16, అక్టోబర్ 2010, శనివారం

కృత్రిమ బ్యాక్టీరియా

ఎ. జనార్దన్
యాంకర్
సైన్స్ చరిత్రలో ఓ కొత్త అద్భుతం…ఓ కోత్త ఆవిష్కరణ..యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తిన అరుదైన ఘటన.. బయోటెక్నాలజీ రంగంలో మనిషి దాటిన మైలురాయి..అమెరికా శాస్ర్తవేత్త జె. క్రెయింగ్ వెంటర్ చేసిన అద్భుతపరిశోధన ఫలించింది. ప్రయోగశాలలో కృత్రిమ బ్యాక్టీరియాకు పురుడు పోశారు. సృష్టికి ప్రతి సృష్టి సాధ్యమేనని నిరూపించిండు క్రెయింగ్ వెంటర్..
వాయస్
మీరు చూస్తున్న ఈ కణాలు మనిషి తన తెలివితేటలతో సృష్టించిన కృత్రిమ బ్యాక్టీరియా. మనిషి మరో బ్రహ్మ అవతారం ఎత్తి రూపొందించిన జీవకణం ఇది. ఆ బ్రహ్మ ఎవరో కాదు అమెరికాకు చెందిన వివాదాస్పద శాస్ర్తవేత్త క్రెయిగ్ వెంటర్..
స్పాట్ (క్రెయిగ్ విజువల్స్)
బ్యాక్టీరియాలు ప్రకృతిలో అతి ప్రాథమిక కణాలు. ఒక రకంగా చెప్పాలంటే జీవం ఉద్భవించడంలో ఇదే తొలిదశ అని కూడా చెప్పొచ్చు. అంతే కాదు సృష్టిలో అనేక క్రియలను శాసించేవి కూడా ఇవే..ఒక్కోరకం బ్యాక్టీరియా అతి ఉష్ట గుండంలో కూడా జీవిస్తే.. మరికొన్ని బ్యాక్టీరియాలు మంచుగడ్డలమద్యకూడా జీవించగలవు. అయితే క్రెయింగ్ సృష్టించిన బ్యాక్టీరియా మాత్రం కేవలం లాబ్లో మాత్రమే జీవించగలదు.
స్పాట్..
ఇది క్రెయింగ్ వెంటర్ ఇనిస్టిట్యూట్…వరల్డ్ మోస్ట్ కాంట్రవర్సియల్ సైంటిస్ట్ క్రెయింట్ తన ఆలోచనలకు పదును పెట్టే ప్రయోగశాల ఇది.15 సంవత్సరాల అవిశ్రాత కృషికి నేడు సజీవ సాక్ష్యం దొరికింది. అకుంఠిత దీక్షతో జీవాన్ని సృష్టించిన క్రెయింగ్ ప్రయోగాల వెనుక ముగ్గురు భారతీయ శాస్ర్తవేత్తలు కూడా ఉన్నారు.
స్పాట్
క్రెయింగ్ ఈ బ్యాక్టీరియాను రూపొందించడానికి అత్యాధునిక సింథటిక్ బయాలజీ టెక్నాలజీని ఉపయోగించుకున్నరు. జీవసంశ్లేషణ అనేది బయోటెక్నాలజీలో ఓ అద్భుత ప్రక్రియ..ఈ టెక్నిక్తోనే జీవోద్భవం సాధ్యమయిందని క్రెయింగ్ వెంటర్ చెప్తున్నడు. బ్యాక్టీరియా సింథసిస్ ప్రక్రియ వేగవంతమైతే బయో కెమిస్ట్రీలో విప్లవాత్మక మార్పులు రానున్నయిని శాస్ర్తవేత్తలు అభిప్రాయపడుతున్నరు.
స్పాట్
జీవకణంలో ఉండే కేంద్రకంలో జతలకొద్దీ క్రోమోజోములుంటయి. ఈ క్రోమోజోముల్లో డి.యన్.ఎ కణాలుంటయి. ఈ డియన్ఎ కణాల్లోనే జన్యునిర్మాణం మొత్తం లిఖించబడి ఉంటది. డియన్ఎ రెండు పోగులతో మెలితిరిగిన నిచ్చెలా ఉంటది. నిచ్చెనలో మెట్లలా ఉండే ఈ తంతువులు నాలుగు రకాలు. అడినీన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్,లు. ఇవి డియన్ఎ పోగులపై జతలుజతలగా ఉంటయి. గ్వానిన్..సైటోసిన్తో, అడినీన్ ..సైటోసిన్తోనే జత కడుతది. ఈ తంతువులు కణద్రవ్యం నిండా ఉంటయి. వీటిని రైబోజోమ్లనే కణాంగాలు ఉత్పత్తి చేస్తయి. డియన్ఎ లో ఉన్న రెండు పోగులు న్యూక్లియోజ్ ఎంజైమ్ల సాయంతో రెండు పోగులుగా విభజింపబడతది. విడిపోయిన పోగుపై ఉన్న అడినీన్, థైమిన్లు మొత్తం జీవద్రవ్యంలో విడిగా ఉన్న పోగులతో జతకట్టి ఓ కొత్త డియన్ఎ పోగు తయారయితది. ఇలా ఒక కణంలో ఒకేసారి కొన్ని వేల పోగులు తయారవుతుంటయి. జీన్ పోగుల పైనే జీవచర్యలన్నీ నియంత్రించ బడి ఉంటయి. ఆ స్పెషల్ కోడ్ నే జీనోమ్ అని పిలుస్తరు. మనిషిలాంటి అభివృద్ది చెందిన జంతువులో కొన్ని లక్షల జీవక్రియలు ఉంటయి. కానీ బ్యాక్టీరియా లాంటి ప్రాథమిక జీవుల్లో తక్కువ జీవక్రియలే ఉంటయి. కాబట్టి చాలా సింపుల్ జీన్ కోడ్ ఉంటది. దీన్ని అధ్యయనం చేయడం చాలా తేలిక. క్రెయింగ్ వెంటర్ కూడా బ్యాక్టీరియాలో ఉన్న జీన్ కోడ్ ను కాపీ కొట్ఇ అచ్చం అటువంటి జీన్కోడ్తో ఉన్న డియన్ఎ ను తన లాబ్లో సృష్టించగలిగిండు. చరిత్రలో ఇదో గొప్ప ఆవిష్కరణ. కొన్న ప్రత్యేకపరిస్థితుల మద్య లాబ్లో కల్చర్ చేసిన బ్యాక్టీరియా కణంలో ఉన్న డియన్ఎ పోగులను తొలగించి..దాని స్థానంలో వెంటర్ తాను సృష్టించిన డియన్ఎ పోగును చొప్పించిండు. ఆశ్చర్యంగా ఆ బ్యాక్టీరియా వెంటర్ సృష్టించిన డియన్ఎ కోడ్ ప్రకారం ప్రవర్తించింది. కణ విభజన, శ్వాసక్రియ వంటి జీవక్రియలతో బాటు ప్రత్యుత్పత్తి వంటి క్రియలు కూడా విజయవంతం అయినయి. అంటే వాంచిత లక్షణాలున్న బ్యాక్టీరియాను సృష్టిచుకోవడం సాధ్యమేనని వెంటర్ రుజువుచేసిండు. సైన్స్ చరిత్రలో ఓ కొత్త జాతి బ్యాక్టీరియాను సృష్టిచిన ఘనత వెంటర్కు దక్కింది.
స్పాట్
ఇదే టెక్నాలజీని ఉపయోగించి భవిష్యత్తులో వాక్సిన్లను, కాలుష్య నివారణ బ్యాక్టీరియాను, ఎయిడ్స్ లాంటి మందులకు లొంగని వైరస్ ను తినే బ్యాక్టీరియాను కూడా సృష్టించి మానవ కళ్యాణానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడాలని ప్రపంచ శాస్ర్తవేత్తలు ఆశిస్తున్నరు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి