ఎ.జనార్దన్ episode 6
ఇంట్రో యాంకర్
ప్రకృతి ఒక జ్ఞానగ్రంధం. ఈ గ్రంధంలో మనం తెరవని పేజీలు ఎన్నో. శాస్ర్తవేత్తలు ఈ ప్రకృతి పుటల్లో దాగిన మర్మాన్ని ఒక్కొక్కటే వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నరు. ఆ జ్ఞాన ఫలాలను మీకందించే ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం..
రిపీట్ యాంకర్
ఈ ప్రకృతిలో ప్రతి జీవి తన మనుగడ కోసం నిత్యం పోరాడుతూనే ఉంటది. ఆ పోరాటానికి కావలసిన రక్షణ కవచాలు. ఒక జాతి తన విస్తరణకు చేసే ప్రయత్నాలు. ఆర్ధోపొడా జీవులకు నీటిపై నడక నేర్పిన సూత్రాలు..ఇవన్నీ చూసే ముందు గతవారం చూసిన సైన్స్ చిత్రాలను ఒక్కసారి గుర్తుతెచ్చుకుందాం..
(రి కాప్)
యాంకర్ 1
ఒక జీవి తనలో ఉష్ణ కాసారాన్ని నింపుకుని జీవిస్తదంటే మీరు నమ్మగలరా..అవును ఒక జలచరం తన చేతుల్లో బడబాగ్ని దాచుకొంది.. దాన్ని రక్షణ కవచంలా ఉపయోగించుకొని తన ఆహారాన్ని సేకరించగలుగుతుంది. ఇంతకీ ఏంటా జీవి..ఏమిటా రహస్యం…
వాయిస్
ఈ సకల చరాచర సృష్టిలో ప్రతి జీవి తన మనుగడ కోసం నిత్యం పోరాడుతూనే ఉంటది. అన్నిటికంటే అద్భుతమైన విషయం ఒకటుంది. ఈ ప్రకృతి ప్రతి జీవికి ఏదో ఒక రకమైన రక్షణ యంత్రాంగాన్ని కల్పించింది. చిన్న అమీబా నుంచి పెద్దపెద్ద జీవుల వరకు ప్రకృతి ప్రసాదించిన రక్షణ కవచాలతోనే అవి తమను తాము కాపాడుకోగలుగుతున్నయి. ఒక్క మనిషి మాత్రమే తన తెలివి తేటలతో సొంతంగా రక్షణ తంత్రాలను ఉపయోగించగలుగుతున్నాడు.
స్పాట్
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పీతను చూడండి. ప్రవాళ బిత్తిక బొరియలో తలదాచుకుంది. ఆహారం వచ్చినపుడు మాటునే ఉండి చప్పున పట్టేయడానికి సిద్ధంగా ఉంది.తన దగ్గరకు వచ్చిన ఆహారపు జీవులను దీని క్లోవ్స్ తో మెరుపు వేగంతో పట్టేస్తది. అంతకు మించిన మరో అద్భుతం ఈ జీవిలో దాగి ఉంది.
స్పాట్
దీని క్లోవ్స్ అంచునుంచి వస్తున్న బుడగలను చూశారా.. వీటిని చూడటానికి ఎదో శ్వాస వాయువులా కనిపించినా వాస్తవానికి ఇది ఉఛ్వాస వాయువు కాదు. సాదారణంగా జీవుల ఉచ్వాస వాయువులు వేడిగా ఉంటాయి. కానీ ఈ జీవి విడుదల చేసే వాయువు తన దగ్గరకు చేరిన జీవిని మాడ్చేసే శక్తి కలది. అవును... ఈ బుడగల్లో అంత శక్తివంతమైన వేడి గాలులు ఉన్నయి. ఇంతకీ నీటిలో ఉన్న ఈ జీవికి వాయులు ఎక్కడివి. తనకు తాను వాయువును ప్రొడ్యూస్ చేయగలదా... ఈ వాయులకు ఇంత వేడి ఎక్కడిది..పరిశోధించారు శాస్త్రవేత్తలు.
స్పాట్
ఈ క్రాబ్ తన దగ్గరకు ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చినపుడు మొదట అది దాని క్లోవ్ తో దెబ్బకొడతది. నిజానికి అది దాని క్లోవ్ కాదు. అది ఒక ఆయుధం. కానీ అది ఎకరికీ తెలియని రహస్యం. ఆ క్లోవ్లో అంత పవరుందన్న రహస్యం చాలా మందికి తెలియదు.
స్పాట్
క్రాబ్ క్లోవ్ పనితీరు పరిశీలించేందుకు మొదట దాని క్లోవ్ దగ్గరకు బ్రష్‌ను తీసుకెళ్లారు. అప్పుడు క్రాబ్ తన క్లోవ్‌తో ఒక్క విసురు విసిరింది. ఈ ఒక్క విరుపులో కొన్ని వందల క్రియలు జరుగుతాయనేది మనమెవరమూ ఊహించని సైన్స్ సీక్రెట్..స్లోమోషన్లో చూస్తేగానీ అసలు సీక్రెట్ తెలియలేదు.
స్పాట్ ( క్రాబ్ టప్ మనే శబ్దం విజువల్)
ఇప్పుడు మనకు వినిపించిన శబ్దం క్లోవ్ నుంచి వచ్చింది కాదు..ఒక అదృశ్య శక్తి..పీతకు ఎక్కడిదీ హాట్ పవర్..
స్పాట్
మొదట క్రాబ్.. తన జీవక్రియలో వెలువడ్డ వేడితో నీటిని ఆవిరి రూపంలోకి మారుస్తది. ఈ ఆవిరి తన ఆవిరికోశంలో అట్టే పెట్టుకుంటది. తన దగ్గరకు ఏదైనా ఆహారం కానీ..శత్రువుగానీ వచ్చినపుడు సూపర్ స్పీడ్తో ఆ హీట్ వెపర్ ను విసురుతది..ఈ వేడి ఆవిరులు అత్యంత ప్రమాదకరమైనవి. ఈ బుడగల్లో వేడి నమ్మశక్యం కానిది..ఈ బబుల్ లో ఉన్న టెంపరేచర్ అక్షరాలా 4000డిగ్రీ సెంటిగ్రేట్ అని శాస్ర్తవేత్తలు నిర్దారించిండ్రు. ఈ ఉష్ణోగ్రత శాస్ర్తవేత్తలనే అబ్బురపరచింది. ఈ అద్భుత శక్తి శత్రుజీవిని ఎదుర్కోవడమే కాదు. దొరికిన జంతువును అప్పటికప్పుడు ఫ్రై చేసేందుకు కూడా ఉపయోగా పడుతది. అయితే ఇది అన్ని వేళలా తన పూర్తి శక్తిని వినియోగించదు. సమయాన్ని.. అవసరాన్నిబట్టి ఈ క్రాబ్ తన పవర్ని వాడుకుంటది.. నమ్మశక్యంగాని ఈ వేడి ఒక్కోసారి నీటిని ఉష్ణకాసారంగా ఉడికిస్తది కూడా..
స్పాట్
బ్రేక్ యాంకర్
నీటి లోతుల్లో ఉన్న ఈ క్రాబ్ కు అంతటి శక్తి ఎక్కడిది..ఈ ఉష్ణశక్తి ఆ జంతువుని ఏమీ చేయదా..అసలు ఈ జలచరంలో ఈ శక్తి ఎలా ఉద్భవిస్తది...తెలుసుకునేందుకు పరికరాలు సిద్ధం చేశారు సైంటిస్టులు..ఈ హీట్ సీక్రెట్ చిన్న బ్రేక్ తరువాత...
వెల్కం యాంకర్
ఎంతో ఎక్సైట్ మెట్ తో ఎదురు చూసే సైన్స్ ఎపిసోడ్ కు తిరిగి స్వాగతం.
యాంకర్
ఒక జీవి నుంచి మరో జీవిని మాడ్చివేయగల ఉష్ణోగ్రత వెలువడటం ఎలా సాధ్యం.ఈ క్రాబ్లో ఉన్న యంత్రాంగం ఏంటి..ఇది ఒక్క బయోమిస్టరీయేనా నిజంగా సాధ్యమయ్యే పనేనా..అనుమానం వచ్చింది పరిశోధకులకు..ఈ విషయం తేల్చేందుకు ఓ చిన్నప్రయోగం చేశారు. ప్రయోగం చిన్నదే కానీ ఫలితాలు మాత్రం చాలా గొప్పవి.
స్పాట్(స్మాల్)
అచ్చు..క్రాబ్లో ఉన్నయంత్రాంగం మాదిరి బ్లేడ్ వీల్ ను తయారు చేశారు. ఈ వీల్ ను క్లాక్ వైజ్ డైమెన్షన్లో స్పీడ్ గా రొటేట్ చేశారు.వీల్ మధ్యలో కాస్త గాప్ వదిలారు. స్పీడ్ పెరిగే కొద్దీ బ్లేడ్ల్ ల వెంబడి సన్నని వాటర్ కావిటీస్ ఏర్పడటం కనిపించింది. ఈ వీల్ ముందుకు కదులుతుంటే బ్లేడ్ ల వెంబడి కావిటేషన్ రూట్స్ సన్నగా ఫాలో కావడాన్ని శాస్ర్తవేత్తలు గుర్తించారు. అంతే కాకుండా వీల్ మధ్యలో నుంచి కూడా అపసవ్య దిశలో వాటర్ కావిటీ ఫోర్స్ బుల్ గా రావడం కనిపించింది. ఈ వీల్ బ్లేడ్ మొనలకు గరుకు తలాన్ని ఏర్పరచడం వల్ల.. ఈ గరుకు తలం నీటితో వేగంగా జరిపిన ఘర్షణలో ఉష్ణశక్తి విడుదలవుతది. అంతే కాకుండా వాటర్ వెపర్గా మాడిఫై అవడానికి కావల్సిన నిర్మాణం బ్లేడ్ కావిటీస్ లో ఉంటది.
స్పాట్
శాస్ర్తవేత్తలు ఎంతో శ్రమకోర్చి తయారు చేసిన ఈ యంత్రం క్రాబ్ కు ప్రకృతి ప్రసాదించిన రక్షణ కవచం. నిజంగా ఒక జలచరంలో ఇటువంటి నిర్మాణ ఏర్పడుతుందని కలలో కూడా ఊహించని సూక్ష్మ రహస్యం శాస్ర్తవేత్తల పరిశీలనలో వెల్లడయింది.
వాయిస్
మనం ఒక పూదోటలో కాసేపు కూర్చుంటే..అక్కడ మన చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా..నిశ్శబ్దంగా ఉన్నదని అనుకుంటం. నిజంగా అలాగే ఉన్నదనే అనిపిస్తది. కానీ అదే మైక్రోసెకన్ లో మన చుట్టూ వేల క్రియలు జరిగిపోతుంటయి. నిశ్శబ్దంగా...అద్భుతంగా తన పని తాము చేసుకుపోతుంటయి. వాటిలో చిగుళ్లు మారాకు వేయడం..పూలు వికసించడం...పరాగరేణువులు సంపర్కం చెందడం..ఒక్కటేమిటి మన కన్నుగప్పి ఎన్ని వేల పనులు జరిగిపోతాయో..ఇవన్నీ మనం గుర్తించలేనంత నెమ్మదిగా జరిగే అందమైన చర్యలు..
స్పాట్ (పూలు వికసించే స్లోమోషన్ విజువల్స్)
వాయిస్
ఇప్పడు మీరు ప్రకృతిలో చాలా నెమ్మదిగా జరిగే చర్యలను చూశారు. నిజానికి ఇవి ఇంత నెమ్మదిగా జరిగితేనే అవి అంత పొందికగా తయారవుతయి. కానీ కొన్ని పనులు రెప్పపాటులో పూర్తయిపోతయి. కనీసం అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అలా జరిగనిది కొన్ని పనులు అసంపూర్తిగా నిలిచిపోతయి...
వాయిస్
మొక్క ఎదుగుదల..పూవు వికసించడం..పరాగరేణువులు సంపర్కం చెందడం ఇవన్నీచాలా నెమ్మదిగా జరిగే చర్యలు ఇవి జరుగుతున్నవా లేదా అన్నంత నెమ్మదిగా జరుగుతయి.కానీ కొన్ని పనులు రెప్పపాటులో జరుగుతుంటయి. ఇక్కడ చూడండి ఈ మొక్క విత్తనాలను ఎంత వేగంగా విసురుతుందో..అటువంటి యంత్రాంగం ఈ జాతి విస్తరణకు ప్రకృతి ప్రసాదించిన వరం.ఈ కాయ పక్వానికి వచ్చినపుడు ఒక చిన్నపాటి బాంబ్ లా పేలుతది. అలా విసరబడిని విత్తనం 6 మీటర్ల దూరం విసరబడుతది. అలా విసరబడిన విత్తనాలు మరో చోట తమ జాతిని వృద్ది చేసుకుంటయి. అలా అలా తమ జాతిని భూమి పై విస్తరిస్తయి.
స్పాట్
ఈ ప్లానెట్ పై కొన్ని పనులకు స్పీడ్ తప్పనిసరి. జెట్ విమానాలు, రాకెట్లు, మిసైల్స్, రెప్పపాటు వేగంతో తమ లక్ష్యాలను చేరుకుంటయి.
స్పాట్
యాంకర్
ఈ స్పీడ్ మనకు, జంతువులకు, మొక్కలకు మాత్రమే తెలుసనుకుంటే పొరపాటే.. ఈ స్పీడ్ సీక్రెట్ను ఫంగస్ కూడా వంటబట్టిచ్చుకుంది. స్పీడంటే అట్లాంటి ఇట్లాంటి స్పీడ్ కాదు. కంటిలో నలుసంత ఉండే ఫంగస్ స్ర్టిప్ రెండు మీటర్ల దూరం స్పోర్స్ ని విసరగలుగుతుందంటే నమ్మగలరా..ఇది నిజంగా నిజం...
వాయిస్
ఇక్కడ కనిపిస్తున్నది గుర్రపు పేడ. ఈ పేడ పై రైజోఫస్ జాతికి చెందిన శిలీంద్రం నివాసం ఉంటది. ఇది కేవలం ఎరువుల పై మాత్రమే నివసిస్తది. ( పేడ విజువల్స్, పేడ పై స్లోమోషన్లో పెరిగే ఫంగస్ విజువల్స్ చూపించాలి.)
వాయిస్
ఇక్కడ తోకకప్పల్లా కనిపించే ఈ పారదర్శక బుడగలు రైజోఫస్ జాతికి చెందిన శిలీంద్రాలు. ఇవి తమ గుళికల్లో జీవద్రవ్యంతో నిండిన స్పోర్స్ కలిగి ఉంటయి. ఈ క్యాప్సూల్ పైన నల్లని క్యాప్ ఉంటది. ఈ సిస్ట్ బ్లాస్ల్ కాగానే ఈ బయోప్లాసంతో బాటు స్పోర్స్ కూడా రిలీజ్ అవుతయి.
స్పాట్
ఇక్కడ ఉన్న ఏదో జరుగుతున్నట్టు కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది కానీ ఏం జరుగుతుందో తెలుసుకోవడం మానవనేత్రానికి సాధ్యం కాదు.
స్పాట్
ఈ మొత్తం దృశ్యాన్ని హైస్పీడ్ కెమెరాలో బంధించి దాన్ని పదివేల రెట్లు స్లోమోషన్లో స్టడీ చేస్తే గానీ అసలు సీక్రెట్ అంతుచిక్కలేదు.. ..
ఇదిగో ఇది స్పోర్స్ రాపిడ్ గా పేలిపోయే దృశ్యం..
ఇది స్లోమోషన్లో స్పోర్స్ రిలీజ్ అయ్యే విజువల్స్..
ఈ స్పోర్స్ ఒక్కసారి బలంగా విసిరిన సీడ్ ప్లాజం స్పోర్స్ రెండుమీటర్ల వరకు విస్తరిస్తది..దీని ఫోర్స్ తో బాటు గాలివాటం కూడా తోడైతే ఈ ఫంగస్ స్పోర్స్ దూరతీరాలకు వ్యాపిస్తయి.
స్పాట్
యాంకర్
మీకెప్పుడైనా నీటిపై నడవాలనే కోరిక కలిగిందా..కనీసం ప్రయత్నం చేశారా...నిజంగా నేలపై నడిచినట్టు నీటిపై కూడా నడవగలిగితే బ్రిడ్జిలతో పనే ఉండదు... కానీ జలచరం కాని ఒక ఆర్ధోపొడా జీవి నీటిపై యధేచ్ఛగా స్కేటింగ్ చేస్తుంది.. ఇంతకీ దీని కాళ్లలో ఉన్న సీక్రెట్ ఏంటో బ్రేక్ తరువాత చూద్దాం..
యాంకర్
నీటిలో జీవించాలంటే అవి జలచరాలైనా ఉండాలి..లేదా ఉభయచరాలైనా అయి ఉండాలి. ఈ రెంటికీ నీటిలో జీవించడానికి అనుకూల మైన యంత్రాంగం ఉంది. కానీ ఇవేవీ లేని ఆర్ధోపొడా జీవి నీటిపై స్కేటింగ్ చేయగలుగుతుందంటే… దాని కాళ్లలో ఉన్న మంత్ర దండం ఏంటి..
వాయిస్
ఇక్కడ కనిపిస్తున్న ఈ నీటి పురుగు ప్రతి సెకన్ కు రెండు మీటర్ల దూరం ఈదగలదు. (స్మాల్ స్పాట్) ఇది నీటి పైనే తన పనులన్నీ పూర్తి చేసుకుంటవి. నీటిపై స్కేటింగ్ చేసినంత సులువుగా ఇది వేగంగా తిరగగలదు.
స్పాట్
(పాలు నీళ్లలో పడే విజువల్స్)
ఇక్కడ చూస్తే నీటిలో పడ్డ పాలచుక్క చలనం ఎలా ఉన్నదో..పాల చుక్క నీటిలో పడగానే నీటి ఉపరితలం పై తిరిగి అంతే వేగంగా కేవలం పాలబాగం మాత్రమే ఒక బిందువులా మారి గాలిలోకి ఎగిసి తిరిగి నీటిలో కలిసిపోతది.
స్పాట్
వాయిస్
నీటిలో వేలు ముంచి తీస్తే మన వేలికి కొంత అంటుకోగా వేలితో బాటే కొంత సాగుతూ పైకి వస్తది.అంటే నీటికి మనం గుర్తించలేనంత తక్కువ మోతాదులో ఎలాస్టిక్ నేచర్ ఉందన్నమాట.నీటికున్న ఈ సాగే గుణాన్ని ఉపయోగించుకొని నీటిపురుగులు కొలనులో ఆవాసం ఉండగలుగుతున్నయి.
స్పాట్
ఈ పురుగులు రంగునీళ్లో పరిగెత్తితే ఇది ఎలా తన పాదాలను కదిలిస్తుందో తేలికగా గుర్తించ వచ్చు. అంటే నీటికి ఉన్న సాగే గుణం వల్ల పురుగు నీటి పై నడవగలుగుతుంది.
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం సైన్స్ సీక్రెట్స్. మరిన్ని విశేషాలతో మళ్లీ వచ్చేవారం కలుసుకుందాం..అంటిల్ దెన్ బై..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి