ఎ.జనార్దన్
మన నేత్రం అత్యంత శక్తివంతమైనది. ఈ సకల చరాచరా జగత్తులో రంగులను గుర్తించగల శక్తి ఒక్క మానవనేత్రానికే ఉంది. అటువంటి మానవనేత్రం నుంచి కూడా తప్పించుకునే ప్రకృతి చిత్రాలున్నయంటే మీరు నమ్మగలరా..మన కంటికి కనిపించని అటువంటి సూక్ష్మప్రపంచాన్ని పరిచయం చేస్తొంది రాజ్‌న్యూస్..
బ్యాంగ్
రహస్యం...ఈ ప్రకృతి ఇప్పటికీ ఎవరూ ఛేదించలేని ఒక రహస్యం...దీని పాస్‌వర్డ్ ఎవరి దగ్గర ఉందో కానీ...దిస్ నేచర్ ఈజ్ వండర్ ఫుల్ క్రియేషన్. ఈ క్రియేషన్‌లో ఉన్న క్రిటికల్ థింగ్స్‌ని కూడా ఛేదించే ప్రయత్నం చేస్తున్నడు మానవుడు. అందుకే కొన్ని కోట్ల మైళ్ల దూరాన ఉన్న గ్రహాలను కనిపెట్టడమే కాదు...మన చుట్టూ, మనలోనా దాగి ఉండి మనకు తెలియని అత్యంత సూక్షజీవులను కనిపెట్టి వాటినుంచి పాఠాలు నేర్చుకుంటున్నడు మనిషి.
వాయిస్
నేచర్.. ది వండర్... కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మానవుడు ఎంతో పురోగతి సాధించానని విర్రవీగుతున్నా...అందంతా కేవలం భ్రమ..ఈ టెక్నాలజీ టెక్నిక్‌లన్నీ ప్రకృతిని చూసి కాపీ కొట్టినవే.. అవును.. నిజం. ఇది మేము చెప్పేది కాదు గ్లొబల్ సైంటిస్ట్‌లంతా ముక్త కంఠంతో వినిపించే సజీవ సత్యం. పిట్టను చూసి గూడు కట్టుకోవడం నేర్చుకున్న మానవుడు..చీమను చూసి పొదుపు చేయడం నేర్చుకున్నడు. ఇవే కాదు వందల కొద్ది ఉపాయాలను మనం చుట్టూఉన్న జంతువులను, పక్షులను , క్రిమి కీటకాదులను చూసి నేర్చుకున్నం. మన ప్రపంచ శాస్త్రవేత్తలు మానవ నేత్రం చూడలేని ఎన్నో వందల రెట్ల సూక్ష్మక్రిములను అధ్యయనం చేయడమే కాదు ... వాటి నుంచి కొత్త పాఠాలు నేర్చుకునే పనిలో పడ్డరు. కొన్ని సూక్ష్మక్రిములు అసలు ఆహారమే తీసుకోకుండా జీవిస్తున్నయంటే వాటి రహస్యం ఏంటో ఇప్పటికీ అంతుచిక్కలేదు. మరి కొన్ని జీవులు కంటికి కనిపింనంత చిన్నవైనా ఈ ప్రకృతినే శాసించగలగడం నిజంగా మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ రహస్య ప్రపంచపు ద్వారాలు తెరిచేపనిలో పడ్డరు మన శాస్ర్తవేత్తలు.
స్పాట్
యాంకర్ 2
మనం చాలా నిశ్శబ్దంగా ఉన్నామని అనుకుంటాం...కానీ ఆ నిశ్శబ్దంలోనే మన చుట్టూ కొన్ని వందల పనులు జరిగిపోతుంటయి. ఈ జగత్తులో ఒక్క సెకనులో కొన్ని లక్షల క్రియలు జరిగిపోతుంటయి. ప్రతి చలనం...ప్రతి కదలిక...ఈ ప్రకృతిలో బాగమే...ఒక చిన్న ముద్దు పెట్టుకున్న సెకన్ల కాలంలో ఏం జరుతోందో చూడండి….
స్పాట్( ముద్దు సీన్లో బ్యాక్టీరియా ట్రాన్స్ఫర్ అయ్యే సీన్)
వాయిస్
యాంకర్ 3
ఈ సూదిని చూశారా... దీని రంద్రంలోకి దారం ఎక్కించాలంటేనే ఎంతో కష్ట పడాలి...ఎందుకంటే ఇంత చిన్న రంద్రాన్ని చూడాలంటే ఎంత కష్టపడాలి...కానీ ఈ సూది మొనకంటే ఎన్నో వేల రెట్ల చిన్నగా ఉండే సూక్ష్మ ప్రపంచం ఉంది...
వాయిస్
ఈ సకల చరాచర జగత్తులో ఎంతో సూక్ష్మమైన జీవులున్నయి. చాలా వాటి ఉనికి నేటి వరకు తెలియదు. ఇప్పటికే కొన్ని కోట్ల బ్యాక్టీరియా, వైరస్, సూక్ష్మ క్రిముల పనితీరును అధ్యయనం చేసిండ్రు మన శాస్ర్తవేత్తలు. అంతేకాదు సూక్ష్మ పరికరాల ద్వారానే సమర్దవంతంగా పని చేయవచ్చని తెలుసుకున్నరు శాస్ర్తవేత్తలు. అందుకే అత్యంత సమర్దవంతంగా పని చేసే సూక్ష్మ పరికరాలను రూపొందిస్తున్నరు.
స్పాట్
వాయస్
ఇది కంప్యూటర్ సి.పి.యు లోపలి బాగం. ఇక్కడ చిన్నగా కనిపించే పరికరాలనన్నిటిని మైక్రోచిప్సని అంటరు... ఈ ఒక్క మైక్రో చిప్ లోనే కొన్ని వందల సర్క్యూట్లను ఏర్పాటు చేసిండ్రు. ఒకప్పుడు ఈ కంప్యూటర్ …ఒక రూంకు సరిపడా ఉండేది. కానీ ఇప్పుడు దీని పరిమాణం అరచేతిలో ఇమిడిపోయేలా తయారు చేశారు మన శాస్త్రవేత్తలు. చిన్న చిన్న పరికరాలతో పెద్ద పెద్ద పనులు చేయించవచ్చని తెలుసుకున్నరు సాంకేతిక నిపుణులు. టెక్నికల్ ఇంజనీరింగ్లో శాస్త్రవేత్తలు అద్భుతాలు సృష్టిస్తున్నారంటే దానికి కారణం మనకు తెలియని, మనం చూడని సూక్ష్మప్రపంచపు రహస్యాలు కనుక్కోవడం వల్లనే అది సాధ్యమయింది.
స్పాట్
యాంకర్ 4
సూక్ష్మజీవులను కూడా చూడటం సాధ్యం కాని మనకు సూక్ష్మ పరికరాలను తయారు చేయడం ఎలా సాధ్యం అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. యస్.. ఇది సాధ్యమే..నానో టెక్నాలజీతో అది సాధ్యమే.. మనం బియ్యం గింజ పై పేరు రాస్తేనే అబ్బో అని నోరెళ్ల బెడతాం..కానీ నానోటెక్నాలజితో వెంట్రుక పొరలో వేయ్యోవంతులో కూడా మనం కోరుకున్నది రాసుకోవచ్చు మీరే చూడండి.
వాయిస్
ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న మిషన్ గుండు పిన్నును కూడా గడ్డపారకంటే పెద్దగా చూపించగల శక్తి కలది. ఒక్క ఆబ్జెక్ట్ను కొన్ని వేల రెట్లు మాగ్నిఫికేషన్ చేసి చూడడం ద్వారా దాని మూలాలు తెలుసుకోవచ్చన్న సూత్రంతో పని చేస్తది. చిన్న వస్తువులను చూపించడమే కాదు ఒక పెద్ద బాగంలో ఉన్న విడిబాగంలో ఉన్న చిన్న వస్తువును కొన్నివేల రెట్లు పెద్దగా చేసి చూపడంలో ఈ పరికరం దిట్ట.
ఇక్కడ వీరు చేస్తున్న హడావుడి చూస్తున్నారుగా…కేవలం ఒక తల వెంట్రుక..ఈ వెంట్రుకను కాస్త దూరం నుంచి చూస్తే నేరుగా కంటికే కనిపించదు. కానీ ఈ ఒక్క వెంట్రుక పై ఈ నానోమిషన్ హిస్టరీ మొత్తం రాసేయోచ్చు. ఇదిగో మీరే చూడండి. వెంట్రుక పై ఎలా పేరు రాస్తున్నారో…
చిన్న స్పాట్
ఈ టెక్నాలజితో టైప్ చేసి పెట్టుకోగలిగితే మన సెంట్రల్ లైబ్రరీ మొత్తం ఒక్కపుస్తకంలో రాసిపెట్టుకోవచ్చు. కాకుంటే మన దగ్గర నానో మిషన్ ఉంటేనే వాటిని తిరిగి చదువుకోగలం. మామూలు కంటితో చదువుకోవడం ఇప్పడు మాత్రం సాధ్యం కాదు..ఏమో భవిష్యత్తులో వీటిని కూడా చూసి చదువగల కళ్లద్దాలు తయారు చేసినా ఆశ్చర్యపోవలసిందిలేదు.
స్పాట్
సైంటిఫిక్ డెవలప్ మెంట్లో మైక్రోస్కోప్ల పాత్ర మరువలేనిది. మైక్రోస్కొప్ కనిపెట్టిన కొత్తలో ముందుగా భూతద్దంతో మాత్రమే చూడటం సాధ్యమయ్యేది. ఆ తరువాత 10x అంటే పది రెట్లు పెద్దగా చూపగల మైక్రోస్కోపులను తయారు చేశారు. వీటి తరువాత 100x అంటే ఒక కణాన్ని వందరెట్లు చేసి చూపగల మైక్రోస్కోప్లను తయారుచేసినరు. లేటెస్ట డెవలప్మెంట్లో ఎలక్ర్టానిక్ మైక్రోస్కొప్లు వచ్చాక హైపవర్ రెజల్యూషన్తో, హై మాగ్నిఫికేషన్ చేసి కణంలోని కణాంగాల పనితీరును కూడా అధ్యయనం చేసి చూపుతున్నరు.
నానోటెక్నాలజీ సాయంతో రోజరోజుకో కొత్త మైక్రోసిస్టమ్ ని క్రియేట్ చేస్తనే ఉన్నరు. కానీ నేచర్ ని మించిన క్రియేటర్ లేదు. మనం ఊహించలేని మైక్రో ఆపరేటర్లను ప్రకృతి సృష్టించి సిద్దంగా ఉంచింది.
స్పాట్ (మైక్రోస్కొప్ విజువల్స డౌన్లోడ్ చేయాలి.)
యాంకర్ 5
మనం ఎంత సాంకేతిక పరిజ్ఞానం అబివృద్ది చెందినా… ఇప్పటికి కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం కనుక్కోలేక ఇబ్బంది పడుతున్నం. కానీ ఇక పరిష్కారం సాధ్యం కావనుకున్న సమస్యలకు కూడా ప్రకృతే దారి చూపింది.
వాయిస్
మానవ మనుగడ మొత్తం ప్రశ్నలమయం..ప్రకృతి మొత్తం ఒక క్వశ్చన్ పేపర్..ఒక వండర్ పజిల్. మనుగడ కోసం ఒక్కో పజిల్ని ఛేదించుకుంటూ ముందుకు పోవాలి. అప్పుడే మన జీవితం చాలా సౌకర్యవంతంగా ఉంటది. మనిషి ఈ నేల పై సుఖంగా జీవించడమే కాదు చంద్రమండలం పై కూడా కాలుమోపాలని ప్రయత్నించిండు. కానీ జాబిల్లి పై జలకాలాడాలనుకున్న మానవుడికి ఆదిలోనే హంసపాదు పడింది. చంద్రుడి పైకి పరిశోధనకు వెళ్లిన మానవుడికి ఓ కొత్త సమస్య ఎదురయ్యింది. చంద్రమండలం నిండా దుమ్ము దూళి ఉంటది. కాలుమోపితే పాదంతో పాటు దుమ్ము లేస్తది. డ్రెస్కు అమర్చిన కెమెరాల నిండా దుమ్ము ధూళిపడి విజువల్స్ రికార్డ్ చేయడం కష్టంగా మారింది. ఈ విషయాన్ని ముందే ఊహించలేక పోవడంతో చంద్రమండలం పై శాస్ర్తవేత్తలకు ఈ సమస్య పెను సవాల్ గా మారింది. ఈ సమస్య కు ప్రకృతే పరిష్కారం చూపింది.
యాంకర్ – బ్రేక్
చంద్రమండలంలో ఎదురైన సమస్యకు ప్రకృతి ఎలా దారి చూపిందో తెలసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం..
యాంకర్ 6
కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం. గ్రహాంతరయానం…ఆపరేటింగ్ మొత్తం ఇక్కణ్నించే..తీరా అక్కడికి వెళ్లాక ఒక చిన్న సమస్య ఎదురైతే… సమస్య చిన్నదైనా దానిని పరిష్కారించే అవకాశాలు లేనప్పుడు… పెట్టిన కోటాను కోట్ల రూపాయల పెట్టుబడి ఏం కావాలి..అవును సరిగ్గా ఇటువంటి సమస్యే ఎదురయింది చంద్రయానం చేసే ఖగోళ పరిశోధకులకు.
వాయిస్
చల్లని వెన్నెల కురిపించే రేరాజు ఉపరితలం పై ఏముందో తెలుసుకోవాలన్న కాంక్ష మనిషిని మిలియన్ డాలర్ల ఖర్చుకు వెనకాడకుండా చంద్రమండలం పై కాలుమోపేలా చేసింది. అక్కడికెళ్లాక చంద్రమండలంపై ఉన్న డస్ట్ సమస్య ప్రయోగానికి పెద్ద ఆటంకంగా మారింది.
స్పాట్
గతంలో ఒకసారి అంతరిక్ష పరిశోధకులకు ఒక సమస్య ఎదురయింది. అంతరిక్ష పరిశోధనకు రోదసి నౌకలో ప్రవేశించాక తాము పరిశీలించిన విషయాలను నోట్ చేసుకునేందుకు పెన్ తీసి రాస్తే అది మోరాయించింది. శూన్యంలో పెన్ రాయకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఆఖరుకు చిన్న ఐడియాతో ఆ సమస్యను అధిగమించారు. మరేంలేదు ఒక్క పెన్సిల్ ముక్క అంతరిక్ష పరిశోధకులకు వరంగా మారింది.
స్పాట్
ఇప్పడీ చంద్ర మండల డస్ట్ సమస్యకు కూడా ప్రకృతే పరిష్కారం చూపింది. ఆ తరువాత అది ఎన్నో వందల సమస్యలకు ఫార్ములాగా మారింది. మన ప్రకృతిలో నిత్యం మనం గమనించినా గమనించనట్టు వదిలేసే ఎన్నో చిత్రాలు ఒక్కోసారి పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారం చూపెడుతయి. అటువంటి విచిత్రమే తామరాకు. తామరాకు నీటిలో ఉన్నా దాని ఉపరితలం పై నీటి చెమ్మను కూడా అంటనీయదు. ఎంత పెద్ద వర్షమయినా దాని పై చుక్కనీరు నిలువదు. ఒక్కనీరే కాదు దుమ్ము ధూళి కూడా తామరాకు ను అంటుకోవు. ఈ తామరాకు లోగుట్టే తమ సమస్యకు పరిష్కారం చూపిస్తుందని భావించారు గార్డర్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ రీసెర్చ్ సైంటిస్ట్ లు. ఆలోచన వచ్చిందే ఆలస్యం తామరాకు లోగుట్టు విప్పేందుకు పరిశోధనలు మొదలు పెట్టిండ్రు.
స్పాట్
ఈ తామరాకు ఉపరితలం మొత్తం మైనపు పొరతో ఆవరించబడి ఉంటది. ఈ లోటస్ లీఫ్ ఎంత బురదలో ఉన్నా దానికి లేశ మాత్రం కూడా దుమ్ము అంటుకోక పోవాడానికి దీని అంతర్నిర్మాణమే కారణం. దీని సెల్ఫ్ క్లీనింగ్ సీక్రెట్ను అధ్యయనం చేసేందుకు అణువణువూ అధ్యయనం చేశారు సైంటిస్ట్ లు.
పారా డబ్బింగ్
ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఈ దారులు తామరాకు ఈనెలు. ఇవి మన మామూలు కంటితో చూడవచ్చు. మైక్రోస్కోప్తో ఆకు అసలు రూపాన్ని తీక్షణంగా పరిశీలిస్తే మనకు చాలా చిన్న మచ్చలు కనిపిస్తయి. మానవుల వెంట్రుక మందం ఆరు మైక్రాన్లు ఉంటది. అంటే ఇంత అన్నమాట. కానీ అంత వ్యాసార్ధంలోనే కొన్ని వందల మైనపు కేశాలు ఆకు ఉపరితలాన్ని ఆవరించి ఉన్నయి. లోటస్ లీఫ్ మనకు పైకి కనిపించినంత మృదువుగా ఉండదు. మన కంటికి కనిపించని ఎత్తుపల్లాలు ఎన్నో ఆకు నిండా ఉన్నయి. ఈ ఎత్తుపల్లాలే తామరాకు సెల్ఫ్ క్లీనింగ్ ఆపరేటింగ్ సీక్రెట్. ఇవే ఆకు పై పడ్డ నీటినైనా, ధూళినైనా దూరంగా విదిలిస్తయి.
స్పాట్
ఈ లోటస్ లీఫ్ సీక్రెట్ శాస్త్రవేత్తలకు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టేలా చేసింది. శాస్ర్తవేత్తలు గదులలో పరిచే రెండు సిరామిక్ టైల్స్ను తీసుకొని ప్రయోగం చేశారు. ఒక టైల్ లోటస్ లీఫ్ సీక్రెట్ కల్చర్తో డెవలప్ చేసిండ్రు. మరో టైల్ సాధారణంగా తయారు చేసిండ్రు. ఈ రెండిటి పైనా డస్ట్ పోసి టెస్ట్ చేస్తే.. లోటస్ లీఫ్ కల్చర్డ్ టైల్… డస్ట్ ఫ్రీగా మారిపోయింది. సక్సెస్….. ఈ ఫార్ములాతో శాస్త్రవేత్తలు తమ సమస్యను అధిగమించిండ్రు. చంద్రమండలం పై డస్ట్ ఫ్రీ కోట్ తయారీకి ఫార్ములా రెడీ అయింది.
స్పాట్ 1 2 3 లాండ్
ఇదే లోటస్ లీఫ్ కల్చర్ ఫార్ములా ఏ ఆబ్జెక్ట్ పై అప్లై చేసినా సేమ్ రిజల్ట్| రిపీట్ అయింది. ఆ వస్తువు డస్ట్ ఫ్రీ, వాటర్ ప్రూఫ్ ఆబ్జెక్ట్గా తయారయితది. ఇదిగో ఈ కోట్ చూడండి టాప్ కింద పెట్టి నీళ్లు వదిలినా ఒక్క చుక్కకూడా కోట్ను తడపడం లేదు. యస్. ఇది తామరాకు నేర్పిన ప్రకృతి పాఠం. మన డ్రెస్లకు బ్యాక్టీరియా, వైరస్లు కూడా అంటుకోకుండా ఇదే సీక్రెట్తో రక్షణ పొందవచ్చనేది శాస్ర్తవేత్తల అంచనా..
యాంకర్ 7
ప్రకృతిలో సూక్ష్మ ప్రపంచపు అద్భుతాలకు తామరాకు ఒక ఉదాహరణ మాత్రమే..ఇటువంటి సీక్రెట్లు ప్రకృతి అణువణువునా కోకొల్లలు. ఇటువంటిదే మరో సీక్రెట్ ఉపయోగించుకొని గోడలపై బల్లులకంటే స్పీడ్ గా పరిగెత్తగలమా..ఈ వండర్ సీక్రెట్..చిన్న బ్రేక్ తర్వాత..
వెల్కం బ్యాక్
యాంకర్ 7
మనం బల్ల పరుపుగా ఉన్న ప్లేస్లో మాత్రమే నడవగలం..కారణం మన కదలికలకు భూమ్యాకర్షణ శక్తికి మధ్య విడదీయరాని సంబంధం ఉంది. ఈ గ్రావిటేషన్ ఫోర్స్ను కూడా తప్పించుకొని స్పైడర్ మాన్లా గోడలెలా ఎక్కొచ్చో మనకు బల్లి నేర్పింది..కాదు మనమే బల్లిని చూసి నేర్చుకున్నం..ఆ సీక్రెట్ మీ కోసం..
వాయస్
మనం ఈ నేలకు సమాంతర తలం మీద మాత్రమే నడవగలం. నేలకూడా కాస్త నునుపుగా ఉందంటే అడుగు తీసి అడుగేయాలంటే కాస్త జాగ్రత్త పడాల్సిందే.. మన నడకకూ భూమ్యాకర్షణ శక్తికి విడదీయరాని సంబంధం ఉంది. ఈ నేల పై కాకుండా నిట్టనిలువు తలాలపై పనిచేయాలంటే మనకు ప్రత్యేకమైన వ్యవస్థ కావాలి. కానీ ఇక్కడ మనం చూస్తున్న జంతువు ఎటువంటి ఆచ్ఛాదనా లేకుండానే అద్దం పై కూడా అవలీలగా నడుస్తోంది. దీనికి కూడా సూక్ష్మ రహస్యమే కారణం.
స్పాట్
ఈ బల్లి చూడ్డానికి 5 ఇంచుల పొడవుతో ఎర్రని నునుపైన పొలుసులను కలిగి ఉంటది. త్రికోణాకారపు దవడలతో సరీసృపాల జాతికి చెందిన జీవి. దీని పాదాల చివర ఏ మంత్రం దండం ఉందో కానీ, నిలువు గోడలపై, నునుపు తలాల పై ఈజీగా నడవగలదు, పరిగెత్తగలదు. వేటాడి ఆహారాన్ని పట్టుకోగలదు. పట్టుకుంటే పట్టులా జారిపోయే దీని పాదాలకు అద్దానికి అతుక్కుపోయి నడిచేంటంత గ్రిప్ ఎక్కడిది..ఈ చిన్న జీవిలో దాగున్న ఆ సీక్రెట్ ఆపరేషన్ ఏమిటి..ఒక్కసారి ఈ లిజార్డ్ లెగ్లో ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలనిపించింది శాస్త్రవేత్తలకు.
స్పాట్
ఈ పాదాల అడుగు బాగం చూడండి. ఒక్కో వేలిలో డజన్ల కొద్దీ విభాగాలున్నయి. ప్రతి బాగం సిల్క్లాంటి ఉపరితలం కలిగిఉంది. ఈ సిల్కీ ఏరియాని మైక్రోస్కోప్ కింద వందరెట్లు పెద్దవిగా చేసి చూస్తేగానీ అసలు రహస్యం తెలియలేదు. మనకు కనిపించే ఈ సిల్కీలేయర్ కొన్ని కోట్ల సూక్ష్మ కేశాలతో నిర్మించబడి ఉంది.ఇంకా ఇంకా లోతుగా అంటే లక్షరెట్లు పెద్దగా చూస్తే ఒక కేశం…కేశాల కట్టలాగా కనిపిస్తది. ఈ కేశాల కట్టలో సుమారు 5లక్షల సూక్ష్మ కేశాలు దాగి ఉన్నయి. ఒక చిన్న వరుసలో కొన్ని కోట్ల సూక్ష్మ కేశాలు బారులు తీరి ఉన్నయి. ప్రతి కేశం ఒక చిన్న పాదంలా పని చేస్తది. కేశం చివరన వెడల్పాటి పాడ్(pad) ఉంటది. ఈ పాడ్.. కాలికి తలానికి మధ్య శూన్య ప్రదేశం ఏర్పరచగలదు. కాలికి తలానికి మధ్య ఉన్న శూన్య ప్రదేశమే నునుపు తలం పై నడిచే గ్రిప్కు గల కారణం. ఇటువంటి కోటాను కోట్ల సూక్ష్మకేశాలు సక్కర్ల వలే పనిచేయడం వల్ల బల్లి అవలీలగా నడవగలదు. తాను నడవడమే కాదు తన బరువు కంటే పదిరెట్లు ఎక్కువ బరువును కూడా సునాయాసంగా మోసుకెళ్లగలదు.
స్పాట్
మన వెంట్రుకలు శరీరంలో చాలా బలహీనంగా అమర్చబడ్డయి. గట్టిగా లాగితే కుదురుతో సహా ఊడొస్తయి. కానీ బల్లి పాదాల పై ఉన్న సూక్ష్మ కేశాలు మన వెంట్రుకలతో పోలిస్తే పదిమిలియన్ రెట్లు బలమైనవి. ఈ సీక్రెట్ తో మనిషి సక్కర్లను తయారు చేయగలిగిండు.
ఎండ్ యాంకర్
ఎంతో సాధించానని హైటెక్ స్పీడ్ తో దూసుకుపోతున్నానని చెప్పుకునే మనిషి చిన్న చిన్న విషయాలకోసం ప్రకృతి పై ఆధారపడక తప్పడం లేదు. ప్రకృతి మనిషికి నేర్పిన పాఠాలు మరిన్ని వచ్చే వార తెలుసుకుందాం..అంటిల్ దెన్ బై.బై.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి