ఎ. జనార్ధన్
ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలు విప్పిచెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
యాంకర్ 1
ఆదిమ మానవుడి కాలంలో ఒక నిప్పు తప్ప ఏ ఇంధనం అవసరం లేదు. అది కూడా అడవి తగల బడుతున్నపుడు నిప్పుతో అవసరాలు తీర్చుకునే వాడు. లేదా ఏదైన పిడుగు పాటుకు చెట్లపై మంటలు పుడితే నిప్పుతో మాంసాన్ని ఉడికించుకునే వాడు. అంతకు మించిన ఇంధనం అప్పుడు అతనికి అవసరం లేదు. కానీ మనిషి నాగరికత నేర్చుకున్నడు. కష్టపడకుండా సుఖంగా బతకడానికి అలవాటు పడ్డడు. ఈ నేల పై దొరికే రకరకాల ఇందనాలకు అలవాటు పడ్డడు. మొత్తంగా ఈ ప్రపంచాన్ని ఇప్పుడు నడిపించేది ఇంధనం..
వాయిస్
ఆదిమ మానవుడి కాలంలో కేవలం తనకు దొరికిన పచ్చి మాంసాన్ని కాల్చడానికే నిప్పును వాడే వాడు. కాల క్రమంలో చలినుంచి తనను కాపాడుకోవడానికి కూడా నిప్పు అవసరం ఏర్పడింది. ఎండు కట్టెలతో నిప్పు రాజేయడం నేర్చుకున్నడు. అప్పుడు అదే ఇంధనం.. కాల క్రమంలో సగం కాలగా మిగిలిన బొగ్గు కూడా ఇంధనంగా పని చేస్తదని తెలుసుకున్నడు.. కట్టెలు కాలగా మిగిలిన బొగ్గెకాదు.. భూగర్భంలో దొరికే రాకాసి బొగ్గుకూడా ఇంధనం గా పనికొస్తుందనే నిజాన్ని తెలుసుకునే సరికి వేల సంవత్సరాలు పట్టింది. ఇంధనం తన రూపాలు మార్చుకొని ఇంటిదీపంలోకి చేరింది.
స్పాట్
మనిషికి యాంత్రిక శక్తి జీవితంలో బాగంగా మారింది. యాంత్రిక శక్తిని నడిపించేది ఇంధనం. తొలుత గాలి వాటంతో వాహనాన్ని నడపడం నేర్చుకున్న మనిషి తరువాత క్రమేపీ బొగ్గుతో.. వాహనాలు నడపడం నేర్చుకున్నడు.. బొగ్గు తరువాత డీసిల్ , పెట్రోల్, కిరోసిన్ వంటి ఇంధనాలను తన అవసరాలకు ఉపయోగించుకున్నడు.
స్పాట్
ఈ ఇంధనాలే మనిషి చేసి కష్టమైన పనులు చిటికెలో చేయగలిగేలా చేసినయి. ఎంత కష్టమైన పనిని కూడా కాసేపట్టో చేయగల సత్తా ఉందంటే అది యాంత్రిక శక్తికే సాధ్యం.. ఒక రకంగా చెప్పాలంటే కొండను పిండి చేసే శక్తి ఇంధనాలకుంది.. ఈ ఇంధనాలన్నీ భూగర్భంలోనో.. సముద్ర గర్భంలోనో దొరికేవే.. కానీ ఎంత కాలం.. ఈ భూగర్భంలో ఉన్న ఇంధనం ఏదో ఒక రోజు అయిపోక మానదు..
స్పాట్
ఇంధనం కోసం మానవుడి అన్వేషణ సాగుతూనే ఉంది.. ఆ అన్వేషణలో ఎన్నో కొత్త రకం ఇంధనాలను, శక్తులను కనుగొన్నడు. ఇంధన వినియోగం పెరిగేకొద్దీ పొల్యూషన్ పెరుగుతూ పోతోంది. పరిశ్రమలకు, వాహనాలకు, గృహ అవసరాలకు ఇంధనమే అవసరం అవుతుంది. అందుకే ఇంధనం మనిషి జీవితంలో బాగమయింది. ఇంధనం లేనిదే మనిషి లేడు అన్న భావనకు వచ్చిండు.
స్పాట్
అయితే భూగర్భంలో ఉన్న ఇంధనమైనా .. సముద్ర గర్భంలో ఉన్న ఇంధనమైనా ఏదో ఒక రోజు తరిగిపోవలసిందే.. అలా ఇంధన వనరులన్నీ తరిగిపోతే.. ఇంధన ఆధారిత వాహనాలు పరిశ్రమలు ఏం కావాలి. ఉత్పత్తులన్నీ ఆగిపోవలసిందేనా.. కాలి నడకను, ఎడ్లబండిని ఆశ్రయించాల్సిందేనా..
స్పాట్
ఇదే భయం పట్టుకుంది మానవుడికి. అందుకే ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం అన్వేషించడం మొదలు పెట్టిండు. ఆ అన్వేషణలో రకరకాల శక్తులు దొరికినయి. సాంకేతిక శాస్ర్తం అభివృద్ది చెందడంతో మనిషి సహజ వనరులను వినియోగించుకోవడం అలవాటు చేసుకుండు. గాలి వాటం, నీటి శక్తి, గురుత్వాకర్షణ శక్తి, సౌర శక్తి ని ఇంధనంగా మలుచుకుండు. అలా పుట్టిందే విండ్ మిషన్, సోలార్ మిషన్, ఎలక్ర్టిసిటీ..
స్పాట్
యాంత్రిక శక్తిని వినియోగించుకోవాలంటే కేవలం డీజిల్, పెట్రోల్ ఒక్కటే ప్రత్యామ్నాయ మార్గం కాదు.. సౌరశక్తితో, విద్యుత్ శక్తితో కూడా మోటార్ ను నడపడం నేర్చుకున్నడు. వీటివల్ల కాలుష్యం తగ్గడంతో బాటు వనరులను కూడా కాపాడుకున్నట్టుంటది.
స్పాట్
యాంకర్ 11
పెట్రోల్.. డీజిల్ వంటి ఇంధనాలు దొరకడమేమో గానీ వాటి రేట్లు ఆకాశాన్ని తాకుతున్నయి. రోజు రోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్య మానవుణ్ని బెంబేలెత్తిస్తున్నయి. దీనికి ప్రత్యామ్నాయ మార్గమే లేదా.. అంటే ఉంది.. అదే సోలార్ పవర్.. ఎలక్ర్టిక్ పవర్.. సౌరశక్తితో యంత్రాలు నడపడమెట్లో ఓ సారి చూద్దాం..
స్పాట్
తరిగిపోతున్న వనరుల గురించి బెంగ పడుతున్న మానవుడికి ఓ కొత్త వనరు దొరికింది. ఇది ఎప్పటికీ తరిగిపోని వనరు. ఈ సృష్టి ఉన్నంత కాలం తరగని గని లాంటి నిధి అది. అదే సౌరశక్తి. అవును సౌరశక్తితో ఎన్నో అద్భుతాలు చేయొచ్చని నిరూపించిన్రు శాస్ర్తవేత్తలు. కాలుష్య రహిత ప్రపంచానికి తొలి అడుగు ఇక్కడే పడింది.
స్పాట్
ఎలక్ర్టిసిటీతో మోటార్లు నడిపించి పరిశ్రమల్లో వాడుకోవడం మనకు తెలుసుకానీ.. ఆటోమోబైల్స్ కూడా ఎలక్ర్టిసీతో నడపొచ్చా.. అంటే కచ్ఛితంగా నడపొచ్చు. కానీ కరెంట్ ఎక్కణ్నుంచి వస్తది. మొబైల్ మోటర్ అంటే నిల్వ ఉన్న విద్యుత్ ని వాడుకోవలసిందే.. అంటే చార్జింగ్ బ్యాటరీలతోనే వెహికిల్స్ నడుపుకోవాలి..
యాంకర్
ఎలక్ర్ట్రిసిటీతో వెహికిల్ నడుపుకోవడమంటే ఖర్చుతో కూడుకున్నదని చాలా మంది అపోహ.. ఎందుకంటే మనింట్లో ఫ్యాన్, వాషింగ్ మెషిన్ లకే కరెంట్ బిల్లు తడిసి మోపెడవుతది. మరి ఎన్నో సౌకర్యాలున్న కార్ ను నడపడానికి ఎంత విద్యుత్ కావాలి.ముందు ఒక బైక్ ను నడపడానికి ఎంత విద్యుత్ ఖర్చు అవుతదో తెలుసుకుందాం..
స్పాట్ (Solar Bike, Fujin DigInfo, Solar Cruising Bicycle, Solar Powered Bike, Endless sphere Electric Vehicle Technology Forums HD ) ఫైల్ యూజ్ చేసుకోండి.
ఇక్కడ జపనీయన్ చేతిలో ఉన్న సోలార్ ఎలక్ర్టిసిటీ బైక్ ను చూడండి. దీనికి కావలసిన విద్యుత్ సోలార్ ప్యానెల్ ద్వారా ప్రొడ్యూస్ అవుతది. ఈ సోలార్ ప్యానెల్ ను బైక్ వెనకాలే అమర్చిన్రు. సూర్యుడు ఉన్నపుడు సోలార్ ప్యానెల్ ద్వారా విద్యుత్ సమకూర్చుకోవచ్చు. దీనికి పెద్దగా ఖర్చు అయ్చేదేమీ లేదు. కానీ మబ్బులు పట్టినపుడు, రాత్రివేళల్లో మాత్రం ఇంట్లోనే విద్యుత్ ను ఉపయోగించుకొని రీచార్చ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీ పూర్తిగా చార్జింగ్ అయితే బైక్ పై 220 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు. ఇక విద్యుత్ బిల్లు విషయానికి వస్తే గంటకు ఒక ఎయిర్ కండీషన్ రన్నయితే ఎంత బిల్లు వస్తదో.. చార్జింగ్ సమయానికి అంతే బిల్లు వస్తది. జపాన్ యెన్ లలో చెప్పాలంటే 220కిలోమీటర్లకు రెండు యెన్ ల కరెన్సీ ఖర్చవుతది. ఇండియన్ కరెన్సీలో అయితే కేవలం ఒక్కరూపాయే అన్నమాట. ఎందుకంటే ఇందులో ఎక్కువ బాగం సోలార్ రూపంలో క్యాష్ లెస్ ఎనర్జీ సేవ్ చేసుకోవచ్చు.
స్పాట్
ఈ బైక్ ను ఉదయపు వేళలో ఆఫీస్ కు రావడానికి గానీ, లేదా కంపెనీలకు వెళ్లెటపుడు వాడుకొని మద్యాహ్న వేళలో చార్జింగ్ కోసం వదిలేయాలి. తిరిగి సాయంకాలం వేళ ఇంటికెళ్లే సమయానికి ఫుల్ గా చార్జింగ్ అయి ఉంటది. దీని వీల్స్ తక్కువ శక్తితో ఎక్కువ కాలం తిరిగే విధంగా తయారు చేస్తరు. అందువల్ల ఎక్కువ విద్యుత్ కూడా ఖర్చు కాదు. పై పెచ్చు బైక్ బాడీ మొత్తం ఫైబర్ తో తయారు చేయడం వల్ల ఇంజన్ పై బారం కూడా చాలా తక్కువ పడుతది.
స్పాట్
యాంకర్
చూశారుగా ఒక్కరూపాయి ఖర్చుతోనే చిన్న బైక్ పై ఎలా హాయిగా తిరుగుతున్నారో.. బైక్ సంగతి ఓకే.. మరి అంతే తక్కువ ఖర్చుతో నడపగలిగే కారుంటే బావుంటుంది కదూ.. అవును.. అందుకే ఇంజనీర్లు సోలార్ కారును తయారు చేసిన్రు. ఈ కారు కొనుక్కుంటే ఇక పెట్రోల్ కోసం పర్సులో చేయి పెట్టాల్సిన అవసరమే లేదు.
స్పాట్ (ఫోటోలు వాడుకో గలరు,
సౌరశక్తితో నడిచే కారు.. వింటుంటేనే కాస్త థ్రిల్లింగా ఉంది. కానీ ఇది ఎలా పనిచేస్తుందనే దాని పైనే అందరికీ అసక్తి.. ఎందుకంటే సైకిల్ షేప్ లో ఉన్న బైక్ అంటే ఓకే.. కానీ కారంటే మాటలా.. దాని ఇంజన్ను లాగాలన్నా.. అందులో కూర్చున్న వారిని లాగాలన్నా ఎంతో శక్తి అవసరం.. ఇంత శక్తిని రీచార్జి చేసుకోవాలంటే అంత ఈజీకాదు.ఇంతకీ సౌర విద్యుత్ కారు ఎలా నడుస్తుందో చూద్దాం.
స్పాట్ (GOOD Transparency Electric Vehicles) ఫైల్ వాడుకోవాలి.
ఎలక్ర్టిక్ కారు రిచార్ట్ కావాలంటే ఎంత విద్యుత్ అవసరం అనే విషయాన్ని పరిశీలించిన్రు. ఒక కారు 8 గంటల్లో ఫుల్ రీచార్జ్ అవుతది. గంటకు 2500వాట్ లు రీచార్జ్ అవుతది. అదే సమయంలో ఒక బల్బ్ 100 వాట్లు ఖర్చు చేస్తది. రీ చార్జి అయిన ఈ మొత్తం కరెంట్ సంవత్సరం ఉపయోగపడుతది. ఇది నాలుగు ప్లాస్మా టి.విలు సంవత్సరకాలం వాడిన విద్యుత్ తో సమానం. మరో ప్రశ్న ఇంట్లో కారు రీ చార్జి చేసుకుంటే ఎంత కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంటదనేది మరో ప్రశ్న..అయితే మైళ్లలో చూసుకుంటే. 100మైళ్లకు మూడు డాలర్లు ఖర్చు అవుతది. అంటే ఇండియన్ రూపీలలో అయితే 150 రూపాయలన్నమాట. అంటే మైలుకు రూపాయిన్నర అన్నమాట..అదే పెట్రోల్ కు అయితే 100 మైళ్లకు 10 డాలర్లు ఖర్చు అవుతది.రూపాయిల్లో అయితే 500లన్న మాట. కిలోమీటర్ కు 5 రూపాయలు ఖర్చవుతది.
స్పాట్
ఎలక్ర్టిసిటీ కార్ గురించి చెబుతుంటే బాగానే ఉంది. మరి దీన్ని రీచార్జ్ చేసుకోవడం ఎలా.. మన సెల్ ఫోన్ రీచార్జ్ చేసుకున్నట్టేనా.. ఇంకా ఏమన్నా చేయాలా అంటే.. అచ్చు మనం మన సెల్ ఫోన్ ను రీచార్జ్ చేసుకున్నట్టే రీ చార్జ్ చేసుకోవాలి. ఇప్పడు కార్ ను ఎలా రీ చార్జ్ చేసుకోవాలో చూద్దాం..
స్పాట్
ఎలక్ర్టిక్ కారును పగలు రాత్రి అనే తేడా లేకుండా 24 గంటల్లో ఎప్పుడైనా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ కార్లకు పెద్ద చెప్పుకోదగ్గ కార్భన్ పొల్యూషన్ ఉండదు కాబట్టి..నీట్ గానే ఉంటయి. కంబషన్ కూడా ఈజీ.. ఇకో ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు.
స్పాట్
ఈ వాహనాల వాడకం వల్ల బొగ్గు, సహజవాయువును ఆదా చేయొచ్చు.
స్పాట్
అంతా బాగానే ఉంది. ఇప్పుడున్న కార్లన్నీ ఎలక్ర్టిసిటీ కార్లుగా మారితే అందరికీ సరిపడా విద్యుత్ మన విద్యుత్ కేంద్రాలలో ఉందా.. వాస్తవానికి ఇండ్లలో అందరూ ఇదే పనిలో ఉంటే గృహావసరాలకు సరిపడా కరెంట్ ఉండదు. అందుకే గ్రిడ్ స్టేషన్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన్రు. ఈ స్టేషన్ లలో కార్ రీ చార్జ్ చేసి జస్ట్ క్రెడిట్ కార్డ్ తో స్క్రాట్ చేస్తే చాలు.. అచ్చు మన పెట్రలో బంకులో మాదిరి.. ప్రాబ్లెం సాల్వ్ డ్..
స్పాట్
ఒక్కోసారి ఇళ్లలో కరెంట్ ప్రాబ్లం వచ్చిందనుకోండి అప్పుడేం చేయాలి.. సరిగ్గా ఈ డౌటే వచ్చింది ఇంజనీర్లకు అందుకే సోలార్ రీ చార్జ్ కార్ ను తయారుచేసిన్రు. కారు బాడీలో ఎండ తగిలే ప్రాంతంలో సోలార్ ప్యానెళ్లను అమర్చిన్రు. ఈ సోలర్ ప్యానెళ్లలో నుంచి కావలసినంత విద్యుత్ ను రీ చార్జి చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఖర్చు ఉండదు.
స్పాట్
ఇవే కాకుండా ఎలక్ర్టో మాగ్నటిక్ ఫోర్స్.. గ్రావిటీ ఫోర్స్ వంటి వాటితో ఇంధనానికి ప్రత్యామ్నాయ శక్తులను తయారు చేస్తున్నరు. ప్రకృతి శక్తులైతే ఇప్పట్లో తరగక పోగా ఎంతో తక్కువ ఖర్చుతో కూడిన పని. అందరికీ అందుబాటులో ఉంటది. ఈ సోలార్ వెహికిల్స్ అందుబాటు లోకి వస్తే ఇక పెట్రోల్ ధరల గురించి ధర్నా చేసే అవసరమే ఉండదు. క్యూలో ఉండి పెట్రోల్ కొట్టిచ్చే పనే ఉండదు.
స్పాట్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి