31, మే 2011, మంగళవారం

ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జి 37

ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలు విప్పిచెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం
యాంకర్ 1
బ్యాంగ్
వాయిస్
ఆరు నెలల మంచు శయనం తరువాత ఎల్లోస్టోన్ క్రమక్రమంగా రూపాంతరం చెందడం ప్రారంభిస్తది. అప్పటి వరకు మంచురాజ్యాన్ని ఏలిన జీవున్నీ ఇక బంట్లు గా మారాల్సిన పరిస్థితి. ఎలుగు బంట్లలాంటి జంతువులు సుప్తావస్థ స్థితిలోకి జారుకొని గ్రీష్మతాపం నుంచి రక్షించుకొనేందుకు సిద్దపడతయి.
భానుడి నులివెచ్చిని కిరణాలు మంచు ముత్యాలను ముద్దాడీ ముద్దాడగానే పరవశించి కరిగిపోయి ఆనంద బాష్పాలుగా ప్రవహిస్తయి. చినుకు చినుకు చిత్తడి నేలై ఒంపు సొంపుల సెలయేరుగా ఒడలు నింపుకుంటది.
ఈ జలాల్లో ఉభయ చరాలు కొత్త ఉత్సాహంతో జలకాలాడతయి. తనువంతా శీతల తాపంతో ఉన్న రుతుకన్య సూర్యుడి వెచ్చని పరిష్యంగం కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తది. అప్పడపుడు దావానలంలా వ్యాపించే అటవీ అగ్ని శిఖల నడుమ ఎల్లోస్టోన్ వేసవిని ఆవహించుకునేందుకు వనమాలతో సిద్దపడతది.
(నక్క..కూత కంటిన్యూ) వేసవి కోసం వేయి కళ్లతో ఎదురు చూసే జీవులన్నీ ఆహ్వాన గీతాలను ఆలపిస్తున్నట్టుంటది. వింటర్ లో విందుభోజనాలు ఆరగించిన జడల జీవులు వదులుగా మారిన మంచు ఎడారిలో అడుగులు తడబడుతుండగా వలస బాట పడుతయి.
వేసవి ఆగమన వాసనను పసిగట్టిన క్రిస్లీ బేర్.. తన పరివారంతో పయనం మొదలు పెడతది. మంచు మడుగులో చేపల వేట మొదలు పెడతది. రుతువు మొత్తం తిరిగి తిరిగి ఈ మంచుకొలనులో చేప మాంసం కోసం ఎల్లోస్టోన్ మొత్తం కలియ తిరుగుతయి.
నిండు శీతలంలో వలస వెళ్లిన జీవులన్నీ మందలు మందలుగా ఎల్లోస్టోన్ ప్రాంతానికి తిరిగి వస్తుంటయి. వేసవి ఆనవాళ్లు చూసి రెట్టించిన ఉత్సాహంతో ఉరుకులు పరుగులు పెట్టుకుంట ఎల్లోస్టోన్ ముఖద్వారానికి చేరుకుంటయి. ఎల్లోస్టోన్ గుండె గుహలో తమకోసం దాచి ఉంచిన ఓ కొత్త ప్రపంచపు తలుపులు తడిమేందుకు అవి కాలంతో పరిగెట్టుకుంటూ వస్తుంటయి. అంతకు ముందు ఇదే ప్రాంతంలో మంచు మడుగుల్లో కూరుకుపోయిన తమకు వెచ్చని నేల గట్టిగా తగలడంతో రెట్టించి ఉత్సాహంతో అడుగులేస్తయి.
అప్పటి వరకు చలికాల సామ్రాజ్యాన్ని గుత్త పెత్తనంగా సొంతం చేసుకున్న బైసన్ లు వేసవి రాకతో పలాయనం చిత్తగిస్తయి. విలయతాండవం చేసే అగ్ని పర్వతం సిగలో వేసిన మంచు దుప్పటి పై తిరుగాడే జీవులు వేడికోసం అలమటించడం బహుషా ఇక్కడ మాత్రమే సాధ్యమేమో. మిలియన్ సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం నిండా వేయి అడుగుల మేర మంచు పరచుకొని ఉండేది. అంత లోతున్న మంచు పుటల కింద దాగున్న ఓ అగ్నిగుండం అప్పుడప్పుడు అనుకోని అతిధిగా వచ్చి. మంచు పొరలను పలచన చేస్తూ చులకనగా చూస్తూ వెళ్లిపోయేది. వేల సంవత్సరాల నాటి ఆ శకున శకలాల శిథిలాలు ఇప్పటికీ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తయి. అలా మంచు కరిగి కరిగి..ఇలా నేల మాళిగలు బయట పడేలా తయారయింది. ఆ నేల పల్లకి పై మొలిచిన మొక్కలను సింగారించుకొని ఎల్లోస్టోన్ ఓ వనకన్యలా కనిపిస్తది. మంచు ముత్యాల నడుమ పొదగ బడిన పచ్చల్లా పసిరిక మొక్కలు కనువిందు చేస్తయి. మంచు పుట్టల్లో పెట్టని కోటలా దాగిన కీటకాలు బాహ్యవాతావరణంలో సంచరించేందుకు బయటకు వస్తయి. వివిధ రకాల పక్షులు కొమ్మకొమ్మకు వాలి తమదైన రాజ్యాన్ని కళ్ళారా చూసి మురిసి పోతయి. నీలి వర్ణపు సొగసులతో చెంగు చెంగున ఎగిరే ఈ పక్షి వేసవిలో ఎల్లోస్టోన్ కు విశిష్ట అతిధి. ఈ కీటకాలన్నీ పక్షికోసమే పుట్టినవన్నంత ఆబగా ఆరగిస్తది. ఆరునెలలుగా ఘనీభవించిన మంచు ఫలకలను మధిస్తున్న ఉష్ణకవ్వానికి తలొగ్గుతూ మంచు గుట్టలన్నీ మంచినీటి వాగులుగా మారుతయి. వాగులనిండా బుడబుంగల్లాంటి పక్షులు కువకువలాడుతూ జలకన్యల్లా జలకాలాడుతయి.అంతెత్తు నుంచి జాలువారే జలపాతాలు వేసవి సూరీడు మీటిన శిలా సంగీతంలా ధ్వనిస్తుంటయి. ఆ జలపాత ఘోషకు వనజీవాలన్నీ పరవశించిపోతయి. ఈ వాగు వరదల్లో జంతువులు కూడా తమ ఉష్ణ తాపాన్నితీర్చుకుంటయి. ఈ జలపాత దారుల్లో అడ్డొచ్చిన వృక్షాలన్నీ నేలకూలాల్సిందే. అంతెత్తునుంచి జాలువారే జలపాతాన్ని చూసి నోరెళ్లబెట్టాల్సిందే. (స్పాట్) ఆరువారాల తరవాత ఎల్లోస్టోన్ వాతావరణంలో పూర్తి స్థాయి మార్పులొస్తయి. బైసన్ లు నీటి మడుగుల్లో స్నానం చేస్తయి. ఎక్కడెక్కడినుంచో రకరకాల పక్షులు అథిదుల్లా వచ్చి అలరిస్తయి. బైసన్లకు కొత్త పసరిక దొరుకుతుంది.ఆర్నెల్ల క్రితం మంచు దుప్పటి కప్పుకున్న ఈ ప్రాంతమంతా ఇప్పుడు ఆకుపచ్చని చీర సింగారించుకున్నట్టుంటది. ఈ వేడి కిరణాలకు నీటి తుంపరలు ఇంద్రధనుస్సును నేలకిందకుదింపుతయి. ఉష్న కయ్యలలో ఉబికి వచ్చే నీరు. భూ అంతరాళాలోనుంచి ఎగజిమ్మే ఆవిరులతో ఈ ప్రాంతమంతా శోభాయమానంగా ఉంటది. బైసన్ ల కొత్త జాతుల ఉత్పత్తి దశ కూడా ఇప్పుడే.
శీతాకాలంలో తమ ప్రతాపాన్ని చూపిన ఎల్బోలు ఇప్పుడు రహస్యజీవనాన్ని గడుపుతయి. కొత్తసంతతికి ప్రపంచపు దారులను పరిచయం చేస్తయి. కూనలన్నీ ఈ వాతావరణానికి అలవాటు పడతయి. ఈ మాసంలో ఎల్లోస్లోన్ ప్రాంతంలో జంతువులు సయ్యాటలు చూసి తీరాల్సిందే.
స్పాట్
నెక్టార్ పుష్పాల నిండా తొణుకుతున్న తేనె ను తాగేందుకు హమ్మింగ్ బడ్స్ ఝుమ్మనే నాదంతో సందడి చేస్తయి. ఒళ్లు విరిసిన పుష్ఫ పల్లకిలో తేనె పిట్టలు మధువు గ్రోలి మైమరిచి పోతయి. నిండా మంచు ఉన్న పర్వతాలు కాస్తా పొడిబారిన మామూలు గుట్టలుగా కనిపిస్తియ. అప్పుడప్పుడూ పలకరించిపోయే వాన చినుకులతో అడవి జీవులన్నీ తమ తాపాన్ని తీర్చుకుంటయి. రాలిన మంచు వానతో రానున్న రుతువుకు స్వాగతమని భావిస్తయి. ఈ మంచు వానకు క్రిస్లీ బేర్ పిల్లలతో హాయిగా సయ్యాల లాడుతది. బైసన్ లు ఈ సడెన్ చేంజ్ ను జీర్ణించుకోలేవు. హమ్మింగ్ బర్డ్ కడుపు నింపే తేనే పూల నిండా మంచు రాలి వాటి పొట్టను కొట్టినట్టుంటది.
ఎల్లో స్టోన్ లో చెప్పుకో దగ్గ పక్షి ఒకటుంది. ఇక్కడ మొక్కలకు రంద్రాలు చేస్తుందే అదే వాటి జీవితకాలాన్ని తగ్గిస్తది. ఎల్లోస్టోన్ ప్రాంతంలో వేసవి లో పూల పందిరి అల్లినట్టుంటది. రకరకాల పూలతో మన్మథబాణం కోసం విరిసిన పూలన్నట్టు ఉంటయి. ఎల్లోస్టోన్ ఎంతగా మారిపోతదంటే ఒకప్పుడు ఇక్కడ మంచు పర్వతాలు ఉన్నయంటే నమ్మలేనంతగా మారపోద్ది. రుతువు రుతువుకు ఇంత మార్పు కనిపించే ఒకే ఒక అరుదైన ప్రాంత భూగోళం పై ఇంతకు మించి వేరెక్కడా లేదు. మంచు విదుల్చుకున్న పర్వతాలన్నీ హరిత వర్ణ చీర కట్టుకున్న వనకన్యలా కనిపిస్తయి. మంచు మడుగులన్నీ ఉష్ణకయ్యాల్లా మారిపోతయి. ఈ కొలను అందాలు చూసి ప్రకృతి మొత్తం ఈ ఒడ్డున్నే వాలి పోయిందనిపిస్తది. వాగు మడుగుల్లో జలచరాలు, ఉబయ చరాలు తనివితీరా తాపాన్ని తీర్చుకుంటయి.
స్పాట్
పక్షులు వేట మొదలేసి చాలినన్న చేపలను తన్నుకుపోతయి. నీటికి ఎదురెళ్లే ప్రాంతంలో చేపలు గుడ్డు పెడతయి. నీటి ప్రవాహంలో ఈ గుడ్డు దూరతీరాలకు చేరి సూర్యరశ్మి చేత పొదగబడుతయి. గ్రీస్లీ బేర్ కూడా ఈ నీటి వాగుల్లో సేద తీరుతయి. ఇవి ఆహారాన్వేషణ కొరకు అడవంతా గాలిస్తయి. పర్వతాలన్నీ పసువర్ణ పూలతో నిండిపోతయి. వసంతం వచ్చి వాలే వరకు ఈ పూలన్నీ ప్రకృతి మాత సిగలో తురుముకున్నంత అందంగా ఉంటయి. గడ్డి పరకలను ఎలుకలు కొరుక్కుని తింటూ రేపటి కొరకు ఆహారాన్ని దాచుకుంటయి. ఉడతలు కూడా రేపలి కోసం ఆహారాన్ని దాచుకుంటయి. ఇవి తన బరువు కంటే 50 రెట్టు ఎక్కువ బరువుండే ఆహారాన్ని రోజు స్టోర్ చేసుకుంటది. ఈ ప్రకృతి ఒడిలో రకరకాల శబ్దాలు సందడి చేస్తయి. ఒకప్పుడు మంచు నిండి పర్వతాలన్నీ మట్టి గుట్టల్లా బోసిపోయి కనిపిస్తయి. వేడి ఎక్కువగా ఉన్న చోట బీడువారిన నేలకూడా ఎండుగడ్డితో బైసన్లకు ఆడ స్థలంగా మారుతది. మంచు పెచ్చులతో ఉన్న ప్రాంతమంతా రాతి కుప్పగా మారడాన్ని చూసి ఆశ్చర్యపోవడం చూసిన వారి వంతవుతుంది.
స్పాట్
తనకు తాను రుతువుకో రంగు పులుముకునే ఈ ఎల్లోస్టోన్ ప్రాంతం వర్ణరుతువులో ఎలా ఉంటుందో వచ్చేవారం చూద్దాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి