8, సెప్టెంబర్ 2010, బుధవారం

సైన్స్ ఎపిసోడ్ 13

ఎ.జనార్ధన్
ఇంట్రో
మనం నివసిస్తున్న ఈ భూమి మొత్తం ప్రకృతి రహస్యాల పుట్ట. ఆ రహస్యాల సమాహారాన్ని మీకందించే దిసైన్స్అల్టిమేట్ నాలెడ్జ్ కు స్వాగతం.
బ్యాంగ్
యాంకర్ 1
ఈ భూమి పై కోటాను కోట్ల రకాల ప్రాణులు ఉన్నయి. ఈ ప్రాణులు ఎలా ఉద్భవించినయి. భగభగ మండే అగ్నిపర్వతం లాంటి భూమి నుంచి ఇన్ని కోట్ల రకాల జాతులు ఎలా పుట్టుకొచ్చినయి. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, ఒకటేమిటి జీవం ఇదీ అదీ అని లేకుండా ప్రకృతి నిండా తొణికిసలాడుతోంది. ఎక్కడిదీ జీవం..ఇది అనాదిగా శాస్ర్తవేత్తల మెదడును తొలుస్తున్న జీవరహస్యం...
జీవరహస్యం బ్యాంగ్.
రిపీట్ యాంకర్
భూమి పై జీవోద్భావ రహస్యాలను తెలసుకోవాలన్న తపన ఇప్పటిది కాదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి తత్వవేత్తలు, శాస్ర్తవేత్తలు ఈ చిక్కుముడిని విప్పేందుకు ఇప్పటి వరకు ప్రయత్నిస్తునే ఉన్నరు. ఈ చిక్కుముడులన్నీ ఒక్కొక్కటే తొలిగి పోతున్నయి. జీవోద్భవ రహస్యం తెలిసి పోతోంది. ఈ రహస్యాల మూలాలను చూసే ముందు గత వారం మనం చూసిన జీవరహస్యాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం...
రిపీట్ స్టోరీ...
మళ్లీ జీవరహస్యం బ్యాంగ్ కొద్దిగా...
యాంకర్ 2
అవును ఈ విశ్వం మొత్తం బిగ్ బ్యాంగ్ ప్రయోగం ద్వారా ఏర్పడిందనే వాదన ఉంది. అయితే ఈ విశ్వవిస్పోటనంలో మంటలు రేపే మహా ప్రళయం లోంచి జీవ కణాలు ఎలా తయారయ్యాయి. ఈ భూ గ్రహం పైకి నీరెలా వచ్చి చేరింది. ఆ విశ్లేషణలోంచి ఆవిర్భవించిందే ఆక్సీజన్. ఒక్క ఆక్సీజన్ కనుగొనడంతో విషయం పూర్తికాలేదు. ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో విషయాలు ఈ జీవ భాగాహరం లో శేషాలుగా మిగిలిపోయినయి. ఇంతకీ ఏంటా జీవరహస్యాలు...
స్పాట్
ఈ సృష్టిలో ఉన్న కోటాను కోట్ల గెలాక్సీలలో ఒక్క సౌరకుటుంబంలోనే జీవం ఉన్నట్టు ఇప్పటి వరకు దొరికిన ఆనవాళ్లను బట్టి తెలుస్తుంది. ఈ భూమి పై జీవం పుట్టడానికి దారి తీసిన కారణాలు ఏంటి. జీవోద్భవానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి. ఈ విశాల ప్రకృతి నిండా తొణికిసలాడే జీవద్రవ్యం ఎలా వచ్చింది. అన్న ప్రశ్నలు మన శాస్త్రవేత్తలను వేలాది సంవత్సరాలుగా వేదిస్తున్నయి.
స్పాట్
పచ్చని ప్రకృతి.. పిల్లగాలులు.. వెచ్చని వాతావరణం. ఈ భూ గ్రహానికే సొంతం. ఈ సౌరకుటుంబం మొత్తంలో ఒక్క ఈ భూమి పై మాత్రమే జీవ మనుగడ సాధ్యమనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. అయితే ఏ జీవావరణాన్ని పరిశీలించినా తేలేది ఒక్కటే..ఈ జీవోద్బవానికి కారణం. నింగి, నేల, ఆకాశం, నీరు, నిప్పు. ఈ పంచభూతాల సంగమంగా నే జీవం ఉద్భవించిందనేది శాస్ర్తవేత్తల వాదన.
స్పాట్
యస్. నిజంగా ఈ పంచభూతాల సాక్షిగా జీవం ఉద్భవించిందనే అనుకుంటే అసలు ఈ పంచభూతాలలోకి నీరు ఎక్కణ్నించి వచ్చిందనే ప్రశ్న కూడా శాస్త్రవేత్తలకు చాలాకాలం చిక్కుముడిగానే మిగిలిపోయింది. అవును మహా విస్పోటనం ద్వారా విడివడి భగభగ మండే భూగోళం ఉపరితలం పైకి నీరెలా వచ్చింది. ఈ ప్రశ్నలన్నిటికి సరైన సమాధానం కనుగొందామనుకున్నా ఆరోజుల్లో నీటిని విశ్లేషించే మార్గం దొరకలేదు. ఈ నీటి గురించి చాలా మంది మేథావులు చేసిన వ్యాక్యానాలు నీటిమీది రాతల్లాగే చరిత్ర గమనంలో చెరిగిపోయాయి. కాని ఆధునిక శాస్ర్త సాంకేతిక పరిజ్ఞానం మరింత పెరిగాక మనిషి గాలిలో ఉన్న ధాతువులను కూడా తేలికగా పసిగట్టగలుగుతున్నడు.
బ్రేక్ యాంకర్
ప్రీస్లీ ఆక్సీజన్నైతే కనుగొన్నాడు గానీ..దీని ఉపయోగాలు పూర్తిగా తెలియలేదు. అసలు జీవ పదార్ధానికి ఆక్సీజన్ కు లింకుందన్న విషయం కూడా అతనికి తెలియదు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఆక్సీజన్ అంటే ఒక మండించే వాయువని మాత్రమే తెలుసు..మరి ఆక్సీజన్ అసలు స్వరూపం ఎప్పుడు బయట పడింది. ఈ సృష్టి నిర్మాణానికి పునాది వేసిన మూలకాల్లో ఆక్సీజన్ కూడా ఒకటన్న విషయం ఎప్పుడు తెలిసింది చిన్న బ్రేక్ తరువాత..
యాంకర్ 3
రసాయన శాస్ర్తం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ..ఎందుకంటే ఒక మూలకం మరొక మూలకంతో సంయోగం చెంది అప్పటి కప్పుడు కొత్త సమ్మేళనంగా రూపుదాల్చడానికి ఎంతో సమయం పట్టదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రిస్ట్లీ ఆక్సీజన్ వాయువును కనుగొన్నడు.నిజానికి మన జీవితంలో జరిగే అద్భుతాల నుంచే చాలా రహస్యాలు వెలుగు చూస్తయి. అటువంటి దే ఇప్పుడు మీరు చూడ బోయేది.
స్పాట్
జీవోధ్భవానికి పంచభూతాల్లో ఒకటైన వాయువు పాత్ర మరవలేనిది. ఇప్పటి వరకు గాలి అంటే..రంగు రుచి వాసన లేనిది. కానీ జోసెఫ్ ప్రీస్ట్లీ ఆక్సీజన్ ను కనుగొన్నంక.. వాయువుకు రంగు రుచి వాసన ఉండగలవని, వీటితో బాటు కొన్ని వాయువులకు ప్రత్యేవమైన ధర్మాలుంటయని తెలియవచ్చింది. ప్రీస్ల్టీ కనుగొన్న వాయువుకు అంత శక్తి ఉంటదని అతనికే తెలియదు. కానీ ఆక్సీజన్ను కనుగొనడం ద్వారా ప్రీస్ల్టీ రసాయన శాస్ర్తంలో ఓ గొప్ప ఆవిష్కరణకు దారి తీశాడన్న సత్యం మరువలేనిది.
స్పాట్
వేల సంవత్సరాల నుంచి మన సంస్కృతీ సంప్రదాయాలతో అనేక విషయాలు ముడివేసుకొని ఉన్నయి.. నిజానికి వాటన్నిటిని మనం కేవలం అద్బుతాలుగానే పరిగణలోకి తీసుకుంటం.కానీ ఆ అద్భుతాల మాటున దాగిన రహస్యమేంటని మాత్రం అలోచించం.. అలా ఆలోచించడం తప్పని కూడా వాదించేవారు లేకపోలేదు. ఎందుకంటే ప్రకృతిలో జరిగే ఈ అద్భుతాలన్నీ దైవ ప్రసాదితమని ఒక బలమైన నమ్మకం.
స్పాట్
ఇదిగో ఇక్కడ వీరు చేసే హడావుడి చూడండి.. వీరంతా ప్రతి సంవత్సరం జరిగే బెలూన్ వేడుకకు హాజరువుతున్నరు. సిటీలో ఉన్న పౌరులంతా ఒక్కచోట చేరి ఈ ఉత్సవాన్ని తిలకిస్తరు.ఇక్కడ నిలువుగా కనిపించే పెద్ద ప్లాస్టిక్ తొడుగుకు తాళ్లు కట్టి వేలాడ దీస్తరు. దీని అంచులకు ఒక రింగు మాదిరి నిర్మాణాన్ని తేలిక రకం దారాలతో కడతారు. బెలూన్కు మద్యలో చుట్టూ తిరుగుకుంట వీరు చేసే ఈ పనిని చుట్టూ హాజరైన ప్రజలు ఆసక్తిగా తిలకిస్తుంటరు. ఈ రింగ్ కట్టడం పూర్తయ్యాక బెలూన్ మద్యలో ఒక పాత్రలో ఎండు గడ్డిపరకలు వేసి మంట పెడతరు. ఈ మంటలో ఒక రకమైన కెమికల్ వేయడం ద్వారా వచ్చే ఆవిరులను బెలూన్ లోకి పంపిస్తరు. ఈ వేడిగాలికి బెలూన్ పైకి ఎగిరిపోకుండ చూట్టూ గట్టిగా పట్టుకుంటరు. ఈ వేడి ఆవిరులు బెలూన్ లో నిండే కొద్దీ బెలూన్ పైకి ఎగబాకుతుంది. ఈ బెలూన్ అమాంత గాలిలోకి ఎగరకుండా మనుషులు గుంజి పట్టుకోవడం తో బాటు బలమైన తాళ్లతో గుంజి కడతరు.
స్పాట్
బెలూన్ నిండా గాలి నిండాక ఒక్కసారి అంతా ఒదిలేస్తరు. అంతే పంజరాన్నివీడిన పక్షిలా బెలూన్ ఆకాశంలోకి రివ్వున ఎగిరిపోతది. రెక్కలు లేని విహంగంటా పట్టణ ప్రజలకు గుడ్ బై చెప్పుకుంగా నింగిలోకి దూసుకు పోతది. ఈ వింత చూసేందుకు ప్రజలంతా ఇక్కడ చేరినా ఈ బెలూన్ గాలిలోకి ఎగరడం వెనకున్న రహస్యం ఏంటనే విషయం ఎవరికీ తెలియదు.ఈ వేడి బెలూన్ను మొదటిసారి 1783లో ఎగరేసిండ్రు. అప్పటి నుంచి ఈ ప్రక్రియ ప్రజలకు ఒక వింత గానే తోచింది. దశాబ్ద కాలం తరువాత గానీ దీని వెనకున్న మర్మం బయట పడలేదు.
స్పాట్
ఇదిగో ఇక్కడ యువ పరిశోధకులు ఉత్సాహంతో చేసే ప్రయోగం చూడండి. గతంలో ఎండు గడ్డిపరకలతో పంపించే వేడిగాలుల స్థానంలో ఇప్పడు తాజాగా హీట్ వెపర్ మిషన్లు వచ్చేశాయి. ఈ మిషన్ల సాయంతో బెలూన్ లోకి వేడి గాలులను పంపిస్తరు. ఎంతో ఎత్తుకు ఎగిరే బెలూన్ తో బాటూ మనిషి కూడా ఎగిరితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందే ఆలస్యం ..ఈ బెలూన్ కు ఒక తొట్టి కట్టిండ్రు..అంతే ఈ బెలూన్ కు చివర బాగంలో ఒక వెదురు తొట్టి కట్టి అందులో ఇద్దరు నుంచి ముగ్గురు మనుషులు ఎక్కి పైకి వెళ్లడం నేర్చుకున్నరు.
స్పాట్
ఏ యంత్రాలు అవసరం లేని సహజ శక్తిని ఉపయోగించుకొని, మానవుడు భూ ఉపరితలం పై విహంగవీక్షణ చేయడం అలవాటు చేసుకున్నడు. పచ్చని ప్రకృతిని భూమి ఎత్తుల్లోంచి ఆస్వాదించడం అలవాటు చేసుకున్నడు. ఆకాశంలో నుంచి చూస్తే భూమి ఎలా కనిపిస్తదో గమనించిండు.
స్పాట్
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదుల సంఖ్యలో బెలూన్ లు ఆకాశంలో పక్షుల గుంపుల వలె ఎగరడం మొదలయింది. ఆకాశంలో విహరించడానికి ఇదొక మార్గంగా ఎంచుకున్నడు ఆధునిక మానవుడు. కారణం ఈ బెలూన్ ఎక్కువ బరువును మొయగలగడానికి గల కారణమేంటో కనుగొన్నరు. ఆ సూత్రంతోనే ఈ బెలూన్ ను మరింత ఎక్కువ వాడకంలోకి తెచ్చిండ్రు.
స్పాట్
ఇంతకీ ఈ బెలూన్ ను ఆకాశ వీధుల్లో తిప్పే వాయువు ఏంటి..ఈ బెలూన్ ను గగన విహారం చేయించే అదృశ్య శక్తి ఏంటి..వీటన్నిటికి వెనకున్న రసాయన రహస్యాలేంటి...తేల్చేశారు శాస్ర్తవేత్తలు.
స్పాట్
బ్రేక్ యాంకర్
గాలిని నింపుకొన్న గాలి బెలూన్‌ అంత ఎత్తుకు ఎగరడానికి కారణం ఏంటి. ఇంతకీ ఆ బెలూన్ ఎగరడం వెనుక ఉన్న రహస్యం ఏంటి. చిన్న బ్రేక్ తరువాత..
యాంకర్ 4
శాస్ర్తవేత్తలకు ఎన్నోరోజులనుంచి ఎదురు చూస్తున్నరోజు రానే వచ్చింది. ఎగిరే బెలూన్ రూపంలొ పరిశోధకులకు ఓ మంచి మార్గం దొరికింది. ఈ ఎగిరే బెలూన్ ను ఆకాశంలో తిప్పే అదృశ్యశక్తి ఏంటి. కనిపెట్టేశారు సైన్టిస్టులు.
స్పాట్
ఇక్కడ ఒక రసాయన శాస్ర్తవేత్త చేస్తున్న ప్రయోగం ఒక్కసారి చూద్దాం. ఈ పటంలో చూపినట్టు ఒక వైపు ఫన్నెట్ ట్యబ్..దానికి కనెక్ట్ చేస్తూ ఒక గ్లాస్ ట్యూబ్ ఉంటది. ఈ గ్యాస్ ట్యూబ్ ఒక ఓవెన్ గుండా వెళ్తది. ఈ ఓవెన్ లోంచి వచ్చే హీట్ ను రెగ్యులరైజ్ చేయడానికి ఐరన్ను వాడుతరు. ఈ ట్యూబ్ ను కాపర్ కాయిల్స్కు కనెక్ట్ చేస్తరు. ట్యూబ్లో రిలీజ్ అయిన వెపర్ను కూల్ చేసి వాటర్ వెపర్ మొత్తం కిందికి సెటిల్ అయి కేవలం గ్యాస్ మాత్రం బయటకు రిలీజ్ అవుతది. ఈ గ్యాస్లో ఆక్సీజన్ తో బాటు మరో మండే వాయువు విడుదల అవుతది. ఈ ఆక్సీజన్ వాయువు కాపర్ తో చర్య చెంది క్యూప్రిక్ ఆక్సైడ్ గా మారుతది. ఇక మిగిలిన వాయువును గాజు జాడీలో బందిస్తరు.
స్పాట్
ఈ వాయువును ఒక గాలి తగలని ప్రదేశానికి తీసుకెళ్లి..జాడీలో మండుతున్న పుల్లను ఉంచగా అది ఇంధనం అంటుకున్నట్టు మరింత కాంతి వంతంగా మండటం గమనించిండ్రు. ఈ వాయువు పేరే హైడ్రోజన్. దీన్ని కనిపెట్టిన శాస్ర్తవేత్త కావెండిష్. అయితే ఈ వాయువుకు హైడ్రోజన్ అని పేరు పెట్టినది మాత్రం లీవోయిజర్.
స్పాట్
హైడ్రోజన్ కనుగొన్నంక దీనిని శాస్ర్తవేత్తలు అనేక ప్రజా ప్రయోజనాలకు వాడుకున్నరు. హైడ్రోజన్ అత్యంత తేలికైన వాయువు. అందుకే హైడ్రోజన్ నింపిన బెలూన్ అత్యంత ఎత్తుకు ఎగరగలదు. అంతే కాదు ఈ వాయువుకు కాస్త మంట తగిలితే చాలు భగ్గున మండుతది. అందకే ఈ హైడ్రోజన్ నింపిన చిన్నచిన్న బెలూన్లను శత్రు సైన్యం మీదికి పంపి వాటిని సూర్యరశ్మితో పేల్చేసే వారు. అంతగా టెక్నాలజి అభివృద్ది చెందని కాలంలో కూడా హైడ్రోజన్ బాంబ్ ను ఉపయోగించి శత్రు సైన్యాన్ని దెబ్బతీసేవారు.
స్పాట్
ఆధునిక శాస్ర్త పరిజ్ఞానం పెరిగాక హైడ్రోజన్ ను రకరకాలుగా వాడుకోవడం మొదలు పెట్టిండ్రు. ఇప్పడు వాహనాలకు ఇందనంగా హైడ్రోజన్ వాయువును వాడుకుంటున్నరు.
స్పాట్
అవును ఇదో పెద్ద విచిత్రం. నీటిని విశ్లేషిస్తే రెండు మండే వాయువులు వెలువడ్డయన్నమాట. అంటే అగ్నికి ఆజ్యం పోసే రెండు వాయువులు అగ్నిని చల్లార్చే నీరుగా మారుతాయన్నమాట. ఇదో ప్రకృతి వింత..మరో జీవరహస్యం.
స్పాట్
అంటే గాలిలో ఉన్న రెండు వాయువులు కలిసి నీటిని ఏర్పరచాయనడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరోటి లేదు. అంటే భగభగ మండుతున్న భూగోళంలో వేడి ఆవిర్లలో విడుదలయిన ఆక్సీజన్, హైడ్రోజన్ వాయువులు కలిసి H2O గా మారినయి. అంటే నీటి ఆవిరిగా మారి తిరిగి ఇదే భూమి పై పడి క్రమేపి భూమి తాపాన్ని చల్లార్చినయన్న విషయాన్ని నిర్ధారించిండ్రు శాస్త్రవేత్తలు.
ఎండ్ యాంకర్
ఇవి ఈ వారం సైన్స్ విశేషాలు మరిన్ని సైన్స్ విశేషాలతో వచ్చే వారం కలుసుకుందా..అంటిల్ దెన్ బైబై..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి