ఇంట్రో యాంకర్
విశ్వరహస్యాను విప్పి చెప్పే ది సైన్స్ అల్టిమేట్ నాటెడ్జ్ కు స్వాగతం.
యాంకర్ 1
మనం మనింట్లో కూర్చొని ఊహాలోకాల్లో ఊరేగుతుంటం. నయాగరా జలపాతం ఒడ్డున కూర్చోవాలని, హిమాలయాల పై విహంగ వీక్షణం చేయాలని, సాగరతీరాలలో చాయ్ తాగాలని అనిపిస్తది. కానీ కోరికలున్నంత రిచ్ గా ఆదాయం ఉండదు. మరెలా.. వరూధినీ ప్రవరుడిలా అరికాళ్లకు ఎదైనా లేహ్యం రాసుకొని ఇక్కడ మాయమై అక్కడ తేలితే ఎంత బావుంటుంది. కానీ మనకా లేహ్యం దొరకదు కదా..ఎలా..కానీ ఇప్పుడా కలలు నిజం కాబోతున్నాయి. కంప్యూటర్ ముందు కూర్చొని ఒక్క క్లిక్ చేస్తే చాలు ఈఫిల్ టవర్ చూట్టూ తిరగొచ్చు. తాజ్ మహల్ ముందు కూర్చొని తాపీకా కాఫీ తాగొచ్చు. ఇదంతా ఫాంటసీ కాదు నింజంగా నిజం, డౌటోస్తే మీరే చూడండి.
స్పాట్
వాయిస్
మాయలు మంత్రాలు..ఇప్పటి వరకు పురాణాలలో మాత్రమే వినిపించేవి కానీ ఇప్పుడు మనం కూడా చేయబోతున్నాం..అంటే మన భౌతికంగా మాయం కాకపోయినా
ఒక్కక్లిక్ తో మనం కదలకుండా కుంటాల జలపాతం ముందు మొక్కజొన్న కంటి తినొచ్చు. టెక్సాస్ వీధుల్లో షికారు చేయొచ్చు. వీధుల్లో వద్దనుకుంటే వినువీధిలో విహరించ వచ్చు.
స్పాట్
గూగ్ ఎర్త్ అంటే ఇప్పట వరకు మనకు తెలిసినది ఒకటే..ఈ భూగోళం పై ఉన్న ప్రతి ప్రాంతాన్ని చూడొచ్చు. లాండ్ మాప్లు తీసుకోవచ్చు. ఒక కిలోమీటర్ ఎత్తులో నుంచి మన ఇల్లు, మన లాండ్, మన పొలం మాత్రమే చూసుకోగలం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కంప్యూటర్ ముందు కూర్చొని ఒక్క క్లిక్ చేస్తే చాలు ప్రపంచాన్ని చుట్టిరావచ్చు. అరసెకన్లో అమెరికా వీధుల్లో విహరించే అవకాశం మన సొంతం. అంతే కాదు మనం ఏసి రూంలో కూర్చొని పట్టపగలు అమెరికా వీధుల్లో తిరిగితే ఎలా ఉంటుందో ఆస్వాదించొచ్చు. అర్ధారాత్రి వేళ అరేబియా సంముద్రపు అలలను తిలకించొచ్చు.
స్పాట్
అమ్మో అంత అదృష్టమా ఎలా సాధ్యం అంటారా. అక్షరాలా ఈ అదృష్టాన్ని మనకు కలిగించింది గూగుల్ ఎర్త్.
స్పాట్
గూగుల్ ఎర్త్ ఈ అవకాశానికి జియోబ్రౌజ్ అనే పేరు పెట్టింది. ఈ జియో బ్రౌస్ సహకారంతో ప్రపంచం మొత్తం చుట్టిరావచ్చు. దీనికి ఫేజ్ 1 వర్క్ దాదాపు పూర్తయింది. అన్ని స్ట్రీట్ లోనూ కెమెరాలు అరేంజ్ చేసి వాటిని ఇంటర్నెట్ కు అనుసంధానం చేసిన్రు. అయితే ప్రస్తుతానికి కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను మాత్రం ఇందులో పొందు పరిచిన్రు. భవిష్యత్తులో ఈ ఎర్త్ మొత్తాన్ని తమ ఆదీనంలోకి తెచ్చుకోవాలని గూగల్ ఎర్త్ ఆశ.
స్పాట్
గూగ్ల్ ఎర్త్ జియోబ్రౌజింగ్ అందుబాటులోకి వస్తే మనం చూడాలనుకున్న ప్రాంతాన్ని సెలక్ట్ చేసి దాన్ని జూమ్ చేసుకొని ఆ స్పాట్లో త్రిడి డైమన్షన్ విజువల్స్ తో వీదుల్లో వీర విహారం చెయ్యోచ్చు.
స్పాట్
గూగుల్ ఎర్త్ సాయంతో ప్రపంచంలో ఎక్కడైనా తిరగొచ్చన్నమాట నిజమే కానీ మనం తిరిగే ప్రాంతం లైవ్ కాదు. కొన్నాళ్ల కిందటిదన్నమాట. అవి ఎప్పుడో తీసిన విజువల్స్. ప్రతి వీధిలో ఒక కార్ని తిప్పి…ఆ కార్ పై మినీ కెమెరా పెట్టి.. ఆ వీధి విజువల్స్ రికార్డ్ చేస్తరు. ఈ విజువల్స్ ను గూగుల్ లో వీధి పేరుకు లింక్ పెడతారు. జియోబ్రౌజింగ్లో మనం ఏ ఏరియానైతే క్లిక్ చేసి టూర్ బటన్ నొక్కుతామో ఆ వీధిలో కార్లో తిరిగిన అనుభూతి కలుగుతుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే వీధికో వీడియో అన్నమాట. ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభదశలోనే ఉన్నది.
యాంకర్ 111
ఒకే త్వరలో మనం ఇంట్లో ఉండే ఈ ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చూడబోతున్నాం.. ఇదొక రకంగా మంచి అడ్వంటేజే..కానీ మరో వండర్ త్వరలో మన ముందుకు రాబోతోంది. అయితే ఇప్పటి వరకు మనం వెబ్ కామ్ తో ఎక్కడో దేశంలో ఉన్న మన మిత్రుడితో లైవ్ లో మాట్లాడటం, లేదా 3జి మొబైల్లో ఫేస్ టు ఫేస్ మాట్లాడు కోవడం మామూలే కానీ అదే మాటల్ని కాస్త కాఫీ షేర్ చేసుకుంటూ గ్రూప్ డిస్కషన్ లా చేస్తే ఎలా ఉంటది. చూస్తే ఆ థ్రిల్లేంటో మీకే తెలుస్తది.
స్పాట్
వాయిస్
ఇక్కడ ఫోన్ లో మాట్లాడున్న యువతి టెక్సాస్ కు 500మైళ్ల దూరంలో జాబ్ చేస్తోంది. ఈమె తన వారితో మాట్లాడుకోవాలంటే ఫోనే సాధ్యం. కొన్నిటిని లైవ్ లో షేర్ చేసుకోవాలంటే వెబ్ కాం ని ఆశ్రయించాల్సిందే..అయితే అదీ కూడా అంత సాటిస్ఫై లేదు. ఇప్పడు మరో కొత్త టెక్నాలజి వచ్చిపడింది. అదే టెలీ ప్రసెంట్. ఈ టెక్నాలజి తో ఎదురెదురుగా ఉన్నంత క్వాలిటీ తో పక్కపక్కన కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇదిగో ఇక్కడ ఓ ఇద్దరు ఉద్యోగులు ఎలా ఎదురెదురుగా ఉన్నట్లు మాట్లాడు కుంటున్నరో..దీనికి వీడికో కాలథి అని పేరు పెట్టిన్రు శాస్ర్తవేత్తలు. భవిష్యత్తులో గ్రూప్ ఆఫ్ కంపనీస్ ఉన్న బాస్ లు ఈ ట్రాన్స్ పోర్ట్ ప్రసెన్స్ టెక్నాలజీ తో ఒక్కచోట నుంచే అన్నీ ఆఫీస్ల స్టాఫ్ కు పనులు పురమాయించొచ్చు. స్నేహితులంతా ఒక్కచోట చేరి కాఫీ పంచుకొని తాగిన అనుభూతి పొందొచ్చు.
స్పాట్
టెలీ ప్రసెంట్ విధానం పెద్దపెద్ద కార్పోరేట్ సంస్థలకు బాగా ఉపయోగ పడింది. మల్టీనేషనల్ కంపెనీ అధినేతలు దేశదేశాలు తిరుగుతూ వారి కంపనీ వ్యవహారాలు, లావాదేవీలు చూసుకొంటరు. దీని వల్ల వారి విలువైన సమయం, డబ్బు వృదా కావడమే కాకుండా దేశదేశాలు తిరగడం వల్ల చాలా తొందరగా అలిసిపోతరు. కానీ ఈ టెలీప్రసెంట్ విధానం అందుబాటులోకి వచ్చినంక ఖండాంతరాల్లో ఉన్న తమ కార్యాలయాలను తేలికగా ఆపరేట్ చేసుకోగలుగుతున్నరు. భవిష్యత్తులో ఈ టెక్నాలజి చిన్న చిన్న కార్పోరేట్ సంస్థలకు కూడా అందుబాటులోకి రానున్నయి.
స్పాట్
యాంకర్..
మీరు రోడ్డు పై వెళ్తున్నారు.. సడెన్ గా డబ్బులు అవసరం వచ్చినయి. కానీ పర్సులో చిల్లిగవ్వ కూడా లేదు. ఇల్లు ఓ ముప్ఫై కిలో మీటర్ల రూరంలో ఉంది. కాస్త కంగారు పడతరు.. ఎవర్నైనా అడగాలంటే మోమాటం..ఈ టెన్స్ లోనే మీ జేబులో ఏటియం కార్డుందన్న విషయం గుర్తుకొస్తది. అంతే గుండె నిబ్బరం చేసుకొని ఎంచక్కా ఎటియంలో డబ్బలు డ్రా చేసుకొని అవసరం తీర్చుకుంటరు. ఇప్పటి వరకు డబ్బుకోసమే ఏటియంలు ఉన్నయి. భవిష్యత్తులో మీకు సడెన్ ఆరోగ్య దెబ్బతిన్నా. లేదా మీ ఆరోగ్యంలో ఏవో సడన్ మార్పులొచ్చినయని మీరు భావించినా ఏటియం మిషన్ లాగానే అత్యంత ఆధునిక టెక్నాలజి వైద్యం ఎక్కడ కోరుకుంటే అక్కడే పొందే రోజులు చాలా దగ్గర్లోనే ఉన్నయి. ఎలాగంటారా..ఇది గో ఇలా..
స్పాట్
హెల్త్ కేర్ ఎనీ ప్లేస్..ఎనీ టైం..ఎనీ డాక్టర్. ఇదీ మోటో..ఈ మోటోతో ఉన్న హెల్త్ చెకప్ చాంబర్ లు ఇక ప్రతి సెంటర్లలో రాబోతున్నయి. ఆ సెంటర్లలో కంప్యూటర్ ముందు నిల్చొని తమ వివరాలు చెప్పాలి. అంతే అది ఫీడ్ చేసుకొని అతని ఐడి నంబర్తో సరిచూసి చాంబర్లోకి అనుమతినిస్తది.
విజువల్స్
ఈ మినీ క్లినిక్ లో ఒక మెడికల్ అసిస్టెంట్ ఉంటడు. పెద్ద ప్లాస్మా స్క్రీన్ పై డాక్టర్ సిద్దంగా ఉంటది. వచ్చిన రోగిని ఆరోగ్యసమస్య ఏంటని వాకబు చేస్తది. అంతే కాదు రోగి లక్షణాలు అడిగి తెలుసుకొని రికార్డ్ చేస్తది. అంతేకాదు ఈ వ్యాధికి సంబందించిన ప్రాధమిక పరిక్షలను జరిపి డయాగ్నసిస్ చేస్తది. తరువాత ఏ డాక్టర్ చేత ట్రీట్ మెంట్ కావాలో అడుగుతది. జవాబు చెప్పిన అరక్షణంలోనే డాక్టర్ స్ర్కీన్ సై కనిపించి ట్రీట్ మెంట్ స్టార్ట్ చేస్తడు. టోటల్ స్కానింగ్ అవసరమను కుంటే లేజర్ స్కానింగ్ చేసి టెలీ డయాగ్నసిస్ చేసి వ్యాధి నిర్ధారణ చేస్తరు. అంతే కాదు ఆ వ్యాధినివారణకు సంబంధించిన మందులను నేరుగా ఇంటికి వచ్చే ఏర్పాటు చేస్తరు. మళ్లీ ఎప్పడు కలవాలో కూడా అపుడే చెప్తరు.
స్పాట్
యాంకర్
ఇంతకు ముందు మనం ట్రాన్స్ పోర్ట్ టెక్నిక్ అనే టాస్క్ని చూశాం. అంటే ఎక్కడో వేల కిలో మీటర్ల దూరంలో ఉన్న మనిషి ప్లాస్మా స్క్రీన్ పై కనిపించి మనతో లైవ్ లో మాట్లాడటం చూశాం. కానీ ఎక్కడో వేయి కిలోమీటర్ల దూరంలో ఉన్న మనిషి సడెన్గా పౌరాణిక సినిమాలలో లాగా మన ముందు కనిపించి మాట్లాడితే ఎలా ఉంటుంది.. కాసిన్ని మాటలు కప్పు కాఫీ తాగి తరువాత సడెన్ గా మాయమైతే ఎలా ఉంటుంది. ఇప్పటి వరకు ఇవన్నీ కేవలం ఊహలు మాత్రమే.. కానీ ఆ ఊహలు నిజం కానున్నాయి. అవును ఇప్పుడు సైన్స్ ఎంత వేగంగా అభివృద్ది చెందిందంటే తలచుకోగానే కోరుకున్న మనిషి కళ్లముందు ప్రత్యక్షం అయి కాసిన్ని కబుర్లు చెప్పి వెళ్తాడు. మీరే చూడండి.
స్పాట్
వాయిస్
ఇదిగో ఇక్కడ ఒక వ్యక్తి చేసే తమాషా చూడండి. తాను తన పార్ట్ నర్ కు చాలా దూరంలో ఉన్నాడు. కానీ తనతో కలిసి కబుర్లు చెబుతూ ఓ పెగ్గేయాలని ఆరాటం. కానీ తనోదేశంలో ఆమె ఒక దేశంలో ఎలా సాధ్యం. కానీ ఆప్పుడొచ్చిన 3డి టెలిప్రసెంట్ టెక్నాలజితో ఇది సాధ్యం. ఇక్కడ కనిపించే వ్యక్తి తాను పెగ్గు వేయదల్చుకోగానే సదరు పార్ట్నర్కు ఓ రింగిస్తడు. అంతే పార్ట్ నర్ అలర్ట్ అయి ప్రత్యక్షం అవుతది. అంతే అక్కడ ఆమెకూడా ఓ పెగ్ తో సిద్దంగా ఉంటుంది. కానీ 3డి ఎఫెక్ట్ వల్ల అచ్చు ఆమె నడిచొచ్చి మన ఎదురుగా కూర్చొని నిజం మనిషిలా మాట్లాడే ఫీలింగ్ కలుగుతది. అక్కడ ఉన్న ఆమెకు కూడా ఇవతలవ్యక్తి ఎదురుగా కూర్చొని మాట్లాడినట్టే ఉంటది. ఈ టెక్నాలజిలో ఒరిజినల్ కలర్స్ హైడెఫినేషన్ 3డి కెమెరాలను వాడటం వల్ల నిజంగానే ఎదురుగా మనిషి కూర్చున్న భావన కలుగుతది. రిమోట్ స్మూత్ గా ప్రేస్ చేసి బాయ్ చెప్పగానే ఎదుటి మనిషి మాయం.
యాంకర్
మనిషి హైటెక్ జీవితానికి అలవాటు పడ్డడు. చిన్న లాంతరు వెలుగులో సరిపెట్టుకొనే మనిషి హై మాస్ట్ లైట్లను మించిన వెలుతురు కోరుకుంటున్నడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ భూగోళం రాత్రి వేళకూడా విద్యుత్ కాంతితో దగదగా మెరిసిపోతుంది. విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. కానీ ఉత్పత్తి సరిపడాలేదు. అంతుకే కనిపించే ఏ చిన్న వనరును కూడా వదులుకోవట్టేదు మనిషి..అయినా రోజురోజుకూ కరెంట్ కోత తప్పడంలేదు.. అందుకే ఓ యువశాస్ర్తవేత్త ఓ కొత్త టెక్నిక్ కనిపెట్టింది. మనం నడిచే పాదాల స్పర్శ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తే ఎలా ఉంటుంది. మన నడకే కరెంట్ ఉత్పత్తి చేస్తే..ఊహే చాలా థ్రిల్లింగా ఉంది కదూ..ఆ టెక్నిక్ ఏంటో చూస్తే ఇంకా థ్రిల్లింగా ఉంటది..
స్పాట్
మనలో కొందరు రోజుకు కనీసం ఒక కిలోమీటరైనా నడుస్తం. కానీ ఆ కిలో మీటర్ నడకలో ఎంతో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చంటోంది ఈ యువశాస్ర్తవేత్త. ఇది నిజంగా నిజం..ఇక్కడ మిణుమిణుకు మని మెరిసే ఇండికేటర్లు ఉన్న ప్యాడ్లకు అనుసంధానం చేసిన సర్క్యూట్ లపై వెయిట్ పడగాగే ఆటోమేటిక్ గా కెనెటిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతది. ఒకసారికి 15వోల్ట్ ల కరెంట్ జెనరేట్ అవుతది. ఇటువంటివి కొన్ని వందల పాడ్లు జనసమ్మర్ధం ఉన్నచోట పరిస్తే ఇక ఆ ఏరియాకు కావలసిన కరెంట్ అక్కడే ఉత్పత్తి చేసుకోవచ్చు.. జనసంచారం బాగా ఉంటే బస్టాండ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, రైల్వేస్టేషన్లు, ఏర్పోర్ట్ల వద్ద, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వీటిని అమర్చి విద్యుత్ను పొందవచ్చంటున్నారు శాస్ర్తవేత్తలు. అంతేకాదు ఈ పద్దతి వల్ల వందలాది వాట్ ల విద్యుత్ అవుతుంది. కరెంట్ కోత అనేదే ఉండదు. .
స్పాట్
యాంకర్..
ప్రపంచవ్యాప్తంగా జనబా విపరీతంగా పెరిగిపోతంది. వీరందికీ తగ్గ ఆహారం, నీరు సమకూర్చడం ఇప్పుడో పెద్ద సమస్య. ఎందుకంటే నీటి చినుకు నేలను తాకగానే పొల్యూటెడ్ సొల్యూషన్ గా మారిపోతది. మళ్లీదాన్ని తాగే నీటిలా మార్చుకోవాలంటే ఒక యాగమే చెయ్యాల్సి వస్తోంది. మన పాత తరం మూడు కుండల పద్దతికి కొత్తసాంకేతిక రూపం ఇచ్చిన్రు శాస్ర్తవేత్తలు.
స్పాట్
ప్రస్తుతం మనకు కాలువల్లో, నదుల్లో లభించే మొత్తం నీటిలో కేవలం 3శాతం నీరే తాగడానికి అనుకూలంగా ఉంది. అది కూడా పూర్తిగా శుభ్రపరచుకొని తాగాలి. లేకుంటే నీటితో బాటు మందులు కూడా మింగాల్సి వస్తది. అందుకే వాటర్ ప్యూరిఫైయర్ను కనుగొన్నరు శాస్ర్తవేత్తలు. దాని పేరు స్లింగ్ షాట్ వాటర్ ప్యూరిఫైయర్. ఈ వాటర్ ఫ్యూరిఫైయర్ లో సూయిజ్ వాటర్, డ్రైనేజ్ వాటర్, రివర్ వాటర్ అనే తేడా లేకుండా ఏ రకమైన నీటిని నింపినా స్వచ్చమైన నీటిని అందిస్తది.
స్పాట్
ఈ స్లింగ్ షాట్ లో రెండు చాంబర్ లుంటయి. ఒక దానిలో మామూలు వాటర్ పోస్తే. మిగతా ఛాంబర్ లోకి ప్యూరిఫైడ్ వాటర్ వచ్చి చేరుతది. ఒక్కసారి దీని పని విధానం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తది. మనం పోసిన వాటర్ ముందుగా ఆవిరి రూపంలోకి మారుతది. ఆ ఆవిరి చాంబర్ పైబాగానికి చేరి చల్లబడి తిరిగి ఒక పైప్ ద్వారా మరో చాంబర్ లోకి ప్రవేశిస్తది. ఈ వాటర్ చాలా స్వచ్చంగా ఉంటది.
స్పాట్
ఈ మిషన్లో ఏ రకమైన నీటినైనా చాలా తేలికగా ప్యూరిఫై చేయొచ్చు. ఈ మిషన్ రోజుకు వేయి లీటర్ల నీటిని శుద్ది చేయగలదు. ఇంతా చేసి ఈ మిషన్ రేటు వింటే గుండెలు బాదుకోవడం ఖాయం. ఈ ప్యూరిఫైయర్ అక్షరాలా 2వేల డాలర్లు. అంటే మన రూపాయిల్లో చెప్పాలంటే లక్షరూపాయలన్న మాట. మనం ఇళ్లల్లో చిన్న గుడ్డ ముక్కతోనో, కాస్త డబ్బున్న వాళ్లయితే వాటర్ ఫిల్టర్ తోనో నీళ్లు వడగట్టుకుంటరు. కానీ నీళ్లు శుద్ది చేసుకోడానికే లక్షరూపాయల మిషనంటే.. చెలిమ నీటితో చెలిమి చేసే సామన్యుడికి సాధ్యమయ్యే పనేనా..అందుకే కాలుష్యాన్ని తగ్గించి పరిసరాలను శుభ్రంగా ఉంచితే ఈ బాధ ఉండదని పర్యావరణ వేత్తలు చెబుతున్నరు.
స్పాట్
యాంకర్..
అర్ధమయింది కదా..రోజు రోజుకూ పెరుగుతున్న నీటి కొరతను తట్టుకోవాలంటే వాటర్ ప్యూరిఫైయర్ లను వాడి నీటి కొరత తీర్చుకోవచ్చు..కానీ పెరుగుతున్న జనాభా తరుగుతున్న వ్యవసాయ విస్తీర్ణం... ఈ పరిస్తితుల్లో ఆహారపు కొరతను ఎలా ఎదుర్కోవాలి. పెరుగుతున్న జనాభాకు తగ్గ ఆహారాన్ని ఈ తక్కువ ప్రాంతంలో అందించడం ఎలా సాధ్యం. తలుచుకుంటే సాధ్యం కానిదంటూ లేదంటున్నరు శాస్ర్తవతత్తలు..దానికి వారు పెట్టిన ముద్దుపేరు స్కై ఫామ్..
స్పాట్
ప్రపంచ జనాభా రోజు రోజుకూ పెరుగి పోతంది. ఈ జనాభాకు తగిన ఆహారం సమకూర్చడం అంటే మాటలు కాదు. ఏటా కొన్ని మిలియన్ల జనాభా ఆహారం దొరకక చనిపోతే..కొన్ని లక్షల మంది పౌష్టికాహార లోపంతో తనువు చాలిస్తున్నరు. ఆహారం అంటే పళ్లెంలో నాలుగు మెతుకుల అన్నం అనుకుంటే పొరపాటే.. ఆహారమంటే పాలు పండ్లు..కూరగాయలు..ఆకుకూరలు ఇవన్నీ ఆహారం కిందకే వస్తయి. మరి ఇంతగా పెరిగిపోతున్న జనాబా..పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్న అపార్ట్ మెంట్ లు.. పరిశ్రమలు..రియల్ ఎస్టేట్ లు .. ఈ పరిస్తితుల్లో ప్రజలకు పంట పండించడానికి కూడా భూమి దొరకని పరిస్తితి. ఈ విషమ పరిస్తితిని ఎదుర్కొనేందుకే అపార్ట్మెంట్ అగ్రికల్చర్ అనే పద్దతిని ప్రవేశపెట్టిన్రు శాస్ర్తవేత్తలు. ఈ పద్దతిలో 14 అంతస్థల భవనంలో కూడా గాలీ, నీరు తాకే విధంగా నిర్మాణం చేపట్టి పంటలు పండిస్తున్నరు. ఈ విధానంలో షేవర్ వాటర్ సప్లై చేసి తక్కువ విస్తీర్ణంలో పంట పండించి ప్రజలకు అందించే టెక్నిక్ ను అభివృద్ది చేసిన్రు శాస్ర్తవేత్తలు.
స్పాట్
అంతా బాగానే ఉంది..మనిషికి ఈ గ్రహం పై నీరు లేకుంటే నీటిని శుద్దిచేసే యంత్రాలు వచ్చినయి. ఆహారం లేకుంటే మన అంతస్ధు పైనే పంట పండించుకొనే టెక్నిక్ లు వచ్చినయి. కానీ ఒక గ్రహశకలం వచ్చి భూమి మీద పడితే ఎలా..ఈ భూమి పై ఉన్న జీవరాశి మొత్తం తుడుచుకుపోతే ఎలా..ఈ సమస్య మనిషిని ఎప్పటినుంచో వేదిస్తోంది. ఈ అంతరిక్షంలో లక్షలాది గ్రహశకలాలు నిత్యం పిశాచాల్లా తిరుగుతున్నయి. వీటిని ఎదుర్కోవడం ఎలా.. ఏదైనా గ్రహశకలం దారి తప్పిభూమి పైకి వచ్చే మనందరం భూమి పై ఆశలొదలుకోవడమేనా..
స్పాట్
ఈ విశాల విశ్వంలో మన భూమితో బాటు ఎన్నో గ్రహశకలాలు తిరుగుతున్నయి. ఇవి అప్పుడప్పుడు తమ కక్ష నుండి వేరు పడి భూమి పైకి దూసుకొస్తున్నయి. కొన్ని భూ వాతా వరణంలోకి ప్రవేశించగానే మండి మసిలా మారిపోతుంటయి..మరి కొన్ని భూమి పరిధి వరకూ దూసుకొచ్చి నేల పై పెద్దపెద్ద గోతులు చేస్తయి..
స్పాట్
చిన్నచిన్న గ్రహ శకలాలైతే పెద్దప్రమాదం లేదు కానీ..మరీ ఫుట్ బాల్ గ్రౌండంత ఉన్న శకలం దూసుకు వస్తే ఈ భూమికి వచ్చే ముప్పు అంతా ఇంతా కాదు. గతంలో మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఈ భూమి పైకి ఒక గ్రహ శకలం దూసుకు వచ్చి ఎన్నో జాతులను తుడిచి పెట్టింది. డైనోసార్స్ వంటి బలిష్టమైన జాతి అంతరించడం వెనుక గ్రహశకలాల పాత్రే ఉందని పరిశోదకుల అభిప్రాయం.
స్పాట్
గతంలో జరిగిన పెనుమప్పే మళ్లీ జరిగితే ఈ భూమి మొత్తం అగ్ని గుండంగా మారి జీవం పూర్తిగా నాశనం కావడం ఖాయం. ఇన్ని వేల సంవత్సరాల నుంచి సాధించిన ప్రగతి మొత్తం చిటికెలో తుడిచిపెట్టుకు పోతుంది. ఈ నీలివర్ణ భూగోళం పై పచ్చని మొలక కూడా మొలవని పరిస్థితి వస్తది.
స్పాట్
ఈ విపత్తు ఇప్పటికిప్పుడు వచ్చేది కాకున్నా..ఏదో ఒకరోజు మాత్రం భూమికి తప్పని సరిగా వచ్చే విపత్తే..ఎందుకంటే లక్షలాధి గ్రహలకలాలు భూ కక్షకు అతి దగ్గరగా వచ్చి వెళుతున్యయి. సంవత్సరాలు గడిచేకొద్దీ వాటి కక్షా వేగాన్ని …కక్ష్యా దిశను మార్చుకుంటున్నయి. దీంతో అవి క్రమేపీ భూమి క్షక్ష్యకు దగ్గరగా వస్తున్నయి. ఏదో ఒక రోజు ఈ పెద్దపెద్ద శకలాలు భూమిని ఢీ కొట్టడం ఖాయం.
స్పాట్
ఈ గ్రహశకలాల ఉనికిని గుర్తించేందుకు అంతరిక్షకేంద్రాన్ని ఏర్పాటు చేసిన్రు. ఈ కేంద్రం నిత్యం విశ్వాంతరాళంలో జరిగే మార్పులను గమనిస్తది. గ్రహశకలాల గమనాన్ని గుర్తిస్తది. ఏదైనా శకలం భూమి పైకి దూసుకొస్తే కనిపెట్టి అలెర్ట్ చేస్తది.
స్పాట్
యాంకర్
బాగానే ఉంది. ..అందరిక్షంలో ఉన్న అంతరిక్ష పరిశోధనా కేంద్రం విశ్వాంతరాళంలో జరిగే మార్పులను గుర్తించి..గ్రహశకలాలు భూమి పైకి వచ్చే విషయాన్ని తెలియజేస్తది. మరి మనిషి అంత పెద్ద గ్రహాశకలాన్ని ఎదిరించగలడా..కొన్ని లక్షల మైళ్ల వేగంతో దూసుకు వచ్చే గ్రహశకలాన్ని ఎదుర్కొనడమంటే మాటలు కాదు. ఊహించడానికే చాలా కష్టం..మరేంచేయాలి.. దానికి కేవలం చిన్నటెక్నిక్ ని కనిపెట్టిన్రు శాస్ర్తవేత్తలు. మరేంలేదు ఎదురుగా ఒక రాయి వస్తే మనం దాన్ని చేత్తో అడ్డుపెట్టే బదులు తలవంచి తప్పించుకునే సూత్రమే ఇదీను. చూడండి..
స్పాట్
విశ్వంలో విహరించే లక్షలాది గ్రహశకలాలు రోజు రోజుకూ భూమికి తగ్గరవుతున్నయి. వాటికి ఉన్న గురుత్వారక్షణ శక్తి తగ్గి భూమి వైపు మళ్లుతున్నయి..మరి కొన్ని ఒకదానికొకటి ఢీ కొని కక్ష్యమార్చుకొని భూమికి దగ్గరగా వస్తున్నయి. ఇవిగానీ భూమిని ఢీ కొంటే ప్రళయం వస్తుంది. భూమి మొత్తం ఒక అగ్ని కణంలా మారుతుంది. అంతేకాదు. ఇక పై భూమి పై గడ్డిపోచ కూడా మొలిచే ఛాన్సులేకుండా అయిపోతది. ఈ విపత్తు ఎప్పుడో ఒకప్పుడు భూమికి తప్పనిసరి అందుకే శాస్త్రవత్తలు ఈ భూమిని, భూమిపై జీవులను గ్రహశకలాలనుంచి కాపాడేందుకు ఒక టెక్నిక్ ను కనిపెట్టన్రు.
స్పాట్
అంతరిక్షపరిశోధనా కేంద్రం శకలాల ఉనికికిని కనిపెట్టి తెలియజేయగానే పరిశోధకులు అలర్ట్ అవుతరు. వెంటనే ఒక స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగిస్తరు. మానవ రహిత స్పేస్ క్రాఫ్ట్ గ్రహశకలాన్ని చేరుకుంటది.. దాని గురుత్వాకర్షణ శక్తిని తగ్గిస్తూ ఈ స్పేస్ క్రాఫ్ట్ భూ కక్ష్యనుంచి కొంత సమయం తప్పిస్తది. కొంత సమయానికి ఆ కక్ష్యనుంచి భూమి వెళ్లిపోగానే యధావిధిగా శకలం తన కక్ష్యను చేరుకుంటది..మరో కొన్ని వందల ఏళ్లవరకు ఆగ్రహశకలంతో భూమికి ముప్పు ఉండబోదు. ఈ లోపే ఆ శకలం శిధిలమైనా కావచ్చు. కానీ ఈ ప్రక్రియ అత్యంత నైపుణ్యంతో నానో సెకన్ను కూడా అంచనా వేసి చేయగలిగేదిగా ఉండాలి. ఒక్క క్షణం ఏమరు పాటుగా ఉన్నా ఈ భూమి మొత్తం భూడిదగా మారాల్సిందే.. గ్రహశకలం ఇరవై సంవత్సరాలకు భూమిని చేరుకుంటదనగా ఇప్పుడే స్పేస్ క్రఫ్ట్ ను ప్రయోగించాలి. అప్పుడే ఆ మరణశాసనాలనుంచి తప్పించుకోగలం.
స్పాట్
ఎండ్ యాంకర్
…
బ్రేక్ లు, వెల్ కం బ్యాక్ లు,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి