8, సెప్టెంబర్ 2010, బుధవారం

సైన్స్ ఎపిసోడ్ 14

ఎ.జనార్ధన్‌
ఈ ప్రకృతి పరిణామ క్రమానికి దోహదం చేసింది వాయువేనని శాస్ర్తవేత్తలు కనిపెట్టేశారు. అయితే వాయువు మీద ఎప్పటి నుంచో ఉన్న అభిప్రాయాలు ఒక్కోక్కటే మారిపోసాగినయి. అప్పటి వరకు మంచి వాయువు చెడు వాయువు రెండే రకాలన్న అభిప్రాయం ఉండేది. కానీ వాయువుల్లోనూ అనేక రకాలుంటయన్న నిజం తెలిసింది. ప్రిస్లీ ఆక్సీజన్ ను, లీవోయిజర్, కావెండిష్ లు హైడ్రోజన్ ను కనుగొన్నాక రసాయన శాస్ర్తంలో వాయువుల ప్రాధాన్యత పై మరింత ఆసక్తి పెరిగింది శాస్ర్తవేత్తలకు..
స్పాట్
వాయు రసాయన పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చని వాడు హంఫ్రీ డేవి.
స్పాట్
హంఫ్రీ డేవి...బ్రిటీష్ రసాయన శాస్ర్తవేత్త..ఎన్నో అరుదైన అద్భుతవిషయాలను ఆవిష్కరించిండు. ఆల్కలీ, ఆల్కలీన్ మూలకాలను కనుగొని రసాయన శాస్త్రంలో కొత్త దారులు చూపిడు. నవ్వు తెప్పించే నైట్రస్ ఆక్సైడ్ కనుగొన్నడు. అంతేకాదు. రసాయన పరిశోధనల్లో అత్యంత పాముఖ్యత కలిగిన పొటాషియ, సోడియం, క్లోరిన్ ల ఉపయోగాలను ధర్మాలను కనుగొన్నది కూడా ఇతనే. గనుల్లో కార్మికులకు వెలుతురు పంచే హంఫ్రీ లాంప్ కూడా ఈయన చలువే.. డేవి..ఇంత గొప్ప మేథావి కనుకనే రాయల్ ఇన్స్టిట్యూషన్ కు సెక్రటరీగా కొనసాగిండు.
స్పాట్
హంఫ్రీ డేవి కనుగొన్న రసాయని అద్భుతాలలో నైట్రస్ వాయువు ఒకటి. ఇది వైద్యరంగంలో సర్జరీలు చేయడానికి ఎంతో ఉపకరిస్తున్నది. ఈ వాయువు నొప్పి తెలియకుండా చేయగల సెడేటివ్.ఇది క్లోరోఫాం కంటే ముందే కనుగొన్నరు. దాని కంటే తక్కువ శక్తి కలిగి ఉంటుంది. దీన్ని సాధారణంగా డెంటిస్ట్లు ఉపయోగిస్తారు. అయితే ఆ వాయువు పీల్చినవారు కొద్దిసేపు గాల్లో తేలినట్టు ఒకరకమైన ఆనందంలో ఉంటరు. కొంతమంది చిరునవ్వులు నవ్వితే, కొద్దిమంది గట్టిగానే నవ్వుతారు. అందుకే నైట్రస్ ఆక్సైడ్ని లాఫింగ్ గ్యాస్ అంటారు. ఈ వాయువును మొదట డేవి తన మిత్రులతో విలాసంగా వాడుకునే వాడు. పార్టీలలో తన మిత్రులను ఆట పట్టించడానికి నైట్రస్ ఆక్సైడ్ ను వాడుకొనే వాడు. ఈ వాయువును ఎక్కువగా వాడితే దీనికి బానిస అయ్యే ప్రమాదం లేకపోలేదు. అప్పట్లో డబ్బున్న వారంతా ఈ గ్యాస్ కోసం బారులు తీరేవారు.
స్పాట్
డేవీ.. సహజంగా ప్రకృతి ప్రేమికుడు..చిన్నపాటి కవి కూడా..అందుకే ఆయనకు పచ్చని ప్రకృతి అన్నా, దోరగా కనిపించే పూల గుత్తులన్నా ఎంతో ఇష్టం..ఆ పరిమళాలలో ఉన్న ఆనందం వర్ణ నాతీతమైనదని అతని కవిత్వంలో పేజీలకు పేజీలు రాసుకునే వాడు. ప్రకృతి పచ్చదనంలో, గడ్డిపరకల కదలికలల్లో, పూల ఎదలోతుల్లోంచి వచ్చే పరిమళాలకున్న శక్తి తెలుసుకొని వాటిల్లో ఉన్న ఆనందం ఎంత విలువైనదో తెలుసుకున్నడు. ఈ ప్రకృతిలోని ప్రతి కదలికలో ఏదో తెలియని శక్తిఉన్నదని బలంగా నమ్మేవాడు. ఆ ఆనందం తను కూడా ప్రజలకు అందివ్వాలనే లక్ష్యంతో అనుభూతినిచ్చే ఈ నైట్రస్ ఆక్సైడ్ వాయువును కనుగొన్నానని తన డైరీలో రాసుకొండు డేవి.
స్పాట్
డేవి తన పరిశోధనలన్నీ లండన్లోని ది రాయల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ లోనే చేసిండు. సరిగ్గా రెండొందల సంవత్సారలకు పూర్వమే డేవీ రసాయన శాస్ర్తంలో అద్భుతాలు సృష్టించిండు. ఇప్పడు ఇక్కడ శాస్ర్తవేత్తలు పరిశీలించే ప్రయోగ ఫలితాలు డేవీ ఆరోజుల్లో కనుగొన్నవే..చూడటానికి ఆశ్చర్యాన్ని, భయాన్ని ఒకేసారి కలిగించే ఈ ప్రయోగాలలో ఉన్న మర్మం చూడండి..
స్పాట్
ఇప్పడు మీరు చూసిన ఈ మెరుపులన్నీ సోడియం, పొటాషియం మూలకాలు చేసే చిత్రాలు. వాటిలో ఉన్న ఎక్స్ ప్లోజివ్ పవర్ ఎంత హై రేంజ్ లో ఉంటదో ఇక్కడ కనిపించింది. చిటికెడు కెమికల్ తో మంటలు మండించవచ్చు, ప్రేలుళ్లను సృష్టించవచ్చన్న సూత్రాన్ని ప్రపంచానికి తెలపిన మహాశయుడు డేవి.
స్పాట్
డేవి ప్రయోగాల తరువాత రసాయన శాస్ర్తం ప్రజల్లోకి వెళ్లింది. రసాయన శాస్ర్తంలో తాను కనుగొన్న మూలకాలకు ఎంతో ప్రాముఖ్యం లభించింది. ఇదిగో ఇక్కడ శాస్ర్తవేత్తలు చేసే ప్రయోగం చూడండి. ఈ ప్రయోగాన్ని డేవీ రెండొందల ఏండ్లకు ముందే చేసిండు. తెల్లటి పొడిని ఒక చిన్న ఇనుప తొట్టిలో పోసి, దాన్ని ముందు మంటతో వేడి చేస్తరు. ఆ తరువాత వేడి అందలోకి ఎలక్ట్రిసిటీ పంపిస్తరు..అంతే..చిటపట మనుకుంటూ వేడివేడి పొగలు కక్కుకుంటూ తారా జువ్వల్లా పేలిపోతుంటది. అవును ఇది పెద్దపెద్దబ్లాస్టింగ్ లల్లో ఉపయోగించే పొటాషియం..పొటాషియం ఎంత పెద్దపెద్ద పనులు చేయగలదో తన ప్రయోగాల ద్వారా నిరూపించిండు డేవి.
స్పాట్
ప్యూర్ పొటాషియం ను చిన్న చిన్న బిళ్లలుగా కోసి..ఒక చిన్న ముక్కను తీసుకొని దానిని ప్రయోగ ద్రావణంలో వేయగానే ఒక్కసారి పెద్దగా పొగలు కక్కుతూ పేలిపోవడం గమనించిండ్రు. అదే తరువాత కాలంలో పేలుడు పదార్ధాల తయారీకి పునాదిగా మారింది.
స్పాట్
18వ శతాబ్దం దాటి 19వ శతాబ్దం మద్యకాలంలో రసాయన శాస్త్రంతో ప్రజలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకుంది. రసాయనాలంటే కేవలం పదార్ధాలే కాదు..వాతావరణం, చెట్టూ చేమ అన్నీ అని తెలిసింది.. ఇది జమైకాలోని ఒక పర్యాటక ప్రాంతం.. ఆ రోజుల్లో మలేరియా జ్వరం ప్రజలను పీడించే మహమ్మారి. దానికి సరైన మందు లేక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నరు. ఎన్ని రకాల మందులు కనిపెట్టినా మలేరియా బారి నుంచి ప్రజలను కాపాడలేని పరిస్థితి. అప్పుడు ప్రకృతి రసాయనాల వైపు చూశారు శాస్ర్తవేత్తలు.
స్పాట్
ఇక్కడ పచ్చగా కనిపిస్తున్న ఈ చెట్టు పేరు సింకోనా మొక్క. ఇది ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసిన మలేరియాకు కళ్లేం వేసిన చెట్టు. దీని బెరడు మలేరియాకు చక్కని దివ్యౌషదం. ఈ బెరడు కొంచె ముక్క కోసుకొని నోట్లో వేసుకుంటే వగరు, చేదు కలిపిన రుచుల్లో ఉంటది. ఈ విషయం తెలుసుకున్నాక సింకోన మొక్కలను విరివిగా పెంచడాన్ని ప్రోత్సహించినయి ప్రభుత్వాలు.
స్పాట్
ఈ మొక్క చేసిన మేలు అంతా ఇంతా కాదు. వాస్తవానికి 1820లో ఈ సింకోనా మొక్క బెరడులో ఇంత సంక్లిష్ట రసాయనం ఉంటుందని ఒక ఫ్రెంచ్ శాస్ర్తవేత్త కనుగొనే వరకు ఎవరికీ తెలియదు. దానికే క్వినైన్ అని పేరు పెట్టిండు.
స్పాట్
సింకోనా మొక్క నుంచి క్వినైన్ తయారు చేయాలంటే ఎంతో ప్రయాసతో కూడిన పని. మొక్క పెరిగి దాని బెరడు ముదిరి పక్వానికి వచ్చే వరకు నిరీక్షించాలి. అంతేకాదు లక్షలాది మంది ప్రజలకు కావలసిన మందును సమకూర్చడానికి వేలాది ఎకరాల్లో సింకోనా పండించాలి. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా క్పినైన్ కెమికల్ ను తయారు చేయడం ఛాలెంజ్ గా తీసుకున్నరు శాస్ర్రవేత్తలు. ఈ క్వినైన్ ను ఇతర అవసరాలకు కూడా వాడుతరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచాలన్నిరంగులమయం చేయడంలో క్వినైన్ పాత్ర మరువలేనిది.
స్పాట్
19వ శతాబ్దంలో విలియం హెన్రీ పెర్కిన్ చేసిన అద్భుత ప్రయోగం ఈ ప్రపంచాన్నిరంగుల వలయంలో ముంచింది. ఇక్కడ మనకు కనిపిస్తున్న పురాతన భవనం పెర్కిన్ ప్రయోగాలు నిర్వహించిన భవనం. ఇక్కడ ఒక శాస్ర్తవేత్త పెర్కిన్ ప్రయోగాలను పునరావృతం చేయడం చూడవచ్చు.
విద్యుత్ లైట్లు అంతగా ఉపయోగంలోకి రాని ఆ కాలంలో ఎక్కువగా గ్యాస్ లైట్లు వినియోగించే వారు. ఈ గ్యాస్ లైట్లను వెలిగించడానికి బొగ్గును కూడా వాడే వారు. వీటి ఉప ఉత్పత్తి ఈ కోల్తార్. ఈ కోల్ తార్ తో బాటు హైలీ టాక్సిక్ సబ్స్టెన్సెస్ క్వినైన్ ను, పొటాషియం డై క్రోమేట్, సల్ఫ్యూరిక్ ఆసిడ్, ఎనలీన్ ల నుపయోగించి మొట్టమొదటి రంగును తయారు చేసిండ్రు. ఈ ఎనలీన్ లో కార్భన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సీజన్లు కూడా ఉంటయి. ఈ మిశ్రమాలన్నీ కలిపితే ఇదిగో ఈ గాజు జాడీలో లాగా నల్లని ప్రెస్పిటేషన్ తయారవుతది. ఈ కొంచెం పౌడర్ కు డైల్యూటెడ్ సల్ఫూరిక్ ఆమ్లాన్ని కలిపి క్లాత్ కు అప్లై చేసిండు. అంతే మొట్ట మొదటి సింథటిక్ కలర్ ను సృష్టించిన ఘనత హెన్రీ పెర్కిన్స్ ఖాతాలో చేరిపోయింది.
స్పాట్.
ఇది విక్టోరియన్ డ్రెస్. ఎప్పుడైతే క్వినైన్ కలర్ కనిపెట్టబడ్డదో అప్పటి నుంచే ఫాషన్ ప్రపంచానికి పునాదులు పడ్డయి. అంతే రసాయన శాస్ర్తంలో ఇండస్ర్టీయల్ కెమిస్ర్టీ కళ్లుతెరుచుకుంది. పారిశ్రామిక రసాయన శాస్ర్తంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది పెర్కిన్స్ కలర్ డై థియరీ. 1870 వ దశకంలో పెర్కిన్స్ అండ్ హిస్ సన్స్ సంస్థలు రంగుల తయారీ పరిశ్రమలను విరివిగా స్థాపించినయి. పెర్కిన్స్ బ్లూ తో మొదలయి వివిధ వర్ణాల వస్త్రాలు అందుబాటులోకి వచ్చినయి. అందుకే పెర్కిన్ పాథర్ ఆఫ్ ఇండస్ర్టీయల్ కెమిస్ట్రీ అయిండు.
స్పాట్
ఇండస్ర్టీయల్ కెమిస్టీ కాస్త అమ్మోనియా తయారికి దారితీసింది. ఇది మన పంట పొలాలలో వాడే ఎరువు. పెరుగుతున్న జనాభాకు తగిన దిగుబడి రావాలంటే పంటలకు తగిన పోషకాలు అందాలి. నేలలో సరియైన పోషకాలు లేకుంటే పంట దిగుబడి పడిపోయేది. కానీ అమ్మోనియా కనుగొనడం ద్వారా నత్రజని రహిత నేలల్లో కూడా బంగారు పంటలు పండించే అవకాశం కలిగింది.
స్పాట్
రసాయనశాస్ర్తంలో వచ్చిన మార్పులు ఆఖరుకు యుద్దంలో కూడా శత్రు సైన్యాన్ని ఎదుర్కోవడానికి తొడ్పడ్డయి. ఖాకీ సైన్యానికి రసాయన ఆయుధాలు మరింత బలాన్నిచ్చినయి. అంతేకాదు కొత్తగా కనిపెట్టిన క్లోరిన్ ఈ యుద్దంలో వేలాది మందిని శవాలుగా మార్చింది. లక్షలాది మందిని పాక్షికంగా వికలాంగులను చేసింది.
స్పాట్
ఒక పదార్ధం ఒక రూపం నుంచి మరో రూపంలోకి ఎలా మారగలుగుతుంది. ఒక పదార్ధం మరో పదార్ధంతో కలిసి కొత్త పదార్ధంగా ఎలా మారుతుంది. ఆ ఏర్పడిన కొత్త పదార్ధం రెండు పాత పదార్దాల లక్షణాలను మించి మరో కొత్తపదార్దంగా ఏర్పడంటంలో ఉన్న మర్మమేంటి..ఇంతకీ అసలు పదార్థపు అణువుల్లో ఏముంది..ఆలోచన వచ్చింది మానవుడికి..అన్వేషణ మొదలయింది.
స్పాట్
నింగి, నేల, ఆకాశాన్ని ఆవరించి పదార్ధాలన్నీ అణువుల నిర్మితాలని కనిపెట్టేశారు శాస్ర్తవేత్తలు. అయితే ఈ పదార్ధాలన్నీ అనేక అణువుల మద్య బలమైన బంధాలతో నిర్మితమవుతయి. ఈ అణువులో ఏముంటుంది. ఈ ప్రశ్నకు అంత తేలికగా సమాధానం దొరకలేదు.ఎంత వెదికినా అణువు అనేది విచ్ఛేదన రహితమైనదనే భావించిండ్రు. తరువాత పరమాణువు ఉంటదని కనిపెట్టారు. అంతకుమించి సూక్ష్మపదార్ధం లేదని బలంగా భావించిండ్రు. అప్పడే క్రూక్స్ తన ఆవిష్కరణతో పరమాణువులో ఉన్న రహస్యాన్ని పటాపంచలు చేసిండు.
స్పాట్
విలియం క్రూక్స్ కు భూత ప్రేతాల వంటి అదృశ్యశక్తులు చేసే అద్భుతశక్తుల కథలంటే ఇష్టం. వాటిని చూడాలని తహతహలాడేవాడు. వాటిలాగే తానూ అదృశ్య అద్భుతాలు చేయాలని ఉబలాట పడేవాడు.
స్పాట్
ఇది క్రూక్స్ తయారు చేసిన గాజు నాళం..ఇందులో పూర్తిగా శూన్యప్రదేశం ఉంటుంది. రెండు వైపులా రెండు ఎలక్ర్టోడ్లు అమర్చబడి ఉంటయి. ఈ రెండు ఎదురెదురుగా ఉండే ఎలక్ట్రోడ్ల మధ్య హై ఓల్టేజ్ విద్యుత్ సరఫరా చేసి చూశాడు క్రూక్స్. అంతే విచిత్రం తానే ఊహించని ఒక అద్బుత శక్తి కనిపించింది. రెండు ఎలక్ర్టోడ్ ల మధ్య ఒక కాంతి పుంజం కనిపించింది.ఈ కాంతిపుంజం ఒక కొస నుంచి మరో కొసకు కదులుతున్నట్టు కనిపించింది. ఈ ఉత్సాహం తగ్గకముందే క్రూక్స్ మరో ప్రయోగం చేసిండు. ఈ క్రూక్స్ నాళం పై దండాయస్కాంతాన్నుంచి ప్రయోగం చేసిండు. ఎప్పుడైతే అయస్కాంత కాంత పుంజం పైకి వచ్చిందో అప్పుడు కాంతి పుంజం దానికి వ్యతిరేకంగా వంగడం గమనించిండు క్రూక్స్. అంటే కాంతి పుంజాన్ని ప్రభావితం చేసే శక్తి ఏదో ఉన్నట్టు గమనించిండు.
స్పాట్
అయస్కాంత శక్తికి ఒక వైపు వంగిన కాంతి పుజాన్ని గమనించిన క్రూక్స్ వెంటనే మరో రకమైన గ్లాస్ నాళాన్ని తయారు చేసి, అందులో ఒక పారలాల్ వీల్ తిరిగే విధంగా ఏర్పాటు చేసిండు. ఇప్పుడు రెండు ఎలక్ర్టోడ్ ల మధ్య హై ఓల్టోజ్ ఎలక్ట్రిసిటీని పంపిండు. ఆశ్చర్యం రెండు ఎలక్ర్టోడ్ లమధ్య అమర్చిన చక్రం వేగంగా తిరగనారంభించింది. చక్రం గుండ్రంగా తిరుగుతూ ఒక వైపు నుంచి మరోవైపుకు కదలడం క్రూక్స్ గమనించిండు. ఏదో అదృశ్య పదార్ధం చక్రాన్ని తిప్పుతందనే సత్యాన్ని తెలుసుకున్నడు. ఇంతకీ ఆ అదృశ్యపదార్ధం ఏంటి..ఈ విషయాన్నికనుగొనడానికి భౌతిక రసాయన శాస్త్రాలు రెండు ఏకమయ్యాయని చెప్పాలి.
స్పాట్
ఈ ప్రయోగాల ఫలితం అణుసిద్దాంత ఆవిష్కరణకు దారి తీసింది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అణురహస్యం గురించి పూర్తి ప్రయోగాలు జరిగినయి.
ఇక్కడ కావెండిష్ లాబరేటరీలో జె.జె థామ్సన్ చేసిన ప్రయోగాలు అణు రహస్యాన్ని ఛేదించడంలో ప్రముఖ పాత్రపోషించాయనే కంటే అసలు అణురహస్యాన్ని ఛేదించాయని చెప్పటమే కరెక్ట్. క్రూక్స్ నాళంలో చక్రాన్ని తిప్పే పదార్థపు రేణువులు పరమాణువుకంటే చాలా చాలా చిన్నవనే విషయాన్ని గుర్తించిండు థాంప్సన్.అంతేకాదు ఈ రేణువులు పరమాణువు కంటే వేయిరెట్లు చిన్నవన్న విషయాన్ని కూడా నిర్ధారించుకున్నడు. ఈ ఆవిష్కరణకు ఆయనకు 1906లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది.
స్పాట్
పదార్ధం మొత్తం విభిన్న రకాల అణువుల సమ్మేళంనం. అందులో కర్భన, నత్రజని, పాస్ఫరస్, ఇంకా రకరకాల పరమాణువులు ఉండవచ్చు. ఇవన్నీ ఒకే పదార్ధంగా కనిపిస్తయి. సూక్ష్మంగా పరిశీలిస్తేనే వీటి అసలు స్వరూపం తెలుస్తది. ఈ పరమాణువును లోతుగా అధ్యయనం చేస్తే పదార్ధం మూడు రకాల పార్టికిల్స్ తో తయారవుతదని కనిపెట్టిండ్రు. అవి ప్రోటాన్, ఎలక్ర్టాన్, న్యూట్రాన్ లు. ప్రోటాన్, న్యూట్రాన్లు పరమాణు కేంద్రకంలో ఉంటే ఎలక్ర్టాన్ లు కేంద్రకం చుట్టూ తిరుగుతుంటయి. ఇవి తమ తమ కక్ష్యల్లో తిరుగుతుంటయి. పరమాణు రహస్యం మానవుని గుప్పిట్లోచిక్కింది. అప్పడు తెలిసింది. మనకు శూన్యంగా కనిపించేదేది శూన్యంగా లేదని, నింగి నేల, గాలి జీవం నిర్జీవం అన్నీ అదృశ్యం పదార్ధాలతోనే నిర్మితమయ్యామనే సత్యం బోధపడింది శాస్ర్తవేత్తలకు. ఈ సృష్టి మొత్తం ఎలక్ర్టాన్ ,ప్రోటాన్, న్యూట్రాన్ లు తప్పమరో పదార్ధం లేదని అయితే ఇవి అమరి ఉండే విధానాన్ని బట్టి పదార్ధ స్వరూపం మారుతుందనే విషయాన్ని తెలుసుకున్నరు. పరమాణువులో ఎలక్ర్టాన్ లు కేంద్రకం చుట్టూ తిరుగుతుంటయి. పరమాణువు చిన్నపాటి సౌరకుటుంబాన్ని పోలి ఉంటది. సూర్యుని చుట్టూ గ్రహాలు తమ కక్ష్యల్లో తిరుగుతున్నట్టు, ఎలక్ర్టాన్లు, కేంద్రకం చుట్టూ మినీ ప్లానెట్ల మాదిరి తిరుగుతూ ఉంటయి. అవి కూడా తమ కక్ష్యల్లో..
స్పాట్
పదార్దం విచ్ఛేదనంలో పురోగతి సాధించాం..పరమాణువులో ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ఉంటయనే సత్యంతో బాటు విశ్వం మొత్తం ఈ పదార్దాలతో నిర్మితమైనదే అనే విషయం స్పష్టమయింది. ఈ సిద్దాంతంలో నుంచే నీల్స్ బోర్, ఐన్ స్టీన్ ల సిద్దాంతాలు పుట్టుకొచ్చినయి. నీల్స్ బోర్ పరమాణువులో ఎలక్ర్టాన్ స్వరూప స్వబావాన్ని వివరిస్తే, ఐన్ స్టీన్ పదార్ధం మొత్తం ఒకే రకాలైన కణాలతో నిర్మితమైనవి కావున పదార్ధం కొత్తగా సృష్టించ బడదు, నాశనం కాబడదు. అనే విశ్వసూత్రాన్ని ఆవిష్కరించిండు.
స్పాట్
1945లో ప్రపంచం మొత్తం విశ్వ శాంతి ఉత్సవాలు జరుపుకుంటోంది. ప్రజలంతా ఆనందోత్సాహాల్లో నిమగ్నమైన తరుణంలో ఈ ఆధునిక శాస్ర్త పరిజ్ఞాన ఫలాలు కొత్త కొత్త ఆవిష్కరణలకు చేసేందుకు మరింత ఉత్సాహాన్నిచ్చింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి