16, అక్టోబర్ 2010, శనివారం

ది సైన్సు ఎపిసోడే 7

ఎ.జనార్దన్
ఇంట్రో యాంకర్
ప్రకృతి ఒక విజ్ఞాన ఖని . ఈ గనిలో మనం ఇప్పటికీ చూడని మణులు ఎన్నో. శాస్ర్తవేత్తలు ఈ ప్రకృతి పొరల్లో దాగిన రహస్యాలను ఒక్కొక్కటే వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నరు. ఆ జ్ఞాన గుళికలను మీకందించే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం..
రిపీట్ యాంకర్
మన చుట్టూ, మనం గుర్తించని ఎన్నో విషయాల్లో సైన్స్ సీక్రెట్స్ దాగి ఉన్నయి. అందులో కొన్ని గతవారం తెలుసుకున్నం. నీటిలో దాగి ఉండే క్రాబ్ క్లోవ్లో అత్యధిక ఉష్టోగ్రత ఉష్ణోగ్రత, ప్రకృతిలో నిశ్శబ్దంగా జరిగే పనులు, ఫంగస్ లో దాగిన మిస్సైల్ సీక్రెట్, నీటిపురుగు కాళ్లో దాగిన స్కేటింగ్ సీక్రెట్..ఇవన్నీ మరొక్కసారి గుర్తుచేసుకుందాం..
యాంకర్ 1
ప్రాణమీద తీపిలేని వారెవరూ లేరు. కానీ సాహసం చేసేవారికి ప్రాణాలంటే గడ్డిపోచలతో సమానం. వాస్తవానికి వారు చేసే పనిలో అంత ప్రాణాంతక విషయాలు దాగిఉన్నయని భౌషా స్పీడ్ కెమేరాలతో గుర్తించే వరకు ఎవరికీ తెలీదు. ఒక వ్యక్తి విద్యత్ వలయంలో మృత్యుకోరల మధ్య ఎలా తన పని తాను చేసుకుపోతున్నాడో చూడండి.
వాయిస్
మానవ నేత్రం అత్యంత శక్తివంతమైనది.. మన శరీరంలో ఉన్న అద్భుత పరికరాల్లో నేత్రం ఒకటి.. మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో స్పష్టంగా తెలపగల శక్తి ఒక్క మానవ నేత్రానికే ఉంది. కానీ మన కన్ను కూడా గుర్తించలేని ఎన్నో అద్భుత ప్రక్రియలను పట్టి చూపించగల కెమెరాలను తయారు చేశారు సైంటిస్టులు. అవి ఎంత గొప్పవంటే మనల్ని ఆవరించి ఉన్న వాయుపొరల్లో ఏంజరుగుతుందో..మన శరీరంలో ప్రతి అణువు ఎలా పనిచేస్తుందో కూడా గుర్తించే స్థాయికి ఈ టెక్నాలజి డెవలప్ అయింది.
స్పాట్ (నడవడం..కాలి ముద్రలు..లేడీ చేతిలోంచి బుట్టపడిపోయిన వస్తువులు)
వాయిస్
మనం నిత్యం చాలా రకాల పనులు చేస్తుంటం..వాటిలో కొన్ని ప్రమాదకరమైనవైతే కొన్ని సునాయాసంగా చేసేవి..ఇదిగో ఇక్కడ ఇతనుకూడా చేతిలో కొన్ని పరికరాలు పట్టుకొని..ఒంటినిండా ఎలక్ట్రిక్ ప్రూఫ్ కోట్ వేసుకొని బయలుదేరాడు. నిజానికి ఇతను చేసే పని సామాన్యమైనది కాదు. ఇతను చేసే సాహసం మృత్యుకోరల మధ్య నాట్యమాడటమే...ఎంతో గుండెధైర్యం ఉన్న వాళ్లు తప్ప ఈ పని మరొకరు చేయలేదు. ఈ హెలికాప్టర్ ఫుట్ బోర్డుపై కూర్చొని
ఆకుపచ్చని అడవుల పై అంతెత్తు పై నుంచి అలవోకగా ప్రయాణిస్తన్న ఇతను ఓ హై పవర్ ఎలక్ర్టిక్ లైన్తో తలపడబోతుండు..
స్పాట్( హెలికాప్టర్ టాప్ టీన్లు..తీగల దగ్గరకు వచ్చే సీన్)
మనం మన ఇంట్లో చిన్న ఫ్యాన్ కు కరెంట్ కనెక్షన్ ఇవ్వాలంటేనే వంద రకాల జాగ్రత్తలు తీసుకున్నా కటింగ్ ప్లేయర్తో వైర్ను పట్టుకోవాలంటేనే హడలిపోతాం..పని పూర్తయ్యే దాకా చేతుల్లోకి వణుకు మనకు తెలియకుండానే వస్తది. పొరపాటున మన ఇళ్లో కరెంట్ షాక్ కొడితే కాస్త దూరాన పడతాం..లేదా గాయమవుతుంది. సకాలంలో స్పందిస్తే పెద్ద ప్రమాదం ఉండదు. కానీ ఇక్కడి హై పవర్ లైన్స్ అలా కాదు.. తేడా వస్తే ఒక్క సెకన్లో మాడి మసవ్వాల్సిందే..ఈ హైపవర్ లైన్లలో ఎంత శక్తి ఉందంటే ఈ లైన్ల చుట్టూ మన కంటికి కనిపించని విద్యుత్ క్షేత్రం చిక్కగా అలుముకొంది.
స్పాట్ ( హెలికాప్టర్ పవర్ టవర్ దూరంగా చేరుకొనే సీన్..)
ఇదిగో ఈ టవర్ ను మామూలు కంటితో చూస్తే ఇలా ఏ క్రియలూ, కదలికలూ లేకుండా ప్రశాంతంగా కనిపిస్తది. ( ఓన్లీ టవర్ చూపించాలి) కానీ హై పవర్ కెమేరాలతో షూట్ చేసి చూస్తే ఇదిగో ఇలా ప్రతి జంక్షన్ వద్దా ఇలా స్పార్క్స్ కనిపిస్తియి. ఈ స్పార్క్ ల చుట్టూ వేలాది విద్యత్ తరంగాలు అలుముకొని ఉన్నయి. ఈ స్పార్క్ ద్వారా మనకు తెలియకుండానే ఎంతో విద్యుత్ వృధాగా ఖర్చయిపోతుంది. ఈ దృగ్విషయాన్ని కొలోన్ అని పిలుస్తరు.
స్పాట్( టవర్..స్పార్క్స్..లాంగ్ అండ్ షార్ట్ షాట్లు)( చీకట్లో వైర్లు )
ఈ హై పవర్ లైన్లలో వందల, వేల వాట్ల కరెంట్ ప్రవహిస్తుంటది. ఒక నదిలో నీరు ఏవిధంగా ప్రవహిస్తుందో అలాగన్న మాట. పెద్దకాలువలో నీరు అక్కడక్కడా లీక్ అయి వృధాగా పోతున్నట్టే.. ఈ విద్యుత్ కూడా జంక్షన్ల వద్ద మనకు కనిపించకుండానే విద్యుత్ వృధాగా పోతుంది... బాహ్యవాతావరణంలోకి విడుదలయిన ఎలక్ట్రిక్ పవర్ ఏమవుతోంది..
స్పాట్
ఇదిగో ఇక్కడ ఒక సైంటిస్ట్ ఏంచేస్తున్నాడో చూడండి. హైపవర్ లైన్ల కింద ఒక ట్యూబ్ లైట్ను మట్టిలో పాతి పరిక్షిస్తున్నడు. యస్..ఈ ఎక్స్పరిమెంట్ సక్సెస్..ట్యూబ్ లైట్ వెలిగింది..అంటే ఈ హైవర్ లైన్ల కింద విద్యత్ క్షేత్రం ఆవరించి ఉందన్నమాట..మన కన్ను గుర్తించలేని విద్యత్ శక్తి ఈ పవర్ లైన్లకింద ఉంది. అందుకే ఎర్త కనెక్షన్ ఇవ్వగానే ఈ ట్యూబ్ లైట్లు వాతావరణంలో ఉన్న పవర్ తో మిణుకు మిణుకు మంటూ వెలుగుతున్నయి. దీనిని బట్టి హైపవర్ లైన్ల పొడుగునా ఎంతో కరెంట్ వృధా అవుతుందన్నమాట.
బ్రేక్ యాంకర్
మీరెప్పుడైనా కరెంట్ తీగలను పట్టుకొని చూశారా..కనీసం ప్రయత్నం చేశారా..ఆ ప్రయత్నం చేసి కూడా ఇంకా ఈ ఎపిసోడ్ చూస్తున్నారా… అయితే మీరు ఘటికులే..కానీ మీకంటే ఘటికులు చాలామందే ఉన్నరు. ఏకంగా హైపవర్ కరెంట్ పై ఉయ్యాలలూగడమెలాగో చిన్న బ్రేక్ తరువాత చూద్దాం..
యాంకర్ 2
వెల్ కం బ్యాక్ టు అల్టిమేట్ నాలెడ్జ్ ఎపిసోడ్...
బ్యాంగ్
మన ఇళ్లలో చిన్న బల్బు పెట్టాలంటే మందు ప్లగ్ తీసేస్తం.. అయినా భయం తగ్గక ఏకంగ మెయిన్ ఆఫ్ చేస్తం..50వాట్ల కరెంట్ కే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే వేలాది వాట్ల కరెంట్ వైర్లను కరెంట్ ఆఫ్ చేయకుండా వాటిపై కూర్చొని రిపేరింగ్ వర్క చేస్తరంటే మీరు నమ్మగలరా.
స్పాట్ ( ట్యూబ్ లైట్ ల స్పాట్)
ఈ ట్యూబ్ లైట్లు ఏ వైర్ కనెక్షన్ కనెక్షన్ లేకుండానే వెలగడమంటే విద్యుత్ లేకుండా వెలగడమని కాదు.వాతావరణంలో ఉన్నవిద్యత్ శక్తిని..కాంతి శక్తిగా మార్చగలుగు తున్నయన్న మాట..ఈ కొలోన్ ప్రక్రియ వల్ల వందల వాట్ల శక్తి వృధా అవుతుంది. ఈ లీక్ ప్రాసెస్ ఎక్కువయినపుడు పవర్ కట్..లోవోల్టేజి సమస్యలు ఎదురవుతయి. ఈ ఎలక్ట్రిక్ వైర్లను ఆవరించి వాతావరణంలోకి ఎలా విద్యత్ శక్తి విడుదతలవుతుందో హై స్పీడ్ కెమేరాలు పట్టి చూపించాయి.
స్పాట్ ( హెలికాప్టర్ వైర్ల దగ్గరకు కిందికి దిగుతుతన్న విజువల్స్)
ఇదిగో ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీర్ తన చేతులలో ఉన్న వైర్లను పవర్ లైన్ల వద్దకు తీసుకురాగానే.. వైర్ లకు లైన్లకు మద్య ఎలక్ట్రిక్ స్పార్క్లు ఎలా పాస్ అవుతున్నాయో..
స్పాట్ ( హెల్పర్ వైర్లను లైన్లకు ఆన్చడం..వాటి మధ్య స్పార్క్లు రావడం)
హెలికాప్టర్ కొన్ని సెకన్ల పాటు గాలిలో అలా నిలిచిపోతుంది. దాని పాత్ పై కూర్చున్న ఈ ఇంజనీర్ తన వద్దనున్న ఆపరెంట్స్ తో రిపేర్ వర్క్ మొదలు పెట్టగానే..అతని చుట్టూ, అతను కూర్చున్న హెలికాప్టర్ చూట్టూ ఈ కొలోన్ విద్యుత్ క్షేత్రం ఆవరించి ఉంటది. మామూలు నేత్రానికి ఇది కనిపించదు.
స్పాట్ ( స్పెషల్ కెమేరాలతో తీసిన షాట్లు, మామూలు షాట్లు చూపించాలి)
ఇలా హెలికాప్టర్ చుట్టూ, లైన్ మెన్ చుట్టూ విద్యుత్ క్షేత్రం ఆవరించి ఉన్నట్టు వారికి కూడా తెలీదు. లైన్ మెన్ ఇప్పుడు పూర్తిగా వైర్ ల పైనే కూర్చొని తన రిపేరింగ్ పని ప్రారంభిస్తున్నడు. అప్పడు హెలికాప్టర్తో ఉన్న లింక్ ను పూర్తిగా డిస్కనెక్టచేయగానే హెలికాప్టర్ చుట్టూ ఉన్న కొలోన్ ఫీల్డ్ మొత్తం మాయమైపోతుంది. ఆ కనెక్టెడ్ వైర్ కే అది పరిమితమవుతుంది.
స్పాట్
ఈ వైర్లు ఉన్నంత పొడవునా వాటికింద ఉన్న ఇళ్లలోనూ, పొలాల్లోనూ ఈ కొలోన్ విద్యత్ క్షేత్రాలు ఆవరించి ఉంటయి.
స్పాట్ ( వైర్ల కింద ఇళ్లు..)
యాంకర్ 3
ఇంద్రధనస్సును చూసి పులకించని వారెవరుంటరు చెప్పండి. కానీ ఈ ఇంద్రధనస్సు ఎలా ఎర్పడుతుందో చాలా మందికి తెలీదు. ఈ వానవిల్లు లో దాగిన రహస్యం ఏంటో ఓ లుక్కేద్దాం..
వాయిస్
ఇంద్రధనస్సులో ఉన్నసప్తవర్ణాలు కనువిందు చేసే ఓ అద్భుత దృశ్యం. మనం కేవలం ఒక స్పటికం ద్వారా చూస్తేనే ఈ ఇంద్రధనస్సు వర్ణాలను గమనించగలం. అప్పడప్పుడు నీటి తుంపరల మధ్య కనిపించే సప్తవర్ణాల ఇంద్రధనస్సు వెనక దాగిన సీక్రెట్ ను కనిపెట్టేశారు సైంటిస్టులు.
స్పాట్
ఈ విశ్వం మొత్తం ఒక లయ బద్దంగా నడుస్తోంది. ఆ లయలో హెచ్చు తగ్గులే మనకు వివిధ రకాల అద్భుతాలను సృష్టిస్తున్నయి. ఈ మనం ఎంతో ఇష్టపడేసంగీతంలో కూడా వినిపించే శబ్దం ఒకటే... అయినా వాటి ఫ్రీక్వెన్సీలో ఉన్న డిఫరెన్స్ వల్ల శబ్దంలో లయలు మారి అద్భుతమైన సంగీతం వినిపిస్తది. ఈ లయబద్దమైన ప్రక్రియ ఈ సృష్టి మొత్తం విస్తరిస్తది. మన చుట్టూ వాతావరణంలో పట్టణంలో..అంతెందుకు నింగీ, నేలా, ఆకాశం నిండా ఈ లయబద్దమైన ప్రక్రియ తోనే సమస్త సృష్టి గమనంలో ఉన్నది.
స్పాట్( కీ ప్యాడ్ విస్తరిచే సీన్లు)
ఈ ఇంద్రధనస్సులో కూడా అదే రిథమిక్ ఫార్ములాతో కాంతి విక్షేపణ అనే ప్రక్రియ జరుగుతుంది. ఈ కాంతి విక్షేపణ ప్రక్రియ ద్వారా ఒక్కో ఫ్రీక్వెన్సీ వద్ద ఒక్కో రంగు బహిర్గతమవుతుంది. సప్తవర్ణాలయినా, సప్తస్వరాలయినా వాటివాటి పౌనఃపుణ్యాన్ని బట్టే ఆధారపడి ఉంటయి.
స్పాట్
యాంకర్
మన నేత్రంతో చూడగలిగితే...కొన్ని మాత్రమే చూడగలం..కానీ ఇప్పడు సాధించిన అడ్వాన్స్ డ్ టెక్నాలజితో శరీర అంతరాంగాల్లో జరిగే వాటిని కూడా గుర్తించవచ్చు. ఈ టెక్నాలజి ఉపయోగించి... అంతెత్తు నుంచి దూకి కూడా చిన్నదెబ్బ తగలకుండా ఎలా తప్పిచ్చుకుంటుందో తెలుసుకున్నరు. ఆ సీక్రెట్ చిన్న బ్రేక్ తరువాత..
యాంకర్
ఒక వ్యక్తిని మనం చూసేటపుడు అతని హావభావాలు, అతను ధరించిన డ్రస్సులు మాత్రమే చూడగలం..కానీ శరీరంలోపలున్న ఎముకలను కూడా చూడటం సాద్యమేనా... ఇది ఖశ్చితంగా సాధ్యమేని రుజువు చేశారు శాస్త్రవేత్తలు.. ఆ టెక్నిక్ తోనే పిల్లి పాదాల్లో ఉన్న సూపర్ మాన్ సీక్రెట్ కనిపెట్టేశారు.
వాయిస్
కాంతికి అపారమైన శక్తి ఉంది. ఇది పారదర్శకమైన ప్రతి వస్తువులోంచి తేలికగా వెళ్లగలదు. ఈ కాంతిలో మామూలు కాంతితో బాటు అతినీలలోహిత కాంతి, పరారుణ కాంతి ఉంటుంది. ఈ అతినీలలోహిత కాంతికి ప్రతి ఆబ్జెక్ట్ నుంచి చొచ్చుకుపోగల సామర్ధ్యం ఉంది. ఈ కాంతిని ఉపయోగించుకొని జీవిలోని అంతరాంగాలను అధ్యయనం చేసిండ్రు.
స్పాట్
ఇదిగో...ఇది సూపర్ పవర్ ఎక్స్ రే మిషన్. ఇది మూవింగ్ ఆబ్జెక్ట్ లను కూడా అణువణువూ శల్యపరిక్ష చేయగలదు. ఈ ఎక్స్ రే టెక్నాలజి కెమేరా లెన్స్ కు జతచేసి హై స్పీడ్ అండ్ హైడెఫినిషన్ కెమేరాలతో రికార్డ్ చేస్తే జీవుల చలనంలో ఉన్న సీక్రెట్లు తెలిశాయి.
స్పాట్
మనిషి కొంత ఎత్తునుంచి దూకితే తన కాళ్లపై ఫోర్స్ పడి ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. దూకడంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న కానీ పిల్లి ఎంతో ఎత్తునుంచి దూకినప్పటికీ, ఏమరుపాటుగా దూకినప్పటికీ కాస్త కూడా దెబ్బతగలదు. అంతే కాకుండా పిల్లి కఠిన నేలపై దూకినా పరుపు పై దూకినంత తేలికగా క్షణాల్లో వెళ్లిపోతది.
స్పాట్
ఒక్కోజంతువుకు ఒక్కోరకమైన యంత్రాంగం ఉంటది.
స్పాట్
ఎలుక చిన్న గొలుసు పై కూడా బ్యాలన్స్ డ్ గా నడవడానికి గల కారణాన్ని అన్వేషించగా..ఎలుక అస్థుల నిర్మాణంలో, నడకలో ఒక గొంగళి పురుగుకు ఉన్న శారీరక లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ శరీరనిర్మాణం సన్నటి తీగలపై కూడా వేగంగా నడవడానికి ఉపయోగపడుతుంది.
స్పాట్
ఊసరవెల్లి నునుపుతలాలపై వేగంగా పాకడానికి కారణం కూడా ఇదే... కెమిలియాన్ తన కాళ్లను పూర్తిగా ఒకదానికొకటి తాకే విధంగా నడవగలదు. అంటే ముందు కాళ్లతో పాకి, ఆ తరువాత వెనుక కాళ్లు ముందు కాళ్ల వద్దకు తెచ్చి గట్టిగా పట్టుకొని ఆ తరువాత నెక్స్ట్ స్టెప్ తీసుకుంటది.
స్పాట్
కౌజు పిట్ట కాళ్లు చూస్తే పిట్ట వెనుక వైపు ఉన్నట్టు ఉంటాయి. కానీ ఇది చాలా బ్యాలన్స్ డ్ గా నడవగలుగుతుంది. ఎక్స్ రే కెమెరాలతో గమనించగా. ఈ పిట్ట వాతులాస్థులు దేహం వెనుక నుంచి ముందు వరకు సాగి బేలన్స్ డ్ గా అమర్చ బడి ఉంటయి. అందువలన ఇది సునాయాసంగా నడవగలదు.
స్పాట్
పిల్లి ఎంత ఎత్తు నుంచి దూకినా ముందు పిల్లి తన ముందు కాళ్లనే ముందు నేలకు ఆనిస్తది. ఆ తరువాత శరీరం మొత్తాన్ని స్ప్రింగ్ మాదిరిగా కుదుపు కుదిపిన తరువాత వెనక కాళ్లను నేలకు ఆనిస్తది. ముందు కాళ్లు నేలకు ఆనించగానే స్లోగా పాదాలను స్ప్రింగ్ మాదిరిగా వంచుతది. ఆ వంచడంలో సగం షాక్ నుంచి తేరుకుంటది. ఆ మిగతా షాక్ వెనక కాళ్లతో ఎదుర్కొంటది. అంతే కాదు ఈ షాక్ పూర్తిగా తన పై పడకుండా ఉండేందుకు కొన్ని క్షణాలు నేలపై పడుకుంటది. బాంబులు విసిరే సమయంలో యుద్దంలో సైనికులు కూడా బాంబ్ షాక్ ల నుంచి తప్పించుకునేందుకు నేలపై పడుకుంటరు. ఈ సిద్దాంతమేదీ పిల్లికి తెలియపోయినా, తన శరీరనిర్మాణంలో ఉన్న అమరికలను బట్టి ఇది తేలికగా ఎత్తులనుంచి దూకగలుగుతుంది.
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ సీక్రెట్లు…మరిన్ని అమేజింగ్..అల్టిమేట్ సైన్స్ సీక్రెట్ల తో మళ్లీ వచ్చేవారం ఇదే సమయానికి కలుసుకుందాం… అంటిల్ దెన్ బైబై

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి