ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలు విప్పి చెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
స్పాట్
యాంకర్ 1
ఎల్లో స్టోన్ భూగోళం పైనే ఓ అద్భుత ప్రాంతం. ఈ ప్రాంతం ఒక్కో సీజన్ లో ఒక్కో రకమైన వాతావరణం ఉండటమే కాకుండా పూర్తి భౌగోళిక మార్పులు జరుగుతయి. శీతాకాలం మంచు మయమైన ఈ ప్రాంతం కాస్త వేసవి గాలి వీస్తే చాలు. రాళ్ల కుప్పలే మిగులతయి. అయినా పచ్చపచ్చని ఆప్రకృతి ఎంత చూసినా తనివి తీరనంత అద్భుతంగా ఉంటది. గత రెండు వారాలుగా శీతాకాలంలో, వేసవి కాలంలో ఎల్లో స్టోన్ ఎలా ఉంటుందో చూశాం. ఈ వారం వర్షాకాలంలో ఎల్లో స్టోన్ ఎలా ఉంటదో చూద్దాం.
స్పాట్
ఎల్లోస్టోన్.. ఓ ఆల్కానిక్ వండర్ లాండ్.. రెండు మిలియన్ ల ఎకరాల విశాల ప్రాంతం.. ఉత్తర అమెరికా నడిబొడ్డున ఉన్న ఆసక్తి గొలిపే ఏరియా.అంతెత్తు నుంచి దూకే జలపాతాలు. పాము పాకినట్టు హొయలు తీరే వాగు వంకలు. ద్రవీభవించిన మంచు శిలల నుంచి పారుతున్న నీటి చెలిమెల్లో సేదతీరే అడవి జంతువులు. భూతలం పై మేఘాలు పింజల్లా తేలియాడే అద్భుత దృశ్యం ఇక్కడే సొంతం. అడవి మొక్కలను తడుముతూ వెళుతున్న పొగమంచు చూడ ముచ్చటగా ఉంటది.
స్పాట్
సరిగ్గా ఇదే ప్రదేశంలో ఆరు నెలల కిందట మంచు పరుపు ఉండేది. ఇప్పుడది నీటి కొలనుగా రూపాంతరం చెందింది. అప్పటి వరకు మంచు రాజ్యాన్ని ఏలిన ఎన్నో జంతువులు ఇప్పుడు వేసవి తాపం నుంచి తమను తాము రక్షించుకునేందుకు సిద్దపడుతున్నయి.
స్పాట్
ఆగస్టు మాసారంభంలో ఎల్లోస్టోన్ లో ఉండే ఎల్కలు అనబడే అడవి జంతువులు విచిత్ర ధ్వనులు చేస్తుంటయి. ఈ ధ్వనులకు అర్ధం అవి తన జతగాణ్ణి పిలవడమే నట. ఈ వింత ధ్వనులను అర్దం చేసుకున్న మగ ఎల్కీలు ఆడ ఎల్కీలను చేరేందుకు పోటీపడతయి.
స్పాట్
యాంకర్ 2
ఎల్లోస్టోన్ లో ఒక వింత వాతావరణ పరిస్థితి ఉంటది. మన హిమాలయాలను చూస్తే ఎండా కాలంలో కూడా మంచు పర్వతాలు కనిపిస్తయి. శీతాకాలంలో ఉన్నంత మంచు కాకున్నా మంచు పర్వతాల ఆనవాళ్లు మాత్రం అలాగే ఉంటయి. కానీ ఇక్కడ దానికి పూర్తి భిన్నమైన వాతావరణం చూడొచ్చు. శీతాకాలంలో చూడ్డానికి నేలకూడా కనిపించని ఈ ప్రాంతంలో… ఎండాకాలం దాటి వర్షరుతువు వస్తే చాలు మంచు ఆనవాళ్లు కూడా కనిపించవు. అదీ ఎల్లో స్టోన్ స్పెషాలిటీ..
స్పాట్
శీతాకాలం ఈ ప్రాంతం మొత్తం మంచు పరిచినట్టుంటది. ఎండాకాలం ఆ మంచంతా నీటి వాగులై పారడంతో మంచు గుట్టలన్నీ మట్టి దిబ్బలుగా మారిపోతయి. ఈ భూగోళంలో ఒక అరుదైన వింత ప్రాంతం ఈ ఎల్లోస్టోన్. ఎందుకంటే రాకీ కొండల నడుమ ఉండే ఈ ప్రాంతం సీజన్ కో రకంగా తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటది.
స్పాట్
మారుతున్న వాతావరణాన్ని బట్టి ఇక్కడ ఎన్నో కొత్త జీవులు తమ ఉనికిని మార్చుకుంటయి. ఈ కాలంలో ఇక్కడికి యాత్రికుల రద్దీ ఎక్కువ. ఈ వాతావరణంలో మాత్రమే ఇక్కడ మనుషులు సంచరించే అవకాశం ఉంటది. గడ్డి మైదానాలలో బైసన్ లు గుంపులు గుంపులగా తిరుగుతయి. అప్పుడప్పుడే రాలిపడుతున్న మంచు శీతాకాల ఆగమనానికి గుర్తుగా ఉంటది. కొమ్ముల జింకలు ఆ విషయాన్ని గుర్తించి తమకిష్టమైన వాతావరణం రాబోతుందని మంచు పొరలపై గెంతుతయి. కానీ ఈ మార్పు బైసన్ లకు ఎంతమాత్రమూ ఇష్టం లేదు. ఎందుకంటే శీతలంలో వచ్చే మంచు పొరలు వాటికి ఆహారం లేకుండా చేస్తయి.
స్పాట్
యాంకర్ 3
ఎల్లోస్టోన్ లో ఒక ప్రకృతి వింత ప్రకృతి వింత చూడొచ్చు. క్లాక్ పక్షులు తాము దూర దృష్టితో ఆహారాన్ని దాచుకునేందుకు నేలలో గింజలను పాతిపెడతాయి. కానీ రుతువు మారగానే ఆ దాచుకున్న ఆహారమే అటవీ సంపదగా వృద్ది చెందుతుంది.పక్షుల నేలలో పాతిన గింజలే రేపటి కొత్త తరం అడవిగా పురుడు పోసుకుంటది. అంటే ప్రకృతి తనకు తాను తన రూపాన్ని దిద్దుకుంటుదన్నమాట. ఎండాకాలంలో వచ్చే అగ్నికాసరపు నీలి నీడలనుంచి అడవులు పూర్తిగా నాశనం కాకుండా ఈ క్లాక్ పక్షులే తమ ఫుడ్ బ్యాంక్ తో అడవిని కాపాడుతయి.
స్పాట్
సూర్యతాపానికి మొక్కలన్నీ పత్రహరితాన్ని నింపుకుంటయి. పైన్ వృక్షాలు మంచి ఫలాలను వృద్ది చేస్తయి. ఈ పండ్లను తనివి తీరా ఆస్వాదించేందుకు చిట్టి చిట్టి పోటీ పడి మరీ కొమ్మ కొమ్మకూ తిరుగుతుంటయి. ఈ పైన్ పండ్లు చాలా ప్రోటీనియస్ ఫుడ్. ఉడతలు తినగా మిగిలిన ఆహారాన్ని అవి నేలలో బొరియలు తవ్వి జాగ్రత్తగా దాచుకుంటయి. ఈ సీక్రెట్ డ్రీస్లీ బేర్ కు తెలుసు. ఇదే ఆహారం కోసం ఎలుగుబంట్లు వస్తయి. ఉడతలు తెలివిగా దాచుకున్న ఫైన్ పండ్లును ఎలుగు బంట్లు తవ్వి తీసుకొంటయి. అంతే కాదు ఉడతలు చెట్టు మొదట్లో దాచిన పండ్లను కూడా ఎంచక్కా ఆరగిస్తయి. ఈ దోపిడిని చూసి కూడా ఉడతలు ఏమీ అనలేకుండా ఉంటయి. ఈ పైన్ గింజలు క్లాక్ పక్షులకు మంచి ఆహారం. వీటిని ఇష్టంగా తింటయి ఈ పక్షులు. తిన్న వరకు తిని కొన్ని గింజలను తీసుకెళ్లి భూమిలో బొరియలు చేసి దాచుకుంటయి. విత్తనాలు నాటినట్టు నేలలో దాచుకుంటయి. అలా వేలాది పక్షులు ఈ ప్రాంతం నిండా గింజలను దాచుకుంటయి. అవి గింజలను దాచిన ప్రాంతం గుర్తు పట్టేందుకు చిన్న చిన్న రాళ్లు పెడతయి. కానీ పాపం రుతువు మారగానే ఈ గింజలు వసంతంలో తిరిగి మొలకెత్తుతయి. మంచు నిండిన నేలలో ఇవి తిరిగి పైన్ వృక్షాలుగా వృద్ది చెందుతయి.
స్పాట్
స్పాట్
ఎల్కీలు రానున్న శీతలాన్న తలుచుకొని హుషారుగా గడుపుతయి. మగ ఎల్కీలు సంగమానికి సిద్దమై ఆడ ఎల్కీల వద్దకు చేరుకుంటయి. మళ్లీ తొడేళ్ల రాక మొదలవుతుంటది. వీటినుంచి ఎల్కీలు తమను తాము రక్షించుకునేందుకు మొక్కలను అడ్డుగా పెట్టుకొని జీవిస్తయి.
స్పాట్
అప్పటి వరకు జలమయంగా ఉంన్న ప్రాంతమంతా మంచు ముద్దలను ముద్దాడేందుకు సిద్దంగా ఉంటది. నీటి సరస్సులు మంచు సరస్సులుగా రూపాంతరం చెందేందుకు సిద్దపడతయి. నీటి కయ్యలన్నీ స్వచ్చమైన నీటితో కనిపిస్తయి.
స్పాట్
యాంకర్ 4
మనం ఒక చెట్టును కూల్చేయాలంటే ఎంత సమయం పడుతది.. మహా అంటే ఒకరోజు.. అదీ ఒక ఇద్దరు మనుషులు కష్టపడితే.. ఆ కూల్చిన చెట్టును ఫర్నీచర్ గానో వంట చెరుకు గానో తయారు చేయాలంటే మరో రెండు మూడు రోజులు పడుతది. కానీ పెద్ద సైజు ఎలకలా ఉండే ఈ జంతువు ఒక్కరోజులో పెద్ద వృక్షాన్ని నేల కూల్చి, ముక్కలు ముక్కలు చేసి ఒక వడ్రంగిలా వంతెన కడుతదంటే మీరు నమ్మగలరా.. నమ్మితీరాలి.. ఎందుకంటే మనుషులు కూడా చేయలేని పని కేవలం తన నాలుగు పళ్లతో ఈ జంతువు చేసి చూపెడుతది.
స్పాట్
ఇంత పెద్ద చెట్టు పెటీల్మని కూలిపోవడం వెనుక ఓ చిన్న జీవి ఉందంటే నమ్మగలరా.. అవును ఇక్కడ ఎలుకలా కనిపిస్తున్న ఈ జీవి పెద్ద పెద్ వృక్షాలను కొరికి నేల కూల్చుతుంది. కింద పడ్డ చెట్లను ముక్కులు ముక్కలుగా చేసి ఈ ముక్కలను జలాశయంలో తీసుకెళ్లి. నీరు పోకుండా ఈ చెక్క ముక్కలతో అడ్డు కట్ట వేస్తది. ప్రకృతి నేర్పిన పాఠం ఇది. ఆ చెక్క ముక్కల కింద నీటిలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటది.
స్పాట్
ఆటం రుతువులో ఆకాశం వైపు చూస్తే ఎంతో అందంగా ఉంటది. సెప్టెంబర్ మాసంలో ఆకులన్నీ పచ్చని పారాణి పూసుకున్న నిండు ముత్తయిదువుల్లా కళకళలాడుతయి. మొక్కలన్నీ పత్రహరితాన్ని వదిలి జాంతో ఫిల్ నింపుకొంటయి. ఇగుళ్లు ఎర్రగా అడవికి బొట్టు పెట్టినట్టు కనిపిస్తయి. వనకన్యను ముస్తాబు చేసినట్టుండే ఈ వృక్షాలన్నీ ఎల్లోస్టోన్ అందాన్ని రెండింతలు చేసి చూపుతయి.
స్పాట్
ఎల్కీ లన్నీ ఈలలు వేసుకుంటూ అడవంతా కలియ తిరుగుతయి. శీతాకాలానికి వర్షాకాలానికి మధ్య రుతువులో జంతువులన్నీ ఒక రకమైన భావనకు లోనవుతుంటయి. ఒక రకంగా చెప్పాలంటే మధ్యస్థ రుతువులో అయోమయానికి లోనవుతయి. కొమ్ముల దుప్పి తన వన ప్రస్థానాన్ని మొదలేస్తది. రెండు మగ జింకలు ఆదిపత్య పోరుకోసం కొమ్ములతో యుద్దం చేస్తవి. ఎవరో ఒకరు విజేతగా నిలవాలి. ఆ విజేతే ఆ ప్రాంతాన్ని దోచుకుంటాడు. ఇది ప్రకృతి చెప్పిన రహస్యం. ఆ విజేతే అక్కడున్న ఆడ జంతువులపై తన ప్రతాపాన్ని చూపి ముందు తరాలనిస్తది.
స్పాట్
అప్పుడప్పుడే జాలువారుతున్న మంచుతెరలను ఆస్వాదిస్తూ మేల్ ఎల్కీలు శీతల రుతువును ఆహ్వానిస్తున్నట్టుంటయి. ఈ రుతువులో మనుగడ కష్టమని తలచిన జంతువులన్నీ వలస బాట పడుతయి. శీతల రుతువు ప్రారంభంలోఎల్కీలను వేటాడేందుకు వేటగాళ్లు ఈ ప్రాంతానికి వస్తరు. ఈ ప్రాంతంలో తమకు కష్టం తప్పదని గ్రహించిన ఎల్కీలు ఎల్లోస్టోన్ ను విడిచి సుదూర ప్రాంతాన్నికి తరలి వెళతయి.
స్పాట్
యాంకర్ 5
రుతువు రుతువు కో రుతురాగాన్ని వినిపించే ఎల్లోస్టోన్ ఎప్పటికీ తరగని అందాన్ని సొంతం చేసుకుంది. తరిగిపోని వనరులు, ఇగిరిపోని సుగందం దీని సొంతం. నిజానికి భూమి పొరలలో నిక్షిప్తమై ఉన్న రహస్యాలకు ఎల్లొస్టోన్ ఒక తాళం చెవిలాంటిదనే చెప్పొచ్చు. భూగోళం పై ఉండే అన్ని రకాల వాతావరణాలు, చాలా రకాల జీవ జాతులను కలిగి ఉండే ఏకైక ప్రాంతం ఎల్లోస్టోన్. ఇంత భిన్నంగా ఉండ బట్టే దీన్ని నేషనల్ పార్క్ గా గుర్తించిన్రు.
స్పాట్
అందంగా చుట్టచుట్టినట్టుండే మైదానాలు, ఒక పద్దతిగా కనిపిస్తియి. ఎల్కీలన్నీ సంతోశంతో గంతులేస్తూ ఎల్లోస్టోన్ ప్రాంతం నుంచి వలస వెళ్తయి.
స్పాట్
ఇన్ని అందాలూ మూటగట్టుకున్న ఈ ఎల్లో స్టోన్ ప్రాంతం ఒక్కసారైనా చూడాలని ప్రతి అమెరికన్ కోరుకుంటడు. ఆ మాటకొస్తే పర్యాటకం మీద అభిరుచి ఉన్న ఏ వక్తయినా ఎల్లోస్టోన్ కు వెళ్లాలనుకోవడం సహజమే. కానీ ఇక్కడి వాతావరణానికి అలవాటుపడాలంటే మాటలు కాదు.
స్పాట్
ఎల్లోస్టోన్ అందాల వెనుక మృత్యు ముఖాలూ ఉన్నయి. విలయ తాండవం ప్రకృతి పరవశం ఒకే చోట కొలువు తీరిన ప్రాంతం ఎల్లోస్టోన్..
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ విశేషాలు. వచ్చేవారం మరిన్ని సైన్స్ సంగతులతో మీ ముందుంటా..దిసీజ్ యువర్స్ శోభన్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి