయి. ఈ మంచు వానకు క్రిస్లీ బేర్ పిల్లలతో హాయిగా సయ్యాల లాడుతది. బైసన్ లు ఈ సడెన్ చేంజ్ ను జీర్ణించుకోలేవు. హమ్మింగ్ బర్డ్ కడుపు నింపే తేనే పూల నిండా మంచు రాలి వాటి పొట్టను కొట్టినట్టుంటది.
ఎల్లో స్టోన్ లో చెప్పుకో దగ్గ పక్షి ఒకటుంది. ఇక్కడ మొక్కలకు రంద్రాలు చేస్తుందే అదే వాటి జీవితకాలాన్ని తగ్గిస్తది. ఎల్లోస్టోన్ ప్రాంతంలో వేసవి లో పూల పందిరి అల్లినట్టుంటది. రకరకాల పూలతో మన్మథబాణం కోసం విరిసిన పూలన్నట్టు ఉంటయి. ఎల్లోస్టోన్ ఎంతగా మారిపోతదంటే ఒకప్పుడు ఇక్కడ మంచు పర్వతాలు ఉన్నయంటే నమ్మలేనంతగా మారపోద్ది. రుతువు రుతువుకు ఇంత మార్పు కనిపించే ఒకే ఒక అరుదైన ప్రాంత భూగోళం పై ఇంతకు మించి వేరెక్కడా లేదు. మంచు విదుల్చుకున్న పర్వతాలన్నీ హరిత వర్ణ చీర కట్టుకున్న వనకన్యలా కనిపిస్తయి. మంచు మడుగులన్నీ ఉష్ణకయ్యాల్లా మారిపోతయి. ఈ కొలను అందాలు చూసి ప్రకృతి మొత్తం ఈ ఒడ్డున్నే వాలి పోయిందనిపిస్తది. వాగు మడుగుల్లో జలచరాలు, ఉబయ చరాలు తనివితీరా తాపాన్ని తీర్చుకుంటయి.
స్పాట్
పక్షులు వేట మొదలేసి చాలినన్న చేపలను తన్నుకుపోతయి. నీటికి ఎదురెళ్లే ప్రాంతంలో చేపలు గుడ్డు పెడతయి. నీటి ప్రవాహంలో ఈ గుడ్డు దూరతీరాలకు చేరి సూర్యరశ్మి చేత పొదగబడుతయి. గ్రీస్లీ బేర్ కూడా ఈ నీటి వాగుల్లో సేద తీరుతయి. ఇవి ఆహారాన్వేషణ కొరకు అడవంతా గాలిస్తయి. పర్వతాలన్నీ పసువర్ణ పూలతో నిండిపోతయి. వసంతం వచ్చి వాలే వరకు ఈ పూలన్నీ ప్రకృతి మాత సిగలో తురుముకున్నంత అందంగా ఉంటయి. గడ్డి పరకలను ఎలుకలు కొరుక్కుని తింటూ రేపటి కొరకు ఆహారాన్ని దాచుకుంటయి. ఉడతలు కూడా రేపలి కోసం ఆహారాన్ని దాచుకుంటయి. ఇవి తన బరువు కంటే 50 రెట్టు ఎక్కువ బరువుండే ఆహారాన్ని రోజు స్టోర్ చేసుకుంటది. ఈ ప్రకృతి ఒడిలో రకరకాల శబ్దాలు సందడి చేస్తయి. ఒకప్పుడు మంచు నిండి పర్వతాలన్నీ మట్టి గుట్టల్లా బోసిపోయి కనిపిస్తయి. వేడి ఎక్కువగా ఉన్న చోట బీడువారిన నేలకూడా ఎండుగడ్డితో బైసన్లకు ఆడ స్థలంగా మారుతది. మంచు పెచ్చులతో ఉన్న ప్రాంతమంతా రాతి కుప్పగా మారడాన్ని చూసి ఆశ్చర్యపోవడం చూసిన వారి వంతవుతుంది.
స్పాట్
తనకు తాను రుతువుకో రంగు పులుముకునే ఈ ఎల్లోస్టోన్ ప్రాంతం వర్ణరుతువులో ఎలా ఉంటుందో వచ్చేవారం చూద్దాం.

ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ 36

ఎ.జనార్ధన్ y do virus kills us
ఇంట్రో యాంకర్
సృష్టి రహస్యాలను విప్పి చెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం..
బ్యాంగ్
యాంకర్ 1
వైరస్.. ఈ పేరు చాలా మందికి పరిచయం ఉన్న పేరు.. వైరస్ చాలా చిన్న జీవి..ఒక్క మాట చెప్పాలంటే అసలు జీవి అనడానికి కూడా ఆధారాలేమీ లేని ఒక ద్రావణం.. వైరస్ గురించి చెప్పాలంటే ఇతిమిద్దంగా పెద్ద నిర్వచనాలేవీ లేవు. దీన్ని జీవులకు నిర్జీవులకు వారధిగా చెబుతరు. అంటే దీనికి జీవి లక్షణాలు కొన్ని నిర్జీవ లక్షణాలు కొన్ని ఉంటయి. ఇంత చిన్న జీవంటే మన కంటికి కూడా కనిపించని..కేవలం బ్యాక్టీరియాలో మాత్రమే కనిపించే బ్యాక్టీరియాలోనే కొన్ని మిలియన్ ల వైరస్ లు డెవలప్ అవుతున్నయంటే..వైరస్ ఎంత చిన్నగా ఉంటదో అర్ధం చేసుకోవచ్చు. ఇంత చిన్న వైరస్ ఇప్పుడు విశ్వనాశనానికే శ్రీకారం చుడుతుందంటే మీరు నమ్మగలరా..అవును ఒక వైరస్ ఇప్పుడు శాస్ర్తవేత్తలకే సవాలుగా మారింది.
స్పాట్
వాయిస్
వైరస్..ఎప్పటి నుంచో వింటున్న పేరు. జలుబు లాంటి సాధారణ జబ్బు నుంచి ఎయిడ్స్ మహమ్మారి వరకు దీని చలువే.. ఈ వైరస్ చేసే వింతలు అన్నీ ఇన్నీ కావు..అలాగని ఇది మానవులను మాత్రమే పగబట్టిన శత్రువు కూడా కాదు. కానీ ఈ వైరస్ ప్రపంచం మొత్తాన్ని గడగడ లాడిస్తోంది.
స్పాట్
సరిగ్గా 2009వ సంవత్సరంలో H1N1 ఇన్ఫొయోంజా వైరస్ ప్రపంచాన్ని పట్టి కుదిపేసింది. ఒక అదృశ్యశక్తి ప్రపంచాన్ని కబళించబోతోందని ప్రపంచం యావత్తూ భయపడింది. ఏం జరుగుతుందో తేలీదు. కనీసం గాలి పీల్చాలన్నా భయం.. స్వేచ్చగా గాలి పీల్చలేని పరిస్తితి. దాని పేరే స్వయం ఫ్లూ..ఈ స్వయం ఫ్లూ ఫోబియాతో ప్రతి చిన్న జలుబును కూడా ఫ్లూ గానే భావించి భయపడ్డరు. రోజుల వ్యవధిలోనే ప్రపంచాన్ని చుట్టి వచ్చిన ఈ వైరస్ భయానికి తాత్కాలికంగా తెరపడింది. ఐనా స్వైన్ ఫ్లూ లాంటి ఎన్నో వైరస్లు పుట్టుకొస్తూనే ఉన్నయి. భవిష్యత్తులో మరింత భయంకరమైన వైరస్లు పుట్టుకురావడం ఖాయం.. ఎందుకు వైరస్ జీవులను చంపుతుంది.
స్పాట్
వైరస్ ఎలా మనుగడ సాగిస్తుందనేది కూడా నేటికీ ఓ బేతాళ ప్రశ్నగానే మిగిలిపోయింది. వైరస్ లో ఉన్న పదార్ధమేంటో ఇప్పటి వరకు కచ్చితంగా తెలియదు. వైరస్ అంటే విషద్రావణం అని మాత్రమే తెలుసు.
స్పాట్
ఇక్కడ శాస్ర్తవేత్తలు వేలాదిరకాల వైరస్ లను అధ్యయనం చేస్తున్నరు. కొత్తకొత్త వైరస్ లు ఎలా పుడుతున్నయి. అవి కలుగ జేసే వ్యాధులేంటి.. వాటి ని ఎలా ఎదుర్కోవాలి అనే వాటి గురించి ప్రధానంగా రీసెర్చ్ చేస్తరు.
స్పాట్
యాంకర్ 2
స్వైన్ ఫ్లూ.. ఈ పేరు తెలియని వారు లేరు. ఆ మధ్యకాలంలో ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించి పదం స్వైన్ ఫ్లూ .. స్వేచ్ఛగా గాలి పీల్చుకోవాలన్నా గడగడలాడాల్సిన పరిస్థితి.. కేవలం ఒక ఇన్ఫ్లూయోంజా రకానికి చెందిన వైరస్ అంటే..మన జలుబుకు కారణ మయ్యే ఒక రకానికి చెందిన వైరస్ శాస్ర్తవేత్తలకే సవాలుగా నిలిచింది. ఇంతకీ ఏంటీ ఇన్ఫ్లూయేంజా వైరస్. ఏంటీ స్వైన్ ఫ్లూ..
స్పాట్
స్వైన్ ఫ్లూ.. ప్రపంచాన్ని భయ పెట్టిన అంటువ్యాధి.. ప్రతి ఒక్కరూ తమ జీవితాల పై ఆశలు వదులుకునేంతగా భయ పెట్టిన వ్యాది. 120 మిలియన్ లమంది ఈ వ్యాధిన పడ్డారని అంచనా.. మీడియా కూడా ఈ వ్యాధి గురించి బాగానే ప్రచారం చేసింది.
స్పాట్
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ వైరస్ లు హె1యన్1 ఇన్ఫూయోంజా వైరస్. దీనికి చాలా రకాలున్నట్టు శాస్ర్తవేత్తలు కనుగొన్నరు. కొన్ని త్రికోణాకరంగా, మరికొన్ని గుండ్రంగా, కొన్ని గుళికలుగా, మరికొన్ని విస్తరించినట్టు ఉంటయి.
స్పాట్
వైరస్ లను , వాటి ఉనికిని కనుక్కోగలిగిన్రు కానీ.. వీటి జీవన విధానమే ఇప్పటికీ శాస్ర్తవేత్తలకు అర్ధంకాని విషయం. ఎందుకంటే ఇది జీవి అనడానికి ఎన్ని తక్కువ ఆధారాలున్నయో నిర్జీవి అనడానికి అంతకంటే ఎక్కువ లక్షణాలున్నయి. ఇది రెప్లికేషన్ అనే ప్రక్రియ ద్వారా బ్యాక్టీరియాలో అభివృద్ది చెందుతది. ఒక మానవ కణంలో ఇది చేరిందంటే ఆ కణాన్ని చంపి కొన్ని మిలియన్ల వైరస్ కణాలను ఉత్పత్తి చేయగలుగుతుంది. అసలు వైరస్ కణాన్ని ఎందుకు చంపుతుందో ఇప్పిటికీ అర్ధం కాదు.
స్పాట్
ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తున్న విజువల్స్ వైరస్ అభివృద్దికి చెందినవే. ఒక కణంలో చేరి వందలాది కణాలుగా ఉద్భవిస్తది. ఒక్కవైరస్ ఒక కణాన్ని చంపేసి మిలియన్ వైరస్ లు పుట్టుకొస్తే.. ఆ మిలియన్ కణాలు ఏంచేయాలి.. అదే పని చేస్తున్నాయి. అతి తక్కువ సమయంలో దేహాన్ని ఛిద్రం చేయగల మహత్తర శక్తి వైరస్ ల సొంతం. అలాగని ఇవేమన్నా కణాలను తింటున్నాయా అంటే అదీ లేదు. వైరస్ కు ప్రత్యేకించి ఆహారం అంటూ ఏదీ లేదు. ఇది కేవలం విషరసాయనం మాత్రమే. ఒక ఆర్ యన్ ఎ కణం మాత్రమే. ఇందులో ఒక కేంద్రకంగానీ ప్రత్యేకించిన యంత్రాంగం గానీ ఉండవు. ఒక్కో వైరస్ ఒక్కో రకమైన నిర్మాణం కలిగి ఉంటుంది. కొన్ని గొలుసులుగా ఉంటే టొబాక్ మోజాయిక్ వైరస్ తొకకప్ప నిర్మాణాన్ని కలిగి ఉంటది. కేవలం ఒకే ఒక ఆర్యన్ ఎ పోచ ఒక జీవితం పై పూర్తి స్థాయి ప్రభావం చూపడమే కాదు. ఆ జీవి జెనెటిక్ కోడ్ మీదనే సవారీ చేసి జీవి లక్షణాలను పూర్తిగా మార్చేసి సిండ్రోమ్ లు గా మార్చగలదు.
స్పాట్
యాంకర్ 3
వైరస్ పుట్టుకకు పునాది ఎక్కడ.. అసలీ వైరస్లు అనేవి ఏ జాతికి చెందిన జీవులు, మనకు ఏక కణ జీవులు, బహుకణ జీవులు. మొక్కలు తెలుసు . కానీ అసలు కణమే లేని జీవులున్నయా.. అలా ఉంటే దానిని జీవే అని పిలుస్తరా..అసలు ఇంతకీ వైరస్ ప్రవృత్తి ఏంటి..
స్పాట్
వైరస్ ఇక్కడా అక్కడా అనే భేదం లేదు. అత్యంత శీతల ప్రదేశాలలో, అత్యంత ఉష్ణ ప్రదేశాలలో, సముద్రాలలో కూడా దీని ఉనికిని గుర్తించవచ్చు. ఇదుగో ఇక్కడ యువ శాస్ర్తవేత్త సముద్రం నుంచి సేకరించిన ఈ అరలీటర్ నీటిలో వివిధ రకాలకు చెందిన వైరస్ లు సుమారు వందల లక్షల కోట్లు ఉంటయని అంచనా .. అయితే ఈ నీరు చూడ్డానికి చాలా స్వచ్ఛంగా కనిపిస్తది.. కానీ ఈ నీటిలో కోటాను కోట్ల బ్యాక్టీరియాలు ఉంటయి. ఈ నీళ్లు తాగిన వ్యక్తిలోకి అవి వలస వెళ్లి తమ పని తాము చేసుకుపోతయి. అయితే అన్నిబ్యాక్టీరియాలు అంత ప్రమాదకరమైనవి కావు.
స్పాట్
వైరస్ సరస్సుల్లో, నదుల్లో, సముద్రాల్లో పుష్కలంగా ఉంటది. పర్యావరణ వ్యవస్థలో వైరస్ లు ప్రధాన పాత్ర పోషిస్తయి. మన కంటికి కనిపించకున్నా పర్యావరణాన్ని శాసించే శక్తి వీటికి ఉంది. వైరస్ లు 20శాతం సముద్రజీవులకు నిత్యం మరణశాసనాలను లిఖిస్తయి. వైరస్ బారిన పడి ఎన్నో జలచరాలు నిత్యం అనారోగ్యంతో బాధపడుతుంటయి.వాస్తవానికి దీన్ని జలాశయం అనేకంటే వైరస్ ద్రవాశయం అనడమే సరియైనదేమో.
స్పాట్
వైరస్ లు ఇప్పుడు పుట్టినవి కాదు. 200ల మిలియన్ సంవత్సరాలకు పూర్వమే ఈ నింగీ, నేలా, జలాల్లో వైరస్ ఆక్రమించి ఉంది. కొన్ని కోటాను కోట్ల రకాల వైరస్లు ఈ భూగోళం పై పుట్టుకొచ్చినయి. అసలీ వైరస్ లు పట్టుక ఎక్కడ.. వీటి ప్రస్థానం గురించి తెలుసుకోవాలంటే..ఈ భూమి పై జీవరాశి పుట్టుక చరిత్రను తిరగేయాల్సిందే.. అంటే మనం ఈ భూమి పై జీవరాశి పుట్టుకకు ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నయో అటువంటి పరిస్థితులు ఉన్న ప్రాంతానికి వెళ్లి తీరాలి. మరి ఈ భూగోళం పై ఇంకా అటువంటి పరిస్థితులు ఉన్న ప్రాంతం ఉందా.. యస్..ఆ ప్రదేశమే ఎల్లో స్టోన్..
స్పాట్
యాంకర్ 4
ఎల్లో స్టోన్ పార్క్ చాలా ప్రయోగాలకు నిలయం. భూమి ఉద్భవించినంక జీవరాశి పుట్టుకపుడు ఏ రకమైన వాతా వరణం ఉందో దాదాపు ఆ తరహా వాతావరణం ఇక్కడ ఉంటది. అంతే కాదు ఆ కాలం నుంచి నేటి కాలం వరకు ఏఏ రకాలైన వాతావరణ పరిస్థితులు ఉన్నయో అన్ని రకాల వాతా వరణ పరిస్థితులను చూడగల ఒకే ఒక ప్రాంతం ఎల్లోస్టోన్.. ఈ భూగోళం పై వింత దృశ్యాలకు ఆలవాలమైన ఎల్లోస్లోన్ కు వెళ్లి చూసొద్దాం.
స్పాట్
ఇదే ఎల్లోస్టోన్ ప్రాంతం..ఇక్కడ..భూమిపై నాలుగు బిలియన్ సంవత్సరాలకు ముందు ఎటువంటి పరిస్థితులు ఉండేవో సరిగ్గా అటువంటి పరిస్థితులే నేటికీ ఇక్కడ ఉన్నయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది భూమి పై ప్రాధమిక జీవనానికి ఒక నమూనా లాంటిదని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం చాలా అరుదైన ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ భుగభుగ మని పొగలు కక్కే ఉష్ణకాసారాలు, వాటి పక్కనే అంతెత్తున ఎగజిమ్మే వేడినీటి చెలిమెలు పక్కపక్కనే ఉంటయి. అడుగు తీసి అడుగేస్తే అరికాలు కిందే అగ్ని శిఖలు బగ్గుమనే వింతయిన ప్రాంతమిది. ఇక్కడ నిత్యం భూమి నుంచి ఉష్ణ గాలులు అధిక వత్తిడితో పైకి లేస్తుంటయి. అత్యంత ఉష్ణం, అత్యధిక శీతలం ఉండే అరుదైన ప్రాంతమిది.
స్పాట్
ఈ ఎల్లో స్టోన్ పరిసర ప్రాంతాలన్నీ భూమి ప్రాధమిక దశలో ఉన్న పరిస్థితుల్లోనే ఉంటయి. ఈ ప్రకృతి మాత తన కిష్టమైన ప్రాధమిక రూపానికి ఆనవాలుగా ఈ ప్రాంతాన్ని చెక్కు చెదరకుండా అలానే ఉంచుకుందా అనిపిస్తది.
స్పాట్
ఈ సృష్టిలో జీవం ఒక పద్దతి ప్రకారం ఏర్పడిందనేది శాస్ర్తవేత్తల భావన. దీనినే ల్యూకా భావన అని పిలుస్తరు. ఈ భావన ప్రకారం… మూడున్నర మిలియన్ ల సంవత్సరాకు ముందు.. ఈ భూమి పై మొట్టమొదట కేంద్రక పూర్వ జీవులైన బ్యాక్టీరియా లు ఉద్భవించినయి. ఆ తరువాత కేంద్రకయుతజీవులు తయారయినయి. వీటినే నిజకేంద్రక జీవులని పిలిచిన్రు. ఈ నిజకేంద్రక జీవుల్లో శిలీంద్రాలు, శైవలాలు, మొక్కలు, జంతువులు, మనతో కలిపి అన్నీ ఆ తరువాతే అభివృద్ది చెందినవి. 1970లో శాస్ర్తవేత్తలు ఈ రెండు రకాలు కాకుండా..అంటే కేంద్రక పూర్వ జీవులు, నిజకేంద్రక జీవులు కాకుండా ఈ రెంటికి మధ్యలో ఓ కొత్త రకమైన జీవులను కనుగొన్నరు. వాటినే ఆర్కియా అని పిలిచిన్రు. ఇవి సజీవులకు నిర్జీవులకు మధ్య వారసులుగా నిలిచినయి.
స్పాట్
యాంకర్ 5
మనం డాక్టర్ దగ్గరకు వెళితే కాచి చల్లార్చిన నీటినే తాగమని సలహా ఇస్తరు. వేడి నీళ్లలో బ్యాక్టీరియా, వైరస్ లు చనిపోతయని వీరి నమ్మకం. మరి అది నిజమేనా..నిజమే కావచ్చు..కానీ అన్ని రకాల వైరస్ లు, బ్యాక్టీరియాలు వేడి నీటికి లొంగవు. అవి సలసల కాగే ఉష్ణకాసారంలో కూడా బతకి బట్టకట్టవని నిరూపించిన్రు శాస్ర్తవేత్తలు.
స్పాట్
లావాలా భుగభుగ మసిలే ఈ నీటిలో కూడా వైరస్, బ్యాక్టీరియాలు బతికి ఉన్నయంటే నమ్మగలరా.. నిజం.. ఈ నీటిలో కూడా వైరస్ బతికే ఉంటది. వీటినే ఉష్ణప్రియ వైరస్ లు అంటరు.. సాధారణంగా మనకు వైద్యులు కాచి చల్లార్చిన నీటినే తాగమని చెప్తరు. మన ఇళ్లలో మామూలుగా కాచి చల్లార్చిన నీటిలో బ్యాక్టీరియా ఉండదని వైద్యులు చెప్తుంటరు. మరి అట్లాంటపుడు ఇలా సలసల కాగే ఉష్ణకాసారం లాంటి నీటి గుండంలో వైరస్ లు ఉన్నయంటే నమ్మకగలమా.. ఆ అనుమానమే వచ్చింది ఒక శాస్ర్తవేత్తకు అందుకే నీటి చెలిమెలో కొంత నీటిని తీసుకొని పరిక్షించిండు.
స్పాట్
సలసల కాగే ఈ నీటిలో కూడా బ్యాక్టీరియాను గుర్తించిన్రు. దాని పేరే ఆర్కియా..ఇది అతి పురాతన వైరస్.. ప్రాథమిక జీవి ఏర్పడటానికి ముందే ఈ ఆర్కియా వైరస్ ఏర్పడిందని శాస్ర్తవేత్తల భావన. ప్రకృతి పరిణామంలో వైరస్ కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. రకరకాల జాతులు పుట్టుకకు కూడా వైరసే కారణమనే వాదన కూడా బలంగా ఉంది. కొన్ని రకాల వైరస్లు జంతువుల శరీరాలలో చేరి వాటి జీవన గమనంలో పూర్తి మార్పు తెచ్చినయనే సిద్దాంతం కూడా ఉంది. ఒకానొక దశలో ఈ ప్రకృతి మొత్తాన్ని వైరస్ లే శాసించినయి. ఎందుకంటే సహజసిద్ద మరణం లేని జీవి వైరస్..ఆ మాటకొస్తే వైరస్ అసలు జీవే కాదు. అదో నిర్ణాయక ప్రాథమిక జీవ పదార్దం.
స్పాట్
వైరస్ లన్నీ హానికరమైనవి కావు... అలాగని అన్ని వైరస్లు అన్ని రకాల జీవుల మీద ప్రభావం చూపవు.. జంతువులకు హాని చేసే వైరస్ లు మొక్కలకు ఉపయోగ పడొచ్చు. అలాగే మొక్కలకు హాని చేసే వైరస్ లు జంతువులకు హాని చేయకపోవచ్చు. ఇదిగో ఇక్కడ లాబొరేటరీలో ఈ శాస్ర్తవేత్త చూపించే ప్రయోగం అదే. ఈ ఆకుపచ్చని టిష్యూకల్చర్ మొక్క పై వాలిన వైట్ ఫ్లైలను చూడండి. ఇవి మొక్క పై ఉన్న పత్రహరితంతో బాటు దానికి సోకిన వైరస్ ను కూడా ఆరగిస్తుంది. కానీ ఈ వైట్ ఫ్లైకి ఏమీ కాదు. ఈ వైట్ ఫ్లై సుమారు వంద రకాల వైరస్ నుంచి తనను తాను కాపాడుకోగలదు. కానీ ఇదే వైట్ ఫ్లై మరో మొక్క మీద వాలినపుడు ఈ తెల్ల ఈగ ద్వారా ఆ మొక్కలోకి వైరస్ సంక్రమణ జరుగుతది. వైరస్ ఒక చోటనుంచి మరో చోటకు బదిలీ కావడానికి ఈగలు కూడా వాహకాలే.
స్పాట్
వైరస్ లు చాలా రకాలుగా ఉంటయి. కొన్ని మామూలు జలుబుతో వదిలేవయితే మరికొన్ని ప్రాణాంతక వ్యాధులను తెచ్చిపెట్టేవి. ఇన్ఫ్లూయేంజా వైరస్ ప్రపంచాన్నే గడగడ లాడించింది. కొన్ని రకాల వైరస్ జీవి ప్రవర్తననే పూర్తిగా మార్చేస్తయి. కుక్కల్లో వచ్చే రేబిస్ వ్యాధి ఈ కోవకు చెందిందే..రేబిస్ వ్యాధి సోకగానే కుక్కలైనా మనుషులైనా వారి వాస్తవ ప్రవర్తను కోల్పోతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక రకమైన మనోవ్యాధి గ్రస్తులవుతారన్న మాట. ఎందుకంటే ఈ వైరస్ బ్రెయిన్ పై పని చేస్తుంది.
స్పాట్ (కుక్కలు మొరగడం)
ఫ్లూ వైరస్ వర్షాకాలంలో వేగంగా విస్తరిస్తుంది. బస్ లు రైళ్లలో ప్రయాణించే వారికి ఇది వేగంగా సోకుతది. ఫ్లూ వైరస్ క్రియాశీలంగా పనిచేసే కాలం వర్షాకాలం కాబట్టి ఈ కాలంలోనే జలుబు ఎక్కువగా వస్తది. చిన్నాచితకా జబ్బులైతే పెద్ద సమస్య లేదు గానీ, మరీ మరణ శాసనాలను లిఖించే వాటితోనే ఇబ్బంది. వైరస్ లలో రారాజు అని చెప్పే వైరస్ హెచ్ ఐ వి వైరస్.
స్పాట్
వైరస్ శరీరాన్ని సోకినప్పటకీ అది కొంత ప్రాంతాన్నే ప్రభావితం చేయడం కూడా శాస్ర్తవేత్తలను విస్మయానికి గురిచేసే అంశం. స్మాట్ ఫాక్స్ కలుగజేసే వైరస్ కేవలం చర్మానికి మాత్రమే పరిమితం. ఇది మనిషిని చంపదు. కేవలం అంతర్భాగాలపై మాత్రమే ప్రభావితం చూపుతది. H1N1 ఇన్ఫ్లుయేంజా వైరస్ మాత్రం ఊపిరితిత్తుల్లోకి లోతుగా వెళ్లి అక్కడి కణజాలాన్ని పూర్తిగా నాశనం చేస్తది. అప్పడు ఊపిరితిత్తులు సరిగా పనిచేయవు. ఆక్సీజన్ తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతది. దీనివలన వ్యక్తి నిమోనియా అనే వ్యాధితో మరణిస్తడు.
స్పాట్
యాంకర్ 6
వైరస్ వల్ల ఒక జాతికి జాతే తుడిచి పెట్టుకు పొయిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఒక ప్రాంతాన్ని మొత్తం కబళించి తరతరాలుగా వేదించే వైరస్ ఒకటి ఉందంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఈ వైరస్ లీలలు తెలుసుకోవాలంటే మనం మధ్య ఆఫ్రికా వెళ్లి తీరాల్సిందే.
స్పాట్ (మోటర్ సైకిల్ వెళ్లే సీన్)
ఇది కాంగో ఏరియా.. ఇక్కడ ప్రజలు నాగరిక ప్రపంచానికి దూరంగా ఆటవికులుగా ఉంటరు. వీరికి మంచి చెడులు అంతగా తెలియవు. దొరికింది తినడం హాయిగా ప్రకృతి ఒడిలో జీవించడమే వీరికి తెలుసు. ఈ వైరస్ ల గురించి గానీ, బ్యాక్టీరియా గురించి గానీ వారికి తెలియదు. ఇటువంటి అయాయక ప్రజలను తరతరాలుగా పట్టి పీడిస్తున్నదో మహమ్మారి. అదే మంకీ ఫాక్స్.. మంకీ ఫాక్స్ అనేది స్మాల్ ఫాక్స్ కు కజిన్ లాంటిదని శాస్ర్తవేత్తలు అభివర్ణిస్తరు. హెచ్ ఐ వి వైరస్ కూడా ఈ ప్రాంతం నుంచె పుట్టిందని శాస్ర్తవేత్తల అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడి ప్రజలు కోతులను ఆహారంగా తీసుకుంటరు. కోతుల శరీరంలో ఉన్న వైరస్ వీరికి సంక్రమించడం, అది ఒకరినుంచి మరొకరికి వ్యాపించి జాతి మొత్తాన్ని ఆవరించింది. నిజానికి తమ శరీరాల్లో ఈ వైరస్ ఉందన్న విషయం ఈ అమాయక జీవులకు తెలియదు. అది ఎలా వ్యాపిస్తుందో కూడా వీరికి తెలియదు. మనం కూడా ఒక్కసారి ఈ కాంగో అడవుల్లో తిరిగితే వీరి జీవన ప్రవృత్తి ఏంటో తెలుస్తది. పదండి పోదాం..
స్పాట్(అడవిలోకి వెళ్లే సీన్స్)
అడవిలో దొరికే వివిధ జాతులకు చెందిన కోతులను ఎయిర్ గన్ లతో వేటాడుతరు ఇక్కడి వారు. గుంపుగా వెళ్లిన వీరిలో ఏ ఒక్కరికి వేట దొరికినా అందరూ వాటాలేసుకొని కలిసి పంచుకుంటరు. కానీ శాస్ర్తీయంగా ఈ కోతిని పరిశీలిస్తే దీని ఆకారమే ఒక వ్యాధికారకంలా కనిపిస్తది. ఈ చనిపోయిన కోతి అప్పటికే వైరస్ తో జబ్బుపడి ఉంది. వికృతంగా ఉన్న ఈ జీవిని ఖండఖండాలు చేసి తలా కొంచెం పంచుకుంటరు. దాని ఫలితం అందరూ అనుభవిస్తరు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికీ ఈ మంకీఫాక్స్ అనే వ్యాది సోకిందిక్కడ. ఇక్కడ చిన్నారుల చర్మం పై చిన్న చిన్న బొడిపెల్లా ఉన్న ఇవి మంకీఫాక్స్ జబ్బు లక్షణాలు. ఈ వ్యాధి సమూహంలో ఒకరి నుంచి మరొకరికి వేగంగా సొకుతుంది.
స్పాట్
మంకీ ఫాక్స్ వ్యాధి సోకిన వారు లేదా ఆ వ్యాధి ప్రాధమిక దశలో ఉన్నవారు జన సమర్ధంలో తిరిగినపుడు వారికి కూడా అది వ్యాపిస్తది. విమానయానం చేసి ఈ వైరస్ ను ఖండాంతరాలకు వ్యాపింపజేసిన్రు. ఇప్పుడీ వ్యాది ప్రపంచంలో చాలా దేశాలకు పాకింది. ఈ వ్యాధి సోకిన వారు రైళ్లలో, షాపింగ్లలో, వివిధ దుకాణాలలో పని చేయడం వల్ల ఈ వైరస్ గిరిజనుల నుంచి నాగరికులకు వేగంగా వ్యాపించింది.
స్పాట్
యాంకర్ 7
1958 వరకు హెచ్ఐవి వైరస్ గురించి ప్రపంచానికి తెలియదు. ఇది చాలా సహజమైన వ్యాధి గానే భావించిన్రు. కానీ అది సిండ్రోమ్ గా మారి మనుషులను జీవచ్ఛవాలుగా మార్చడం చూసి ఇది ప్రత్యేక మైన వ్యాధిగా గుర్తించిన్రు. ఎక్కడో మధ్య ఆఫ్రికాలో పుట్టిన హెచ్ఐవి వైరస్ ఇప్పుడు ప్రపంచాన్నే వణికిస్తుంది. స్మాల్ ఫాక్స్ , పోలియో లాంటి కొన్ని వైరస్ లకు వ్యాక్సిన్లు ఉన్నయి. ఈ వ్యాక్సిన్లు వాడిన వారి శరీరంలోకి వైరస్ సంక్రమించినా వ్యాధులను కలుగజేయవు సరికదా అవి వారి శరీరంలో జీవించలేవు.
స్పాట్
ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తులు స్మాల్ ఫాక్స్ వైరస్ బారిన పడిన వారే. స్మాల్ ఫాక్స్ దెబ్బకు జీవితాలను చిద్రం చేసుకున్న ఈ అభాగ్యులకు ఆ వైరస్ ంటే ఏమిటో తెలియదు. అసలీ మహమ్మారి తమనే ఎందుకు ఆవరించిందో తెలియదు.
అంతగా వైధ్యం అభివృద్ది చెందని ఆ రోజుల్లో స్మాల్ ఫాక్స్ వ్యాధి సోకితే మరణమే శరణ్యం. ఈ వ్యాధి సోకిన ముగ్గురిలో ఇద్దరు చనిపోవలసిందే. బ్రతికిన ఆ ఒక్కరు కూడా మృత్యుద్వారాల ముందు దినదిన గండం గా గడపాల్సిందే. ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి గాలి, నీరు, ఆహారం ద్వారా సోకడంతో దాదాపు ప్రపంచాన్ని మొత్తం తుడిచిపెడుతుందనే భయం పట్టుకుంది. ఎన్నో పరిశోధనల తరువాత స్మాల్ ఫాక్స్ కు ఒక టీకా కనిపెట్టిన్రు. ఈ టీకా వేసే విధానం కూడా కాస్త ఇబ్బందిగానే ఉండేది.. ఈ టీకా గురించి మొదట్లో అపోహలు ఉండటం వల్ల మొదట్టో వీటిని వేయించుకోవడానికి ప్రజలు భయపడ్డరు. తరువాత చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు కౌంట్ చేసి మరీ ఈ టీకాలు వేయడంతో ఈ వైరస్ నుంచి ముక్తి కలిగింది.
స్పాట్
20వ శతాబ్దంలో సుమారు 300 విలియన్ల మందికి ఈ స్మాల్ ఫాక్స్ వ్యాధి సోకింది. వ్యాక్సిన్ కనిపెట్టడం, దాన్ని ప్రజలపై ప్రయోగించడం ఒక బాగమైతే తరువాత వాతావరణ పరిస్థితుల్లో ఈ వైరస్ పూర్తిగా నిర్మూలించబడింది.
స్పాట్
ఇప్పడు ప్రపంచాన్ని భయపెడుతున్న మరో మహమ్మారి వైరస్ హెచ్ఐవి. ఎన్ని ప్రయత్నాలు చేసినా హెచ్ఐవి కి వ్యాక్సిన్ కనిపెట్టలేకపోవడానికి కారణాలు న్నయి. మొదట ఇవి మనిషికి సోకినపుడే మానవ కణంలో మల్టిప్లెక్స్ విధానం ద్వారా నిత్యం లక్షలాది వైరస్ లను ఉత్పత్తి చేస్తది. ఈ వైరస్లు మానిషి వ్యాధి నిరోదక వ్యవస్థను తుడిచేసే ప్రయత్నం చేస్తది. దాంతో మనిషిలో ఉన్నరోగ నిరోదక వ్యవస్థ పూర్తిగా తగ్గిపోయి చిన్న జ్వరానికే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తది.
స్పాట్
హెచ్ ఐ వి వైరస్ ను కనుగొని ఆరు దశాబ్దాలు అవుతున్నా దీనికి వ్యాక్సిన్ కనుగొనడం చాలా కష్టంగా మారింది. దీనికి ఒక బలమైన కారణం ఉంది. ఒక రకమైన వైరస్ అయితే దానికి తగిన మందు కనుక్కోవచ్చు . కానీ ఒకే వైరస్ తన రూపాన్ని కొన్ని లక్షల రూపాల్లోకి మార్చుకుంటే ఎన్ని లక్షల వ్యాక్సిన్ లు తయారు చేయాలి. ఇదే శాస్ర్తవేత్తల ముందు ఉన్నప్రశ్న.
స్పాట్
హెచ్ ఐవి వైరస్ రెప్లికేషన్ విధానంలో అభివృద్ది చెందుతది. అయితే ఇది తనను తాను కాపీ చేసుకొని తన జీన్ పోచలను తయారు చేసుకొంటది. కానీ ఇది తన పోచ తాను తయారు చేసుకొనే క్రమంలో కొన్ని నత్రజని క్షారాలను మరిచిపోతది. జీన్ కోడ్ లో మార్పు ఉండటం వలన..కొత్తగా ఏర్పడే వైరస్ కు అంతకు ముందు ఉన్న వైరస్ కు లక్షణాలలో, రూపంలో సారూప్యం ఉండటం లేదు. అంటే హెచ్ ఐవి అనేది ఒక రకమైన వ్యాధికలిగించే భిన్నరూపాలున్న వైరస్ అన్నమాట. ఒక రకమైన వైరస్ ను నిర్మూలించే వ్యాక్సిన్ దాని ఉత్పత్తిని నిర్మూలించలేని పరిస్థితి ఉంది. వైరస్ ఎప్పటికపుడు రూపాలను మార్చుకోవడం, లక్షణాలను మార్చుకోవడం వల్ల దాని పై ప్రయోగించే వ్యాక్సిన్ కనుగొనడం కూడా చాలి ఇబ్బందిగా మారింది.
స్పాట్
యాంకర్ 8
హెచ్ ఐ వి వైరస్ కు మందులు లేవా.. హెచ్ ఐవి సోకితే చనిపోవలసిందే..ఎవరూ బ్రతకరా..మామూలు మానవుణ్ని కూడా వేదించే ప్రశ్నలివి..కానీ ఇది వాస్తవం కాదు. ఎయిడ్స్ సోకిన మనిషి కూడా హాయిగా మామూలుగా బతకొచ్చు. ఇది కూడా మామూలు జబ్బుల మాదిరే..కానీ కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి.
స్పాట్
హెచ్ఐవి వైరస్ నుంచి కాపాడేందుకు వ్యాక్సిన్ లు లేకున్నా ఈ వ్యాధి సోకిన మనిషి జీవితకాలాన్ని పొడిగించేందుకు మందులున్నయి. యాంటీరిట్రోవైరల్ డ్రగ్స్ వాడటం వలన చాలా వరకు జీవితకాలాన్ని పొడిగించుకునే అవకాశం ఉంది. అయితే ఇది క్రమం తప్పకుండా వాడాలి.
స్పాట్
హెచ్ఐవి వైరస్ కు సరియైన టీకా కనుగొనడానికే కుస్తీపట్లు పడుతున్న మన శాస్ర్తవేత్తలకు స్వైన్ ఫ్లూ ఒక సవాలు విసిరింది. స్వైన్ ఫ్లూ వ్యాధిని కలుగజేసే H1N1 వైరస్ పక్షులను, పందులను, మానవులను ఈ వ్యాధికి గురిచేస్తది. అయితే పక్షుల నుంచి, పందుల నుంచి, మానవుడి నుంచి ఈ వైరస్ ను సేకరించి దాని పై ప్రయోగాలు చేసిన్రు. ఈ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొనే వరకు ఇది సోకకుండా జాగ్రత్తపడటమే మార్గంగా తోచింది. అందుకే ప్రపంచ పౌరులంతా మాస్క్ లు ధరించి ముందు జాగ్రత్త తీసుకున్నరు. దీని కోసం ప్రభుత్వాలు కూడా జాగ్రత్తతీసుకొని మాస్క్లను పంచి పెట్టినయి. స్వైన్ ఫ్లూ సోకిన వ్యక్తులను విడిగా తీసుకొని వైద్యం చేసే ప్రయత్నం చేసినయి.
స్పాట్
జీవి..నిర్జీవి కానీ ఒక మాధ్యమిక విష రసాయనం సృష్టి నిర్మాణాన్నే శాసిస్తుంది. దాని పేరే వైరస్..సృష్టి ఆది నుంచి ఉన్న ఈ పదార్దం రోజు రోజుకు తన రూపాన్ని మార్చుకుంటూ మానవ విజ్ఞానానికే సవాలుగా నిలిచింది. రానున్నకాలంలో మానవజాతి మొత్తాన్ని తుడిచి పెట్టే వైరస్ పుట్టుకొచ్చినా ఆశ్యర్యం లేదు. అలా పుట్టుకొచ్చే వైరస్ కు మానవుడే పురుడు పోస్తడు. తన చుట్టూ ఉన్న పరిసరాలను కాలుష్యం చేయడం విపరీతంగా రేడియో థార్మిక పదార్ధాలు ఉపయోగించడం వలన కొత్త జాతుల వైరస్లు ఉత్పరివర్తనాల వలన పుట్టుకొస్తున్నయి. ఏదో ఒక రోజు ఇవి పెరిగి పెరిగి భూగోళం పై జీవనాన్ని ప్రశ్నార్ధకంగా మార్చినా ఆశ్చర్యంలేదు.
స్పాట్
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ విశేషాలు..మరిన్ని లేటెస్ట్ సైంటిఫిక్ అప్ డేట్స్ తో వచ్చేవారం మళ్లీ కలుసుకుందాం.. దిసీజ్ యువర్స్ రాజేశ్ సైనింగ్ ఆఫ్
బ్రేక్ లు.