ఎ.జనార్ధన్
ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలు విప్పి చెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
యాంకర్ 1
ఈ విశాల విశ్వం కథేంటి.. ఈ భూమి ఎప్పటిది.. ఎవరు సృష్టించిన్రు.. ఈ భూమి పై జీవం ఎలా పుట్టింది.. ఇవన్నీ ఇప్పటికీ ఎడతెగని ప్రశ్నలు.. ఎప్పటికైనా ఈ చిక్కుముళ్లు విడిపోతాయనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే విశ్వాన్ని సర్వస్వం ఒడగడుతున్న శాస్ర్తవేత్తలకు రోజు రోజు కూ ప్రశ్నల సంఖ్య పెరుగుతుందే తప్ప తరగడం లేదు. అంతేకాదు ఇప్పటి వరకు తాము కనుగొన్న చాలా సిద్దాంతాలు శుద్ద తప్పనే విషయం తెలిసి నిరాశ పడే వారు కూడా లేక పోలేదు. వాస్తవానికి ఈ విశ్వం ఎలా ఏర్పడింది. దీని వైశాల్యం ఎంత.. ఈ అఖండ విశ్వంలో మనమెంత.. ఈ ప్రశ్నలకు ఖగోళ మేథావి స్టీఫెన్ హాకింగ్ ఎంత ఆసక్తి కర సమాధానాలిచ్చిన్రు. ఒక్కసారి హాకింగ్ ఏమంటున్నడో చూద్దాం..
స్పాట్
వాయిస్
స్టీఫెన్ హాకింగ్ చెప్పిన విశ్వరహస్యం ఇది. నిజంగా ఎవరూ ఊహించరు.
నేను స్టీఫెన్ హాకింగ్.. కుర్చీలోంచి కదలలేకున్నా విశ్వరహస్యాలన్నీ ఛేదించే ప్రయత్నం చేశాను. మన భూమి, మన సౌర కుటుంబమే కాదు.. విశ్వం మొత్తం ఎలా పుట్టిందో తెలిపే ప్రయత్నం చేస్తాను..ఈ స్టోరీలో విశ్వానికి ముగింపు ఎలా ఉండబోతోందో కూడా చెబు తాను..
స్పాట్
ఇది స్టీఫెన్ హాకింగ్ కాలం కథ.. విశ్వం కథ..భవిష్యత్ కథ.. ఒక్కసారి కాలాన్ని వెనక్కు తిప్పుతూ వెనక్కు వెళదాం.. ఈ సృష్టి ఆవిర్భావానికి దారి తీసిన పరిస్థితులను చూద్దాం.
స్పాట్
స్టీఫెన్ హాకింగ్ ఈ విశ్వం గురించి చాలా ఏండ్లు పరిశోధించిండు.. ఎన్ని సంవత్సరాలైనా ఈ అంశం బోరనిపించలేదు.. రోజు రోజు కూ ఉత్సాహం పెరుగుతోంది.. ఇప్పుడు మనం చూస్తున్నది హాకింగ్ ఊహించిన అనంత విశ్వం.. ఇక్కడ మనకు చిన్న చిన్న బిందువుల్లా, తుంపరల్లా కనిపించే వన్నీ పెద్ద పెద్ద పెద్ద పాలపుంతలు. ఒక్కో పాల పుంతలో నాలుగు వందల బిలియన్ ల ఒంటరి నక్షత్రాలుంటయి. ఈ అనంత విశ్వాన్ని అంచనా వేయగలగడం కేవలం సూపర్ కంప్యూటర్ ద్వారానే సాధ్యం. ఇప్పుడు మనం చూస్తున్న అనంత విశ్వం నుంచి భూమికి వెళ్లాలంటే కోటాను కోట్ల కాంతి సంత్సరాలు ప్రయాణించాలి. ఈ గెలాక్సీ కాంపౌండ్ నుంచి ఎన్నో పాలపుంతలు దాటాలి.. పాల పుంతలు దాటి సౌరకుటుంబం ఉన్న పాల పుంతను చేరాలి. సౌరకుటుంబంలో ఒక్కో గ్రహాన్ని, గ్రహ శకలాలను దాటుతూ భూమిని చేరాలి.
స్పాట్
యాంకర్ 2
విశ్వదర్శనం కావాలంటే అంత సులువు కాదు.. ఎందుకంటే ఇప్పుడు మనం టి.వి లలో కంప్యూటర్ లలో చూసే గెలాక్సీ నమూనాలు చూడ్డానికి చిన్న బొమ్మల్లా ఉన్నయిగని.. ఇలా కనిపించే ఏ రెండు నక్షత్రాల మధ్య ప్రయాణించాలన్నా ఒక జీవిత కాలం సరిపోదు.
స్పాట్
ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా కనిపిస్తున్న ఈ ప్రకృతి ఒకప్పుడు నిత్యం ప్రళయాగ్ని కక్కుతూ ఉండేది.
స్పాట్
సరిగ్గా..14 బిలియన్ సంవత్సరాలకు ముందు.. ఇప్పుడు మనం చూస్తున్న.. ఈ గ్రహాలు కానీ.. ఆస్టరాయిడ్ లు కానీ..నక్షత్రాలు కానీ.. పాలపుంతలు కానీ… గెలక్సీలు కానీ..ఇప్పుడు మనం చూస్తున్న ఈ అనంత విశ్వం ఏవీ లేవు. కేవలం సాంద్రతా యుతమైన చిమ్మ చీకటి ఉంది..
హాకింగ్ వాయిస్
మనం ఈ చిన్న గ్రహం పై హాయిగా బతకడానికి.. మనిషి ప్రత్యేక మైన మనిషిగా బతకడానికి ఎన్నో లక్షల సంవత్సరాల మార్పులు జరిగినయి.
వాయిస్
ఈ గెలాక్సీలో ఉన్న చిన్న చిన్న రేణువుల్లాంటి వన్నీ కోటాను కోట్ల నక్షత్రాల సమూహాలు. ఇటువంటి కోటాను కోట్ల పాల పుంతలు కలిస్తే అనంత విశ్వం ఉంటది. ఈ అనంత విశ్వానికి ఆది అంతం ఇంకా కనుక్కోలేదు.
స్పాట్
యాంకర్ 3
కెప్లర్ టెలీస్కోప్ లో ఈ విశ్వాన్ని పరిశీలిస్తే.. ఈ అనంత విశ్వం కొంత నీలి రంగులో మరికొంత ఎర్ర రంగులో కనిపిస్తది. కారణం చాలా రోజులు తెలుసుకోలేక పోయిన్రు శాస్ర్తవేత్తలు. కానీ ఓ చిన్న కిటుకుతో అసలు విషయం తెలుసుకోగలిగిన్రు. ఇంతకీ ఏంటా కిటుకు..
స్పాట్
వాయిస్ ఇదిగో ఇక్కడ వేగంగా.. రయ్యి మని శబ్దం చేస్తూ వెళుతున్న కారును చూడండి.
ఒక్కసారి కారు మనకు దూరం గా వెళిపోతుంటే వచ్చే శబ్దాన్ని పరిశీలిద్దాం.. (స్పాట్) ఇప్పుడు మన దగ్గరగా వచ్చి దూరంగా వెళ్లిపోయే శబ్దాన్ని వినండి.. మళ్లీ ఇంజన్ స్పీడ్ మరింత పెంచినపుడు శబ్దం ఎలా ఉన్నది.
స్పాట్
ఇదే కారు మనకు దగ్గరగా వస్తున్నపుడు లేత నీలి రంగులో కనిపిస్తది. తిరిగి అంతే వేగంతో మన నుంచి దూరంగా వెళ్తుంటే లేత ఎరుపులో కనిపిస్తది. ఈ ప్రభావాన్ని డాప్లర్ ప్రభావం అంటరు. సో .. డాప్లర్ ప్రభావం మూలంగానే గెలాక్సీ లో నీలి రంగు, ఎరుపు రంగు కనిపిస్తది. ఇందులో కొన్న గ్రమాలు వేగంగా వస్తుంటయి. మరికొన్ని వేగంగా వెళుతుంటయి. అందుకే గెలాక్సీ నీలి, ఎరుపుల దొంతలా కనిపిస్తది.
స్పాట్
ఇంతకీ ఈ గెలాక్సీ జననం ఎప్పుడు .. ఈ అనంత విశ్వం వయసెంత.. ఈ ప్రశ్నలకు ఇప్పటి వరకు దొరికిన జవాబు ఒకటే.. 13 మిలియన్ల సంవత్సరాలకు ముందు చిమ్మ చీకటిలో అత్యధిక సాంత్రతతో ఉన్న ఈ శూన్యంలో రెండు దైవాణువులు ఢీ కొనడం వల్ల ఒక మహా విస్పోటనం జరిగింది. ఆ విస్పోటనమే చీకట్లో వెలుగులు నింపింది.
స్పాట్
చీకట్లో జరిగిన ఆ మహా విస్పోటనం క్రమ క్రమంగా కోటాను కోట్ల కాంతి సంవత్సరాల వేగంతో దూరంగా విస్తరించ సాగింది.
స్పాట్
యాంకర్ 4
ఈ విశ్వ విస్తరణ ఎంత కాలం జరిగింది. ఎలా జరిగింది.. ఒక చెంచాడు ద్రవ్యరాశి ఒక గ్రహంగా రూపాంతరం చెందడం ఎలా సాద్యమయింది. రేణువులన్నీ పిల్ల గెలాక్సీలుగా మరడం ఎలా సాధ్యమయింది. తరచి చూస్తే శాస్ర్తవేత్తలకు లోతైన అంశాలు చాలా వెలుగులోకి వచ్చినయి.
స్పాట్
బారయుత వాయువులతో.. మిరిమిట్లు గొలిపే అత్యుష్ణ వెలుగులతో కనిపించే ఈ మహా సృష్టి వృత్తాకారంలో విస్తరిస్తూ వెళుతుంది.ఈ మహావిస్పోటనం చీకట్లో కాంతి కిరణాలను విస్తరిస్తూ కాంతి వేగంతో విస్తరించింది. బయటనుంచి ఇదో అగ్నిగోళంలా ఉంది. లోపలి బాగంలో రేణు పరిణామంలో టైనీ గెలాక్సీలు వేగంగా వ్యాకోచించడం మొదలు పెడతయి. ఇక్కడ కిరణాల మాదిరిగా కనపడేవన్నీ కోటాను కోట్ల గెలాక్సీల సముదాయం. ఈ గెలాక్సీలన్నీ ధూళి కణాల్లా వేగంగా.. ప్రొజెక్టర్ లో ఫోకస్ లా కాంతి వేగంతో శూన్యం నిండా విస్తరించింది.
స్పాట్
ప్రళయ గర్జనతో విస్తరించే ఈ ద్రవ్యరాశి వాయుధూళి రూపంలో ఉంటది. ఒక్క అణువే ఒక పాల పుంత తో సమానం అంటే దాని ద్రవ్యరాశి ఎంత ఉంటదో అర్ధం చేసుకోవచ్చు. ఇంత ద్రవ్యరాశి మొత్తం కేవలం వాయురూపంలో ఉండటం వల్ల వేగంగా విస్తరించగలిగింది. సూక్ష్మరూపంలో ఉన్న ఈ అనంత విశ్యం 13 మిలియన్ ల సంవత్సరాల నుంచి నేటికీ విస్తరిస్తనే ఉంది. భార సాంద్రత గల ఈ అనంత విశ్వ పయనం ఓ మహత్తర కార్యానికి తొలిఅడుగు.
స్పాట్
వాయుధూళిగా ఉన్న ఈ విశ్వ పదార్ధం క్రమేపీ ద్రవరూపంలో.. ఆ తరువాత మెల్లగా చల్లబడి ఘనరూపంలోకి రూపాంతరం చెందింది. ఈ విశ్వావిర్భావ దశలోనే కాస్మిక్ ఎనర్జీ జెనరేట్ అయింది. ఇందులో కొంత సాలిడ్ మేటర్ గా రూపుదాలిస్తే.. మిగతాది యాంటి మేటర్ గా రూపాంతరం చెందింది. సవ్య అపసవ్య దిశలో భ్రమణం చెందే బాలగ్రహాలు, పురిటి నక్షత్రాలు ఒకదానినొకటి ఢీకొని గ్రహాలు ఉపగ్రహాలుగా పిల్ల విశ్వాలుగా విచ్చిత్తి చెందినయి. ఈ మహా తాడనంలో వెలువడిన రేడియేషన్ కోటాను కోట్ల ఆటంబాంబ్ లతో సమానం.
స్పాట్
యాంకర్ 5
బిగ్ బ్యాంగ్ మహా విస్పోటనం లో ఏర్పడిన ప్రతి గ్రహం ఇప్పటికీ ఉందా..నక్షత్రాలన్నీ అలాగే ఉన్నయా.. ఒకవేళ అలాగే ఉంటే అవి ఎందుకు దూరంగా విస్తరించ బడ్డయి. కారణం అన్వేషించిన్రు శాస్ర్తవేత్తలు.
స్పాట్
ఈ మహాతాడనంలో కొన్ని నక్షత్రాలు అప్పటికప్పుడు అదృశ్యమైపోయినయి. బిలియన్ రేణువులు గ్రహాలుగా వ్యాకోచించినయి. ఈ తాడనంలో మిగిలిన శేష పదార్ధాలే నేటి విశ్వం. ఈ అనంత విశ్వం కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరం విస్తరించింది. ఇంత విస్తీర్ణంలో ధూళి మేఘం తో పాటు పొగ ఆవరించింది. ఆ పొగలోనే వివిధ రకాల మూలకాలు పుట్టుకొచ్చినయి.
స్పాట్
పది నిముషాల్లో కొటాను కోట్ల కాంతి సంవత్సరాల దూరం ప్రయాణించిన ఈ విశ్వం లోపొగ అంతర్ధానమయింది. ఇలా 330 సంవత్సరాలు ఇంతే వేగంతో శూన్యంలో నక్షత్రాలు గ్రహాలు విస్తరించినయి. ఆ తరువాత వేగం క్రమంగా తగ్గుతూ పోయింది. కానీ అప్పుడు మొదలైన భ్రమణమే నేటి గ్రహాల భ్రమణం, పరిభ్రమణం.
స్పాట్
విశ్వావిర్భావం కొన్ని విలియన్ ల సంవత్సరాలు పట్టింది. ఇందులో వందల బిలియన్ ల గెలాక్సీలు తయారయినయి. మొదట్లో గెలాక్సీల మధ్య తాడనం జరిగేది. తరువాత అది గ్రహాలకు పరిమిత మయింది. ఈ గ్రహాలు కూడా ఒకదానినొకటి ప్రభావితం చేసుకుంటయి. కారణం గురుత్వాకర్షణ శక్తి.
స్పాట్
న్యూటన్ అనే ఖగోళ శాస్ర్తవేత్త ఒక యాపిల్ చెట్టు కింద కూర్చుని ఆకాశం వైపు చూస్తూ సుదీర్ఘంగా ఆలోచిస్తున్నడు. సరిగ్గా అప్పుడే చెట్టు పై నుంచి ఆపిల్ కాయ తెగి నేల పై పడింది. రాలిన ఆ యాపిల్ పండు నేల పైనే ఎందుకు పడాలి. ఆకాశంలోకి ఎందుకు వెళ్లకూడదు అనే ప్రశ్న ఉద్భవించింది న్యూటన్ మనస్సులో.. ఆ ప్రశ్నే గురత్వాకర్షణ శక్తి సూత్రానికి పురుడు పోసింది.
స్పాట్
విశ్వావిర్భావంలో గ్రావిటీ పవర్ చేసిన విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. బిగ్ బ్యాంగ్ తరువాత రెండు మిలియన్ ల సంవత్సరాల వరకు విశ్వం ఒక రూపంలోకి రాలేదు. 1982లో హాకిన్స్ తో బాటు మూడొందల మంది శాస్ర్తవేత్తలు చేసిన ప్రయోగంలో విశ్వం అమరిక ఎలా జరిగిందో తెలుసుకున్నరు. దీనికి వీరు ఎంపిక చేసుకున్నది..పల్లపు స్థలం, బాల్ బేరింగ్ లు
స్పాట్
ఈ ఐరన్ బాల్స్ పై ఏ ప్రభావం లేనపుడు ఇవి ఒక పద్దతి ప్రకారం సమాన దూరంలో అమరి ఉన్నయి. సమ దూరంలో ఉన్న గ్రహాల నుంచి కొన్ని జీవిత కాలం పూర్తయి అదృశ్యమయినయి. దీంతో వాటి ప్రభావం ఇతర గ్రహాల పై పడింది. ఒక వైపు గురుత్వాకర్షణ శక్తి తగ్గడంతో ఆ గ్రహాలు మరో గ్రహ ప్రభావానికి లోనయినయి. ఇలా గ్రహాలన్నీ ఎక్కువ విశ్వ గురుత్వాకర్షణ శక్తి వైపుకు మళ్లడం మొదలు పెట్టినయి. అప్పుడు మొదలయిన ఆ విశ్వవిస్తరణ నేటికీ కొనసాగుతనేఉంది.
స్పాట్
ఈ విశ్వావిర్భావానికి ముందు.. అంటే 13.5 మిలియన్ సంవత్సరాలకు ముందు ఈ విశాల విశ్వం నిండా హైడ్రోజన్ గ్యాస్ నిండి ఉంది. అంటే ఒక రకంగా ప్రోటాన్, ఎలక్రాన్ ల మేఘాలతో నిండి ఉందని చెప్పొచ్చు. హైడ్రోజన్ చాలా తేలికైన వాయువు.. పవర్ జెనరేట్ చేయగల వాయువు.. 10మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయగల వాయువు. ఈ ఉష్ణోగ్రతే నక్షత్రాలను కాంతి వంతగా చేయగలుగుతుంది. హైడ్రోజన్ పరమాణువుల సంలీనం ఉష్ణాన్ని వెలువరుస్తది. ఈ హైడ్రోజన్ సంలీనం హీలియం వాయువుగా రూపాంతరం చెందుతది. నక్షత్రాల కోర్ పార్ట్లో మొత్తం హీలియం అణువులతో నిండి ఉంది. ఈ శక్తి కొన్ని కోట్ల అణుబాంబుల శక్తి తో సమానం. విశ్వావిర్భావ సమయంలో ఇటువంటి సంలీనాలు మిలియన్ ల కొద్దీ జరిగినయి.
స్పాట్
విశ్వంలో నిండిఉన్న హైడ్రోజన్ అణువుల తాడనం వల్ల ఎన్నో నక్షత్రాలు కొత్తగా ఏర్పడ్డయి. హైడ్రోజన్ ఇందనంతోనే ఇవన్నీ నేటికీ బతికి ఉన్నయి. ఈ హైడ్రోజన్ వాయువు అయాన్ లుగారూపాంతరం చెంది.. వివిధ రకాల మూలకాలుగా ఏర్పడ్డయి. ఈ మూలకాలే కార్బన్, నైట్రోజన్, సిలికాన్ వంటి 108 మూలకాలు మరియు వాటి సమ్మిళిత అయాన్లు గా ఏర్పడ్డయి. ఇవే నేటి మన భూమి పై జీవరాశి వుట్టుకకు కారణం అయినయి.
స్పాట్
యాంకర్ 6
విశ్వావిర్భావంలో నక్షత్రాలే పాత్ర చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటి ఈ పరిశోధనలకు మూలం నక్షత్రాలే.. 13మిలియన్ సంవత్సరాల క్రితం మొదలయిన విశ్వాగ్ని నేటికీ రగుల్తనే ఉంది. దాన్ని బట్టే నక్షత్రం వయసు.. విశ్వావిర్భావ కాలాన్ని అంచనా వేయగలుగుతున్నరు. ఈ లెక్కలు ఎలా సాధ్యమయినయి.
స్పాట్
విశ్వావిర్భావంలో నక్షత్రం పాత్ర ఏమిటి..అసలు నక్షత్రంలో ఏముంది. ఒక్కసారి నక్షత్రాన్ని వర్టికల్ గా విచ్చేదన చేసి చూస్తే దీని మర్మమేంటో తెలుస్తది. ఈ నక్షత్ర మధ్యబాగంలో హైడ్రోజన్ అణువులు సంలీనమై శక్తి విడుదలవుతది. ఈ చర్య శృంకల చర్యగా జరిగి అయాన్లు, శక్తి కేంద్రాలు ఏర్పడుతయి. ఈ శక్తి కేంద్రాలు అయస్కాంత క్షేత్రాలుగా రూపాంతరం చెందుతయి. నక్షత్ర కేంద్రకం నుంచి ఉపరితలం వరకు ఇదే చర్య జరుగుతది. ఈ చర్యలలో హైడ్రోజన్ పూర్తిగా అయిపోయినపుడు నక్షత్ర జీవిత కాలం పూర్తయినట్టు. నక్షత్రంలో హైడ్రోజన్ ఇందనం పూర్తిగా అయిపోగానే పెద్ద శబ్దంతో పేలిపోతది. ఆ శకలాలు శూన్యంలోకి విస్తరించబడుతయి. ఈ పరికల్పననే సూపర్నోవా అంటరు. ఈ పరిస్థితిలో నక్షత్రాన్ని మృత నక్షత్రం అంటరు.
స్పాట్
ఈ మైక్రో సెకన్ లో కొన్ని కోట్ల ఉద్ఘారాలు విడుదలవుతయి. దీంతో పాటు ఒక బలమైన షాక్ శూన్యంలోకి విడుదలవుతది. అంతే కాదు పేలుళ్లలో విడుదలయిన పదార్ధమంతా శూన్యంలోకి విస్తరించ బడుతయి.
స్పాట్
ఈ మృతనక్షత్రంలో నుంచి మెటల్ ఎర్రగా శూన్యం నిండా విస్తరిస్తది. బిగ్ బ్యాంగ్ జరిగిన 300మిలియన్ సంవత్సరాల తరువాత ఇప్పుడు చూస్తున్న మన సౌరకుటుంబం ఉండే పాలపుంత ఖచ్ఛితమైన రూపు సంతరించుకుంది.ఈ పాలపుంత సుమారు 6వేల బిలియన్ మైళ్ల వ్యాసాన్ని కలిగి ఉంటది. ఇందులో 2వందల బిలియన్ ల నక్షత్రాలుంటయని అంచనా. ఈ నక్షత్ర సమూహాలన్నీ కేవలం గురుత్వాకర్షణ శక్తితో ఏర్పడ్డయి. గురుత్వాకర్షణది శక్తి సృష్టి నిర్మాణంలో కీలక పాత్ర .
స్పాట్
ఈ తెల్లని పొగల చారల మధ్య నల్లని ఆకారాన్ని బ్లాక్ హోల్ అని పిలుస్తరు. ఈ బ్లాక్ హోల్ సిద్దాంతాన్ని ఆవిష్కరించడానికి హాకింగ్ కు చాలా కాలం పట్టింది.
స్పాట్
ఒక మృత నక్షత్రం బ్లాక్ హోల్ గా మారినంక జరిగే మార్పులు గెలాక్సీలో పెను భీభత్సాన్ని సృష్టిస్తయి. నక్షత్రం మధ్యలో ఉండే గ్రావిటేషన్ ఫోర్స్ ఓ మెగా అట్రాక్టర్. దీనికి ఎంత బలమైన ఆకర్షణ శక్తి ఉందంటే మృత నక్షత్రం తనకున్న గురుత్వాకర్షణ శక్తితో తన చుట్టూ ఉన్న గ్రహాలన్నిటినీ మింగేయగలదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల నక్షత్రాలను మింగేసినా దాని ఆకలి తీరదు. ఎంత వేగంగా అయితే విస్పోటనం చెందిందో అంతకంగే వేగంగా నక్షత్రాలను, గ్రహాలను దాని పరిధి క్రమేపీ విస్తరించుకుంటూ వెళ్తది. మృత నక్షత్రాలు సాధారణ సమన్వయంలో, కాల రంధ్రం యొక్క విస్తారము మొత్తము ఒక్క చోట, అంటే ఒక బిందువు కాని,ఒక వలయము కాని, ఒక కాంతిరేఖ కాని లేక ఒక గోళమునందు కాని కేంద్రీకృతమై ఉండవచ్చు. దాని యొక్క ఖచ్చితమైన వివరాలు ప్రస్తుత పరిస్థితులలో అర్ధమైతలేవు. ఈ ఒక చోటునుండి గుండ్రముగా ఉండే సరిహద్దుని ఇవెంట్ హారిజాన్ అంటరు. ఈ ఇవెంట్ హారిజాన్ అనునది మరి తిరిగి రానటువంటి బిందువునుసూచిస్తుంది.ఈ సరిహద్దు దాటితే స్థూల ద్రవ్యము మరియు అణుధార్మికతకూడా తప్పనిసరిగా ఈ మొదలు లోపలికే పడిపోతయి. మధ్యభాగామునందుండే మూలము నుండి ఇవెంట్ హారిజాన్ వరకు ఉండే దూరము కాల రంధ్రం యొక్క పరిమాణము.
స్పాట్
సూర్యుని పరిమాణానికి సమానమైన కొలత కలిగిన కాల రంధ్రం యొక్క వ్యాసార్ధము షుమారు మూడు కిలోమీటర్లుంటుంది. దీనికి మించిన దూరంలో ఉన్నప్పుడు,మిగిలిన అదే పరిమాణంగల పదార్ధాలలాగానే,కాల రంధ్రం కూడా సూర్యుని మాదిరి అంతే ఆకర్షణ కలిగి ఉంటుంది. అంటే సూర్యుని కనక అదే పరిమాణము కలిగిన కాల రంధ్రంతో మార్పిడి చేస్తే,గ్రహాల గ్రహమార్గాములో మార్పు లేకుండా ఉంటుంది.
స్పాట్
కాల రంధ్రాల కొలతల బట్టి వాటిని పలురకాలుగా విభజించటమైనది. నక్షత్రముగురుత్వాకర్షణ ముడుగువలన కనక కాల రంధ్రం సృష్టించబడి ఉన్నట్లయితే అప్పుడు వాటినిస్టేల్లార్ కాల రంధ్రాలు అంటారు. నక్షత్ర వీధుల మధ్య ఉండేటువంటి కాల రంధ్రాల యొక్క పరిమాణము కొన్ని బిల్లియేన్ల సూర్య పరిమాణములకు సమానముగా ఉంటుంది.వీటిని సూపర్ మాసివ్ కాల రంధ్రాలు అంటారు. ఈ రెండు శ్రేణుల మధ్య, అందరూ ప్రాక్కల్పితముగా నమ్మేది ఇంటర్మీడియేట్ కాల రంధ్రాలు కొన్నివేల సూర్య పరిమాణములకు సమానమైనటువంటివి ఉంటాయని. జగత్తు సృష్టించబడినప్పటి చరిత్ర ప్రాక్కల్పన ప్రకారము బిగ్ బ్యాంగ్ సమయములో తయారయిన అతి తక్కువ పరిమాణంకల కాల రంధ్రాల ఉనికి కూడా ఉండవచ్చు.వీటిని ప్రైమార్డియేల్ కాల రంధ్రంలుగా అన్వయించవచ్చు. వాటియొక్క ఉనికి ప్రస్తుతము ఖచ్చితముగా నిర్దారించలేము.
స్పాట్
ఈ బ్లాక్ హోల్ వల్ల భూమి వచ్చే ముప్పేంటి.. సూర్యుడు కూడా మామూలు నక్షత్రాల్లా బ్లాక్ హోల్ గా మారబోతున్నాడా . ఒక వేళ అలా మారితే ఏం జరగబోతోంది. ఈ సౌర మండలం మొత్తాన్ని సూర్యుడే మింగేయబోతున్నాడా.. ఈ ప్రశ్నలన్నిటికీ వచ్చే ఎపిసోడ్ లో సమాధానం వెతుకుదాం.
యాంకర్ 7
ఇంత పెద్ద గెలక్సీలో.. ఇప్పుడు మనం ఊహిస్తున్న మార్పులన్నీ నిజంగా జరిగినయేనా.. వీటిని మనం నమ్మొచ్చా.. ఇది కేవలం ఊహా కల్సిత సిద్దాంతమేనా..ఈ అనుమానం మనకే కాదు.. శాస్ర్తవేత్తలకూ వచ్చింది. ఒక్కోసారి తామూహించిన విషయాలు నిజం కాదేమోనన్న అనుమానం కూడా వాళ్ల మెదళ్లను తొలిచేస్తది. కారణం.. ఇదిగో ఈ చిన్న విషయం.
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ విశేషాలు.. మరిన్ని లేటెస్ట్ సైంటిఫిక్ అప్ డేట్స్ వచ్చేవారం తెలుసుకుందా.. అంటిల్ దెన్ బైబై దిసీజ్ శోభన్ సైనింగ్ ఆఫ్.
బ్రేక్ లు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి