31, మే 2011, మంగళవారం

ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ 41

ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాలు విప్పిచెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం
యాంకర్ 1
ఈ విశాల విశ్వంలో ఈ భూమి పైనే కాకుండా గెలాక్సీలో ఇంకెక్కడో జీవం ఉండే ఉంటుందనే బలమైన అనుమానాలు ఉన్నయి. ఈ అనుమానాలు.. కేవలం అనుమానాలేనా.. నివురు గప్పిన నిజాలా.. ఏమరు పాటుగా ఉన్న మన పై ఏదో ఒకరోజు గ్రహాంతర వాసులు దాడి చేస్తరా.. అచ్చం ఇదే కాన్సెప్ట్ తో ఎన్నో హాలీవుడ్ సినిమాలు వచ్చినయి. అంతే క్యూరియాసిటీ తో వాటిని ఆదరించింన్రు ప్రజలు. కానీ గ్రహాంతర జీవం పై నిజానిజాలేంటి.. నిజంగా గ్రహాంత జీవం ఉందా.. అవి మన కంటే తెలివైనవా.. మానవ రూపంలోఉంటయా.. పూర్తిగా భిన్నంగా ఉంటయా.. ఈ ప్రశ్నలకు సమాధానం వెదికే పనిలో ఉండగానే.. రీసెంట్ గా సైబీరియా మంచు కొండల్లో ఒక విచిత్ర జీవిని కనుగొన్నరు పరిశోధకులు. ఇది అచ్చం ఇప్పటి వరకు ఫిక్షన్ సినిమాల్లో వచ్చిన గ్రహాంతర వాసిలా ఉండటంతో అనుమానాలు మరింత బలపడ్డయి. మీరూ ఓసారి ఆ క్లిప్పింగ్ చూస్తే మీకే అర్ధమవుతది.
(సైబీరియా క్లిప్పింగ్)
యాంకర్ 2
చూశారుగా.. ఇది కచ్చితంగా భూమి పై తిరిగే జంతువైతే కాదు. మనిషి పోలికలున్నా మనిషి మాత్రం కాదు. రష్యన్ లు మాత్రం ఇది ఎలియనే అని కచ్చితంగా నమ్ముతున్నరు. ఇప్పటికే ఈ వీడియోలు యూ ట్యూబ్ లో షికార్లు చేస్తున్నయి. ఇది ఏలియనా .. కాదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు శాస్ర్తవేత్తలు పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. ఆఖరుకు ఇది ఏలియన్ కాదు... అని తేల్చేసిన్రు. కానీ ఏలియన్ లు ఉన్నయా లేవా అన్న సందేహం మాత్రం అలానే ఉండిపోయింది.
వాయిస్
సైబీరియాలో దొరికిన ఈ ఏలియన్ రూపంలో ఉన్న పదార్ధం యూట్యూబ్ లో హల్ చల్ చేయడంతో ఏలియన్ అనే మాట తిరిగి తెరపైకి వచ్చింది. దీనికి భారీ ఎత్తున ప్రచారం కూడా జరిగింది. శాస్త్రవేత్తలంతా హడావుడి చేసి ఈ దేహం వెనుక ఉన్న రహస్యమేంటో శోధించి సాధించిన్రు. ఇది కచ్చితంగా ఏలియన్ కాదని తేల్చేసిన్రు.
యాంకర్ 3
ఈ సౌర కుటుంబ అవల ఎక్కడో ఒకచోట మాత్రం కచ్చితంగా జీవం ఉండే అవకాశాలు లేకపోలేదు అనే నిర్ధారణకు వచ్చిన్రు పరిశోధకులు. కానీ ఆ జీవం ఏ రూపంలో ఉంటది. ఈ ప్రశ్నకు సమాధానం కేవలం ఊహాత్మకం మాత్రమే.. కానీ ఐన్ స్టీన్ తరువాత అంతటి మేథావి గా ప్రశంసలందుకున్న స్టీవెన్ హాకింగ్ గ్రహాంత జీవం గురించి కొన్ని పరికల్పనలు చేసిండు.. వాస్తవానికి సైన్స్ ఫిక్షన్ సినిమాలను అందరూ నమ్మరు. కానీ ఖగోళ రహస్యాలను, గ్రహ గతులను వడగట్టిన హాకింగ్ విశ్వంలో జరిగే కొన్ని వింతల గురించి తెలపిండంటే.. వాటికి కచ్చితంగా విశ్వసనీయత ఉండే ఉంటుందని ఓ నమ్మకం. ఇంతకీ స్టీవెన్ హాకింగ్ ఏం చెప్పిండు..
బైట్ (స్టీవెన్ హాకింగ్ వాయిస్)
పారా డబ్బింగ్
హాలో..నాపేరు స్టీవెన్ హాకింగ్.. నేను ఫిజిసిస్టుని, కాస్మాలజిస్టుని, నేను కంప్యూర్ సాయంతో మాత్రమే మాట్లాడగలను. అంటే కంప్యూటర్ లో రాసిన స్క్రిస్ట్ వాయిస్ కన్వర్టర్ సాయంతో మాట్లాడగలను.ఇప్పుడు ప్రపంచ మానవాళి మొత్తం అంతా ఆసక్తిగా అడుగుతున్న ఒకే ఒకే ప్రశ్న. ఏటియన్స్ నిజమేనా.. ఎలా ఉంటయి. ఎక్కడ ఉంటయి. వాటి శరీరం ఎటువంటి పదార్ధారలతో తయారయింది. చూడ్డానికి అవి ఎలా ఉంటయి. అవి తెలివైనవా.. ఈ ప్రశ్నలన్నిటికీ నా ఊహా శక్తికి అందిన సమాచారమంతా ఈ స్టోరీ ద్వారా అంతిస్తున్నాను.
స్పాట్
ఈ సృష్టిలో మరెక్కడయినా గ్రహాంతర జీవులు ఉన్నయా.. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే.. మనం ఈ సౌరకుటుంబాన్ని దాటి వెళ్లాలి. భూమిని విడిచి.. ఒక్కొక్క గ్రహాన్ని దాటుకుంటూ.. విశాల విశ్వంలోకి ప్రవేశించాలి
స్పాట్
ఈ విశ్వం ఎంత పెద్దదిగా ఉంటదంటే… మన ఊహకే దాని వైశాల్యం అంతు పట్టనంత పెద్దిగా ఉంటది. మన సౌరకుంటుంబాల్లాంటి వేలాది సౌరకుటుంబాలుంటే ఈ పాలపుంత లో 200ల మిలియన్ల నక్షత్రాలుంటయి… ఇది మన సౌరకుటుంబాల్లాంటి లక్షలాది సౌరకుంటుంబాలుంటే పాలపుంత.. అంటే ఇది మన పాల పుంత అన్నమాట.. ఈ పాలపుంతలోనే కోటాను కోట్ల నక్షత్రాలు గ్రహరాశులున్నయి. అంత పెద్ద పాలపుంత ఈ వైడ్ గెలాక్సీ తో పోల్చుకుంటే ఈ పాలపుంత ఒక చిన్న నీటి బిందువు లాంటిది.
స్పాట్
యాంకర్ 4
రాత్రి వేళ ఆకాశం వైపు చూస్తే మనకు లెక్కలేనన్ని నక్షత్రాలు కనిపిస్తయి. పాలపుంతలు కూడా కనిపిస్తయి. ఐతే మన కంటికి కనిపించే విశ్వం చాలా చిన్నది. ఎంత చిన్నదంటే ఈ మహాగెలాక్సీలో నీటి తుంపరంత.. ఒక్కసారి ఈ పాలపుంతను దాటి లార్జ్ గెలాక్సీలోకి వెళ్లొద్దాం.
స్పాట్
ఈ పాల పుంతల సాగరాన్ని దాటుకుంటు చాలా చాలా దూరంగా.. అంటే పూర్తిగా వెళ్లే ప్రయత్నం చేద్దాం.
స్పాట్
చూశారుగా సుమారు వంద బిలియన్ ల గెలక్సీలు చెట్టు కొమ్మాల్లా ఈ శూన్యంలోకి అన్ని వైపులా విస్తరించుకొని ఉన్నయి.
స్పాట్
ఇంతకీ ఈ విశాల విశ్వానికి ఆది అంతం అనేది ఎక్కడా కనిపించలేదు.
(మళ్లీ..స్పీఫెన్ హాకింగ్ వాయిస్)
నా గణితశాస్ర్త మేథస్సుతో ఆలోచిస్తే ఈ విశాల విశ్వంలో ఎక్కడో ఒక దగ్గర ఏలియన్స్ ఉండటం ఖాయమని నా అభిప్రాయం.. అవి ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో నివసించగలవు.. మండే సూర్యుడి పై కూడా చలించగలగే అవకాశం కూడా ఉండి ఉండొచ్చు..
స్పాట్
ఈ విశాల విశ్వంలో గ్రహాంతర జీవం ఉండే అవకాశాలు అనంతం.
స్పాట్
యాంకర్ 5
ఈ భూమి పై జీవం మొదలయింది ఏకకణ జీవితోనే. ముందు వృక్ష జాతి పుట్టిందా.. జంతుజాతి ఆవిర్భవించిందా అనే విషయం పై ఇప్పటికీ చాలా సందేహాలున్నయి. అయితే మరి ఏలియన్స్ కు పునాది కూడా హరితపదార్ధమేనా.. అక్కడ కూడా మొక్కలున్నయా.. ఉంటే ఎటువంటివి.. మళ్లొక్కసారి గెలాక్సీలోకి తొంగి చూద్దాం.
స్పాట్
ఏలియన్స్ జీవం హరిత వర్ణపు ద్రవంతోనే మొదలయిందా.. ఇది జీవద్రవ్యం ఏర్పడటానికి మొదటిపునాది. ఈ పరిణామమే అత్యంత పరిణితి చెందే జీవుల ఆవిర్భావానికి దారి తీస్తది.
స్పాట్
ఈ గెలాక్సీ సమూహాల నడుమ ఎక్కడో ఒక దగ్గర మనం ఊహించినట్టు.. టి.విలలో .. సినిమాలలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమాల మాదిరిగా ఏలియన్లు ఉండే ఉంటయి. ఇవిస్టార్ వార్ కు సిద్దంగా ఉన్నాయన్న మాటలు కూడా వాస్తవమే అయి ఉండొచ్చు.
స్పాట్
గ్రహాంతర జీవాన్వేషణలో వెలుగు చూస్తున్న కొన్ని ఫార్ములాలు జీవానికి కొత్త అర్ధాన్నిస్తున్నయి. జీవం కొత్త కొత్త రూపాలలో నక్షత్రాల నడుమ కూడా పురుడు పోసుకోవచ్చన వాదనలు కూడా ఉన్నయి.
స్పాట్
ఒక్కోసారి కోటాను కోట్ల సూక్ష్మక్రిములన్నీ కలిసి ఒక మేఘంగా రూపొంది స్వేచ్ఛగా కదలుతూ ఉండొచ్చు. ఇవి ఏ ఆహారం లేకుండా సంవత్సరాల తరబడి జీవించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం.
స్పాట్
గ్రహాంతర జీవం ఉందో లేదో తెలుసుకోవాలంటే ఈ గెలాక్సీని వీడి తిరిగి మళ్లీ మన భూమి పైకి చేరాల్సిందే.
స్పాట్
ఈ పచ్చని ప్రకృతినడుమ జీవార్భావానికి దారి తీసే పరిస్థితులేంటో అనే విషయాలు కోకొల్లలుగా ఉన్నయి. (స్పాట్ తొండ,..)
ఈ భూమి పైన రకరకాల జీవులున్నయి. ఒక్కో జీవి జీవన వైవిధ్యం ఒక్కోరకంగా ఉంటది. వాటి జీవన విధానంలో గానీ, శరీర నిర్మాణం, ఆహారపుటలవాట్లలో గానీ పూర్తి వైరుద్యాలుంటయి.
స్పాట్
జీవం ఏర్పడే అవకాశం ఎలా ఉంటదో తెలుసుకోవాలంటే ముందు జీవాన్ని విశ్లేషించాలి.
స్పాట్
జీవద్రవ్యం, దేహనిర్మాణం జరగాలంటే అమైనో ఆమ్లాలు కావాలి.. అయితే అమైనో ఆమ్లాలు ఒక్కటిగా కలిస్తే జీవం ఏర్పడుతదా.. ఈ సూత్రంతోనే ఎందరో శాస్ర్తవేత్తలు రకరకాల ఊహాగానాలు, పరికల్పనలు చేసిన్రు.
స్పాట్
ఈ సిద్దాంతం ప్రకారం జలాశయాల్లో విడివిడిగా ఉన్న రసాయనాలు కలిసి అమైనో ఆమ్లాలుగా రూపొందినయి. అమైనో ఆమ్లాలన్నీ ఒకదానికొకటి తాకుతూ ఉండేవి. ఏదో ఒకరోజు జీవద్రవ్యం ఏర్పడటానికి అనుకూలమయ్యే ఒక గొలుసు తయారయింది. అంతే ఆ క్షణమే ఈ భూమి పై జీవావిర్భావానికి తొలి అడుగు పడింది.
స్పాట్
తొలిసారి ఏర్పడ్డ ఆ జీవం.. తిరిగి తిరిగి రకరకాల జీవులుగా పరిణితి చెందింది. ఏకకణ జీవులు, బహుకణ జీవులుగా అభివృద్ది చెందినయి. ఇవే తిరగి వర్గాలుగా, విభాగాలుగా, ఉపవిభాగాలుగా అభివృద్ది చెందినయి. అయితే అచ్చు ఇవే పరిస్థితులు ఇతర గ్రహాలపై జరగవని చెప్పలేం. లేదా ఇంతకంటే గొప్ప మార్పులు జరిగే అవకాశం కూడా లేకపోలేదు.. ఇప్పుడిక తిరిగి గెలాక్సీ లోకి వెళదాం..
స్పాట్
యాంకర్ 6
ఇప్పటి వరకు శాస్ర్తవేత్తలు జీవం ఏర్పడటానికి చాలా కారణాలే చెప్పిన్రు. కానీ ఈ భూమి పై జీవం పుట్టడానికి ఇక్కడి పరిస్థితులే కారణం కాదనే కొత్త వాదన పుట్టుకొచ్చింది. ఈ గ్రహం పై ఇప్పుడున్న జీవం వేరే గ్రహం నుంచి వచ్చిందనే వాదన కూడా ఉంది. .
స్పాట్
గ్రహాంతర జీవం కోసం జరిగే అన్వేషణలో ఓ కొత్తనిజం బయట పడ్డది. ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి జీవం రవాణా అయ్యే మార్గం ఒకటి కనుగొన్నరు. గెలాక్సీ లో స్వేచ్ఛగా విహరించే ఆస్టరాయిడ్స్ ఒక్కోసారి తమ కక్ష్య నుంచి బయటపడి ఏదో ఒక గ్రహాన్ని ఢీ కొంటయి. ఈ ఆస్టరాయిడ్ లతో పాటు వాటి పై జీవించే చిన్నా చితక బ్యాక్టీరియా కూడా గ్రహాలను చేరుతయి.
స్పాట్
ఆస్టరాయిడ్ ల పై స్తబ్దుగా ఉన్న చాలా రకాల మైక్రోమ్స్ ఏదైనా గ్రహాన్ని చేరినపుడు అక్కడ అనుకూల పరిస్థితులు ఉంటే వాటి క్రియలను ప్రారంభిస్తయి. ఇప్పుడు భూమి పై ఉన్న సమస్త జాతులకు మూలాలు విశ్వాంతరాళంలోంచి ఊడిపడ్డయేననే కొత్త సిద్ధాంతం వెలుగులోకి వచ్చింది. ఆస్టరాయిడ్ ల ద్వారానే జీవం భూమిని చేరి ఉండొచ్చనే ఒక ఊహ.. ఈ ఊహే నిజం కావాలని లేదు.
స్పాట్
ఆస్టరాయిడ్ నుంచి నేలను చేరిన జీవం ఇంతింతైవటుడింతై అన్నట్టు భూగోళం నిండా జీవజాలంతో నిండిపోయింది. అయితే ఈ పరిణామం ఒక్క భూమికే పరిమితం కాలేదనేది శాస్ర్తవేత్తల అభిప్రాయం. ఇతర గ్రహాలపై కూడా ఇదే విధంగా జీవం అభివృద్ది చెంది ఉండొచ్చనే అభిప్రాయం ఉంది.
స్పాట్
స్టీఫెన్ హాకింగ్ ప్రకారం ఇక్కడ కనిపించే జీవుల వంటి విచిత్ర జీవులు ఏలియన్ లుగా అభివృద్ది చెంది ఉండవచ్చనే అభిప్రాయం ఉంది.
స్పాట్
నీరు.. ఈ సృష్టిలో అత్యంత కీలకం. జీవం ఏర్పడటానికి కావలసిన ప్రధాన వనరు నీరు. అయితే ఈ సౌరమండలంలో గ్రహాంతరాళంలో కూడా నీరు ఘనీభవించిన ఉంది. చిన్న చిన్న క్రిస్టల్స్ రూపంలో ఉంది.
స్పాట్
యాంకర్ 7
మనకు భూమి పై ఉన్ననీరే తెలుసు.. కానీ గెలాక్సీలో శూన్యంలో కూడా వాటర్ ఉంటదట. రేణురూపంలో ఉన్న ఈ నీరు చాలా మందికి తెలయదు.. ఈ సౌరమండలంలో రెండు గ్రహాల మధ్య నీటి చెమ్మ ఆవరించి ఉంది. ఆ రెండింటిలో మొదటిది భూమి. రెండవది ఒకటి భూమికి దగ్గరగా ఉండే మార్స్ గ్రహం.. ఒక్కసారి ఈ మార్స్ పై దాగిన జీవ రహస్యమేంటో చూద్దాం.
స్పాట్
ఇవి మార్స్ గ్రహం ఉపరితల చిత్రాలు. రోబోలు తెచ్చిన ఈ చిత్రాలను శాస్త్రవేత్తలు జాగ్రత్తగా అధ్యయనం చేసిన్రు. మార్స్ గ్రహం పై ఉన్న మట్టిని, రాళ్లను నిశితంగా పరిశీలించిన్రు. ఇక్కడ తెల్లగా కనిపిస్తున్న లవణం వంటిపదార్ధం. ఈ గ్రహం పై నీరుండేదనడానికి నిర్జీవ సాక్ష్యం. ఇక్కడ ఎండిపోయిన సరస్సులా కనిపిస్తున్న ఈ ప్రాంతం నిండా ఒకపుడునీరుండేదని శాస్ర్తవేత్తల ఊహ.. సాటిలైట్ తీసిన చిత్రాలను పరిశీలిస్తే.. పిల్లకాలువలు వాటిని తమలో ఇముడ్చుకున్న పెద్దకాలువల చాయా చిత్రాలను గుర్తించిన్రు. ఇక్కడ ఎడారిలా కనిపిస్తున్న ఇసుక గుట్టలకు కారణం నీరేనని శాస్ర్తవేత్తలు చెబుతున్నరు. ఇసుక రేణువుల నడుమ తేమ ఉండి తీరుతుంది.. ఈ తేమ చాలు జీవం పుట్టడానికి.
స్పాట్
మార్స్ కు సరిగ్రా 30 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న జూపిటర్ గ్రహం ఉంది. దీని చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహం పై కూడా జీవం ఉండే అవకాశాలు మెండుగా ఉండొచ్చనే ఊహాగానాలు బలంగా ఉన్నయి. కారణం ఈ గ్రహం పై ఉన్న పరిస్థితులే.
స్పాట్
ఇది జూపిటర్ ఉపగ్రహం ఉపరితలం. దీనిపై రెండు వేల మైళ్లవిస్తీర్ణంలో మంచు పరుచుకొని ఉంది. ఈ మంచు పొరల మందం 15 మైళ్లు ఉంటది. ఈ 15 మైళ్ల కింద ఉన్న వెచ్చని పొరల్లో జీవం ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నయి. ఈ ఉపగ్రహం జూపిటర్ చుట్టు తిరిగి రావడానికి మూడున్నర రోజులు పడుతది. దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతున్నపుడు ఇది జుపిటర్ గురుత్వాకర్షణ శక్తికి లోనవుతది. ఫలింతంగా ఇది దగ్గరకు ఒత్తబడి లోపలిపొరల్లో తీవ్ర వత్తిళ్లు కలుగుతయి. ఈ వత్తిళ్లు ఉష్ణాన్ని విడుదల చేస్తయి. ఈ ఉష్ణం పై పొరల్లో ఉన్న మంచును కరిగిస్తది. ఈ మంచు నీటిలోనే ఏలియన్ లు ఉండొచ్చని అనుమానిస్తున్నరు.
స్పాట్
ఒంటి నిండా విద్యుత్ బల్బులను అలంరించుకుంటున్నట్టు కనిపిస్తున్న ఈ విద్యుల్లతలు స్టీఫెన్ హాకింగ్ ఊహిస్తున్న ఏలియన్ లు. ఇవి తమ శరీరంలో ఉన్న రసాయనాలను వినియోగించుకొని కాంతిని ఉత్పత్తి చేస్తయని ఊహిస్తున్నరు. ఎందుకంటే వీటిని సూర్యరశ్మి తాకే అవకాశం లేదు. కాబట్టి ఇవి తమ శరీరంలో రసాయనాలతోనే విద్యుత్తు తయారు చేసుకుంటయని భావన..
స్పాట్
ఈ ఏలియన్ లు మనల్ని కంటాక్ట్ చేసే రోజు దగ్గర్నోనే ఉందని భావిస్తున్నరు.
యాంకర్ 8
ఇప్పటి వరకు మనం చూసిన ఆనవాళ్లన్నీ సౌరకుటుంబం పరిధిలోనివే.. ఒక్కసారి ఈ సౌరకుటుంబాన్ని దాటి గెలాక్సీ లోతుల్లోకి తొంగి చూస్తే అక్కడ ఎటువంటి వాతావరణం ఉండొచ్చు. ఆ వాతావరణం జీవార్భావానికి అనుకూలమా కాదా.. ఈ అంశం పై స్టీఫెన్ హాకింగ్ ఏమంటున్నడు.
స్టీఫెన్ వాయిస్
ఈ విశాల విశ్వంలో మనం ఒంటరిగా లేము. మనతో బాటు ఎక్కడో ఒక చోట జీవం సిద్దంగా ఉండటానికి అవకాశాలు లేకపోలేదు.
వాయిస్
శాస్ర్తసాంకేతిక రంగంలో అభివృద్ది చెందినంక గ్రహగతుల గురించి ఎన్నో రహస్యాలు వెలుగులోనికి వచ్చినయి. ఇక్కడ మనకు కనిపించే కెప్లర్ టెలీస్కోప్ ఖగోళాన్ని ఒడగడుతుంటది. అయితే ఇప్పటి వరకు శాస్ర్తవేత్తల దృష్టి నుంచి తప్పిచ్చుకుంటున్న గ్రహం ఒకటుంది. ఇటువంటి గ్రహం ఒకటుందనే ఆచూకీ చూపకుండా తప్పిచ్చకు తిరుగుతోంది. ఎలా సాధ్యం. మనిషి కన్ను గప్పి తిరగడం దీనికి ఎలా సాధ్యమయింది.. కాదు కాదు. సౌరమండలానికి ఆవల ఉన్న నక్షత్రాలను కనుగొనే మానవుడు ఈ గ్రహాన్ని గుర్తించలేకపోవడానికి కారణం ఏంటి.
స్పాట్
ఈ గెలాక్సీలో ఎన్నో రకాల నక్షత్రాలను, గ్రహాలను కనుగొన్నరు. కానీ కొన్ని గ్రహాలు, నక్షత్రాలు టెలీస్కోప్ల కన్నుగప్పినయి. ఇదెలా సాద్యం. అవును.. కొన్ని గ్రహాల గమన తీరే దీనికి కారణం. ఇదిగో ఒక్కడ ఒక యువకుడు డిస్క్ తో వామ్ అప్ చేస్తున్నడు. ఈ డిస్క్ ను తిప్పుతూ దాని బరువుకు తాను కూడా ఒక సర్కిల్ లో చుట్టూ తిరుగుతున్నడు. అచ్చం ఇటువంటి గమనమే ఈ గ్రహానిది. ఇది నక్షత్రం చుట్టూ తిరుగుతూ నక్షత్రాన్ని ప్రభావితం చేస్తుంటది. అంటే ఈ గ్రహాన్ని నక్షత్రమే భారంగా తిప్పుతున్నట్టుఉంటది. అంతేకాదు ఇది నక్షత్రాల నడుమ వేగంగా పరిభ్రమిచడం వలన దీని ఉనికి 1995 వరకు దొరకలేదు. తర్వాత ఇటువంటివి మరో 100 గ్రహాలు ఉన్నట్టు శాస్ర్తవేత్తలు కనుగొన్నరు. ఇదిగో ఇది అటువంటి గ్రహమే..
స్పాట్
ఈ గ్రహం పైనే ఏలియన్స్ ఉండటానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నయని హాకింగ్ అభిప్రాయం… అయితే వేరే గ్రహం పై ఉన్న జీవులు భూమి పై ఉన్నజీవుల మాదిరిగానే ఉండాలనే నిబంధన లేదు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న జీవులను చూడండి. ఇవి హాకింగ్ ఊహించిన రూపాలు. ఇవి నాచు, మన్నుతో జీవించే శాఖాహారులు.
స్పాట్
ముందు పెద్ద పాదం. తలపై రెండు నాసికా రంద్రాలు, శరీరం మద్యలో 180 డిగ్రీలు చూడగల కంటి నిర్మాణం. (స్మాల్ స్పాట్) ప్రాంతమేదైనా కావచ్చు, రూపమెలానైనా ఉండొచ్చు.. కానీ జీవనపోరాటం ఒకటే నని హాకింగ్ ఒపీనియన్. ఇక్కడ కూడా మనుగడ కోసం పోరాటం అనే సూత్రం వర్థిల్లుతుంది. ఒక జీవి పై మరో జీవి దాడి చేయడం.. పోరాడటం వంటివి మామూలే.
స్పాట్
అయితే హాకింగ్ ప్రకారం ఏలియన్స్ ఒకే గ్రహం పై మాత్రమే లేవు.. ఈ విశాల విశ్వగమనంలో ఎన్నో చోట్ల ఎన్నో గ్రహాలపై ఉండొచ్చు. ఆయన ఊహ ప్రకారం మరో గ్రహం పై లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ అతి చల్లగా ఉండి మంచు గడ్డలుగా, ద్రవ రూపంలో ఉండొచ్చు. ఈ లిక్విడ్ నైట్రోజన్ తో బాటు పాస్పరస్, కార్బన్, సిలికాన్ వంటి కొన్ని మూలకాలు ఉండే జీవం పుడుతుందని ఆయన అభిప్రాయం.
స్పాట్
ఇంకా జూపిటర్ , శని గ్రహాల పై కూడా జీవం ఉండే అవకాశాలు ఉండి ఉండొచ్చంటడు హాకింగ్. ఇవి మన కంటే సాంకేతికంగా ఎంతో అభివృద్ది చెందిన జీవులు కూడా కావచ్చు. ఎంతగా అంటే కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరాన్ని కూడా రెప్పపాటులో దాటే సాంకేతిక పరిజ్ఞానం వీటికి ఉండొచ్చనే ఊహ. ఇప్పటి వరకు ఉన్న ఊహాగానాలు పుకార్ల ప్రకారం ఏలియన్ లు కాంతులు వెదజల్లే వాహనాల్లో వస్తరని, మనుషులను, జంతువులను మాయం చేస్తరని కథనాలు వినిపించినయి. సో.. ఇదే నిజమని కాదు.. కానీ హాకింగ్ ఊహ ప్రకారం ఇవి తమ వాహనాలకు కావలసిన ఇందనం నక్షత్రం నుంచే సేకరించుకుంటయి. అది కూడా నక్షత్రం పై వాలి డైరెక్ట్ గా పవర్ ని కాప్చర్ చేస్తయి. నక్షత్రం చుట్టూ డైమండ్ షేప్ లో ఒక కాంతి పుంజాన్ని ఏర్పాటు చేస్తయి. ఈ నాలుగు కోణాలు ఒకే చోట ప్రొజెక్ట్ అయి ఒక ఉష్ణబిలాన్ని ఏర్పాటు చేస్తయి. ఈ ఉష్ణబిలంలో ప్రవేశిస్తే. రెప్పపాటులో కోటాను కోట్ల కాంతి సంవత్సరాలు ప్రయాణించ గలవని హాకింగ్ అభిప్రాయం. అయితే వీటన్నిటికీ రుజువులేమీ లేకున్నా.. అబద్దాలని మాత్రం కొట్టిపారేయలేము. నిజంగా ఏలియన్స్ అంత సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్నవే అయితే వాటి కోసం అన్వేషించడం, వాటిజోలికి పోకపోవడమే మంచిది.
ఎండ్ యాంకర్
అర్ధమయిందిగా ఏలియన్స్ గురించి హాకింగ్ ఏమన్నారో.. ఇవీ ఈ వారం సైంటిఫిక్ అప్ డేట్స్ . వచ్చేవారం మరిన్ని సైన్స్ విశేషాలతో వచ్చేవారం కలుసుకుందాం.. దిసీజ్ శోభన్ సైనింగ్ ఆఫ్..
బ్రేక్ లు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి