ఎ.జనార్ధన్
ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలను విప్పి చెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
యాంకర్ 1
మానవుడు ఇంత అభివృద్ది సాధించానని విర్రవీగుతున్నడు. మొత్తం విశ్వరహస్యాలనే గుప్పిట్లో పట్టేశానని సంబుర పడుతున్నడు. కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానం సాధించినా ఇది కొన్ని రోజులకే పరిమితం కానుందా... ఈ విజ్ఞానంమంతా కాలగర్భంలో కలిసిపోవలసిందేనా.. ఈ భూమి ప్రమాదంలో పడనుందా.. అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇది మేము చెప్పే మాటలు కావు. లేదా భయపెట్టడానికి అనే మాటలు కావు.. ఇవి అక్షరాలా విశ్వసత్యాలు.. శాస్ర్తవేత్తలు వందల సంవత్సరాలుగా పరశోధించి నిగ్గుతేల్చిన నిజాలు..
స్పాట్
ఈ విశ్వం ఎలా ఏర్పడింది.. విశ్వం ఏర్పడక మునుపు ఏముండేది.. ఈ ప్రశ్నలు వేలాది సంవత్సరాల నుంచి మానవుణ్ని వేధిస్తున్న ప్రశ్నలు. శోధించగా.. శోధించగా.. శాస్ర్తవేత్తలకు విభ్రాంతికర వాస్తవాలు తెలిసినయి. ఇప్పుడు భూమి పై ఉన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడాలంటే 13బిలియన్ సంవత్సరాలు పైనే పట్టింది. ఇన్ని సంవత్సరాలకు ముందు భూమి ఎలా ఉండేది. ఈ విశ్వం ఎలా ఉండేది..
స్పాట్
ఈ విశ్వం ఏర్పడ ముందు. అత్యధిక సాంధ్రతగ చిమ్మ చీకటి ఉండేది. పూర్తిగా దైవకణాలని పిలవబడే సృష్టి నిర్మాణ ప్రాథమిక కణాలతో ఉందని శాస్ర్తవేత్తల ఊహ.. ఒకానొక దశలో రెండు ప్రాథమిక కణాల తాడనం వలన ఈ మహాసృష్టికి పునాదులు పడ్డయని ఇప్పటి వరకు మెజారిటీ శాస్ర్తవేత్తలు అంగీకరించిన ఉమ్మడి భావన.
స్పాట్
ఈ మహా విస్పోటనం తరువాత కాంతి వేగంతో సృష్టి విస్తరించింది. ఈ సృష్టి క్రియలో సాంద్రతాయుత కణాలన్నీ ఏకమై ఎన్నో తాండనాలు జరిగినయి. అప్పుడే పుట్టిన పిల్ల గ్రహాలు, బాల నక్షత్రాలు ఒక నిర్ధిష్ట కక్ష్యలో ఉండక పోవడం, ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల ఒక దాని కొకటి ఢీ కొని మహా అగ్ని విలయమే జరిగింది.
స్పాట్
ఇలా కొన్ని బిలియన్ల సంవత్సరాల తరువాత నేటి అనంత విశ్వం రూపుదాల్చింది. ఈ మహా విశ్వంలో ఎన్నో చోట్ల జీవం ఉంది అనేది నేటికి అర్ధం కాని పరిస్థితి. కానీ అన్ని రకాల వాతావరణ పరిస్థితులు అనుకూలించడం వల్లనో రసాయన చర్యలు సహకరించడం వల్లనో.. ఆస్టరాయిడ్ల నుంచి జీవం దిగుమతి కావడం వల్లనో ఈ భూమి పై జీవావిర్భావానికి పునాదులు పడ్డయి.. కోటాను కోట్ల రకాల జీవజాతులు వృక్ష జాతులు ఆవిర్భవించినయి.
స్పాట్
సృష్టి ఆవిర్భావం నుంచి నేటి వరకు భూమి పై మనుగడ దినదిన గండంగా మారుతోంది. ఏ రోజు ఏ గ్రహ శకలం వచ్చి భూమిని ఢీ కొంటుందో అనే భయం వెంటాడుతూనే ఉంది. ఎందుకంటే ఈ విశాల విశ్వంలో ఆస్టరాయిడ్ ల ట్రాఫిక్ రోజు రోజుకూ పెరిగి పోతోంది. భ్రమణ వేగం తగ్గి ఆస్టరాయిడ్ లన్నీ ఏదో ఒక గ్రహా గురుత్వాకర్షణ శక్తికి లోనయి గ్రహాలను ఢీకొంటున్నయి.ఈ ఆస్టరాయిడ్ యాక్సిడెంట్ బెడద సౌర కుటుంబంలో ఉన్న అన్ని గ్రహాలకు తప్పడం లేదు. కానీ ఇతర గ్రహాల పై జీవం లేదు కాబట్టి పెద్దగా ముప్పులేదు.
స్పాట్
భూమి పై కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న ఆస్టరాయడ్ లు వచ్చి పేలిపోతుంటయి. వీటినే మనం చుక్క తెగింది అని పిలుచుకుంటం. కానీ మరీ పెద్ద ఆస్టరాయడ్లు వచ్చినపుడు భూమికి, భూమి పై ఉన్న జీవజాతులకు పెనుముప్పు ఖాయం. ఇది ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఒక వేళ ఇలా జరుగకున్నా మరో రూపంలో ఈ సృష్టి వినాశనం తప్పని సరి అంటున్నరు శాస్ర్తవేత్తలు.
యాంకర్ 2
ఈ సృష్టి ఎంత వేగంగా విస్తరిస్తుందో.. అంతే వేగంగా వినాశనానికి గురి కాబోతుంది. నిజమా.. ఇలా అని నిత్యం భయపెట్టడమెందుకు.. హాయిగానే బతుకుతున్నాం కదా.. మళ్లీ ఈ ప్రళయం గోలేంటని అనుకోవచ్చు. కానీ మేం చెప్పే విలయం.. మనం కాదు కదా మన మునిమనవళ్లకు.. మునిమనవళ్లు కూడా చూడరు. ఎందకంటే ఇదంతా జరగాలంటే సూర్యుడిలో ఉన్న ఇందనం పూర్తిగా అయిపోయి తీరాలి. అలా అయిపోవడం మాత్రం తధ్యం.
స్పాట్
ఈ సృష్టిలో నక్షత్రాలన్నీ మిణుకు మిణుకు మంటూ మెరుస్తున్నయంటే కారణం అవన్నీ స్వయం ప్రకాశకాలు. ఈ స్వయం ప్రకాశం వెనుక నిత్యం కొన్ని కోటాను కోట్ల ఆటంబాంబులకు సమానమయ్యే శక్తి ఉంది. ఏదో ఒకరోజు ఈ శక్తి వనరు తరగడం ఖాయం అని శాస్ర్తవేత్తలు అంచనా వేస్తున్నరు. ఇలా శక్తి మొత్తం పూర్తిగా తరగిపోయి.. వాటిల్లో ఉన్న ఇంధనం మొత్తం అయిపోయి నక్షత్ర విస్పోటనం జరుగుతది. విస్పోటనం తరువాత ఈ నక్షత్రం బ్లాక్ హోల్ గా మారుతది. సరిగ్గా అప్పుడే సృష్టి వినాశనం మొదలవుతది. ఈ బ్లాక్ హోల్ తన చుట్టూ ఉన్న గ్రహాలను మింగేయడం మొదలేస్తది. బ్లాక్ హోల్ నుంచి కాంతి కూడా తప్పిచ్చుకోలేదు. ఈ బ్లాక్ హోల్ తన పరిధిలో ఉన్న గ్రహాలను నక్షత్రాలను తనలో కలిపేసుకుంటది.
స్పాట్
నక్షత్రాలన్నీ బ్లాక్ హోల్స్ గా మారాల్సిందేనా అంటే అవుననే సమాధానం వస్తది శాస్ర్తవేత్తల నుంచి..అవును ఒక్కమాటలో చెప్పాలంటే భూమి కూడా ఒక బ్లాక్ హోల్ గా మారబోతోందా.. స్టీఫెన్ హాకింగ్ ప్రకారం ఇదిగో భూ కేంద్రంలో మార్పుల వల్ల అత్యధిక గురుత్వాకర్షణ శక్తికి లోనయి భూమి తనలోకి తానే కుంచించుకొని పోతుంది. ఒకానొక దశలో కేంద్రానికి కుంచించుకు పోయి ఒక నల్లని బిందువు మాదిరిగా మారిపోతది.
స్పాట్
భూమి ఒక్కో ముక్కగా. ఎడారులు, మంచు పర్వతాలు అలా కుంచించుకు పోతయి. మొత్తం 8000వేల మైళ్ల వ్యాసార్ధం ఒక చిన్న బిందువుగా మారిపోతది.
స్పాట్
ఈ బ్లాక్ హోల్ నుంచి విపరీతమైన రేడియోషన్ విడుదలవుతది. క్రమేపీ ఈ బ్లాక్ హోల్ తెల్లగా ప్రకాశించ బడుతది. దీనికి అందుబాటులో ఉన్న అన్ని ఉపగ్రహాలను మింగేస్తది. 15 మైళ్ల వ్యాసార్దంలో ఉండే ఈ బ్లాక్ హోల్ రోజు రోజుకూ తన వ్యాసార్ధాన్ని పెంచుకొని ఒక మాసివ్ బ్లాక్ హోల్ గా రూపాంతరం చెందుది. ఎంతగా అంటే 11మిలియన్ మైళ్లవ్యాసార్ధానికి తన విస్ర్తుతిని పెంచుకొంటది. అలా పెరిగిన బ్లాక్ హోల్ ఈ పాలపుంతనే మింగగల శక్తిని సొంతం చేసుకుంటది.
స్పాట్
మన పాల పుంత తో బాటు ఈ సౌర కుంటుంబం కూడా విస్పోటనం వల్ల సంభవించినయే.. ఈ సౌరకుటుంబంలో ఉన్న నవగ్రహాలు, వాటి ఉపగ్రహాలు అన్నీ ఏదో ఒక రోజు సూర్యుడికి ఆహారం కావలసినవేనని శాస్ర్తవేత్తలు బల్లగుద్ది మరీ చెబుతున్నరు.
స్పాట్
ఒక మహా విస్పోటనం నుంచి ఎలా ఈ సృష్టి ఆవిర్భవించిందో.. ఆఖరుకు తిరోగమన దిశలో తిరిగి అదే దశకు చేరుకో బోతుందని శాస్ర్తవేత్తలు చెబుతున్నరు. చిన్న చిన్న కాల బిలాలు, పిల్ల విశ్వాలు ఏర్పడి వాటిలో అవే జీర్ణించుకొని ఆ బిలాల వ్యాసార్ధం పెద్దదయి.. మొత్తం ఒక సాంద్రతాయుత బిలంగా రూపాంతరం చెందబోతోందని శాస్ర్తవేత్తలు అంచనా కడుతున్నరు. అయితే ఇది సృష్టి ఏర్పడకముందు ఉన్న ఒక సాంద్రతాయుత స్థితి గా భావిస్తున్నరు.
స్పాట్
మన భూగోళం ఇప్పుడున్నట్టు ఉండేది కాదు.. ఒకప్పుడు ఈ భూమి సలసల కాగే అగ్నిపర్వతం క్రమేపీ చల్లబడి హైడ్రోజన్ ఆక్సీజన్ వాయువుల సమ్మేళనంతో ఏర్పడిన నీటి ఆవిరులు నేటి మన భూమి బ్లూ ప్లానెట్ రూపానికి కారణభూతాలు. ఈ భూమి పై నీరంతా ఒక వైపు భూమి ఉత్తర ధృవం వైపు ఉంది. ఐతే.. తర్వాత భూమి పై జరిగిన అనేక భౌతిక మార్పుల మూలంగా భూమి ఖండ, ఖండాలు గా విభజించ బడ్డది. అయితే ఈ ఖండ చలన సిద్దాంతం ప్రకారం భూమిపై జీవం ఏర్పడ్డంకనే నేల ఖండాలుగా విడిపోయిందని చెప్తరు. అందుకే ఖండాల అంచులు ఒకదానినొకటి విడదీసినట్టుండటం, వివిధ ఖండాలలో ఒకే రకమైన జీవ జాతులుండటం.. ఈ వాదానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. అయితే ఈ భూమి పై ఎన్నో జీవజాతులు అంతరించి పోయినయి. కాలగర్భంలో కలిసిపోయినయి. శాస్ర్తవేత్తలకు దొరికిన శిలాజాలను బట్టి ఎన్నో రకాల జీవులు ఈ నేల పై మనుగడ సాగించినయి. ఈ జాతులు ఎందుకు అంతరించిపోయాయనే విషయం పై భిన్న వాదనలున్నయి. గ్రహ శకలం ఒకటి భూని తాకి చాలా జీవ జాతులు అంతరించాయనే వాదన కూడా ఉంది. అయితే ఈ గ్రహ శకలం ఖండచలనం జరిగాక వచ్చిందా.. లేక భూమి ఉమ్మడిగా ఉన్నపుడే ఢీ కొందా అనే విషయాలపై కూడా అభిప్రాయ భేదాలున్నయి. ఏదేమయినప్పటికీ గతంలో ఈ భూమిని గ్రహ శకలం ఢీకొందనే మాట మాత్రం వాస్తవం. మళ్లీ అటువంటి గ్రహ శకలం రూపంలో భూమికి ముప్పు రాబోతోంది.. ఏం టా గ్రహ శకలం..
యాంకర్ 3
గ్రహశకలాలు భూమి పైకి రావడం కొత్తేమీ కాదు.. అలాగని నిత్యమూ కాదు.. కానీ ఈ సారి అంటే 2019లో భూమికి దగ్గరగా వచ్చే గ్రహ శకలం మాత్రం అతి పెద్దది. అది ఏమాత్రం కక్ష్య తప్పి భూమి పైకి వచ్చిన ఈ భూమి పై ఉండే జీవ జాతులన్నీ మాడి మసవ్వాల్సిందే..
స్పాట్
ఇక్కడ పెద్ద బండరాయిలా శూన్యంలో ప్రయాణిస్తున్న ఈ భారీ గ్రహ శకలం పేరు అపోఫిస్. ఈ గ్రహ శకలం గురించి గ్రీకుసిద్దాంత కర్తలు ముందే ఊహించిన్రు. ఈ అపోఫిస్ పై కూడా వారి గ్రంధాల్లో రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నయి. అయితే శాస్ర్తవేత్తలు వీరి ఊహాగానాలను కూడా కొట్టిపారేయలేదు. దీన్ని 2004లో కనిపెట్టిన్రు శాస్ర్తవేత్తలు. ఇది 20 మిలియన్ టన్నుల బరువుంటది. గంటకు 28వేల మైళ్ల వేగంతో శూన్యంలో దూసుకుపోతుంది. బుల్లెట్ కంటె 10 రెట్టవేగంతో ఇది ప్రయాణిస్తుంది. దీనిలో మన ప్రపంచం మొత్తం దగ్గర ఉన్న అణుబాంబులను మించిన శక్తి ఉంది.
స్పాట్
అపోఫిస్ 2029 సంవత్సరం కల్లా భూమికి ఇది 23వేల మైళ్ల దగ్గరిగా వస్తది. అంటే ఉపగ్రహాల వంటివి దీన్ని తాకే అవకాశం లేకపోలేదు. అంతే కాదు. ఒక వేళ ఇది భూమి వైపు దూసుకొచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని శాస్ర్తవేత్తల అందోళన. అయితే అపోఫిస్ నుంచి తప్పిచ్చుకున్నా.. విశ్వాంతరాళంలో దాగిన వేలాది గ్రహశకలాల ఎప్పుడూ భూమినే టార్గెట్ చేసుకొని భ్రమణం చేస్తున్నయి. 10 మైళ్ల వ్యాసార్ధం ఉన్న గ్రహ శకలాలు భూమిని ఢీ కొని విధ్వంసాన్ని సృష్టిస్తున్నయి. గతంలో ఇటువంటి గ్రహశకలం భూమిని ఢీ కొని భూమిని స్టెరిలైజ్ చేసింది.
స్పాట్
మనవ నాగరికత పెరిగినంక మనిషి భూగోళాన్ని తన చేతుల్లోకి తీసుకుండు. టెక్నాలజీ డెవలప్ అయింది. ఈ భూమి పై ఉన్న ఎన్నో రహస్యాలను, ఖగోళ రహస్యాలను తెలుసుకుండు. అంతే కాదు. తన జ్ఞానం వినాశనం వైపు కూడా అడుగులేసింది. అందులో బాగమే అణుబాంబ్
స్పాట్
మానవుడు తను తయారు చేసుకున్న. అణుబాంబులే భూమికి మరణ శాసనాలను లిఖించనున్నయి.అణుయుద్దాల వల్ల భూమిని ముక్కలు చేసే అవకాశం ఉంది.కానీ ఇప్పటికే అణునిషేదం అమలు చేసి ఈ ముప్పును తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నరు. కానీ విశ్వాంతరాళం మరో ముప్పును సిద్దంగా ఉంచింది. ఏంటా ముప్పు.
స్పాట్
విశ్వాంతరాళంలో నక్షత్రాలలో ఇందనం అయిపోవడంతో పెద్ద శబ్దం చేస్తూ పేలిపోతుంటయి. ఒక నక్షత్రం పేలినపుడు పెద్ద పెద్ద శకలాలు విస్పోటనంలోంచి భారీగా బాహ్య వాతావరణంలోకి విసిరివేయబడుతయి. ఈ శకలాలు ఒక్కోక్కటి చంద్రుడి పరిమాణం నుంచి భూమి పరిమాణమంత ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈ నక్షత్ర విస్పోటనాలను సూపర్ నోవా అని పిలుస్తరు.
స్పాట్
ఈ సూపర్ నోవా జరిగినంకనే బ్లాక్ హోల్స్ ఏర్పడుతయి. కానీఈ సూపర్నోవా నక్షత్రం విస్తరించే సమయంలో భారీ శబ్ధంతో కూడిన పేలుడు సంభ విస్తుంది. ఆకాశం ప్రకాశవంతమై, దాని నుంచివెలువడిన అతిచిన్న కణాలైన న్యూట్రినోలు, అంతరిక్షంలో భారీ స్థాయిలో వర్షిస్తాయని శాస్ర్తవేత్తలు చెబుతున్నరు. సూపర్నోవాలోని 99 శాతం శక్తి , న్యూట్రినోల రూపంలో వెలువడుతుంది. ఈ న్యూట్రినోలు భూమిలోకే కాక మానవుల శరీరంలోకి కూడా చొచ్చుకుపోతయి.
యాంకర్ 4
సూపర్ నోవాలంటే ఏంటి.. వీటి వల్ల మనిషికి వచ్చే ముప్పేంటి.. ఎక్కడో కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో నక్షత్రాలు పేలిపోతే.. మనకు వచ్చే నష్టమేంటి.. అవును.. వేయి సంవత్సరాలకు ముందు పేలిన నక్షత్రాల వల్ల కూడా భూమికి భారీ నష్టమే పొంచి ఉంది..ఏంటా నష్టం..
స్పాట్
ఈ సూపర్ నోవాలు ప్రతి పది సంవత్సరాల కొకసారి వస్తుంటయి. అంటే ఈ విశ్వంలో అర్ధ శతాబ్దానికో నక్షత్రం పేలిపోతోందన్నమాట. అయితే ఇవి భూమి వరకు వస్తయా రావా అనేది వాటి దూరాన్ని, శక్తిని బట్టి ఉంటది.
స్పాట్
19వ దశకంలో బ్రిటీష్ సాటిలైట్ గామా రేడియేషన్ ను గుర్తించింది. ఈ రేడియేషన్ అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి అణుబాంబులు పేలినపుడు మాత్రమే మస్తయి. ఈ గామా కిరణాలను పరిశీలిస్తే ఇవి అంతరిక్షం నుంచి వచ్చినవిగా తెలిసింది. అయితే ఇవి అంతరిక్షం నుంచి ఎలా సడన్ గా వచ్చినవని సూక్ష్మవిశ్లేషణ చేస్తే మన దగ్గరి నుంచి 8వేల కాంతి సంవత్సరాల దూరంలో పేలిపోయిన ఒక నక్షత్రం తాలూకు గామా కిరణాలని తేలింది. అంటే కాంతి వేగంతో ప్రయాణించినా నక్షత్రం పేలిపోయిన 8వేల సంవత్సరాలకు ముందు జరిగిన పరిణామాలు భూమి పై ప్రభావం చూపుతున్నయి. అవి భూమిని చేరడానికి ఇన్ని వేల సంవత్సరాలు పట్టింది. అయితే ఎప్పుడో జరిగిన అంతరిక్ష ఉత్పాతాలకు ఇప్పుడు భూమి పై ప్రభావం పడుతోంది.
స్పాట్
ఈ రేడియేషన్ భూమి పై ఉన్న వృక్ష జీవ జాతుల పై ప్రభావం చూపుతోంది. డబ్లూ 104 అనే నక్షత్రం పేలిన 8వేల సంవత్సరాల తరువాత భూమి దాని రేడియేషన్ ను ఎదుర్కొంది. అయితే దీని బలహీన ప్రాంతాలు మాత్రమే భూమి పరిధిలోకి వచ్చి వెళ్లినయి. పూర్తి స్థాయిరేడియేషన్ భూమిని చేరితే మాడి మసవ్వాల్సిందే.
స్పాట్
450 మిలియన్ సంవత్సరాలకు పూర్వం వాతావరణం మొత్తం గామా కిరణాలతో నిండి ఉందని శాస్ర్తవేత్తలు చెబుతున్నరు.
స్పాట్
మానవుడు ఖగోళరహస్యాలు తెలుసుకునే క్రమంలో అద్భుతమైన రహస్యాలు వెలుగు చూసినయి. ముందుగా చంద్రుని పై కాలు మొపిండు..
స్పాట్
చంద్రుని తరువాత 50 విలియన్ మైళ్లదూరంలో ఉన్న మార్స్ గ్రహం పైకి మానవుడి దృష్టి మళ్లింది. ఈ రెడ్ ప్లానెట్ పై ఏముందో తెలుసుకోవాలన్న ఆకాంక్ష మనిషికి పెరిగింది. ఇక్కడ తక్కువ గురుత్వాకర్షణ శక్తి, తక్కువ పీడనం, అత్యధికంగా కార్భన్ డై ఆక్సైడ్ గ్యాస్ ఉండటం గమనించిండు. మార్స్ పై ప్రత్యేకించిన అయస్కాంత క్షేత్రంగానీ, ఓజోన్ పొరగానీ లేకపోవడాన్ని శాస్ర్తవేత్తలు గుర్తించిన్రు. అయితే మార్స్ నేల పై అప్పికే సరస్సులు ఉండి ఎండినట్టు ఆనవాళ్లు ఉన్నయి. అయితే ఇవి నీటివా కాదా అన్న ప్రశ్న మాత్రం అలాగే మిగిలి ఉంది.
స్పాట్
మార్స్ గ్రహం పై ఉన్న వివిధ రకాల ఆనవాళ్లు గతంలో జీవ సంచారం ఉన్నట్టనిపిస్తున్నా,.. భౌతిక పరిస్థితులు మాత్రం దీనికి విరుద్దంగా ఉన్నయి. సూర్యుడి వయసు రోజు రోజుకూ తరిగిపోతుంది. ప్రతి బిలియన్ సంవత్సరానికి ఒక సారి 6శాతం తగ్గుతోంది. 5 బిలియన్ సంవత్సారాలనుంచి 200బిలియన్ డిగ్రీలు తగ్గింది. దీనికి భవిష్యత్తులో భూమి ఒక గుర్తింపులేని గ్రహంగా మారొచ్చు. 7 బిలియన్ సంవత్సరాల తరువాత సూర్యుడు క్రమేపీ విస్తరించడం మొదలు పెడతడు. సూర్యునిలో ఇందనం తరుగుతున్న కొద్దీ దాని విస్తీర్ణం రోజురోజుకూ పెరుగుతుంటది.
స్పాట్
7 బిలియన్ సంవత్సరాల తరువాత సూర్యుడు ప్రస్తుత పరిమాణం కంటే 200 రెట్టు పెద్దగా ఉంటడు. భూమికి 200 మిలియన్ల మైళ్ల వ్యాసార్దంలో ఉంటడు.అప్పటికే బుదుడు, శుక్రుడు గ్రహాలు సూర్యుడిలో కలిసిపోతయి. ఆ తరువాత వంతు భూమిదే. భూమి కూడా ఒకానొక దశలో సూర్యుడిలో విలీనం కాక తప్పదు.
స్పాట
ఇన్ని వేల సంవత్సరాలుగా అభివృద్ది చెందిన జీవజాతి భౌగోళిక మార్పులకు మసి కావల్సిందేనా.. ఈ జీవద్రవ్యాన్ని కాపాడుకునే మార్గమే లేదా.. టెలీస్కోప్ చూపు మేరలో మరో జీవానుకూల గ్రహం ఏదీలేదా. అంటే ఉంది.. అదే గ్లీసర్..
స్పాట్
యాంకర్ 5
గ్లీసర్ గ్రహం మానవుడు జీవించడానికి అనుకూలమైన గ్రహమే అని శాస్ర్తవేత్తల ఆశ.. కానీ వచ్చిన చిక్కల్లా అంతదూరం వెళ్లడమే.. ఒక మనిషి కాంతి వేగంతో జీవిత కాలం పయనిస్తే గాని ఈ నక్షత్రాన్ని చేరుకోలేడు. మరి ఎలా.. ఈ సమస్యను అధిగమించేదెలా.. పరిష్కారం కనుగొన్నరు శాస్ర్తవేత్తలు.
స్పాట్
ఇది గ్లీసర్..అచ్చం భూమిని పోలిన మరో జీవానుకూల గ్రహమని భావిస్తున్నరు. 2007లో శాస్ర్తవేత్తలు దీన్ని కనుగొన్నరు. దీని ఉపరితలం పై నీరుందనే బలమైన నమ్మకం శాస్ర్తవేత్తలను దీనిపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు పురికొల్పింది. కానీ గ్లీసర్ చాలా చాలా దూరంలో ఉన్న గ్రహం. ఇది ఎంత దూరంలో ఉందందటే.. 20 కాంతి సంవత్సరాలకు మించిన దూరంలో ఉంది. అంటే 120ట్రిలియన్ మైళ్ల దూరంలో ఉంది. అయితే వచ్చిన చిక్కల్లా ఇక్కడికి ఎలా వెళ్లాలన్నదే.
స్పాట్
ఈ గ్రహాన్ని చేరాలంటే కాంతి వేగంతో ప్రయాణించే వాహనం కావాలి. మనిషి మొట్టమొదట1997 లో ఒక వాహనాన్ని తయారు చేసిన్రు. ఈ వాహనం అత్యతం వేగంతో ప్రయాణిస్తది.39వేల మైళ్లను గంటలో చేరగలదు. కన్నుమూసి తెరిచేలోపే భూమిని చుట్టే శక్తి కలదు.
స్పాట్
గ్లీసర్ గ్రహాన్ని చేరాలంటే 350 సంవత్సరాలు పడుతది. ప్రస్తుతం ఉన్న సాంకేతి పరిజ్ఞానాన్ని మరింత పెంచితే ఇది సాధ్యం కావచ్చు. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఒక భారీ అంతరిక్ష వాహనం అటువంటిదే. ఇందులో అణుధార్మిక శక్తి నింపి కేవలం రేడియోధార్మిక శక్తితోనే వేగంగా ప్రయాణించే వాహనాన్ని తయారు చేయవచ్చని శాస్ర్తవేత్తల ఊహా.
ఇంత ఖర్చు పెట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని మొత్తం ఉపయోగించి అంతరిక్ష వాహనాన్ని తయారు చేసినా మరో సమస్య ఉంది. సెకన్ కు వేయి కిలో మీటర్ల వేగంతో ప్రయాణించినా గ్రహాన్ని చేరాలంటే కనీసం 75 సంవత్సరాలు పడుతుంది. అంటే ఒక మనిషి పూర్తి జీవిత కాల మన్నమాట. అంటే మనం పంపించే మిషన్ లో అప్పుడే పుట్టిన ఒక బిడ్డను వేసి.. వాడు బతకడానికి అన్ని రకాల వాతావరనాలు కల్పిస్తే వాడు వృద్దుడయ్యే సరికి ఆ గ్రహాన్ని చేరుతడు. లేదా ఇది సాధ్యం కాని పని. దీనికి కూడా ఓ మార్గం ఉంది. రానున్న జనరేషన్ లో జెనెటిక్ ఇంజనీరింగ్ను ఉపయోగించి మానవ జీవితకాలాన్ని పెంచనున్నారు. జెనెటిక్ ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో మనిషి జీవితకాలాన్ని రెండురెట్టు పెంచి కొంత విజ్ఞానం నేర్పినంక వాడిని వ్యోమగామిగా తీర్చిదిద్ది అంతరిక్ష వాహనంలో గ్లీసర్ గ్రహానికి పంపాలి. అయితే ఇది ఏ ఒక్కరినో ఇద్దరినో కాకుండా ఒక బంచ్ గా పంపితే ఏదో ఒక క్షణంలో.. ఎక్కడో ఒక ప్రాంతంలో ఈ ప్రయోగం సక్సెస్ అయి జీవం మరో గ్రహం పై మనుగడ సాగించే అవకాశం ఉంది. 13.5 బిలియన్ సంవత్సరాల వయసున్న ఈ విశ్వం త్వరలో తన రూపు మార్చుకోబోతోంది. త్వరలో అంటే బిలియన్ ల సంవత్సరాల తరువాతే..
స్పాట్
కాల క్రమంలో అంటే బిలియన్ ల సంవత్సరాల తరువాత మన పాల పుంత ఉన్న గెలాక్సీ తన దగ్గర్లో ఉన్న మరో గెలక్సీ తో ఢీకొంటది. అలా గ్రహాలు, నక్షత్రాల పరిధి దాటి ఏకంగా గెలాక్సీలకు గెలాక్సీలే ఒకదానికొకటి ఢీకొంటయి. .. తరువాత ఈ అనంత విశ్వం మొత్తం గ్రావిటీ శక్తితో నిండిపోతది. కొన్ని కోట్ల నక్షత్రాలు, సంలీనం విలీనం అవుతుంటయి. కిరణాలు, పదార్దం అవిరళంగా సంచరిస్తయి. ఈ క్రమంలో విశ్వం పుట్టుక దశలే తిరిగి ఏర్పడుతయి. అంటే మళ్లీ మరో బిగ్ బ్యాంగ్ తప్పదన్నమాట.
స్పాట్
ఈ అనంత విశ్వం నిండా శక్తి కేంద్రాలు నిండి ఉంటయి. దీన్నే డార్క్ ఎనర్జీ అంటరు. శూన్యంలో సమాంతర ప్రాంతం మొత్తం ఈ శక్తి నిండి ఉంటది. 13.5 మిలియన్ సంవత్సరాల వరకు జరిగిన పరిణామం బిగ్ బ్యాంగ్ తో మొదలయి. బిగ్ బ్యాంగ్ తో మళ్లీ పునరావృతం అవుతది.
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ విశేషాలు.. మరిన్ని సైంటిఫిక్ అప్‌డేట్స్ తో మళ్లీ మీ ముందుంటాం దిసీజ్ యువర్స్ శోభన్ సైనింగ్ ఆఫ్.
బ్రేక్ లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి