16, అక్టోబర్ 2010, శనివారం

ది సైన్సు ఎపిసోడే ౧౫

ఎ. జనార్ధన్
ఇంట్రో యాంకర్
ఈ సృష్టిలో మానవ జాతి ఆవిర్భావం ఓ చిక్కు ప్రశ్న. ఎప్పటికీ ఛేదించలేని ఫజిల్. కానీ మానవ జాతి ఈ భూమి పైకి ఎలా వచ్చిందనే విషయాన్ని తెలుసుకునేందుకు గ్రీకుల కాలం నుంచి నేటి వరకు ప్రయత్నిస్తూనే ఉన్నరు. ఇప్పుడిప్పుడే మానవ జాతి మూలాలు బయటపడుతున్నయి.
బ్యాంగ్
యాంకర్ 1
ఈ మనవ జాతిని దేవుడు సృష్టించిండా..లేదా పరిణామ సిద్దాంతం ప్రకారం జంతువుల నుంచి అభివృద్ది చెందిండా..ఇంత సైన్స్ అభివృద్ది చెందినా ఖచ్ఛితంగా మానవ జాతి పుట్టుకకు ఇదీ కారణం అని చెప్పే ఆనవాలు ఏదీ లేదు. ఇంతకీ ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పటి నుంచి వెదకడం మొదలు పెట్టారో తెలసుకుంటే ఎంత ప్రగతి సాధించామో అర్ధమవుతది.
స్పాట్
ఈ ప్రకృతిలో మనిషి పాత్ర ఎంత...అసలు ఈ భూమి పైకి మానవుడు ఎలా వచ్చిండు. కొందరు తత్వవేత్తలు చెబుతున్నట్టు మనిషిని ఒక శక్తి సృష్టించిందా...లేక శాస్ర్తవేత్తలు చెబుతున్నట్టు పరిణామ క్రమంలో మానవుడు ఈ రూపాన్ని సంతరించుకున్నడా అన్నది ఇప్పటికీ తెగని చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇది అత్యంత వివాదాస్పదమైన అంశం ఎందుకంటే ఇప్పటికీ శాస్ర్తవేత్తల్లో మానవ పరిణామం పై ఒక ఉమ్మడి అభిప్రాయం లేదు. శాస్ర్తం అభివృద్ది చెందుతున్న కొద్దీ గతంలో చేసిన పరిశోధనలు, ఊహాగానాలు అంతా ఒట్టి ఊహేనా అన్న డౌట్ కూడా వస్తుంది. జెనెటిక్ ఇంజనీరింగ్ డెవలప్ అయి మానవ జీన్ కోడ్ మాప్ సిద్దం చేస్తున్న ఈ తరుణంలో మానవ పరిణామంలో ఉన్న చిక్కుముడులు ఒక్కొక్కటే వీడుతున్నయి.
స్పాట్
జీవం పుట్టుకకు ఆధారం నీరేనని...నీటిలోంచే జీవం ఉద్భవించిందనేది శాస్ర్తవేత్తలు వాదన. ఇప్పటి వరకు ఎందరో శాస్ర్తవేత్తలు నమ్మే సిద్దాంతం కూడా ఇదే...అయితే బాగా అభివృద్ది చెందిన దేశాలలో జీవి పుట్టుకకు ఆధారమైన జీవజాతులు చాలా కనుమరుగయినవి. వీటి మూలాలు జన సంచారం తక్కువగా ఉన్న అడవుల్లో ఉన్నప్పటికీ వాటిని గుర్తించి వెలికితీయడం చాలా ప్రయాసతో కూడుకున్న పని. ఒక జంతువు ఎన్నోరకాల జాతులుగా అభివృద్ది చెందడం వెనక మర్మం ఏంటనే సందేహం వచ్చింది పరిశోధకులకు... ఈ సందేహం నివృత్తి చేసుకునేందుకు కొన్ని వేల ప్రయోగాలు నిర్వహించిండ్రు. వీటి ఆనవాలు ఖండాంతరాలలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తిచిండ్రు. ముఖ్యంగా జమైకా దీవిలో ఉన్న వేలాది రకాల మొక్కలు, జంతు జాతులు ప్రస్తుత జీవజాతులు పూర్వికులగా గుర్తించిండ్రు. ఒక్కసారి మనం కూడా జమైకా దీవుల్లో విహరించి వద్దాం పదండి...
స్పాట్
ఇక్కడ కనిపించే పూల మొక్కలు ప్రకృతి నిండా అందాలను అద్దుతుంటయి. ఎంత సేపు చూపినా తనివి తీరని అందం వీటిది..ఒకటి కాదు రెండు కాదు వేలరకాల వృక్షజాతులు ఈ ప్రకృతి నిండా పచ్చగా పరచుకొని ఉన్నయి. ఈ సృష్టిలో ఉన్న వైవిధ్య భరిత జీవజాతులు నిజంగా మనిషికి పెద్ద ఫజిల్ గానే మిగిలినయి. ఎప్పటికి ఛేదించలేని ఈ చిక్కుముడిని ..తన ఊహా శక్తితో విప్పేందుకు అనాది నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నడు మానవుడు. అయినా ఆ ప్రకృతిని అర్ధం చేసుకోడానికి ఒక జీవిత కాలం సరిపోదు. అన్ని వేల రకాల జీవజాలం ప్రకృతినిండా పరచుకొని ఉంది. ఒకే రకమైన ఆకృతి కలిగిన జీవులు కొన్ని చిన్నగా ఉంటే మరికొన్ని మరింత పెద్దగా కనిపిస్తయి. కారణం తెలియదు గానీ ఒకే జాతికి చెందిన జీవులు కొన్ని కౄరమృగాలుగా మారితే మరికొన్ని సాధుజంతువులుగా మారినయి. ఈ ప్రకృతి వింతల్లో అర్థం కాని కొన్ని లక్షలనిగూఢ రహస్యాలను అర్ధం చేసుకునే పనిలో పడ్డరు జంతు, వృక్ష శాస్ర్తవేత్తలు.
స్పాట్
ఇదిగో ఇక్కడ ఒక జమైకన్ వృక్షశాస్ర్తవేత్త వివిధ రకాల బల్లులను అధ్యయనం చేసేందుకు చేసే ప్రయత్నం చూడండి.. ముందుగా వివిధ రకాల బల్లి జాతులను సేకరించి వాటి గురించి పూర్తిగా అధ్యయనం చేస్తరు. ఒక్కముక్కలో చెప్పాలంటే మొత్తం జాతుల మూలాలను అధ్యయనం చేస్తే మానవ పరిణామ క్రమం తెలుసుకోవడం తేలికని వీరి అభిప్రాయం. ఎందుకంటే ఒకవేళ పరిణామ సిద్దాంతమే నిజమైతే... ఒక జీవి నుంచి మరో జీవి ఎలా పరిణామం చెందిందో అధ్యయనం చేయడానికి ఈ జాతుల సేకరణ మరింత ఉపకరిస్తది.
స్పాట్
ఇదిగో ఇక్కడ లైబ్రరీలో వేలాది స్పెసిమెన్స్ ను భద్రపరిచిండ్రు. ఎందుకంటే ప్రకృతిని అధ్యయనం చేసే యువశాస్త్రవేత్తలు తొలుత తరగతి గదిలో వీటిని అధ్యయనం చేశాక నిజమైన ప్రకృతిలోకి తొంగిచూస్తరు. ఇటువంటి లక్షలాది నమూనాలు మ్యూజియంలలో భద్రపరచబడి ఉన్నయి.
స్పాట్
బ్రేక్ యాంకర్
ప్రకృతిలో ఉన్న వివిధ జాతులను సేకరించి ఏం చేస్తారు. ఈ స్పేసిమెన్స్ వల్ల పొందే లాభం ఏంటి..నిజాని మనం భద్రపరచిని శిలాజాల కన్నా ప్రకృతి కూడా తన లైబ్రరీలో స్పెసిమెన్స్ను భద్రపరిచింది. ఇంతకీ ఏంటా నేచురల్ స్పెసిమెన్స్ తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం..
యాంకర్ 2
ఒక వ్యవస్థ గురించి అధ్యయనం చేయాలంటే ముందు... ఆ వ్యవస్థలో చిన్న బాగాన్ని అద్యయనం చేస్తే దాని మొత్తం కధంతా తెలిసిపోతది. అందుకే శాస్ర్తవేత్తలు ఎన్నో నమూనాలు సేకరించి దాచుకుంటరు. కానీ ప్రకృతి తనపై తిరుగాడిన ఎన్నో జాతుల ఆనవాళ్లను దాచుకొంది.
స్పాట్
ఇదిగో ఇది బ్రిటీష్ మ్యూజియం. ఇక్కడ వేలాది మంది ప్రజలు భద్రపరచబడిన నమూనాలను తిలకించేందకు కొందరు, కొత్తగా సేకరించిన నమూనాలను నమోదు చేసేందుకు కొందరు ఇక్కడకు వస్తరు. మ్యూజియంలో ఒక్కోక్క్ జాతికి సంబందించి వేలాది రకాలను సేకరించి పెడతరు.. ఇవి చెడిపోకుండా కెమికల్స్ అద్ది ప్లాస్టిక్ కవర్లలో, కంటైనర్లలో, పేపర్ బౌండ్ లలో దాచిపెడతరు. వాటి పార్శిల్ పై ఆ స్పెసిమెన్ పేరు, జాతి, తరగతులు మొత్తం క్షుణ్ణంగా రాస్తరు. ప్రకృతిలో జాతులన్నీ ఒక్క భవనంలో ఒదిగిపోతయి.
స్పాట్
మానవ పరిణామం గురించి అధ్యయనం చేయాలన్న తపన మొదటి నుంచి ఉన్నదే అయినప్పటికి దానిని శాస్ర్తీయంగా అధ్యయనం మొదలుపెట్టింది మాత్రం 17వ శతాబ్దంలోనే... హెన్స్ స్లోయెన్ మొదటి సారి జీవ వైవిధ్యం గురించి మొట్టమొదటి డాక్యుమెంటరీ తయారు చేసిండు.
పారిస్లో ఫ్రెంచి విప్లవం తరువాత శాస్ర్తసాంకేతిక రంగాలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నయి. ఈ ప్రకృతి, సృష్టి భగవంతుని నిర్మితమని చాలా మంది భావించేవారు. దీనిని మార్చడానికి వీలులేదని గట్టిగా నమ్మేవారు.
స్పాట్
పారిస్ నగరం అభివృద్ది చెందిన తరువాత ఎన్నో విలాసవంతమైన భవనాలకు పునాదులు పడ్డయి. ఈ భవనాలు పూర్తిగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కట్టబడినయి. అయితే ఈ భవనాలన్నీ లైమ్ స్టోన్ తో కట్టిండ్రు. ఈ లైమ్ స్టోన్ కోసం వందలాది క్వారీలను ఏర్పాటు చేసి, ఆ క్వారీలలో సున్నాన్ని తవ్వి బయటకు తరలించేవారు. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న చీకటి గుహలన్నీ సున్నం వెలికి తీయగా మిగిలినవే. ఈ సున్నపు బొరియలు తవ్వుతున్న క్రమంలో అక్కడి వారు ఒక వింతను గమనించిండ్రు. గతంలో వారు ఇంత వరకు చూడని అనేక జంతువుల అస్తి పంజరాలు బయట పడటం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. వాటన్నిటినీ ఒక్కచోటకు చేర్చింన్రు. ప్రజలెవరూ చూడని పెద్దపెద్ద అస్థిపంజరాల నిర్మాణం ఏర్పడింది. దాంతో ఈ భూమి పై ఒకప్పుడు పెద్దపెద్ద జంతువులు జీవించేవన్న విషయం అర్ధమయింది.
స్పాట్
ఇదిగో ఇక్కడ ఉన్న వందలాది శిలాజాలన్నీ వివిధ రకాల విలుప్త జీవులవే. అలా దొరికిన శిలాజాలతో ఏకంగా ఒక మ్యూజియమే వెలిసింది. అటువంటి కోవలోకే రాకాసి బల్లులను చేర్చింన్రు. రాకాసి బల్లుల్లో కూడా శాఖాహారులు మాంసాహారులు ఉన్నాయన్న విషయం వాటి శిలాజాల నిర్మాణాన్ని బట్టి తెలిసింది. వాటి దంతవిన్యాసాన్ని బట్టి అవి శాఖాహారులా లేక మాంసాహారులా అన్న విషయాన్ని నిర్ధారించుకునే వారు శాస్త్రవేత్తలు.
స్పాట్
ఎండ్ యాంకర్
ఇవీ ఈ వారం విశేషాలు మరిన్ని అప్ డేట్స్ మళ్ళీ కలుద్దాం..అంటిల్ దెన్న బైబై..
వెల్ కం బ్యాక్ టు ది సైన్స్ అల్టిమేట్ నాలెడ్జ్..

1 కామెంట్‌:

  1. జీవాన్ని గూర్చి నా అన్వేషణ . దయచేసి సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని తెలియజేయ గలరు.

    రిప్లయితొలగించండి